1. వినాళ గ్రంథులు స్రవించే కొన్ని రసాయన పదార్థాలు రక్తం ద్వారా ప్రయాణించి వివిధ జీవక్రియలను నియంత్రిస్తాయి. ఈ పదార్థాలను ఏమంటారు?
జ: హార్మోన్లు
2. కిందివాటిలో అంతరస్రావ్య వ్యవస్థలో ప్రధాన భాగాలేవి?
i) అంతరస్రావ్య గ్రంథులు ii) హార్మోన్లు iii) హృదయం
జ: i, ii
3. కిందివాటిలో వినాళ గ్రంథులు ఏవి?
ఎ) ఎక్సోక్రైన్ గ్రంథులు బి) హెటిరోక్రైన్ గ్రంథులు
సి) ఎండోక్రైన్ గ్రంథులు డి) హైపర్ట్రోఫిక్ గ్రంథులు
జ: సి (ఎండోక్రైన్ గ్రంథులు)
4. అంతరస్రావ్య వ్యవస్థను అధ్యయనం చేసే శాస్త్రం ఏది?
జ: ఎండోక్రైనాలజీ
5. ఎండోక్రైనాలజీ శాస్త్ర పితామహుడు ఎవరు?
జ: థామస్ ఎడిసన్
6. కిందివాటిలో మానవ అంతరస్రావ్య వ్యవస్థలో భాగమైన గ్రంథులు ఏవి?
i) పీనియల్ దేహం ii) అవటు గ్రంథి iii) అడ్రినల్ గ్రంథి iv) హైపోథలామస్
జ: i, ii, iii, iv
7. కిందివాటిలో హార్మోన్లను ఉత్పత్తి చేయని గ్రంథి ఏది?
ఎ) పిట్యూటరీ బి) కాలేయం సి) క్లోమం డి) పారాథైరాయిడ్
జ: బి (కాలేయం)
8. ‘ఎమర్జెన్సీ హార్మోన్’ను స్రవించే గ్రంథి ఏది?
జ: అడ్రినల్
9. పారాథైరాక్సిన్ లోపం వల్ల వచ్చే వ్యాధి?
జ: టెటాని
10. కిందివాటిలో మానవుడి సాధారణ పెరుగుదలపై ప్రభావం చూపే హార్మోన్ ఏది?
ఎ) ఈస్ట్రోజన్ బి) ప్రొజెస్టిరాన్ సి) టెస్టోస్టిరాన్ డి) థైరాక్సిన్
జ: డి (థైరాక్సిన్)
11. యుక్తవయసులో కంఠంలోని మార్పునకు కారణమయ్యే హార్మోన్ ఏది?
జ: టెస్టోస్టిరాన్
12. థైరాక్సిన్ లోపం వల్ల పెద్దవారిలో వచ్చే వ్యాధి?
జ: గాయిటర్
13. థైరాక్సిన్ ఉత్పత్తికి అవసరమైన మూలకం ఏది?
జ: అయోడిన్
14. శిశువు జన్మించే ప్రక్రియలో తోడ్పడే హార్మోన్?
జ: ఆక్సిటోసిన్
15. మానవ శరీరంలో సోడియం అయాన్లను నియంత్రించే హార్మోన్ ఏది?
జ: ఆల్డోస్టిరాన్
16. కోపం రావడానికి కారణమయ్యే హార్మోన్?
జ: అడ్రినలిన్
17. పోరాడే లేదా పలాయనం చెందే గ్రంథి (ఫైట్ అండ్ ఫ్లైట్)గా దేన్ని పిలుస్తారు?
జ: అడ్రినల్
18. మెదడులో ఉండే గ్రంథి ఏది?
జ: పిట్యూటరీ
19. ఎపిథలామస్లో భాగమైన సీనియర్ దేహం లేదా ఎపిఫైసిస్ నుంచి స్రవించే హార్మోన్లు?
జ: మెలటొనిన్, సెరటొనిన్
20. అంతరస్రావ్య వ్యవస్థకు, నాడీ వ్యవస్థకు ప్రధాన సంధాన సేతువులా వ్యవహరించేది ఏది?
జ: హైపోథలామస్
21. హైపోఫైసిస్ లేదా హైపోథలామస్ సెరిబ్రి అని ఏ గ్రంథిని పిలుస్తారు?
జ: పిట్యూటరీ గ్రంథి
22. కిందివాటిని జతపరచండి.
23. సైమండ్స్ వ్యాధికి కారణం?
జ: పెరుగుదల హార్మోన్ను అధికంగా స్రవించడం
24. థైరాయిడ్ పరీక్షలో నిర్ధారిస్తున్న T3, T4 లు అంటే
జ: ట్రై అయిడో థైరోనిన్, టెట్రా అయిడో థైరోనిన్
25. హైపర్ పారా థైరాయిడిజమ్ కిందివాటిలో దేనితో అనుసంధానమై ఉంటుంది?
i) ఆస్టియో ఫ్లోరోసిస్ ii) మూత్రపిండాల్లో రాళ్లు iii) అధికంగా దాహం వేయడం iv) ఆస్టైటిస్ ఫైబ్రోసా సిస్టికా
జ: i, ii, iii, iv
26. కిందివాటిని జతపరచండి.
27. స్త్రీలలో గర్భస్రావానికి ప్రధాన కారణం?
జ: ప్రొజెస్టిరాన్ తక్కువ స్రవించడం
28. థైరాయిడ్ హార్మోన్ లోపం వల్ల పసిపిల్లల్లో కలిగే వ్యాధి?
జ: క్రెటినిజమ్
రచయిత: కొర్లాం సాయి వెంకటేష్