• facebook
  • whatsapp
  • telegram

  జాతీయ షెడ్యూల్ కులాల కమిషన్ జాతీయ షెడ్యూల్ తెగల కమిషన్ - 2

1. షెడ్యూల్డ్‌ కులాలు, తెగల ప్రయోజనాలను కాపాడటానికి రాష్ట్రపతి రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్‌ ప్రకారం ఒక ప్రత్యేక అధికారిని నియమిస్తారు.?

1)ఆర్టికల్‌ 336   2) ఆర్టికల్‌ 337    3) ఆర్టికల్‌ 338    4)ఆర్టికల్‌ 339


2. 1978లో ఒక కార్యనిర్వాహక ఉత్తర్వు ద్వారా షెడ్యూల్డ్‌ కులాలు, తెగల కమిషన్‌ను ఏర్పాటు చేశారు. ఇది ఏ ప్రభుత్వ కాలంలో జరిగింది?

1) ఇందిరాగాంధీ    2) మొరార్జీదేశాయ్‌  3) చరణ్‌సింగ్‌        4)రాజీవ్‌గాంధీ


3. 1978లో ఏర్పాటైన షెడ్యూల్డ్‌ కులాలు, తెగల కమిషన్‌కి మొదటి అధ్యక్షులు ఎవరు?

1) బోలా పాశ్వాన్‌ శాస్త్రి    2)రంగనాథ్‌ మిశ్రా

 3)కున్వర్‌సింగ్‌    4) రామేశ్వర్‌ ఓరాన్‌


4. షెడ్యూల్డ్‌ కులాలు, తెగల కమిషన్‌ను ‘జాతీయ షెడ్యూల్డ్‌ కులాలు, తెగల కమిషన్‌’గా ఎప్పుడు మార్చారు?

1) 1982   2)1985    3)1987  4) 1989


5. ‘జాతీయ షెడ్యూల్డ్‌ కులాలు, తెగల కమిషన్‌’కు రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించిన రాజ్యాంగ సవరణ చట్టం ఏది?

1) 61వ రాజ్యాంగ సవరణ చట్టం, 1988

2) 65వ రాజ్యాంగ సవరణ చట్టం, 1990

3)67వ రాజ్యాంగ సవరణ చట్టం, 1991

4) 71వ రాజ్యాంగ సవరణ చట్టం, 1992


6. రాజ్యాంగ ప్రతిపత్తి పొందిన ‘జాతీయ షెడ్యూల్డ్‌ కులాలు, తెగల కమిషన్‌’ 1992, మార్చి 12 నుంచి అమల్లోకి వచ్చింది.దీని తొలి అధ్యక్ష, ఉపాధ్యక్షులుగా ఎవరు వ్యవహరించారు?

1) రాంధన్, బండి ఓరాన్‌  

2) కున్వర్‌సింగ్, రాంధన్‌

3) దిలీప్‌సింగ్‌ భూరియా, సజ్జన్‌సింగ్‌ 

4)రంజిత్‌కిషన్, బండి ఓరాన్‌


7. జాతీయ షెడ్యూల్డ్‌ కులాలు, తెగల కమిషన్‌ను ఏ ప్రధానమంత్రి కాలంలో ‘జాతీయ షెడ్యూల్డ్‌ కులాల కమిషన్‌’, ‘జాతీయ షెడ్యూల్డ్‌ తెగల కమిషన్‌’గా విభజించారు?

1) వి.పి.సింగ్‌     2) పి.వి.నరసింహారావు

3) అటల్‌బిహారీ వాజ్‌పేయీ   4) డాక్టర్‌ మన్మోహన్‌సింగ్‌


8. జాతీయ షెడ్యూల్డ్‌ కులాలు, తెగల కమిషన్‌ను ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ‘జాతీయ షెడ్యూల్డ్‌ కులాల కమిషన్‌’, ‘జాతీయ షెడ్యూల్డ్‌ తెగల కమిషన్‌’గా వేరుచేశారు?

1) 81వ రాజ్యాంగ సవరణ చట్టం, 2000

2) 84వ రాజ్యాంగ సవరణ చట్టం, 2001

3) 86వ రాజ్యాంగ సవరణ చట్టం, 2002

4) 89వ రాజ్యాంగ సవరణ చట్టం, 2003


9. కిందివాటిలో సరైనవి ఏవి?

ఎ) ఆర్టికల్‌ 338(1): జాతీయ షెడ్యూల్డ్‌ కులాల కమిషన్‌ గురించి పేర్కొంటోంది.

బి) ఆర్టికల్‌ 338(2): జాతీయ షెడ్యూల్డ్‌ కులాల కమిషన్‌లో ఛైర్మన్, డిప్యూటీ ఛైర్మన్, ముగ్గురు సభ్యులు ఉంటారు.

సి) ఆర్టికల్‌ 338(3): జాతీయ షెడ్యూల్డ్‌ కులాల కమిషన్‌ ఛైర్మన్, డిప్యూటీ ఛైర్మన్‌ సభ్యులను రాష్ట్రపతి నియమిస్తారు.

డి) ఆర్టికల్‌ 338(4): జాతీయ షెడ్యూల్డ్‌ కులాల కమిషన్‌ తన పని విధానాన్ని తానే నియంత్రించుకుంటూ, స్వతంత్ర సంస్థగా వ్యవహరిస్తుంది.

1) ఎ, బి, సి   2) ఎ, సి, డి   3) ఎ, బి, డి     4) పైవన్నీ


10. జాతీయ షెడ్యూల్డ్‌ కులాల కమిషన్‌ ఛైర్మన్, డిప్యూటీ ఛైర్మన్, సభ్యుల పదవీ కాలాన్ని గుర్తించండి.

1) మూడేళ్లు    2) నాలుగేళ్లు  3) అయిదేళ్లు       4) ఆరేళ్లు


11. జాతీయ షెడ్యూల్డ్‌ కులాల కమిషన్‌కి సంబంధించి కిందివాటిలో సరైనవి?

ఎ) సివిల్‌ కోర్టుకు ఉండే అధికారాలను కలిగి ఉంటుంది.

బి) రాజ్యాంగపరంగా, చట్టపరంగా ఎస్సీ వర్గాల వారికి కల్పించిన రక్షణల అమలు తీరును పర్యవేక్షిస్తుంది.

సి) వివిధ వ్యక్తులను తన ముందు హాజరు కావాలని ఆదేశాలు జారీచేస్తుంది.

డి) వివిధ డాక్యుమెంట్లను తనకు సమర్పించాల్సిందిగా  ఉత్తర్వులు జారీచేస్తుంది.

1) ఎ, సి, డి   2) ఎ, బి, సి   3) ఎ, బి, డి     4) పైవన్నీ


12. ‘జాతీయ షెడ్యుల్డ్‌ కులాల కమిషన్‌’ తన వార్షిక నివేదికను ఎవరికి సమర్పిస్తుంది?

1) పార్లమెంట్‌   2) కేంద్రమంత్రి మండలి   

3) రాష్ట్రపతి    4)కేంద్ర సామాజిక సంక్షేమ మంత్రిత్వ శాఖ


13. జాతీయ షెడ్యూల్డ్‌ కులాల కమిషన్‌కు సంబంధించి కిందివాటిలో సరైంది?

ఎ) తొలి ఛైర్మన్‌ - సూరజ్‌భాన్‌

బి) రెండో ఛైర్మన్‌ - బూటాసింగ్‌

సి) మూడో ఛైర్మన్‌ - పి.ఎల్‌.పునియా

డి) పి.ఎల్‌.పునియా రెండుసార్లు ఛైర్మన్‌గా వ్యవహరించారు.

1) ఎ, బి, డి    2) ఎ, సి, డి    3) ఎ, బి, సి    4) పైవన్నీ


14. జాతీయ షెడ్యూల్డ్‌ కులాల కమిషన్‌ ప్రస్తుత ఛైర్మన్, డిప్యూటీ ఛైర్మన్‌ ఎవరు?

1) విజయ్‌ సాంప్లా, అరుణ్‌ హల్ధార్‌ 

2) వినయ్‌ కటారియా, అన్నాజిందీ

3) నందకుమార్‌సాయి, విజయ్‌సాంప్లా 

4)అహ్లువాలియా, వినయ్‌ కటారియా


15. కిందివాటిలో సరైనవి ఏవి?

ఎ) జాతీయ షెడ్యూల్డ్‌ కులాల కమిషన్‌ ఛైర్మన్‌ కేంద్ర కేబినెట్‌ మంత్రి హోదా కలిగి ఉంటారు.

బి) జాతీయ షెడ్యూల్డ్‌ కులాల కమిషన్‌ డిప్యూటీ ఛైర్మన్‌ కేంద్ర సహాయమంత్రి హోదా కలిగి ఉంటారు.

సి) జాతీయ షెడ్యూల్డ్‌ కులాల కమిషన్‌ సభ్యులు భారత ప్రభుత్వ కార్యదర్శి హోదా కలిగి ఉంటారు.

డి) జాతీయ షెడ్యూల్డ్‌ కులాల కమిషన్‌ ప్రధాన కార్యాలయం న్యూదిల్లీలో ఉంది.

1) ఎ, బి, సి        2) ఎ, సి, డి    3) ఎ, బి, డి       4) పైవన్నీ


16. కిందివాటిలో జాతీయ షెడ్యూల్డ్‌ కులాల కమిషన్‌ వెలువరించే ‘ఇ-మ్యాగజైన్‌’ ఏది?

1) అనుశుచిత్‌ జాతి వాహిని    2) వర్న్‌బుల్‌ వాహిని

3) అన్‌టచబుల్‌ వాహిని    4) వండర్‌ వాహిని


17. జాతీయ షెడ్యూల్డ్‌ తెగల కమిషన్‌ను రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్‌ ప్రకారం ఏర్పాటు చేశారు?

1) ఆర్టికల్‌ 338 (A)   2) ఆర్టికల్‌ 339(A)

3) ఆర్టికల్‌ 340(A)    4) ఆర్టికల్‌ 341(A)


18. జాతీయ షెడ్యూల్డ్‌ తెగల కమిషన్‌కు సంబంధించి కిందివాటిలో సరైనవి?

ఎ) ఒక ఛైర్మన్, ఒక డిప్యూటీ ఛైర్మన్, ముగ్గురు సభ్యులు ఉంటారు.

బి) ఛైర్మన్‌ కేంద్ర కేబినెట్‌ మంత్రి హోదా కలిగి ఉంటారు.

సి) డిప్యూటీ ఛైర్మన్‌ కేంద్ర సహాయమంత్రి హోదా కలిగి ఉంటారు.

డి) సభ్యులు భారత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హోదా కలిగి ఉంటారు.

1) ఎ, బి, డి    2) ఎ, సి, డి   3) ఎ, బి, సి    4) పైవన్నీ


19. కిందివాటిలో జాతీయ షెడ్యుల్డ్‌ తెగల కమిషన్‌కు సంబంధించి సరైనవి?

ఎ) ఎస్టీ వర్గాల ప్రయోజనాల పరిరక్షణకు కృషి చేస్తుంది.

బి) తన వార్షిక నివేదికను పార్లమెంట్‌కి సమర్పిస్తుంది.

సి) సివిల్‌ కోర్టుకి ఉండే అధికారాలను కలిగి ఉంటుంది.

డి) తన పని విధానాన్ని తానే నియంత్రించుకుంటుంది.

1) ఎ, సి, డి    2) ఎ, బి, సి    3) ఎ, బి, డి    4) పైవన్నీ


20. జాతీయ షెడ్యుల్డ్‌ తెగల కమిషన్‌ ఛైర్మన్‌కు సంబంధించి కిందివాటిలో సరైంది?

ఎ) తొలి ఛైర్మన్‌ - కున్వర్‌సింగ్‌

బి) రెండో ఛైర్మన్‌ - ఊర్మిళాసింగ్‌

సి) మూడో ఛైర్మన్‌ - రామేశ్వర్‌ ఓరాన్‌

డి) రామేశ్వర్‌ ఓరాన్‌ రెండు సార్లు ఛైర్మన్‌గా వ్యవహరించారు.

1) ఎ, బి, సి  2) ఎ, సి, డి   3) ఎ, బి, డి    4)పైవన్నీ


21. జాతీయ షెడ్యూల్డ్‌ తెగల కమిషన్‌ ప్రస్తుత ఛైర్మన్‌ ఎవరు?

1)నందకుమార్‌ సాయి  2) హర్ష చౌహాన్‌

3) అనూప్‌సింగ్‌       4) రాంనాయక్‌


22. కిందివాటిలో సరైనవి ఏవి?

ఎ) గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖను 1999లో ఏర్పాటుచేశారు.

బి) గిరిజన ఆర్థికాభివృద్ధి సంస్థను 2001లో ఏర్పాటుచేశారు.

సి) గిరిజన సంప్రదాయ అటవీ హక్కుల చట్టాన్ని 2006లో చేశారు.

డి) గిరిజన కోపరేటివ్‌ ఫెడరేషన్‌ని 2019లో ఏర్పాటుచేశారు.

1) ఎ, బి, డి   2) ఎ, బి, సి   3) ఎ, సి, డి    4)పైవన్నీ


23. ఏ ప్రధానమంత్రి కాలంలో భారత పార్లమెంట్‌ ఎస్సీ, ఎస్టీ వర్గాలపై అకృత్యాల నిరోధక చట్టాన్ని (Prevention of SC, ST Atrocities Act)  రూపొందించింది?

1) రాజీవ్‌గాంధ (1987)  

2) విశ్వనాథ్‌ ప్రతాప్‌ సింగ్‌ (1989)

3) హెచ్‌.డి.దేవెగౌడ (1992)  

4) ఎస్‌.చంద్రశేఖర్‌ (1990)

24. ‘ఎస్సీ, ఎస్టీ అకృత్యాల నిరోధక చట్టం 1989’ ప్రకారం కిందివాటిలో సరైనవి?

ఎ) ఈ వర్గాల వారితో బలవంతంగా వెట్టిచాకిరీ చేయించకూడదు.

బి) ఈ వర్గాల వారిని కులం పేరుతో దూషించడం నేరం.

సి) ఈ వర్గాల వారు ఉపయోగించుకుంటున్న జలవనరులను కలుషితం చేయడం నేరం.

డి) ఈ వర్గాల వారు వినియోగించుకుంటున్న ఓటుహక్కును ఆటంకపరచడం నేరం.

1) ఎ, సి, డి    2) ఎ, బి, సి    3) ఎ, బి, డి    4)పైవన్నీ


25. ‘ఎస్సీ, ఎస్టీ అకృత్యాల నిరోధక చట్టం, 1989’ ప్రకారం కిందివాటిలో సరైనవి?

ఎ) ఈ వర్గాల వారు నివసిస్తున్న ప్రాంతాల్లో ఇతరులు జంతు కళేబరాలు వేయడం నేరం.

బి) ఈ వర్గాల వారిని భూత వైద్యం చేస్తున్నారనే నెపంతో గాయపరచడం నేరం.

సి) ఈ వర్గాల వారి మెడలో చెప్పులు దండలు వేయడం, నగ్నంగా ఊరేగించడం నేరం.

డి) ఈ వర్గాల వారిని ఉద్దేశపూర్వకంగా అవమానించడం నేరం.

1) ఎ, బి, సి   2) ఎ, సి, డి    3) ఎ, బి, డి    4) పైవన్నీ


సమాధానాలు

1-3  2-2  3-1  4-3  5-2   6-1  7-3  8-4  9-4  10-1  11-4  12-3  13-4  14-1  15-4   16-1  17-1  18-4  19-1  20-4  21-2  22-2  23-2  24-4  25-4


గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు

1. కింది అంశాల్లో సరైనవి ఏవి? 

(టీఎస్, సబ్‌-ఇన్‌స్పెక్టర్స్, 2016)

ఎ) మొదటి జాతీయ షెడ్యూల్డ్‌ కులాలు, తెగల కమిషన్‌ను 1992లో ఏర్పాటు చేశారు.

బి) 65వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా మొదటి జాతీయ షెడ్యూల్డ్‌ కులాలు, తెగల కమిషన్‌ను ఏర్పాటు చేశారు.

సి) జాతీయ షెడ్యూల్డ్‌ కులాలు, తెగల కమిషన్‌కు మొదటి ఛైర్మన్‌ సీహెచ్‌ హనుమంతయ్య.

1) ఎ, బి    2) బి, సి   3) ఎ, సి   4)పైవన్నీ


2. కులాలను షెడ్యూల్డ్‌ కులాలుగా (ఎస్సీ) ప్రకటించే అధికారం ఎవరికి ఉంది? 

(టీఎస్‌పీఎస్సీ టౌన్‌ ప్లానింగ్‌ ఆఫీసర్స్, 2015)

1)జాతీయ షెడ్యూల్డ్‌ కులాల కమిషన్‌    2) ప్రధానమంత్రి       

3) పార్లమెంట్‌    4)రాష్ట్రపతి


3. ప్రభుత్వ ఉద్యోగాల్లో షెడ్యూల్డ్‌ కులాలు, తెగల ఉద్యోగులకు పదోన్నతుల్లో రిజర్వేషన్‌ కల్పించిన రాజ్యాంగ సవరణ చట్టం?

1) 93వ సవరణ, 2005     2) 85వ సవరణ, 2002

3) 81వ సవరణ, 2001     4) 77వ సవరణ, 1995


4. SC, ST (Prevention of Atrocities) ACTతిదిగి ని ఎప్పుడు రూపొందించారు?

(గ్రూప్‌ -II,  2012)

1) 1979     2) 1989     3)1999     4) 2009


సమాధానాలు

1-1    2-4    3-4   4-2

Posted Date : 14-01-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌