ప్రాక్టీస్ ప్రశ్నలు
1. ఒక త్రిభుజంలోని మూడు కోణాలు 1 : 4 : 7 నిష్పత్తిలో ఉంటే, వాటిలో అతిపెద్ద కోణం
1) 102∘ 2) 105∘ 3) 115∘ 4) 120∘
2. ఒక త్రిభుజంలోని మూడు కోణాలు 1 : 1 : 2 నిష్పత్తిలో ఉంటే ఆ త్రిభుజం?
1) సమద్విబాహు త్రిభుజం 2) లంబకోణ త్రిభుజం
3) సమబాహు త్రిభుజం 4) లంబకోణ సమద్విబాహు త్రిభుజం
3. రెండు విద్యుత్ స్తంభాల పొడవులు వరుసగా 20 మీ., 25 మీ. వాటి అగ్రభాగాల మధ్య దూరం 13 మీ. అయితే ఆ విద్యుత్ స్తంభాల మధ్య దూరమెంత? (మీ.లలో)
1) 12 2) 14 3) 13 4) 9
4. కిందివాటిలో అల్పకోణ త్రిభుజాన్ని సూచించే కొలతలు ఏవి?
1) 6 సెం.మీ., 8 సెం.మీ., 10 సెం.మీ. 2) 6 సెం.మీ., 8 సెం.మీ., 9 సెం.మీ.
3) 6 సెం.మీ., 8 సెం.మీ., 11 సెం.మీ. 4) 6 సెం.మీ., 8 సెం.మీ., 12 సెం.మీ.
సమాధానాలు: 1-2; 2-4; 3-1; 4-2.