• facebook
  • whatsapp
  • telegram

లాభనష్టాలు

ముఖ్యాంశాలు


1. అమ్మినవెల > కొన్నవెల అయినప్పుడు లాభం వస్తుంది.లాభం = అమ్మినవెల - కొన్నవెల

2. అమ్మినవెల < కొన్నవెల అయినప్పుడు నష్టం ఏర్పడుతుంది.నష్టం = కొన్నవెల - అమ్మినవెల

3. కొన్నవెల, లాభశాతం ఇస్తే, అమ్మినవెల 


4. కొన్నవెల, నష్టశాతం ఇస్తే, అమ్మినవెల

మాదిరి  సమస్యలు

1. తేజ ఒక వస్తువును 8% నష్టంతో అమ్మాడు. అతడు ఆ వస్తువును రూ.36 అదనపు ధరతో అమ్మితే 12% లాభం వస్తుంది. అయితే తేజ ఆ వస్తువును ఎంతకు కొన్నాడు?


1) రూ.150     2) రూ.180   3) రూ.200     4) రూ.240


సాధన: తేజ వస్తువును కొన్నవెల  = రూ.x అనుకోండి.


లెక్కప్రకారం,


     

సమాధానం: 2


2. వ్యాపారి ఒక కలాన్ని రూ.600 కి, ఒక పుస్తకాన్ని రూ.4000 కి కొన్నాడు. వాటిని వరుసగా 20%, 32% నష్టాలతో అమ్మాడు. మొత్తం మీద ఆ వ్యాపారికి ఎంత శాతం నష్టం వచ్చింది?

1) 21.40%           2) 26.08%   3) 30.43%           4) 28.42%

సాధన: వ్యాపారి కలాన్ని, పుస్తకాన్ని కొన్నవెల 

 = రూ.600 + రూ.4000 = రూ.4600

కలం, పుస్తకంపై లభించిన నష్టాల మొత్తం 

= రూ.120 + 1280 = రూ.1400

కలం, పుస్తకాలపై లభించిన నష్టశాతం = 


సమాధానం: 3


3. వ్యాపారి ఒక వస్తువును రూ.355 కి అమ్మితే 29% నష్టం వచ్చింది. అతడికి ఆ వస్తువును అమ్మడం ద్వారా 31% లాభం రావాలంటే  దాన్ని ఎంతకు అమ్మాలి?

1) రూ.655    2) రూ.675    3) రూ.680    4) రూ.620

సాధన: వ్యాపారి వస్తువును అమ్మినవెల = రూ.355 నష్టం = 29%

అమ్మినవెల = కొన్నవెల ´  

   సమాధానం: 1


4. వ్యాపారి ఒక వస్తువును రూ.2200 కి అమ్మితే 10% లాభం వచ్చింది. అదే వస్తువును రూ.2600 కి అమ్మితే ఎంత శాతం లాభం వస్తుంది?

1) 20%   2) 25%   3) 30%   4) 40%

సాధన: వస్తువు కొన్నవెల 


  = రూ.2000

వస్తువును రూ.2600 కి అమ్మడం ద్వారా పొందే లాభం 

= రూ.2600 -రూ.2000 = రూ.600

  = 30%      

 సమాధానం: 3


5. ఒక పండ్ల వ్యాపారి కొన్ని పండ్లను కొంత ధరకు కొన్నాడు. వాటిని అమ్మే క్రమంలో వాటిలో వ భాగం పండ్లు పాడైపోయాయి. మిగిలిన వాటిలో  వ భాగం పండ్లను 15%లాభంతో, మిగిలిన వాటిని 10% లాభంతో అమ్మితే, మొత్తం మీద ఆ వ్యాపారికి లాభమా? నష్టమా? ఎంత శాతం?

1) లాభం, 10.4%         2) నష్టం, 10.4%    3) లాభం, 9.6%         4) నష్టం, 9.6% 

సాధన: వ్యాపారి 100 పండ్లను రూ.100 కి కొన్నాడు అనుకోండి.  అంటే ఒక పండు కొన్నవెల రూ.1 అవతుంది.  1/5  పండ్లు పాడవగా, మిగిలిన పండ్లు = 


    = 100 - 20 = 80 పండ్లు 

మిగిలిన పండ్లలో 2/5 వ భాగం పండ్లను అమ్మినవెల 


                    

సమాధానం: 2


6. ఒక వస్తువు కొన్నవెల రూ.2800. ఆ వస్తువు అమ్మినవెలపై లాభాన్ని లెక్కిస్తే 20% వచ్చింది. అయితే అసలు లాభం ఎంత? (రూపాయల్లో)

1) 700      2) 750      3) 800       4) 850

సాధన: వస్తువు కొన్నవెల = రూ.2800 

అమ్మినవెల = x అనుకోండి.

లెక్కప్రకారం,  x= రూ..2800 + x × 20% 


 లాభం = 3500 -2800 = రూ.700

సమాధానం: 1


7. ఒక వ్యాపారి వస్తువులను అమ్మడం ద్వారా 13 శాతం లాభం పొందుతున్నాడు. ఒక నెలలో ఆ వ్యాపారి రూ.7,91,000ల అమ్మకం చేస్తే, అతడికి ఎంత లాభం వస్తుంది?

1) రూ.61,000        2) రూ.71,000    3) రూ.81,000        4) రూ.91,000

సాధన: వ్యాపారి అమ్మినవెల = రూ.791000

లాభం = 13 శాతం

కొన్నవెల = x అనుకోండి.


 x = రూ.7,00,000  

కొన్నవెల (x) = రూ.700000  

లాభం = అమ్మినవెల - కొన్నవెల

= 791000 -700000 = రూ.91000

సమాధానం: 4


రచయిత

సీ‡హెచ్‌. రాధాకృష్ణ

విషయ నిపుణులు 

Posted Date : 27-01-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌