• facebook
  • whatsapp
  • telegram

యూనియన్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ 

మాదిరి ప్రశ్నలు


1. ప్రపంచంలో మొదటిసారి పోటీ పరీక్షల ద్వారా ఉద్యోగులను ఎంపిక చేసే పద్ధతిని ప్రవేశపెట్టిన దేశం?

 1)  అమెరికా    2) బ్రిటన్‌    3) చైనా    4) ఫ్రాన్స్‌


2. మన దేశంలో 1793లో సివిల్‌ సర్వీసెస్‌ విధానాన్ని ప్రవేశపెట్టినవారు?

 1) వారన్‌ హేస్టింగ్స్‌    2) కారన్‌వాలీస్‌      3) వెల్లస్లీ      4) చార్లెస్‌ మెట్‌కాఫ్‌


3. 1926లో ఏ కమిషన్‌ సిఫార్సుల మేరకు మన దేశంలో కేంద్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ను ఏర్పాటుచేశారు?

 1) లీ కమిషన్‌     2) హార్టాగ్‌ కమిషన్‌     3) రోవర్‌ కమిషన్‌     4) అట్లీ కమిషన్‌


4. మన దేశంలో ఏ చట్టం ప్రకారం జాతీయ స్థాయిలో ఫెడరల్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్, రాష్ట్రాల్లో రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ల ఏర్పాటును నిర్దేశించారు?

 1) 1909 మింటో - మార్లే          2) 1919 మాంటేగ్‌ - చెమ్స్‌ఫర్డ్‌

  3) 1935 భారత ప్రభుత్వ చట్టం     4) 1947 లార్డ్‌ మౌంట్‌బాటన్‌ ప్లాన్‌


5. యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ గురించి రాజ్యాంగంలో ఎక్కడ పేర్కొన్నారు?

 1) XIVవ భాగం, ఆర్టికల్‌ 315 - 323      2) XVవ భాగం, ఆర్టికల్‌ 313 - 323 

 3) XVIవ భాగం, ఆర్టికల్‌ 312 - 324      4) XVIIవ భాగం, ఆర్టికల్‌ 308 - 323  


6. యూపీఎస్సీ ఛైర్మన్, సభ్యుల పదవీకాలం?

 1)   సంవత్సరాలు లేదా 62 ఏళ్ల వయసు వరకు

 2) 5 సంవత్సరాలు లేదా 65 ఏళ్ల వయసు వరకు

 3) 6 సంవత్సరాలు లేదా 65 ఏళ్ల వయసు వరకు

 4)  5 సంవత్సరాలు లేదా 62 ఏళ్ల వయసు వరకు 


7. యూపీఎస్సీ ఛైర్మన్, సభ్యులను ఎవరు నియమిస్తారు?

 1) సుప్రీంకోర్టు     2) పార్లమెంటు     3) అటార్నీ జనరల్‌     4) రాష్ట్రపతి


8. రాష్ట్ర పబ్లిక్‌ సర్వీసు కమిషన్‌ ఛైర్మన్, సభ్యులను గవర్నర్‌ నియమించగా, తొలగించేది ఎవరు?

 1) రాష్ట్రపతి         2) గవర్నర్‌     

 3) ముఖ్యమంత్రి        4) అడ్వకేట్‌ జనరల్‌


9. యూపీఎస్సీ ఛైర్మన్‌గా పనిచేసిన ఎ.ఆర్‌.కిద్వాయ్‌ని ఏ రాష్ట్రానికి గవర్నర్‌గా నియమించడాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది?

 1) హిమాచల్‌ప్రదేశ్‌    2) కేరళ     3) బిహార్‌     4) తమిళనాడు


10. కిందివాటిలో అఖిల భారత సర్వీసు కానిది?

 1) ఐఏఎస్‌     2) ఐఎమ్‌ఎస్‌    3) ఐపీఎస్‌    4) ఐఎఫ్‌ఎస్‌


11. మన దేశంలో సివిల్‌ సర్వీసుల దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తున్నారు?

 1) మార్చి 21     2) ఏప్రిల్‌ 21     3) జూన్‌ 21     4) ఆగస్టు 21

12. అఖిల భారత సర్వీసుల పితామహుడిగా ఎవరిని పేర్కొంటారు?

 1) సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌         2) జవహర్‌లాల్‌ నెహ్రూ

 3) డాక్టర్‌ బి.ఆర్‌. అంబేడ్కర్‌         4) సుభాష్‌ చంద్రబోస్‌


13. మన దేశంలో 1772లో ఎవరికాలంలో భూమిశిస్తును వసూలు చేసే లక్ష్యంతో ‘జిల్లా కలెక్టర్‌’ పదవిని ప్రవేశపెట్టారు?

 1)  కారన్‌వాలీస్‌     2)  వారన్‌ హేస్టింగ్స్‌    3) లార్డ్‌ కర్జన్‌     4) చార్లెస్‌ మెట్‌కాఫ్‌


14. యూపీఎస్సీకి సంబంధించి కిందివాటిలో సరికాని దాన్ని గుర్తించండి.

 1) 1947 నుంచి 1949 వరకు యూపీఎస్సీ ఛైర్మన్‌గా హెచ్‌.కె. కృపలాని వ్యవహరించారు.

 2) యూపీఎస్సీ ఛైర్మన్, సభ్యులు తమ రాజీనామాను రాష్ట్రపతికి సమర్పించాలి.

 3) యూపీఎస్సీ ఛైర్మన్, సభ్యులు తమ రాజీనామాను ప్రధానమంత్రికి సమర్పించాలి.

 4) ఆర్టికల్‌ 315 ప్రకారం జాయింట్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ను ఏర్పాటు చేస్తారు.


15. జాయింట్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఛైర్మన్, సభ్యుల పదవీకాలాన్ని గుర్తించండి.

 1) 5 సంవత్సరాల పదవీకాలం లేదా 60 సంవత్సరాల వయసు వరకు

 2) 6 సంవత్సరాల పదవీకాలం లేదా 62 సంవత్సరాల వయసు వరకు

 3) 6 సంవత్సరాల పదవీకాలం లేదా 65 సంవత్సరాల వయసు వరకు

 4)  5 సంవత్సరాల పదవీకాలం లేదా 65 సంవత్సరాల వయసు వరకు

సమాధానాలు: 1-3; 2-2; 3-1; 4-3; 5-1; 6-3; 7-4; 8-1; 9-3; 10-2; 11-2; 12-1; 13-2; 14-3; 15-2.

Posted Date : 04-05-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌