• facebook
  • whatsapp
  • telegram

సుపరిపాలన - 2

1. 1989లో ఏ దేశాల పాలనపై ప్రచురించిన నివేదికలో ప్రపంచబ్యాంకు మొదటిసారిగా సుపరిపాలన అనే భావనను పేర్కొంది?

1) దక్షిణాసియా దేశాలు      2) సబ్‌ సహారా ఆఫ్రికా దేశాలు

3) లాటిన్‌ అమెరికా దేశాలు    4)ఆగ్నేయాసియా దేశాలు


2. మెరుగైన పాలనను అందించడానికి అవసరమైన అంశాలను 1992లో ‘గవర్నెన్స్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ రిపోర్టు’’ను ఎవరు విడుదల చేశారు?

1)  ప్రపంచ బ్యాంకు      2) ఐక్యరాజ్య సమితి

3) కామన్వెల్త్‌ కూటమి    4) అంతర్జాతీయ పార్లమెంటరీ ఫోరం


3. ‘గవర్నెన్స్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ రిపోర్టు’’ ప్రకారం అవినీతిని నిర్మూలించడానికి, అభిలషణీయ పాలనను అందించడానికి దేన్ని  అనుసరించాలి?

ఎ) పౌరసమాజంలో జవాబుదారీతనాన్ని మెరుగుపరచడం

బి) సమాజ ప్రగతిలో ప్రభుత్వేతర సంస్థలు, పౌర సమాజాల పాత్రను పెంపొందించడం

సి) ప్రజలందరిలో స్వయం సమృద్ధి, సాధికారతను పెంపొందించడం

డి) అభివృద్ధి ఫలాలను అన్ని వర్గాల వారికి అందించడం

1) ఎ, బి, సి    2)  ఎ, సి, డి     3) ఎ, బి, డి    4) పైవన్నీ


4. 1995లో దర్బన్‌లో జరిగిన ‘సామాజిక అభివృద్ధి శిఖరాగ్ర సమావేశం’లో సుపరిపాలన సాధనకు నిర్దేశించిన లక్ష్యాలకు సంబంధించి సరికానిది?

1) పేదరిక నిర్మూలన     2) ఉత్పాదక ఉద్యోగితా సృష్టి

3) సామాజిక ఏకీకరణ    4) రాజకీయేతర సమాజ నిర్మూలన


5. సుపరిపాలన అనేది జవాబుదారీతనం, పారదర్శకత, భవిష్యత్తు అంచనా, భాగస్వామ్యం అనే అంశాలపై ఆధారపడి ఉంటుందని 1999లో ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఏడీబీ) ఏ రిపోర్టులో పేర్కొంది?

1) ఆన్‌ గవర్నెన్స్‌ ఇన్‌ ఆసియా      2)  గవర్నెన్స్‌ అండ్‌ ట్రాన్సాక్షన్‌

3)  గవర్నెన్స్‌ అండ్‌ రెస్పాన్సిబిలిటీ      4) గవర్నెన్స్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ 


6. ఐక్యరాజ్యసమితి అనుబంధ విభాగమైన ‘యునైటెడ్‌ నేషన్స్‌ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రామ్‌’ (యూఎన్‌డీపీ) సుస్థిర మానవాభివృద్ధిని సాధించే సుపరిపాలనకు అవసరమైన సాధనాలుగా వేటిని గుర్తించింది?

ఎ) పర్యావరణ పరిరక్షణ, పునరుజ్జీవనం    

బి) మహిళల ప్రగతిని పెంపొందించడం

సి) ఉపాధి కల్పన, సుస్థిర జీవన విధానం

డి) పేదరిక నిర్మూలన

1) ఎ, బి, సి    2) ఎ, సి, డి    3) ఎ, బి, డి    4) పైవన్నీ


7. సుపరిపాలన లక్షణాన్ని గుర్తించండి.

ఎ) పౌరుల రాజకీయ, సామాజిక, ఆర్థిక నైతిక జీవితాన్ని పెంపొందించడం

బి) రక్షణ రంగానికి వెచ్చిస్తున్న నిధులను తగ్గించి, మానవాభివృద్ధి పథకాలకు మళ్లించడం 

సి) పౌరుల సంక్షేమం కోసం అభిలషణీయ విధానాలను రూపొందించి అమలుచేయడం

డి) పౌరులందరికీ సమన్యాయం, పారదర్శక పాలనను అందించడం

1)  ఎ, బి, డి    2) ఎ, బి, సి    3) ఎ, సి, డి     4) పైవన్నీ


8. మనదేశంలో ‘జాతీయ సమాచార సాంకేతిక పరిజ్ఞాన కేంద్రాన్ని (National Informatics Centre) ఎప్పుడు స్థాపించారు?

1) 1976    2) 1979       3) 1980    4) 1991


9. పరిపాలనకు సంబంధించి  "SMART  (స్మార్ట్‌)। అంటే.....

1) Simple, Moral, Accountable, Responsive, Transparent

2) Sample, Moral, According, Respectable, Transparent

3) Similar, Merit, Account, Response, Target

4) Save, Merit, Accuracy, Representative, Trust


10. ‘స్మార్ట్‌’ గవర్నెన్స్‌లోని అంతర్గత అంశాన్ని గుర్తించండి.

ఎ) పరిపాలన నిర్వర్తన సామర్థ్యాన్ని వృద్ధిచేయడం, సంకుచిత రాజకీయాల నుంచి పాలనను వేరుచేయడం

బి) పాలనలో జవాబుదారీతనం, పారదర్శకతను పెంచడం

సి) పాలనలో సామాజిక నాయకత్వం కీలకపాత్ర పోషించేలా చేయడం

డి) ప్రభుత్వ సేవల్లో నూతన విధానాలను అనుసరించడం, రాబోయే కాలానికి పాలనను సన్నద్ధం చేయడం

1) ఎ, బి, సి   2) ఎ, సి, డి    3) ఎ, బి, డి   4) పైవన్నీ


11. కింద పేర్కొన్న సంస్థలు, అవి ఉన్న కేంద్రాలకు సంబంధించి సరైన జవాబును గుర్తించండి.

ఎ) ద సెంటర్‌ ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ - హైదరాబాద్‌

బి) ద సెంటర్‌ ఫర్‌ లా అండ్‌ గవర్నెన్స్‌ - న్యూదిల్లీ 

సి) ద నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ స్మార్ట్‌ గవర్నమెంట్‌ - హైదరాబాద్‌

డి) ద సెంటర్‌ ఫర్‌ పబ్లిక్‌ పాలసీ అండ్‌ గవర్నెన్స్‌ - న్యూదిల్లీ 

1)  ఎ, బి, డి    2) ఎ, సి, డి    3) ఎ, బి, సి    4) పైవన్నీ


12. మనదేశంలో ‘జాతీయ సుపరిపాలన దినోత్సవాన్ని’ ఏ రోజున నిర్వహిస్తారు? 

1)  అక్టోబరు, 2     2) నవంబరు, 11    3) డిసెంబరు, 25    4) ఆగస్టు, 22


13. ప్రభుత్వ సేవలను ప్రజలందరికీ అందించి, సమాచారాన్ని స్థానిక భాషలోనే చేరవేసే లక్ష్యంతో 2000లో ‘‘జ్ఞాన్‌దూత్‌’’ అనే ప్రాజెక్టును ప్రారంభించిన రాష్ట్రం?

1) మధ్యప్రదేశ్‌   2) హిమాచల్‌ ప్రదేశ్‌ 

3) గుజరాత్‌    4) ఉత్తరప్రదేశ్, కేరళ


14. ప్రభుత్వ, ప్రైవేట్‌ భాగస్వామ్యంతో లోక్‌వాణి అనే ఈ-గవర్నెన్స్‌ ప్రాజెక్టును 2004లో ఏ రాష్ట్రంలో ప్రారంభించారు?

1) మహారాష్ట్ర    2) కేరళ 

3) ఉత్తర్‌ప్రదేశ్‌    4) తమిళనాడు


15. ప్రభుత్వ సేవలను పౌరకేంద్రకంగా అందించే లక్ష్యంతో ‘ఫ్రెండ్స్‌’ అనే ‘ఈ-గవర్నెన్స్‌’ ప్రాజెక్టును ఏ రాష్ట్రంలో నిర్వహిస్తున్నారు?

1)  తెలంగాణ    2) రాజస్థాన్‌     3) కేరళ    4) మహారాష్ట్ర


16. FRIENDS ప్రాజెక్టుకు సంబంధించి కింది వాటిలో సరైంది? 

1) Fast Reliable Instant Efficient Network for the Disbursement of Service

2) Friendly Relevant Innovation Electronic Network for the Disbursement of Service

3) Frequent Reality Interest Evolution Network for the Disbursement of Service

4) Footstep Reality Innovation Electronic Network for the Disbursement of Service


17. సమాచార సేవలతో పాటు, ధ్రువీకరణ పత్రాలు కూడా అందించే పౌర కేంద్రక సేవలను ‘ఈ-మిత్ర’ ప్రాజెక్టు పేరుతో ఏ రాష్ట్రంలో అమలు చేస్తున్నారు? 

1) రాజస్థాన్‌    2) మధ్యప్రదేశ్‌     3)  తమిళనాడు    4) ఆంధ్రప్రదేశ్‌


సమాధానాలు

1-2  2-1  3-4 4-4 5-1  6-4 7-4  8-1  9-1  10-4  11-4  12-3  13-1  14-3  15-3  16-1  17-1  


మరికొన్ని..

1. ప్రభుత్వానికి ప్రజల ద్వారా రావాల్సిన బిల్లులను ఆన్‌లైన్‌ ద్వారా సులభ పద్ధతిలో చెల్లించడానికి ‘రేస్‌’ అనే ఈ-గవర్నెన్స్‌ ప్రాజెక్టును ఏ రాష్ట్రంలో ప్రారంభించారు?

1)  పశ్చిమ్‌బంగా    2) హరియాణా    3) బిహార్‌     4) చత్తీస్‌గఢ్‌


2. ఈ-గవర్నెన్స్‌ ప్రాజెక్టు RACEe  అంటే....

1) Revenue Administration through Computerized Energy

2) Relevant Accuracy with Computerized Event

3) Reserved Ambition for Coordination Ethics

4) Reputed Avenger with Connectivity Event


3. మహారాష్ట్రలో కొనసాగుతున్న "MAHA Govt cloud"  అనేది దేన్ని ఉద్దేశించింది?

1) పారిశ్రామికవేత్తలకు సులభతర వాణిజ్య సదుపాయాలు

2) బ్యాంకింగ్‌ రంగాన్ని బలోపేతం చేయడం

3) రైతులకు వ్యవసాయ సంబంధమైన సమాచారాన్ని అందించడం

4) ద్రవ్యోల్బణ నియంత్రణ విధానాల ప్రాజెక్టు


4.  CRIPS అంటే ఏమిటి?

1) Computarized Rural Information System Project

2) Coordination Rural lnformation System Programme

3) Controle Relevant Innovation Source Project

4) Common Rural Information Sustainable Project

5. ఏ రాష్ట్రంలో డెయిరీ ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్‌ కియోస్క్‌ (DISK) అనే ఈ-గవర్నెర్స్‌ ప్రాజెక్టు అమల్లో ఉంది?

1) పంజాబ్‌     2) ఒడిశా   3) గుజరాత్‌     4) ఆంధ్రప్రదేశ్‌


6. కింది వాటిలో పౌరపట్టికలకు సంబంధించి సరైంది?

ఎ) ప్రభుత్వ సంస్థ అందించే వివిధ సేవలకు సంబంధించిన కనీస ప్రమాణాలను వివరించడం

బి) ప్రజలకు ప్రభుత్వం అందించే సేవల నాణ్యతను నిరంతరం మెరుగుపరచడం

సి) ప్రభుత్వం అందించే సేవలను నిర్ణీత సమయానికి పౌరులకు అందజేయడం

డి) పాలనా సేవలు అందించే అధికారి, ఆ ప్రభుత్వ విభాగం అందించిన సేవలకు జవాబుదారీగా ఉండేలా చేయడం

1) ఎ, బి, డి   2) ఎ, సి, డి    3) ఎ, బి, సి    4)  పైవన్నీ


7. 1991లో బ్రిటన్‌లో ఏ ప్రధాని కాలంలో ‘‘పౌరపట్టిక’’ విధానాన్ని మొదటిసారిగా ప్రారంభించారు?

1) మార్గరెట్‌ థాచర్‌    2) టోనీ బ్లెయిర్‌    3) జాన్‌ మేజర్‌       4) ఎడ్విన్‌ జాన్సన్‌


8. ‘‘డిజిటల్‌ ఇండియా’’ కార్యక్రమాన్ని ఎప్పుడు ప్రారంభించారు?

1)  2015, జులై 1      2)  2016, ఆగస్టు 30

3) 2017, అక్టోబరు 2      4) 2018, నవంబరు 11


సమాధానాలు

1-3   2-1   3-3    4-1  5-3   6-4   7-3    8-1

Posted Date : 25-01-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌