మాదిరి ప్రశ్నలు
1. ఎవరెస్ట్ శిఖరం ఉన్న ప్రాంతం? (Group 2, 2004)
జ: కేంద్ర హిమాలయాలు
2. సాగర్‌మాతకు ఉన్న మరో పేరు? (Group 1, 2012)
జ: ఎవరెస్ట్
3. K2 పర్వతాగ్రం ఉన్న ప్రదేశం? (Jr. Steno, 2010)
జ: కారకోరం
4. హిమాలయాల్లో ఎత్తైన శిఖరాలు ఏ ప్రాంతాల్లో ఉన్నాయి? (Group-1, 1999)
జ: హిమాద్రి
5. ప్రపంచంలోని ఎత్తైన పర్వతాల్లో ఒకటైన అన్నపూర్ణ ఎక్కడ ఉంది?
జ: నేపాల్
6. ధవళగిరి శిఖరం ఏ ప్రాంతంలో ఉంది? (Group-1, 1999)
జ: నేపాల్
7. హిమాచల్ పర్వతాలు - హిమాద్రి మధ్య ప్రసిద్ధిగాంచిన లోయ?
జ: కశ్మీర్‌లోయ
8. మికిర కొండలు ఏ రాష్ట్రంలో ఉన్నాయి?
జ: అసోం
9. కిందివాటిలో ఏ రాష్ట్ర తీరాన్ని కోరమండల్ తీరం అని పిలుస్తారు? (2010, గ్రూప్ - 1)
1) గుజరాత్ 2) మహారాష్ట్ర
3) తమిళనాడు 4) కేరళ
జ: 3 (తమిళనాడు)
10. మలబార్ తీరప్రాంతపు బ్యాక్ వాటర్స్‌ను ఏమని పిలుస్తారు. (సివిల్ అసిస్టెంట్ సర్జన్, 2009)
జ: లాగూన్లు
11. కృష్ణ, గోదావరి డెల్టాల మధ్య ఉన్న సరస్సు? (డీఎల్ - 2012)
జ: కొల్లేరు సరస్సు
12. కిందివాటిలో సుభాష్ చంద్రబోస్ ద్వీప్ అని దేన్ని పిలుస్తారు?
1) నీల్ ఐలాండ్ 2) రాస్ ఐలాండ్
3) హేవ్‌లాక్ ఐలాండ్ 4) కచ్చతీవు ఐలాండ్
జ: 2 (రాస్ ఐలాండ్ )
13. కథియవార్ తీరం అని ఏ రాష్ట్ర తీరాన్ని పిలుస్తారు?
జ: గుజరాత్
14. దేశంలో అతిపొడవైన తీరరేఖ ఉన్న రాష్ట్రం?
జ: గుజరాత్
15. ఆసియా ఖండంలోనే మొదటి బ్లూఫ్లాగ్ బీచ్?
జ: చంద్రభాగ బీచ్
16. భూవిజ్ఞాన శాస్త్రజ్ఞుల ప్రకారం భారతదేశంలో అతి పురాతనమైన ముడుత పర్వతాలు ఏవి?
జ: ఆరావళి పర్వతాలు
17. ‘రూర్ ఆఫ్ ఇండియా’ అని పిలిచే ప్రాంతం ఏది?
జ: ఛోటానాగ్పూర్ పీఠభూమి
18. గంగా - సింధు మైదానాల్లో ఉండే చిత్తడి ప్రాంతాన్ని ఏమంటారు?
జ: టెరాయి
19. దోఆబ్లకు ప్రసిద్ధి చెందిన ప్రాంతం?
జ: పంజాబ్ - హరియాణా మైదానం
20. ‘బిహార్ దుఃఖదాయని’ అని ఏ నదిని పిలుస్తారు?
జ: కోసి నది
21. భారతదేశంలో అతిపెద్ద భౌతిక విభాగం?
జ: ద్వీపకల్ప పీఠభూమి
22. ఇటీవలి కాలంలో ఏర్పడిన ఒండలి నేలలను ఏమంటారు?
జ: ఖాదర్