• facebook
  • whatsapp
  • telegram

సుప‌రిపాల‌న 

1. ‘రాజ్యం అనేది మానవుడికి ఉత్తమ జీవితాన్ని ప్రసాదించడానికి ఏర్పడి, అందుకోసమే కొనసాగుతుంది’ అని ఎవరు పేర్కొన్నారు?
 a) రూస్కోపౌండ్‌     b) అరిస్టాటిల్‌     c) జాన్‌లాస్కి      d) జాన్‌ బెంథామ్‌

2. ‘సుపరిపాలన’ అనే భావనను సబ్‌సహారా ఆఫ్రికా దేశాల పాలనపై ప్రచురించిన నివేదికలో తొలిసారిగా ఎవరు పేర్కొన్నారు?
a)  ఆసియా అభివృద్ధి బ్యాంకు     b) ఐక్యరాజ్యసమితి
c) రెడ్‌క్రాస్‌ సొసైటీ                     d) ప్రపంచ బ్యాంక్‌

3. 1995లో ఎక్కడ జరిగిన సామాజిక అభివృద్ధి శిఖరాగ్ర సమావేశంలో సుపరిపాలన సాధనకు లక్ష్యాలను నిర్దేశించారు?
a) దర్బన్‌         b) వాషింగ్టన్‌      c) నైరోబి      d) టోక్యో

4. 1992లో సుపరిపాలన సాధనకు ప్రపంచబ్యాంకు వెలువరించిన రిపోర్ట్‌?
a) గవర్నెన్స్‌ అండ్‌ రెస్పాన్స్‌బిలిటీ    b) గవర్నెన్స్‌ అండ్‌ ట్రాన్సాక్షన్‌
c) గవర్నెన్స్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌     d) గవర్నెన్స్‌ అండ్‌ గుడ్‌ గవర్నెన్స్‌

5. 1999లో ‘ఆన్‌ గవర్నెన్స్‌ ఇన్‌ ఆసియా’ అనే రిపోర్ట్‌లో సుపరిపాలన సాధనకు జవాబుదారీతనం, పారదర్శకత, భవిష్యత్‌ అంచనా, భాగస్వామ్యం అనే ప్రధాన అంశాలను పేర్కొన్నది?
 a) యునెస్కో        b) ఆసియా అభివృద్ధి బ్యాంకు
 c)  ప్రపంచబ్యాంకు    d) చైనా కేంద్రబ్యాంకు

6. యునైటెడ్‌ నేషన్స్‌ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రామ్బ్‌గీవిదీశ్శి సుస్థిర మానవాభివృద్ధిని సాధించేందుకు గుర్తించిన ప్రధానాంశాల్లో లేనిది?
a) జనాభా నియంత్రణ, నిరక్షరాస్యత నియంత్రణ
b)) పేదరిక నిర్మూలన, పర్యావరణ పరిరక్షణ, పునరుజ్జీవనం
c) మహిళల ప్రగతిని పెంపొందించడం
d) ఉపాధి కల్పన, నిలకడైన జీవన విధానం

7. కిందివాటిలో సుపరిపాలన లక్షణాన్ని గుర్తించండి.
a) పౌరులందరికీ సమన్యాయం, పారదర్శక పాలన
b) పౌరులందరిలో జవాబుదారీతనాన్ని పెంపొందించడం.
c) పౌరుల రాజకీయ, సామాజిక, ఆర్థిక, నైతిక జీవితాన్ని పెంపొందించడం.
d) పైవన్నీ  

8. 1991లో ఏ ప్రధానమంత్రి కాలంలో ప్రవేశపెట్టిన నూతన ఆర్థిక సంస్కరణల వల్ల భారత్‌లో సుపరిపాలనకు శ్రీకారం చుట్టారు?
a) అటల్‌ బిహారి వాజ్‌పేయీ              b)  పి.వి. నరసింహారావు
c) విశ్వనాథ్‌ ప్రతాప్‌సింగ్‌                 d) రాజీవ్‌ గాంధీ

9. భారత ప్రభుత్వం 2000 సంవత్సరంలో ‘సెంటర్‌ ఫర్‌ ఈ - గవర్నెస్‌’ను ఏ నగరంలో నెలకొల్పింది?
a) న్యూదిల్లీ      b) బెంగళూరు     c) చెన్నై      d) హైదరాబాద్‌


10. జాతీయ సుపరిపాలన దినోత్సవాన్ని ఏ రోజును నిర్వహిస్తున్నారు?
a) అక్టోబరు 2        b) ఆగస్టు 15       c) జనవరి 26        d) డిసెంబరు 25

11.     ఆంధ్రప్రదేశ్‌లో ఎన్‌.టి. రామారావు ప్రభుత్వం ‘పౌర సహాయ పౌర ఫిర్యాదుల బ్యూరో’ను మొదటిసారిగా ఎప్పుడు ఏర్పాటుచేసింది
a) 1983         b) 1985            c) 1986        d) 1987

12. 1984లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎన్‌.టి. రామారావు ప్రభుత్వం ఏ వ్యవస్థను రద్దుచేసి దాని స్థానంలో ‘విలేజ్‌ అసిస్టెంట్స్‌’ వ్యవస్థను ప్రవేశపెట్టింది?
a) గ్రామాధికారులు                   b) కమత అధికారులు 
b) పంచాయతీ అధికారులు         d) సమితి అధికారులు 
 

13.  హైదరాబాద్‌లో ‘సుపరిపాలనా కేంద్రాన్ని’ ఎప్పుడు స్థాపించారు?
a) 2000 అక్టోబరు           b) 2001 అక్టోబరు  
c) 2002 అక్టోబరు           d) 2003 అక్టోబరు 


సమాధానాలు
1-b; 2-d; 3-a; 4-c; 5-b; 6-a; 7-d; 8-b; 9-a; 10-d; 11-a; 12-a; 13-c.

Posted Date : 04-05-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌