మాదిరి ప్రశ్నలు
1. ఐక్యరాజ్య సమితి ‘సుస్థిరాభివృద్ధి కోసం విద్యా దశాబ్దం’ను ఎప్పుడు ప్రకటించింది? (డిప్యూటీ సర్వేయర్, 2017)
జ: 2005 - 2015
2. ‘ఎజెండా - 21’ దేనికి సంబంధించింది? (డీఎల్, 2017)
జ: సుస్థిరాభివృద్ధి
3. కిందివాటిలో సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో భాగం కానిది? (గ్రూప్ - 3, 2017)
1) పేదరిక నిర్మూలన 2) ప్రపంచశాంతి, న్యాయాన్ని కాపాడటం
3) అందరికీ నాణ్యమైన విద్య 4) క్రీడా నైపుణ్యాలను పెంచడం
జ: 4 (క్రీడా నైపుణ్యాలను పెంచడం)
4. 2015 న్యూయార్క్ సాధారణ సభలో ఐక్యరాజ్య సమితి మొత్తం ఎన్ని సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను ప్రకటించింది? (ఏఈ, 2016)
జ: 17
5. యూఎన్వో సాధారణ సభ 2015 సెప్టెంబరులో నిర్వహించిన 70వ సదస్సులో ఏ తీర్మానాన్ని ప్రకటించింది? (గురుకుల పీజీటీ, 2018)
జ: సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు
6. సుస్థిరాభివృద్ధిపై మొదటి సదస్సును ఎక్కడ నిర్వహించారు?
జ: జోహన్నెస్ బర్గ్