1. CSIR ఆధారిత సంస్థ CIMAP ఏ నగరంలో ఉంది?
జ: లఖ్‌నవూ
2. L మెంథాల్ అనే రసాయన పదార్థానికి క్యాన్సర్‌ను నివారించే లక్షణం ఉందని శాస్త్రవేత్తలు నిర్ధారించారు. ఈ పదార్థం కింది ఏ మొక్కల్లో లభిస్తుంది?
ఎ) మెంథా బి) టాక్సస్ బకేటా సి) మెంథా, టాక్సస్ బకేటా డి) ఏదీకాదు
జ: సి(మెంథా, టాక్సస్ బకేటా)
3. పాలిస్టర్ రసాయన నామం ఏమిటి?
జ: పాలీ ఇథిలీన్ టెరీప్తాలేట్
4. పాలిస్టర్‌ను జీవ విచ్ఛిత్తి చేయగల బ్యాక్టీరియల్ రకంగా జపాన్ శాస్త్రవేత్తలు కనుక్కున్నది...?
జ: ఇడియోనెల్లా సకాయిన్సెస్ 201 - F6
5. సిసాంపెలోస్ పరైరా అనే వృక్ష జాతి నుంచి కింది ఏ వ్యాధికి ఔషధాన్ని తయారుచేశారు?
ఎ) చికెన్ గున్యా బి) స్వైన్ ఫ్లూ సి) డెంగీ జ్వరం డి) ఎబోలా
జ: సి(డెంగీ జ్వరం)
6. కింది ఏ పామును శాస్త్రవేత్తలు ఇటీవల కొత్తగా కనుక్కున్నారు?
ఎ) మెలినోఫిడియం పంక్టేటం బి) మెలినోఫిడియం కైరై
సి) మెలినోఫిడియం పంక్టేటం, మెలినోఫిడియం కైరై డి) ఏదీకాదు
జ: బి(మెలినోఫిడియం కైరై)
7. బ్రెయిన్ బహుమతి పొందిన శాస్త్రవేత్త/ శాస్త్రవేత్తలు?
1) టిమోతీ బ్లిస్ 2) గ్రాహమ్ కోలిన్గ్రిడ్జ్ 3) రిచర్డ్ మోరిస్ 4) శామ్యూల్ క్లెమెన్స్
జ: 1, 2, 3
8. జికా వైరస్ వాహకం ఏది?
జ: ఎడిస్
9. కిందివాటిలో ప్రపంచంలో మొదటి వేగవంతమైన యాంటీ రాబిస్ ఔషధం ఏది?
ఎ) RMAb బి) hRIG సి) RMIG డి) ఏదీకాదు
జ: ఎ(RMAb)
10. CSIR ప్రవేశపెట్టిన మొదటి యాంటీ డయాబెటిక్ ఆయుర్వేద మందు ఏది?
జ: BGR 34
11. ఇటీవల ఏ రాష్ట్రం స్వైన్ ఫ్లూ (H1N1) వ్యాధిని ఎపిడిమిక్ డిసీజ్ యాక్ట్‌లో చేర్చింది?
జ: పంజాబ్
12. జికా వైరస్‌ను మొదట ఏ దేశంలో గుర్తించారు?
జ: ఉగాండా
13. కిర్బ్ గౌరవ్ అనే గేదెను క్లోనింగ్ ద్వారా సృష్టించిన CIRB సంస్థ ఎక్కడ ఉంది?
జ: హిస్సార్
14. భారతదేశంలో ప్రప్రథమంగా క్లోనింగ్ ద్వారా గేదెను సృష్టించిన సంస్థ ఏది?
జ: NDRI
15. కొత్తగా జీవ కృత్రిమ కాలేయాన్ని అభివృద్ధి చేసి కాలేయ వ్యాధిగ్రస్తులకు అందించిన దేశం ఏది?
జ: చైనా
16. కేంద్ర వ్యవసాయ, వ్యవసాయదారుల సంక్షేమ మంత్రిత్వ శాఖ 2016 - 17 సంవత్సరానికి ప్రకటించిన BG-II రకానికి చెందిన బీటీ కాటన్ గరిష్ఠ అమ్మకపు ధర ఎంత?
జ: రూ.800
17. 'రొటావాక్' కిందివాటిలో ఏ వ్యాధికి సంబంధించిన వ్యాక్సిన్?
ఎ) ఎల్లో ఫీవర్ బి) ఇన్ఫ్లుయెంజా సి) డయేరియా డి) జ్వరం
జ: సి(డయేరియా)
18. H1N1 వైరస్ కిందివాటిలో ఏ ఉపరకానికి (సబ్ టైప్) చెందింది?
ఎ) ఇన్ఫ్లుయెంజా A బి) ఇన్ఫ్లుయెంజా B
సి) ఇన్ఫ్లుయెంజా C డి) ఇన్ఫ్లుయెంజా D
జ: ఎ(ఇన్ఫ్లుయెంజా)
19. H1N1 అంటే...
జ: హీమ్ఎగ్లుటినిక్ టైప్ 1, న్యూరమినిడేజ్ టైప్ 1
20. ద్రవరూప పెంటా వాలెంట్ వ్యాక్సిన్ అయిన "ComBE Five"ను ఏ కంపెనీ తయారు చేయనుంది?
జ: బయోలాజికల్ ఇ లిమిటెడ్