• facebook
  • whatsapp
  • telegram

భారత రాజ్యాంగం చారిత్రక నేపథ్యం -Ⅱ-1

1. రెగ్యులేటింగ్‌ చట్టం, 1773 ద్వారా రద్దు చేసిన బాంబే, మద్రాస్‌ ప్రెసిడెన్సీల శాసన అధికారాలను ఏ చట్టం ద్వారా పునరుద్ధరించారు?

1) చార్టర్‌ చట్టం, 1853          2) భారత ప్రభుత్వ చట్టం, 1858

3) ఇండియన్‌ కౌన్సిల్‌ చట్టం, 1861    4) ఇండియన్‌ కౌన్సిల్‌ చట్టం, 1892


2. లార్డ్‌ కానింగ్‌ ప్రవేశపెట్టిన ‘పోర్ట్‌ఫోలియో’ (మంత్రులకు వారి శాఖలను కేటాయించే) విధానానికి దేని ద్వారా చట్టబద్ధత కల్పించారు?

1) భారత ప్రభుత్వ చట్టం, 1858           2)ఇండియన్‌ కౌన్సిల్‌ చట్టం, 1861

3) ఇండియన్‌ కౌన్సిల్‌ చట్టం, 1892      4) మింటో - మార్లే సంస్కరణల చట్టం, 1909


3. ‘ఇండియన్‌ కౌన్సిల్‌ చట్టం, 1861’కి సంబంధించి కిందివాటిలో సరైనవి?
ఎ) భారతీయులకు మొదటిసారిగా శాసన నిర్మాణంలో పాల్గొనే అవకాశం కల్పించారు.

బి) గవర్నర్‌ జనరల్‌కు ‘ఆర్డినెన్స్‌’ను జారీ చేసే అధికారం కల్పించారు.

సి) ‘వార్షిక బడ్జెట్‌’ను ప్రవేశపెట్టే విధానానికి శ్రీకారం చుట్టారు.

డి) ‘భారత రాజ్య కార్యదర్శి’ అనే పదవిని ఏర్పాటు చేశారు.

1) ఎ, బి, సి        2) ఎ, సి, డి     3) ఎ, బి, డి       4) పైవన్నీ


4. కిందివాటిలో సరైనవి ఏవి?

ఎ) సివిల్‌ ప్రొసీజర్‌ కోడ్‌  (civil procedure code): 1859

బి) ఇండియన్‌ పీనల్‌ కోడ్‌(indian penal code): 1860

సి) క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌ (criminal procedure code): 1861

డి) ఇండియన్‌ ఇన్ఫర్మేషన్‌ కోడ్‌( indian information code): 1862

1) ఎ, బి, సి     2) ఎ, డి       3) సి, డి      4) పైవన్నీ


5. ఇండియన్‌ కౌన్సిల్‌ చట్టం, 1861 ప్రకారం మనదేశంలో 1862లో హైకోర్టులను ఎక్కడ ఏర్పాటు చేశారు?

1) కలకత్తా, బొంబాయి, దిల్లీ         2) కలకత్తా, బొంబాయి, మద్రాస్‌

3) కలకత్తా, మద్రాస్, లాహోర్‌       4) కలకత్తా, బొంబాయి, లఖ్‌నవూ


6. కౌన్సిల్‌ సభ్యులకు బడ్జెట్‌పై చర్చించడానికి, ప్రభుత్వాన్ని ఉద్దేశించి ప్రశ్నలు వేయడానికి ఏ చట్టం ద్వారా అధికారం కల్పించారు?

1) ఇండియన్‌ కౌన్సిల్‌ చట్టం, 1861        2) ఇండియన్‌ కౌన్సిల్‌ చట్టం, 1892

3)  ఇండియన్‌ కౌన్సిల్‌ చట్టం, 1901      4 ) మింటో-మార్లే సంస్కరణల చట్టం, 1909


7. ఇండియన్‌ కౌన్సిల్‌ చట్టం, 1892 ప్రకారం కేంద్ర శాసనసభలో ప్రాతినిధ్యం పొందిన భారతీయులను గుర్తించండి.

1) గోపాలకృష్ణ గోఖలే, సురేంద్రనాథ్‌ బెనర్జీ      2) ఫిరోజ్‌షా మెహతా, దాదాభాయ్‌ నౌరోజి

3) రాస్‌ బిహారీ ఘోష్, బిల్‌గ్రామి                4) పైవారంతా


8. ఏ చట్టం ద్వారా ‘కేంద్ర లెజిస్లేటివ్‌ కౌన్సిల్‌’ను ‘ఇంపీరియల్‌ లెజిస్లేటివ్‌ కౌన్సిల్‌’గా మార్చారు?

1) ఇండియన్‌ కౌన్సిల్‌ చట్టం, 1892            2)మింటో-మార్లే సంస్కరణల చట్టం, 1909

3) మాంటేగ్‌-చెమ్స్‌ఫర్డ్‌ సంస్కరణల చట్టం, 1919         4)పిట్స్‌ ఇండియా చట్టం, 1784


9. మింటో-మార్లే సంస్కరణల చట్టం, 1909కి సంబంధించి కిందివాటిలో సరైనవి ఏవి?

ఎ) గవర్నర్‌ జనరల్‌ ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌లో మొదటిసారి భారతీయులకు ప్రాతినిధ్యం కల్పించారు.

బి) గవర్నర్‌ జనరల్‌ ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌లో ప్రాతినిధ్యం పొందిన మొదటి భారతీయుడు సత్యేంద్ర ప్రసాద్‌ సిన్హా.

సి) కేంద్ర, రాష్ట్ర శాసనసభ్యులకు అనుబంధ ప్రశ్నలు వేసేందుకు, బడ్జెట్‌పై తీర్మానాలు ప్రవేశపెట్టేందుకు అవకాశాన్ని కల్పించారు.

డి) కేంద్ర శాసనసభలో మొదటిసారి ‘ద్విసభా విధానాన్ని’ ప్రవేశపెట్టారు.

1) ఎ, బి, సి       2) ఎ, సి, డి         3) ఎ, బి, డి          4) పైవన్నీ


10. మనదేశంలో ముస్లింలు ఎన్నికల్లో పోటీ చేసేందుకు ప్రత్యేక మత నియోజకవర్గాలను ఏ చట్టం ద్వారా ప్రవేశపెట్టారు?

1)ఇండియన్‌ కౌన్సిల్‌ చట్టం, 1892                 2) మింటో-మార్లే సంస్కరణల చట్టం, 1909

3)మాంటేగ్‌-చెమ్స్‌ఫర్డ్‌ సంస్కరణల చట్టం, 1919            4) భారత ప్రభుత్వ చట్టం, 1935


11. భారతదేశంలో ‘మత నియోజకవర్గాల పితామహుడిగా’ ఎవరిని పేర్కొంటారు?
1) లార్డ్‌ మింటో           2) లార్డ్‌ చెమ్స్‌ఫర్డ్‌

3) లార్డ్‌ మౌంట్‌ బాటన్‌       4) చార్లెస్‌ మెట్‌కాఫ్‌


12. మింటో-మార్లే సంస్కరణల చట్టం, 1909కి సంబంధించి కిందివాటిలో సరైనవి?

ఎ) ముస్లిం ప్రజాప్రతినిధులను ముస్లిం ఓటర్లే ఎన్నుకునే విధానాన్ని ప్రవేశపెట్టారు.

బి) ముస్లింలకు వారి జనాభాకు మించి ప్రాతినిధ్యం కల్పించారు
సి) మతతత్వానికి చట్టబద్ధతను కల్పించారు.

డి) ‘భారత హైకమిషనర్‌’ అనే పదవిని ఏర్పాటు చేశారు.

1) ఎ, బి, డి       2) ఎ, బి, సి        3)ఎ, సి, డి    4) పైవన్నీ


13. ‘‘మింటో-మార్లే సంస్కరణల చట్టం (1909) హిందువులు, ముస్లింల మధ్య వేర్పాటువాదానికి బీజాలు నాటి, భారతదేశ విభజనకు కారణమైంది’’ అని పేర్కొంది ఎవరు?

1) జవహర్‌లాల్‌ నెహ్రూ     2) డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌

3) మహ్మద్‌ అలీ జిన్నా         4) సయ్యద్‌ ఖాసిం రిజ్వీ


14. ‘మాంటేగ్‌-చెమ్స్‌ఫర్డ్‌ సంస్కరణల చట్టం, 1919’కి సంబంధించి కిందివాటిలో సరైనవి?

ఎ) ఈ చట్టం 1921 నుంచి అమల్లోకి వచ్చింది.

బి) భారత్‌లో పార్లమెంటరీ విధానానికి పునాదులు వేసింది.

సి) కేంద్ర శాసనసభలో మొదటిసారి ‘ద్విసభావిధానానికి’ శ్రీకారం చుట్టారు.

డి) భారత్‌లో బాధ్యతాయుతమైన పాలనను అందించడమే లక్ష్యంగా దీన్ని చేసినట్లు బ్రిటిష్‌వారు పేర్కొన్నారు.

1) ఎ, బి, సి     2) ఎ, బి, డి      3) ఎ, సి, డి     4) పైవన్నీ


15. మాంటేగ్‌-చెమ్స్‌ఫర్డ్‌ సంస్కరణల చట్టం, 1919 ద్వారా కేంద్ర శాసనసభలో ‘కౌన్సిల్‌ ఆఫ్‌ స్టేట్స్‌’ ఏర్పడింది. దీనికి సంబంధించి కిందివాటిలో సరైనవి?

ఎ) దీన్ని ‘ఎగువ సభ’గా పేర్కొన్నారు.

బి) ఈ సభ పదవీ కాలం ఆరేళ్లు.

సి) ఇందులోని సభ్యుల సంఖ్య 60.

డి) ఈ సభకు గవర్నర్‌ జనరల్‌ ఎక్స్‌ అఫీషియో ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు.

1) ఎ, సి, డి    2) ఎ, బి, డి       3) ఎ, బి, సి     4) పైవన్నీ


16. మాంటేగ్‌-చెమ్స్‌ఫర్డ్‌ సంస్కరణల చట్టం, 1919 ద్వారా కేంద్ర శాసనసభలో ‘లెజిస్లేటివ్‌ అసెంబ్లీ’ని ఏర్పాటుచేశారు. దీనికి సంబంధించి కిందివాటిలో సరైనవి?

ఎ) దీన్ని దిగువ సభగా పేర్కొంటారు. ఈ సభ పదవీ కాలం మూడేళ్లు.
బి) ఈ సభలోని మొత్తం సభ్యులు: 144.

సి) ఈ సభకు ఎన్నికయ్యే సభ్యులు: 104.

డి) ఈ సభకు నామినేట్‌ అయ్యే సభ్యులు: 40

1) ఎ, బి, సి      2) ఎ, సి, డి     3) ఎ, బి, డి    4) పైవన్నీ


17. 1921లో కేంద్ర శాసనసభలోని ‘లెజిస్లేటివ్‌ అసెంబ్లీ’కి అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడిగా ఎవరు వ్యవహరించారు?

1) సర్‌  ఫ్రెడరిక్‌ వైట్, సచ్చిదానంద సిన్హా        2) సచ్చిదానంద సిన్హా, విఠల్‌భాయ్‌ పటేల్‌

3) సర్‌ థామస్‌ పీకాక్, సచ్చిదానంద సిన్హా      4) సచ్చిదానంద సిన్హా, సర్‌ ఫ్రెడరిక్‌ వైట్‌


సమాధానాలు


1-3    2-2    3-1     4-1    5-2      6-2    7-4    8-2    9-1  

10-2    11-1   12-2    13-1   14-4    15-1      16-4   17-1 


మరికొన్ని..


1. రాష్ట్రాల్లో అమలు చేసిన ‘ద్వంద్వ పాలన’కి సంబంధించి కిందివాటిలో సరైనవి?

ఎ) ప్రభుత్వ పాలనాంశాలను ట్రాన్స్‌ఫర్డ్‌ ( transferred) రిజర్వ్‌డ్‌( reserved) అంశాలుగా విభజించారు.

బి) రిజర్వ్‌డ్‌ అంశాలు: 28 

సి) ట్రాన్స్‌ఫర్డ్‌ అంశాలు: 22

డి) రిజర్వ్‌డ్‌ అంశాల్లో అత్యధిక ప్రాధాన్యం కలిగినవి, ట్రాన్స్‌ఫర్డ్‌ అంశాల్లో ప్రాధాన్యం లేనివి ఉంటాయి.

1) ఎ, బి     2) ఎ, సి      3) బి, డి    4) పైవన్నీ

2. మాంటేగ్‌-చెమ్స్‌ఫర్డ్‌ సంస్కరణల చట్టం, 1919కి సంబంధించి కిందివాటిలో సరైనవి?

ఎ) ‘భారత హైకమిషనర్‌’ అనే పదవిని ఏర్పాటు చేశారు.

బి) ‘భారత హైకమిషనర్‌’ కార్యాలయాన్ని దిల్లీలో ఏర్పాటు చేశారు.

సి) కేంద్ర బడ్జెట్‌ నుంచి రాష్ట్రాల బడ్జెట్‌ను తొలిసారి వేరుచేశారు.

డి) సిక్కులు, క్రైస్తవులు, ఆంగ్లో-ఇండియన్లు, యూరోపియన్లకు ప్రత్యేక నియోజకవర్గాలను కేటాయించి, మనదేశంలో మతపరమైన ప్రాతినిధ్యాన్ని విస్తృతం చేశారు.

1) ఎ, సి, డి      2) ఎ, బి, డి     3) ఎ, బి, సి    4) పైవన్నీ


3. మాంటేగ్‌ చెమ్స్‌ఫర్డ్‌ సంస్కరణల చట్టం, 1919 ప్రకారం ‘పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌’ ఏర్పాటు గురించి అధ్యయనం చేసేందుకు నియమించిన కమిషన్‌?

1) రాప్సన్‌ కమిషన్‌      2) ఉడ్స్‌ కమిషన్‌    3) లీ కమిషన్‌    4) డంబర్టన్‌ కమిషన్‌


4. సాధారణ బడ్జెట్‌ నుంచి రైల్వేబడ్జెట్‌ను ఏ చట్టం ద్వారా వేరు చేశారు?

1) మింటో-మార్లే సంస్కరణల చట్టం, 1909          2) ఇండియన్‌ కౌన్సిల్‌ చట్టం, 1861

3) మాంటేగ్‌-చెమ్స్‌ఫర్డ్‌ సంస్కరణల చట్టం, 1919    4) ఇండియన్‌ కౌన్సిల్‌ చట్టం, 1892


5. ‘‘భారతదేశంలో ద్వంద్వ అనేది దాదాపు దూషించే మాట అయ్యింది. ఒక వ్యక్తి మరొక వ్యక్తిని నీవు డైయార్కివి అని అరవడం నేను విన్నాను’’ అని ఎవరు పేర్కొన్నారు?

1) విలియం థాంప్సన్‌     2)  సర్‌ బట్లర్‌     3) విన్‌స్టన్‌ చర్చిల్‌     4) మడ్డీమాన్‌


6. మాంటేగ్‌-చెమ్స్‌ఫర్డ్‌ సంస్కరణల చట్టం, 1919ని ‘‘సూర్యుడు లేని ఉదయం’’గా పేర్కొంది?

 1) జవహర్‌లాల్‌ నెహ్రూ     2) బాలగంగాధర్‌ తిలక్‌

3) సరోజినీ నాయుడు    4) మహాత్మాగాంధీ


సమాధానాలు


1-4    2-4     3-3     4-3     5-2     6-2

Posted Date : 07-06-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌