• facebook
  • whatsapp
  • telegram

సమాచార హక్కు చట్టం, 2005 లోక్‌పాల్, లోకాయుక్త

1. కిందివాటిలో సమాచార హక్కు చట్టం ఉద్దేశాలు ఏవి?

ఎ) పరిపాలనలో పారదర్శకతను పెంపొందించడం

బి) అవినీతిని నిర్మూలించడం

సి) ప్రభుత్వ అధికారుల్లో జవాబుదారీతనాన్ని పెంపొందించడం

డి) ప్రజలకు సుపరిపాలనను అందించడం

1) ఎ, బి, సి    2) ఎ, సి, డి

3) ఎ, బి, డి      4) పైవన్నీ


2. సమాచార హక్కు పౌరుల ప్రాథమిక హక్కుల్లో అంతర్భాగమని సుప్రీంకోర్టు ఏ కేసు సందర్భంగా తీర్పు ఇచ్చింది?

1) రాజ్‌నారాయణ్‌ vs ఇందిరాగాంధీ కేసు

2) సందీప్‌ పాండే vs యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసు

3) మేనకాగాంధీ vs యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసు

4) నందినీ శతపథి vs  స్టేట్‌ ఆఫ్‌ ఒడిశా కేసు


3. మనదేశంలో ఎవరి కృషి ఫలితంగా సమాచార హక్కు చట్టం రూపొందింది?

1)నళినీరంజన్‌ సర్కార్, దీన్‌దయాళ్‌ బంధోపాధ్యాయ

2) అన్నా హజారే, రంజిత్‌సింగ్‌ సర్కారియా

3) సందీప్‌పాండే, అరుణారాయ్‌

4) సుభాష్‌మిశ్రా, రఘునందన్‌ పాఠక్‌


4. ‘సమాచార హక్కు చట్టం, 2005’కి సంబంధించి కిందివాటిలో సరైనవి?

ఎ) భారత రాష్ట్రపతి 2005, జూన్‌ 15న ఆమోదముద్ర వేశారు.

బి) ఇది 2005, అక్టోబరు 12 నుంచి అమల్లోకి వచ్చింది.

సి) ఈ చట్టంలో 6 చాప్టర్లు, 31 సెక్షన్లు ఉన్నాయి.

డి) ఈ చట్టం ప్రకారం ప్రభుత్వం నుంచి 17 రకాల సమాచారాన్ని పొందొచ్చు.

1) ఎ, బి, డి    2) ఎ, సి, డి    3) ఎ, బి, సి      4) పైవన్నీ


5. ‘సమాచార హక్కు చట్టం, 2005’ ప్రకారం పౌరులు ఎలాంటి సమాచారాన్ని పొందగలరు?

ఎ) ప్రభుత్వ పరిపాలనకు సంబంధించిన రికార్డులు

బి) ప్రభుత్వం వెలువరించే సర్క్యులర్లు, మెమోలు

సి) ప్రభుత్వ ఉద్యోగుల హాజరు పట్టికలు

డి) వివిధ వస్తువుల కొనుగోలుకు సంబంధించిన గణాంకాలు

1) ఎ, బి, సి   2) ఎ, బి, డి    3) ఎ, సి, డి     4) పైవన్నీ


6. ‘సమాచార హక్కు చట్టం, 2005’ నుంచి కింది ఏ అంశాలను మినహాయించారు?

ఎ) కేంద్ర ఇంటెలిజెన్స్‌ సంస్థలకు సంబంధించిన సమాచారం.

బి)  దేశ సార్వభౌమత్వానికి భంగం కలిగించే అంశాలు.

సి) దేశభద్రతకు ఆటంకం కలిగించే అంశాలు.

డి) లాగ్‌పుస్తకాలు, నమూనాలు.

1) ఎ, బి, సి    2) ఎ, బి, డి   3) ఎ, సి, డి     4) పైవన్నీ


7. కిందివాటిలో సరైనవి ఏవి?

ఎ) సమాచార హక్కు చట్టాన్ని అమలు చేసిన తొలి దేశం - స్వీడన్‌ (1766)

బి) బ్రిటిష్‌ వారి పాలనా కాలంలో 1923లో మనదేశంలో అధికార రహస్యాల చట్టాన్ని రూపొందించారు.

సి) అటల్‌బిహారీ వాజ్‌పేయీ ప్రభుత్వ కాలంలో 2002లో సమాచార స్వేచ్ఛ చట్టం రూపొందింది.

డి) సమాచార హక్కు చట్టాన్ని 2005లో పార్లమెంట్‌ ఉభయ సభల సంయుక్త సమావేశంలో ఆమోదించారు.

1) ఎ, బి, డి    2) ఎ, సి, డి    3) ఎ, బి, సి    4) పైవన్నీ


8. ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో సమాచార హక్కు చట్టాన్ని అమలు చేసే బాధ్యత ఎవరికి ఉంటుంది?

1) పబ్లిక్‌ ఇన్ఫర్మేషన్‌ ఆఫీసర్‌    2)  పబ్లిక్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌

3)  పబ్లిక్‌ అథారిటీ ఆఫీసర్‌    4)పబ్లిక్‌ అవేర్‌నెస్‌ ఆఫీసర్‌


9. ఒక వ్యక్తి ఏదైనా సమాచారం కోసం దరఖాస్తు చేసుకుంటే, ఎన్నిరోజుల్లోగా వారికి సంబంధిత సమాచారాన్ని ఇవ్వాలని సమాచార హక్కు చట్టంలో నిర్దేశించారు?

1) 15 రోజులు   2) 30 రోజులు  

3) 45 రోజులు    4) 90 రోజులు


10. సమాచార హక్కు చట్టాన్ని పర్యవేక్షించేందుకు ‘కేంద్ర సమాచార కమిషన్‌’ (CIC)  ని ఏర్పాటు చేశారు. దీని నిర్మాణానికి సంబంధించి కిందివాటిలో సరైనవి?

1) ప్రధాన కమిషనర్, అయిదుగురికి మించకుండా సమాచార కమిషనర్లు ఉంటారు.

2) ప్రధాన కమిషనర్, ఆరుగురికి మించకుండా సమాచార కమిషనర్లు ఉంటారు.

3) ప్రధాన కమిషనర్, ఏడుగురికి మించకుండా సమాచార కమిషనర్లు ఉంటారు.

4) ప్రధాన కమిషనర్, 10 మందికి మించకుండా సమాచార కమిషనర్లు ఉంటారు.


11. కిందివాటిలో సరైనవి ఏవి?

ఎ) సీఐసీ ప్రధాన, ఇతర సమాచార కమిషనర్లను రాష్ట్రపతి నియమిస్తారు.

బి) సీఐసీ మొదటి ప్రధాన సమాచార కమిషనర్‌ వజీహత్‌ హబీబుల్లా.

సి) సమాచార హక్కు చట్టం ఆన్‌లైన్‌ దరఖాస్తు పోర్టల్‌ను 2013లో ప్రారంభించారు.

డి) సుప్రీంకోర్టు విచారణను అనుసరించి సీఐసీ కమిషనర్, సభ్యులను రాష్ట్రపతి తొలగిస్తారు.

1) ఎ, బి, డి    2) ఎ, సి, డి   3) ఎ, బి, సి      4) పైవన్నీ


12. సీఐసీ ప్రధాన, ఇతర సమాచార కమిషనర్ల ఎంపిక కోసం  ఏర్పడే ‘స్క్రీనింగ్‌ కమిటీ’లో ఎవరు సభ్యులుగా ఉంటారు?

1)  ప్రధానమంత్రి, కేంద్ర కేబినెట్‌ మంత్రి, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు.

2)  ప్రధానమంత్రి, రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్, లోక్‌సభ స్పీకర్‌.

3) రాజ్యసభ ఛైర్మన్, లోక్‌సభ స్పీకర్, కేంద్ర హోంమంత్రి.

4) సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, లోక్‌సభ స్పీకర్, రాజ్యసభ ఛైర్మన్‌.


13. కేంద్ర సమాచార కమిషన్‌ ప్రస్తుత ప్రధాన కమిషనర్‌ ఎవరు?

1) సుధీర్‌ భార్గవ      2) రాజీవ్‌ మాథూర్‌

3) యశ్‌వర్థన్‌ కుమార్‌ సిన్హా    4) ప్రమోద్‌ ఛటర్జీ


14. మనదేశంలో సమాచార హక్కు చట్టాన్ని అమలు చేసిన తొలి రాష్ట్రం?

1) మహారాష్ట్ర   2) హిమాచల్‌ప్రదేశ్‌ 

3) తమిళనాడు   4) గుజరాత్‌


15. సమాచారాన్ని కోరే వ్యక్తులకు వేధింపులు, బెదిరింపుల నుంచి రక్షణ కల్పించేందుకు భారత ప్రభుత్వం రూపొందించిన చట్టం ఏది?

1)  విజిల్‌ బ్లోయర్స్‌ రక్షణ చట్టం, 2014

2) విజిల్‌ విల్లర్స్‌ రక్షణ చట్టం, 2014

3) సివిల్‌ రైట్స్‌ రక్షణ చట్టం, 2014

4) ఇన్నోవేటివ్స్‌ రక్షణ చట్టం, 2014


16. కిందివాటిలో సరైనవి ఏవి?

ఎ) సమాచార హక్కు చట్టం జమ్మూ-కశ్మీర్‌లో 2019 నుంచి అమల్లోకి వచ్చింది.

బి) సహకార సంఘాలు సమాచార హక్కు చట్టం పరిధిలోకి వస్తాయని కేరళ ప్రభుత్వం చట్టం చేసింది.

సి) సహకార సంఘాలు సమాచార హక్కు చట్టం పరిధిలోకి రావు అని సుప్రీంకోర్టు పేర్కొంది.

డి) రాజకీయ పార్టీలు కూడా సమాచార హక్కు చట్టం పరిధిలోకి వస్తాయని 2013లో కేంద్ర సమాచార కమిషన్‌ పేర్కొంది.

1) ఎ, బి, సి     2) ఎ, సి, డి    3) ఎ, బి, డి      4) పైవన్నీ


17. విచారణ జరుగుతున్నప్పుడు వ్యక్తులకు ప్రాణహాని ఉందని భావిస్తే, సమాచారాన్ని వెల్లడించాల్సిన అవసరం లేదని సమాచార హక్కు చట్టంలోని ఏ సెక్షన్స్‌ పేర్కొంటున్నాయి?

1) సెక్షన్స్‌ 8(1)(A), 8(1)(B)  

2) సెక్షన్స్‌ 8(1)(G), 8(1)(H)

3) సెక్షన్స్‌ 9(1)(C), 9(1)(D) 

4) సెక్షన్స్‌ 10(A), 10(1)(B)

సమాధానాలు

1-4,  2-1,  3-3,  4-4,  5-4,  6-1,  7-3,  8-1,  9-2,  10-4,  11-4,  12-1,  13-3,  14-3,  15-1,  16-4,  17-2.  


మరికొన్ని..

1. లోక్‌పాల్‌ బిల్లును ఇందిరాగాంధీ ప్రభుత్వం పార్లమెంట్‌లో తొలిసారి ఎప్పుడు ప్రవేశపెట్టింది?

1) 1967   2) 1968  3) 1971   4) 1982


2. ‘లోక్‌పాల్‌’కి సంబంధించి సరైనవి?

ఎ) ‘లోక్‌’ అంటే ప్రజలు, ‘పాల్‌’ అంటే సంరక్షకుడు అని అర్థం.

బి) రాజ్యసభ ‘లోక్‌పాల్‌’ బిల్లును 2013, డిసెంబరు 17న ఆమోదించింది.

సి) లోక్‌సభ ‘లోక్‌పాల్‌’ బిల్లును 2013, డిసెంబరు 18న అమోదించింది.

డి) ‘లోక్‌పాల్‌’ బిల్లుపై 2014, జనవరి 1న అప్పటి రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ ఆమోదముద్ర వేశారు.

1) ఎ, సి, డి   2) ఎ, బి, సి     3) ఎ, బి, డి     4) పైవన్నీ


3. ‘లోక్‌పాల్‌’కి సంబంధించి కిందివాటిలో సరైనవి?

ఎ) ఒక ఛైర్మన్, గరిష్ఠంగా 8 మంది సభ్యులు ఉంటారు.

బి) ఛైర్మన్, సభ్యులను రాష్ట్రపతి నియమిస్తారు.

సి) దీనికి సివిల్‌ కోర్టుకు ఉండే అధికారాలు, విధులు ఉంటాయి.

డి) దీనికి రాజ్యాంగ హోదా కల్పించేందుకు 116వ రాజ్యాంగ సవరణ బిల్లు ద్వారా ప్రయత్నించి విఫలమయ్యారు.

1)  ఎ, బి, సి    2) ఎ, బి, డి    3) ఎ, సి, డి     4) పైవన్నీ


4. లోక్‌పాల్‌ ఛైర్మన్, సభ్యుల పదవీ కాలానికి సంబంధించి కిందివాటిలో సరైంది?

1) పదవి చేపట్టిన తేదీ నుంచి అయిదేళ్లు లేదా 70 ఏళ్ల వయసు నిండేవరకు

2) పదవి చేపట్టిన తేదీ నుంచి అయిదేళ్లు లేదా 65 ఏళ్ల వయసు నిండేవరకు

3) పదవి చేపట్టిన తేదీ నుంచి అయిదేళ్లు లేదా 62 ఏళ్ల వయసు నిండేవరకు

4) పదవి చేపట్టిన తేదీ నుంచి ఆరేళ్లు లేదా 65 ఏళ్ల వయసు నిండేవరకు


5. 2019లో లోక్‌పాల్‌ తొలి ఛైర్మన్‌గా ఎవరు నియమితులయ్యారు?

1) రంజన్‌ దేశాయ్‌   2) వినయ్‌మిశ్రా 

3) జె.ఎస్‌.వర్మ     4) పినాకి చంద్రఘోష్‌


6. లోకాయుక్తకి సంబంధించి సరైనవి?

ఎ) రాష్ట్రంలో అత్యున్నతస్థాయిలో జరిగే అవినీతిని విచారించే స్వయం ప్రతిపత్తి వ్యవస్థ.

బి) లోకాయుక్త చట్టాన్ని మొదటిసారి ఒడిశా 1970లో రూపొందించింది.

సి) లోకాయుక్త చట్టాన్ని అమలుచేసిన తొలి రాష్ట్రం మహారాష్ట్ర (1971)

డి) ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో లోకాయుక్త చట్టం 1983లో రూపొందింది.

1)  ఎ, బి, సి    2) ఎ, బి, డి    3) ఎ, సి, డి     4) పైవన్నీ


సమాధానాలు

1-2    2-4    3-4    4-1    5-4    6-4

Posted Date : 20-01-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌