• facebook
  • whatsapp
  • telegram

సామాజిక వికాస ప‌థ‌కాలు   

నమూనా ప్రశ్నలు
 

1.  బ్లాకు స్థాయి ప్రణాళికీకరణపై అధ్యయనం కోసం 1978లో ఏర్పాటైన కమిటీని గుర్తించండి.
a) సీహెచ్‌. హనుమంతరావు కమిటీ     b) దంత్‌వాలా కమిటీ
c) రంజిత్‌సింగ్‌ సర్కారియా కమిటీ     d) ఎల్‌.ఎం. సింఘ్వీ కమిటీ

2. జిల్లా ప్రణాళికా బోర్డులను ఏర్పాటు చేయాలని సిఫారసు చేసిన సీహెచ్‌. హనుమంతరావు కమిటీని ఏ ప్రధాని కాలంలో నియమించారు?
a) ఇందిరా గాంధీ               b) మొరార్జీ దేశాయ్‌ 
c) లాల్‌బహదూర్‌ శాస్త్రి         d) రాజీవ్‌గాంధీ

3. భారత్‌లో ఉద్యోగస్వామ్యం కారణంగా ప్రజాస్వామ్యం ‘‘వేళ్ల్లూనుకునే వ్యవస్థగా కాకుండా, వేళ్లులేని వ్యవస్థగా మారిందని’’ ఏ కమిటీ విమర్శించింది?
a) ఎల్‌.ఎం.సింఘ్వీ కమిటీ         b) దంత్‌వాలా కమిటీ
c) జీవీకే రావు కమిటీ              d)  సీహెచ్‌. హనుమంతరావు కమిటీ

4. జీవీకే.రావు కమిటీ సిఫారసుల్లో లేని దాన్ని గుర్తించండి.
a) బ్లాకు వ్యవస్థను రద్దు చేయాలి.
b) జిల్లా స్థాయి యూనిట్‌లకు ప్రణాళికా విధులను బదిలీ చేయాలి.
c) జిల్లా పరిషత్‌కు కలెక్టర్‌ ఛైర్మన్‌గా వ్యవహరించాలి.
d) బ్లాకు అభివృద్ధి అధికారి అనే పదవిని ఏర్పాటు చేయాలి.

5. 1985లో ఏ ప్రధానమంత్రి కాలంలో ప్రణాళిక సంఘం ‘‘గ్రామీణాభివృద్ధి, పేదరిక నిర్మూలన, పరిపాలనా ఏర్పాట్లు’ అనే అంశాన్ని అధ్యయనం చేయడానికి జీవీకే. రావు కమిటీని ఏర్పాటుచేసింది? 
a) మొరార్జీ దేశాయ్‌         b) రాజీవ్‌గాంధీ    
c) ఇందిరాగాంధీ              d) వీపీ. సింగ్‌

6.  జిల్లా అభివృద్ధి అధికారి అనే పదవిని ఏర్పాటు చేయాలని సిఫారసు చేసిన కమిటీ ఏది?
 a)  బల్వంతరాయ్‌ మెహతా కమిటీ     b) దంత్‌వాలా కమిటీ
 c) సర్కారియా కమిటీ          d) జీవీకే రావు కమిటీ

7. 1986లో రాజీవ్‌గాంధీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఎల్‌.ఎం.సింఘ్వీ కమిటీ సిఫారసుల్లో లేనిదాన్ని గుర్తించండి.
a)  స్థానిక సంస్థలకు రాజ్యాంగ భద్రతను కల్పించాలి.
b) గ్రామసభల ప్రాధాన్యాన్ని పెంచాలి.
c) రాష్ట్ర ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేయాలి.
d) రాష్ట్ర CAG వ్యవస్థను ఏర్పాటు చేయాలి.

8. స్థానిక సంస్థల ఎన్నికల వివాదాల పరిష్కారానికి ‘ప్రత్యేక న్యాయ ట్రైబ్యునళ్లను’ ఏర్పాటు చేయాలని సిఫారసు చేసిన కమిటీ ఏది?
a) సర్కారియా కమిటీ         b) ఎల్‌.ఎం.సింఘ్వీ కమిటీ
 b) అశోక్‌మెహతా కమిటీ      d) దంత్‌వాలా కమిటీ

9. NESS  పథకాన్ని సుశిక్షితులైన తోటమాలి నిర్వహించే చక్కని ఉద్యానవనం లాంటిదని ఎవరు అభివర్ణించారు?
a) జవహర్‌లాల్‌ నెహ్రూ         b) ఎస్‌.కె. డే 
c) వి.టి. కృష్ణమాచారి        d) సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌

10.  CDP, NESS లపై సమీక్షించేందుకు 1957లో ఏర్పాటైన కమిటీ?
a) బల్వంతరాయ్‌ మెహతా కమిటీ     b) అశోక్‌మెహతా కమిటీ
c) జీవీకే రావు కమిటీ         d) ఎల్‌.ఎం. సింఘ్వీ కమిటీ

11. మన దేశంలో మూడంచెల పంచాయతీరాజ్‌ విధానాన్ని సిఫారసు చేసిన కమిటీ?
a) అశోక్‌మెహతా కమిటీ         b) సీహెచ్‌. హనుమంతరావు కమిటీ
c) బల్వంతరాయ్‌ మెహతా కమిటీ     d) పి.కె. తుంగన్‌ కమిటీ

12. మూడంచెల పంచాయతీరాజ్‌ విధానాన్ని మొదటిసారిగా రాజస్థాన్‌లో ఎప్పుడు ప్రారంభించారు?
a) 1958, అక్టోబరు 2          b) 1959, అక్టోబరు 2
c) 1958, నవంబరు 1         d) 1959, నవంబరు 14

13. ఆంధ్రప్రదేశ్‌లో మూడంచెల పంచాయతీరాజ్‌ విధానాన్ని 1959, నవంబరు 1న ఏ ముఖ్యమంత్రి కాలంలో ప్రారంభించారు?
a) నీలం సంజీవరెడ్డి          b) దామోదరం సంజీవయ్య
 c) టంగుటూరి ప్రకాశం         d)  భవనం వెంకట్రామ్‌

14. 1977 సెంబరులో పంచాయతీరాజ్‌ వ్యవస్థపై అధ్యయనం కోసం అశోక్‌మెహతా కమిటీని నియమించిన ప్రధాని ఎవరు?
a) ఇందిరా గాంధీ             b) లాల్‌బహదూర్‌ శాస్త్రి
c) మొరార్జీ దేశాయ్‌            d) చరణ్‌సింగ్‌

15. అశోక్‌మెహతా కమిటీ సిఫారసు చేసిన రెండంచెల పంచాయతీరాజ్‌ విధానంలో అత్యంత కీలకమైన అంచెను గుర్తించండి. 
 a) గ్రామ పంచాయతీ              b) మండల పరిషత్‌  
c) జిల్లా పరిషత్‌                    d)  గ్రామ పంచాయతీ, జిల్లా పరిషత్‌ 

16. అశోక్‌మెహతా కమిటీ గ్రామ పంచాయతీలను రద్దుచేసి వాటి స్థానంలో వేటిని ఏర్పాటు చేయాలని సిఫారసు చేసింది?
 a)  గ్రామ కమిటీలు              b) గ్రామ యూనిట్‌లు
 c)  గ్రామ సభలు                  d) గ్రామ మున్సబ్‌లు

17.  కిందివాటిలో అశోక్‌మెహతా కమిటీ సిఫారసుల్లో లేనిది?
a)  స్థానిక సంస్థల పదవీకాలం నాలుగేళ్లు ఉండాలి.
b) పంచాయతీ రాజ్‌ మంత్రిని ఏర్పాటుచేయాలి.
c) పంచాయతీ ఎన్నికల్లో రాజకీయ పార్టీలు ప్రత్యక్షంగా పోటీ చేయాలి.
 d) పంచాయతీ ఎన్నికల్లో రాజకీయ పార్టీలు ప్రత్యక్షంగా పోటీ చేయకూడదు.

18.  అశోక్‌మెహతా కమిటీ సిఫారసుల్లో కీలకమైన మండల పరిషత్‌ విధానాన్ని అమలు చేసిన మొదటి రాష్ట్రం?
a) కర్ణాటక      b) ఆంధ్రప్రదేశ్‌      c) కేరళ      d) తమిళనాడు

19. ఆంధ్రప్రదేశ్‌లో రెవెన్యూ మండలాలను ఎన్‌.టి. రామారావు ప్రభుత్వం ఎప్పుడు ఏర్పాటు చేసింది?
 a) 1984      b) 1985      c) 1986      d) 1987

20. అశోక్‌మెహతా కమిటీ మొత్తం ఎన్ని సిఫారసులు చేసింది?
a)  122        b) 132        c) 142       d) 152

సమాధానాలు
1-b; 2-a; 3-c; 4-d; 5-b; 6-d; 7-d; 8-b; 9-b; 10-a; 11-c; 12-b 13-a; 14-c; 15-b; 16-a; 17-d; 18-a; 19-b; 20-b.

Posted Date : 24-01-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌