• facebook
  • whatsapp
  • telegram

భారత వ్యవసాయ రంగం - విధానాలు

1. జాతీయాదాయంలో వ్యవసాయరంగం వాటా?

1) 20%   2) 21%   3) 22%   4) 23%


2. భారత వ్యవసాయాన్ని ‘‘రుతుపవనాలతో ఆడే జూదంగా’’ వర్ణించింది ఎవరు? (భారతదేశంలో వ్యవసాయ ఉత్పత్తిని ఎక్కువగా రుతుపవనాలే నిర్ణయిస్తాయి. అవి ఆలస్యమైనా, ఆగిపోయినా వ్యవసాయం విఫలమవుతుంది. ఈ కారణం వల్లే ఆయన ఈ విధంగా పేర్కొన్నారు.)

1) ఆడమ్‌స్మిత్‌  2) గున్నార్‌ మిర్దాల్‌

3) మార్షల్‌     4) జె.ఎం.కీన్స్‌


3. భారత ఆర్థిక వ్యవస్థలోని మూడు రంగాల్లో వ్యవసాయ రంగాన్ని ఏమంటారు?

1) ద్వితీయ రంగం      2) ప్రాథమిక రంగం

3) తృతీయ రంగం     4) గనుల రంగం


4. భారత ప్రభుత్వం మొదటి పôచవర్ష ప్రణాళిక (1951-56) లో ఏ రంగానికి అధిక ప్రాధాన్యం ఇచ్చింది?

1) వ్యవసాయ   2) పారిశ్రామిక    3)భారీ పరిశ్రమలు    4) తయారీ


5. ఏ సంవత్సర మధ్య కాలంలో అనుసరించిన నూతన వ్యవసాయ వ్యూహం హరిత విప్లవ సాధనకు ఉపయోగపడింది?

1) 1966-69    2) 1966-68     3) 1967-69     4) 1966-71


6. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఎన్నో వంతు లేదా అంతకు మించి ప్రజలు గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు? వీరి ప్రధాన వృత్తి ఏది?

1) 2/3వ వంతు, వ్యవసాయం      2) 1/3వ వంతు, పశుసంపద

3) 1/6వ వంతు, పారిశ్రామిక రంగం     4) 2/6వ వంతు, తయారీ రంగం


7. ‘‘ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయ రంగంపై ఆధారపడే వారి శాతం తగ్గుతూ, సేవారంగంపై ఆధారపడే వారి శాతం పెరగడమే ఆర్థిక అభివృద్ధికి సూచిక’’ అని ఎవరు పేర్కొన్నారు?

1) డేవిడ్‌ రికార్డో   2) సైమన్‌ కుజ్నెట్స్‌

3) మార్షల్‌     4) గున్నార్‌ మిర్దాల్‌


8. ప్రస్తుతం భారతదేశ జనాభాలో ఎంత శాతానికిపైగా వ్యవసాయ రంగంపై ఆధారపడి జీవిస్తున్నారు? (‘2021-22 కేంద్ర వ్యవసాయ శాఖ - రైతుల సంక్షేమం’ వార్షిక నివేదిక ప్రకారం)

1) 54.6%    2) 53.6%   3) 49.6%     4) 64.6%


9. మనదేశంలో ఎక్కువ ఉపాధిని కల్పిస్తోన్న రంగం?

1) వ్యవసాయ రంగం   2)ద్వితీయ రంగం

3) సేవారంగం    4) ఎంఎస్‌ఎంఈల రంగం


10. 1951-81 మధ్య కాలంలో భారతదేశంలో ఎంత శాతం జనాభా వ్యవసాయ రంగంపై ఆధారపడ్డారు?

1) 62.1%      2) 72.1%    3) 82.1%  4) 52.1%


11. మనదేశంలో జాతీయాదాయంలో తక్కువ వాటా కలిగిన రంగం ఏది?

1) సేవారంగం     2)వ్యవసాయ రంగం  

3)పారిశ్రామిక రంగం    4)గనుల రంగం


12. భారతదేశ వ్యవసాయ ఉత్పత్తుల్లో కింది ఏవి ఎక్కువగా ఎగుమతి అవుతున్నాయి?

1) సుగంధ ద్రవ్యాలు, పత్తి, ఆయిల్‌ మీల్‌ కేక్‌

2) ఆముదం నూనె, కాఫీ  

3) జీడిపప్పు, టీ, కూరగాయలు  

4)పైవన్నీ


13. ప్రపంచ వాణిజ్య సంస్థ (WTO) వాణిజ్య గణాంక సమీక్ష - 2021 ప్రకారం ప్రపంచ వ్యవసాయ వాణిజ్యంలో 2020లో భారతదేశ ఎగుమతుల వాటా ఎంత?

1) 2.2%   2) 3.2%   3) 4.2%      4)6.2%


14. 2021-22 నాటికి జాతీయాదాయంలో వ్యవసాయ రంగం వాటా?(2021-22) భారత ఆర్థిక సర్వే ప్రకారం)

1) 16.8%   2) 17.5%   3) 18.8%      4) 19.8%


15. 1950-51లో జాతీయాదాయంలో వ్యవసాయ రంగం వాటా?

1) 51%  2) 52%   3) 53%  4) 55%


16. ‘కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ - రైతుల సంక్షేమం’ వార్షిక నివేదిక 2021-22 ప్రకారం భూ వినియోగంలో నికర సేద్యభూమి? (మిలియన్‌ హెక్టార్లలో)

1) 139.3     2) 140.3    3) 138.3     4) 139.4 


17. 1950-51లో మనదేశంలో మొత్తం ఆహారధాన్యాల ఉత్పత్తి? (మిలియన్‌ టన్నుల్లో)

1) 50.8    2) 60.8  3) 70.8   4)80.8


18. 2020-21 నాటికి  మనదేశంలో మొత్తం ఆహారధాన్యాల ఉత్పత్తి ఎన్ని మిలియన్‌ టన్నులుగా నమోదైంది? (2021-22) భారత ఆర్థిక సర్వే ప్రకారం)

1) 308.65     2) 408.65    3) 605.68      4) 408.65 


19. 2021-22 భారత ఆర్థిక సర్వే ప్రకారం, 2019-20 నాటికి వ్యవసాయ రంగంలో మూలధన కల్పన సామర్థ్యం (పెట్టుబడి) వాటా?

1) 15.5%     2) 14.8%    3) 15.6%    4)15.9%


20. 2021-22 భారత ఆర్థిక సర్వే ప్రకారం, వ్యవసాయం - దాని అనుబంధ రంగాల వృద్ధి రేట్లను జతపరచండి.

 జాబితా - I        జాబితా - II

i) 2016-17      a) 4.3%

ii) 2019-20      b) 6.8%

iii) 2020-21      c) 3.9%

iv) 2021-22     d) 3.6%

1)  i-b, ii-a, iii-d, iv-c

2) i-a, ii-d, iii-c, iv-b

3) i-d, ii-c, iii-b, iv-a

4) i-c, ii-b, iii-a, iv-d


21. 1951-2001 మధ్యకాలంలో స్థూల జాతీయోత్పత్తికి వ్యవసాయరంగం సమకూర్చిన ఆదాయం నాలుగురెట్ల కంటే ఎక్కువ పెరిగింది. ఇదే కాలంలో స్థూల జాతీయ ఉత్పత్తి ఎనిమిది రెట్లు పెరిగింది. దీని ప్రకారం స్థూల జాతీయోత్పత్తిలో వ్యవసాయరంగం వాటా...

1) తగ్గింది      2) పెరిగింది 

3) హెచ్చుతగ్గులు ఉన్నాయి    4) మొదట తగ్గి, తర్వాత పెరిగింది


22. ‘కేంద్ర వ్యవసాయ మంత్రిత్వశాఖ - రైతుల సంక్షేమం’ వార్షిక నివేదిక 2021-22 ప్రకారం మనదేశంలో మొత్తం భూవిస్తీర్ణం... (మిలియన్‌ హెక్టార్లలో)

1) 328.7    2) 428.7    3) 329.8     4) 326.7


23. ‘కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ - రైతుల సంక్షేమం’ వార్షిక నివేదిక 2021-22 ప్రకారం, మనదేశంలో స్థూల పంట విస్తీర్ణం ఎంత? (మిలియన్‌ హెక్టార్లలో)

1) 197.3   2) 196.3     3) 185.3     4) 194.5


24. భారతదేశంలో పండే ప్రధాన వాణిజ్య పంటలు ఏవి?

1) పత్తి, జనుము   2) మిరప, పొగాకు     3) నూనె గింజలు     4) పైవన్నీ


25. వ్యవసాయ సూచిక సంఖ్యలను తయారు చేసేది?

1)నేషనల్‌ స్టాటిస్టికల్‌ ఆఫీస్‌ (ఎన్‌ఎస్‌ఓ)    2) కేంద్ర వ్యవసాయ శాఖ

3) నీతి ఆయోగ్‌    4) కేంద్ర ఆర్థిక శాఖ


26. భారతదేశ వ్యవసాయంలో అల్ప ఉత్పాదకతకు గల కారణాలకు సంబంధించి కిందివాటిలో సరైంది?

1) భూమిపై జనాభా ఒత్తిడి, భూసారం క్షీణించడం, అవస్థాపన సౌకర్యాల కొరత

2) నీటిపారుదల సౌకర్యాల కొరత

3) వలస పాలన, చిన్న కమతాలు, భూస్వామ్య పద్ధతులు - కౌలు విధానాలు

4) పైవన్నీ


27. మొదటి పంచవర్ష ప్రణాళిక (1951-56) లో ఏ రంగానికి అధిక కేటాయింపులు చేశారు?

1) వ్యవసాయం, నీటిపారుదల     2) పారిశ్రామిక    

3) రవాణా   4) సాంకేతిక పరిజ్ఞానం


28. భారత వ్యవసాయ రంగం కింది దేనిలో ముఖ్య పాత్ర పోషిస్తుంది?

1) గ్రామీణ ప్రజల జీవనోపాధి 

2) ఉద్యోగిత 

3) ఆహార భద్రత   

4) పైవన్నీ


29. వ్యవసాయం అంటే?

1) భూమిని దున్ని, పంటలను సాగుచేయడం

2) పంటలను పండించడంతో పాటు మొక్కలు పెంచడం

3)పశువులను పోషించడం, కోళ్లను పెంచడం, చేపలను పెంచడం 

4) పైవన్నీ


సమాధానాలు

1-1  2-2  3-2  4-1  5-1  6-1  7-2  8-1  9-1  10-2  11-2  12-4  13-1  14-3  15-3  16-1  17-1  18-1  19-4  20-1  21-1  22-1  23-1  24-4  25-2  26-4  27-1  284 294


మరికొన్ని...


1. వ్యవసాయ రంగానికి సంబంధించి కిందివాటిలో సరైంది?

1) ప్రజలందరికీ ఆహార ధాన్యాలను సరఫరా చేయడంతోపాటు పారిశ్రామిక రంగానికి కావాల్సిన ముడి పదార్థాలను అందిస్తుంది.

2) అభివృద్ధి చెందిన వ్యవసాయరంగం పారిశ్రామిక రంగానికి శ్రమను, మూలధనాన్ని బదిలీ చేస్తుది.

3) దేశీయ, విదేశీ మార్కెట్లకు వ్యవసాయ రంగం తన ఉత్పత్తులను సరఫరా చేస్తుంది.

4) పైవన్నీ


2. ఉత్పాదకత (Productivity) అంటే?

1) ఒక హెక్టారు దిగుబడి

2) రెండు హెక్టార్ల దిగుబడి

3) మూడు హెక్టార్ల దిగుబడి

4) నాలుగు హెక్టార్ల దిగుబడి


3. ఒకే సమయంలో వేర్వేరు పంటల కింద ఉన్న విస్తీర్ణాన్ని ఏమంటారు?

1) పంటల తీరు   2) ఉత్పాదకత

3) ఉత్పత్తి   4) నికర సేద్యం


4. మనదేశంలో ప్రచ్ఛన్న నిరుద్యోగిత  ఏ రంగంలో ఉంది?

1) వ్యవసాయ   2) పారిశ్రామిక

3) గనుల       4) ద్వితీయ


5. 2019-20లో వ్యవసాయ రంగంలో ప్రభుత్వ పెట్టుబడి శాతం.... (2021-22 భారత ఆర్థిక సర్వే ప్రకారం)

1) 2.7%      2) 2.9%   3) 2.5%      4) 2.8%


6. 2021-22 భారత ఆర్థిక సర్వే ప్రకారం, ప్రపంచంలో పంచదార ఉత్పత్తిలో భారత్‌ స్థానం?

1) 2     2) 3    2) 1    4) 4


7. 2017-18లో మనదేశంలో వ్యవసాయ రంగం వృద్ధి రేటు శాతం? (2021-22 భారత ఆర్థిక సర్వే ప్రకారం)

1) 6.8%   2) 6.6%    3) 2.6%      4) 4.3%


8. 2015-16లో మనదేశంలో వ్యవసాయ రంగంలో ప్రభుత్వ పెట్టుబడి శాతం? (2021-22 ఆర్థిక సర్వే ప్రకారం)

1) 2.6%     2) 2.8%    3) 2.5%     4)  2.9%


సమాధానాలు

1-4   2-1   3-1   4-1   5-1   6-1   7-3   8-1

Posted Date : 17-01-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌