• facebook
  • whatsapp
  • telegram

జాతీయ మానవ హక్కుల కమిషన్‌  జాతీయ మైనార్టీ కమిషన్‌

1. మనదేశంలో జాతీయ మానవహక్కుల కమిషన్‌ ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది?

1) 1992, అక్టోబరు 12     2)1993, అక్టోబరు 12

3) 1992, నవంబరు 24    4) 1993, నవంబరు 24


2. జాతీయ మానవహక్కుల కమిషన్‌కు సంబంధించి కిందివాటిలో సరైనవి?

ఎ) దీన్ని పార్లమెంట్‌ చట్టం ద్వారా ఏర్పాటు చేశారు.

బి) సివిల్‌ కోర్టుకు ఉండే అధికారాలు దీనికి ఉంటాయి.

సి) ఇది రాజ్యాంగబద్ధ సంస్థ

డి) దీని ఛైర్మన్, సభ్యులను రాష్ట్రపతి నియమిస్తారు.

1) ఎ, బి, డి     2) ఎ, సి, డి     3)ఎ, బి, సి     4) పైవన్నీ


3. జాతీయ మానవహక్కుల కమిషన్‌ నిర్మాణానికి సంబంధించి కిందివాటిలో సరైనవి?

1) ఒక ఛైర్మన్, ముగ్గురు సభ్యులు ఉంటారు.

2) ఒక ఛైర్మన్, నలుగురు సభ్యులు ఉంటారు.

3) ఒక ఛైర్మన్, అయిదుగురు సభ్యులు ఉంటారు.

4) ఒక ఛైర్మన్, ఆరుగురు సభ్యులు ఉంటారు.


4. జాతీయ మానవ హక్కుల కమిషన్‌ ఛైర్మన్, సభ్యుల పదవీకాలానికి సంబంధించి కిందివాటిలో సరైనవి?

1) పదవిని చేపట్టిన రోజు నుంచి మూడేళ్లు లేదా 70 ఏళ్ల వయసు నిండేవరకు

2) పదవిని చేపట్టిన రోజు నుంచి అయిదేళ్లు లేదా 65 ఏళ్ల వయసు నిండేవరకు

3) పదవిని చేపట్టిన రోజు నుంచి మూడేళ్లు లేదా 65 ఏళ్ల వయసు నిండేవరకు

4) పదవిని చేపట్టిన రోజు నుంచి అయిదేళ్లు లేదా 70 ఏళ్ల వయసు నిండేవరకు


5. జాతీయ మానవహక్కుల కమిషన్‌లో కింది ఎవరు ‘ఎక్స్‌అఫీషియో’ సభ్యులు కాదు?

1) జాతీయ షెడ్యూల్డ్‌ కులాల కమిషన్‌ ఛైర్మన్‌

2) జాతీయ మహిళా కమిషన్‌ ఛైర్మన్‌

3) జాతీయ సమాచార కమిషన్‌ ఛైర్మన్‌

4) జాతీయ మైనార్టీ కమిషన్‌ ఛైర్మన్‌


6. కిందివాటిలో జాతీయ మానవహక్కుల కమిషన్‌ విధి?

ఎ) రాజ్యాంగం, చట్టపరంగా మానవ హక్కుల రక్షణకు కృషి చేయడం.

బి) కారాగారాలను సందర్శించి, శిక్షను అనుభవిస్తున్న ఖైదీల హక్కుల పరిరక్షణకు కృషిచేయడం.

సి) మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడిన వారిపై కేసుల నమోదుకు ఆదేశాలివ్వడం.

డి) మానవ హక్కుల ఉల్లంఘన జరగకుండా తీసుకోవాల్సిన చర్యలను ప్రభుత్వానికి సిఫార్సు చేయడం.

1) ఎ, బి, సి     2) ఎ, సి, డి     3) ఎ, బి, డి     4) పైవన్నీ


7. జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు తొలి ఛైర్మన్‌ ఎవరు?

1) జస్టిస్‌ రంగనాథ్‌ మిశ్రా    2) జస్టిస్‌ రాజేంద్రబాబు

3) జస్టిస్‌ వై.వి.చంద్రచూడ్‌   4)  జస్టిస్‌ కె.కెన్‌.సింగ్‌


8. జాతీయ మానవ హక్కుల కమిషన్‌ తన వార్షిక నివేదికను ఎవరికి సమర్పిస్తుంది?

1)  పార్లమెంట్‌     2) రాష్ట్రపతి    3) సుప్రీంకోర్టు     4) ప్రధానమంత్రి


9. జాతీయ మానవ హక్కుల కమిషన్‌ ఛైర్మన్, సభ్యులను ఎంపిక చేసేందుకు ఏర్పడే స్క్రీనింగ్‌ కమిటీకి ఎవరు నేతృత్వంవహిస్తారు?

1) రాష్ట్రపతి     2) సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి 

3) ప్రధానమంత్రి     4) లోక్‌సభలోని ప్రధాన ప్రతిపక్ష నాయకులు


10. జాతీయ మానవ హక్కుల కమిషన్‌ ఛైర్మన్, సభ్యులను ఎంపిక చేసేందుకు ఏర్పడే స్క్రీనింగ్‌ కమిటీలో ఎవరు సభ్యులుగా ఉంటారు?

ఎ) కేంద్ర హోంమంత్రి, లోక్‌సభ స్పీకర్‌ 

బి) రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్, రాజ్యసభలో ప్రతిపక్షనాయకులు

సి) లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నాయకులు 

డి) సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఇద్దరు సీనియర్‌ హైకోర్టు న్యాయమూర్తులు

1) ఎ, బి, సి    2) ఎ, సి, డి    3) ఎ, బి, డి    4) పైవన్నీ


11. జాతీయ మానవ హక్కుల పరిరక్షణ (సవరణ) చట్టం, 2019కి సంబంధించి జాతీయ మానవ హక్కుల కమిషన్‌లో జరిగిన మార్పును గుర్తించండి.

ఎ) ఛైర్మన్‌గా నియమితులు కావాలంటే పదవీ విరమణ పొందిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి/ న్యాయమూర్తి అయి ఉండాలి.

బి) ఛైర్మన్, సభ్యుల పదవీ కాలాన్ని 5 నుంచి 3 ఏళ్లకు తగ్గించారు.

సి) పౌరహక్కుల రంగంలో నిష్ణాతులైన మేధావుల (సభ్యుల) సంఖ్యను 2 నుంచి 3 కి పెంచారు.

డి) దిల్లీ కేంద్రపాలిత ప్రాంతంలోని మానవ హక్కుల అంశాలు జాతీయ మానవ హక్కుల కమిషన్‌ పరిధిలో ఉంటాయి.

1) ఎ, బి, డి     2) ఎ, సి, డి    3) ఎ, బి, సి     4) పైవన్నీ


12. జాతీయ మానవ హక్కుల కమిషన్‌ (ఎన్‌హెచ్‌ఆర్‌సీ) ప్రస్తుత ఛైర్మన్‌ ఎవరు?

1) అరుణ్‌కుమార్‌ మిశ్రా     2) అనంత్‌ సిసోదియా 

3) మాంటేగ్‌ సింగ్‌ అహ్లువాలియా      4) కె.జి.బాలకృష్ణన్‌


13. జాతీయ అల్పసంఖ్యాక వర్గాల కమిషన్‌ (National Minority Commission) మొదటి ఛైర్మన్‌ ఎవరు? (1978లో కార్యనిర్వాహక ఉత్తర్వుల ద్వారా దీన్ని ఏర్పాటు చేశారు.)

1) ఎం.ఆర్‌.మసాని   2) బి.అహ్మద్‌ ఖురేషి   

3) తారిక్‌ అన్వర్‌    4) జస్టిస్‌ మహ్మద్‌ హిదయతుల్లా


14. 1978లో ఏర్పడిన ‘జాతీయ మైనార్టీ  కమిషన్‌’ ఏ మంత్రిత్వశాఖ పర్యవేక్షణలో ఉండేది?

1) కేంద్ర హోంమంత్రిత్వశాఖ   2) కేంద్ర మానవ వనరుల మంత్రిత్వశాఖ 

3) కేంద్ర ప్రజా వ్యవహారాల మంత్రిత్వశాఖ   4) కేంద్ర రక్షణ మంత్రిత్వశాఖ


15. 1985 నుంచి ‘జాతీయ మైనార్టీ కమిషన్‌’ ఏ మంత్రిత్వశాఖ పర్యవేక్షణలో కొనసాగుతోంది?

1) కేంద్ర మానవ వనరుల మంత్రిత్వశాఖ 

2) భారత విదేశాంగ మంత్రిత్వశాఖ

3) కేంద్ర సంక్షేమ మంత్రిత్వశాఖ 

4) కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వశాఖ


16. జాతీయ మైనార్టీ కమిషన్‌కు సంబంధించి కిందివాటిలో సరైనవి?

ఎ) పార్లమెంట్‌ 1992లో నేషనల్‌ కమిషన్‌ ఫర్‌ మైనార్టీస్‌ యాక్ట్‌ని రూపొందించింది.

బి) దీనికి ఛైర్మన్, సభ్యులను రాష్ట్రపతి నియమిస్తారు.

సి) ఛైర్మన్‌తో సహా సభ్యులంతా మైనార్టీ వర్గానికి చెందిన వారై ఉండాలి.

డి) ఛైర్మన్, సభ్యులు తమ రాజీనామాను కేంద్రమంత్రి మండలికి సమర్పించాలి.

1) ఎ, సి, డి    2) ఎ, బి, సి   3) ఎ, బి, డి     4) పైవన్నీ


17. జాతీయ మైనార్టీ కమిషన్‌ చట్టబద్ధ సంస్థగా ఎప్పుడు ఏర్పడింది?

1) 1992, డిసెంబరు 17     2) 1992, డిసెంబరు 29 

3) 1993, మే 17     4) 1994, అక్టోబరు 17


18. జాతీయ మైనార్టీ కమిషన్‌ నిర్మాణానికి సంబంధించి కిందివాటిలో సరైనవి?

1)  ఛైర్మన్, వైస్‌ ఛైర్మన్, అయిదుగురు సభ్యులు ఉంటారు.

2) ఛైర్మన్, వైస్‌ ఛైర్మన్, నలుగురు సభ్యులు ఉంటారు.

3) ఛైర్మన్, వైస్‌ ఛైర్మన్, ముగ్గురు సభ్యులు ఉంటారు.

4) ఛైర్మన్, వైస్‌ ఛైర్మన్, ఇద్దరు సభ్యులు ఉంటారు.


సమాధానాలు

1-2  2-1  3-3  4-1  5-3  6-4  7-1  8-2  9-3  10-1  11-4  12-1  13-1  14-1  15-3  16-2  17-3  18-1


మరికొన్ని..


1. జాతీయ మైనార్టీ కమిషన్‌ విధులకు సంబంధించి కిందివాటిలో సరైనవి?

ఎ) మైనార్టీల సంక్షేమానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టాల్సిన విధానాలను సిఫార్సు చేయడం.

బి) రాజ్యాంగం, చట్టపరంగా మైనార్టీలకు కల్పించే రక్షణల అమలుకు కృషిచేయడం.

సి) మైనార్టీల హక్కుల ఉల్లంఘనకు సంబంధించిన ఫిర్యాదులను విచారించడం.

డి) మైనార్టీల సామాజిక, ఆర్థిక, విద్యాభివృద్ధికి కృషిచేయడం.

1) ఎ, బి, సి     2) ఎ, సి, డి     3) ఎ, బి, డి     4) పైవన్నీ


2. కిందివాటిలో సరైనవి?

ఎ) 1964లో కేంద్ర వక్ఫ్‌బోర్డు ఏర్పడింది.

బి) 1989లో మౌలానా ఆజాద్‌ ఫౌండేషన్‌ ఏర్పడింది.

సి) 2013లో ‘జియోపార్శి’ పథకం ప్రారంభమైంది.

డి) 2014లో జైనులకు మైనార్టీ హోదా లభించింది.

1) ఎ, బి, డి    2) ఎ, సి, డి    3) ఎ, బి, సి     4) పైవన్నీ


3. ‘జాతీయ మైనార్టీ కమిషన్‌’ తొలి ఛైర్మన్‌గా ఎవరు వ్యవహరించారు? (ఇది 1993లో చట్టబద్ధ సంస్థగా ఏర్పడింది.)

1) మహ్మద్‌ సర్దార్‌ అలీఖాన్‌     2) మహ్మద్‌ హమీద్‌ అన్సారి 

3) తాహిర్‌ మహ్మద్‌     4)  వజాహత్‌ హబీబుల్లా


4. మైనార్టీల సంక్షేమాన్ని అధ్యయనం చేసేందుకు అటల్‌బిహారీ వాజ్‌పేయీ ప్రభుత్వం 2004లో ఎవరి అధ్యక్షతన కమిషన్‌ను ఏర్పాటు చేసింది?

1) రంగనాథ్‌మిశ్రా    2) దీన్‌దయాళ్‌ ముఖోపాధ్యాయ 

3) అరవింద్‌ సుగారియా    4)  వినయ్‌చంద్‌ దీపక్‌


5. జాతీయ మైనార్టీ కమిషన్‌కు ప్రస్తుత ఛైర్మన్‌ ఎవరు?

1) గురుదయాళ్‌ హసన్‌ రిజ్వి      2) మహ్మద్‌ షఫి ఖురేషి 

3) ఇక్బాల్‌సింగ్‌ లాల్‌పురా     4) తర్లోచన్‌సింగ్‌


6. ముస్లిం మైనార్టీల సంక్షేమంపై అధ్యయనం కోసం డా.మన్మోహన్‌సింగ్‌ ప్రభుత్వ కాలంలో ఏర్పడిన కమిటీ ఏది?

1) రాంమానక్‌ మిశ్రా కమిటీ 

2) రాజేంద్ర సచార్‌ కమిటీ 

3) అసన్‌ మాలిక్‌ కమిటీ 

4) సయ్యద్‌ అలీషా కమిటీ


7. మైనార్టీల సంక్షేమానికి 15 సూత్రాల పథకాన్ని ప్రవేశపెట్టిన ప్రధాని?

1) పి.వి.నరసింహారావు       2) అటల్‌బిహారీ వాజ్‌పేయీ

3) డా.మన్మోహన్‌సింగ్‌     4) నరేంద్రమోదీ


సమాధానాలు

1-4   2-4   3-1   4-1   5-3   6-2   7-3

Posted Date : 19-01-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌