• facebook
  • whatsapp
  • telegram

భారత రాజ్యాంగం అవలోకనం

అధ్యాయం - 1 

భారత రాజ్యాంగం - స్వభావం - రాజ్యాంగ అభివృద్ధి - భారత రాజ్యాంగ ప్రధాన లక్షణాలు - ప్రవేశిక - ప్రాథమిక హక్కులు - ఆదేశిక సూత్రాలు - వాటి సంబంధం - ప్రాథమిక విధులు - విశేష లక్షణాలు - కేంద్ర, సమాఖ్య వ్యవస్థలు

1. కింది వాక్యాల్లో సత్యమైన వాటిని గుర్తించండి.
(A) భారత రాజ్యాంగంలోని 42వ రాజ్యాంగ సవరణ ప్రాథమిక హక్కుల కంటే ఆదేశిక సూత్రాలకు ప్రాధాన్యం ఇచ్చింది.
(B) రాజ్యాంగంలోని 3వ, 4వ భాగాల మధ్య అనుసంధానం ఉండాలని మినర్వామిల్స్ కేసులో పేర్కొన్నారు.
(C) రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాలకు న్యాయ సమీక్ష ఉంది.
(D) ప్రస్తుతం 7 ప్రాథమిక హక్కులు పౌరులకు అమల్లో ఉన్నాయి.
జ: A, B
2. కిందివాటిలో సరైన జతను గుర్తించండి.
     1) భారత ప్రభుత్వ చట్టం 1892 - ఎన్నికల నియమాలు
     2) భారత ప్రభుత్వ చట్టం 1909 - బాధ్యతాయుత ప్రభుత్వం
     3) భారత ప్రభుత్వ చట్టం 1919 - ప్రాదేశిక స్వాతంత్య్రం
     4) భారత ప్రభుత్వ చట్టం 1935 - రాష్ట్రాల్లో ద్వంద్వ ప్రభుత్వం
జ: 1 (భారత ప్రభుత్వ చట్టం 1892 - ఎన్నికల నియమాలు)
3. కిందివాటిలో ఏ పదాల వరుస క్రమాన్ని భారత రాజ్యాంగ పీఠిక లో పొందుపరిచారు?
     1) భారతదేశం ఒక ప్రజాస్వామ్య, స్వతంత్ర, సర్వసత్తాక, సౌభ్రాతృత్వ రాజ్యం
     2) భారతదేశం ఒక సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యం
     3) భారతదేశం ఒక ప్రజాస్వామ్య, సర్వసత్తాక రాజ్యం
     4) భారతదేశం ఒక స్వతంత్ర, సామ్యవాద, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యం
జ: 2 (భారతదేశం ఒక సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యం)
4. మనదేశంలో ఆస్తిహక్కును ప్రాథమిక హక్కుల నుంచి తొలగించి రాజ్యాంగబద్ద హక్కుగా మార్చారు ఎందుకంటే...
జ: ఆస్తిహక్కు న్యాయ వ్యవస్థ, పార్లమెంటుకు మధ్య వివాదాస్పదంగా మారడం వల్ల
5. ఫిబ్రవరి 21, 1948న రాజ్యాంగ సదస్సుకు సమర్పించిన భారత ముసాయిదా రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్స్, షెడ్యూల్స్ వరుసగా...
జ: 295, 8
6. భారతదేశంలో ఈస్టిండియా కంపెనీ పరిపాలనను నియంత్రించడానికి ప్రవేశపెట్టిన బ్రిటిష్ మొదటి చట్టం ఏది?
జ: రెగ్యులేటింగ్ చట్టం - 1773
7. భారత రాజ్యాంగ ప్రవేశికలో ఏ విధంగా రాశారు?
జ: భారత ప్రజలమైన మేము భారత రాజ్యాంగాన్ని మా రాజ్యాంగ అసెంబ్లీలో ఆమోదించి మా రాజ్యాంగాన్ని మాకు మేమే ఇస్తున్నాం.
8. భారతదేశంలో ప్రాథమిక హక్కులకు రక్షకుడు ఎవరు?
జ: సుప్రీంకోర్టు
9. బెంగాల్ మొదటి గవర్నర్ జనరల్ ఎవరు?
జ: వార్న్‌హేస్టింగ్స్
10. కింది ఏ ప్రతిపాదనను భారత ప్రజల స్వేచ్ఛా స్వాతంత్య్రాల మాగ్నాకార్టాగా పేర్కొంటారు?
     1) క్రిప్స్ ప్రతిపాదన    2) విక్టోరియా రాణి ప్రకటన   3) క్యాబినెట్‌మిషన్ ప్రతిపాదన   4) వేవెల్ ప్రతిపాదన
జ: 2 (విక్టోరియా రాణి ప్రకటన)
11. 1883 చార్టర్ చట్టం ప్రకారం ప్రవేశపెట్టిన అంశాల్లో కిందివాటిలో లేనిది-
      1) ఈస్టిండియా కంపెనీ వాణిజ్య కార్యకలాపాలను రద్దుచేసింది.
      2) కౌన్సిల్‌లోని ఉన్నతాధికారిని గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా మార్చింది.
      3) కౌన్సిల్ న్యాయ చట్టాలను చేసే అధికారం గవర్నర్ జనరల్‌కు ఇచ్చింది.
      4) గవర్నర్ జనరల్ కౌన్సిల్‌లోని న్యాయమండలికి మొదటిసారిగా భారతీయుడిని నియమించారు.
జ: 4 (గవర్నర్ జనరల్ కౌన్సిల్‌లోని న్యాయమండలికి మొదటిసారిగా భారతీయుడిని నియమించారు)
12. భారత రాజ్యాంగ తయారీకి రాజ్యాంగసభ ఎప్పుడు ఏర్పడింది?
జ: 1946, డిసెంబరు 6
13. కుల, మత ప్రాతిపదికగా ప్రత్యేక నియోజక వర్గాలను ఏర్పాటు చేసిన మొదటి చట్టం ఏది?
జ: ఇండియన్ కౌన్సిల్ చట్టం - 1909
14. క్యాబినెట్ మిషన్ ప్లాన్ భారతదేశాన్ని దేనికోసం సందర్శించింది?
జ: రాజ్యాంగ సమస్యకు సరైన పరిష్కారం చూపడానికి
15. ఏ చట్టం ద్వారా భారతదేశ పాలనా వ్యవహారాలు ఈస్టిండియా కంపెనీ నుంచి బ్రిటిష్ రాణి చేతికి వెళ్లాయి?
జ: భారత ప్రభుత్వ చట్టం - 1858
16. 1949, నవంబరు 26వ తేదీన అమల్లోకి వచ్చిన రాజ్యాంగ నిబంధనలు ఏవి?
      I) పౌరసత్వానికి సంబంధించిన నిబంధనలు
      II) ఎన్నికలకు సంబంధించిన నిబంధనలు
      III) తాత్కాలిక పార్లమెంటుకు సంబంధించిన నిబంధనలు
      IV) ప్రాథమిక హక్కులు
జ: I, II, III
17. కిందివాటిలో దేనికి ప్రభుత్వ శాఖలను వ్యవస్థీకరించే అధికారం ఉంది?
      1) పార్లమెంటు       2) లోక్‌సభ        3) కార్యనిర్వాహక వర్గం       4) ఆర్థిక మంత్రిత్వ శాఖ
జ: 3 (కార్యనిర్వాహక వర్గం)
18. కిందివాటిలో ఏ దేశ రాజ్యాంగాన్ని దృఢ రాజ్యాంగానికి ఉదాహరణ చెప్పవచ్చు?
      1) అమెరికా       2) భారతదేశం       3) కెనడా       4) బ్రిటన్
జ: 1 (అమెరికా)
19. భారత రాజ్యాంగం ఏ తరహాకు చెందిన రాజ్యాన్ని ప్రకటిస్తుంది?
జ: ఏకీకృత, సమాఖ్య లక్షణాలున్న రాజ్యాంగం
20. భారత రాజ్యాంగాన్ని ఆమోదించిన తేదీ-
జ: 1949, నవంబరు 26
21. భారత రాజ్యాంగం ముసాయిదా రచన మీద ప్రభావం చూపింది-
జ: భారత ప్రభుత్వ చట్టం - 1935
22. కిందివాటిలో సరైన జతను గుర్తించండి.
A) మొదటి షెడ్యూల్

I) ప్రమాణ స్వీకార విధానం

B) మూడో షెడ్యూల్

II) అధికార విభజన

C) ఏడో షెడ్యూల్

III) భారత దేశంలోని రాష్ట్రాల-కేంద్రపాలిత ప్రాంతాల భౌగోళిక పరిధి

D) ఎనిమిదో షెడ్యూల్

IV) భాషలు

జ: A - III,  B - I,   C - II,  D - IV
23. భారత రాజ్యాంగాన్ని వ్యాఖ్యానించడంలో ఎవరికి అధికారం ఉంది?
జ: సుప్రీంకోర్టు
24. కెనడా రాజ్యాంగం నుంచి మన రాజ్యాంగానికి గ్రహించిన అంశాలేవి?
      1) సమాఖ్య పద్ధతి       2) భారత యూనియన్      
      3) కేంద్రానికి అవశిష్ట అధికారాలు       4) అన్నీ
జ: 4 (అన్నీ)

25. భారత రాజ్యాంగం మనదేశాన్ని ఏవిధంగా వర్ణించింది?
జ: రాష్ట్రాల కలయిక
26. వివిధ రాజ్యాంగాల నుంచి మన రాజ్యాంగానికి గ్రహించిన అంశాల్లో సరైన జతను గుర్తించండి.
I) రాజ్యాంగ సవరణ పద్ధతి

A) ఐర్లాండు

II) ఉమ్మడి జాబితా

B) జపాన్

III) చట్టం నిర్ధారించిన పద్ధతి

C) ఆస్ట్రేలియా

IV) రాజ్యసభకు విశిష్ట సభ్యుల నియామకం

D) దక్షిణాఫ్రికా

జ: I-D, II-C, III-B, IV-A
27. భారత రాజ్యాంగ నిర్మాతల ఆశయాలు, భావాలను ప్రతిబింబించేది ఏది?
జ: రాజ్యాంగ ప్రవేశిక
28. కింది లక్షణాల్లో మన రాజ్యాంగం ఏ అంశాల్లో అమెరికా రాజ్యాంగాన్ని పోలి ఉంది?
      1) ప్రాథమిక హక్కులు       2) అధ్యక్ష పాలన       3) ఏకీకృత పాలన       4) ద్వంద్వ పౌరసత్వం
జ: 1 (ప్రాథమిక హక్కులు)
29. భారత రాజ్యాంగ పీఠిక రాజ్యాంగంలో భాగమని ఏ కేసులో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది?
జ: కేశవానంద భారతి కేసు
30. కిందివాటిలో ఏకకేంద్ర లక్షణం కాని అంశాన్ని గుర్తించండి.
      1) దేశం మొత్తానికీ ఒకే రాజ్యాంగం ఉండటం      2) రాష్ట్రానికి, దేశానికి ఒకే పౌరసత్వం ఉండటం
      3) గవర్నర్ నియామకం                                  4) అన్నీ సరైనవే
జ: 4 (అన్నీ సరైనవే)
31. కిందివాటిలో తప్పుగా జతపరిచిన అంశమేది?
      1) పార్లమెంటరీ తరహా ప్రభుత్వం - ఇంగ్లండ్                          2) రాజ్యాంగ సవరణ - అమెరికా
      3) రాజ్యసభకు సభ్యులను నామినేట్ చేయడం - ఐర్లాండు      4) గవర్నర్లను నియమించడం - కెనడా
జ: 2 (రాజ్యాంగ సవరణ - అమెరికా)
32. రాజ్యాంగ పరిషత్‌లో భారతీయ క్రైస్తవులకు ప్రాతినిథ్యం వహించిన వారెవరు?
జ: హెచ్.సి.ముఖర్జీ
33. కిందివాటిలో సరైన జతను గుర్తించండి.
      1) భారత ప్రభుత్వ చట్టం - 1909 - మతపరమైన ప్రాతినిధ్యం
      2) భారత ప్రభుత్వ చట్టం - 1919 - ద్వంద్వపాలన
      3) భారత ప్రభుత్వ చట్టం - 1935 - అఖిల భారత సమాఖ్య
      4) అన్నీ సరైనవే
జ: 4 (అన్నీ సరైనవే)
34. అవసరాన్ని బట్టి భారత దేశం ఏకకేంద్ర రాజ్యంగా, సమాఖ్య రాజ్యంగా వ్యవహరిస్తుందని ఎవరు పేర్కొన్నారు?
జ: బి.ఆర్.అంబేడ్కర్
35. రాజ్యాంగ బద్ధమైన ప్రభుత్వం అంటే?
జ: రాజ్యాంగ ప్రకార ప్రభుత్వం
36. ''ప్రపంచంలోని అన్ని రాజ్యాంగాలను పరిశీలించి, వాటిలోని గొప్ప అంశాలను గ్రహించి, వాటిని భారతదేశ పరిస్థితులకు అనుకూలంగా మార్చి రాజ్యాంగాన్ని నిర్మించుకున్నాం. ఈ విధంగా చేయడం తప్పేమీ కాదు ఇది ప్రకృతి సిద్దమైంది" అని భారత రాజ్యాంగం గురించి పేర్కొన్న వారెవరు?
జ: బి.ఆర్.అంబేడ్కర్
37. భారత రాజ్యాంగం సంపూర్ణంగా అమల్లోకి వచ్చిన తేది ఏది?
జ: 1950, జనవరి 26
38. రాజ్యాంగ పరిషత్ తొలి సమావేశం ఎప్పుడు జరిగింది?
జ: 1946, డిసెంబరు 9
39. నియమావళి కమిటీ (Rules Committe) అధ్యక్షుడు ఎవరు?
జ: బాబూ రాజేంద్రప్రసాద్
40. కిందివాటిలో భారత రాజ్యాంగంలో రాష్ట్రజాబితాలో చేర్చని అంశమేది?
      1) పోలీస్       2) శాంతి భద్రతలు      3) జైళ్లు       4) క్రిమినల్ ప్రొసీజర్ కోడ్
జ: 4 (క్రిమినల్ ప్రొసీజర్ కోడ్)
41. కిందివారిలో రాజ్యాంగ పరిషత్ అధ్యక్షుడిగా ఎన్నికైన వారెవరు?
      1) జవహర్‌లాల్ నెహ్రూ       2) మహాత్మాగాంధీ      3) సచ్చిదానంద సిన్హా       4) బాబూ రాజేంద్రప్రసాద్
జ: 4 (బాబూ రాజేంద్రప్రసాద్)
42. భారత్ రాజ్యాంగాన్ని తయారు చేయడానికి పట్టిన మొత్తం సమయమెంత?
జ: 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు
43. భారత రాజ్యాంగాన్ని స్వీకరించడానికి అనుసరించిన విధానం ఏమిటి?
జ: రాష్ట్రపతితోపాటూ రాజ్యాంగ పరిషత్ సభ్యుల సంతకాల తర్వాత రాజ్యాంగాన్ని స్వీకరించడమైంది.
44. కిందివాటిలో ప్రాథమిక విధికానిది ఏది?
      1) జాతీయ గీతాన్ని, జాతీయ పతాకాన్ని గౌరవించడం
      2) ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించడం
      3) సహజ వనరులను పరిరక్షించి, మెరుగుపరచడం
      4) జాతీయ ప్రాముఖ్యం ఉన్న స్మారక నిర్మాణాలు, స్థలాలను రక్షించడం
జ: 4 (జాతీయ ప్రాముఖ్యం ఉన్న స్మారక నిర్మాణాలు, స్థలాలను రక్షించడం)
45. స్వతంత్ర భారతదేశ రాజ్యాంగ రూపకల్పనకు జాతీయవాదులు చేసిన ప్రయత్నం ఏది?
జ: నెహ్రూ నివేదిక
46. కిందివాటిలో సరికాని జత ఏది?
      1) చట్టం ముందు అందరూ సమానమే - పౌరులకు, పౌరులు కానివారికి సరైన హామీ ఇవ్వడమైంది.
      2) దేశంలోని ఏదైనా రాష్ట్రం పేరును మార్చడం - రాష్ట్ర శాసనసభ ఆమోదం ఉంటే సరిపోతుంది.
      3) కొత్త రాష్ట్రాల ఏర్పాటు - పార్లమెంటుకు అధికారం ఉంది.
      4) ప్రభుత్వ ఉద్యోగాల్లో సమాన అవకాశాలు - భారత పౌరులకు సరైన హామీ ఇచ్చారు.
జ: 2 (దేశంలోని ఏదైనా రాష్ట్రం పేరును మార్చడం - రాష్ట్ర శాసనసభ ఆమోదం ఉంటే సరిపోతుంది.)
47. రాజ్యాంగంలోని ఏ షెడ్యూల్‌లో భూ సంస్కరణలను చేర్చారు?
జ: 11వ షెడ్యూల్
48. కిందివాటిలో ఏది సమాఖ్య లక్షణం కాదు?
1) కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఏర్పాటు     2) ఒకే పౌరసత్వం ఉండటం      

3) దృఢ రాజ్యాంగం       4) అన్నీ
జ: 2 (ఒకే పౌరసత్వం ఉండటం)
49. భారత రాజ్యాంగంలో గుర్తింపు పొందిన భాషలు ఎన్ని?
జ: 22
50. పార్లమెంటుల మాత అని ఏ పార్లమెంటును పేర్కొంటారు?
జ: బ్రిటన్
51. రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు ఎన్ని సంవత్సరాల వయసువారికి (ఈ వయసు నుంచి) ఓటు హక్కును కల్పించారు?
జ: 21
52. ప్రాథమిక విధులు భారత రాజ్యాంగంలో పొందుపరచడానికి కారణమేమిటి?
జ: రాజ్యాంగేతర కార్యక్రమాలను అణిచివేయడానికి
53. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే నినాదానికి కిందివాటిలో దేంతో సంబంధం ఉంది?
       1) రష్యన్ విప్లవం       2) చైనీస్ విప్లవం   3) అమెరికన్ విప్లవం     4) ఫ్రెంచ్ విప్లవం
జ: 4 (ఫ్రెంచ్ విప్లవం)
54. కిందివాటిలో సత్యమైనదాన్ని గుర్తించండి.
      1) భారత దేశాన్ని రాజ్యాంగంలో హిందూస్థాన్ అని పేర్కొన్నారు.
      2) రాజ్యాంగ తొలి ప్రతిలోనే కేబినెట్ అనే పదం చేర్చారు.
      3) భారత రాజ్యాంగంలో సమాఖ్య అనే పదాన్ని ఎక్కడా పేర్కొనలేదు
      4) దేశానికి అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు.
జ: 3 (భారత రాజ్యాంగంలో సమాఖ్య అనే పదాన్ని ఎక్కడా పేర్కొనలేదు)
55. 1950, జనవరి 26న అమల్లోకి వచ్చిన రాజ్యాంగంలో ఏ పదాన్ని పేర్కొనలేదు?
జ: సామ్యవాద
56. మొదట భారత రాజ్యాంగంలో ఉండి ఆ తర్వాత తొలగించిన ప్రాథమిక హక్కు ఏది?
జ: ఆస్తి హక్కు
57. కిందివాటిలో ప్రాథమిక హక్కుల గురించి ఏది నిజం?
1) ఇవి సంపూర్ణమైన హక్కులు కావు
2) వీటిని న్యాయవ్యవస్థ రక్షిస్తుంది
3) పార్లమెంటు ఉభయ సభల్లో 2/3వ వంతు మెజారిటీతో మాత్రమే వీటిని సవరించవచ్చు
4) అన్నీ
జ: 2 (వీటిని న్యాయవ్యవస్థ రక్షిస్తుంది)
58. పార్లమెంటు సాధారణ మెజారిటీతో కింది ఏ అంశాన్ని సవరించలేదు?
  1) రాష్ట్రాల పునర్నిర్మాణం   2) పౌరసత్వ అర్హతలు    3) రాష్ట్ర ఎగువసభ రద్దు   4) దేశ అధ్యక్షుడి ఎన్నిక పద్ధతి
జ: 4 (దేశ అధ్యక్షుడి ఎన్నిక పద్ధతి)
59. భారతదేశ సమాఖ్య విధానాన్ని, కేంద్ర - రాష్ట్ర సంబంధాలను ప్రభావితం చేసిన రాజ్యాంగం ఏది?
జ: కెనడా రాజ్యాంగం
60. 1946, మే 16న వచ్చిన కేబినెట్ మిషన్ ప్రణాళికకు సంబంధించి కిందివాటిలో సరైంది ఏది?
(ఎ) బ్రిటిష్ ఇండియా ద్వారా రాష్ట్రాలకు కార్యనిర్వహణ, శాసన పరమైన అధికారాలు కేంద్రం నుంచి బదిలీ అయ్యాయి.
(బి) సంస్థానాలు కార్యనిర్వహణ, శాసనపర అధికారాల నుంచి విముక్తి పొందాయి
జ: ఎ, బి
61. మొదట భారత రాజ్యాంగంలో ఎన్ని రకాల ప్రాథమిక హక్కులను చేర్చారు?
జ: 7
62. భారత ప్రభుత్వ చట్టం - 1935లో ఉన్న ఇన్‌స్ట్రుమెంట్ ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్స్‌ను 1950లో భారత రాజ్యాంగంలో వేటి పేరిట పొందుపరిచారు?
జ: ఆదేశిక సూత్రాలు
63. భారత రాజ్యాంగ తాత్విక భావనను దేని ఆధారంగా రూపొందించారు?
జ: 1947 నెహ్రూ ప్రతిపాదనలు
64. రాజ్యాంగ పరిషత్ తొలి సమావేశం ఎక్కడ జరిగింది?
జ: ఢిల్లీ
65. రాజ్యాంగ లక్షణాలు, ఆశయాల తీర్మానాన్ని భారత జాతి చక్రంగా అభివర్ణించింది ఎవరు?
జ: కె.ఎం.మున్షి
66. భారత జాతీయ కాంగ్రెస్ ఎక్కడ జనవరి 26, 1930ను సంపూర్ణ స్వరాజ్ దినంగా నిర్వహించాలని నిర్ణయించింది?
జ: లాహోర్
67. జీవించే హక్కుకు సంబంధించిన ప్రకరణ 21లోని చట్టం నిర్ధారించిన ప్రకారం అనే పదాన్ని ఏ రాజ్యాంగం నుంచి గ్రహించారు?
జ: జపాన్
68. కింది అంశాల్లో సత్యమైన వాటిని గుర్తించండి.
       i) భారత రాజ్యాంగం ప్రకారం సామాజిక న్యాయం అమలుకు కోర్టులకు అధికారాలను ఇవ్వడం
       ii) ఆర్థిక పరమైన వ్యత్యాసాల తొలగింపు
       iii) పనిచేసేవారికి సమర్థ జీవన విధానాన్ని కల్పించడం
       iv) సమాజంలో వెనుకబడినవారికి రక్షణ కల్పించడం
జ: i, ii, iii, iv
69. స్పీకర్ వ్యవస్థ, అఖిల భారత సర్వీసులను ఏ రాజ్యాంగం నుంచి గ్రహించారు?
జ: బ్రిటన్
70. భారత జాతీయ రచనా సమయంలో భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎవరు?
జ: జె.బి. కృపలానీ
71. భారత ప్రభుత్వం అనే పదం ఏ చట్టం ద్వారా అమల్లోకి వచ్చింది?
జ: చార్టర్ చట్టం - 1833
72. భారత రాజ్యాంగ ప్రవేశిక, రాజ్యాంగానికి కీ నోట్ లాంటిది అని వ్యాఖ్యానించినవారెవరు?
జ: ఎర్నెస్ట్ బార్కర్
73. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 51 A ప్రకారం భారత పౌరుడి ముఖ్య ప్రాథమిక విధులు ఏవి?
       i) సామ్యవాదం, లౌకికవాదం, ప్రజాస్వామ్యం పట్ల నమ్మకం కలిగి ఉండాలి.
       ii) భారత జాతీయ జెండాను, జాతీయ గీతాన్ని గౌరవిస్తూ రాజ్యాంగానికి కట్టుబడి ఉండాలి
       iii) భారత సమగ్రత, సమైక్యత, సామ్యవాదాన్ని రక్షించాలి
       iv) దేశ వారసత్వం, సంస్కృతి రక్షణకు కృషిచేయాలి
జ: ii, iii, iv
74. రాజ్యాంగంలో పేర్కొన్న రాజ్యం అనే మాటను విశదపరిచే ప్రకరణ ఏది?
జ: 12
75. ఏ చట్టం ఫలితంగా భారతదేశంలో మొదటిసారిగా సుప్రీంకోర్టును ఏర్పాటు చేశారు?
జ: రెగ్యులేటింగ్ చట్టం - 1773
76. కిందివాటిలో సరైన జత
       1) ఉమ్మడి జాబితా - ఆరోగ్యం              2) కేంద్ర జాబితా - పోలీసు వ్యవస్థ
       3) ఉమ్మడి జాబితా - ప్రణాళికలు          4) రాష్ట్ర జాబితా - ఆయుధాలు
జ: 3 (ఉమ్మడి జాబితా - ప్రణాళికలు)
77. ఇప్పటివరకు పీఠికను ఎన్నిసార్లు సవరించారు?
జ: ఒకసారి
78. భారత పార్లమెంటు 1956లో ఎన్ని రాష్ట్రాల ఏర్పాటుకు రాష్ట్రాల పునర్విభజన కమిషన్‌ను ఏర్పాటు చేసింది?
జ: 24 రాష్ట్రాలు, 9 కేంద్రపాలిత ప్రాంతాలు
79. రాజ్యాంగ పరిషత్‌కు 11 బ్రిటిష్ పాలిత రాష్ట్రాల నుంచి ఎన్నికైన సభ్యులు ఎంత మంది?
జ: 292
80. రాజ్యాంగానికి పీఠిక అనే భావనను మనం ఏ రాజ్యాంగం నుంచి గ్రహించాం?
జ: అమెరికా
81. భారత సమాఖ్య విధానాన్ని పూర్తి ఏకీకృత విధానంగా ఎప్పుడు మార్చవచ్చు?
జ: జాతీయ అత్యవసర పరిస్థితిలో
82. భారత రాజ్యాంగ పరిషత్ తొలి సమావేశం 1946లో 'సచ్చిదానంద సిన్హా' అధ్యక్షతన ఏ రోజున జరిగింది?
జ: డిసెంబరు 9
83. కిందివాటిలో రాష్ట్ర జాబితాలోని అంశాన్ని గుర్తించండి.
       1) ద్రవ్య ముద్రణ        2) భారత రైల్వేలు        3) అమ్మకపు పన్ను        4) దూరదర్శన్
జ: 3 (అమ్మకపు పన్ను)
84. కింద పేర్కొన్న జతల్లో సరికానిదాన్ని గుర్తించండి.
  1) రాజ్యసభ సీట్ల కేటాయింపు - 7వ షెడ్యూల్              2) భాషలు - 8వ షెడ్యూల్
  3) కేంద్రపాలిత ప్రాంతాల సరిహద్దులు - 1వ షెడ్యూల్   4) రాజ్యాంగబద్ధ వ్యక్తుల జీతభత్యాలు - 2వ షెడ్యూల్
జ: 1 (రాజ్యసభ సీట్ల కేటాయింపు - 7వ షెడ్యూల్)
85. రాజ్యాంగ పరిషత్ ఏర్పాటును అధికారికంగా ప్రకటించింది-
జ: క్రిప్స్ రాయబారం
86. రాజ్యాంగానికి ఆత్మ, హృదయంగా దేన్ని పేర్కొంటారు?
జ: రాజ్యాంగ ప్రవేశిక
87. భారతదేశం కానిస్టిట్యుయెంట్ అసెంబ్లీ ప్రారంభోత్సవ సమావేశానికి ఎవరు అధ్యక్షత వహించారు?
జ: సచ్చిదానంద సిన్హా
88. కిందివాటిలో రాజ్యాంగ పరిషత్‌కు ఎన్నిక కానిది ఎవరు?
       1) మహాత్మాగాంధీ        2) కె.టి.షా       3) కె.ఎం.మున్షీ        4) బి.ఆర్.అంబేడ్కర్
జ: 1 (మహాత్మాగాంధీ)
89. రాజ్యాంగ రచన కోసం రాజ్యాంగ పరిషత్ అనుసరించిన నమూనా ఏది?
జ: యూరో అమెరికన్ నమూనా
90. స్వాతంత్య్రానంతరం రాజ్యాంగ పరిషత్‌లోని సభ్యుల సంఖ్య ఎంత?
జ: 299
91. ప్రాథమిక హక్కుల్లో సాంస్కృతిక, విద్యా హక్కును ఏర్పాటు చేయడం వెనుక ఉన్న ఉద్దేశం-
జ: భారతదేశ సంస్కృతిని సంరక్షించడానికి సహాయపడటం
92. రాజ్యాంగ పరిషత్‌లో మహిళలకు ప్రాతినిధ్యం వహించినదెవరు?
జ: హంసా మెహతా
93. కిందివాటిలో ఏ దేశ రాజ్యాంగం నుంచి మనం ఎలాంటి అంశాన్ని స్వీకరించలేదు?
       1) కెనడా        2) అమెరికా        3) చైనా        4) జర్మనీ
జ: 3 (చైనా)
94. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ)ను ఏర్పాటు చేసింది?
జ: భారత రాజ్యాంగం
95. రాజ్యాంగాన్ని రాజ్యాంగ పరిషత్ 1949, నవంబరు 26 ఏ వారం ఆమోదించింది?
జ: శనివారం
96. రాజ్యాంగ పరిషత్ జాతీయ జెండాను ఆమోదించిన రోజు ఏది?
జ: 1947, జులై 27
97. జాతీయ జెండాలోని ధర్మచక్రంలో ఎన్ని ఆకులు ఉన్నాయి?
జ: 24
98. కిందివాటిలో సరికాని జత-
       1) రాష్ట్ర జాబితా - పోలీసు వ్యవస్థ          2) కేంద్ర జాబితా - ఎన్నికలు
       3) ఉమ్మడి జాబితా - విడాకులు          4) ఉమ్మడి జాబితా - పంచాయతీరాజ్ వ్యవస్థ
జ: 4 (ఉమ్మడి జాబితా - పంచాయతీరాజ్ వ్యవస్థ)
99. రాజ్యాంగంలో మైనారిటీలకు ప్రాతినిధ్యం వహించినదెవరు?
జ: హెచ్.సి.ముఖర్జీ
100. ప్రస్తుతం రాజ్యాంగంలో ఉన్న మొత్తం షెడ్యూళ్లు ఎన్ని?
జ: 12
101. భారత రాజ్యాంగంలో ఉభయ జాబితాలో ఉన్న అంశం ఏది?
జ: జనాభా నియంత్రణ, కుటుంబ ప్రణాళిక
102. భారత పరిపాలనా సర్వీసు (ఐఏఎస్), భారత పోలీసు సర్వీసు (ఐపీఎస్)లు దేని ద్వారా ఏర్పడ్డాయి?
జ: భారత పార్లమెంటు
103. కిందివారిలో ఏ రాజ్యాంగ సభ్యుడు ఆకస్మికంగా మరణించారు?
      1) బి.ఆర్.మిట్టల్       2) డి.పి.ఖైతాన్       3) కె.టి.షా       4) కె.ఎం.మున్షీ
జ: 2 (డి.పి.ఖైతాన్)
104. జాతీయ క్యాలెండర్ ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది?
జ: 1957, మార్చి 22
105. భారతదేశంలో కిందివాటిలో దేన్ని రక్షించడం ప్రాథమిక విధి?
      1) గ్రామ పంచాయతీలు       2) భారత జాతీయ జెండా      3) వన్యజీవులు       4) ఏదీకాదు
జ: 3 (వన్యజీవులు)

106. కిందివాటిలో రాజ్యాంగ పరిషత్‌లోని నాలుగు కేంద్ర పాలిత ప్రాంతాలతో సంబంధం లేనిది?
      1) అజ్మల్       2) మేవార్       3) సింధూ       4) దిల్లీ
జ: 3 (సింధూ)
107. ''ఈ రోజు నుంచి మనం వైవిధ్యాలతో కూడిన సమాజంలోకి ప్రవేశిస్తున్నాం. రాజకీయాల్లో సమానత్వం ఉంటుంది కానీ ఆర్థిక, సామాజిక రంగాల్లో అసమానత్వం ఉంటుంది" అని పేర్కొన్నది?
జ: బి.ఆర్.అంబేడ్కర్
108. మొదటిసారిగా 1862లో బొంబాయి, మద్రాసు, కలకత్తా హైకోర్టులను స్థాపించారు. అయితే ఆ తర్వాత 1866లో స్థాపించిన హైకోర్టు ఏది?
జ: అలహాబాదు హైకోర్టు
109. మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ గురించి రాజ్యాంగంలోని ఏ భాగంలో పేర్కొన్నారు?
జ: 9వ
110. భారత రాజ్యాంగాన్ని సవరించడం గురించి తెలిపే ఆర్టికల్ ఏది?
జ: 368
111. భారత రాజ్యాంగ ప్రవేశికను ఏ దేశ రాజ్యాంగం నుంచి స్వీకరించారు?
జ: ఫ్రాన్స్
112. సర్వసత్తాక భారత రాజ్యాంగానికి సంబంధించి కిందివాటిలో సత్యమైనదాన్ని గుర్తించండి.
      1) భారత జాతీయ కాంగ్రెస్ ద్వారా రచించబడి, బ్రిటన్ ప్రధాని ద్వారా స్వీకరించబడింది.
      2) రాజ్యాంగసభ ద్వారా నిర్మితమై బ్రిటన్ ప్రభుత్వం ద్వారా స్వీకరించబడింది.
      3) బ్రిటన్ ప్రభుత్వ ఆధీనంలో రచించబడి, బ్రిటన్ పార్లమెంటు ద్వారా స్వీకరించబడింది.
      4) భారత రాజ్యాంగ సభ ద్వారా రాయబడి, స్వీకరించబడింది.
జ: 4 (భారత రాజ్యాంగ సభ ద్వారా రాయబడి, స్వీకరించబడింది)
113. పార్టీ ఫిరాయింపులను నిషేధిస్తూ 252వ సవరణను 1985లో చేసిన ప్రధానమంత్రి ఎవరు?
జ: రాజీవ్‌గాంధీ
114. చట్టం మూలంగా సమాన రక్షణ అనే భావనను ఎక్కడి నుంచి గ్రహించారు?
జ: అమెరికా
115. రాష్ట్రపతి జారీచేసే ఆర్డినెన్స్ గరిష్ఠ జీవితకాలం ఎంత?
జ: 6 నెలల, 6 వారాలు
116. భారత స్వాతంత్య్ర చట్టం - 1947ను ఆమోదించినవారెవరు?
జ: ఇంగ్లండ్ పార్లమెంట్
117. మొదటి భారత రాజ్యాంగ సవరణ ఎప్పుడు జరిగింది?
జ: 1951
118. కిందివాటిని జతపరచండి.
A) షెడ్యూల్ IX

I) పంచాయతీరాజ్ వ్యవస్థ

B) షెడ్యూల్ X

II) భూసంస్కరణల వివరణ

C) షెడ్యూల్ XI

III) అసోం, మేఘాలయ, మిజోరాం రాష్ట్రాల్లోని గిరిజన ప్రాంతాల పరిపాలనా విధానం గురించి వివరణ

D) షెడ్యూల్ VI

IV) కేంద్ర, రాష్ట్రాల మధ్య అధికార పంపిణీ

V) పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టం

జ: A-II, B-V, C-I, D-III
119. ప్రాథమిక హక్కులు రాజ్యాంగంలో ఏ భాగంలో ఉన్నాయి?
జ: 3వ
120. 1978లో జరిగిన పార్లమెంట్ ఉభయ సభల సంయుక్త సమావేశానికి అధ్యక్షత వహించింది ఎవరు?
జ: ఎస్.కె.హెగ్డే
121. ఏ దేశ రాజ్యాంగాన్ని దృఢ రాజ్యాంగానికి ఉదాహరణగా పేర్కొనవచ్చు?
జ: అమెరికా
122. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పుడు బ్రిటన్ ప్రధానిగా ఎవరు వ్యవహరించారు?
జ: క్లెమెంట్ అట్లీ
123. కిందివాటిలో తప్పుగా జతచేసిన ఆర్టికల్‌ను గుర్తించండి.
      1) ఆర్టికల్ 14 - చట్టం ముందు అందరూ సమానులే
      2) ఆర్టికల్ 15 - మత, భాష, కులం, లింగం, పుట్టుక ఆధారంగా పాటించే వివక్షను నిషేధించడం
      3) ఆర్టికల్ 16 - ప్రభుత్వ ఉద్యోగాల్లో సమాన అవకాశాల కల్పన
      4) ఆర్టికల్ 17 - విద్యాహక్కు కల్పన
జ: 4 (ఆర్టికల్ 17 - విద్యాహక్కు కల్పన)
124. రాజ్యాంగ పరిషత్‌కు ప్రధాన సలహాదారుడిగా వ్యవహరించినవారు?
జ: బి.ఎన్.రావు
125. ఏ రాజ్యాంగ సవరణను మినీ రాజ్యాంగంగా అభివర్ణించవచ్చు?
జ: 42వ
126. కిందివాటిలో సరికానిదాన్ని గుర్తించండి.
      1) ఆర్టికల్ 76 - అటార్నీ జనరల్               2) ఆర్టికల్ 148 - కాగ్
      3) ఆర్టికల్ 263 - అంతర్‌రాష్ట్ర మండలి      4) ఆర్టికల్ 280 - ఎన్నికల సంఘం
జ: 4 (ఆర్టికల్ 280 - ఎన్నికల సంఘం)
127. మన దేశంలో ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేస్తున్న రాష్ట్రం ఏది?
జ: గోవా
128. పేదలకు ఉచిత న్యాయ సహాయాన్ని నిర్ధారించిన ఆర్టికల్ ఏది?
జ: 39A
129. భారతదేశం సమాఖ్య రాజకీయ వ్యవస్థ అయినప్పటికీ సమాఖ్య అనే పదాన్ని...
జ: రాజ్యాంగంలో ప్రస్తావించలేదు
130. బ్రిటిష్ ప్రభుత్వం తన 800 సంవత్సరాల సుదీర్ఘమైన పార్లమెంటరీ చరిత్రలో ఆమోదించిన అతిపెద్ద చట్టం ఏది?
జ: భారత ప్రభుత్వ చట్టం - 1935
131. జనగణమన జాతీయ గీతం పాడటానికి తీసుకోవాల్సిన సమయం ఎంత? (సెకన్లలో)
జ: 52
132. భారత రాజ్యాంగం ప్రకారం మైనర్ అంటే ఎన్ని సంవత్సరాల్లోపు వారు అని అర్థం?
జ: 18
133. రాజ్యాంగ రచన కోసం రాజ్యాంగ పరిషత్ ఏర్పరిచిన కమిటీలు ఎన్ని?
జ: 22
134. రాష్ట్రపతి ఎన్నిక విధానాన్ని ఏ దేశ రాజ్యాంగం నుంచి గ్రహించారు?
జ: ఐర్లాండ్
135. ఆదేశిక సూత్రాలు భారత రాజ్యాంగంలో ఏ భాగంలో ఉన్నాయి?
: 4వ
136. కిందివాటిలో సరైన జతను గుర్తించండి.
A) 19వ రాజ్యాంగ సవరణ

I) రాష్ట్రాల్లో లోక్‌సభ, శాసనసభ స్థానాలను ఎస్సీ, ఎస్టీలకు కేటాయింపు

B) 25వ రాజ్యాంగ సవరణ

II) ఎన్నికల సంఘం విధులు

C) 26వ రాజ్యాంగ సవరణ

III) భూ ఆక్రమణ పరిహారం గురించి

D) 45వ రాజ్యాంగ సవరణ

IV) రాజభరణాల రద్దు

జ: A-II, B-III, C-IV, D-I
137. వయోజన ఓటుహక్కు పరిమితిని 21 నుంచి 18 ఏళ్లకు తగ్గించిన సవరణ ఏది?
జ: 61వ
138. ప్రస్తుతం నమోదు ద్వారా పౌరసత్వాన్ని పొందేందుకు ఒక వ్యక్తి కనీస స్థిర నివాసం ఉండాల్సిన కాలం ఎంత?
జ: 5 సంవత్సరాలు
139. కిందివాటిలో రాష్ట్రపతి నివాసం ఏది?
      1) రాష్ట్రపతి భవన్       2) నిర్వచనా సదన్      
      3) రాజ్‌భవన్       4) అన్నీ
జ: 1 (రాష్ట్రపతి భవన్)
140. భారతదేశంలో రాజకీయ అధికారానికి మూలం ఎవరు?
జ: భారత ప్రజలు
141. కింది ఏ కేసులో సుప్రీంకోర్టు ప్రాస్పెక్టివ్ ఓవర్ రూలింగ్‌ను వివరించింది?
      1) గోలఖ్‌నాథ్ కేసు Vs స్టేట్ ఆఫ్ పంజాబ్          2) కేశవానంద భారతి కేసు Vs స్టేట్ ఆఫ్ కేరళ
      3) చంపకం దొరై రాజన్ కేసు Vs స్టేట్ ఆఫ్ మద్రాస్      4) కేహార్ సింగ్ కేసు Vs భారత ప్రభుత్వం
జ: 1 (గోలఖ్‌నాథ్ కేసు Vs స్టేట్ ఆఫ్ పంజాబ్)
142. Prevention of Immoral Traffic Act (PITA) ను చేసిన సంవత్సరం-
జ: 1955
143. మహిళలకు ఓటు హక్కును కల్పించిన తొలి దేశం ఏది?
జ: న్యూజిలాండ్
144. కింద పేర్కొన్న అంశాల్లో ఏది సమాఖ్య రాజ్యలక్షణం కాదు?
      1) లిఖిత రాజ్యాంగం       2) అధికారాల విభజన      3) న్యాయ సమీక్ష       4) ఏకపౌరసత్వం
జ: 4 (ఏకపౌరసత్వం)
145. భారత రాజ్యాంగాన్ని సవరించడానికి ఎన్ని రకాల సవరణా పద్ధతులు ఉన్నాయి?
జ: మూడు
146. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన ప్రత్యేక రాజ్యాంగ సవరణ ఏది?
జ: 32వ
147. రాజ్యాంగం అమల్లోకి రాకముందు పార్లమెంటును ఏమని వ్యవహరించేవారు?
జ: ప్రొవిజనల్ పార్లమెంట్
148. రిట్‌లను జారీచేసే అధికారం హైకోర్టులకు కల్పిస్తున్న అధికరణ ఏది?
జ: 226
149. భారత రాజ్యాంగంలో ఆదేశసూత్రాలను చేర్చడానికి ఐరిష్ రాజ్యాంగంలోని ఏ అంశం వల్ల ప్రేరణ లభించింది?
జ: డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ
150. భారత రాజ్యాంగం ప్రకారం అవశిష్ట విషయాలపై ఎవరు శాసనాలు చేస్తారు?
జ: పార్లమెంటు మాత్రమే
151. వందేమాతర గీతాలాపన ప్రప్రథమంగా ఎప్పుడు జరిగింది?
జ: 1896
152. కిందివాటిలో బ్రిటన్ నుంచి గ్రహించింది-
      1) పార్లమెంటరీ విధానం       2) స్పీకరు వ్యవస్థ      3) అటార్నీ జనరల్       4) గణతంత్ర వ్యవస్థ
జ: 4 (గణతంత్ర వ్యవస్థ)
153. జాతీయ పతాకం గురించి ఏర్పడిన కమిటీకి అధ్యక్షులు ఎవరు?
జ: బాబూ రాజేంద్రప్రసాద్
154. 7వ రాజ్యాంగ సవరణ, 1956 ద్వారా మనదేశంలో ఏర్పడిన రాష్ట్రాల సంఖ్య ఎంత?
జ: 14
155. భారత రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులకు సంబంధించి కింది వ్యాఖ్యల్లో ఏది సత్యం?
      1) ప్రాథమిక హక్కులను ప్రపంచంలోని ఇతర లిఖిత రాజ్యాంగాల్లోని వాటి కంటే విపులంగా వర్ణించారు.
      2) ప్రస్తుతం భారత పౌరులకు 7 ప్రాథమిక హక్కులు ఉన్నాయి.
      3) ఇవి ఐక్యరాజ్యసమితి మానవహక్కుల ప్రకటన వల్ల మనకు లభించాయి.
      4) అన్నీ సరైనవే
జ: 1 (ప్రాథమిక హక్కులను ప్రపంచంలోని ఇతర లిఖిత రాజ్యాంగాల్లోని వాటి కంటే విపులంగా వర్ణించారు)
156. మన జాతీయ గీతం జనగణమణను మొదటిసారిగా ఆలపించిన తేది, ప్రాంతాన్ని గుర్తించండి.
జ: 1911 డిసెంబరు 27, కలకత్తా
157. రాజ్యాంగ పరిషత్ నిర్వహణ, రాజ్యాంగాన్ని రూపొందించడానికి ఎంత ఖర్చయ్యింది?
జ: రూ.64,00,000
158. రాజ్యాంగ ప్రవేశికను ప్రప్రథమంగా ఏ రాజ్యాంగ సవరణ ద్వారా సవరించారు?
జ: 42వ
159. రాష్ట్రపతిని తొలగించే మహాభియోగ తీర్మానాన్ని ఎంతమంది సభ్యుల సంతకాలతో పార్లమెంటు ఉభయసభల్లో ఏ సభలోనైనా ప్రవేశపెట్టవచ్చు?
జ: 1/4
160. కిందివాటిలో భారత రాజ్యాంగంలోని 4వ షెడ్యూల్ దేని గురించి ప్రస్తావిస్తుంది?
      1) కేంద్ర, రాష్ట్రాల మధ్య పాలనాంశాల విభజన; కేంద్ర, రాష్ట్ర, ఉమ్మడి జాబితాల్లోని ముఖ్యాంశాలు
      2) రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు రాజ్యసభలో ప్రాతినిధ్య సీట్ల కేటాయింపు
      3) పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం
      4) రాజ్యాంగబద్ధ పదవుల్లోని వ్యక్తుల జీతభత్యాలు
జ: 2 (రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు రాజ్యసభలో ప్రాతినిధ్య సీట్ల కేటాయింపు)
161. 1949, నవంబరు 26 నుంచి అమల్లోకి వచ్చిన అంశాలు ఏవి?
      1) పౌరసత్వం       2) ఎన్నికలు      3) ప్రొవిజనల్ పార్లమెంటు       4) అన్నీ
జ: 4 (అన్నీ)
162. సామ్యవాద, లౌకిక అనే పదాలను రాజ్యాంగంలో ఏ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు?
జ: 42వ
163. అంటరానితనాన్ని ఒక పాపంగా పరిగణించి ప్రచారం చేసిన వారెవరు?
జ: మహాత్మా గాంధీ
164. 1977లో భారతరత్న లాంటి బిరుదులను చట్టవిరుద్ధంగా ప్రకటించిన రాష్ట్రం ఏది?
జ: మధ్యప్రదేశ్
165. భారతీయులకు ప్రాథమిక హక్కులను అధికారికంగా కావాలని 1931లో ఎక్కడ జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశం డిమాండు చేసింది?
జ: కరాచి
166. ఎవరి ఆమోదంతో బిల్లుకు చట్టహోదా చేకూరుతుంది?
జ: రాష్ట్రపతి
167. మాండమస్ రిట్‌కు సంబంధించి సరైనదాన్ని గుర్తించండి.
      1) ఒక ప్రత్యేక విధిని నిర్వహించమని సుప్రీంకోర్టు రిట్ జారీ చేయడం.
      2) శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు కోర్టులో హాజరయ్యే హక్కును గురించి తెలిపే లీగల్ పదం
      3) జాతీయ పార్టీలు తమ అభిప్రాయాలను అధికారికంగా తెలియజేయడం.
      4) అన్నీ సరైనవే
జ: 1 (ఒక ప్రత్యేక విధిని నిర్వహించమని సుప్రీంకోర్టు రిట్ జారీ చేయడం)
168. భారత ప్రభుత్వ చట్టం - 1935లో ఎన్ని ప్రకరణలు ఉన్నాయి?
జ: 321

Posted Date : 24-01-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌