• facebook
  • whatsapp
  • telegram

నదికి దగ్గరగా ఖాదర్‌.. దూరంగా భంగర్‌! 

భారతదేశ నైసర్గిక స్వరూపం, శీతోష్ణస్థితి

భారతదేశంలో విభిన్న భౌగోళిక స్వరూపాలు, వాతావరణ పరిస్థితులు ఉన్నాయి. మూడు దిక్కుల్లో సముద్రం, నాలుగో వైపు హిమాలయాల సహజసిద్ధ రక్షణతో అత్యంత వైవిధ్యంగా, వివిధ విశేషాల సమాహారంగా ఈ ప్రాంతం ఉంది. మొత్తం భూభాగాన్ని హిమాలయాలు, గంగా సింధూ మైదానం, ఎడారి, దక్కన్‌ పీఠభూమి, సముద్ర తీర మైదానాలు తదితర భౌగోళిక మండలాలుగా విభజించుకొని పోటీ పరీక్షార్థులు అధ్యయనం చేయాలి. దేశవ్యాప్తంగా విస్తరించిన పర్వతాలు, నేలలు, వాటి వర్గీకరణ, స్వభావాలు, ప్రదేశాల వారీగా ప్రధానమైన భౌగోళిక అంశాల గురించి తెలుసుకోవాలి. 

ఆన్‌లైన్ ప‌రీక్ష కోసం క్లిక్ చేయండి...


1. కేంద్ర గణాంక సంస్థ లెక్కల ప్రకారం, భారతదేశ భూభాగంలో పర్వతాలు, కొండలు, పీఠభూములు, మైదానాలు ఆక్రమించిన వరుస క్రమ శాతం?

1) 27.7%, 43.2%, 18.5%, 10.6%    2) 10.6%, 18.5%, 27.7%, 43.2%

3) 18.5%, 27.7%, 43.2%, 10.6%    4) 10.6%, 18.5%, 43.2%. 27.7%


2. హిమాలయ వ్యవస్థను ఉత్తరం నుంచి దక్షిణానికి ఎన్ని ముడుత పర్వత శ్రేణులుగా విభజించారు?

1) 4     2) 3     3) 5     4) 2


3. హిమాలయాలు భారతదేశానికి ఏ దిక్కున సరిహద్దుగా ఉన్నాయి?

1) దక్షిణ  2) ఉత్తర  3) తూర్పు  4) పశ్చిమ


4. ప్రపంచంలో ఎత్తయిన భూమార్గం ద్వారా వెళ్లే మనాలీ - లేహ్‌ రహదారిని ఏ కనుమ ద్వారా నిర్మించారు?

1) బారాలాచా లా      2) షిష్‌కి లా      

3) నిధి లా      4) నాథు లా


5. దిల్వారా దేవాలయం ఏ పర్వత శ్రేణిలో ఉంది?

1) హిమాలయ      2) ఆరావళి  

3) సహ్యాద్రి      4) సాత్పురా


6. భారతదేశంలోని ఎత్తయిన హిమాలయ శిఖరం?    

1) ఎవరెస్ట్‌        2) కాంచనగంగ  

3) K2 (గాడ్విన్‌ ఆస్టిన్‌)    4) ధవళగిరి


7. ‘డూన్‌ లోయలు’ అంటే ఏమిటి?

1) పొడవైన లోయలు          2) సన్నని లోయలు

3) సన్నని, పొడవైన లోయలు  4) లోతైన లోయలు


8. ‘హిమాలయ’ అంటే అర్థం?

1) మంచు శిఖరం      2) మంచు పర్వతం  

3) మంచు నిలయం      4) మంచు కొండ


9. రెండు పర్వతాలు/కొండల మధ్య సహజంగా ఏర్పడిన రహదారిని ఏమంటారు?

1) కనుమ  2) డూన్‌  3) థాండ్స్‌   4) ధోరోస్‌


10. దట్టమైన అడవులతో చిత్తడిగా ఉన్న ప్రాంతాన్ని ఏమని పిలుస్తారు?

1) భంగర్‌  2) టెరాయి  3) ఖాదర్‌  4) భాబర్‌ 


11. ఇటీవల భారత్‌ - చైనాల మధ్య ‘వర్తకం’ ఏ కనుమ ద్వారా ప్రారంభమైంది?

1) నాథు లా      2) ఖామ్‌ లా  

3) బామిడి లా      4) యాంగ్‌ యాప్‌


12. నదికి దగ్గరగా, లేత రంగులో, ఎక్కువ సారవంతంగా ఉండే నవీన ఒండలి నేలలను ఏమంటారు?

1) భంగర్‌  2) ఖాదర్‌  3) భాబర్‌  4) టెరాయి


13. నదికి దూరంగా, ముదురు రంగులో, తక్కువ సారవతంగా ఉండే నవీన ఒండలి నేలలను ఏమంటారు?

1) భంగర్‌  2) ఖాదర్‌  3) భాబర్‌ 4) టెరాయి


14. రెండు నదుల మధ్య ఉన్న భూభాగాన్ని ఏమని పిలుస్తారు?

1) కనోల్‌   2) డోబ్‌  3) రోహి  4) కనుమ


15. ప్రస్తుతం ‘టెథిస్‌’ సముద్ర అవశేషంగా దేన్ని భావిస్తున్నారు? 

1) కాస్పియన్‌      2) నల్ల సముద్రం  

3) అరేబియా      4) మధ్యధరా


16. పిగ్మోలియన్‌ పాయింట్‌కు మరొక పేరు?

1) గౌర్‌మోత      2) కిబితు   

3) ఇందిరా పాయింట్‌     4) ఇందిరా కాల్‌


17. నదులు తమతోపాటు తెచ్చిన ఒండ్రు మట్టిని తన ముఖద్వారం వద్ద నిక్షేపణ చేసి సముద్రంలో కలిసే ప్రాంతాన్ని ఏమంటారు?

1) ఛోస్‌   2) కయల్‌   3) కయ్య   4) డెల్టా


18. ధోరోస్‌ అంటే ఏమిటి?

1) ఎండిపోయిన నదుల ప్రవాహ గుర్తులు

2) ఎండిపోయిన నదుల ప్రవాహ గుర్తుల్లో ఏర్పడిన సరస్సులు

3) కదిలే ఇసుక దిబ్బలు

4) శివాలిక్‌ పాదాల వద్ద ఉన్న చిన్న చిన్న నీటి ప్రవాహాలు


19. థాండ్స్‌ అంటే ఏమిటి?

1) ఎండిపోయిన నదుల ప్రవాహ గుర్తుల్లో, గుంతల్లో ఏర్పడిన సరస్సులు

2) ఎండిపోయిన నదుల ప్రవాహ గుర్తుల్లో ఏర్పడిన వాగులు

3) కదిలే ఇసుక దిబ్బలు

4) శివాలిక్‌ పాదాల వద్ద ఉన్న చిన్న చిన్న నీటి ప్రవాహాలు


20. కిందివాటిలో సరైన దాన్ని ఎంచుకోండి.

ఎ) భారతదేశంలో అత్యధిక సంఖ్యలో జాతీయ ఉద్యానవనాలు మధ్యప్రదేశ్‌లో ఉన్నాయి.

బి) మధ్యప్రదేశ్, అండమాన్‌ నికోబార్‌ దీవుల్లో గరిష్ఠ సంఖ్యలో జాతీయ ఉద్యానవనాలున్నాయి.

1) ఎ మాత్రమే     2) బి మాత్రమే 

3) రెండూ సరైనవి     4) రెండూ సరికాదు


21. దక్కన్‌ పీఠభూమిలో ఎక్కువ భాగం ఏ రకమైన నేలలు విస్తరించి ఉన్నాయి?    

1) ఒండ్రు నేలలు     2) పసుపు నేలలు 

3) ఎర్ర నేలలు     4) నల్ల నేలలు


22. భారతదేశంలోని కింది నదుల్లో ఏది డెల్టాను ఏర్పరచదు?

1) గంగ  2) నర్మద  3) మహానది  4) కావేరి


23. కిందివాటిలో ఏ నదికి తెలివాహ నది అని పేరు?

1) తుంగభద్ర  2) కృష్ణా  3) పెన్నా 4) గోదావరి


24. కిందివాటిని జతపరచండి.

    కొండలు       రాష్ట్రం
1) రాజ్‌మహల్‌ ఎ) గుజరాత్‌
2) పన్నా కొండలు బి) మహారాష్ట్ర
3) గిర్‌ కొండలు సి) ఝార్ఖండ్‌
4) అజంతా, బాల్‌ఘాట్‌ డి) కర్ణాటక
5) మల్‌నాడ్‌ ఇ) మధ్యప్రదేశ్‌

1) 1-సి, 2-ఇ, 3-ఎ, 4-బి, 5-డి      2) 1-ఇ, 2-సి, 3-బి, 4-ఎ, 5-డి

3) 1-డి, 2-ఎ, 3-బి, 4-సి, 5-ఇ      4) 1-సి, 2-ఇ, 3-ఎ, 4-డి, 5-బి


25. ఖండ సంబంధ దీవులకు సంబంధించి సరైన వాక్యాలను గుర్తించండి.

ఎ) ఒకప్పుడు ఖండాల్లో భాగంగా ఉండి, విడిపోయి ఏర్పడిన దీవులు.

బి) సముద్ర భూతలంపై నెలకొన్న అగ్నిపర్వత శిఖరాలు సముద్ర ఉపరితలానికి చొచ్చుకు రావడం వల్ల ఏర్పడిన దీవులు.

సి) ప్రవాళభిత్తికల అవశేషాలు సముద్ర భూతలంపై పోగుపడి ఘనీభవించినప్పుడు ఏర్పడ్డాయి.

1) ఎ, బి    2) బి, సి     3) ఎ, సి     4) ఎ, బి, సి


26. కిందివాటిని జతపరచండి.

     దీవులు     రాష్ట్రం
1) పిరమ్‌ ఎ) కర్ణాటక
2) బక్తల్‌ బి) గోవా
3) అంజెదివా సి) మహారాష్ట్ర
4) కరంజ డి) గుజరాత్‌

1) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి    2) 1-డి, 2-బి, 3-సి, 4-ఎ

3) 1-డి, 2-ఎ, 3-బి, 4-సి    4) 1-ఎ, 2-డి, 3-సి, 4-బి


27. భూపరివేష్టిత రాష్ట్రాలకు ఉదాహరణ-

ఎ) ఝార్ఖండ్‌     బి) మధ్యప్రదేశ్‌ 

సి) హరియాణా     డి) ఒడిశా

1) ఎ, బి, సి, డి     2) ఎ, బి, సి 

3) బి, సి, డి     4) ఎ, డి


28. అతిపెద్ద భూపరివేష్టిత దేశం?

1) భారతదేశం     2) చైనా 

3) మంగోలియా     4) రష్యా


29. జమ్ము-కశ్మీర్‌ నుంచి అరుణాచల్‌ ప్రదేశ్‌ వరకు వ్యాపించి ఉన్న హిమాలయాలు?

1) ఉన్నత హిమాలయాలు     2) నిమ్న హిమాలయాలు

3) బాహ్య హిమాలయాలు     4) టిబెట్‌ హిమాలయాలు


30. హిమాలయ వ్యవస్థను ఈశాన్య రాష్ట్రాల్లో ఏమని పిలుస్తారు?

1) పూర్వాంచల్‌ పర్వతాలు 2) పాట్‌కాయ్‌ కొండలు 

3) అరకాన్‌ యోమా కొండలు     4) లుషాయ్‌ కొండలు


31. కిందివాటిలో సరైన వాక్యాలు గుర్తించండి.

ఎ) గంగా - సింధు - బ్రహ్మపుత్ర మైదానం అలహాబాద్‌ వద్ద ఎక్కువ వెడల్పుగా ఉంటుంది.

బి) ఝార్ఖండ్‌లోని రాజ్‌మహల్‌ కొండల వద్ద తక్కువ వెడల్పుతో ఉంది.

1) ఎ మాత్రమే     2) బి మాత్రమే 

3) ఎ, బి     4) ఏదీకాదు


32. గంగా - సింధు మైదానాన్ని ప్రాంతీయంగా ఎన్ని మైదానాలుగా విభజించారు?

1) 3     2) 4     3) 2     4) 5


33. దక్షిణ భారతదేశంలో ఎత్తయిన పర్వత శిఖరం?

1) దొడబెట్ట     2) అనైముడి     

3) గాడ్విన్‌ ఆస్టిన్‌     4) నందాదేవి


34. ఏ దేశాన్ని ఆసియా ఇటలీ అని పిలుస్తారు?

1) మయన్మార్‌     2) భారతదేశం 

3) శ్రీలంక     4) పాకిస్థాన్‌


35. ఆరావళి శ్రేణులు దేనికి ఉదాహరణ?

1) స్ట్రెయిట్‌ పర్వతం     2) బ్లాక్‌ పర్వతం 

3) అవశేష పర్వతం     4) అగ్నిపర్వతం


36. కిందివాక్యాలు పరిశీలించి, సరైన సమాధానాన్ని ఎన్నుకోండి.

ఎ) హిమాలయ వ్యవస్థలో అన్నింటికన్నా దక్షిణంగా విస్తరించి ఉన్న పర్వతశ్రేణి శివాలిక్‌ కొండలు.

బి) వీటినే ‘హిమాలయ పర్వత పాద ప్రాంతాలు’ అని పిలుస్తారు.

1) ఎ మాత్రమే     2) బి మాత్రమే 

3) ఎ, బి     4) ఏదీకాదు


37. ఏ హిమాలయ వ్యవస్థలో దేశంలో అత్యంత ఎత్తులో ఉన్న పీఠభూమి ఉంది?

1) ఉన్నత హిమాలయాలు 2) నిమ్న హిమాలయాలు

3) బాహ్య హిమాలయాలు  4) టిబెట్‌ హిమాలయాలు


38. ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన పర్వతశ్రేణి?

1) హిమాద్రి హిమాలయాలు     2) హిమాచల్‌ హిమాలయాలు

3) శివాలిక్‌ కొండలు     4) ట్రాన్స్‌ హిమాలయాలు


39. నదులు ప్రవహించే స్థానం ఆధారంగా హిమాలయ వ్యవస్థను నిలువుగా ఎన్ని భాగాలుగా విభజించవచ్చు?

1) 4      2) 3      3) 2      4) 1


40. గంగా-సింధూ మైదాన పశ్చిమ ప్రాంతంలో కార్బొనేట్స్, బైకార్బొనేట్స్‌ లవణాలతో కూడిన క్షార స్వభావం ఉన్న నేలలను ఏమంటారు?

1) రే నేలలు     2) కల్లార్‌ నేలలు 

3) ఉసర నేలలు     4) పైవన్నీ


41. కింది వాక్యాన్ని పరిశీలించి, సరైన సమాధానాన్ని గుర్తించండి.

గంగా - సింధు మైదాన ప్రాంతీయ భాగాలుగా ఉన్నవి-

ఎ) రాజస్థాన్‌ మైదానం     బి) గంగా మైదానం

సి) పంజాబ్‌ - హరియాణా మైదానం 

డి) బ్రహ్మపుత్ర మైదానం

1) ఎ, బి, సి         2) బి, సి, డి      

3) బి, సి          4) పైవన్నీ


సమాధానాలు

1-2; 2-1; 3-2; 4-1; 5-2; 6-3; 7-3; 8-3; 9-1; 10-2; 11-1; 12-2; 13-1; 14-2; 15-4; 16-3; 17-4; 18-1; 19-1; 20-3; 21-4; 22-2; 23-4; 24-1; 25-4; 26-3; 27-2; 28-3; 29-2; 30-1; 31-3; 32-2; 33-2; 34-2; 35-3; 36-4; 37-4; 38-1; 39-1; 40-4; 41-4.

ఆన్‌లైన్ ప‌రీక్ష కోసం క్లిక్ చేయండి...

Posted Date : 05-10-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు