• facebook
  • whatsapp
  • telegram

భారతదేశ భౌతిక స్వరూపాలు

1. ఆసియా ఖండంలోనే అతిపెద్ద బైడైరెక్షనల్‌ సొరంగాన్ని లఢఖ్‌లో నిర్మిస్తున్నారు. ఇది ఏ కనుమలో ఉంది?
1) జోజిలా      2) నితిలా      3) బారాంచల్‌      4) లీఫ్‌ లేఖ్‌


2. సూలేమాన్‌ పర్వతాలు ఏ రెండు దేశాల మధ్య సరిహద్దులు?
1) ఇండియా - అఫ్గానిస్థాన్‌          2) ఇండియా - చైనా
3) ఇండియా - పాకిస్థాన్‌             4) ఇండియా - బంగ్లాదేశ్‌


3. కిందివాటిలో వృష్ణ/ఉప్పు జలాల ద్వారా ఏర్పడిన పొడవైన సరస్సు ఏది?
1) చిల్కా సరస్సు      2) వెంబనాడ్‌ సరస్సు      3) లోక్‌తక్‌ సరస్సు      4) పులికాట్‌ సరస్సు


4. భారతదేశ పశ్చిమ కనుమల్లో ఉన్న ఘాట్‌/కనుమలను ఉత్తరం నుంచి దక్షిణానికి అవరోహణ క్రమంలో అమర్చండి.
1) పాల్‌ఘాట్, షేన్‌కోట్, థాల్‌ఘాట్, బోర్‌ఘాట్‌
2) థాల్‌ఘాట్, బోర్‌ఘాట్, పాల్‌ఘాట్, షేన్‌కోట్‌
3) థాల్‌ఘాట్, పాల్‌ఘాట్, బోర్‌ఘాట్, షేన్‌కోట్‌
4) బోర్‌ఘాట్, థాల్‌ఘాట్, షేన్‌కోట్, పాల్‌ఘాట్‌


5. భారతదేశంలో అత్యంత పురాతనమైన శిలలు?
1) దార్వార్‌ శిలలు       2) గోండ్వానా శిలలు      
3) కడప శిలలు          4) దక్కన్‌ నాపల


6. డూన్స్‌ వేటి మధ్యలో విస్తరించి ఉన్నాయి?
1) హిమాచల్‌ - శివాలిక్‌          2) ట్రాన్స్‌ - హిమాద్రి 
3) శివాలిక్‌ - వింద్యా              4) వింద్యా - సాత్పుర


7. కందర భూములు అనేవి?
1) అధికంగా కోతకు గురైన ప్రాంతాలు    2) ఇసుక ప్రాంతాలు
3) ఉపరితల సమతల ప్రాంతాలు         4) ఏదీకాదు


8. కిందివాటిలో మిక్కిలి ఎత్తయిన విసనకర్ర ఆకారంలో ఉన్న అచిద్ర భూములు?
1) బాబర్‌      2) భంగర్‌      3) ఖాదర్‌      4) ఖల్లార్‌


9. కిందివాటిని జతపరచండి.
    దోబ్‌                   నదులు
i) బారీదోబ్‌             a) జీలం - చీనాబ్‌
ii) రచన దోబ్‌         b) బియాస్‌ - సట్లెజ్‌ 
iii) బిస్టా దోబ్‌          c) చినాబ్‌ - రావి 
iv) చాజ్‌ దోబ్‌         d) రావి - బియాస్‌
1) i-a, ii-b, ii-c, iv-d     2) i-d, ii-c, iii-b, iv-a
3) i-d, ii-c, iii-a, iv-b    4) i-a, ii-b, iii-d, iv-c


10. చిల్కా సరస్సు ఏ తీరంలో విస్తరించి ఉంది?
1) ఉత్కళ తీరం         2) వంగ తీరం      3) సర్కార్‌ తీరం       4) కొంకణ్‌ తీరం


11. భారత్‌ - చైనా మధ్య ఇండో - సైనో యుద్ధం ఎప్పుడు జరిగింది?
1) 1962 అక్టోబరు - నవంబరు       2) 1962 జూన్‌ - జులై
3) 1965 ఆగస్టు - సెప్టెంబరు         4) 1965 ఆగస్టు - నవంబరు


12. భారతదేశపు తూర్పు సరిహద్దు ఏ రాష్ట్రంలో ఉంది?
1) అరుణాచల్‌ ప్రదేశ్‌     2) మిజోరాం       3) నాగాలాండ్‌      4) మణిపూర్‌


13. ద్వీపకల్ప భారత్‌కు నైరుతి దిశలో అత్యంత ఎత్తయిన శిఖరం ఏది?
1) దొడబెట్ట     2) అనైముడి      3) సాలహర్‌       4) కల్సుబై


14. నదులకు జన్మస్థానమైన ‘అమర కంటక్‌’ ఏ ప్రాంతంలో ఉంది?
1) వింద్యా పర్వతాలు      2) సాత్పుర పర్వతాలు     
3) మైకాల పీఠభూమి      4) ఛోటానాగపూర్‌


15. మన దేశంలో అతిపెద్ద హిమానీనదం?
1) న్యూబ్రా           2) సియాచిన్‌        3) కార్గిల్‌      4) ద్రాస్‌


16. కింది అంశాల్లో సరైనవి. 
ఎ) భారతదేశ భూ ఉపరితల అత్యంత ఎత్తయిన ప్రాంతం కాంచనజంగా.
బి) భారతదేశ భూ ఉపరితల అత్యంత పల్లపు ప్రాంతం కుట్టనాడు.
1) ఎ సరైంది            2) బి సరైంది
3) ఎ, బి సరైనవి       4) ఎ, బి రెండూ సరైనవి కావు


17. సాత్పురా పర్వతాలు ఏ ప్రాంతాల మధ్య విస్తరించి ఉన్నాయి?
1) మహారాష్ట్ర రాజపిప్పల్‌ నుంచి మధ్యప్రదేశ్‌ రేవా
2) మహారాష్ట్ర అజంతా నుంచి మధ్యప్రదేశ్‌ జబల్‌పూర్‌
3) గుజరాత్‌ కదియవార్‌ నుంచి చత్తీస్‌గఢ్‌ మైకాల పీఠభూమి
4) ఏదీకాదు


18. ధర్మశాల శీతల ప్రాంతం ఏ రాష్ట్రంలో ఉంది?
1) హిమాచల్‌ ప్రదేశ్‌        2) ఉత్తరాఖండ్‌      3) లఢఖ్‌       4) జమ్ము కశ్మీర్‌ 


19. కిందివాటిలో సరైంది.
ఎ) రాజమహల్‌ కొండలు ఝార్ఖండ్‌లో ఉన్నాయి.
బి) లూషాయ్‌ కొండలు మిజోరాంలో ఉన్నాయి.
సి) యార్కాడ్‌ శీతల ప్రాంతం తమిళనాడులో ఉంది.
డి) మిష్మికొండలు అరుణాచల్‌ ప్రదేశ్‌లో ఉన్నాయి.
1) ఎ మాత్రమే     2) బి మాత్రమే     3) ఎ, బి, సి మాత్రమే        4) పైవన్నీ


20. ప్రత్యేకమైన సింహపు తోక గల కోతులకు ఏ ప్రాంతం ప్రసిద్ధి?
1) పశ్చిమ కనుమలు         2) తూర్పు కనుమలు      
3) హిమాలయాలు           4) గంగా పరివాహకం 


21. కింది భూస్వరూపాలను పశ్చిమం నుంచి తూర్పునకు అవరోహణ క్రమంలో అమర్చండి.
1) బాబర్, టెరాయి, భంగర్, ఖాదర్‌       2) ఖాదర్, భంగర్, బాబర్, టెరాయి  
3) భంగర్, ఖాదర్, టెరాయి, బాబర్‌      4) టెరాయి, బాబర్, ఖాదర్, భంగర్‌


22. ప్రపంచంలోనే అతిపెద్ద డెల్టా సుందర్‌బన్‌ ఏ నదుల మధ్య ఏర్పడింది?
1) గంగా - సింధూ          2) గంగా - బ్రహ్మపుత్ర  
3) వింద్యా - సాత్పురా    4) మిసిసిపి - ముస్సోరి


23.     సముద్ర తీర ప్రాంతపు వరదలకు గురై పలక చలనాల వల్ల ఏర్పడిన శిలలు?
1) రాజమండ్రి శిలలు         2) ఆరావళి శిలలు
3) చార్నోఖైట్‌ శిలలు          4) ఖోండలైట్‌ శిలలు


24. కింది అంశాలను జతపరచండి.
i) ప్రాచీన ముడుత పర్వతాలు       a) శాడీల్‌ శిఖరం 
ii) అవశిష్ట పర్వతాలు               b) బ్లూ మౌంటేన్‌
iii) నవీన ముడుత పర్వతాలు       c) గుర్‌ శిఖర్‌
iv) అగ్ని పర్వతాలు                  d) నంగ పర్బత్‌
1) i-a, ii-b, iii-c, iv-d        2) i-c, ii-b, iii-d, iv-a
3) i-a, ii-c, iii-b, iv-d        4) i-c, ii-d, iii-a, iv-b


25. దక్కన్‌ పీఠభూమి, మాల్వా పీఠభూమిని విభజిస్తున్న నది?
1) నర్మదా నది         2) సోన్‌ నది     3) దామోదర్‌ నది          4) చంబల్‌ నది


26. ‘భూ అభినతిలోయ’ ద్వారా ఏర్పడిన మైదానం?
1) సికియాంగ్‌ మైదానం         2) మెకాంగ్‌ మైదానం
3) గంగా - సింధూ మైదానం   4) తూర్పుతీర మైదానం


27. కింది అంశాల్లో సరైనవి.
ఎ) పురాతన కాలంలో ఏర్పడిన ప్రాచీన ఒండలి మైదానాలను భంగర్‌ భూములు అంటారు.
బి) ఇటీవలి కాలంలో ఏర్పడిన లేత గోధుమరంగు నూతన ఒండలి మైదానాలను ఖాదర్‌ భూములు అంటారు.
1) ఎ సరైంది           2) బి సరైంది 
3) ఎ, బి సరైనవి      4) ఎ, బి సరికావు


సమాధానాలు: 1-1; 2-3; 3-2; 4-2; 5-1; 6-1; 7-1; 8-1; 9-2; 10-1; 11-1; 12-1; 13-2; 14-3; 15-4; 16-3; 17-1; 18-1; 19-4; 21-1; 22-1; 23-2; 24-1; 25-2; 26-1; 27-3; 28-3.

Posted Date : 08-03-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌