• facebook
  • whatsapp
  • telegram

త్రిభుజాలు

1. ఒక త్రిభుజం అయితే కిందివాటిలో ఏది సత్యం?

1) AC2  = AB+ BC2      2) AC =  AB + BC

3) AC > AB + AC           4) AC < AB + BC

సమాధానం: 4

సాధన: ఒక త్రిభుజంలో ఏ రెండు భుజాల మొత్తమైనా మూడో భుజం కంటే ఎక్కువగా ఉంటుంది.

కాబట్టి Ac < AB + BC అనేది సత్యం. 

2. ఒక త్రిభుజంలో మూడు భుజాల పొడవులు వరుసగా 13 సెం.మీ., 16 సెం.మీ., 10 సెం.మీ. అయితే ఆ త్రిభుజం?  

1) అల్పకోణ త్రిభుజం          2) అధికకోణ త్రిభుజం

3) లంబకోణ త్రిభుజం          4) ఏదీకాదు

సమాధానం: 1


3. ఒక సమబాహు త్రిభుజంలో పరివృత్త కేంద్రం, లంబకేంద్రం, గురుత్వ కేంద్రం, అంతర వృత్త కేంద్రాలు     

1) సరేఖీయాలు          2) సరేఖీయాలు కావు       3) ఏకీభవిస్తాయి        4)  అన్నీ

సమాధానం: 3

సాధన: ఒక సమబాహు త్రిభుజంలో పరివృత్త కేంద్రం, లంబకేంద్రం, గురుత్వ కేంద్రం, అంతరవృత్త కేంద్రాలు ఒకే బిందువును సూచిస్తాయి. అంటే ఏకీభవిస్తాయి.



5. ఒక త్రిభుజంలో మూడు కోణాలు 2 : 3 : 4 నిష్పత్తిలో ఉన్నాయి. అయితే ఆ త్రిభుజంలో అతిపెద్ద కోణం? 

1) 60           2) 80           3) 40           4) 150

సమాధానం: 2


6. ఒక త్రిభుజంలో మూడు కోణాలు 1 : 2 : 3 నిష్పత్తిలో ఉన్నాయి. అయితే ఆ త్రిభుజం ..... 

1) లంబకోణ త్రిభుజం           2) సమబాహు త్రిభుజం

3) సమద్విబాహు త్రిభుజం         4) అధికకోణ త్రిభుజం

సమాధానం: 1

Posted Date : 09-11-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌