• facebook
  • whatsapp
  • telegram

సామాజిక వికాస ప‌థ‌కాలు   

దంత్‌వాలా కమిటీ (1978)

మొరార్జీ దేశాయ్‌ నాయకత్వంలోని జనతా పార్టీ ప్రభుత్వం 1978లో బ్లాకు ్బతీః్న‘ఁ్శ స్థాయి ప్రణాళికీకరణపై అధ్యయనం కోసం దంత్‌వాలా కమిటీని ఏర్పాటు చేసింది.

సిఫారసులు

* గ్రామ పంచాయతీ సర్పంచ్‌లను ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నుకోవాలి.

* బ్లాకును ఒక యూనిట్‌గా తీసుకుని ప్రణాళికా రచన చేయాలి.

* బ్లాకు వ్యవస్థ (మాధ్యమిక వ్యవస్థ)కు ప్రాధాన్యం కల్పించాలి.

* జిల్లా ప్రణాళికా రూపకల్పనలో కలెక్టర్‌ కీలక పాత్ర పోషించాలి.

సీహెచ్‌. హనుమంతరావు కమిటీ (1984)

1984లో ఇందిరాగాంధీ ప్రభుత్వం నియమించిన సీహెచ్‌. హనుమంతరావు కమిటీ కొన్ని సిఫారసులు చేసింది. అవి: 

* జిల్లా ప్రణాళికా బోర్డులను ఏర్పాటు చేయాలి.

* జిల్లా పరిషత్‌ అభివృద్ధిలో కలెక్టర్‌ కీలక పాత్ర పోషించాలి.

* రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధి జిల్లా అభివృద్ధిలో బాధ్యత వహించాలి. 

జీవీకే రావు కమిటీ (1985)

1985లో రాజీవ్‌గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు ప్రణాళికా సంఘం ‘గ్రామీణాభివృద్ధి, పేదరిక నిర్మూలన, పరిపాలనా ఏర్పాట్లు’ అనే అంశాన్ని అధ్యయనం చేయడానికి జీవీకే. రావు కమిటీని ఏర్పాటు చేసింది.

దీని ప్రధాన సిఫారసులు

* ‘బ్లాకు’ వ్యవస్థను రద్దుచేయాలి.

* జిల్లా పరిషత్‌కు ‘కలెక్టర్‌’ ఛైర్మన్‌గా వ్యవహరించాలి.

* నైష్పత్తిక ప్రాతినిధ్యం ఉన్న ఉప కమిటీలను జిల్లా స్థాయిలో ఏర్పాటు చేయాలి.

* జిల్లా స్థాయి యూనిట్‌లకు ప్రణాళిక విధులను బదిలీ చేయాలి.

* జిల్లా స్థాయి అభివృద్ధి కార్యక్రమాలన్నింటినీ కలెక్టర్‌ ద్వారానే నిర్వహించాలి.

* నిర్ణీత పదవీ కాలం ప్రకారం పంచాయతీరాజ్‌ సంస్థలకు ఎన్నికలను నిర్వహించాలి.

* జిల్లా పరిషత్‌లను అన్ని విధాలుగా పటిష్టపరచాలి. 

* జిల్లా అభివృద్ధి అధికారి(district development officer -DDO) అనే పదవిని ఏర్పాటు చేయాలి.

* ‘‘మన దేశంలో ఉద్యోగస్వామ్యం కారణంగా పరిపాలనా స్ఫూర్తి దెబ్బతింటుందని, ఇది పంచాయతీరాజ్‌ వ్యవస్థని బలహీనపరచిందని, దీంతో ప్రజాస్వామ్యం వేళ్లులేని వ్యవస్థగా మారిందని’’ ఈ కమిటీ విమర్శించింది.

ఎల్‌.ఎం.సింఘ్వీ కమిటీ (1986)

* 1986లో పంచాయతీరాజ్‌ వ్యవస్థపై అధ్యయనం కోసం ఎల్‌.ఎం. సింఘ్వీ కమిటీని రాజీవ్‌గాంధీ ప్రభుత్వం నియమించింది.

దీని సిఫారసులు

* స్థానిక సంస్థలకు రాజ్యాంగ భద్రతను కల్పించాలి.

* గ్రామీణ న్యాయ పంచాయతీలను ఏర్పాటు చేయాలి.

* గ్రామీణ పరిపాలనలో ‘గ్రామసభ’లను ఏర్పాటుచేసి, వాటి ప్రాధాన్యాన్ని పెంచాలి.

* రాష్ట్ర ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేయాలి.

* స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కోసం రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఏర్పాటు చేయాలి.

* స్థానిక సంస్థలకు సకాలంలో, క్రమం తప్పకుండా ఎన్నికలను నిర్వహించాలి.

* స్థానిక సంస్థలకు రాజ్యాంగబద్ధంగా అధికారాలు, విధులను బదిలీ చేయాలి.

* స్థానిక సంస్థలకు తగిన ఆర్థిక వనరులను సమకూర్చడం ద్వారా వాటిని పటిష్టపరచాలి.

* స్థానిక సంస్థల ఎన్నికల వివాదాలను పరిష్కరించేందుకు ‘ప్రత్యేక న్యాయ ట్రైబ్యునళ్ల’ను ఏర్పాటు చేయాలి.(Special judicial tribunals).

Posted Date : 09-11-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌