మాదిరి ప్రశ్నలు
1. మనదేశంలో అత్యధిక ప్రాంతాల్లో పంటలు సాగుచేసే పంటకాలం ఏది?
జ: ఖరీఫ్
2. 2014 - 15లో ఆహార ధాన్యాల ఉత్పత్తి ఎంత?
జ: 252.02 మి.ట.
3. గోధుమ ఉత్పత్తిలో ప్రథమస్థానంలో ఉన్న రాష్ట్రం ఏది?
జ: ఉత్తర్ ప్రదేశ్
4. 2014 - 15లో దేశంలో జొన్నల దిగుబడి ఎంత?
జ: 953 కేజీలు/హెక్టార్
5. చెరకు ఉత్పత్తిలో ప్రథమస్థానంలో ఉన్న రాష్ట్రం ఏది?
జ: ఉత్తర్ ప్రదేశ్
6. 1950 - 51 నాటికి దేశంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి ఎంత?
జ: 54.92 మి.ట.
7. 'ప్రపంచ జనపనార రాజధాని'గా ఏ నగరాన్ని పేర్కొంటారు?
జ: కోల్కతా
8. భారతదేశంలో పొగాకు పంటను ప్రవేశపెట్టినవారు?
జ: పోర్చుగీసు
9. దేశంలో అత్యధికంగా సాగు చేసే తేయాకు రకం ఏది?
జ: బ్లాక్ టీ
10. కర్ణాటకలోని 'బాబు బుడాన్ కొండల ప్రాంతం' దేనికి ప్రసిద్ధి?
జ: కాఫీ
11. రబ్బరు ఉత్పత్తిలో ప్రథమస్థానంలో ఉన్న రాష్ట్రం?
జ: కేరళ
12. కుంకుమ పువ్వు ఉత్పత్తిలో ప్రథమస్థానంలో ఉన్న రాష్ట్రం ఏది?
జ: జమ్మూ కశ్మీర్
13. ఉల్లిపాయల ఉత్పత్తిలో ప్రథమస్థానంలో ఉన్న రాష్ట్రం ఏది?
జ: మహారాష్ట్ర
14. నారింజ పండ్ల ఉత్పత్తిలో ప్రసిద్ధి చెందిన రాష్ట్రం?
జ: మహారాష్ట్ర
15. పాల ఉత్పత్తిలో ప్రథమస్థానంలో ఉన్న దేశం ఏది?
జ: భారతదేశం
16. దేశంలో అత్యధిక సంఖ్యలో పశువులు ఉన్న రాష్ట్రం ఏది?
జ: ఉత్తర్ ప్రదేశ్