• facebook
  • whatsapp
  • telegram

నిష్పత్తి, అనుపాతం

ఒకే రకమైన రెండు రాశుల్లో మొదటిది, రెండోదాంతో ఎన్నిరెట్లు ఉందో పోల్చి చెప్పే గణిత ప్రక్రియను 'నిష్పత్తి' అంటాం.

¤a, b లు ఒకే రకమైన రెండు రాశులు అయితే వాటి నిష్పత్తిని a : b అని రాస్తాం.  అని భిన్న రూపంలో చూపిస్తాం.

a : b నిష్పత్తిలో aను పూర్వపదమని, bని పరపదమని అంటారు.

నిష్పత్తులు - రకాలు

వర్గ నిష్పత్తి: a : b యొక్క వర్గ నిష్పత్తి a2 : b2

వర్గమూల నిష్పత్తి: a : b యొక్క వర్గమూల నిష్పత్తి  

ఘన నిష్పత్తి: a : b యొక్క ఘన నిష్పత్తి a3 : b3

ఘనమూల నిష్పత్తి: a : b యొక్క ఘనమూల నిష్పత్తి 

అనుపాతం: రెండు నిష్పత్తుల సమానత్వాన్ని అనుపాతం అంటాం.

       a : b = c : d అయితే, a : b : : c : d అని రాస్తాం.

       a : b : : c : d  ad = bc (అంత్యాల లబ్ధం = మధ్యముల లబ్ధం)

అనుపాతం - రకాలు

మధ్యమానుపాతం (Mean proportional): a, b ల యొక్క మధ్యమానుపాతం అవుతుంది.

తృతీయ లేదా మూడో అనుపాతం (Third Proportional): a : b = b : c అయితే cని a, bల తృతీయ అనుపాతం అంటారు. అంటే  

చతుర్థానుపాతం (Fourth Proportional): a : b = c : d అయితే, d ని చతుర్థానుపాతం అంటారు. అంటే   

విలోమ నిష్పత్తి: a : b యొక్క విలోమ నిష్పత్తి  

బహుళ నిష్పత్తి: ఏవైనా రెండు నిష్పత్తుల్లో పూర్వపదాల లబ్ధానికి, పరపదాల లబ్ధానికి ఉన్న నిష్పత్తిని ఆ రెండు నిష్పత్తుల బహుళ నిష్పత్తి అంటారు.

    a : b, c : dలు ఏవైనా రెండు నిష్పత్తులు అయితే వాటి బహుళ నిష్పత్తి ac : bd అవుతుంది.

మాదిరి సమస్యలు

1. రెండు సంఖ్యలు 17 : 13 నిష్పత్తిలో ఉన్నాయి. ఆ సంఖ్యల మొత్తం 120. అయితే ఆ సంఖ్యలు వరుసగా... 

1) 66, 54         2) 78, 42            3) 68, 52         4) 76, 44

సాధన: రెండు సంఖ్యలు a : b నిష్పత్తిలో ఉన్నాయి. ఆ సంఖ్యల మొత్తం x అయితే ఆ సంఖ్యలు వరుసగా 

సమాధానం: 3

గమనిక: మూడు సంఖ్యలు a : b : c నిష్పత్తిలో ఉండి, వాటి మొత్తం x అయితే ఆ సంఖ్యలు వరుసగా

2. రెండు సంఖ్యలు 1 : 7 నిష్పత్తిలో ఉన్నాయి. ఆ సంఖ్యలకు 5 కలిపితే వచ్చే సంఖ్యల నిష్పత్తి 4 : 13. అయితే ఆ సంఖ్యలు వరుసగా...

1) 3, 21         2) 4, 28             3) 5, 35         4) 6, 42

సాధన: రెండు సంఖ్యల నిష్పత్తి  a : b. ఆ సంఖ్యలకు x అనే సంఖ్యను కలిపితే వచ్చే సంఖ్యల నిష్పత్తి  c : d అయితే ఆ రెండు సంఖ్యలు వరుసగా


సమాధానం: 1


3. రెండు సంఖ్యలు 3 : 5 నిష్పత్తిలో ఉన్నాయి. ప్రతి సంఖ్య నుంచి 9ని తీసివేస్తే వచ్చే సంఖ్యల నిష్పత్తి 11 : 19. అయితే ఆ సంఖ్యలు వరుసగా...

1) 96, 160         2) 135, 225            3) 72, 120         4) 108, 180

సాధన: రెండు సంఖ్యలు a : b నిష్పత్తిలో ఉన్నాయి. ఆ సంఖ్యల నుంచి xని తీసివేస్తే వచ్చే సంఖ్యల నిష్పత్తి c : d అయితే ఆ సంఖ్యలు వరుసగా

రెండు సంఖ్యల నిష్పత్తి = a : b = 3 : 5

తీసివేసిన సంఖ్య = x = 9

ఫలిత సంఖ్యల నిష్పత్తి  = c : d = 11 : 19 

ఆ సంఖ్యలు వరుసగా = 108, 180

లేదా

రెండు సంఖ్యల నిష్పత్తి = 3 : 5
ఆ సంఖ్యలు  = 3x, 5x  అనుకోండి.

ఆ సంఖ్యలు,  3x = 3 × 36 = 108
5x = 5 × 36 = 180 

సమాధానం: 4


4. రోహిత్, గణేష్, క్రిష్‌ అనే ముగ్గురు ఉద్యోగుల జీతాల మొత్తం రూ.72,000. వారు తమ జీతాల్లో వరుసగా 80%, 85%, 75% ఖర్చు చేస్తారు. వారు చేసిన పొదుపు సొమ్ముల నిష్పత్తి 8 : 9 : 20. అయితే రోహిత్‌ జీతం ఎంత?
1) రూ.16000         2) రూ.18000            3) రూ.19000         4) రూ.21000
సాధన: రోహిత్, గణేష్, క్రిష్‌లు చేసే పొదుపు సొమ్ము నిష్పత్తి = 8 : 9 : 20

సమాధానం: 1


5. ఆర్మీ ఉద్యోగాల నియామక ప్రక్రియలో ఎంపికైన, ఎంపిక కాని అభ్యర్థుల నిష్పత్తి 5 : 1. ఉద్యోగాల కోసం పోటీపడిన అభ్యర్థుల సంఖ్య 100 తగ్గి, ఎంపికైన అభ్యర్థులు 20 మంది తగ్గితే ఎంపికైన, ఎంపిక కాని అభ్యర్థుల నిష్పత్తి 6 : 1 అవుతుంది. అయితే ఉద్యోగాల కోసం పోటీపడిన అభ్యర్థులు ఎంతమంది? 
1) 2560         2) 2760           3) 2780         4) 2860
సాధన: ఆర్మీ ఉద్యోగాల నియామక ప్రక్రియలో ఎంపికైన, ఎంపిక కాని అభ్యర్థుల నిష్పత్తి = 5 : 1
ఎంపికైనవారు = 5x అనుకోండి.
ఎంపికకాని వారు = x అనుకోండి.
పోటీపడిన మొత్తం అభ్యర్థులు = 5x + x = 6x
దత్తాంశం ప్రకారం:

ఎంపికైనవారు = 5x − 20 
ఎంపిక కానివారు = 6x - 100 - (5x - 20)
= 6x - 100 - 5x + 20  
= x - 80

ఇప్పుడు, (5x - 20) : (x - 80) = 6 : 1
⇒ (5x − 20) 1 = (x - 80) 6
⇒ 5x − 20 = 6x − 480
⇒ 480 − 20 = 6x − 5x
⇒ x = 460 

పోటీపడిన అభ్యర్థుల మొత్తం = 6x = 6 × 460 = 2760 మంది
సమాధానం: 2



సమాధానం: 3


7. కింది పటంలో AB రేఖాఖండం పొడవు 28.6 సెం.మీ. X అనే బిందువు రేఖాఖండాన్ని 9 : 13 నిష్పత్తిలో విభజిస్తుంది. అయితే AX, XB  రేఖాఖండాల పొడవులు వరుసగా....... (సెం.మీ.లలో)


8. రెండు సంఖ్యల నిష్పత్తి 17 : 45. చిన్న సంఖ్యలో 1/3వ భాగం విలువ, పెద్ద సంఖ్యలో 1/5వ భాగం నుంచి 15 తీసివేస్తే వచ్చిన విలువకు సమానం. అయితే ఆ సంఖ్యలలో చిన్న సంఖ్య విలువ...

మ‌రికొన్ని

1. x : y =- 2 : 3; 2 : x = 4 : 8 అయితే y విలువ ఎంత? 

1) 6      2) 8      3) 4        4) 12

సాధన: 2 : x = 4 : 8

             

సమాధానం: 1

సమాధానం: 3

3. A, B ఆదాయాల నిష్పత్తి 5 : 3. A, B, C ల ఖర్చుల నిష్పత్తి 8 : 5 : 2. C రూ.20,000 ఖర్చు చేస్తాడు. B రూ.7000 పొదుపు చేస్తాడు. అయితే A పొదుపు చేసే సొమ్ము ఎంత?

1) రూ.15,000     2) రూ.40,000     3) రూ.5000     4) రూ.12,500

సాధన: A, B ఆదాయాల నిష్పత్తి = 5 : 3

            A ఆదాయం = 5x , B ఆదాయం = 3x

    A, B, C ల ఖర్చుల నిష్పత్తి = 8 : 5 : 2

    A ఖర్చు = 8y, B ఖర్చు = 5y, C ఖర్చు = 2y

    C ఖర్చు = రూ.20,000

    2y = 20000

   y = రూ.10,000

 B పొదుపు = రూ.7000

  3x - 5y = రూ.7000

3x - 5y = 50000 + 7000

3x = 50000 + 7000

=> 3x = 57000

 

x = రూ.19,000

A పొదుపు = 5x - 8y

= 5 x 19,000 - 8 x 10000

= 95000 - 80000 

= రూ.15,000

సమాధానం: 1

సమాధానం: 3

5. ఒక భిన్నంలో లవం, హారాల నిష్పత్తి 2 : 3. లవం నుంచి 6 తీసివేస్తే వచ్చే భిన్నం అసలు భిన్నం విలువలో 2/3 వ భాగం ఉంది. అయితే అసలు భిన్నంలో లవం ఎంత?

1) 12         2) 18          28         4) 36

సాధన: ఒక భిన్నంలో లవం, హారాల నిష్పత్తి = 2 : 3

 

సమాధానం: 2

7.  12, 18, x లు అనుపాతంలో ఉంటే x విలువ ఎంత?

1) 24         2) 36         3) 27         4) 45

సాధన: 12, 18, x లు అనుపాతంలో ఉంటే 12 : 18 = 18 : x

 12 x x = 18 x 18

x = 27

సమాధానం: 3

సమాధానం: 4

సమాధానం: 2

10. 6, 7, 15, 17 లకు ఏ సంఖ్యను కూడితే వచ్చే సంఖ్యలు అనుపాతంలో ఉంటాయి?

1) 4          2) 3          3) 2          4) 1

సాధన: కూడాల్సిన సంఖ్య = x అనుకోండి.

6 + x, 7 + x, 15 + x, 17 + x లు అనుపాతంలో ఉంటాయి.

(6 + x) : (7 + x)  = (15 + x) : (17 + x)

(6 + x) : (17 + x) = (7 + x) : (15 + x) 

= 102 + 6x + 17x + x2

= 105 + 7x + 15x + x2

= 102 + 23x = 105 + 22x

= 23x - 22x = 105 - 102 

x = 3

సమాధానం: 2

Posted Date : 07-12-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌