బారువడ్డీలో అసలును స్థిరంగా ఉంచి, అసలుపై మాత్రమే వడ్డీని లెక్కిస్తారు.
ఇక్కడ, P = అసలు, T = కాలం (సం.), R = ఏడాదికి వడ్డీ రేటు
* బారువడ్డీ ప్రకారం,
మొత్తం A = అసలు (P) + బారువడ్డీ
= P + I
మాదిరి ప్రశ్నలు
1. హరి రూ.4000ను సూర్యకి 15% వడ్డీకి ఇచ్చాడు. అయిదేళ్ల కాలానికి అయిన బారువడ్డీ ఎంత?
1) రూ.5000 2) రూ.3000
3) రూ.4000 4) రూ.2500
సాధన:
సమాధానం: 2
2. రూ.4000పై 12 శాతం వడ్డీ చొప్పున రెండున్నరేళ్ల కాలంలో అయిన మొత్తం ఎంత?
1) రూ.1200 2) రూ.5200
3) రూ.4200 4) రూ.4500
సాధన:
సమాధానం: 2
3. రాము కొంత సొమ్ముపై రెండేళ్ల కాలానికి 8% వడ్డీ చొప్పున రూ.6400 చెల్లించాడు. రాము అప్పుగా తీసుకున్న మొత్తం ఎంత?
1) రూ.40,000 2) రూ.45,000
3) రూ.50,000 4) రూ.52,000
సాధన:
సమాధానం: 1
4. రాణి రూ.4000ను కొంత వడ్డీ రేటుకు అప్పుగా తీసుకుంది. అయిదేళ్లలో ఆ మొత్తం రూ.6000 అయ్యింది. అయితే రాణి ఆ మొత్తాన్ని ఎంత వడ్డీ రేటుకు అప్పుగా తీసుకుంది?
1) 7% 2) 8% 3) 9% 4) 10%
సాధన: బారువడ్డీ = మొత్తం - అసలు
సమాధానం: 4
5. శివ రూ.1200ని 6% వడ్డీరేటు చొప్పున రమ్యకి ఇచ్చాడు. అది ఎంతకాలంలో రూ.1344 అవుతుంది?
1) మూడేళ్లు 2) నాలుగేళ్లు
3) రెండేళ్లు 4) రెండున్నరేళ్లు
సాధన: వడ్డీ (I) = మొత్తం అసలు
= 1344 - 1200
= 144
సమాధానం: 3
6. రాజు కొంత సొమ్మును బారువడ్డీకి ఇస్తే, మూడేళ్లలో రూ.5,500 అయ్యింది. అదే సొమ్ము నాలుగేళ్లలో రూ.6,500 అయితే, అప్పుగా ఇచ్చిన మొత్తం ఎంత?
1) రూ.1500 2) రూ.3000
3) రూ.3500 4) రూ.2500
సాధన: మూడేళ్లకైన మొత్తం = రూ.5500
నాలుగేళ్లకైన మొత్తం = రూ.6500
బారువడ్డీతో లెక్కిస్తే, అసలు స్థిరంగా ఉంటుంది.
ఏడాదికి అయ్యే వడ్డీ
= 1000 (6500 - 5500)
మూడేళ్లకయ్యే వడ్డీ = 3000
అసలు = మొత్తం - వడ్డీ
= 5500 - 3000
= రూ.2500
సమాధానం: 4
7. హారిక కొంత సొమ్మును కొంత వడ్డీరేటుతో సంవత్సర కాలానికి అప్పుగా తీసుకుంది. తర్వాత వడ్డీ రేటును 2% పెంచడంతో, రూ.120 వడ్డీ అధికంగా చెల్లించింది. అయితే తీసుకున్న అసలు ఎంత?
1) రూ.3400 2) రూ.6000
3) రూ.4500 4) రూ.7000
సాధన:
సమాధానం: 2
8. హరిత కొంత సొమ్మును కొంత వడ్డీరేటుతో రెండేళ్ల కాలానికి అప్పుగా తీసుకుంది. తర్వాత 3% వడ్డీరేటు పెంచడంతో రూ.210 వడ్డీని అధికంగా చెల్లించింది. అయితే తీసుకున్న అసలు ఎంత?
1) రూ.3400 2) రూ.2500
3) రూ.3500 4) రూ.3800
సాధన:
సమాధానం: 3
9. ఒక వడ్డీ వ్యాపారి శ్రావ్యకు రూ.2000ను రెండేళ్లకు, రమ్యకు రూ.3000ను ఏడాది కాలానికి అప్పుగా ఇచ్చాడు. ఇద్దరి నుంచి మొత్తం రూ.420 వడ్డీని పొందాడు. అయితే వడ్డీ రేటు ఎంత?
1) 5% 2) 6% 3) 7% 4) 8%
సాధన:
సమాధానం: 2
10. ఒక వ్యాపారి సరితకు రూ.4000ని 12% వడ్డీరేటుకు, హరితకు కొంత సొమ్మును 6% వడ్డీరేటుకు అప్పుగా ఇచ్చాడు. ఏడాది తర్వాత వారి నుంచి సమాన వడ్డీలు పొందాడు, అయితే హరితకు ఇచ్చిన సొమ్ము ఎంత?
1) రూ.6000 2) రూ.12,000
3) రూ.10,000 4) రూ.8000
సాధన:
సమాధానం: 4
గమనిక: కొంత సొమ్ము బారువడ్డీ ప్రకారం రెట్టింపు కావడానికి T సంవత్సరాలు అయితే n రెట్లు కావడానికి (n - 1)T సంవత్సరాల సమయం పడుతుంది.
* కొంత సొమ్ము బారువడ్డీ ప్రకారం ఆరేళ్లలో రెట్టింపు అవుతుంది. అదే సొమ్ము 8 రెట్లు కావడానికి పట్టే సమయం ఎంత?
1) 35 సం. 2) 42 సం.
3) 48 సం. 4) 56 సం.
సాధన: 8 రెట్లు కావడానికి పట్టే సమయం
సమాధానం: 2
* కొంత సొమ్ము అయిదేళ్లలో రెట్టింపు అవుతుంది. అదే మొత్తం అయిదు రెట్లు కావడానికి ఎంత సమయం పడుతుంది?
1) 20 సం. 2) 16 సం.
3) 25 సం. 4) 30 సం.
సాధన: 5 రెట్లు కావడానికి పట్టే సమయం
సమాధానం: 1
* సాధారణ వడ్డీ అసలులో 25 శాతానికి సమానం, వడ్డీరేటు కాలానికి సమానం అయితే వడ్డీరేటు ఎంత?
1) 7% 2) 6% 3) 5% 4) 8%
సాధన:
సమాధానం: 3
గమనిక: కొంత సొమ్మును మొదట T1 కాలానికి R1 వడ్డీరేటుతో, తర్వాత T2 కాలానికి R2 వడ్డీరేటుతో, T3 కాలానికి R3 వడ్డీరేటుతో అప్పుగా ఇస్తే, మొత్తం వడ్డీ I అయితే,
* ఒక వ్యక్తి కొంత సొమ్మును అప్పుగా ఇచ్చి, మొదటి రెండేళ్లకు 3% వడ్డీరేటు చొప్పున, తర్వాతి మూడేళ్లకు 8% వడ్డీరేటు చొప్పున అపై సంవత్సరానికి 10% వడ్డీరేటు చొప్పున వసూలు చేశాడు. అతడికి ఆరేళ్ల కాలానికి రూ.1520 వడ్డీగా వచ్చింది. అయితే అప్పుగా ఇచ్చిన సొమ్ము ఎంత?
1) రూ.3800 2) రూ.5000
3) రూ.3600 4) రూ.4200
సాధన:
సమాధానం: 1
గమనిక: బారు వడ్డీ ప్రకారం,
* కొంత సొమ్ము రెట్టింపు అయితే
* కొంత సొమ్ము 3 రెట్లు అయితే
* కొంత సొమ్ము 4 రెట్లు అయితే
* కొంత సొమ్ము బారువడ్డీ ప్రకారం అయిదేళ్లలో రెట్టింపు అయ్యింది. అయితే వడ్డీ రేటు ఎంత?
1) 10% 2) 15% 3) 20% 4) 30%
సాధన:
సమాధానం: 3
* కొంత సొమ్ము బారువడ్డీ ప్రకారం, 20 సంవత్సరాల్లో 4 రెట్లు అయ్యింది. అయితే వడ్డీరేటు ఎంత?
1) 10% 2) 15% 3) 20% 4) 30%
సాధన:
సమాధానం: 2