1. కిందివాటిలో లైంగిక సంపర్కం ద్వారా వ్యాప్తిచెందే వ్యాధులు ఏవి?
i) మెనింజైటిస్ ii) గనేరియా iii) గనేరియా iv) మలేరియా
జ: గనేరియా, గనేరియా మాత్రమే
2. కిందివాటిలో ORS (ఓరల్ రీ హైడ్రేషన్ సొల్యూషన్) ద్వారా చికిత్స చేయదగ్గ వ్యాధి ఏది?
ఎ) క్షయ బి) కలరా సి) తట్టు డి) మెదడువాపు
జ: బి(కలరా)
3. 'హన్సన్' వ్యాధి అని దేనికి పేరు?
జ: క్షయ
4. ఆపిల్లో క్రౌన్గాల్ వ్యాధికి కారణమైన సూక్ష్మజీవి?
జ: ఆగ్రో బ్యాక్టీరియం ట్యుమిఫేషియన్స్
5. కిందివాటిని సరిగా జతచేయండి.
జాబితా 'ఎ' | జాబితా 'బి' |
i) డిఫ్తీరియా | a) ట్రిపనోసోమా పేలిడమ్ |
ii) పెర్టుసిస్ | b) క్లాస్ట్రీడియం టెటనై |
ii) టెటనస్ | c) బోర్డిటెల్లా పెర్టుసిస్ |
iv) సిఫిలిస్ | d) కార్ని బ్యాక్టీరియా |
జ: i-d, ii-c, iii-b, iv-a
6. పసిపిల్లల్లో ఏ వ్యాధి రాకుండా BCG వ్యాక్సిన్ను ఇస్తారు?
జ: క్షయ
7. బ్యాక్టీరియాలకు సంబంధించి సరైనవి ఏవి?
i) ఇవి ఏకకణజీవులు
ii) ఇవి కేంద్రకపూర్వ జీవులు
iii) వీటిలో ప్లాస్మిడ్లు అనే ప్రత్యేక నిర్మాణాలు కనిపిస్తాయి.
జ: i, ii, iii
8. వైడల్ పరీక్ష ద్వారా ఏ వ్యాధిని నిర్ధారించవచ్చు?
జ: టైఫాయిడ్
రచయిత: కొర్లాం సాయి వెంకటేష్