• facebook
  • whatsapp
  • telegram

నీతి ఆయోగ్‌ 

 1. కిందివాటిలో సరైనవి?

ఎ) ‘లీ కమిషన్‌’ సిఫార్సుల మేరకు 1926లో మొదటిసారిగా కేంద్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఏర్పడింది.

బి) భారత ప్రభుత్వ చట్టం, 1935 ప్రకారం కేంద్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ పేరును ‘ఫెడరల్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌’గా మార్చారు.

సి) 1950లో ‘ఫెడరల్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌’ పేరును ‘యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌’గా మార్చారు.

డి) భారత్‌లో మొదటి సివిల్‌ సర్వీస్‌ ఉద్యోగి సత్యేంద్రనాథ్‌ ఠాగూర్‌

1) ఎ, బి, డి     2)ఎ, సి, డి      3) ఎ, బి, సి     4) పైవన్నీ


2. భారత్‌లో అఖిల భారత సర్వీసుల పితామహుడిగా ఎవరిని పేర్కొంటారు?

1) సర్దార్‌ వల్లభ్‌భాయ్‌ పటేల్‌       2) సత్యేంద్రనాథ్‌ ఠాగూర్‌      3)  నిర్మల్‌కుమార్‌ ముఖర్జీ     4)కారన్‌ వాలీస్‌


3. కిందివాటిలో సరికానిది?

1) నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీ - కడక్‌వాస్లా    2) ఇండియన్‌ మిలటరీ అకాడమీ - డెహ్రాడూన్‌    3) నేషనల్‌ డిఫెన్స్‌ కాలేజ్‌ - దిల్లీ       4)నేషనల్‌ ఫారెస్ట్‌ అకాడమీ - సిమ్లా


4. మనదేశంలో సివిల్‌ సర్వీసుల దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు?

1) ఫిబ్రవరి, 21      2) మార్చి, 21      3) ఏప్రిల్, 21      4) నవంబరు, 21


5. కిందివాటిలో అఖిల భారత సర్వీస్‌ కానిది?

 1) ఇండియన్‌ అడ్మినిస్ట్రేటివ్‌ సర్వీస్‌ (ఐఏఎస్‌)       2) ఇండియన్‌ పోలీస్‌ సర్వీస్‌ (ఐపీఎస్‌)    3) ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీస్‌ (ఐఎఫ్‌ఎస్‌)      4)ఇండియన్‌ ఫారిన్‌ సర్వీస్‌ (ఐఎఫ్‌ఎస్‌)


6. కిందివాటిలో సరైనవి ఏవి?

ఎ) యూపీఎస్సీ ఛైర్మన్, సభ్యులను రాష్ట్రపతి నియమిస్తారు.

బి) జాయింట్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌కు ఛైర్మన్, సభ్యులను రాష్ట్రపతి నియమిస్తారు.

సి) యూపీఎస్సీ తన వార్షిక నివేదికను రాష్ట్రపతికి సమర్పిస్తుంది.

డి) యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఛైర్మన్, సభ్యుల జీతభత్యాలను కేంద్ర సంఘటిత నిధి నుంచి చెల్లిస్తారు.

1) ఎ, బి, సి      2) ఎ, సి, డి      3) ఎ, బి, డి    4) పైవన్నీ


7. యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్సీ) ఛైర్మన్, సభ్యుల పదవీకాలం?

1)పదవి చేపట్టిన తేదీ నుంచి ఆరేళ్లు లేదా 65 ఏళ్ల వయసు నిండే వరకు

2) పదవి చేపట్టిన తేదీ నుంచి అయిదేళ్లు లేదా 65 ఏళ్ల వయసు నిండే వరకు

3)పదవి చేపట్టిన తేదీ నుంచి ఆరేళ్లు లేదా 62 ఏళ్ల వయసు నిండే వరకు

4) పదవి చేపట్టిన తేదీ నుంచి అయిదేళ్లు లేదా 62 ఏళ్ల వయసు నిండే వరకు


8. యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ గురించిన రాజ్యాంగ వివరణ ఎక్కడ ఉంది?

1) XIVవ భాగం, ఆర్టికల్‌ 315 నుంచి 323

2) XVవ భాగం, ఆర్టికల్‌ 314 నుంచి 333

3) XVIవ భాగం, ఆర్టికల్‌ 316 నుంచి 321

4)XVIIవ భాగం, ఆర్టికల్‌ 318 నుంచి 322


9. సివిల్‌ సర్వీసులపై అధ్యయనం కోసం ఏర్పడిన కమిటీలకు సంబంధించి సరికానిది?

1) సతీష్‌ చంద్ర కమిటీ      2) పి.సి.హోతా కమిటీ     3) రంగరాజన్‌ కమిటీ       4)వై.కె.అలఘ్‌ కమిటీ


10. సివిల్‌ సర్వీసులపై అధ్యయనం చేసిన వివిధ కమిటీల సిఫార్సులకు సంబంధించి కిందివాటిలో సరైనవి?

ఎ) నిగవేకర్‌ కమిటీ - ప్రిలిమ్స్‌ స్కోర్‌కు రెండేళ్ల వ్యాలిడిటీ ఉండాలి.

బి) సతీష్‌ చంద్ర కమిటీ - మెయిన్స్‌ పరీక్షల్లో ఎస్సే పేపర్‌ను ప్రవేశ పెట్టాలి.

సి) అలఘ్‌ కమిటీ - ప్రిలిమ్స్‌లో ఆప్షనల్‌ పేపర్‌ను కొనసాగించాలి.

డి) బస్వాన్‌ కమిటీ - ప్రాంతీయ భాషల్లో పరీక్ష రాయడాన్ని నిలిపివేయాలి.

1) ఎ, బి, సి     2)ఎ, సి, డి      3)  బి, సి, డి     4)పైవన్నీ


11. మనదేశంలో నూతన అఖిల భారత సర్వీసులను ఏర్పాటు చేయాలంటే, రాజ్యసభలో ముందుగా 2/3వ వంతు ప్రత్యేక మెజార్టీతో ఒక తీర్మానాన్ని ఆమోదించాలి. రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్‌ ప్రకారం దీన్ని చేస్తారు?

1) ఆర్టికల్‌ 308       2) ఆర్టికల్‌ 312       3)ఆర్టికల్‌ 315        4)ఆర్టికల్‌ 317


12. కిందివాటిలో సరైనవి ఏవి?

ఎ) ఆర్టికల్‌ 315 ప్రకారం యూపీఎస్సీ రాజ్యాంగబద్ధ సంస్థగా ఏర్పడింది.

బి) యూపీఎస్సీ తొలి ఛైర్మన్‌ హెచ్‌.కె.కృపలానీ

సి) యూపీఎస్సీ ప్రస్తుత ఛైర్మన్‌ మనోజ్‌సోని

డి) యూపీఎస్సీ ఛైర్మన్‌ కావాలంటే  ఉండాల్సిన కనీస వయసు 55 ఏళ్లు.

1)ఎ, బి, సి     2)  బి, సి     3) సి, డి    4) పైవన్నీ


13. నీతి ఆయోగ్‌ అంటే?

1) నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ ఇండియా ఆయోగ్‌

2) నేషనల్‌ ఇన్‌స్టిట్యూషన్‌ ఫర్‌ ట్రాన్స్‌ఫార్మింగ్‌ ఇండియా ఆయోగ్‌

3) నేషనల్‌ ఇన్‌స్టిట్యూషన్‌ ఫర్‌ టెక్నికల్‌ ఇండియా ఆయోగ్‌

4) నేషనల్‌ ఇన్‌స్టిట్యూషన్‌ ఫర్‌ టెస్టింగ్‌ ఇండియా ఆయోగ్‌


14. ప్రణాళికా సంఘం స్థానంలో నీతి ఆయోగ్‌ ఏర్పడింది. ఇది ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది?

1)2015, జనవరి 1     2)  2015, ఏప్రిల్‌ 1      3) 2015, నవంబరు 14       4) 2015, డిసెంబరు 25


15. నీతి ఆయోగ్‌కు సంబంధించి కిందివాటిలో సరైనవి?

ఎ) ఇది ఒక సలహాపూర్వక సంస్థ

బి) తొలి ఆధ్యక్షుడు నరేంద్రమోదీ

సి) తొలి ఉపాధ్యక్షుడు అరవింద్‌  పనగరియా

డి) తొలి సీఈఓ సింధుశ్రీ ఖుల్లర్‌

1) ఎ, బి     2) ఎ, సి    3) ఎ, డి      4) పైవన్నీ


16. నీతి ఆయోగ్‌ పాలకమండలి మొదటి సమావేశం ఎప్పుడు జరిగింది?

1) 2015, జనవరి 28      2) 2015, ఫిబ్రవరి 8    3)  2015, జనవరి 9     4)2015, మార్చి 26


17. కిందివాటిలో నీతి ఆయోగ్‌ లక్ష్యాలు ఏవి?

ఎ) బలమైన రాష్ట్రాలతో బలమైన దేశాన్ని నెలకొల్పడం.

బి) జాతీయ లక్ష్యాల సాధన కోసం రాష్ట్రాల భాగస్వామ్యాన్ని పెంపొందించడం.

సి) ఆర్థిక వ్యూహాలు, విధానాల్లో జాతీయ భద్రత ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇవ్వడం.

డి) గ్రామ స్థాయి నుంచి విశ్వసనీయ ప్రణాళికలను రూపొందించి, అమలుచేయడం

1) ఎ, బి      2) సి, డి    3) బి, డి      4)పైవన్నీ


18. ప్రణాళికా సంఘాన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు? 


1) 1950, మార్చి 15      2) 1951, మార్చి 16     3) 1952, ఏప్రిల్‌ 2      4) 1950, ఏప్రిల్‌ 1


19. కిందివాటిలో సరైనవి ఏవి?

ఎ) గాంధేయ ప్రణాళికను శ్రీమన్నారాయణ అగర్వాల్‌ రూపొందించారు.

బి) ప్రజాప్రణాళికను ఎం.ఎన్‌.రాయ్‌ రూపొందించారు.

సి) సర్వోదయ ప్రణాళికను జయప్రకాష్‌ నారాయణ్‌ రూపొందించారు.

డి) పావర్టీ ఇన్‌ ఇండియా అనే గ్రంథాన్ని దాదాభాయ్‌ నౌరోజీ రాశారు.

1) ఎ, బి, డి      2) ఎ, సి, డి       3) ఎ, బి, సి      4) పైవన్నీ


20. జాతీయ బాలల హక్కుల కమిషన్‌ (నేషనల్‌ కమిషన్‌ ఫర్‌ ప్రొటెక్షన్‌ ఆఫ్‌ చైల్డ్‌ రైట్స్‌ - ఎన్‌సీపీసీఆర్‌)కి సంబంధించి కిందివాటిలో సరైనవి?

ఎ) బాలల హక్కుల పరిరక్షణ చట్టాన్ని 2005లో రూపొందించారు.

బి) జాతీయ బాలల హక్కుల కమిషన్‌ను 2007, మార్చిలో ఏర్పాటు చేశారు.

సి) ఇది ఒక చట్టబద్ధమైన సంస్ధ.

డి) దీన్ని 2021లో సవరించి మహిళలను కూడా చేర్చారు.

1)ఎ, బి, సి     2) ఎ, సి, డి      3)ఎ, బి, డి     4)పైవన్నీ


21. జాతీయ బాలల హక్కుల కమిషన్‌ ఏ మంత్రిత్వశాఖ  పరిధిలో ఉంటుంది?

1) కేంద్ర సాంఘిక సంక్షేమ మంత్రిత్వశాఖ

2) కేంద్ర మహిళా - శిశు అభివృద్ధి  మంత్రిత్వశాఖ

3) కేంద్ర హోం మంత్రిత్వశాఖ

4)కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖ


22. జాతీయ బాలల హక్కుల కమిషన్‌  తొలి ఛైర్మన్‌?

1) శాంతాసిన్హా     2) కుషాల్‌సింగ్‌    3) ప్రియాంక్‌ కానుంగో       4)స్తుతి నరేన్‌కక్కర్‌


23. జాతీయ బాలల హక్కుల కమిషన్‌ నిర్మాణానికి సంబంధించి కిందివాటిలో సరైనవి?

ఎ) ఒక ఛైర్మన్,  ఒక మెంబర్‌ సెక్రటరీ ఉంటారు.

బి) ఆరుగురు సభ్యులు ఉంటారు.

సి) సభ్యుల్లో తప్పనిసరిగా ఇద్దరు మహిళలు ఉండాలి.

1) ఎ, బి      2) బి, సి   3)ఎ, సి    4) పైవన్నీ


సమాధానాలు

1 - 4    2 - 1  3 - 4  4 - 3  5 - 4  6 - 4  7 - 1  8 - 1  9 - 3  10 - 4  11 - 2  12 - 1  13 - 2  14 - 1  15 - 4  16 - 2  17 - 4  18 - 1  19 - 4  20 - 1  21 - 2  22 - 1    23 - 4


గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు


1. నీతి ఆయోగ్‌ దేన్ని సూచిస్తుంది?  

(టీఎస్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్స్, 2016)

1)నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ టెక్నికల్‌ ఇన్వెస్టిగేషన్‌

2) నేషనల్‌ ఇన్‌కం ట్రాన్స్‌ఫర్‌ టు ఇండివిడ్యువల్స్‌

3) నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ ట్రాన్స్‌ఫార్మింగ్‌ ఇండియా

4) నేషనల్‌ ఇంటెలిజెన్స్‌ ట్రైనింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌


2. జాతీయ ప్రణాళికా సంఘాన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు? 

(ఏపీ కానిస్టేబుల్స్, 2016;   ఏపీ పంచాయతీ సెక్రటరీస్, 2014)

1) 1947     2) 1948      3) 1951    4) 1950


3. అఖిలభారత సర్వీసులను ప్రస్తావించిన రాజ్యాంగ ప్రకరణ ఏది? 

(ఏపీ కానిస్టేబుల్స్‌ 2016)

1) ఆర్టికల్‌ 326    2) ఆర్టికల్‌ 312        3) ఆర్టికల్‌ 324     4) ఆర్టికల్‌ 316


4. కిందివాటిలో సరైనవి? 

(టీఎస్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్స్, 2016)

ఎ) అఖిల భారత సర్వీసుల నిబంధనలను భారత రాజ్యాంగంలో స్పష్టంగా పేర్కొన్నారు.

బి) జాతీయాభివృద్ధి మండలి ప్రస్తావన రాజ్యాంగంలో లేదు. 

సి) స్టాంప్‌ డ్యూటీని కేంద్రం విధిస్తుంది. రాష్ట్రాలు వాటిని వసూలు చేసుకుని వినియోగించుకోవచ్చు.

1) ఎ, సి      2)ఎ, బి,    3) ఎ, సి      4) ఎ, బి


5. కిందివాటిలో రాజ్యాంగేతర సంస్థ/ సంస్థలను గుర్తించండి. 

(ఏపీ సబ్‌ ఇన్‌స్పెక్టర్స్, 2016)

ఎ) నీతి ఆయోగ్‌       బి) జాతీయ అభివృద్ధి మండలి

సి) జాతీయ సమగ్రతా మండలి     డి) అంతర్‌ రాష్ట్ర మండలి

1) ఎ, సి     2) ఎ, డి     3) ఎ, బి, సి     4) పైవన్నీ


6. ‘బాలల హక్కుల రక్షణ కోసం జాతీయ కమిషన్‌ (ఎన్‌సీపీసీఆర్‌)కి సంబంధించి కిందివాటిలో సరైనవి?

(టీఎస్‌ కానిస్టేబుల్స్, 2018)

ఎ) బాలల హక్కుల రక్షణ కోసం చట్టం, 2015 ఆధారంగా 2017, మార్చిలో దీన్ని ఏర్పాటు చేశారు.

బి) ఇది ఒక రాజ్యాంగబద్ధ సంస్థ

సి) 0 నుంచి 18 ఏళ్ల వయసు వారిని బాలలుగా (పిల్లలు) గుర్తిస్తారు.

1) సి మాత్రమే     2) ఎ, బి       3) బి, సి      4) ఎ, పి


7. యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్సీ) తన వార్షిక నివేదికను ఎవరికి సమర్పిస్తుంది?

(ఏపీ సబ్‌ ఇన్‌స్పెక్టర్స్, 2018)

1)పార్లమెంట్‌       2)రాష్ట్రపతి     3)ప్రధానమంత్రి     4)కేంద్ర హోంశాఖ మంత్రి


సమాధానాలు


1 - 3     2 - 4      3 - 2     4 - 2      5 - 3    6 - 1    7 - 2


రచయిత


బంగారు సత్యనారాయణ


విషయ నిపుణులు 

Posted Date : 10-01-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌