1. గాజు తయారీలో ఉపయోగించే ముడిపదార్థాలు ఏవి?
a) సోడాయాష్ b) సున్నపురాయి c) ఇసుక d) అన్నీ
జ: d (అన్నీ)
2. రసాయనికంగా గాజు అనేది...
జ: సోడియం సిలికేట్, కాల్షియం సిలికేట్, సిలికాల మిశ్రమం
3. కిందివాటిలో గాజుకు సంబంధించి సరైంది?
a) అతి శీతలీకరణం చెందిన ద్రవం b) అస్ఫటిక పదార్థం
c) పారదర్శక లేదా పారభాసిక పదార్థం d) అన్నీ
జ: d (అన్నీ)
4. గాజుపై అక్షరాలు రాయడాన్ని ఏమంటారు?
జ: ఎచింగ్
5. ఎచింగ్ ప్రక్రియ కోసం ఉపయోగించే ఆమ్లం ఏది?
జ: హైడ్రోఫ్లోరిక్ ఆమ్లం
6. ద్రవగాజును త్వరగా చల్లబరిస్తే పెళుసుగా తయారవుతుంది. కాబట్టి వేడిగాజును ప్రత్యేక పద్ధతిలో నెమ్మదిగా చల్లబరుస్తారు. ఈ ప్రక్రియను ఏమంటారు?
జ: మంద శీతలీకరణం
7. గాజును వేడిచేసి మెత్తబరచి దానిలోకి గాలిని ఊది కోరిన ఆకృతిలో గాజు వస్తువులను తయారుచేసే ప్రక్రియను ఏమంటారు?
జ: గ్లాస్ బ్లోయింగ్
8. సున్నపురాయి రసాయనికనామం?
జ: కాల్షియం కార్బొనేట్
9. కిందివాటిని జతపరచండి.
జ: A-iii, B-i, C-iv, D-ii
10. కిందివాటిని జతపరచండి.
జ: A-iii, B-i, C-ii
11. గ్లాస్ బ్లోయింగ్ అనేది ఏ రకమైన గాజుతో సాధ్యపడుతుంది?
జ: పైరెక్స్ గాజు, బోరోసిలికేట్ గాజు
12. సెంట్రల్ గ్లాస్ అండ్ సిరామిక్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉంది?
జ: జాదవ్‌పూర్
13. సిమెంట్‌ను కనుక్కున్నది ఎవరు?
జ: జోసఫ్ ఆస్పిడిన్
14. రసాయనికంగా సిమెంట్ అంటే ఏమిటి?
జ: కాల్షియం సిలికేట్, కాల్షియం అల్యూమినేట్ల మిశ్రమం
15. సిమెంట్ తయారీలో ఉపయోగించే ముడిపదార్థాలు ఏవి?
a) సున్నపురాయి b) బంకమన్ను c) జిప్సం d) అన్నీ
జ: d (అన్నీ)
16. జిప్సం రసాయననామం?
జ: కాల్షియం సల్ఫేట్ డైహైడ్రేట్
17. జిప్సంను 120ºC వద్ద వేడిచేసినప్పుడు ప్లాస్టర్ ఆఫ్ పారిస్ (POP) అనే పదార్థం ఏర్పడుతుంది. దీన్ని ఫాల్స్ సీలింగ్, విగ్రహాల తయారీలో, విరిగిన ఎముకలు కట్టుకట్టడానికి ఉపయోగిస్తారు. POP రసాయన నామం ఏమిటి?
జ: కాల్షియం సల్ఫేట్ హెమీహైడ్రేట్
18. వ్యాధుల చికిత్సకు మందులను ఉపయోగించే ప్రక్రియను ఏమంటారు?
జ: కీమోథెరపీ
19. శరీర నొప్పిని తగ్గించే మందులను ఏమంటారు?
జ: ఎనాల్జిసిక్‌లు
20. రేడియోధార్మిక కిరణాలు ఉపయోగించి క్యాన్సర్ వ్యాధికి చికిత్స చేయడాన్ని ఏమంటారు?
జ: రేడియోథెరపీ
21. బ్యాక్టీరియా, వైరస్ లాంటి సూక్ష్మజీవుల జీవరసాయన చర్యలను అడ్డుకుని వాటి పెరుగుదలను ఆపే లేదా పూర్తిగా నశింపజేసే మందులను ఏమంటారు?
జ: సూక్ష్మజీవ నిరోధకాలు
22. కిందివాటిలో సూక్ష్మజీవ నిరోధకాలు ఏవి?
a) యాంటీబయాటిక్‌లు b) యాంటీసెప్టిక్‌లు
c) యాంటీబయాటిక్‌లు, యాంటీసెప్టిక్‌లు d) ఏదీకాదు
జ: యాంటీబయాటిక్‌లు, యాంటీసెప్టిక్‌లు
23. జ్వరాన్ని తగ్గించే మందుల వర్గాన్ని ఏమంటారు?
జ: యాంటీపైరెటిక్లు
24. కిందివాటిలో యాంటాసిడ్లు లేదా ఆమ్ల విరోధులు ఏవి?
a) అల్యూమినియం హైడ్రాక్సైడ్ b) రెనిటిడీన్ (జన్టాక్)
c) ఒమిప్రజోల్ d) అన్నీ
జ: d (అన్నీ)
25. యాంటాసిడ్‌గా ఉపయోగించే ‘మిల్క్ ఆఫ్ మెగ్నీషియం’ ఏ పదార్థ జల మిశ్రమం?
జ: మెగ్నీషియం హైడ్రాక్సైడ్
26. జీర్ణకోశంలో అధికంగా హైడ్రోక్లోరిక్ ఆమ్లం ఉత్పత్తిని ఉత్తేజపరిచే రసాయన పదార్థం?
జ: హిస్టమీన్
27. మధుమేహ వ్యాధి నివారణకు ఉపయోగించే ఇన్సులిన్‌ను కనుక్కున్న శాస్త్రవేత్త?
జ: ఎఫ్. బెంటింగ్
28. పారాసిటమాల్ అనేది ఒక.....
జ: యాంటీపైరెటిక్, ఎనాల్జిసిక్
రచయిత: పి. భానుప్రకాష్