• facebook
  • whatsapp
  • telegram

భారతదేశం - ఖనిజాలు

1. సిమెంట్‌ రేకుల తయారీలో ఉపయోగించే ఖనిజం? 

1) మైకా     2) ఆస్‌బెస్టాస్‌ 

3) ఫెల్డ్‌స్పార్‌     4) క్రోమియం 

2. జిప్సం ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్రం? 

1) ఆంధ్రప్రదేశ్‌     2) గుజరాత్‌ 

3) రాజస్థాన్‌     4) మధ్యప్రదేశ్‌ 

3. మన దేశంలో ఖనిజాల సర్వే, అన్వేషణకు సంబంధించి అత్యున్నత శాఖ? 

1) కేంద్ర హోంశాఖ 

2) కేంద్ర గనుల మంత్రిత్వ శాఖ 

3) కేంద్ర పర్యాటక శాఖ 

4) కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ 

4. కింది వాటిలో సరికాని వాక్యం? 

1) మాంగనీస్‌ ఉత్పత్తిలో భారతదేశం రెండో స్థానంలో ఉంది.

2) మన దేశంలో ఒడిశా రాష్ట్రంలో మాంగనీస్‌ నిల్వలు అధికంగా ఉన్నాయి. 

3) మాంగనీస్‌ ఉత్పత్తిలో జింబాబ్వే ప్రథమ స్థానంలో ఉంది. 

4) మాంగనీస్‌ నిల్వలు అధికంగా ఉన్న రాష్ట్రం మహారాష్ట్ర. 

5. విమానాల విడిభాగాల తయారీలో ఉపయోగించే ఖనిజం? 

1్శ అల్యూమినియం       2్శ గన్‌ మెటల్‌ 

3్శ క్రోమియం       4్శ లిమొనైట్‌ 

6. రాజస్థాన్‌లోని ఖేత్రి వద్ద లభించే ఖనిజం? 

1్శ మాంగనీస్‌     2్శ ఇనుము 

3్శ రాగి     4్శ వజ్రాలు 

7. విశ్వ ఖనిజంగా పేరుగాంచింది? 

1్శ బంగారం     2్శ వజ్రాలు 

3్శ బాక్సైట్‌     4్శ పెట్రోలియం 

8. ప్రపంచంలో అభ్రకం ఉత్పత్తి, ఎగుమతిలో ప్రథమ స్థానంలో ఉన్న దేశం? 

1) బ్రెజిల్‌     2) చైనా 

3) రష్యా     4) అమెరికా 

9. టూత్‌పేస్ట్, కాస్మోటిక్స్‌ తయారీలో ఏ ఖనిజాన్ని ఉపయోగిస్తారు? 

1) మైకా     2) జిప్సం 

3) లైమ్‌స్టోన్‌     4) టిన్‌

10. ఎరువుల తయారీలో ఉపయోగించే ఖనిజం 

1) ముగ్గురాయి     2) డోలమైట్‌ 

3) సున్నపురాయి     4) జిప్సం 

11. దేశంలో అతి పెద్ద మెకనైజ్డ్‌ ఇనుపధాతు గని ఏది?

1) బైలదిల్లా     2) ఝరియా

3) ఖుద్రేముఖ్‌     4) నౌమండి 

12. విద్యుత్‌ బల్బుల ఫిలమెంట్‌లలో ఉపయోగించే ఖనిజం?

1) క్రోమైట్‌     2) టంగ్‌స్టన్‌ 

3) గ్రాఫైట్‌     4) స్టియటైట్‌

13. మధ్యప్రదేశ్‌లోని రేవా, సాత్నా ప్రాంతాలు ఏ ఖనిజానికి ప్రసిద్ధి చెందాయి?

1) ఇనుప ధాతువు    2) సున్నపురాయి

3) మైకా           4) రాగి

14. రూబీ రకానికి చెందిన మైకా ఆంధ్రప్రదేశ్‌ లోని ఏ ప్రాంతంలో లభిస్తుంది? 

1) నెల్లూరు, గూడూరు 

2) కృష్ణా, తిరువూరు  

3) కర్నూలు, సంగం   

4) కడప, మైదుకూరు 

15. మండి రాతి ఉప్పుకి సంబంధించింది? 

1) హిమాచల్‌ ప్రదేశ్‌లోని మండి ప్రాంతంలో లభిస్తుంది. 

2) మానవ వినియోగానికి పనికి రాదు.

3) పశువుల దాణాలో వినియోగిస్తారు. 

4) పైవన్నీ 

16. బొగ్గు గనుల్లో అగ్ని ప్రమాదాలకు కారణమయ్యే బొగ్గు రకం? 

1) ఆంత్రసైట్‌     2) బిట్యూమినస్‌ 

3) లిగ్నైట్‌     4) పీట్‌

17. భారతదేశం నుంచి బాక్సైట్‌ ఖనిజాన్ని ఎక్కువగా ఏ దేశానికి ఎగుమతి చేస్తున్నారు? 

1) చైనా    2) జర్మనీ    3) బ్రిటన్‌    4) అమెరికా 

18. మాంగనీస్‌ను కిందివాటిలో దేని కోసం వినియోగిస్తారు? 

1) ఇనుము - ఉక్కు తయారీలో 

2) విద్యుత్‌ పరిశ్రమలో

3) బ్లీచింగ్‌ పౌడర్‌ తయారీలో     

4) పైవన్నీ

19. ప్రపంచంలో బంగారం ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్న దేశం? 

1) భారతదేశం     2) చైనా 

3) రష్యా     4) ఇటలీ  

20. ఏ ఖనిజం వాడకాన్ని ప్రస్తుతం ప్రపంచ మంతటా నిషేధిస్తున్నారు? 

1) రాతినార/ ఆస్‌బెస్టాస్‌    2) మైకా 

3) క్రోమియం         4) బెరైటీస్‌ 

21. రాణిగంజ్‌ బొగ్గు క్షేత్రం ఏ రాష్ట్రంలో ఉంది? 

1) మధ్యప్రదేశ్‌        2) ఛత్తీస్‌గఢ్‌ 

3) పశ్చిమ్‌ బంగ        4) ఝార్ఖండ్‌  

22. భారతదేశంలో పెట్రోలియం నిక్షేపాలను అసోంలోని దిగ్భయ్‌ వద్ద మొదట గుర్తించారు. ఇక్కడ పెట్రోలియం తవ్వకాలను ఏ సంవత్సరంలో ప్రారంభించారు? 

1) 1886     2) 1889 

3) 1884     4) 1876 

23. బాంబేహైలో పెట్రోలియం నిల్వలను ఏ సంవత్సరంలో కనుక్కున్నారు? 

1) 1954     2) 1962 

3) 1974     4) 1876 

24. దేశంలో అతి చిన్న చమురు శుద్ధి కర్మాగారమైన తాటిపాక ఏ రాష్ట్రంలో ఉంది? 

1) ఆంధ్రప్రదేశ్‌     2) గుజరాత్‌ 

3) అసోం     4) హిమాచల్‌ ప్రదేశ్‌  

25. యురేనియం కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ను ఎప్పుడు స్థాపించారు?

1) 1965     2) 1967 

3) 1977     4) 1986 

26. 2022 మార్చి నాటికి ప్రపంచంలో సౌరశక్తి ద్వారా విద్యుత్‌ ఉత్పత్తిలో భారతదేశం ఎన్నో స్థానంలో ఉంది?

1) మొదటి స్థానం    2) నాలుగోస్థానం 

3) ఆరోస్థానం     4) పదోస్థానం 

27. చరంక సోలార్‌ పార్క్‌ ఏ రాష్ట్రంలో ఉంది?

1) గుజరాత్‌      2) మధ్యప్రదేశ్‌ 

3) హిమాచల్‌ ప్రదేశ్‌   4) అరుణాచల్‌ ప్రదేశ్‌ 

28. మన దేశంలోని ఏ ప్రాంతంలో ఉన్న చమురు శుద్ధి కర్మాగారాన్ని రొమేనియా సహకారంతో ఏర్పాటు చేశారు?

1) దిగ్భయ్‌     2) గౌహతి 

3) బరౌని     4) కొయాలి 

29. చమురును శుద్ధి చేయడంలో ఉండే ప్రధాన ప్రక్రియల సంఖ్య? 

1) మూడు     2) అయిదు 

3) ఎనిమిది     4) ఆరు 

30. జవహర్‌లాల్‌ నెహ్రూ ‘ఫౌంటైన్‌ ఆఫ్‌ ప్రాస్పరిటీ’గా వర్ణించిన అంకలేశ్వర్‌ చమురు క్షేత్రం ఏ రాష్ట్రంలో ఉంది? 

1) పశ్చిమ్‌ బంగ        2) రాజస్థాన్‌ 

3) గుజరాత్‌        4) మధ్యప్రదేశ్‌  

31. ఒడిశాలోని కియోంజహార్‌ వద్ద లభించే ఖనిజం? 

1) ముడి చమురు  2) ముడి ఇనుము 

3) రాగి      4) బాక్సైట్‌  


32. ఖేత్రి రాగి నిక్షేపాలు ఏ రాష్ట్రంలో ఉన్నాయి?

1) రాజస్థాన్‌     2) గుజరాత్‌ 

3) మహారాష్ట్ర     4) కర్ణాటక  

33. గుజరాత్‌లో బాక్సైట్‌ లభించే ప్రాంతాలు? 

1) అమ్రేలీ, భిల్వారా, జునాగఢ్‌ 

2) అమ్రేలీ, భావ్‌నగర్, జునాగఢ్‌ 

3) పాళి, బార్గాన్, భావ్‌నగర్‌  

4) కట్ని, నలమావు, ముంగర్‌

34. దేశంలో తగరం ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్రం? 

1్శ హరియాణా     2్శ ఛత్తీస్‌గఢ్‌

3్శ ఝార్ఖండ్‌     4్శ ఒడిశా  

35. రత్నగిరి ఇనుప ఖనిజ నిక్షేపాలు ఏ రాష్ట్రంలో ఉన్నాయి? 

1్శ కర్ణాటక     2్శ మహారాష్ట్ర 

3్శ గుజరాత్‌     4్శ ఆంధ్రప్రదేశ్‌ 

36. తాల్చేరు బొగ్గు క్షేత్రం ఏ రాష్ట్రంలో ఉంది? 

1్శ ఒడిశా    2్శ ఝార్ఖండ్‌

3్శ ఛత్తీస్‌గఢ్‌     4్శ పశ్చిమ్‌ బంగ

37. బొగ్గు తయారయ్యే క్రమంలో మొదటి దశలో ఏర్పడేది? 

1్శ ఆంత్రసైట్‌     2్శ బిట్యూమినస్‌ 

3్శ లిగ్నైట్‌     4్శ పీట్‌ 

38. భారతదేశంలో ఖనిజాలకు ప్రసిద్ధి చెందిన పీఠభూమి ఏది? 

1్శ దక్కన్‌ పీఠభూమి 

2్శ మాళ్వా పీఠభూమి 

3్శ చోటా నాగ్‌పుర్‌ పీఠభూమి 

4్శ టిబెట్‌ పీఠభూమి  

39. హజారీబాగ్, సింగ్భమ్, పలమావు ఇనుప ఖనిజ నిక్షేపాలు ఏ రాష్ట్రంలో ఉన్నాయి? 

1) ఒడిశా     2) ఝార్ఖండ్‌ 

3) మధ్యప్రదేశ్‌     4) కర్ణాటక  

40. భారతదేశంలో వజ్రాల నిల్వలు అధికంగా ఉన్న రాష్ట్రం?

1) మధ్యప్రదేశ్‌     2) ఛత్తీస్‌గఢ్‌ 

3) రాజస్థాన్‌     4) ఒడిశా 

41. సున్నపురాయి ఖనిజ ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్రం? 

1) కర్ణాటక     2) రాజస్థాన్‌ 

3) గుజరాత్‌     4) ఒడిశా  

42. బ్లీచింగ్‌ పౌడర్‌ తయారీలో ఉపయోగించే ఖనిజం? 

1) సున్నపురాయి         2) లిగ్నైట్‌ 

3) మాంగనీస్‌         4) జిప్సం  

43. ఆంధ్రప్రదేశ్‌లోని అగ్నిగుండాల, గరిమెన పెంట ప్రాంతాల్లో లభించే ఖనిజం? 

1) ఇనుము         2) రాగి 

3) మాంగనీస్‌         4) సీసం 

44. భారతదేశం జాతీయ ఖనిజ విధానాన్ని ప్రకటించిన సంవత్సరం? 

1) 1992     2) 1993 

3) 1996     4) 1997  

45. రాజస్థాన్‌లోని ‘జావర్‌’ గనులు ఏ ఖనిజానికి ప్రసిద్ధి చెందాయి?

1) బొగ్గు        2) బాక్సైట్‌

3) వెండి        4) సున్నపురాయి

46. కర్ణాటకలోని శాండూర్‌ వద్ద లభించే ఖనిజం? 

1) ఇనుము     2) మాంగనీస్‌ 

3) బంగారం     4) రాగి 

47. గారో కొండల్లోని దారంగిరి ప్రాంతంలో లభించే ఖనిజం ఏది?

1) బొగ్గు     2) రాగి 

3) ఇనుము     4) లిగ్నైట్‌

48. పెట్రోలియం అనే పదం పెట్రా, ఓలియం అనే గ్రీకు భాషా పదాల నుంచి ఉద్భవించింది. గ్రీకు భాషలో పెట్రా అంటే ఏమిటి? 

1) రాతి చమురు         2) శిల 

3) నూనె         4) మండటం 

49. తారాపూర్‌ అణు విద్యుత్‌ కేంద్రం ఎక్కడ ఉంది? 

1) రాజస్థాన్‌     2) గుజరాత్‌ 

3) తమిళనాడు     4) మహారాష్ట్ర 

50. ప్రపంచ ప్రసిద్ధి గాంచిన కోహినూర్‌ వజ్రం ఏ ప్రాంతంలో లభించింది? 

1) కొల్లూరు - గుంటూరు. 

2) వజ్రకరూరు - అనంతపురం 

3) మంగపేట - కడప 

4) బెల్గాం - కర్ణాటక 

51. బొగ్గు గనుల్లో బొగ్గు క్షీణతకు గురి కాకుండా, ఆక్సీకరణం చెందకుండా ఉండటానికి, కాంతిని పరావర్తనం చేసి వెలుతురు ఇవ్వడానికి గోడలకు పూతలా పూసే పదార్థం? 

1) బెరైటీస్‌     2) డోలమైట్‌ 

3) మైకా     4) యురేనియం 

52. ముడి చమురు, సహజ వాయువుల కోసం భూమిని లోతుగా తవ్వడానికి ఉపయోగపడే ఖనిజం ఏది? 

1) బెరైటీస్‌     2) ఫెల్డ్‌స్పార్‌ 

3) యురేనియం     4) క్రోమియం  

53. ఖనిజాల నిల్వల్లో రత్నగర్భగా పేరొందిన రాష్ట్రం? 

1) ఝార్ఖండ్‌      2) కర్ణాటక 

3) ఆంధ్రప్రదేశ్‌      4) మధ్యప్రదేశ్‌

54. ప్రసిద్ధి చెందిన ఇనుపధాతు గని ‘ఖుద్రేముఖ్‌’ ఏ రాష్ట్రంలో ఉంది?

1) ఝార్ఖండ్‌     2) ఛత్తీస్‌గఢ్‌ 

3) కర్ణాటక     4) మహారాష్ట్ర

55. రాగి, టిన్‌లను మిశ్రమం చేస్తే వచ్చే ఖనిజం ఏది?

1) ఇత్తడి         2) కంచు 

3) జర్మన్‌ సిల్వర్‌         4) నిక్రోమ్‌

సమాధానాలు

1 - 2   2 - 3   3 - 2   4 - 4    5 - 1   6 - 3   7 - 3   8 - 2   9 - 1   10 - 2   11 - 1   12 - 2   13 - 2   14 - 2   15 - 4   16 - 3   17 - 1   18 - 4   19 - 2   20 -1   21 - 3   22 - 1   23 - 3   24 - 1   25 - 2   26 - 2   27 - 1   28 - 2   29 - 1   30 - 3   31 - 4   32 - 1   33 - 2   34 - 2   35 - 2   36 - 1   37 - 4   38 - 3   39 - 2   40 - 1   41 - 2   42 - 3   43 - 2   44 - 2   45 - 3   46 - 2   47 - 1   48 - 2   49 - 4   50 - 1   51 - 2   52 - 1   53 - 3   54 - 3   55 - 2

Posted Date : 22-07-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌