• facebook
  • whatsapp
  • telegram

అక్షర శ్రేణి 

క్రమం కనిపెడితే జవాబు!


ఆఫీసులో ఫైల్స్‌ ఒక క్రమ పద్ధతిలో అమరుస్తారు. మెడికల్‌ షాపుల్లోనూ మందుల బాక్స్‌లను నిర్ణీత విధానంలో పెట్టుకుంటారు. అనుకున్న వెంటనే వాటిని తీసుకోవడానికి వీలుగా ఇలాంటి ఏర్పాట్లు చేసుకుంటారు. దాని కోసం సాధారణంగా ఆంగ్ల అక్షరమాలను అనుసరిస్తారు. ఇది ఒక రకంగా పనిని సులభం చేసుకోవడం, అనవసరమైన గందరగోళాన్ని నివారించుకునే నైపుణ్యమే. అభ్యర్థుల్లో ఈ విధమైన సమస్యా పరిష్కార సామర్థ్యాలను గుర్తించడానికి రీజనింగ్‌లో ‘అక్షరశ్రేణి’ పాఠం నుంచి ప్రశ్నలు అడుగుతుంటారు. వాటికి సరైన సమాధానాలను కనుక్కోవాలంటే  వివిధ  రకాలుగా ఏర్పడే అక్షరాల స్థానాలు, క్రమాలపై అవగాహన పెంచుకోవాలి. 

‘అక్షర శ్రేణి (letter series) అనే పాఠ్యాంశానికి సంబంధించిన ప్రశ్నలకు సరైన సమాధానాలు గుర్తించాలంటే అభ్యర్థికి ఆంగ్ల  అక్షరమాల స్థానాలపై అవగాహన ఉండాలి. అంతేకాకుండా ఆ  అక్షరమాల స్థానాలు కుడి నుంచి ఎడమకు, ఎడమ నుంచి కుడికి, ప్రతిబింబాలపై కూడా పట్టు సాధించాలి.


ఆంగ్ల అక్షరమాలలో 26 అక్షరాలు ఉన్నప్పటికీ, రీజనింగ్‌లోని అక్షర శ్రేణికి సంబంధించి వివిధ సెట్‌లను కలుపుతూ చాలా అక్షరాల స్థానాలను తీసుకుంటారు.


పై క్రమాన్ని గమనించినట్లయితే రెండో అర్ధభాగ అక్షరాలను  వ్యతిరేక దిశలో రాశారు. ఆ విధంగా రాయడం ద్వారా ప్రతిబింబ   అక్షరాలను పొందొచ్చు. 


ప్రతిబింబ అక్షరాలు

Z    E  V    I  R
B  Y    F  U    J

 Q
C  X    G  T    K  P
D  W    H  S    L  O
M  N         


    మొత్తం ఆంగ్ల అక్షరాలు = 26

    26 అక్షరాలు = 1 సెట్‌

    52 అక్షరాలు = 2 సెట్స్‌

    78 అక్షరాలు = 3 సెట్స్‌


    1 వ అక్షరం = 27 వ అక్షరం = A

    0 వ అక్షరం = 26 వ అక్షరం = Z


మాదిరి ప్రశ్నలు


కింది శ్రేణుల్లో తర్వాత వచ్చే అక్షరం/అక్షరాలను కనుక్కోండి.


1. L, B, J, D, H, F, F, H, ....., .....

1) J, D 2) D, J 3) F, L 4) D, M

వివరణ: పై శ్రేణిని రెండు ఉపశ్రేణులుగా విభజించి రాయగా..

జ: 2


2.     2. R, M, B, S, O, E, T, Q, H, ....., .....

1) U, K 2) S, U 3) S, K 4) U, S

వివరణ: పై శ్రేణిలో మూడు ఉపశ్రేణులు ఉన్నాయి.

జ: 4


3.  G, M, R, V, .....

1) W 2) X 3) Y 4) Z

వివరణ: 


జ: 3


4.    T, V, Z, F, N, .....

1) X 2) Z 3) W 4) V

వివరణ: 


జ: 1


5.     A, A, B, F, X, .....

1) L 2) R 3) O 4) P

వివరణ: 

X = 24 ⇒ 24 × 5 = 120

4 సెట్లు = 26 × 4 = 104

120 - 104 = 16 ⇒ 16వ అక్షరం = P    

జ: 4


6.     L, B, R, H, .....

1) R 2) X 3) T 4) Z

వివరణ:

26 + 8 = 34 ⇒ 34 − 10 = 24

24వ అక్షరం = X                    

జ: 2


7.     I, R, K, P, M, N, A, ....., ....., X

1) C, Z 2) O, R 3) Z, C 4) A, Z

వివరణ: ప్రతిబింబ అక్షరాలు 

I  R, K  P, M  N, A  Z, C  X

జ: 3


8.     B, E, J, Q, P, .....

1) A 2) Z 3) W 4) B

వివరణ: 

 

జ: 1


9.     Y, M, C, U, O, .....

1) L 2) X 3) K 4) Z

వివరణ: 

జ: 3


10. B, F, L, T, C, .....

1) X 2) M 3) R 4) W

వివరణ: 

సంయుక్త సంఖ్యలను కలపగా శ్రేణి ఏర్పడింది.

జ: 4


11. A, B, F, O, .....

1) F 2) E 3) G 4) T

వివరణ: 

జ: 2


12. B, C, M, N, .....

1) Z 2) W 3) X 4) V

వివరణ: 

జ: 1


13. K, M, Q, Y, .....

1) F 2) G 3) M 4) Y

వివరణ: 


K = 11 = 1 + 1 = 2 ⇒ M = 13 = 1 + 3 = 4

Q = 17 = 1 + 7 = 8 ⇒ Y = 25 = 2 + 5 = 7

సంఖ్యలోని అంకెల మొత్తాన్ని కలపడం ద్వారా శ్రేణి ఏర్పడింది.                

జ: 1


14.  B, G, M, T, B, .....

1) K 2) M 3) L 4) N

వివరణ: 

జ: 1


15. P, J, E, A, .....

1) L 2) J 3) X 4) R

వివరణ: 

జ: 3


16. GMSY, IOUA, KQWC, .....-

1) MSYE 2) NSYE 3) MTYE 4) MSYF

వివరణ:

జ: 1


17. ADG, GJM, .-.-.-.-.-, SVY

1) MPS 2) MQR 3) MQS 4) SPM

వివరణ:

జ: 1


18. BMY, DNW, FOU, .-.-.-.-.-

1) HPT 2) HPS 3) HQS 4) GPS

వివరణ:


జ: 2


19. DMP, FLN, HKL, JJJ, .-.-.-.-.-

1) MIH 2) III 3) LIH 4) MII

వివరణ:        

జ: 3


20. FJKP, ILMQ, LNOR, OPQS, .-.-.-.-.-

1) RQTV 2) RQSS

3) RRST 4) RTTU

వివరణ:             

జ: 3


21. IXT, MAV, QDX, .-.-.-.-.-

1) WGX 2) VHY 3) UGZ 4) YHZ

వివరణ:



రచయిత: గోలి ప్రశాంత్‌ రెడ్డి

Posted Date : 20-04-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌