• facebook
  • whatsapp
  • telegram

ఉత్తర అమెరికా

ఉనికి 

* ఉత్తర అమెరికా 7ా నుంచి 83ా ఉత్తర అక్షాంశాల మధ్య, 20ా నుంచి 120ా పశ్చిమ రేఖాంశాల మధ్య ఉంది.

* విస్తీర్ణపరంగా ఇది మూడో పెద్ద ఖండం.

విస్తీర్ణంలో భారతదేశం కంటే ఉత్తర అమెరికా 8 రెట్లు పెద్దది.

ఎల్లలు 

* తూర్పు - అట్లాంటిక్‌ మహాసముద్రం 

* పశ్చిమం - పసిఫిక్‌ మహాసముద్రం

* ఉత్తరం - ఆర్కిటిక్‌ మహాసముద్రం 

* దక్షిణం - కరేబియన్‌ సముద్రం

* ఉత్తర, దక్షిణ అమెరికాలను పనామా కాలువ వేరు చేస్తోంది. 

* అట్లాంటిక్‌ మహాసముద్ర నీటిని పసిఫిక్‌ మహాసముద్రంతో కలిపే కాలువ - పనామా కాలువ.

* పనామా కాలువను తవ్వడం వల్ల న్యూయార్క్, శాన్‌ఫ్రాన్సిస్కో నగరాల మధ్య దూరం 12,640 కి.మీ. తగ్గింది.


బేరింగ్‌ జలసంధి

* ఉత్తర అమెరికా ఖండాన్ని ఆసియా ఖండం నుంచి వేరు చేస్తోంది.

* ఆర్కిటిక్, బేరింగ్‌ సముద్రాలను కలుపుతుంది.

* రష్యా, అలస్కా దేశాలను వేరు చేస్తోంది.


ప్రధాన భూస్వరూపాలు 

ఉత్తర అమెరికాను మూడు ప్రధాన భౌతిక స్వరూపాలుగా విభజించారు. అవి:

1. పశ్చిమ కార్డిలిరాస్‌ 

2. తూర్పు మెట్ట భూములు 

3. మధ్య మైదానాలు

పశ్చిమ కార్డిలిరాస్‌

* ఇవి ఉత్తర అమెరికాలో పశ్చిమవైపు ఉత్తర, దక్షిణాలుగా విస్తరించి ఉన్నాయి.

* ఈ ఖండంలోని నదులకు జన్మస్థలం పశ్చిమ కార్డిలిరాస్‌

పశ్చిమ కార్డిలిరాస్‌ మూడు సమాంతర శ్రేణులుగా ఉంది. అవి:

1. రాకీ పర్వతాలు 

2. తీరశ్రేణి 

3. సియెర్రా నెవెడ శ్రేణి

* ఈ ఖండంలో ఎత్తయిన శిఖరం - మెకిన్లీ. ఎత్తు 6187 మీటర్లు. ఇది అలస్కా దేశంలో ఉంది.

* మెకిన్లీ శిఖరం రాకీ పర్వతాల్లో ఉంది.

* రాకీ పర్వతాల వద్ద రాగి, యశదం, బంగారం విరివిగా లభిస్తాయి.


తూర్పు మెట్ట భూములు 


* ఇవి తూర్పున లాబ్రడార్‌ నుంచి న్యూఫౌండ్‌లాండ్‌ (newfoundland) వరకు విస్తరించి ఉన్నాయి.

* ఇక్కడ అపలేచియన్‌ పర్వతాలు ఉన్నాయి.

* ఇవి రాకీపర్వతాల కంటే పురాతనమైనవి.

* అపలేచియన్‌ పర్వతాలు అవశిష్ట పర్వతాలు.

* ఈ ప్రాంతంలో బొగ్గు విరివిగా లభిస్తుంది.


మధ్య మైదానాలు 

* ఇవి పశ్చిమాన రాకీ పర్వతాలు, తూర్పున అపలేచియన్‌ పర్వతాల మధ్య విశాలంగా విస్తరించి ఉన్నాయి.

* ఈ ప్రాంతంలో అయిదు మంచి నీటి సరస్సులు ఉన్నాయి. అవి: 

1. సుపీరియర్‌    2. మిచిగాన్‌    3. హురాన్‌     4. ఇరి      5. ఒంటారియో

* సుపీరియర్‌ సరస్సు ప్రపంచంలోనే అతిపెద్ద మంచినీటి సరస్సు. దీని చుట్టూ ఇనుప ఖనిజం లభిస్తుంది.

* ఇరి, ఒంటారియో సరస్సుల మధ్య నయాగరా జలపాతం ఉంది.

* ఉత్తర అమెరికా ఖండాన్ని పంచ సరస్సుల భూమి ' the land of five lakes'  అంటారు.


రవాణా 

* ఉత్తర అమెరికా ఖండమంతటా అత్యంత ఆధునిక రవాణా సౌక్యరాలు ఉన్నాయి.

* అట్లాంటిక్‌ తీరంలో అనేక రేవు పట్టణాలు ఉన్నాయి.

* ఈ ఖండంలో వ్యాపారం చాలా వరకు జల మార్గాల ద్వారా జరుగుతుంది.

* మిసిసిపి, లారెన్స్‌ నదులు, 5 మహా సరస్సులు ప్రధాన ఖండాంతర్గత జలమార్గాలు.

* ఈ ఖండంలో 9000 వరకు విమానాశ్రయాలు ఉన్నాయి.

* న్యూయార్క్‌లోని కెనడీ విమానాశ్రయం ప్రపంచంలో అత్యంత రద్దీ ఉన్న విమానాశ్రయం.


ఇతర అంశాలు

* అమెరికా, కెనడా దేశాలను 49ా అక్షాంశం వేరు చేస్తుంది.

* ఆసియా ఈశాన్య అంచు వాయవ్య ఉత్తర అమెరికాకు 96 కి.మీ. దూరంలో ఉంది.

అమెరిగో వెస్పూచి అనే ఇటలీ దేశ అన్వేషకుడు క్రీ.శ.1502లో అమెరికాను కనుక్కున్నాడు.

* ప్రపంచ సినీ పరిశ్రమ కేంద్రమైన హాలీవుడ్‌ ఈ ఖండంలోనే ఉంది.

* అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోను బంగారు ద్వారం ఉన్న నగరంగా పేర్కొంటారు.

* హవాయి దీవుల రాజధాని నగరమైన హోనోలులును క్రాస్‌ రోడ్స్‌ ఆఫ్‌ పసిఫిక్‌ అంటారు.

* 1000 పశ్చిమ రేఖాంశం ఉత్తర అమెరికాను రెండు నిలువు భాగాలుగా వేరు చేస్తోంది.

ప్రపంచ భూభాగంలో 16.3% ఈ ఖండం ఆక్రమించింది.


నదీవ్యవస్థ 


* ఈ ఖండంలో మిసిసిపి, సెయింట్‌ లారెన్స్, కొలరాడో, సక్రామెంటో ప్రధాన నదులు.

* ఈ ఖండంలో పెద్ద నది మిసిసిపి.


గ్రాండ్‌ కానియన్‌ ఆఫ్‌ కొలరాడో:


* ఇది ప్రపంచంలో అతి పెద్ద అగాధదరి.

* కొలరాడో నది ప్రవాహం వల్ల ఈ అగాధదరి ఏర్పడింది.

* దీని పొడవు 466 కి.మీ., లోతు 1.6కి.మీ., వెడల్పు 29 కి.మీ.


వ్యవసాయం 


* ఈ ఖండంలోని ప్రజల ముఖ్య వృత్తి వ్యవసాయం. ఇక్కడ విస్తృత వ్యవసాయం అమల్లో ఉంది.

* ఉత్తర అమెరికాలోని గడ్డి భూములను ప్రయరీలు అంటారు.

* ప్రయరీలు గోధుమ పంటకు ప్రసిద్ధి. అందుకే వీటిని ‘ప్రపంచ రొట్టెల బుట్ట’ అంటారు.

* ప్రపంచవ్యాప్తంగా గోధుమ ఉత్పత్తిలో ఉత్తర అమెరికా అయిదో స్దానంలో ఉంది.

* మెక్సికో దేశంలో జొన్న ఎక్కువగా పండిస్తారు.

* ప్రపంచ జొన్న ఉత్పత్తిలో ఉత్తర అమెరికా వాటా 50%. 

* మిసిసిపి నదీ పరీవాహక ప్రాంతంలో పత్తిని విస్తారంగా సాగు చేస్తారు.

* ప్రపంచ పొగాకు ఉత్పత్తిలో ఉత్తర అమెరికా వాటా 30%. 


ఉత్తర అమెరికాలోని ద్వీపాలు

* గ్రీన్‌లాండ్‌: ప్రపంచంలోనే అతిపెద్ద ద్వీపమైన గ్రీన్‌లాండ్‌ అమెరికా ఈశాన్య భాగంలో ఉంది. దీన్నే కిలాడి నూనట్‌ అని పిలుస్తారు. ఈ ద్వీపం భౌగోళికంగా ఉత్తర అమెరికాలో భాగమైనప్పటికీ ఇది డెన్మార్క్‌ అధీనంలో ఉంటుంది.

* బఫిన్‌ ద్వీపాలు: ఈ ద్వీపాలు హడ్సన్‌ అఖాతానికి, బఫిన్‌ అఖాతానికి మధ్య ఉన్నాయి. 

* సౌతాంప్టన్‌ ద్వీపం: ఇది హడ్సన్‌ అఖాతం ఉత్తర భాగంలో ఉంది.

* హవాలి ద్వీపాలు: ఇవి పసిఫిక్‌ మహాసముద్రంలో అగ్నిపర్వత ద్వీప సముదాయాలు.

* న్యూఫౌండ్‌లాండ్‌ ద్వీపం: సెయింట్‌ లారెన్స్‌ సింధు శాఖ వద్ద గల ద్వీపం. దీన్ని ‘ది రాక్‌’ అని కూడా పిలుస్తారు. గ్రాండ్‌ బ్యాంకు అనే చేపల దిబ్బ ఇక్కడ ఉంది.

* అల్యూషన్‌ ద్వీపాలు: అలాస్కా ద్వీపం నుంచి తోరణం లాగా పసిఫిక్‌ మహాసముద్రంలో విస్తరించిన ద్వీపాలు. 

ఆర్కిటిక్‌ మహాసముద్రంలోని ద్వీపాలు: విక్టోరియా ద్వీపం, ప్యారీ ద్వీపాలు, క్వీన్‌ ఎలిజబెత్‌ ద్వీపం, ఎల్స్మియర్‌ ద్వీపాలు కెనడా ఉత్తరానున్న ఆర్కిటిక్‌ మహాసముద్ర భాగంలో ఉన్నాయి

డెత్‌ వ్యాలీ: అమెరికాలోని అత్యంత పల్లపు ప్రాంతం. ఇది కాలిఫోర్నియా, నెవెడ రాష్ట్రాల్లో ఉంది. అమెరికాలో అత్యంత ఉష్ణోగ్రత నమోదయ్యే ప్రాంతం డెత్‌ వ్యాలీ.


పరిశ్రమలు 
 

* ప్రపంచంలో ఎక్కువ పారిశ్రామికీకరణ చెందిన ఖండం ఉత్తర అమెరికా.

* అమెరికాలో ఇనుము - ఉక్కు పరిశ్రమలు ఉన్నాయి.

వార్తా పత్రికలకు ఉపయోగించే కాగితం ఉత్పత్తికి కెనడా ప్రసిద్ధి చెందింది.

ఈ ఖండంలోని ‘మాంట్రీలు’ ప్రధాన పారిశ్రామిక కేంద్రం.

Posted Date : 01-08-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌