• facebook
  • whatsapp
  • telegram

జాతీయ మహిళా కమిషన్,జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్

1. కింది వాటిలో జాతీయ మహిళా కమిషన్‌ (National Commission for Women) కు సంబంధించి సరైంది?

ఎ) పార్లమెంటు జాతీయ మహిళా కమిషన్‌ చట్టాన్ని 1990లో రూపొందించింది.

బి) జాతీయ మహిళా కమిషన్‌ను 1992లో ఏర్పాటు చేశారు.

సి) ఈ కమిషన్‌ ఛైర్మన్, సభ్యులను రాష్ట్రపతి నియమిస్తారు.

డి) ఈ కమిషన్‌ తన వార్షిక నివేదికను పార్లమెంటుకి సమర్పిస్తుంది.

1) ఎ, బి, డి    2) ఎ, సి, డి    3) ఎ, బి, సి     4) పైవన్నీ


2. జాతీయ మహిళా కమిషన్‌ నిర్మాణానికి సంబంధించి సరైంది?

1) ఛైర్మన్, డిప్యూటీ ఛైర్మన్, ముగ్గురు సభ్యులు

2) ఛైర్మన్, మెంబర్‌ సెక్రటరీ, అయిదుగురు సభ్యులు

3) ఛైర్మన్, మెంబర్‌ సెక్రటరీ, ముగ్గురు సభ్యులు

4) ఛైర్మన్, డిప్యూటీ ఛైర్మన్, అయిదుగురు సభ్యులు


3. జాతీయ మహిళా కమిషన్‌ విధులకు సంబంధించి కింది వాటిలో సరైంది?

ఎ) రాజ్యాంగపరంగా, చట్టబద్ధంగా మహిళలకు కల్పించిన రక్షణ అమలు తీరును పర్యవేక్షించడం.

బి) సివిల్‌ కోర్టును పోలిన అధికారాలు, విధులు కలిగి ఉండటం.

సి) మహిళల హక్కుల ఉల్లంఘనకు సంబంధించిన ఫిర్యాదులు పరిష్కరించడం.

డి) మహిళల సంక్షేమానికి అవసరమైన సిఫార్సులు చేయడం.

1) ఎ, బి, సి     2) ఎ, బి, డి   3) ఎ, సి, డి     4)పైవన్నీ 


4. జాతీయ మహిళా కమిషన్‌ ఛైర్మన్‌లకు సంబంధించి సరైంది?

ఎ) తొలి ఛైర్మన్‌ - జయంతి పట్నాయక్‌

బి) రెండో ఛైర్మన్‌ - మోహిని జైన్‌షాది

సి) మూడో ఛైర్మన్‌ - విభాపార్థసారథి

డి) నాలుగో ఛైర్మన్‌ - పూర్ణిమా అద్వానీ

1) ఎ, బి, సి    2) ఎ, సి, డి   3) ఎ, బి, డి     4) పైవన్నీ 


5. జాతీయ మహిళా కమిషన్‌కు ప్రస్తుత ఛైర్మన్‌ ఎవరు?

1) రేఖాశర్మ   2) మమతాశర్మ

3)లలితా కుమారమంగళం  4) నళినీ రంజన్‌


6. జాతీయ మహిళా కమిషన్‌కు రెండుసార్లు ఛైర్మన్‌గా ఎవరు వ్యవహరించారు?

1) గిరిజా వ్యాస్, రేఖాశర్మ

2) జయంతి పట్నాయక్, గిరిజా వ్యాస్‌

3)మమతాశర్మ, లలితా కుమారమంగళం

4)మోహినిగిరి, పూర్ణిమా అద్వానీ


7. కింది వాటిలో సరైంది?

ఎ) జాతీయ మహిళా కమిషన్‌ ఛైర్మన్, సభ్యుల పదవీ కాలం - మూడేళ్లు

బి) స్త్రీ, శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ ఏర్పాటు - 2006

సి) మహిళా సాధికారత జాతీయ విధానం రూపొందింది - 2001

డి) ముంబయి కేంద్రంగా భారతీయ మహిళా బ్యాంకు ఏర్పాటు - 2013

1) ఎ, బి, సి    2) ఎ, సి, డి    3) ఎ, బి, డి   4) పైవన్నీ 


8. కింది అంశాల్లో సరైంది?

ఎ) హిందూ వివాహ చట్టం - 1955

బి) హిందూ వారసత్వ చట్టం - 1956

సి) వరకట్న నిషేధ చట్టం - 1961

డి) ప్రసూతి సౌకర్యాల చట్టం - 1961

1)ఎ, బి, డి     2) ఎ, సి, డి   3)ఎ, బి, సి     4) పైవన్నీ 


9. జాతీయ మహిళా కమిషన్‌ నిర్వహించే ప్రాంతీయ సమావేశాలను ఏమంటారు?

1) Voice of voiceless   2) Voice of the women 

3) Voice with strength    4) Voice of warning


10. కింది వాటిలో సరైంది ఏది? 

ఎ) జాతీయ మహిళా కమిషన్‌ కార్యాలయం పేరు - నిర్భయ భవన్‌

బి) గృహహింస నిరోధక చట్టం - 2005

సి) మహిళా దినోత్సవం - మార్చి 8

డి) కుటుంబ కోర్టుల చట్టం - 1984

1) ఎ, బి, సి     2) ఎ, సి, డి   3) ఎ, బి, డి     4) పైవన్నీ 


11. మనదేశంలో గృహహింస నిరోధక చట్టం (Domestic violence act) ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది?

1) 2005, అక్టోబరు 26   2)2006, అక్టోబరు 26

3) 2005, నవంబరు 19     4) 2006, జులై 21


12. జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్‌ గురించి రాజ్యాంగంలో ఎక్కడ వివరించారు?

1) ఆర్టికల్, 339    2) ఆర్టికల్, 340   3)  ఆర్టికల్, 341    4) ఆర్టికల్, 342


13. కింది వాటిలో సరైంది ఏది?

ఎ) దేశంలో మొదటి వెనుకబడిన తరగతుల కమిషన్‌కు కాకాసాహెబ్‌ కాలేల్కర్‌ నేతృత్వం వహించారు.

బి) 1953లో ఏర్పడిన ఈ కమిషన్‌ 1955లో తన నివేదికను సమర్పించింది.

సి) ఈ కమిషన్‌ నివేదిక ప్రకారం వెనుకబడిన కులాల సంఖ్య - 2399

డి) జవహర్‌లాల్‌ నెహ్రూ ప్రభుత్వం కాలేల్కర్‌ నివేదికను అమలు చేసింది.

1) ఎ, బి, సి    2) ఎ, సి, డి    3) ఎ, బి, డి       4) పైవన్నీ 


14. దేశంలో 1979, జనవరి 1న ఏర్పడిన రెండో వెనుకబడిన తరగతుల కమిషన్‌కు ఎవరు నేతృత్వం వహించారు?

1) రంగనాథ్‌ మిశ్రా   2) దేవదాసన్‌ బాలాజీ

3)బిందేశ్వర్‌ ప్రసాద్‌ మండల్‌   4) బిపిన్‌ చంద్రసహాని


15. రెండో వెనుకబడిన తరగతుల కమిషన్‌కు సంబంధించి సరైంది?

ఎ) మొరార్జీదేశాయ్‌ ప్రభుత్వ కాలంలో ఈ కమిషన్‌ను ఏర్పాటు చేశారు

బి) ఈ కమిషన్‌ తన నివేదికను 1980లో సమర్పించింది

సి) ఈ కమిషన్‌ నివేదిక ప్రకారం వెనుకబడిన కులాల సంఖ్య - 3743

డి) ఈ కమిషన్‌ నివేదికను రాజీవ్‌గాంధీ ప్రభుత్వం అమలు చేసింది.

1) ఎ, బి, డి     2) ఎ, సి, డి   3) ఎ, బి, సి     4) పైవన్నీ 


16. కేంద్ర ప్రభుత్వ విద్య, ఉద్యోగాల్లో ఓబీసీ వర్గాల వారికి ఎంతశాతం రిజర్వేషన్లు కల్పించాలని మండల్‌ కమిషన్‌ సిఫార్సు చేసింది? 

1) 21%    2) 23%   3) 27%    4) 29%


17. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో ఓబీసీ వర్గాల వారికి 27% రిజర్వేషన్లు అమలు చేయడం సమంజసమేనని సుప్రీంకోర్టు ఏ కేసు సందర్భంగా తీర్పు ఇచ్చింది?

1)ఇందిరాసహాని  VS  యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసు

2)రాజ్‌మనోహర్‌ VS యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసు

3)రత్నవేల్‌ పాండ్యన్‌ VS యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసు

4) రంగనాథ్‌ ఛటర్జీ VS యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసు


18. ఏ ప్రధాని కాలంలో ‘జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్‌’ను ఒక చట్టబద్ధమైన సంస్థగా ఏర్పాటు చేశారు?

1) విశ్వనాథ్‌ ప్రతాప్‌సింగ్‌ 

2) రాజీవ్‌గాంధీ     

3) పి.వి.నరసింహారావు

4) మొరార్జీ దేశాయ్‌


19. ‘జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్‌’కు సంబంధించి సరైంది?

ఎ) 1992లో పార్లమెంటు చట్టం ద్వారా ఏర్పడింది

బి) 1993, ఏప్రిల్‌ 2 నుంచి అమల్లోకి వచ్చింది

సి) జస్టిస్‌ ఆర్‌.ఎన్‌.ప్రసాద్‌ తొలి ఛైర్మన్‌గా వ్యవహరించారు

డి) దీనికి ఛైర్మన్‌గా వ్యవహరించిన తెలుగు వ్యక్తి - వంగల ఈశ్వరయ్య

1) ఎ, బి, సి     2) ఎ, సి, డి   3) ఎ, బి, డి      4) పైవన్నీ 


20. జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్‌కు రాజ్యాంగ హోదా కల్పించిన రాజ్యాంగ సవరణ చట్టం....

1) 101వ రాజ్యాంగ సవరణ చట్టం, 2017      

2)102వ రాజ్యాంగ సవరణ చట్టం, 2018

3)103వ రాజ్యాంగ సవరణ చట్టం, 2019      

4) 101వ రాజ్యాంగ సవరణ చట్టం, 2020


21. కింది వాటిలో జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్‌కు సంబంధించి సరైంది?

ఎ) ఒక ఛైర్మన్, ఒక డిప్యూటీ ఛైర్మన్, ముగ్గురు సభ్యులు ఉంటారు.

బి) వీరిని రాష్ట్రపతి నియమిస్తారు

సి) పదవీకాలం - మూడేళ్లు

డి) ఈ కమిషన్‌ తన నివేదికను పార్లమెంటుకి సమర్పిస్తుంది
1) ఎ, బి, సి      2) ఎ, సి, డి   3) ఎ, బి, డి     4) పైవన్నీ


సమాధానాలు

1 - 3  2 - 2  3 - 4  4 - 2  5 - 1  6 - 1  7 - 4  8 - 4  9 - 1  10 - 4  11 - 2  12 - 2  13 - 1  14 - 3  15 - 3  16 - 3  17 - 1  18-3  19 - 4  20 - 2  21 - 1  


గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు


1. జాతీయ మహిళా కమిషన్‌ అధ్యక్షురాలి పదవీ కాలం ఎంత?

(టీఎస్‌ కానిస్టేబుల్స్, 2016)

1)నాలుగేళ్లు     2) అయిదేళ్లు  3) రెండేళ్లు      4) మూడేళ్లు


2. కింది వాటిలో సరికానివి?

(టీఎస్‌ కానిస్టేబుల్స్, 2016)

ఎ) జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్‌: రాజ్యాంగ సంస్థ

బి) జాతీయ మైనార్టీ కమిషన్‌: రాజ్యాంగ సంస్థ

సి) జాతీయ మహిళా కమిషన్‌: చట్టబద్ధ సంస్థ

డి) జాతీయ షెడ్యూల్డ్‌ తెగల కమిషన్‌: రాజ్యాంగ సంస్థ

1) ఎ, సి, డి    2) ఎ, బి   3) ఎ, బి, సి  4) బి మాత్రమే


3. 1953లో ఓబీసీ కమిషన్‌ ఎవరి నేతృత్వంలో ఏర్పడింది? 

(ఏపీ పంచాయతీ సెక్రటరీస్, 2019)

1) కె.కె.శెట్టి   2) హర్థేకర్‌ మంజప్ప

3) కాకాసాహెబ్‌ కాలేల్కర్‌    4) జాయ్‌ చిమ్‌ అల్వా


4. కింది వాటిలో సరైంది ఏది? 

(టీఎస్‌ గ్రూప్‌- II, 2016)

ఎ) జాతీయ షెడ్యూల్డ్‌ కులాల కమిషన్‌: ఒక చట్టబద్ధ సంస్థ

బి) జాతీయ మహిళా కమిషన్‌: ఒక రాజ్యాంగ సంస్థ

సి) జాతీయ షెడ్యూల్డ్‌ తెగల కమిషన్‌: ఒక రాజ్యాంగ సంస్థ

డి) జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్‌ : ఒక చట్టబద్ధ్ట సంస్థ

1) ఎ, సి, డి      2)ఎ, బి, డి    3)ఎ, బి        4) సి, డి 


5. మహిళా సాధికారత జాతీయ విధానాన్ని ఎప్పుడు ప్రకటించారు?

(ఏపీ వార్డ్‌ సచివాలయం, 2019)

1) 1991     2) 2001 

3) 2004    4) 2008


6. స్త్రీలను సమానులుగా పరిగణించాలని, శ్రమకు తగ్గ సమాన ప్రతిఫలం పొందాలని అభిప్రాయపడిన జాతీయ నాయకుడు? 

(టీఎస్‌ కానిస్టేబుల్స్, 2019)

1) బాలగంగాధర్‌ తిలక్‌ 

2) లాలా లజపతిరాయ్‌

3) మహాత్మా గాంధీ 

4) మోతీలాల్‌ నెహ్రూ


7. ఆర్థికంగా బలహీన వర్గాల (EWS) కు చెందిన వారికి 10% రిజర్వేషన్లు ఏ చట్టం ప్రకారం 2019, జనవరిలో అమల్లోకి తెచ్చారు?  

(టీఎస్‌ సబ్‌ఇన్‌స్పెక్టర్స్, 2019)

1) 101వ సవరణ చట్టం 

2) 122వ సవరణ చట్టం

3)103వ సవరణ చట్టం 

4)102వ సవరణ చట్టం


సమాధానాలు

1 - 4   2 - 2   3 - 3   4 - 4   5 - 2   6 - 3   7 - 3

Posted Date : 14-01-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌