• facebook
  • whatsapp
  • telegram

దత్తాంశ విశ్లేషణ


చిత్రాలతో చిక్కుముడులకు చెక్‌!


ఖర్చులు, పొదుపు, పెట్టుబడుల వివరాలను విశ్లేషించుకుంటే ఒక వ్యక్తి ఆదాయాన్ని సక్రమంగా వినియోగించుకోవచ్చు. రకరకాల విభాగాల్లో ఉన్న ఉద్యోగుల సంఖ్య, పని గురించి తెలిస్తే ఒక సంస్థ మానవ వనరులను సమర్థంగా ఉపయోగించుకోగలుగుతుంది. అందుబాటులో ఉన్న సమాచారాన్ని వినియోగించుకొని సమస్యలు పరిష్కరించడం, సరైన నిర్ణయాలు తీసుకోవడంపైనే వ్యక్తులు, సంస్థల ప్రయోజనాలు ఆధారపడి ఉంటాయి. ఇందుకోసం నాలుగు రకాల చిత్రాలను రీజనింగ్‌ సూచిస్తోంది. వాటి గురించి తెలుసుకుంటే సమస్యల చిక్కుముడులకు చెక్‌ పెట్టవచ్చని చెబుతోంది. అలాంటి నైపుణ్యాలను పరీక్షించడానికే రీజనింగ్‌లో ‘దత్తాంశ విశ్లేషణ’ అధ్యాయం నుంచి ప్రశ్నలు అడుగుతారు. కొన్ని మౌలికాంశాలను నేర్చుకుంటే అభ్యర్థులు చిత్రాల ప్రశ్నలకు తేలిగ్గా సమాధానాలు గుర్తించవచ్చు.  

సేకరించిన దత్తాంశాన్ని ‘ప్రాథమిక దత్తాంశం’ అంటారు. ఈ దత్తాంశాన్ని వివిధ రకాల సాంఖ్యకశాస్త్ర భావనలను ఉపయోగించి వర్గీకరించిన దత్తాంశంగా మార్చవచ్చు. దీన్ని సులువుగా విశ్లేషించడానికి ప్రధానంగా నాలుగు రకాల చిత్రపటాలను ఉపయోగిస్తారు. అవి 


1) వృత్తరేఖా చిత్రం (Pie Chart)

 2) పట్టికా రూపం (Table Form)

3)  కమ్మీరేఖా చిత్రం (Bar Diagram)

4)  రేఖా చిత్రం (Line Diagram)


* ఈ అంశానికి సంబంధించిన ప్రశ్నలను సులువుగా సాధించడానికి ప్రాథమికంగా కింది అంశాలపై అవగాహన ఉండాలి.

దత్తాంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించడం

*ప్రాథమిక గణిత పరిక్రియలు

*నిష్పత్తులు

*సగటు

* శాతాలు

పై అంశాలతో పాటు కొన్నిసార్లు లాభనష్టాలకు సంబంధించిన భావనలు కూడా ఉపయోగపడతాయి. 


a,b ల నిష్పత్తిని a :b  గా రాస్తాం.


* శాతం అంటే నూటికి లేదా ప్రతి 100కు అని అర్థం 

వృత్తరేఖా చిత్రం: * వృత్తరేఖా చిత్రానికి సంబంధించి సమాచారం ప్రధానంగా డిగ్రీలు లేదా శాతాల్లో ఉంటుంది.

డిగ్రీల మొత్తం = 360o    

శాతాల మొత్తం = 100% 

* డిగ్రీల నుంచి శాతాల్లోకి లేదా శాతాల నుంచి డిగ్రీల్లోకి మార్చడానికి కింది సూత్రాన్ని ఉపయోగిస్తారు. 

ఉదా: 1. 90o లకు సమానమైన విలువ శాతాల్లో ఎంత? 

 2. 20% కి సమానమైన విలువ డిగ్రీల్లో ఎంత?


           

I.  కింది వృత్తరేఖా చిత్రంలో ఒక కంపెనీలోని వివిధ డిపార్టుమెంట్లలో పనిచేస్తున్న 1800 మంది వివరాలు ఇచ్చారు. 


1.  కింది ఏ డిపార్టుమెంట్‌లో అతి తక్కువ మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు?

1) ఫైనాన్స్‌   2) సిస్టమ్స్‌    3) హెచ్‌ఆర్‌     4) స్టోర్స్‌


వివరణ: సెక్టార్‌ కోణం హెచ్‌ఆర్‌లో తక్కువగా ఉంది కాబట్టి హెచ్‌ఆర్‌ డిపార్టుమెంట్‌లో తక్కువ మంది పనిచేస్తున్నారు.

జ:  3


2.   మార్కెటింగ్, సిస్టమ్స్‌ కాకుండా మిగతా డిపార్టుమెంట్లలో పనిచేస్తున్న ఉద్యోగుల సగటు ఎంత? 

1) 270o   2)240o    3) 260o   4) 360°

వివరణ: నాలుగు డిపార్టుమెంట్లలో = 36 + 90 + 30 + 60 = 216 

జ: 1


II. కింది వృత్తరేఖా చిత్రంలో ఒక కళాశాలలో వివిధ కోర్సుల్లో చదువుతున్న 1250 మంది విద్యార్థుల వివరాలు ఇచ్చారు. 

1. HEC చదివే విద్యార్థుల సంఖ్య ఎంత?

1) 140      2) 150        3) 180       4) 50

వివరణ: 100%  ̶  ̶  ̶  ̶   1250

                12%  ̶  ̶  ̶  ̶   ?

          

             = 150 మంది

జ: 2


2. CEC చదివే విద్యార్థుల సంఖ్య కంటే తీiశిది చదివే విద్యార్థుల సంఖ్య ఎంత ఎక్కువ?

1) 25        2) 50        3) 40        4) 60

వివరణ:  CEC : BiPC

               16%  ̶  18% = 2%

               100%   ̶  ̶  ̶  ̶  1250

                2%   ̶  ̶  ̶  ̶   ?

      

జ: 1

3. MPC చదివే విద్యార్థుల సంఖ్యను సూచించే సెక్టార్‌ కేంద్రం వద్ద చేసే కోణం?

1) 90o     2) 60o    3) 75o     4) 72o

వివరణ: MPC = 20%

జ: 4


III. కింది వృత్తరేఖా చిత్రంలో ఒక పరిశ్రమలో మొత్తం రూ.2880 లక్షల బడ్జెట్‌లో వివిధ అంశాలకు కేటాయింపులు ఇచ్చారు.

1. జీతాలకు కేటాయించిన డబ్బు ఎంత?

1) రూ.1490 లక్షలు     2) రూ.1320 లక్షలు 

3) రూ.1152 లక్షలు     4) రూ.1600 లక్షలు

వివరణ:  100%  ̶  ̶  ̶  ̶  2880

                 40%  ̶  ̶  ̶  ̶ ?

      

జ: 3


2. జీతాల కేటాయింపులో బీమా, సాంఘిక భద్రత కేటాయింపును తీసివేయగా వచ్చేవి ఏ కేటాయింపునకు సమానం?

1) ఇతరాలు    2) వైద్య ఖర్చులు       3) క్యాంటీన్‌     4) ఏదీకాదు

వివరణ: జీతాలు  బీమా, సాంఘిక భద్రత

  = 40 - 25 = 15 = వైద్య ఖర్చులు

జ: 2


3. క్యాంటీన్, ఇతరాలకు కలిపిన కేటాయింపులు ఏ కేటాయింపుల్లో సగం?

1) బీమా, సాంఘిక భద్రత      2) ఏదీకాదు       3) వైద్య ఖర్చులు       4) జీతాలు

వివరణ: క్యాంటీన్‌ + ఇతరాలు  

                  = 12 + 8 = 20%

         జీతాల కేటాయింపులో సగం

జ: 4


IV.  కింది పటంలో ఒక గ్రామంలోని 400 మంది ఉద్యోగుల వివరాలు ఇచ్చారు.

1. మహిళా లాయర్లు ఎంతమంది?

1) 48    2) 50    3) 62    4) 32

వివరణ: 100%  ̶  ̶  ̶  ̶  400 

               12%  ̶  ̶  ̶  ̶  ?

లాయర్లు = 48

              1 : 2

         3   ̶  ̶  ̶  ̶  48 

        2   ̶  ̶  ̶  ̶ ?

మహిళా లాయర్లు = 32

జ: 4


2. పురుషులైన పోలీసులు, స్త్రీ ఉపాధ్యాయుల సంఖ్యకు మధ్య నిష్పత్తి?

1) 11 : 13      2) 13 : 11     3) 16 : 35      4) 35 : 16

వివరణ: 100%  ̶  ̶  ̶  ̶  400

                11%  ̶  ̶  ̶  ̶  ?

      100%  ̶  ̶  ̶  ̶   400 

        30%   ̶  ̶  ̶  ̶   ?


    

   నిష్పత్తి 32 : 70 = 16 : 35

జ: 3


3. టీచర్ల భాగానికి చెందిన సెక్టార్‌ కేంద్రం వద్ద చేసే కోణం?

1) 1080     2) 1120     3) 720     4) 900

జ: 1

రచయిత: గోలి ప్రశాంత్‌రెడ్డి 

Posted Date : 05-06-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు