• facebook
  • whatsapp
  • telegram

సముద్రశాస్త్రం - 2

1. పాంథాలసా అంటే?

1) పెద్దభూభాగం      2) మహా సముద్రాల కూటమి     

3) దట్టమైన అరణ్యం   4) సముద్ర అగాధం

జ: మహా సముద్రాల కూటమి

2. ఇంగ్లిష్‌ అక్షరం ‘S’ ఆకారంలో ఉండే మహా సముద్రం?

1) అట్లాంటిక్‌     2) పసిఫిక్‌     3) హిందూ మహాసముద్రం    4) ఆర్కిటిక్‌

జ: అట్లాంటిక్‌     

3. కిందివాటిలో పలకల కదలికల అధ్యయనంలో దోహదపడేవి ఏవి?

1) సముద్ర తరంగాలు     2) సముద్ర అగాధాలు     

3) సముద్ర మైదానాలు     4)  ప్రపంచ పవనాలు

జ: సముద్ర అగాధాలు

4. ఛాలెంజర్‌ అగాధం లోతు ఎంత?

1) 11,022 మీ.    2) 10,475 మీ.    3) 11,622 మీ.    4) 7,450 మీ.

జ: 11,022 మీ

5. అతిపెద్ద ఖండ తీరపు అంచు కలిగిన మహా సముద్రం ఏది?

1) పసిఫిక్‌     2) అట్లాంటిక్‌     3) ఆర్కిటిక్‌    4) అంటార్కిటికా

జ: అట్లాంటిక్‌

6. శాస్త్రవేత్తలు ఇప్పటివరకు అధ్యయనం చేసిన సముద్ర అగాధాల సంఖ్య?

1) 37       2) 47      3) 57     4) 67

జ:  57 

7. బెఫిన్‌ దీవి కింది ఏ మహాసముద్రంలో ఉంది?

1) పసిఫిక్‌     2) అట్లాంటిక్‌       3) ఆర్కిటిక్‌    4) హిందూ మహాసముద్రం

జ:  అట్లాంటిక్‌   

8. అట్లాంటిక్‌ మహాసముద్రంలోని శీతల ప్రవాహం?

1) గల్ఫ్‌స్ట్రీం   2) కురోషియా     3) పెటా    4) లాబ్రడార్‌

జ: లాబ్రడార్‌

9. మహాసముద్రాల్లో ఎక్కువ భాగం సముద్ర మట్టానికి ఎన్ని కిలోమీటర్ల లోతు వరకు ఉంటుంది? 

1) 3 - 6 కి.మీ.    2) 5 - 6 కి.మీ.   3) 8 - 16 కి.మీ.     4) 5 - 8 కి.మీ.

 జ: 3 - 6 కి.మీ.  

10. సముద్ర చలనాలు ఎన్ని రకాలు?

1) రెండు   2) మూడు     3) నాలుగు    4) ఆరు

జ:  మూడు

11. సముద్ర తరంగాల పరిమాణం దేనిపై ఆధారపడి ఉంటుంది?

1) గాలి వీచే దిశ     2) గాలి వేగం     3)సముద్ర లోతు     4) ఖండతీరపు వాలు

జ:  గాలి వేగం   

12. ‘డాగర్‌ బ్యాంక్‌’ అనే ప్రముఖ మత్స్య కేంద్రం ఎక్కడ ఉంది?

1) ఎర్ర సముద్రం    2) కాస్పియన్‌ సముద్రం 

3) ఉత్తర సముద్రం    4) మధ్యధరా సముద్రం

జ: ఉత్తర సముద్రం

13. సాధారణంగా మహాసముద్రాల ఉష్ణోగ్రత...

1) 2 నుంచి 290C  వరకు ఉంటుంది      2) సముద్రంలో లోతుకు వెళ్లే కొద్దీ తగ్గుతుంది 

3) 5 కి.మీ. లోతు వరకు క్రమేపీ తగ్గుతుంది     4) పైవన్నీ

జ:  పైవన్నీ 

14. మహాసముద్రాలపై వేగంగా కదిలే నీటి ప్రవాహాన్ని ఏమంటారు?

1) స్ట్రీమ్‌     2) డ్రిఫ్ట్‌       3) లానినో     4) ఎల్‌నినో

 జ: స్ట్రీమ్‌ 

15. సముద్రలోతును కింది ఏ ప్రమాణంతో సూచిస్తారు?

1) గాలన్స్‌       2) నాటికల్‌ మైళ్లు    3) కిలోమీటర్‌    4) ఫాథమ్‌

జ:  ఫాథమ్‌  

16. సముద్ర నీటిలో పెద్దమొత్తంలో కరిగి ఉన్న ఖనిజం?

1) ఉప్పు     2) ఫాస్ఫేట్‌    3) కాల్షియం  4) బంగారం

  జ: ఉప్పు    

17. మానవులకు అత్యంత ఉపయోగకరమైన మహాసముద్ర భూతలం ఏది?

1) ఖండతీరపు అంచు     2) ఖండతీరపు వాలు 

3) సముద్రమైదానం     4) సముద్ర అగాధం

జ: ఖండతీరపు అంచు 

18. భూమిపై ఉన్న మంచి నీటిలో ఎంత శాతం శాశ్వత మంచుగా మారింది?

1) 68.7%     2) 29.9%     3) 6.2%    4) 97%

జ:  68.7%

19. కిందివాటిలో సరైన క్రమం ఏది?

1) అవపాతం, రవాణా, ద్రవీభవనం, బాష్పీభవనం

2) బాష్పీభవనం, రవాణా, ద్రవీభవనం, అవపాతం

3) ద్రవీభవనం, అవపాతం, రవాణా, భూగర్భజలం

4) ఉపరితల ప్రవాహాం, ద్రవీభవనం, అవపాతం, రవాణా

జ: బాష్పీభవనం, రవాణా, ద్రవీభవనం, అవపాతం

20. ప్రపంచ సముద్ర దినోత్సవాన్ని ఏటా ఏ రోజున నిర్వహిస్తారు?

1) జూన్‌ 5    2) జూన్‌ 6     3) జూన్‌ 8     4) జూన్‌ 18

జ:  జూన్‌ 8   

21. రెండు పోటులు లేదా రెండు పాటుల మధ్య కాల వ్యత్యాసం?

1) 6 గం.13 ని.     2) 52 ని.     3) 12 గం.26 ని.    4) 6 గం.30 ని.

జ: 12 గం.26 ని.   

22. బయోషియో ఒక....

1) ఉష్ణప్రవాహం      2) శీతలప్రవాహం     

3) స్థానిక ఉష్ణప్రవాహం    4) భూభాగ శీతల ప్రవాహం

జ:  శీతలప్రవాహం     

23. ప్రపంచంలోకెల్లా అత్యంత చదును, నునుపుగా ఉండే ప్రాంతం?

1) లోయస్‌ మైదానం  2) మహసముద్ర మైదానం 

3) నదీతీర మైదానం    4)  సముద్రతీర మైదానం

జ: మహసముద్ర మైదానం 

24. నల్లసముద్ర నీటిలో ఉండే లవణీయత?

1) 8%    2) 15%     3) 35%   4) 40%

జ:  15% 

25. కిందివాటిలో లవణీయత ఎక్కువగా ఉన్న సముద్రం?

1) బాల్టిక్‌ సముద్రం    2) ఎర్రసముద్రం 

3) నల్లసముద్రం    4) మధ్యధరా సముద్రం

జ: మధ్యధరా సముద్రం

26. పోటు-పాటులకు సంబంధించి కిందివాటిలో సరికానిది?

1) సముద్ర నీటిమట్టం తగ్గడం, పెరగడంలో ముఖ్యపాత్ర పోషిస్తాయి.

2) సముద్రంలో ఇసుక మేటను ఆపుతాయి

3) చేపలు పట్టేందుకు అనుకూలం     

4) వీటి ఎత్తు ప్రతిరోజు ఒకేలా ఉంటుంది

జ: వీటి ఎత్తు ప్రతిరోజు ఒకేలా ఉంటుంది

27. కిందివాటిలో సరైన జత?

1) హిప్సోగ్రాఫిక్‌ వక్రరేఖ - సముద్ర అంతర్భాగంలోని నిమ్నోన్నతాలను పోల్చడం

2) ఐసోబాత్స్‌ - ఉపరితలం నుంచి సమాన లోతు కలిగిన ప్రాంతాలు

3) ఐసోహైలైన్స్‌ - ఒకే లవణీయత కలిగిన ప్రాంతాలు    

4) పైవన్నీ 

జ:  పైవన్నీ  

28. ఆసియా, అమెరికా ఖండాల మధ్య ఉన్న మహా సముద్రం?

1) పసిఫిక్‌      2) అట్లాంటిక్‌   3) హిందూమహాసముద్రం     4) మధ్యధరా సముద్రం

జ:  పసిఫిక్‌  

29. అపకేంద్ర బలానికి సంబంధించి కిందివాటిలో సరికానిది?

1) భూమధ్య రేఖ వద్ద తక్కువగా ఉంటుంది

2) భూమధ్య రేఖ వద్ద ఎక్కువగా ఉంటుంది

3) ధ్రువాల వద్ద తక్కువగా ఉంటుంది

4) ధ్రువాల వద్ద ఎక్కువగా ఉంటుంది

జ: భూమధ్య రేఖ వద్ద ఎక్కువగా ఉంటుంది

30. ‘హ్యూడర్‌’ అనే గ్రీకు పదానికి అర్థం?

1) నీరు     2) ఆవిరి      3) జీవం   4) సముద్రం

జ:  నీరు


మరికొన్ని..

1. సముద్రతీర భూస్వరూపాల ఏర్పాటు ఆధారంగా కిందివాటిలో సరైన వరుసక్రమం ఏది?

1) గుహలు, తోరణాలు, సముద్ర బృగువు, పేర్పుడు స్తంభాలు

2) గుహలు, తోరణాలు, బీచ్, అగ్రం

3) బీచ్, అగ్రం, సముద్ర బృగువు, బృగువు

4) గుహలు, తోరణాలు, పేర్పుడు స్తంభాలు, సముద్ర బృగువు

జ: గుహలు, తోరణాలు, పేర్పుడు స్తంభాలు, సముద్ర బృగువు

2. భూమికి, సముద్రానికి మధ్య సరిహద్దు ప్రాంతాన్ని ఏమంటారు?

1) సముద్ర బీచ్‌    2) ఖండతీరపు వాలు     3) ఖండతీరపు అంచు     4) సముద్రమైదానం

జ: ఖండతీరపు అంచు  

3. సామాన్య లవణీయత అంటే?

1) 1000 గ్రా. నీటిలో 30 గ్రా. లవణీయత

2) 100 గ్రా. నీటిలో 35 గ్రా. లవణీయత

3) 1000 గ్రా. నీటిలో 35 గ్రా. లవణీయత

4) 10000 గ్రా. నీటిలో 35 గ్రా. లవణీయత

జ:  1000 గ్రా. నీటిలో 35 గ్రా. లవణీయత

4. ‘ప్యుర్టోరికో అగాధం’ ఏ సముద్రంలో ఉంది?

1) పసిఫిక్‌      2) అట్లాంటిక్‌     3) హిందూమహాసముద్రం     4) మధ్యధరాసముద్రం

జ:  అట్లాంటిక్‌ 

5.  తాగునీరు, సాగు నీరు, నది నీటిలో లవణీయతలు వరుసగా...

1) 1%, 2%, 3%      2) 3%, 2%, 1%    3) 1%, 3%, 2%   4)  2%, 3%, 1%

 జ: 1%, 3%, 2%

6. వాన్‌ సరస్సు ఏ దేశంలో ఉంది?

1) టర్కీ    2) రష్యా    3) అమెరికా     4) జపాన్‌

జ:  టర్కీ

7. ఆగ్నేయాసియా, భారత్‌లో రుతుపవన వ్యవస్థను నిర్వీర్యం చేసి, తక్కువ వర్షపాతానికి కారణమవుతున్న జలరాశి?

1) ఎల్‌నినో    2) లానినో     3) డ్రిఫ్ట్‌    4) ఏదీకాదు

జ: ఎల్‌నినో​​​​​​​

8. ప్రపంచ నీటి వనరుల దినోత్సవాన్ని ఏటా ఎప్పుడు నిర్వహిస్తారు?

1) మార్చి 21     2) మార్చి 22     3) ఏప్రిల్‌ 21    4) ఏప్రిల్‌ 22

జ: మార్చి 22 

9. మృత సముద్రం లవణీయత?

1) 330%      2) 238%    3) 220%     4) 254%

జ:  238%

10. ప్రశాంత జలభాగం అని పిలిచే మహా సముద్రం?

1) పసిఫిక్‌      2) అట్లాంటిక్‌     3) ఆర్కిటిక్‌      4) అంటార్కిటిక్‌ 

జ: పసిఫిక్‌ 


 

వివిధ సముద్ర ప్రవాహాలు

కురోషియో ప్రవాహం: ఇది ఉష్ణ ప్రవాహం. ఉత్తర పసిఫిక్‌లోని ఈ ప్రవాహం ప్రపంచంలోనే ఉన్నతమైంది. 1936 లో జార్జ్‌ వస్ట్‌ అనే శాస్త్రవేత్త దీనికి కురోషియో అనే పేరు పెట్టారు. కురోషియో అంటే జపాన్‌ భాషలో ముదురు నీలం అని అర్థం.

కురోషియో అనే ఉష్ణ ప్రవాహం, ఒయోషియో అనే శీతల ప్రవాహం జపాన్‌ ప్రాంతంలో కలుసుకుంటాయి. ఆ దేశ శీతోష్ణస్థితిపై వీటి ప్రభావం ఎంతో ఉంది. ఈ రెండు ప్రవాహాలు కలిసే ప్రాంతంలో చేపలు తాత్కాలికంగా మూర్ఛపోయి నీళ్లపై తేలుతూ, జాలర్లకు సులభంగా దొరుకుతాయి.

* ఉష్ణ, శీతల ప్రవాహాలు ఎదురెదురుగా కలవడం వల్ల జపాన్‌లో టైఫూన్లు (Typhoons) ఎక్కువగా సంభవిస్తున్నాయి.  ఇవి వారి ఆర్థిక వ్యవస్థపై ప్రభావాన్ని చూపిస్తున్నాయి.

ఒయోషియో ప్రవాహం: ఇది శీతల ప్రవాహం. ఆర్కిటిక్‌ మహాసముద్రం నుంచి బేరింగ్‌ జలసంధి ద్వారా ప్రవహించి, జపాన్‌ వద్ద కురోషియో అనే ఉష్ణ ప్రవాహంతో కలుస్తుంది. దీంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగమంచు ఏర్పడి నౌకాయానానికి, విమానయానానికి అంతరాయం కలుగుతుంది.

బెంగ్యులా ప్రవాహం(Benguela Current): ఇది ఒక శీతల ప్రవాహం.పశ్చిమ పవన డ్రిఫ్ట్‌ ఉత్తరానికి తిరిగి, ఆఫ్రికా పశ్చిమ తీరం మీదుగా ప్రవహించేటప్పుడు బెంగ్యులా వద్ద అప్‌వెల్లింగ్‌ ప్రభావం వల్ల శీతల ప్రవాహం ఏర్పడుతుంది. సముద్ర గర్భంలో ఉండే మురికి నీరు పైకి రావడాన్ని అప్‌వెల్లింగ్‌ అంటారు. ఇది దుర్వాసనతో ఉంటుంది. అప్‌వెల్లింగ్‌ వెంట ప్లాంక్టన్స్‌ (Planktons) అనే చిన్న పురుగులు ఉపరితలానికి వచ్చి, చేపలకు ఆహారంగా మారతాయి.

Posted Date : 24-05-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌