• facebook
  • whatsapp
  • telegram

కాలం - పని 

* A ఒక పనిని x రోజుల్లో పూర్తి చేస్తే, ఒక రోజులో చేయగల పని భాగం = 1/x

* A ఒక పనిని x రోజుల్లో, B అదే పనిని y రోజుల్లో పూర్తి చేస్తే, వారిద్దరూ కలిసి ఆ పనిని పూర్తి చేయడానికి పట్టే కాలం 


* A, B లు కలిసి ఒక పనిని x రోజుల్లో పూర్తి చేయగలరు. A ఒక్కడే అదే పనిని 'y' రోజుల్లో పూర్తి చేస్తే, B ఆ పనిని పూర్తి చేయడానికి పట్టే కాలం


   
* A, B, C లు ఒక పనిని చేయడానికి పట్టే కాలాలు వరుసగా X, Y, Z రోజులు అయితే, ముగ్గురూ కలిసి ఆ పనిని పూర్తి చేయడానికి పట్టే కాలం



* ఒక పనిని A, Bలు x రోజుల్లో, B, Cలు y రోజుల్లో, C, Aలు Z రోజుల్లో పూర్తి చేస్తారు. ముగ్గురూ కలిసి ఆ పనిని పూర్తి చేయడానికి పట్టే కాలం


       

మాదిరి ప్రశ్నలు


1. ఒక పనిని A 10 రోజుల్లో, B 15 రోజుల్లో పూర్తి చేస్తారు. అయితే వాళ్లిద్దరూ కలిసి అదే పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు?

1) 5         2) 7         3) 6        4) 10

సాధన: A, B కలిసి పని చేయడానికి పట్టే కాలం 


2. రవి, హరి కలిసి ఒక పనిని 12 రోజుల్లో పూర్తి చేస్తారు. రవి ఒక్కడే ఆ పనిని 20 రోజుల్లో పూర్తిచేస్తే, హరి ఎన్ని రోజుల్లో ఆ పని చేస్తాడు?

1) 30      2) 25       3) 24       4) 36 

సాధన: B ఒక్కడే పని చేయడానికి పట్టే కాలం 


 
3. ఒక పనిని A, B లు 12 రోజుల్లో, B, C లు 15 రోజుల్లో, C, Aలు 20 రోజుల్లో పూర్తి చేస్తారు. ముగ్గురూ కలిసి ఆ పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలరు?

1) 5        2) 12        3) 13         4) 10 

సాధన: ఒక పనిని A, B లు x రోజుల్లో, B, C లు y రోజుల్లో, C, A లు Z రోజుల్లో పూర్తి చేస్తారు. A, B, C కలిసి ఆ పని చేయడానికి పట్టేకాలం

       


4. A, B, C లు ఒక పనిని వరుసగా 10, 15, 20 రోజుల్లో చేస్తారు. ముగ్గురూ కలిసి ఆ పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలరు?


     


5. ఒక పనిని A, B లు 18 రోజుల్లో చేస్తే, B, C లు 24 రోజులు,  A, C లు 36 రోజుల్లో చేస్తారు. అయితే A ఒక్కడే ఆ పనిని ఎన్ని రోజుల్లో చేయగలడు?

1) 36        2) 32         3) 48        4) 24 


6. ఒక పనిని A 9 రోజుల్లో, B 12 రోజుల్లో పూర్తి చేస్తారు. C సహాయంతో ఆ పని 4 రోజుల్లో పూర్తయితే, C ఒక్కడే ఆ పనిని ఎన్ని రోజుల్లో చేస్తాడు?

1) 18      2) 16      3) 20      4) 24 


 


7. A ఒక పనిని 15 రోజుల్లో పూర్తి చేస్తాడు. అయితే 3 రోజుల తర్వాత అతడు పనిని  వదిలి వెళ్లాడు. మిగిలిన పనిని B 20 రోజుల్లో చేశాడు. అయితే మొత్తం పనిని B ఒక్కడే ఎన్ని రోజుల్లో పూర్తిచేశాడు?

1) 25           2) 28      3) 30       4) 32


8. ఒక పనిని A 18 రోజుల్లో పూర్తి చేస్తే, B 15 రోజుల్లో పూర్తి చేస్తాడు. B 10 రోజులు పని చేసి మానేశాడు. అయితే మిగిలిన పనిని A ఒక్కడే చేయడానికి ఎంత కాలం పడుతుంది?

1) 5 రోజులు     2) 4 రోజులు        3) 8 రోజులు     4) 6 రోజులు


9. A ఒక పనిని 20 రోజుల్లో పూర్తిచేస్తాడు.  B అదే పనిని పూర్తి చేయడానికి పట్టే కాలం 25 రోజులు. A పని ప్రారంభించిన 2 రోజులకి B అతడితో చేరాడు. అయితే ఆ పని ఎన్ని రోజుల్లో పూర్తవుతుంది?

1) 5 రోజులు     2) 8 రోజులు                3) 10 రోజులు     4) 12 రోజులు


 


గమనిక: 

* ఒక వ్యక్తి పనిచేసే సామర్థ్యం, దానికి పట్టే కాలం విలోమానుపాతంలో ఉంటాయి.

* పని పూర్తిచేసే రోజుల నిష్పత్తి A : B అయితే, వారి సామర్థ్యాల నిష్పత్తి B : A.

* ఒక పనిని పూర్తిచేసే రోజుల నిష్పత్తి A : B : C అయితే వారి సామర్థ్యాల నిష్పత్తి  BC : AC : AB


10. A, Bలు ఒక పనిని వరుసగా 20 రోజులు, 30 రోజుల్లో పూర్తిచేస్తారు. అయితే వారి సామర్థ్యాల నిష్పత్తి ఎంత?

1) 2 : 3         2) 6 : 5         3) 3 : 2              4) 5 : 7

సాధన: రోజుల నిష్పత్తి = 20 : 30 

                = 2 : 3

సామర్థ్యాల నిష్పత్తి = 3 : 2               సమాధానం: 3


11. A, B, C లు ఒక పనిని వరుసగా 10, 15, 20 రోజుల్లో చేస్తే, వారి సామర్థ్యాల నిష్పత్తి ఎంత?

1) 5 : 3 : 2          2)  2 : 3 : 4        3) 4 : 3 : 2        4) 6 : 4 : 3

సాధన: రోజుల నిష్పత్తి = 10 : 15 : 20

    = 2 : 3 : 4

సామర్థ్యాల నిష్పత్తి

    = (3 × 4) : (2 × 4) : (2 × 3)

    = 12 : 8 : 6 = 6 : 4 : 3                 సమాధానం: 4


12. A సామర్థ్యం B కి 3 రెట్లు. A, B లు కలిసి ఒక పనిని 12 రోజుల్లో పూర్తి చేయగలరు. అయితే A ఒక్కడే ఆ పనిని పూర్తి చేయడానికి ఎన్ని రోజులు కావాలి?

1) 16 రోజులు      2) 15 రోజులు        3) 20 రోజులు        4) 24 రోజులు

సాధన:

A పని పూర్తిచేయడానికి పట్టే రోజుల సంఖ్య = x 

B పని పూర్తిచేయడానికి పట్టే రోజుల సంఖ్య = 3x

A, B కలిసి ఆ పని చేయడానికి పట్టే కాలం = 12 రోజులు


13. A, B, C లు ఒక పనిని వరుసగా 10, 12, 15 రోజుల్లో పూర్తి చేస్తారు. ముగ్గురూ కలిసి ఆ పనిని రూ.9000 కి పూర్తి చేస్తే, అందులో C వాటా ఎంత? 

1) రూ.3600     2) రూ.2500      3) రూ.2400     4) రూ.2260

సాధన:


 

*  ఒక పనిని  x  రోజుల్లో చేస్తాడనుకుందాం. ఒక రోజులో ఆ పనిలో  x  వ వంతు చేయగలడు.
ఉదా: A ఒక పనిని 20 రోజుల్లో చేస్తాడనుకుందాం. అప్పుడు ఒక రోజులో ఆ పనిలో 20వ వంతు చేయ గలడు. అంటే ప్రతిరోజూ కచ్చితంగా ఆ పనిలో   భాగం చేస్తాడని కాదు. సగటున అలా చేయగలడని అనుకోవచ్చు
*  B ఒక పనిలో    వ భాగం ఒక రోజులో చేస్తాడను కుంటే ఆ పని చేయడానికి B కి పట్టే రోజులు y
ఉదా: తీ ఒక పనిలో    వ భాగం ఒక రోజులో చేస్తాడనుకుంటే ఆ పని చేయడానికి తీ కి పట్టే రోజులు 5. 

*  ఒక మనిషి పనిచేయగల శక్తి, పని చేయడానికి పట్టే కాలం విలోమానుపాతంలో ఉంటాయి.

ఉదా: A, B లు ఒక పనిని వరుసగా 15, 20 రోజుల్లో చేయగలరు. పని చేయగల శక్తి ఎవరికి ఎక్కువ?

సాధన: A, B లు ఒక పనిని వరుసగా 15, 20 రోజుల్లో చేయగలరు. వారి మధ్య నిష్పత్తి
           A    :    B 
          15    :    20 
           3     :    4
  A కి పని చేయగల శక్తి ఎక్కువ.

 (ఒక వ్యక్తి పని చేయగల శక్తి, అతడు పని చేయడానికి పట్టే కాలం విలోమానుపాతంలో ఉంటాయి.)

1. A, B, C లు ఒక పనిని విడివిడిగా 12, 24, 36 రోజుల్లో పూర్తిచేస్తారు. ముగ్గురూ కలిసి ఆ పనిని పూర్తిచేసేందుకు ఎన్ని రోజులు పడుతుంది?

    1) 5 6/11 రోజులు     2) 4 రోజులు    3) 6 6/11రోజులు    4) 6 రోజులు 

సాధన: A ఒక పనిని పూర్తిచేయడానికి పట్టే రోజులు (x) = 12 

    అదే పనిని B పూర్తిచేయడానికి పట్టే రోజులు (y) = 24 

    అదే పనిని C పూర్తిచేయడానికి పట్టే రోజులు (z) = 36 

    A, B, C లు కలసి అదే పనిని పూర్తిచేయడానికి పట్టే రోజులు 

సమాధానం: 3

2. A, B, C లు ఒక పనిని విడివిడిగా 5 గంటలు, 9 గంటలు, 15 గంటల్లో పూర్తి చేస్తారు. C ఆ పనిని ముందుగా ప్రారంభించి గంట తర్వాత విరమించుకున్నాడు. మిగిలిన పనిని A, B లు కలిసి ఎన్ని గంటల్లో పూర్తి చేస్తారు?

    1) 1 గం. 40 ని.       2) 2 గం.     3) 1 గం.     4) 3 గం.

సాధన: A ఒక పనిని పూర్తిచేయడానికి పట్టే గంటలు = 5

A ఒక గంటలో చేసే పని = 1/5

అదే పనిని B పూర్తిచేయడానికి పట్టే గంటలు = 9

B ఒక గంటలో చేసే పని = 1/9 

 అదే పనిని C పూర్తిచేయడానికి పట్టే గంటలు = 15

C ఒక గంటలో చేసే పని = 1/15 

A, B లు కలిసి ఒక గంటలో చేసే పని = 1/5 + 1/9 = 9+5 / 45 = 14/45

C గంట పనిచేశాక మిగిలిన పని = 1 - 1/15 = 14/15 

14/15 భాగం పనిని A, B లు కలిసి పూర్తి చేయడానికి పట్టే సమయం 

అభ్యాస ప్రశ్నలు


1. A, B లు ఒక పనిని విడివిడిగా 20, 30 రోజుల్లో పూర్తి చేస్తారు. ఇద్దరూ కలిసి ఆ పనిని పూర్తిచేయడానికి ఎన్ని రోజులు పడుతుంది?

    1) 12       2) 15       3) 16       4) 18


2. A, B లు కలిసి ఒక పనిని 12 రోజుల్లో పూర్తిచేస్తారు. B ఒక్కడే ఆ పనిని 18 రోజుల్లో పూర్తి చేస్తాడు. అయితే అదే పనిని A ఎన్ని రోజుల్లో పూర్తిచేస్తాడు?

    1) 34       2) 24       3) 36       4) 48


3. A, B లు ఒక పనిని విడివిడిగా 6, 9 రోజుల్లో పూర్తి చేస్తారు. ఇద్దరూ కలిసి పని ప్రారంభించిన 2 రోజుల తర్వాత A ఆ పని నుంచి విరమించుకున్నాడు. మిగిలిన పనిని B ఒక్కడే పూర్తిచేసేందుకు ఎన్ని రోజులు పడుతుంది?

    1) 3        2) 4        3) 6        4) 8


సమాధానాలు: 1-1; 2-3; 3-2.

Posted Date : 12-09-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌