• facebook
  • whatsapp
  • telegram

ఐక్యరాజ్య సమితి - 2

1. ఐక్యరాజ్యసమితి ఆవిర్భావానికి కారణమైన ‘‘అట్లాంటిక్‌ చార్టర్‌’’పై 1941, ఆగస్టు 14న ఎవరెవరు సంతకాలు చేశారు?

1)  బ్రిటన్‌ ప్రధాని విన్‌స్టన్‌ చర్చిల్, అమెరికా అధ్యక్షుడు ఫ్రాంక్లిన్‌ డి.రూజ్‌వెల్ట్‌

2)  బ్రిటన్‌ ప్రధాని క్లెమెంట్‌ అట్లీ, అమెరికా అధ్యక్షుడు ఉడ్రోవిల్సన్‌

3) బ్రిటన్‌ ప్రధాని మార్గరెట్‌ థాచర్, అమెరికా అధ్యక్షుడు జార్జ్‌ వాషింగ్టన్‌

4) జర్మనీ చాన్సలర్‌ బిస్మార్క్, ఇండోనేసియా అధినేత డా.సుకర్నో


2. యునైటెడ్‌ నేషన్స్‌ (United Nations) అనే పదాన్ని ఎవరు సూచించారు?

1) బ్రిటన్‌ ప్రధాని మార్క్వెల్‌    2) అమెరికా అధ్యక్షుడు కెన్నడీ

3) బ్రిటన్‌ ప్రధాని క్లెమెంట్‌ అట్లీ     4) అమెరికా అధ్యక్షుడు ఫ్రాంక్లిన్‌ డి.రూజ్‌వెల్ట్‌


3. 1944లో ఎక్కడ జరిగిన సమావేశంలో ఐక్యరాజ్యసమితి ఏర్పాటు కోసం విస్తృత సంప్రదింపులు జరిగాయి?

1) డంబర్టన్‌ ఓక్స్‌    2) శాన్‌ఫ్రాన్సిస్కో

3) కాన్‌స్టాంట్‌నోపుల్‌  4) న్యూయార్క్‌


4. 1945, జూన్‌ 26న ఎక్కడ జరిగిన సమావేశంలో 50 దేశాల ప్రతినిధులు పాల్గొని ఐక్యరాజ్యసమితి చార్టర్‌ను రూపొందించి సంతకాలు చేశారు?

1) హిరోషిమా     2) న్యూయార్క్‌    3) శాన్‌ఫ్రాన్సిస్కో     4) వాషింగ్టన్‌


5. ప్రపంచ శాంతి స్థాపనే లక్ష్యంగా ఐక్యరాజ్యసమితిని ఎప్పుడు ఏర్పాటు చేశారు?

1) 1945, ఆగస్టు 24     2) 1945, సెప్టెంబరు 24

3) 1945, అక్టోబరు 24     4) 1945, డిసెంబరు 24


6. ఐక్యరాజ్యసమితిలో 51వ సభ్యదేశంగా చేరిన దేశం.....

1) పోలండ్‌    2) హంగేరీ    3) టర్కీ   4) న్యూజిలాండ్‌


7. ఐక్యరాజ్యసమితి ఆశయానికి సంబంధించి కింది వాటిలో సరైంది?

ఎ. రాబోయే తరాలను యుద్ధ ఉపద్రవాల నుంచి కాపాడటం.

బి. మానవులందరికీ హక్కులు, గౌరవ ప్రదమైన జీవనం లభించేలా చూడటం.

సి. అంతర్జాతీయ శాంతి భద్రతలను పరిరక్షించడం

డి. ప్రజల సాంఘిక, ఆర్థిక అభివృద్ధి కోసం కృషిచేయడం.

1) ఎ, బి సి     2)ఎ, సి, డి    3) ఎ, బి, డి     4) పైవన్నీ


8. 1943, అక్టోబరు 30న మాస్కో ప్రకటనను (Mascow Declaration) ఆమోదించిన దేశాలను గుర్తించండి. 

1) అమెరికా, బ్రిటన్, చైనా, సోవియట్‌ యూనియన్‌

2) జర్మనీ, సోవియట్‌ యూనియన్‌

3) సోవియట్‌ యూనియన్, జపాన్‌

4) బ్రిటన్, ఫ్రాన్స్, సోవియట్‌ యూనియన్‌


9. 1945లో యాల్టాలో జరిగిన సమావేశంలో పాల్గొన్న నాయకులను గుర్తించండి. 

1) క్లెమెంట్‌ అట్లీ, జోసఫ్‌ స్టాలిన్, ఫ్రాంక్లిన్‌ రూజ్‌వెల్ట్‌

2) ఫ్రాంక్లిన్‌ రూజ్‌వెల్ట్, జోసఫ్‌ స్టాలిన్, విన్‌స్టన్‌ చర్చిల్‌

3) ఉడ్రోవిల్సన్, క్లెమెంట్‌ అట్లీ, జోసఫ్‌ స్టాలిన్‌

4) విన్‌స్టన్‌ చర్చిల్, జోసఫ్‌ స్టాలిన్, కెన్నడీ


10. ఐక్యరాజ్యసమితికి రాజ్యాంగంగా పేరొందిన ‘‘చార్టర్‌’’లో ఉన్న అంశాన్ని గుర్తించండి. 

1) ఆర్టికల్స్‌ -111, అధ్యాయాలు-19         

2) ఆర్టికల్స్‌-121, అధ్యాయాలు-22

3) ఆర్టికల్స్‌-191, అధ్యాయాలు-19 

4) ఆర్టికల్స్‌ -201, అధ్యాయాలు-19


11. ప్రస్తుతం ఐక్యరాజ్యసమితిలోని సభ్యదేశాల సంఖ్య?

1) 190     2) 191     3) 192     4) 193


12. కింది వాటిలో ఐక్యరాజ్యసమితిలో సభ్యత్వం లేని దేశాలేవి?

1) వాటికన్‌సిటీ, కిర్గిస్థాన్‌    2)  తైవాన్, భూటాన్‌

3) వాటికన్‌సిటీ, తైవాన్‌    4) తైవాన్, మయన్మార్‌


13. ఐక్యరాజ్యసమితిలో సభ్యత్వం పొందిన దేశాలకు సంబంధించి కింది వాటిలో సరికానిది? 

1) 189వ సభ్యదేశం - సిరియా   2) 190వ సభ్యదేశం - స్విట్జర్లాండ్‌

3) 191వ సభ్యదేశం - తూర్పు తిమోర్‌    4) 192వ సభ్యదేశం - మాంటెనిగ్రో


14. యూఎన్‌ఓలో 193వ  సభ్యదేశంగా 2011, జులై 9న చేరిన దేశం?

1) మొరాకో   2) తజకిస్థాన్‌     3) దక్షిణ సూడాన్‌    4) జింబాబ్వే


15. ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?

1) జెనీవా   2) వియన్నా   3) న్యూయార్క్‌    4) లండన్‌


16. ఐక్యరాజ్యసమితి రాజ్యాంగంలోని ప్రవేశిక ముసాయిదాను ఎవరు రూపొందించారు?

1) ఆరాన్‌ మోర్గాన్‌ (బ్రిటన్‌)    2)  జాన్‌ క్రిస్టియాన్‌ (దక్షిణాఫ్రికా)

3)జాన్‌ ఫ్రెడరిక్‌ (సోవియట్‌ యూనియన్‌)     4) అలెగ్జాండ్రా వివియన్‌ (అమెరికా)


17. ఐక్యరాజ్యసమితి కార్యాలయానికి అవసరమైన భూమిని ఎవరు సమకూర్చారు?

1) జాన్‌.డి.రాక్‌ఫెల్లర్‌    2) ఉడ్రోవిల్సన్‌   3) మేరియా జాన్సన్‌    4) మెరింద్‌ ఫ్రాంక్లిన్‌


18. ఐక్యరాజ్యసమితి అధికార భాషలకు సంబంధించి కింది వాటిలో సరికానిది?

1) ఇంగ్లిష్, ఫ్రెంచ్‌   2) స్కాండినేవియన్, యూరో

3) రష్యన్, అరబిక్‌   4)  స్పానిష్, చైనీస్‌


19. కింది వాటిలో ఐక్యరాజ్యసమితి జెండాకు(Flag) సంబంధించి సరైంది?

ఎ) లేత నీలం రంగు బ్యాక్‌గ్రౌండ్‌పై తెలుపు రంగులో ‘‘గ్లోబు’’ ఉంటుంది

బి) గ్లోబుకి ఇరువైపులా శాంతికి చిహ్నమైన రెండు ఆలివ్‌ కొమ్మలు ఉంటాయి

సి) జెండా పొడవు, వెడల్పుల నిష్పత్తి 3 : 2గా ఉంటుంది

డి) జెండా పొడవు, వెడల్పుల నిష్పత్తిని 2019లో సవరించారు.

1) ఎ, బి, సి    2) ఎ, సి, డి   3) ఎ, బి, డి    4) పైవన్నీ


20. ఐక్యరాజ్యసమితిలోని ప్రధాన భాగాలను గుర్తించండి. 

ఎ) సాధారణ సభ (General Assembly), భద్రతా మండలి (Security Council)

బి) ఆర్థిక, సామాజిక మండలి (Economic and Social Council)

సి) ధర్మకర్తృత్వ మండలి(Trusteeship Council) సచివాలయం(Secretariat) 

డి) అంతర్జాతీయ న్యాయస్థానం(International Court of Justice)

1) ఎ, సి, డి    2) ఎ, బి, సి    3) ఎ, బి, డి     4) పైవన్నీ


సమాధానాలు

1-1  2-4  3-1  4-3  5-3  6-1  7-4  8-1  9-2  10-1  11-4  12-3  13-1  14-3  15-3  16-2  17-1  18-2 19-1 20-4


మరికొన్ని...


1. ఐక్యరాజ్యసమితిలోని ఏ ప్రధాన భాగాన్ని ‘‘ప్రపంచ పట్టణాలకు సమావేశ వేదిక’’(Meeting Venue of the World Towns)  గా అభివర్ణిస్తారు?

1) భద్రతా మండలి    2) సాధారణ సభ 

3) ఆర్థిక, సామాజిక మండలి     4) అంతర్జాతీయ న్యాయస్థానం 


2. సాధారణ సభకి సంబంధించి కింది వాటిలో సరైంది?

1) ఐక్యరాజ్యసమితిలో సభ్యదేశాలన్నీ సాధారణ సభలో సభ్యదేశాలుగా కొనసాగుతాయి

2) సభ్యదేశం సాధారణ సభకు అయిదుగురిని ప్రతినిధులుగా పంపవచ్చు

3) తీర్మానాలపై ఓటింగ్‌ సమయంలో ప్రతి సభ్యదేశానికి ఒక ఓటు ఉంటుంది

4) కీలకమైన తీర్మానాన్ని ఆమోదించేందుకు 2/3 వంతు ప్రత్యేక మెజార్టీ అవసరం

1) ఎ, బి, సి     2) ఎ, సి, డి     3) ఎ, బి, డి     4) పైవన్నీ


3. ఐక్యరాజ్యసమితి సాధారణ సభ సమావేశాలు ఏటా ఎప్పుడు ప్రారంభం అవుతాయి?

1) జులై - రెండో సోమవారం     2) సెప్టెంబరు - మూడో మంగళవారం

3) అక్టోబరు - నాలుగో బుధవారం    4) డిసెంబరు - మొదటి గురువారం


4. ఐక్యరాజ్య సమితి సాధారణ సభకు సంబంధించి కింది వాటిలో సరైంది? 

ఎ. ఇది ప్రపంచ పార్లమెంటుగా పేరొందింది

బి. భద్రతా మండలికి తాత్కాలిక సభ్యదేశాలను ఎంపిక చేస్తుంది

సి. ఐక్యరాజ్యసమితిలో నూతన సభ్యదేశాలను చేర్చుకుంటుంది

డి. సాధారణ సభకు అధ్యక్షత వహించిన తొలి మహిళ - విజయలక్ష్మీ పండిట్‌

1) ఎ, బి, డి    2) ఎ, సి, డి    3) ఎ, బి, సి     4) పైవన్నీ


5. భద్రతా మండలికి (Security Council) సంబంధించి కింది వాటిలో సరైంది?

ఎ. మొత్తం సభ్యదేశాల సంఖ్య - 15

బి. శాశ్వత సభ్యదేశాల సంఖ్య - 5

సి. తాత్కాలిక సభ్యదేశాల సంఖ్య - 10

డి. తాత్కాలిక సభ్యదేశాల పదవీ కాలం - రెండేళ్లు

1) ఎ, బి, సి    2) ఎ, సి, డి   3) ఎ, బి, డి    4) పైవన్నీ


6. భద్రతా మండలిలోని తాత్కాలిక సభ్యదేశాల ప్రాతినిధ్యానికి సంబంధించిన సరైంది? 

ఎ. ఆసియా, ఆఫ్రికాల నుంచి - 5 దేశాలు

బి. లాటిన్‌ అమెరికా నుంచి - 2 దేశాలు

సి. పశ్చిమ యూరప్‌ నుంచి - 2 దేశాలు

డి. తూర్పు యూరప్‌ నుంచి - ఒక దేశం 

1) ఎ, బి, సి   2) ఎ, సి, డి    3) ఎ, బి, డి    4) పైవన్నీ


7. భద్రతా మండలికి సంబంధించి కింది వాటిలో సరైంది?

ఎ. 1988లో నోబెల్‌ శాంతి బహుమతి లభించింది

బి. అమెరికా, రష్యా, బ్రిటన్, ఫ్రాన్స్, చైనా శాశ్వత సభ్యదేశాలు

సి. శాశ్వత సభ్యదేశాలకు ‘‘వీటో’’ ్బజునిగివ్శీ అధికారం ఉంటుంది.

డి. భారతదేశం తాత్కాలిక సభ్యదేశంగా ఇప్పటివరకు ఎనిమిదిసార్లు ఎన్నికైంది

1) ఎ, బి, సి     2) ఎ, సి, డి   3) ఎ, బి, డి     4) పైవన్నీ


8. ఐక్యరాజ్యసమితికి చెందిన ఏ అంశం ప్రస్తుతం మనుగడలో లేదు?

1) అంతర్జాతీయ న్యాయస్థానం     2) ధర్మకర్తృత్వ మండలి

3) భద్రతా మండలి   4) సాంఘిక ఆర్థిక మండలి


సమాధానాలు

1-2  2-4  3-2  4-4  5-4  6-4  7-4  8-2

Posted Date : 07-02-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌