• facebook
  • whatsapp
  • telegram

మత స్వాతంత్య్రపు హక్కు, సాంస్కృతిక, విద్యా హక్కులు

1. రాజ్యాంగంలోని 25వ అధికరణంలో 'మత ప్రచారం' (Religious Propaganda) అనే పదం గురించి సుప్రీంకోర్టు ఏ కేసులో వివరణ ఇచ్చింది?
జ: స్టేన్‌లూస్ కేసు

 

2. మత ప్రాతిపదిక ఆధారంగా ప్రభుత్వం పన్నులు విధించకూడదని చెబుతున్న అధికరణం ఏది?
జ: 27

 

3. గదబ, లంబాడా మొదలైన గిరిజన తెగలకు సంబంధించిన ప్రజల విశిష్టమైన సంస్కృతి, వేష భాషలకు రాజ్యాంగం ఏ అధికరణం ద్వారా భద్రత కల్పిస్తోంది?
జ: 29

 

4. మైనారిటీ వర్గాల ప్రజలు ప్రత్యేక విద్యా సంస్థలను ఏర్పాటు చేసుకుని, నిర్వహించుకోవడానికి వీలు కల్పిస్తున్న అధికరణం ఏది?
జ: 30

 

5. రాజ్యాంగంలోని 25 వ అధికరణం నుంచి 28 వ అధికరణం వరకు పరిశీలిస్తే భారతదేశం ఎలాంటి వ్యవస్థలా అనిపిస్తుంది?
జ: లౌకిక రాజ్యం

 

6. ప్రభుత్వ ఆర్థిక సహాయంతో నడిచే విద్యా సంస్థల్లో మత బోధనలను నిషేధిస్తున్న అధికరణం ఏది?
జ: 28

 

7. 'హిందుత్వం అనేది భారత ఉపఖండంలోని ప్రజల జీవన విధానం' అని సుప్రీంకోర్టు ఏ కేసులో పేర్కొంది?
జ: మనోహర్ జోషి కేసు

 

8. హిందూ మతంలో ప్రభుత్వం కొన్ని సామాజిక సంస్కరణలు చేపట్టవచ్చని పేర్కొంటున్న అధికరణం ఏది?
జ: 25

 

9. రాజకీయాలను మత ప్రభావం నుంచి వేరు చేయాలని తొలిసారిగా సూచించింది?
జ: మాకియవెల్లి

 

10. ఏ రాజ్యాంగ సవరణ ద్వారా 30 (1) (A) ను రాజ్యాంగంలో చేర్చారు?
జ: 44

రచయిత: జి. కళ్యాణ చక్రవర్తి


 

Posted Date : 24-01-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌