• facebook
  • whatsapp
  • telegram

ఖనిజ వనరులు

1.  భారతదేశాన్ని ఖనిజాల సౌలభ్యాన్ని బట్టి ఎన్ని ప్రాంతాలుగా విభజించవచ్చు?

    1) ఆరు       2) ఏడు       3) ఎనిమిది      4) అయిదు


2.  భారతదేశానికి ప్రస్తుతం ఎన్ని రకాల ఖనిజాలను ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉంది?

    1) 89         2) 87          3)  83         4) 81


3. భారతదేశంలో ఉత్పత్తి చేస్తున్నవాటిలో సరైనవి గుర్తించండి.

    ఎ) 4 ఇంధన ఖనిజాలు      బి) 10 లోహ ఖనిజాలు

   సి) 47 అలోహ ఖనిజాలు    డి) 3 అణు ఖనిజాలు

    ఇ) 25 ఇతర చిన్న ఖనిజాలు

    1)  ఎ, బి, సి          2) సి, బి, డి     3) ఎ, బి, సి, డి       4) ఎ, బి, సి, డి, ఇ   


4. బంగారం, రాగి, వెండి ఏ రకమైన ఖనిజాలు?

    1) లోహ ఖనిజాలు            2) అలోహ ఖనిజాలు

    3) ఇంధన ఖనిజాలు         4) అణు ఖనిజాలు


5. జిర్కోనా, మోనోజైట్, ఇల్మనైట్‌ అనేవి ఏ రకమైన ఖనిజాలు?

    1) లోహ ఖనిజాలు           2) అలోహ ఖనిజాలు

    3) ఇంధన ఖనిజాలు         4) అణు ఖనిజాలు


6.  కిందివాటిలో సరైంది?

    ఎ) భారతదేశ ఎగుమతికి తగిన ఖనిజాలు ఇనుము, మాంగనీస్, అబ్రకం.

    బి) దేశీయ ఉపయోగానికి సరిపడే స్వయం సమృద్ధి ఖనిజాలు బొగ్గు, జిప్సమ్, సున్నపురాయి.

   సి) భారత్‌ దిగుమతి చేసుకునే ఖనిజాలు చమురు, రాగి, పాదరసం.

    1)  ఎ         2)  బి          3)  ఎ, బి        4)  ఎ, బి, సి


7. ‘భారతదేశ రూర్‌’ (రూర్‌ ఆఫ్‌ ఇండియ్శా అని దేన్ని పిలుస్తారు?

    1)  కర్ణాటక పీఠభూమి          2)  చోటా నాగ్‌పూర్‌ పీఠభూమి

    3)  మాల్వా పీఠభూమి         4)  షిల్లాంగ్‌ పీఠభూమి


8.  భారతదేశంలో ఖనిజ నిల్వలు లేని రాష్ట్రాలు? 

    1)  తమిళనాడు - జమ్ముకశ్మీర్‌       2)  హిమాచల్‌ప్రదేశ్‌ - మహారాష్ట్ర

    3)  అసోం - అరుణాచల్‌ప్రదేశ్‌         4)  ఉత్తర్‌ ప్రదేశ్‌ - పంజాబ్‌


9.  భారతదేశం నుంచి అధికంగా ఇనుప ఖనిజాన్ని దిగుమతి చేసుకుంటున్న దేశం?

    1)  ఆస్ట్రేలియా      2)  జపాన్‌        3)  బ్రెజిల్‌       4)  దక్షిణాఫ్రికా


10.  దాలీ-రాజరా, బైలాదిల్లా ప్రాంతాలు దేనికి ప్రసిద్ధి?

    1)  మాంగనీస్‌      2)  బొగ్గు       3)  ఇనుము      4)  బాక్సైట్‌


11.  పొటాషియం పర్మాంగనేట్, బ్లీచింగ్‌ పౌడర్, గాజు, పెయింటింగ్‌ పరిశ్రమల్లో అధికంగా వినియోగించే ఖనిజమేది?

    1)  మాంగనీస్‌       2)  బాక్సైట్‌       3)  అబ్రకం       4)  బెరైటీస్‌


12. కిందివాటిలో సరికానిది ఏది?

    ఎ)  యశదం (జింక్శ్, సీసంలకు రాజస్థాన్‌ ఉదయ్‌పూర్‌ జిల్లాలోని జావర్‌ గనులు ప్రసిద్ధి.

   బి)  మైకా ఉత్పత్తిలో భారత్‌ ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉంది.

    సి)  మధ్యప్రదేశ్‌లో కేన్‌ నది అంచున ఉన్న పన్నా, ఆంధ్రప్రదేశ్‌ కృష్ణానది అంచున ఉన్న కొల్లూర్‌ వజ్రాలకు ప్రసిద్ధి.

   డి)  భారత ప్రభుత్వం ఖనిజాల ప్రాముఖ్యాన్ని గుర్తించి 1994లో నూతన ఖనిజ విధానానికి ఆమోదం తెలిపింది.

    1) సి        2) సి, డి         3) డి           4) ఎ, సి


13.  కంచును ఏ మిశ్రమాల ద్వారా తయారు చేస్తారు?

    1) రాగి + జింకు   2) రాగి + తగరం    3) రాగి + నికెల్‌     4) రాగి + జింకు + నికెల్‌


14. ఆజైంటైన్, స్టెపనైట్, ప్రొస్టేట్‌ మూలకాల నుంచి దొరికే ఖనిజం ఏది?

    1) వెండి       2) నికెల్‌       3) రాగి      4) వజ్రాలు


15.  అల్యూమినియం లోహాన్ని ఏ ఖనిజం నుంచి తయారు చేస్తారు?

    1) అబ్రకం    2) క్లింబరైట్‌     3) బాక్సైట్‌      4) బెరైటీస్‌


16. కిందివాటిని జతపరచండి.

ప్రాంతం లభించే ఖనిజం
i) ఝరియా ఎ) రాగి
ii) అగ్నిగుండాల బి) బొగ్గు
iii) బయ్యారం సి) బంగారం
iv) హిరాబుద్దీని డి) ఇనుము
  ఇ) వజ్రాలు

          i   ii   iii   iv              i   ii   iii  iv

    1) ఎ  బి  సి  డి            2) డి  సి  బి  ఎ

    3) ఇ  డి  బి  ఎ            4) బి  ఎ  డి  సి


17.  ఇనుము ధాతువుల్లో అత్యంత నాణ్యమైంది ఏది?

    1) సిడరైట్‌       2) లిమోనైట్‌       3) మాగ్నటైట్‌       4) హెమటైట్‌


18.  కిందివాటిని జతపరచండి. 

i) నోబెల్‌ మెటల్ ఎ) లిగ్నైట్‌
ii) విశ్వఖనిజం బి) రాగి
iii) మిశ్రమ ఖనిజం సి) అల్యూమినియం
iv) బ్రౌన్‌ ఖనిజం డి) బంగారం

         i   ii   iii  iv             i   ii   iii   iv 

    1) బి  ఎ  డి  సి         2) ఎ  బి  సి  డి

    3) డి  సి  బి  ఎ         4) డి  సి  ఎ  బి


19.  ఆంథ్రోసైట్, బిట్యుమినస్‌ ఏ ధాతువు రకాలు?

    1) బొగ్గు       2) ఇనుము       3) థోరియం     4) యురేనియం


20.  విద్యుత్తు నిరోధానికి వినియోగించే ఖనిజ వనరు ఏది?

    1) మైకా      2) బెరైటీస్‌      3) బాక్సైట్‌      4) సున్నపురాయి


21.  బేరియంను దేని నుంచి వెలికి తీస్తారు?

    1) సున్నపురాయి       2) స్టియాటైట్‌      3) బెరైటీస్‌      4) కియాటైట్‌


22.  పర్యావరణానికి హాని కలిగిస్తుందనే ఉద్దేశంతో ఇటీవల ఏ ఖనిజాన్ని ప్రపంచ వ్యాప్తంగా నిషేధించారు?

    1) ఆస్బెస్టాస్‌       2) డోలమైట్‌      3) జిప్సమ్‌      4) ఇల్మనైట్‌


23.  పెన్సిల్, బ్యాటరీల్లో ఉపయోగించే ఖనిజం?

    1) బాక్సైట్‌      2) వజ్రం      3) గ్రాఫైట్‌       4) లిగ్నైట్‌


24.  ఇటీవల ‘యురేనియం కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌’ (UCIL) యురేనియం, థోరియాన్ని వెలికితీసేందుకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని ఏ ప్రాంతాలను అన్వేషిస్తుంది?

  1) తుమ్మలపల్లి - నాగర్‌కర్నూల్‌   2) లింగాల - మిర్యాలగూడ

 3) అగ్నిగుండాల - సింగరేణి      4) రామగిరి - గద్వాల


25.  రసాయన పరిశ్రమల్లో ఆక్సీకరణంగా ఉపయోగించే మాంగనీస్‌కు ఆంధ్రప్రదేశ్‌లోని ఏ జిల్లా ప్రసిద్ధి?

    1) కర్నూలు       2) చిత్తూరు      3) శ్రీకాకుళం      4) పశ్చిమ గోదావరి


26.  న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించడానికి, డ్యూటీరియం ఆక్సైడ్‌ను (D20) తయారు చేసే భారజల కర్మాగారం ఎక్కడ ఉంది?

    1) మణుగూరు     2) గద్వాల     3) రంగారెడ్డి      4) దన్‌బాద్‌


27.  కిందివాటిలో సరైన వాక్యాలను గుర్తించండి.

   ఎ) 1774 సంవత్సరంలో వెలికి తీసిన మొదటి బొగ్గు గని - రాణిగంజ్‌ (పశ్చిమ్‌ బంగ)

   బి) 1889 సంవత్సరంలో వెలికి తీసిన మొదటి చమురు బావి - దిగ్బాయ్‌ (అసోం)

   సి) 1904లో వెలికి తీసిన మొదటి ఇనుప గని - సింగ్‌బమ్‌ (ఝార్ఖండ్)

    1) ఎ          2) ఎ, బి           3) బి, సి          4) ఎ, బి, సి


28.  థోరియంను అత్యధికంగా ఏ రాష్ట్రాల్లో వెలికి తీస్తారు?

    1) కేరళ - తమిళనాడు      2) తమిళనాడు - ఆంధ్రప్రదేశ్‌

    3) కేరళ - కర్ణాటక            4) గుజరాత్‌ - మహారాష్ట్ర


29.  రాతి ఉప్పు (సైంధవ లవణం) కు ఏ రాష్ట్రం అత్యంత ప్రసిద్ధి?

    1) గుజరాత్‌       2) ఒడిశా     3) హిమాచల్‌ప్రదేశ్‌     4) ఝార్ఖండ్‌


30.  దేశంలో 98% బొగ్గు ఎక్కడ లభిస్తుంది?

    1) దార్వార్‌       2) గొండ్వానా       3) టెర్షియోరరీ      4) చార్నోఖైట్‌

31.  ప్రస్తుతం దేశంలోని మొత్తం చమురు ఉత్పత్తిలో 48% ఏ ప్రాంతం కలిగి ఉంది?

    1)  బాంబేహై       2) దిగ్బాయ్‌       3) కావేరి      4) బారాముర


32.  భారతదేశంలో సహజ వాయువును మొదట ఏ ప్రాంతంలో కనుక్కున్నారు? 

    1) హుగ్రేజన్‌       2) బిజయపూర్‌       3) వాగొడియా      4) జ్వాలాముఖి


33.  సహజవాయువును 36 శాతం అత్యధికంగా ఏ రంగంలో ఉపయోగిస్తున్నారు?

    1)  ఎరువుల పరిశ్రమ       2)  శక్తి ఉత్పాదనం    3) ఇతర పరిశ్రమలు      4) వంటగ్యాస్‌


34.  నహరకటియా, అంకళేశ్వర్‌ ప్రాంతాలు దేనికి ప్రసిద్ధి? 

    1) చమురు       2) సహజవాయువు       3) థోరియం       4) యురేనియం


35.  కిందివాటిలో ప్రపంచంలోనే అతి పొడవైన భూగర్భ పైప్‌లైన్‌?

    1) ముంబయి - అంకళేశ్వర్‌ - కయోలీ         2) సాలాయా - కోయలి - మధుర

    3) హజీరా - బీజాపూర్‌ - జగదీస్‌పుర్‌        4) నహర్‌కటియా - నూన్‌మతి - బరౌనీ


36.  గ్యాస్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌  గుజరాత్‌ జామ్‌నగర్‌ నుంచి దిల్లీ వరకు నిర్మించిన ప్రపంచంలోనే పొడవైన ఎల్‌పీజీ పైపులైన్‌ పొడవు ఎంత?

    1) 1269 కి.మీ.      2) 1750 కి.మీ.      3) 1256 కి.మీ.      4) 1161 కి.మీ.


37.  కింది అంశాల్లో సరైనవి గుర్తించండి.

    ఎ) ప్రస్తుతం దేశంలో 24 నూనె శుద్ధి కర్మాగారాలున్నాయి. ఇందులో 3 ప్రైవేటు, మిగిలినవి ప్రభుత్వ రంగంలో ఉన్నాయి

    బి) భారత్‌లో అతిపెద్ద ప్రభుత్వ ఆయిల్‌ రిఫైనరీ - కేరళ కొచ్చి రిఫైనరీ

   సి) దేశంలో అతిచిన్న ప్రభుత్వ ఆయిల్‌ రిఫైనరీ - ఆంధ్రప్రదేశ్‌ తాటిపాక

    డి) ప్రైవేటు రంగంలో అతిపెద్ద ఆయిల్‌ రిఫైనరీ - గుజరాత్‌ జామ్‌నగర్‌

    1) ఎ, డి      2) బి, సి      3) ఎ, బి, సి       4) ఎ, బి, సి, డి


38.  సిమెంట్‌ పరిశ్రమల్లో అత్యధికంగా ఉపయోగించే ముడి ఖనిజం ఏది?

    1) అబ్రకం      2) సున్నపురాయి       3) ఆస్బెస్టాస్‌       4) స్టియాటైట్‌


39.  దేశంలో మొదట యాంత్రీకరణ ద్వారా వెలికి తీస్తున్న ఇనుప గని?

    1) బైలాదిల్లా      2) బళ్లారి       3) సింగ్‌బమ్‌      4) కెమ్మనగండి


40.  కిందివాటిలో ఖనిజాలు - వాటి ధాతువులకు సంబంధించి సరికానిది.

    1) సీసం - గెలీనా                 2) థోరియం - మోనోజైట్‌ 

    3) టిటానియం - ఇల్మనైట్‌     4) యురేనియం - క్లింబరైట్‌ 


41.   బాక్సైట్‌ను అత్యధికంగా ఉత్పత్తి చేసే రాష్ట్రాలు?

    1) ఒడిషా     2) గుజరాత్‌     3) ఛత్తీస్‌గఢ్‌     4) మధ్యప్రదేశ్‌ 


42.  ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని దంతేవాడ ప్రాంతం దేనికి ప్రసిద్ధి?

    1) వెండి        2) తగరం       3) రాగి       4) జింకు 


43.  కిందివాటిలో అలోహ ఖనిజం కానిది?

    1) మెగ్నీషియం     2) డోలమైట్‌     3) పలకరాయి     4) ఫెల్డ్‌స్ఫార్‌ 

44.  ఇనుప ఖనిజ ఉత్పత్తిలో భారతదేశం ప్రపంచంలో ఏ స్థానంలో ఉంది?

    1) మొదటి        2) 4వ        3) 2వ       4) 3వ


45.  ఇండియాలో 94% ముగ్గురాయి (బెరైటీస్‌) ఉత్పత్తిని ఏ రాష్ట్రం కలిగి ఉంది?

    1) ఛత్తీస్‌గఢ్‌    2) తెలంగాణ     3) మధ్యప్రదేశ్‌     4) ఆంధ్రప్రదేశ్‌ 

46.  ఫెర్టిలైజర్స్, ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస్‌లో వినియోగించే ఖనిజం?

    1) జింకు      2) జిప్సం      3) ఆస్బెస్టాస్‌      4) గ్రాఫైట్‌ 


47. బంగారాన్ని క్యారెట్స్‌లో లెక్కిస్తారు. అయితే 22 క్యారెట్స్‌లో బంగారం శాతం ఎంత?

    1) 8.4 శాతం     2) 91.6 శాతం     3) 100 శాతం     4) 96.1 శాతం 


48.  స్టెయిన్‌లెస్‌ స్టీల్‌లో ఉపయోగించే మిశ్రమ ఖనిజాలు?

    ఎ) ఇనుము     బి) నికెల్‌      సి) క్రోమియం   డి) జింకు    ఇ) రాగి

    1) ఎ, బి, సి     2) బి, సి, డి     3) సి, డి, సి     4) ఎ, బి, డి


సమాధానాలు:  1-2; 2-1; 3-4; 4-1; 5-4; 6-4; 7-2; 8-4; 9-2; 10-3; 11-1; 12-3; 13-2; 14-1; 15-3; 16-4; 17-3; 18-3; 19-1; 20-1; 21-3; 22-1; 23-3; 24-1; 25-3; 26-1; 27-4; 28-1; 29-3; 30-2; 31-1; 32-4; 33-1; 34-1; 35-3; 36-1; 37-4; 38-2;  39-1; 40-4; 41-1; 42-2; 43-1; 44-2; 45-4; 46-2; 47-2; 48-1.

Posted Date : 24-01-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌