• facebook
  • whatsapp
  • telegram

చతురస్రం, వృత్తం

చతురస్రం: చతురస్ర భుజం 'a' యూనిట్లు అయితే, దాని చుట్టుకొలత = 4a యూ.

 వైశాల్యం = a2 చ.యూ.

కర్ణం = √2a యూ.

వృత్తం: వృత్త వ్యాసార్ధం r యూ. అయితే, దాని పరిధి = 2r2 యూ.

     వైశాల్యం = πr2 చ.యూ.

అర్ధవృత్తం: అర్ధవృత్త వ్యాసార్ధం r యూ. అయితే చుట్టుకొలత =  πr + 2r యూ.

                    (లేదా)

= (π + 2)r యూ.

                  (లేదా)
                  36/7. r యూ.

     వైశాల్యం = πr2/2 చ.యూ.

* రెండు ఏకకేంద్ర వృత్తాల మధ్య ఉన్న వృత్తాకార లేదా కంకణాకార బాట వైశాల్యం 

    =  π(R2 - r2)  చ.యూ.

= π(R + r) (R - r) చ.యూ.

మాదిరి  సమస్యలు

1. ఒక వృత్తంలో ఒక చతురస్రం, అందులో మరో వృత్తం అంతర్లిఖించి ఉన్నాయి. ఆ రెండు వృత్తాల మధ్య ఉన్న వృత్తాకార బాట వైశాల్యం 16π చ.యూ. అయితే ఆ చతురస్ర వైశాల్యం ఎంత? (చ.యూ.లలో)
1) 32     2) 48      3) 64      4) 72
సాధన: చతురస్ర భుజం = a అనుకోండి.
బయటి, లోపలి వృత్త వ్యాసార్ధాలు వరుసగా = R, r అనుకోండి.
దత్తాంశం ప్రకారం,
రెండు వృత్తాల మధ్య ఉన్న వృత్తాకార బాట వైశాల్యం  = 16π  చ.యూ.
⇒ π(R2 − r2) = 16π
⇒ R2 − r2 = 16 (1) 
పటం నుంచి; R2 = r2 + (a/2)2
⇒ (R2 - r2) = a2/4
⇒ a2 = 4(R2 - r2)
⇒ a2 = 4 × 16 = 64
చతురస్ర వైశాల్యం (a2) = 64 చ.యూ.
సమాధానం: 3


2. ఒక చతురస్ర చుట్టుకొలత 44 సెం.మీ., ఒక వృత్త పరిధి 44 సెం.మీ. అయితే, ఆ రెండింటిలో దేని వైశాల్యం ఎక్కువ? ఎంత ఎక్కువ? 
1) చతురస్రం, 33 చ.సెం.మీ.
2) వృత్తం, 66 చ.సెం.మీ.
3) వృత్తం, 33 చ.సెం.మీ. 
4) రెండింటి వైశాల్యాలు సమానం.
సాధన: చతురస్ర భుజం = a, వృత్త వ్యాసార్ధం = r   అనుకోండి.
దత్తాంశం ప్రకారం,
4a = 44 సెం.మీ.; 2πr = 44 సెం.మీ.


4. ఒక వృత్తం, చతురస్ర వైశాల్యాలు సమానం. అయితే, చతురస్ర భుజానికి, వృత్త వ్యాసార్ధానికి మధ్య ఉన్న నిష్పత్తి ఎంత?
1) π : 1           2) 1 : π         3) √π :1        4) 1 : √π 
సాధన: చతురస్ర భుజం = r, వృత్త వాసార్ధం = r అనుకోండి.


అభ్యాస సమస్యలు

1. చతురస్రం ఒక వృత్తంలో అంతర్లిఖించి ఉంది. ఆ చతురస్రంలో మరో వృత్తాన్ని అంతర్లిఖించారు. రెండు వృత్తాల మధ్య ఉన్న వృత్తాకార బాట వైశాల్యం 9π చ.యూ. అయితే ఆ చతురస్ర వైశాల్యం ఎంత? (చ.యూ.లలో)
1) 9               2) 18               3) 36                 4) 72


2. ఒక చతురస్ర చుట్టుకొలత 22 సెం.మీ, ఒక వృత్త పరిధి 22 సెం.మీ. అయితే ఆ రెండింటిలో దేని వైశాల్యం ఎక్కువ? ఎంత ఎక్కువ?
1) చతురస్రం, 8.5 సెం.మీ.          2) వృత్తం, 8.25 సెం.మీ.
3) చతురస్రం, 17 సెం.మీ.          4) వృత్తం, 17 సెం.మీ.


3. ఒక వృత్తంలో చతురస్రం అంతర్లిఖించి ఉంది. ఆ వృత్త వ్యాసం 15√2 సెం.మీ. అయితే ఆ చతురస్ర భుజం పొడవు ఎంత? (సెం.మీ.లలో)
1) 15              2) 30             3) 7.5             4) 12

 

4. ఒక వృత్తంలో చతురస్రం అంతర్లిఖించి ఉంది. ఆ చతురస్రంలో మరో వృత్తం అంతర్లిఖించి ఉంది. అయితే బాహ్యవృత్తం, చతురస్రం, అంతర వృత్త వైశాల్యాల నిష్పత్తి ఎంత?
1) 14 : 7 : 11            2) 11 : 7 : 14           3) 7 : 11 : 14            4) 14 : 11 : 7


సమాధానాలు: 1-3; 2-2; 3-1; 4-4.

Posted Date : 29-12-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌