• facebook
  • whatsapp
  • telegram

అంతర్జాతీయ పర్యావరణ రక్షణ చట్టాలు

   మానవ మనుగడకు మూలాధారం ప్రకృతి. మనిషి భౌతిక అవసరాలను తీరుస్తూ మానసిక వికాసానికి దోహదం చేస్తోంది. అమెరికా పర్యావరణవేత్త ఎడ్వర్డ్‌ గోల్డ్‌ స్మిత్‌ 'అనేక అవసరాలకు ఆధారమైన ప్రకృతిని ఆధునిక మానవుడు వేగంగా నాశనం చేస్తున్నాడు' అని తెలిపాడు. పర్యావరణ పరిరక్షణకు అమెరికా పార్లమెంటు అనేక చట్టాలు చేయడంతో ‘అంతర్జాతీయ పర్యావరణ పరిరక్షణ’ ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.
          వాతావరణ మార్పుల కారణంగా భూగోళం వేడెక్కుతుందని 1827లో మొదటిసారి ఫోరీర్‌ అనే శాస్త్రవేత్త గుర్తించాడు. బొగ్గు లాంటి శిలాజ ఇంధనాల నుంచి వచ్చిన CO2, ఇతర వాయువుల వల్ల భూగోళంపై ఉష్ణోగ్రత పెరిగి భూతాపానికి దారితీస్తుందని 1886లో స్వాంటీ ఆర్హీనియన్‌ పేర్కొన్నాడు.

 

స్టాక్‌హోం సదస్సు - 1972
          ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో 1972 జూన్‌ 5 - 16 మధ్య స్టాక్‌హోం (స్వీడన్‌)లో మొదటి అంతర్జాతీయ పర్యావరణ సదస్సు జరిగింది. ఈ సమావేశంలో 26 సూత్రాలతో పర్యావరణం అభివృద్ధిపై డిక్లరేషన్‌ చేస్తూ కార్యాచరణ ప్రణాళిక కింద 109 సిఫారసులను తీర్మానం చేశారు. పర్యావరణ సమస్యలను పరిష్కరించడానికి 1972 జూన్‌ 5న ఐరాస ఏజెన్సీగా ‘ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమం (యూఎన్‌ఈపీ)’ ను ఏర్పాటు చేశారు.

దీని ప్రధాన కార్యాలయం కెన్యా రాజధాని నైరోబిలో ఉంది. దీని మొదటి ఛైర్మన్‌ మారిస్‌ స్ట్రాంగ్‌. ప్రస్తుత ఛైర్మన్‌ జోయిసే మసూయ. ప్రపంచ వాతావరణ సంస్థ, ఐక్యరాజ్య సమితి పర్యావరణ కార్యక్రమం (యూఎన్‌ఈపీ) ఆధ్వర్యంలో 1988లో ‘వాతావరణ మార్పులపై అంతరప్రభుత్వ ప్యానల్‌ (Intergovernmental Panel on Climate Change - IPCC)’  ను ఏర్పాటుచేశారు.1972 నుంచి ఏటా జూన్‌ 5న అంతర్జాతీయ పర్యావరణ అవగాహన దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు.
 

ధరిత్రి లేదా పృథ్వి సదస్సు - 1992
      1992 జూన్‌ 3 - 14 మధ్య బ్రెజిల్‌ రాజధాని రియోడిజెనీరోలో ఐక్యరాజ్యసమితి పర్యావరణ, అభివృద్ధి సదస్సు లేదా పృథ్వి సదస్సును నిర్వహించారు.
ఈ సమావేశంలో చర్చించిన అంశాలు: 
ఎ) రియో పర్యావరణ, అభివృద్ధి డిక్లరేషన్‌
బి) వాతావరణ మార్పు (UNFCCC)
సి) అజెండా - 21 (సుస్థిరాభివృద్ది)
డి) అటవీ సంరక్షణ సూత్రాలు
ఇ) జీవవైవిధ్యం
ఎఫ్‌) ఎడారీకరణ

* 1992, మే 9న కుదిరిన అంతర్జాతీయ పర్యావరణ సంధి ఫలితంగా అదే ఏడాది జూన్‌లో నిర్వహించిన ధరిత్రి సదస్సు వాతావవరణ మార్పులపై ప్రధానంగా చర్చించింది. ఫలితంగా ఐక్యరాజ్యసమితి వాతావరణ మార్పుల చట్టం (యూఎన్‌ఎఫ్‌సీసీసీ) రూపొందింది. ఇది 1994, మార్చి 21న అమల్లోకి వచ్చింది. ఈ సంధి ప్రకారం వాతావరణ మార్పులపై ఏటా సమీక్ష జరపాలని నిర్ణయించారు. 1995 నుంచి వీటిని క్రమం తప్పకుండా నిర్వహించాలని తీర్మానించారు. వీటినే యూఎన్‌ఎఫ్‌సీసీసీ లేదా COP సదస్సులు అంటారు. 1995 నుంచి 2018 వరకు మొత్తం 24 COP సదస్సులను నిర్వహించారు.
 

ఇటీవల జరిగిన సదస్సులు
        COP - 21: 2015 నవంబరు 30 - డిసెంబరు 12, పారిస్‌ 
        COP - 22: 2016 నవంబరు 7 - 18, మర్రకేష్‌
        COP - 23: 2017 నవంబరు 6 - 17, బాన్‌
        COP - 24: 2018 డిసెంబరు 3 - 14, కాటోవిస్‌ (పోలెండ్‌)
        COP - 25: 2019 నవంబరు 11 - 22, చిలీలో జరగనుంది. (వాస్తవానికి ఈ సదస్సు బ్రెజిల్‌లో జరగాలి. కానీ ఆ దేశ అధ్యక్ష ఎన్నికల దృష్ట్యా వేదికను మార్చారు)

* రియోడిజెనీరో ధరిత్రి సదస్సులో మరో అంశంగా జీవవైవిధ్య చట్టాన్ని (Convention on  Biological Diversity) ఆమోదించారు. 1993, డిసెంబరు 29 నుంచి ఇది అమల్లోకి వచ్చింది. వివిధ జాతులకు చెందిన జీవులు ఒకే సమూహంలో కలిసి జీవించడాన్ని జీవవైవిధ్యం అంటారు. అలాగే వివిధ రకాల జీవులను సంరక్షించడానికి 2000 జనవరిలో కార్టజీనా ప్రోటోకాల్‌ ఆన్‌ బయోసేఫ్టీ ఒప్పందం జరిగింది. ఇది 2003, సెప్టెంబరు 11 నుంచి అమల్లోకి వచ్చింది. ప్రపంచంలో అతిపెద్ద జీవవైవిధ్య దేశం బ్రెజిల్‌. ఏటా మే 22న అంతర్జాతీయ జీవవైవిధ్య దినోత్సవాన్ని, ఏప్రిల్‌ 22న అంతర్జాతీయ ధరిత్రి దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు.
*  స్విట్జర్లాండ్‌లోని వరల్డ్‌ వైల్డ్‌ లైఫ్‌ ఫండ్‌ (డబ్ల్యూడబ్ల్యూఎఫ్‌) ప్రపంచంలో అంతరించిపోతున్న జీవులను ‘రెడ్‌ డాటా బుక్‌’ (రెడ్‌లిస్ట్‌)లో ప్రచురిస్తుంది. ప్రస్తుతం మన దేశంలో బట్టమేకల పక్షి, కలివికోడి, ఏనుగులు, చిరుతలు అంతరించిపోతున్నట్లు పేర్కొంది.

 

ధరిత్రి సదస్సులు
         మొదటి సదస్సు - 1999, రియోడిజెనీరో (బ్రెజిల్‌)
        రెండో సదస్సు - 2002,  జొహెన్నస్‌బర్గ్‌ (దక్షిణాఫ్రికా) (రియో + 10)
        మూడో సదస్సు - 2012,  రియోడిజెనీరో (బ్రెజిల్‌) (రియో + 20)

క్యోటో ప్రోటోకాల్‌ ఒప్పందం - 1997
      జపాన్‌ రాజధాని క్యోటో వేదికగా 1997, డిసెంబరు 11న జ‌రిగిన స‌ద‌స్సులో ఈ ఒప్పందం కుదిరింది. ఈ సమావేశంలో పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన దేశాలు కర్బన ఉద్గారాలను తగ్గించాలని సమావేశ సభ్య దేశాలు తీర్మానించాయి. కార్బన్‌ ట్రేడింగ్, పరిశుభ్రత అభివృద్ధి విధానాలు, ఉమ్మడి అమలు కార్యక్రమాలను అన్ని దేశాలు పాటించాలని పేర్కొన్నారు. దీన్నే క్యోటో ప్రోటోకాల్‌ ఒప్పందం అంటారు. ఈ తీర్మానం 2005, ఫిబ్రవరి 16 నుంచి అమల్లోకి వచ్చింది.
 

మాంట్రియల్‌ ప్రోటోకాల్‌ ఒప్పందం - 1987
       భూ ఉపరితలం నుంచి 30 - 34 కి.మీ. ఎత్తులో స్ట్రాటో ఆవరణంలో ఓజోన్‌ పొర ఉంటుంది. ఇది సూర్యుడి నుంచి వచ్చే అతినీలలోహిత కిరణాలను భూమి పైకి రాకుండా అడ్డుకుంటుంది. అయితే భూమిపై క్లోరో ఫ్లోరో కార్బన్ల సంఖ్య పెరగడం వల్ల ఓజోన్‌ పొర ఛిద్రమైంది. దీన్ని మొదట 1975లో అంటార్కిటిక్‌ ఖండంపై గుర్తించారు. ఓజోన్‌ క్షీణతను తగ్గించడానికి 1987, సెప్టెంబరు 16న ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో మాంట్రియల్‌లో ఓజోన్‌ తరుగుదల సదస్సును నిర్వహించారు. దీన్నే మాంట్రియల్‌ ప్రోటోకాల్‌ ఒప్పందం అంటారు. ఈ ఒప్పందం 1989, ఆగస్టు 26 నుంచి అమల్లోకి వచ్చింది. అందువల్ల ఏటా సెప్టెంబరు 16న అంతర్జాతీయ ఓజోన్‌ అవగాహన దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు.
              

         ఇటీవల 28వ మాంట్రియల్‌ ప్రోటోకాల్‌ ఒప్పందం, COP - 21 పారిస్‌ వాతావరణ మార్పుల సదస్సులకు అనుగుణంగా 2016, అక్టోబరు 15న ఆఫ్రికా దేశమైన రువాండా రాజధాని కిగాలిలో ఓజోన్‌ తరుగుదల సమీక్ష సదస్సు జరిగింది. ఈ సమావేశంలో 2045 నాటికి 80 - 85% వరకు హైడ్రోఫ్లోరో కార్బన్లను తగ్గించాలని, 2100 సంవత్సరానికి 0.5 డిగ్రీల ఉష్ణోగ్రతను తగ్గించాలని తీర్మానం చేశారు.
 

అంతర్జాతీయ సౌరకూటమి (ఐఎస్‌ఏ) - 2018 
          భూమిపై శిలాజ ఇంధన వనరులను తగ్గిస్తూ, శిలాజేతర వనరులను పెంపొందించడానికి ప్రపంచవ్యాప్తంగా ఒక కూటమి ఏర్పాటైంది. భారత ప్రధాని మోదీ కృషితో COP -  21 పారిస్‌ సదస్సులో దీనికి బీజం పడింది. కర్కాటక, మకర రేఖల మధ్య ఉష్ణోగ్రత ఎక్కువగా పొందుతున్న 121 దేశాలతో సౌరకూటమిని ఏర్పాటు చేశారు. వీటినే సూర్యపుత్ర దేశాలు అంటారు. ఈ కమిటీ ప్రధాన ఉద్దేశం ఖనిజ చమురుకు ప్రత్యామ్నాయంగా సౌరశక్తి వనరును వినియోగించడం. దీన్నే ఇంటర్నేషనల్‌ ఏజెన్సీ ఫర్‌ సోలార్‌ పాలసీ అండ్‌ అప్లికేషన్‌ (IASPA) అని పిలుస్తారు. దీని ప్రధాన కార్యాలయం గ్యాల్‌పహరి, గురుగ్రామ్‌ (హరియాణా)లో ఉంది. మొదటి సదస్సు 2018, మార్చి 11న న్యూదిల్లీలో జరిగింది. ఈ సమావేశం 2002 నాటికి 175 గిగావాట్ల సౌరశక్తిని ఉత్పత్తి చేయాలని తీర్మానించింది. ఈ కమిటీ ప్రపంచబ్యాంక్‌ భాగస్వామ్యంగా ఉంటుంది. ఈ సదస్సుకు ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఫ్రాన్సిస్‌ హొలాండే ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

Posted Date : 01-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

విపత్తు - నిర్వహణ

1. అంతర్జాతీయ విపత్తు కుదింపు మూడో సదస్సు ఎక్కడ జరిగింది?
జ: 2015 మార్చి - సెండాయ్ ‌

 

2. కిందివాటిని జతపరచండి.

    వాయువు    అంశం/ప్రభావం
 i) మిథైల్‌ ఐసోసైనేట్‌  a) జైవిక వ్యవస్థ
 ii) ఏజెంట్‌ ఆరెంజ్  b) కిరణ ధార్మిక
 iii) రేడియో తరంగాలు  c) రసాయనిక
 iv) మైకోటాక్సిన్స్  d) పారిశ్రామిక

      i    ii   iii   iv
జ:  d   c     b    a

 

3. రాస్టార్, వెక్టార్‌ నమూనాలు ఎందులో భాగాలు?
జ: భౌగోళిక సమాచార వ్యవస్థ

 

4. నేషనల్‌ రిమోట్‌ సెన్సింగ్‌ సెంటర్‌ భూతల కేంద్రం (Earth Station) ఎక్కడ ఉంది?
జ: షాద్‌నగర్‌

5. కిందివాటిలో సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో భాగం కానిది?

1) పేదరికం, ఆకలిని నిర్మూలించడం         
 2) ఉత్పత్తి, వినియోగాన్ని పెంపొందించడం
3) క్రీడా నైపుణ్యాలను అభివృద్ధి చేయడం    
4) లింగ సమానత్వం, మహిళా సాధికారత
జ: 3 (క్రీడా నైపుణ్యాలను అభివృద్ధి చేయడం)

 

6. గ్రీన్‌పీస్‌ ఉద్యమం మొదట దేనికి వ్యతిరేకంగా జరిగింది?
జ: అణు వ్యతిరేకత

 

7.  కిందివాటిలో జల కాలుష్యం  వల్ల రాని వ్యాధి?
1) కలరా      2) కామెర్లు      3) మలేరియా      4) డయేరియా
జ: 3 (మలేరియా)

 

8. కిందివాటిని ఆరోహణ క్రమంలో అమర్చండి.
1) జాతీయ హరిత ట్రైబ్యునల్‌      2) జీవ వైవిధ్య చట్టం
3) జాతీయ వన్యప్రాణి చట్టం        4) జల కాలుష్య నియంత్రణ చట్టం
జ: 3421

 

9. పర్యావరణంపై భారత పార్లమెంట్‌ చేసిన చట్టాల్లో సరికానిది.   
1) పర్యావరణ పరిరక్షణ చట్టం - 1986           
2) బయోస్ఫియర్‌ చట్టం - 1988
3) వాయు కాలుష్య నియంత్రణ చట్టం - 1981      
4) హాట్‌స్పాట్‌ చట్టం - 2006
జ: 2 (బయోస్ఫియర్‌ చట్టం - 1988)

10. కిందివాటిలో సరైంది? 
a) క్యోటో ప్రోటోకాల్‌ ఒప్పందం వాతావరణ మార్పునకు సంబంధించింది. 
b) మాంట్రియల్‌ ప్రోటోకాల్‌ ఓజోన్‌ తరుగుదలకు సంబంధించింది.
జ: a, b సరైనవి

 

11. కిందివాటిలో సరికానిది? 
1) అంతర్జాతీయ సునామీ దినోత్సవం - నవంబరు 5    
2) అంతర్జాతీయ అటవీ దినోత్సవం - మార్చి 20
3) అంతర్జాతీయ ధరిత్రీ దినోత్సవం - ఏప్రిల్‌ 22            
4) అంతర్జాతీయ జీవవైవిధ్య దినోత్సవం - మే 22
జ: 2 (అంతర్జాతీయ అటవీ దినోత్సవం - మార్చి 20)

 

12. కిందివాటిని జతపరచండి.

         సమావేశం      వేదిక
 i) ఓజోన్‌ తగ్గుదల సదస్సు  a) న్యూదిల్లీ
 ii) అంతర్జాతీయ సౌర కూటమి సదస్సు  b) కిగాలి
 iii) COP - 24 సదస్సు   c) న్యూయార్క్‌
 iv) సుస్థిరాభివృద్ధి  లక్ష్యాల సదస్సు  d) కెటోవీస్‌
   e) పారిస్

జ: i-,b ii-a, iii-d, iv-c

13. కిందివాటిలో సరైంది ఏది?
1) సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు 2015 - 30 వరకు వర్తిసాయి 
2) SDG లో మొత్తం 17 లక్ష్యాలు, 169 ఉప లక్ష్యాలు ఉన్నాయి
3) సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను 2015, సెప్టెంబరు 25న ఆమోదించారు
జ: 1, 2, 3 సరైనవి

 

14. అప్పికో ఉద్యమం ఏ రాష్ట్రంలో జరిగింది?
జ: కర్ణాటక

 

15. కిందివాటిలో పర్యావరణ ఉద్యమాలకు సంబంధించి సరికానిది?
1) క్షిపణులకు వ్యతిరేకంగా బాలియాపాల్‌ ఉద్యమం జరిగింది.
2) మేధాపాట్కర్‌ ‘నర్మద బచావో’ ఆందోళన చేపట్టారు.
3) ఝార్ఖండ్‌లో చెట్ల నరికివేతకు వ్యతిరేకంగా జంగిల్‌ బచావో ఉద్యమం జరిగింది. 
4) యురేనియం వ్యతిరేక ఉద్యమం నిశ్శ‌బ్ద లోయలో  జరిగింది.
జ: 4 (యురేనియం వ్యతిరేక ఉద్యమం నిశ్శ‌బ్ద లోయలో జరిగింది.)

16. కిందివాటిని జతపరచండి.

 i) ధరిత్రీ సదస్సు  a) జోహెన్నస్ ‌బర్గ్‌ - 2002
 ii) పర్యావరణ సదస్సు  b) హైదరాబాద్‌ - 2012
 iii) జీవవైవిధ్య సదస్సు  c) స్టాక్‌హోం - 1972
 iv) సుస్థిరాభివృద్ధి సదస్సు  d) రియో - 1992

    i   ii   iii   iv
జ: d   c    b    a

 

17. జీవావరణ పిరమిడ్‌లో మొదటి మెట్టులో ఉన్నదెవరు?
జ: ఉత్పత్తిదారులు

 

18. కిందివాటిలో జాతీయ విపత్తు నిర్వహణ సపోర్ట్‌ ప్రోగ్రాంను నిర్వహించేది?
1) ISRO      2) GIS      3) NRSA      4) NGRI
జ: 3 (NRSA)


19. క్యోటో ప్రోటోకాల్‌ ఒప్పందం ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది?
జ: 2005, ఫిబ్రవరి 16

20. జాతీయ కార్యాచరణ ప్రణాళిక వాతావరణ మార్పు కోసం 2016 డిసెంబరులో ఎన్ని జాతీయ ప్రణాళికలను అమలుపరిచింది?
జ: 8

 

21. కిందివాటిలో సరైనవి గుర్తించండి.  
1) 2016 కరవు నిర్వహణ కరదీపిక దీర్ఘకాలిక కరవు 33% ఉన్నట్లు పేర్కొంది.
2) కరవు పీడిత ప్రాంతం కింద 35% ఉన్నట్లు పేర్కొంది.
3) 10% కంటే ఎక్కువ అవపాతం లోపించినట్లయితే దాన్ని వాతావరణ కరవు అంటారు.
జ: 1, 2, 3 సరైనవి

 

22. కిందివాటిని జతపరచండి.

 అంశం  శాతం
 i) కరవు ప్రభావం  a) 10%
 ii) వరద ప్రభావం  b) 59%
 iii) భూకంప ప్రభావం  c) 12%
 iv) తుపాన్ల ప్రభావం  d) 68%
   e) 15%

     i    ii    iii   iv
జ:  d   c    b    a

23. నైలోమీటర్‌ సాధనాన్ని దేన్ని అంచనా వేయడానికి ఉపయోగిస్తారు?
జ: వరదలు

 

24. కిందివాటిలో ఉష్ణ మండల చక్రవాత వర్గీకరణ వేగానికి సంబంధించి సరికానిది. 
1) తుపాన్‌ స్ట్రోమ్‌ : 62 - 88 కేఎంపీహెచ్‌           2) వాయుగుండం : 31 - 49 కేఎంపీహెచ్‌ 
3) అల్పపీడన ద్రోణి : 50 - 61 కేఎంపీహెచ్‌      4) సూపర్‌ సైక్లోన్‌ : 221 కేఎంపీహెచ్‌ పైన
జ: 3 (అల్పపీడన ద్రోణి : 50 - 61 కేఎంపీహెచ్‌) 

 

25. కొరియాలీస్‌ ఎఫెక్ట్‌ ప్రకారం చక్రవాతాల గమనానికి సంబంధించి సరైంది.
1) ఉత్తరార్ధ గోళంలో చక్రవాతాలు సవ్య పద్ధతిలో వీస్తాయి. 
2) దక్షిణార్ధ గోళంలో అపసవ్య పద్ధతిలో వీస్తాయి.
జ: 1, 2 రెండూ సరైనవికావు

 

26. కిందివాటిలో సరైంది ఏది? 
1) హజార్డ్‌ అనే పదం అరబిక్‌ భాష నుంచి వచ్చింది. 
2) డిజాస్టర్‌ అనే పదం ఫ్రెంచ్‌ భాష నుంచి ఆవిర్భవించింది.
జ: 1, 2 సరైనవి

27. కిందివాటిలో ప్రకృతి విపత్తుల్లో భాగం కానిది?
1) హిమపాతాలు       2) ఉరుములు, పిడుగులు      3) వన నిర్మూలన      4) ఉష్ణశీతల గాలులు
జ: 3 (వన నిర్మూలన)

 

28. ప్రస్తుతం దేశంలోని ఎన్ని రాష్ట్రాలు ప్రకృతి వైపరీత్యాలకు గురవుతున్నాయి?
జ: 27

 

29. భారతదేశంలో భౌగోళికంగా కరవులు ఎక్కువగా ఏ ప్రాంతంలో సంభవిస్తున్నాయి?
జ: పశ్చిమ - దక్షిణ భారత్‌

 

30. విపత్తు సంభవించినప్పుడు అవసరమైనవి?
1) అత్యవసర స్పందన, సహాయం        2) పునరావసం, పునర్నిర్మాణం
3) సంసిద్ధత                        4) అన్నీ
జ: 4 (అన్నీ)

 

31. కిందివాటిలో సరికానిది.  
1) జాతీయ విపత్తు ప్రతిస్పందన దళాన్ని (NDRF) విపత్తు చట్టం సెక్షన్‌ 44 ప్రకారం ఏర్పాటు చేస్తారు.
2) NDRF కేంద్ర హోంమంత్రి నిర్వహణలో ఉంటుంది.
3) NDRF లో ప్రస్తుతం 12 బెటాలియన్లు ఉన్నాయి.
4) ప్రస్తుతం 10వ CRPF బెటాలియన్‌ విజయవాడలో ఉంది. 4
జ:  4  

32. ప్రపంచంలో సంభవించే వైపరీత్యాల్లో కిందివాటిలో సరికానిది? 
1) భూకంపాల వల్ల 8% నష్టం కలుగుతుంది      2) వరదల వల్ల 30% నష్టం కలుగుతుంది
3) చక్రవాతాల వల్ల 21% నష్టం కలుగుతుంది.     4) కరవుల వల్ల 20% నష్టం కలుగుతుంది.
జ: 4 (కరవుల వల్ల 20% నష్టం కలుగుతుంది.)

 

33. ఏదైనా భౌగోళిక ప్రాంతంలో లేదా ఒక కమ్యూనిటీలో సంభవించే వైపరీత్యాల వల్ల జరిగే నష్ట తీవ్రత, పరిధి, పరిస్థితులు దేనికి దారితీస్తాయి?
జ: దుర్బలత్వం

 

34. 1999, ఆగస్టు 20న విపత్తు నిర్వహణపై అత్యున్నతాధికార కమిటీని ఎవరి అధ్యక్షతన వేశారు?
జ: జె.సి. పంత్‌

 

35. విపత్తు తీవ్రతను సాధారణంగా దేన్ని బట్టి అంచనా వేస్తారు?
జ: ప్రాణ, ఆస్తి నష్టం

 

36. కిందివాటిలో విపత్తులు, వాటి నోడల్‌ మంత్రి బాధ్యతలను జతపరచండి.

    విపత్తు      మంత్రి
 i) పరిశ్రమలు - రసాయనాలు  A) హోంమంత్రి
 ii) హిమపాతాలు  B) వ్యవసాయ మంత్రి
 iii) కరవులు  C) రక్షణ మంత్రి
 iv) NDRF  D) పర్యావరణ - అటవీ మంత్రి
   E) పరిశ్రమల మంత్రి

    i     ii   iii   iv
జ: D   C    B   A

37. కింది అంశాల్లో సరైన వాటిని గుర్తించండి.
1) జాతీయ విపత్తు నిర్వహణ మొదటి సమావేశం న్యూదిల్లీలోని విజ్ఞాన్‌ భవన్‌లో 2006, నవంబరు 29న జరిగింది.
2) జాతీయ విపత్తు నిర్వహణ సమావేశాలకు ప్రధాన మంత్రి అధ్యక్షత వహిస్తారు.
జ: 1, 2 సరైనవి

 

38. కిందివాటిని జతపరచండి.

 కమిటీ   ఛైర్‌పర్సన్
 i) కేబినెట్‌ కమిటీ   A) కేంద్ర హోంమంత్రి
 ii) జాతీయ సంక్షోభ నిర్వహణ కమిటీ  B) హోం కార్యదర్శి
 iii) జాతీయ కార్యనిర్వహణ కమిటీ  C) కేబినెట్‌ కార్యదర్శి
 iv) విపత్తు సమన్వయ కమిటీ   D) ప్రధానమంత్రి

   i    ii    iii   iv
జ: D   C    B    A

 

39. అంతర్జాతీయ విపత్తు తగ్గింపు మూడో సదస్సు 2015, మార్చి 18న ఎక్కడ జరిగింది?
జ: సెండాయ్‌

40. నూతన జాతీయ విపత్తు నిర్వహణ ప్రణాళిక (NDMP) ను 2016, జూన్‌ 1న న్యూదిల్లీలో ఎవరు విడుదల చేశారు?  
జ: ప్రధానమంత్రి  

 

41. కిందివాటిని జతపరచండి.     

 సంస్థ  కార్యాలయం
 i) అంతర్జాతీయ విపత్తు తగ్గింపు సంస్థ  A) బ్యాంకాక్
 ii) ఆసియా విపత్తు ప్రతిస్పందన సంస్థ  B) జెనీవా
 iii) సార్క్‌ విపత్తు తగ్గింపు సంస్థ  C) నాగ్‌పుర్‌
 iv) నేషనల్‌ సివిల్‌ డిఫెన్స్‌ కాలేజీ  D) దిల్లీ
   E) పుణె

    i    ii   iii   iv
జ: B   A   D   C

 

42. కింది అంశాల్లో సరైనవాటిని గుర్తించండి.
1) అంతర్జాతీయ సునామీ అవగాహన దినోత్సవం - నవంబరు 5
2) జాతీయ విపత్తు అవగాహన దినోత్సవం - అక్టోబరు 29
3) అంతర్జాతీయ విపత్తు కుదింపు దశాబ్దం - 1990 - 2000
జ: 1, 2, 3

43. దీర్ఘకాలిక విపత్తు ప్రణాళిక అభివృద్ధిని ఏ రకమైన విపత్తు స్థాయిలో సూచిస్తారు?
జ: L3

 

44. ‘జాతీయ విపత్తు నిర్వహణ ప్రణాళిక’ (NDMP)లో మొత్తం ఎన్ని లక్ష్యాలు ఉన్నాయి?
జ: 14

 

45. కింది అంశాల్లో సరైనవి. 
1) విపత్తు సహాయ నిధిని ఏర్పాటుచేయాలని 9వ ఆర్థిక సంఘం మొదట సిఫారసు చేసింది.
2) 13వ ఆర్థిక సంఘం సిఫారసు మేరకు జాతీయ విపత్తు సహాయక నిధిని 2010, ఏప్రిల్‌ 1న ప్రారంభించారు.
3) 14వ ఆర్థిక సంఘం 2015-20కి గాను ఆంధ్రప్రదేశ్‌కు రూ.2,489 కోట్లను సిఫారసు చేసింది.
జ: 1, 2, 3

Posted Date : 01-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

పర్యావరణ పరిరక్షణ చట్టం - భారతదేశం

మాదిరి ప్ర‌శ్న‌లు

1. జాతీయ వన్యప్రాణి సంరక్షణ చట్టం భారతదేశంలో ఎప్పుడు అమల్లోకి వచ్చింది? (ఏఈ, 2015)
జ: 1972

 

2. భారతదేశంలోని పర్యావరణ పరిరక్షణ చట్టాలను ఆరోహణ క్రమంలో అమర్చండి. (ఏఎస్‌వో, 2018)
a) జాతీయ వన్యప్రాణి చట్టం            b) జీవ వైవిధ్య చట్టం 
c) వాయుకాలుష్య నియంత్రణ చట్టం         d) నీటి కాలుష్య నియంత్రణ చట్టం
జ: a, d, c, b

 

3. కిందివాటిలో జీవవైవిధ్య సంరక్షణ కేంద్రాలతో భౌగోళిక సరిహద్దు లేనివి? (గ్రూప్‌ 4, 2018)
1) జాతీయ పార్కులు            2) జీవగోళ సంరక్షణ ప్రాంతాలు
3) అభయారణ్యాలు            4) జల సంరక్షణ ప్రాంతాలు
జ: 3 (అభయారణ్యాలు)

 

4. భారతదేశంలో 2016 వాతావరణ మార్పు జాతీయ కార్యచరణ ప్రణాళికలో భాగంగా ఎన్ని జాతీయ మిషన్లు ప్రారంభించారు? (గ్రూప్‌ 1, 2017)
జ: 8

5. కిందివాటిని జతపరచండి. (ఎస్సై, 2016)    

         చట్టాలు  ఆమోదించిన సంవత్సరం
 i) నీటి కాలుష్య నియంత్రణ చట్టం  a) 1974
 ii) వాయుకాలుష్య నియంత్రణ చట్టం  b) 1981
 iii) పర్యావరణ పరిరక్షణ చట్టం  c) 1986
 iv) జీవవైవిధ్య చట్టం  d) 2002 
   e) 1985

    i     ii    iii     iv 
జ: a    b     c     d

 

6. భారతదేశ జీవవైవిధ్య సంరక్షణ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? (ఏఈఈ, 2016)
జ: చెన్నై

 

7. జాతీయ పర్యావరణ పరిరక్షణ చట్టాన్ని ఎప్పుడు ఆమోదించారు? (గ్రూప్స్, 2017)
జ: 1986

Posted Date : 01-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

అంతర్జాతీయ పర్యావరణ రక్షణ చట్టాలు

మాదిరి ప్ర‌శ్న‌లు

1. క్యోటో ప్రోటోకాల్‌ ఒప్పందం దేనికి సంబంధించింది? (ఏఈ, 2015)
జ: వాతావరణ మార్పు

 

2. క్యోటో ప్రోటోకాల్‌ ఒప్పందం ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది? (ఏఈఈ, 2016)
జ: 2005, ఫిబ్రవరి 16

 

3. 2022 నాటికి భారతదేశం ఎన్ని గిగావాట్ల సౌరశక్తిని ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించింది? (గ్రూప్‌ - 1, 2017)
జ: 100

 

4. అంతరించిపోతున్న జీవులను లెక్కించడానికి ఉపయోగించే పుస్తకం (ఎస్‌ఐ, 2016)
జ: రెడ్‌లిస్ట్‌

 

5. అంతర్జాతీయ మొదటి పృథ్వి సదస్సును ఎప్పుడు నిర్వహించారు? (ఎస్‌ఏ, 2018)
జ: 1992

6. కిందివాటిని జతపరచండి.

   జాబితా - I     జాబితా - II
 i) పర్యావరణ దినోత్సవం  A) సెప్టెంబర్‌ 16
 ii) జీవవైవిధ్య దినోత్సవం  B) ఏప్రిల్‌ 22
 iii) ధరిత్రి దినోత్సవం  C) మే 22
 iv) ఓజోన్‌ దినోత్సవం  D) జూన్‌ 5

    i     ii     iii   iv
జ: D   C     B     A

7. కిందివాటిని జతపరచండి.   

     సదస్సులు    సంవత్సరం
 i) క్యోటో ప్రోటోకాల్‌ ఒప్పందం  A) 1987
 ii) మాంట్రియల్‌ ప్రోటోకాల్‌  B) 1997
 iii) అంతర్జాతీయ సౌర కూటమి సదస్సు  C) 2016
 iv)  ఓజోన్‌ తరుగుదల సదస్సు  D) 2018

      i        ii       iii       iv
జ: B      A       D        C

8. కార్బన్‌పై ట్యాక్స్‌ విధించిన మొదటి దేశం
జ: న్యూజిలాండ్‌

 

9. UNEP ని విస్తరించండి.
జ: United Nations Environment Programme

 

10. మొదటి అంతర్జాతీయ పర్యావరణ సదస్సును ఎక్కడ నిర్వహించారు?
జ: స్టాక్‌హోం

Posted Date : 01-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

పర్యావరణం - కాలుష్య కారకాలు

           పర్యావరణం సరళమైంది, సంక్లిష్టమైంది. అది శుద్ధంగా ఉన్నంతవరకు సరళంగా ఉంటుంది. కానీ కొన్ని అనూహ్య మార్పులు సంభవించినప్పుడు సంక్లిష్టంగా మారుతుంది. ఇలా పర్యావరణంలో వివిధ మార్పులు సంభవించడాన్నే కాలుష్యం అంటారు.

           కాలుష్య కారకాలు భౌతిక ఏజెంట్లుగా వ్యవహరిస్తాయి. ఇవి ఉండాల్సిన పరిమాణం కంటే ఎక్కువగా ఉండి పర్యావరణం నుంచి గ్రహించే వనరుల భౌతిక, రసాయనిక, శారీరక ధర్మాల్లో మార్పులు వచ్చినప్పుడు పర్యావరణం కలుషితమవుతుంది. ఇలా పర్యావరణానికి ఉన్న స్వాభావిక లక్షణాలైన భౌతిక, రసాయనిక అంశాల్లో పరిణామాలు ఏర్పడటాన్నే కాలుష్య కారకాలు అంటారు. ఈ కారకాల్లో ప్రధానంగా నీటి కాలుష్యం, శబ్ద కాలుష్యం; వాయు, ఘన వ్యర్థ పదార్థాలు, థర్మల్, రేడియో ఆక్టల్‌ కాలుష్యాలు ప్రధానమైనవి.


జల కాలుష్యం: 
           జీవరాశులకు గాలి, ఎండ ఎంత అవసరమో నీరు కూడా అంతే అవసరం. భూ ఉపరితలంపై 71 శాతం నీరు ఆవరించి జీవరాశులకు వివిధ రకాలుగా ఉపయోగపడుతుంది. మానవుడి శరీరంలో 90% నీరు ఉంటుంది. ఆక్సిజన్, హైడ్రోజన్‌ వాయువుల 1 : 2 నిష్పత్తి సమ్మేళనాల ద్వారా ఏర్పడిన ద్రవపదార్థమే నీరు. ఇది జీవజాల సహజ ప్రధాన వనరు. కాబట్టి నీటిని అత్యంత విలువైన వనరుగా పరిగణిస్తారు. నీరు లేకపోతే భూమిపై జీవం ఉండదు.

ఉదా: 1986 ఏప్రిల్‌లో భారత ప్రభుత్వం గంగానదిలో కాలుష్యాన్ని తగ్గించడానికి ‘గంగా యాక్షన్‌ ప్రణాళిక’ అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది. దీన్ని 2000 మార్చిలో ఉపసంహరించారు. మళ్లీ ఈ నది 1760 కి.మీ. పొడవున కలుషితమవడంతో 2014 డిసెంబరులో ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర జలవనరుల శాఖ నిర్వహణలో గంగానది కాలుష్యాన్ని తొలగించడానికి ‘నమామి గంగా’ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ప్రధాన కారణాలు:

* మానవ వ్యర్థాలు మేటవేయడం, గృహాల్లోని వ్యర్థాలు
* పారిశ్రామిక వ్యర్థాలు, రసాయనిక క్రిమి సంహారకాలు
* విషపూరితమైన లోహ మూలకాలు, మందులు, వ్యర్థాలు మొదలైన వాటివల్ల నీరు కలుషితమవుతుంది.

 

ప్రభావాలు:
* జల కాలుష్యం అనేక దుష్ఫలితాలకు దారి తీస్తుంది.
* స్వచ్ఛమైన నీరు అనేక రకాల వ్యర్థాల వల్ల మురుగు నీరుగా మారి నీటి స్వచ్ఛతను క్షీణింపజేస్తుంది.
ఉదా: నీటిని శుద్ధి చేయడానికి హాలోజన్‌ బిళ్లలను వినియోగించాలి.

* నీటిలో అనేక వ్యర్థాలు కలవడం వల్ల వివిధ రకాల వ్యాధులు వ్యాపిస్తాయి. నీటి కాలుష్యం వల్ల ప్రధానంగా కలరా, కామెర్లు (జాండీస్‌), డిఫ్తీరియా, డయేరియా లాంటి వ్యాధులు సంక్రమిస్తాయి.
ఉదా: డయేరియా వ్యాపించినప్పుడు వేడి చేసిన నీరు, టీ డికాషన్, లేత కొబ్బరి నీళ్లను తాగాలి.
* చమురు శుద్ధి ద్వారా వచ్చే వ్యర్థాలు, ఇతర ఉత్పత్తులు సముద్రంలో కలవడం వల్ల ఆ నీరు కలుషితమవుతుంది.
ఉదా: సముద్రాల్లోని వ్యర్థాల వల్ల చేపల్లో హైడ్రోకార్బన్ల సంఖ్య పెరిగి క్యాన్సర్‌ కారక వ్యాధులు సంక్రమిస్తున్నాయి.
* నదులు, సముద్రాల్లో అనేక కలుషితాల ద్వారా ఆక్సిజన్‌ తగ్గి వాతావరణంలోని ఉష్ణోగ్రత మార్పునకు
దారితీస్తుంది. ఈ మార్పు జలచరాల పునరుత్పత్తిని ప్రభావితం చేస్తుంది.
ఉదా: మానవ జీవ వ్యర్థాలు నీటిలో కలవడం వల్ల నత్రజని శాతం పెరిగి, ఆక్సిజన్‌ తగ్గి జీవులు మరణిస్తున్నాయి. దీనివల్ల ప్రస్తుతం బయాలాజికల్‌ ఆక్సిజన్‌ డిమాండ్‌ పెరుగుతుంది.
* నీటి కాలుష్యాన్ని బయాలాజికల్‌ ఆక్సిజన్‌ డిమాండ్‌ పారామీటర్‌ ద్వారా అంచనా వేస్తారు.

 

ధ్వని కాలుష్యం:
         ప్రస్తుతం పారిశ్రామికీకరణ, పట్టణీకరణ, ఆధునికీకరణ వేగంగా జరుగుతుండటంతో ధ్వని కాలుష్య పరిమాణం పెరుగుతుంది.
          తీవ్రమైన శబ్దాన్నే ధ్వని అంటారు. శబ్దం అనేది శక్తికి ఒక రూపం. ఎలాంటి కంపనమైనా శబ్దాన్ని సృష్టిస్తుంది. శబ్దం వాయు, ఘన, ద్రవ మాధ్యమాల ద్వారా ప్రయాణిస్తుంది. కొన్నిసార్లు శబ్దాల స్థాయి తీవ్రంగా, మరికొన్నిసార్లు తక్కువగా ఉంటుంది. పీడన స్థాయిని బట్టి ధ్వనిని యూనిట్‌లలో కొలుస్తారు. ధ్వని తీవ్రతను డెసిబుల్స్‌లో (db) సూచిస్తారు.

* పీడనాన్ని బట్టి ధ్వనిని రెండు రకాలుగా వర్గీకరించారు.
            1) శబ్ద తీవ్రత                   2) శబ్ద స్థాయి
* ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) పగటి సమయంలో 45 db, రాత్రివేళలో 35 db; సగటున 50 - 90 డెసిబుల్స్‌ మధ్య ఉండే శబ్దాన్ని ధ్వనిగా పేర్కొంది. గరిష్ఠంగా 120 డెసిబుల్స్‌ ధ్వని పీడనాన్ని మానవులు సురక్షితంగా వినగలుగుతారు. 120 డెసిబుల్స్‌ పీడనం కంటే ఎక్కువగా ఉండే ధ్వనులు పర్యావరణంలో హానికరమైన ప్రభావాలను ఉత్పన్నం చేసి ధ్వని కాలుష్యాన్ని కలిగిస్తాయి.

 

జాతీయ కాలుష్య నియంత్రణ మండలి (NCPB) ప్రకారం వివిధ ప్రాంతాల్లో ఉండాల్సిన శబ్ద స్థాయి:  
1) పారిశ్రామిక ప్రాంతాలు : 65 - 75 db
2) వాణిజ్య ప్రాంతాలు : 50 - 60 db
3) నివాస ప్రాంతాలు : 40 - 50 db
4) ఆసుపత్రులు, విద్యాసంస్థలు, ఆధ్యాత్మిక ప్రాంతాలు, నిశ్శబ్ద ప్రాంతాలు : 30 - 40 db
ఉదా: దిల్లీలో శబ్ద కాలుష్యానికి గురవుతున్న 60 ఏళ్ల వయసున్న వారిని మౌలానా ఆజాద్‌ మెడికల్‌ కాలేజీలోని ‘వృత్తిపరమైన, పర్యావరణ ఆరోగ్య కేంద్రం’ అధ్యయనం చేసింది. వారు వయసుతో నిమిత్తం లేకుండా సాధారణ వయసు కంటే 15 ఏళ్లు ముందుగానే వినికిడి సమస్య బారిన పడుతున్నట్లు వెల్లడించింది. అంటే సైన్స్‌ ప్రకారం 75 ఏళ్లకు రావాల్సిన వినికిడి సమస్యలు 60 ఏళ్లకే వస్తున్నాయి.

కారణాలు:
* లౌడ్‌ స్పీకర్లు, సైరన్ల వాడకం పెరగడం
* నగరాలకు సమీపంలో ఉన్న పారిశ్రామిక యంత్రాల ధ్వనులు
* థర్మల్‌ పవర్‌ ప్లాంట్లు; గనులు, ఖ్వారీల బ్లాస్టింగ్‌
* విమానాశ్రయాలు, వివిధ వాహనాల ద్వారా వెలువడుతున్న ధ్వని

 

ప్రభావాలు:
* ధ్వని కాలుష్యం పర్యావరణ స్వచ్ఛతను, వివిధ ప్రాణులను ప్రభావితం చేస్తుంది.
* మానవుల శరీరంలోని వివిధ వ్యవస్థలు చేసే పనులకు అడ్డుపడుతుంది.
ఉదా: నరాలపై ఒత్తిడి పెరగడం, నిద్రలేమి, జీర్ణక్రియ సరిగ్గా పనిచేయకపోవడం, అధిక రక్తపోటు లాంటివి సంభవిస్తాయి.
* నాడులు సక్రమంగా పనిచేయకపోవడానికి కారణం ధ్వని కాలుష్యం.
ఉదా: రక్తంలో కొవ్వు శాతం పెరగడం, గర్భస్థ శిశువులకు వచ్చే ప్రమాదాలు.
* తాత్కాలికంగా లేదా శాశ్వతంగా వినికిడి శక్తిని కోల్పోయే ప్రమాదం ఉంటుంది.
* ధ్వని కాలుష్యం వల్ల నరాల బలహీనత, హైపర్‌టెన్షన్, మైగ్రేన్, ఒత్తిడి పెరుగుతాయి.
ఉదా: కార్డియో వ్యాస్కులర్, జీర్ణవ్యవస్థ ప్రక్రియ అస్తవ్యస్తంగా మారుతుంది.

కిరణధార్మిక (న్యూక్లియర్‌) కాలుష్యం:

          అణు విద్యుత్, అణు సంబంధిత పరిశ్రమలు, అధునాతన వైద్య పరికరాల నుంచి వెలువడే కిరణధార్మిక వ్యర్థాలను రేడియో ధార్మిక కాలుష్యం అంటారు. థోరియం, యురేనియం, ఆక్టీనియం, రేడియం, గాలి, నీరు భూమిపై నిక్షిప్తమై ఉంటాయి. ఈ ఖనిజాలు న్యూక్లియర్‌ రియాక్టర్లలో పరమాణు కేంద్రకాన్ని విచ్ఛిన్నం చేసి విద్యుత్, కిరణధార్మిక వ్యర్థాలను విడుదల చేస్తాయి.
ఉదా: ఒక అణుబాంబు పేలితే 50% శక్తి, 33% ఉష్ణం, 17% కిరణధార్మిక దుమ్ము వెలువడుతుంది.

 

కారణాలు:
* అణు విద్యుత్‌ శక్తి కర్మాగారాలు
* అణు సంబంధిత పరిశ్రమలు
* వైద్య పరికరాలుగా ఉపయోగించే ఎమ్‌ఆర్‌ఐ సీటీ స్కాన్, ఎక్స్‌రే, రేడియోఆక్టివ్‌లు

 

ప్రభావాలు:
* శరీరం అలసిపోయి కండరాలు దెబ్బతినడం, లుకేమియా, అకాల వార్థక్యం, ఆయువు తగ్గడం, అంగవైకల్యం వస్తాయి.

ఉదా: 1986, ఏప్రిల్‌ 26న రష్యాలోని ఉక్రెయిన్‌లో జరిగిన చెర్నోబిల్‌ అణు దుర్ఘటన వల్ల ఏర్పడిన రేడియేషన్‌ ప్రభావానికి 50% మంది ప్రజలు మరణించారు. కొంతమంది వెంట్రుకలు ఊడిపోయి, క్రోమోజోమ్‌లు దెబ్బతిని, అనేక క్యాన్సర్‌ వ్యాధుల బారినపడ్డారు.

Posted Date : 01-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

పర్యావరణం - సమకాలీన అంశాలు

మాదిరి ప్ర‌శ్న‌లు

1. 2016లో ప్రపంచ వలస పక్షుల దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహించారు?
జ: మే 10

 

2. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవల వెల్లడించిన నగర వాయు గుణాత్మక డేటాబేస్ ఆధారంగా అత్యంత కలుషిత మురికివాయువును కలిగి ఉన్న నగరం ఏ దేశంలో ఉంది?
జ: ఇరాన్

 

3. గోల్డెన్ మసీర్ చేప పునరావాసం, సంరక్షణ కోసం వాటిని కృత్రిమంగా అభివృద్ధి చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన రాష్ట్రం ఏది?
జ: హిమాచల్‌ప్రదేశ్

 

4. ఏ చేపను భారత నదీజలాల పులిగా పేర్కొంటారు?
జ: గోల్డెన్ మసీర్ చేప

 

5. ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ జీవవైవిధ్య దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు?
జ: మే 22

 

6. అసోచామ్ (ASSOCHAM) - KPMG సంయుక్తంగా నిర్వహించిన అధ్యయనం ప్రకారం ఎలక్ట్రానిక్ వ్యర్థాలు వెలువరించడంలో మన దేశం ఎన్నో స్థానంలో ఉంది?
జ: 5వ

7. కిందివాటిలో దేనికి భారతదేశ జీవవైవిధ్య పురస్కారం 2016 లభించింది?
ఎ) సునాబేడా పులుల సంరక్షణా కేంద్రం               బి) కుద్రేముఖ్ జాతీయ పార్క్
సి) పక్కే పులుల సంరక్షణా కేంద్రం                       డి) మేగమలై వన్యప్రాణి సంరక్షణా కేంద్రం
జ: సి( పక్కే పులుల సంరక్షణా కేంద్రం)

 

8. ఆసియాలోనే ప్రప్రథమ గిప్స్ రాబందుల పునర్‌ప్రవేశ కార్యక్రమాన్ని ఏ రాష్ట్రంలో ప్రారంభించారు?
జ: హరియాణా

 

9. కిందివాటిలో రాబందుల జనాభా గణనీయంగా తగ్గడానికి కారణమైన ప్రధాన రసాయనం ఏది?
జ: డైక్లోఫినాక్

 

10. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని నిర్వహించడానికి ఐక్యరాజ్య సమితి ఏ సంవత్సరంలో ఆమోదం తెలిపింది?
జ: 1972

 

11. మనదేశంలో నగర జంతువును ప్రకటించిన మొట్టమొదటి నగరం ఏది?
జ: గువాహటి

 

12. ప్రపంచంలో అటవీ నిర్మూలనను నిషేధించిన మొదటి దేశం ఏది?
జ: నార్వే

13. 'మరుభూమీకరణపై పోరు' ప్రపంచ దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు?
జ: జూన్ 17

 

14. ప్రపంచ హైడ్రోగ్రఫీ దినోత్సవాన్ని ఏ నెలలో జరుపుకుంటారు?
జ: జూన్

 

15. సముద్రాలు, సరస్సులు, నదులు లాంటి జల సంబంధ అంశాల కొలతలు, వర్ణనకు సంబంధించిన అధ్యయనాలు చేసే అనువర్తిత శాఖగా దేన్ని పేర్కొంటారు?
జ: హైడ్రోగ్రఫీ

పర్యావరణం సంబంధ‌ సమకాలీన అంశాలు

1. ఇటీవల NABARD (నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్) కింది ఏ పర్యావరణ సంబంధ సంస్థతో ప్రధాన గుర్తింపు ఒప్పందం (AMA - Accreditation Master Agreement) పై సంతకం చేసింది?
జ: GCF - గ్రీన్ క్లైమేట్ ఫండ్

 

2. GCF కి సంబంధించి కిందివాటిలో సరైన వాక్యాలేవి?
i) దీన్ని దక్షిణ కొరియాలో స్థాపించారు.
ii) దీన్ని UNFCC (United Nations Framework Convention on Climate Change) అధీనంలో ఉన్న సంస్థగా పేర్కొనవచ్చు.
iii) 2015లో అమల్లోకి వచ్చిన పారిస్ ఒప్పందానికి ఇది కేంద్ర బిందువు.
iv) సుమారు 24 మంది సభ్యులు ఉన్న ఒక బోర్డు అధీనంలో దీని పరిపాలన సాగుతుంది.
v) అభివృద్ధి చెందుతున్న దేశాల్లో వాతావరణ మార్పులను నిరోధించడానికి దీన్ని స్థాపించారు.
జ: i, ii, iii, iv , v

 

3. పులుల సంరక్షణపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ టైగర్ డేని (Global Tiger or International Tiger day) సాధారణంగా ఏ రోజు నిర్వహిస్తారు?
జ: జులై 29

4. సెయింట్ పీటర్స్‌బర్గ్ డిక్లరేషన్ కిందివాటిలో దేనికి సంబంధించింది?
    ఎ) అంతరిస్తున్న పాముల సంరక్షణ, వాటి జనాభా పెంపుదల.
    బి) పులుల సంరక్షణ, 2022 నాటికి ద్విగుణీకృత పులుల సంఖ్యను సాధించడం.
    సి) ఖడ్గమృగాలను జాతీయ పార్కుల్లో సంరక్షించడం.
    డి) సింహాలను కొత్త ప్రదేశాలకు పంపి వాటి జీవన ప్రమాణాలను మెరుగుపరచడం.
జ: బి (పులుల సంరక్షణ, 2022 నాటికి ద్విగుణీకృత పులుల సంఖ్యను సాధించడం)

 

5. సెయింట్ పీటర్స్‌బర్గ్ పులుల సదస్సు (St. Peters Burg Tiger Summit) ఎప్పుడు జరిగింది?
జ: 2010

 

6. 2017 సంవత్సరానికి సంబంధించి ప్రపంచ పులుల దినోత్సవం ప్రధాన నినాదం ఏమిటి?
జ: పులుల సంరక్షణార్థం శుద్ధమైన ఆవరణ శాస్త్రం (Fresh Ecology for Tiger's Protection)

 

7. 'వరల్డ్ వైల్డ్‌లైఫ్ ఫండ్' గణాంకాల ఆధారంగా పులుల జనాభాకు సంబంధించి కిందివాటిలో సరైన వాక్యాలేవి?
i) 1915 నాటికి సుమారు ఒక లక్షగా ఉన్న పులుల సంఖ్య గడిచిన శతాబ్దంలో సుమారు 97 శాతం మేర నష్టానికి గురైంది.
ii) ప్రస్తుతం పులులు అధికంగా ఉన్న దేశాల్లో భారత్ అగ్ర స్థానంలో ఉంది. సుమారు 2,226 పులులు ఉన్నాయని అంచనా.
iii) గడిచిన కొన్ని దశాబ్దాలతో పోల్చుకుంటే ఈ దశాబ్దంలో పులుల సంఖ్యలో పెరుగుదల కొంత ఆశాజనకంగా ఉంది.

iv) భారత్, బంగ్లాదేశ్ సంయుక్త భాగస్వామ్యంలో ఉన్న పెద్ద మడ అడవి సుందర్‌బన్ ప్రపంచంలోనే అత్యధికంగా పులులు ఉన్న ప్రాంతంగా గుర్తింపు పొందింది.
జ: i, ii, iii, iv

 

8. కిందివాటిలో ప్రపంచంలోనే మొదటి హరిత మెట్రో వ్యవస్థగా సంపూర్ణంగా తయారైన మెట్రో రైలు వ్యవస్థ ఏది?
    ఎ) న్యూయార్క్ మెట్రో రైల్వే కార్పొరేషన్ (NMRC)    బి) ఆస్ట్రేలియా మెట్రో రైల్ ప్రైవేట్ లిమిటెడ్ (AMRL)
    సి) దిల్లీ మెట్రో రైల్వే కార్పొరేషన్ (DMRC)                డి) జపాన్ మెట్రో రైల్వే ఏజెన్సీ (JMRA)
జ: సి (దిల్లీ మెట్రో రైల్వే కార్పొరేషన్ (DMRC))

 

9. ఇటీవల 'నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా' ఏడు ప్రాజె క్టులను ఆమోదించింది. అయితే 'నేషనల్ మిషన్ ఫర్ క్లీన్' గంగాకు సంబధించి కిందివాటిలో ఏది సత్యం?
   i) ఇది నేషనల్ గంగా కౌన్సిల్ కార్యశీలక శాఖ
   ii) దీన్ని 2011లో స్థాపించారు.
   iii) దీని నిర్వహణ శైలిలో పరిపాలన శాఖ, కార్యనిర్వాహక శాఖ అనే రెండంచెల వ్యవస్థ నిర్మాణం కనిపిస్తుంది.
జ: i, ii, iii

 

10. దోహా సవరణ (Doha Amendment) కింది ఏ పర్యావరణ ఒప్పందానికి సంబంధించింది?
జ: క్యోటో ప్రోటోకాల్

11. క్యోటో ప్రోటోకాల్‌కు సంబంధించి కిందివాటిలో సరైన వాక్యాలు?
   i) క్యోటో ప్రోటోకాల్ మొదటి నిబద్ధతా సమయం 2008 నుంచి 2012 వరకు
   ii) క్యోటో ప్రోటోకాల్ ద్వితీయ నిబద్ధతా సమయం (Second Commitment) 2013 నుంచి 2020 వరకు
   iii) ఇది ఒక అంతర్జాతీయ హరిత గృహ ప్రభావ కారక వాయువుల ఉద్గార నియంత్రణా ఒప్పందం
   iv) ఇది 2005 ఫిబ్రవరి నుంచి అమల్లోకి వచ్చింది
జ: i, ii, iii, iv

 

12. నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ ఇటీవల ఏ నగరంలో 50 మైక్రాన్ల కంటే తక్కువ మందం ఉన్న జీవక్షయం కాని ప్లాస్టిక్ సంచుల వాడకాన్ని మధ్యంతరంగా రద్దు చేసింది?
జ: దిల్లీ

 

13. ప్రపంచ ఏనుగుల దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు?
జ: ఆగస్టు 12

 

14. 2017లో ప్రపంచ ఏనుగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని మన దేశంలో కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రి డా.హర్షవర్థన్ ప్రారంభించిన కార్యక్రమం?
జ: గజ యాత్ర

15. కింది వాయువుల్లో దేన్ని కాలుష్యకారకం కానిదిగా చెప్పవచ్చు?
      ఎ) కార్బన్ డై ఆక్సైడ్       బి) పొగ       సి) సల్ఫర్ డై ఆక్సైడ్       డి) నైట్రోజన్
జ: డి (నైట్రోజన్)

 

16. ఎడిన్‌బర్గ్ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు ప్రపంచంలోనే అతిపెద్ద అగ్నిపర్వత ప్రాంతాన్ని ఇటీవల ఆవిష్కరించారు. ఇది ఎక్కడ ఉంది?
జ: అంటార్కిటికా

 

17. 2017లో నిర్వహించిన ఏనుగుల జనాభా గణనలోని అంశాల ఆధారంగా మన దేశంలో కింది ఏ రాష్ట్రంలో అత్యధికంగా ఏనుగులు ఉన్నట్లు పేర్కొనవచ్చు?
జ: కర్ణాటక

 

18. ఆవరణ వ్యవస్థ సేవా అభివృద్ధి పథకం (Eco System Service Improvement Project) ను నేషనల్ గ్రీన్ ఇండియా మిషన్‌లో భాగంగా, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్రీ రిసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ (ICFRE) ద్వారా కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ ఏయే రాష్ట్రాల్లో ప్రారంభించనుంది?
      i) చత్తీస్‌గఢ్       ii) మధ్యప్రదేశ్       iii) గుజరాత్
జ: i, ii మాత్రమే

 

19. గ్లోబల్ ఎన్విరాన్‌మెంట్ ఫెసిలిటీ అనేది కింది ఏ సంస్థకు సంబంధించింది?
జ: ప్రపంచ బ్యాంకు (World Bank)

20. కేంద్ర ప్రభుత్వం ప్రారంభించనున్న Eco System Service Improvement Project కాలపరిమితి ఎన్ని సంవత్సరాలు?
జ: 5

 

21. గ్రీన్ ఎనర్జీ కారిడార్ ప్రాజెక్ట్ కిందివాటిలో దేనికి సంబంధించింది?
ఎ) సౌర, పవన, ఇతర పునరుద్ధరింపదగిన వనరుల నుంచి ఉత్పత్తి చేస్తున్న విద్యుత్‌శక్తిని సమకాలీకరణం (Synchronisation) చేయడానికి నిర్దేశించింది.
బి) జీవ పునరుత్పత్తిని ప్రదర్శించే వనరుల ఉత్పత్తి, వినియోగానికి నిర్దేశించింది.
సి) పంటలు, పండ్ల వృక్షాల వ్యర్థ పదార్థాల నుంచి నవీన పద్ధతుల ద్వారా విద్యుత్ ఉత్పాదన మెరుగుపరచడానికి
డి) సేంద్రియ వ్యవసాయ పద్ధతుల్లో పాశ్చాత్య సాంకేతికతను ప్రవేశపెట్టడానికి నిర్దేశించింది.
జ: ఎ (సౌర, పవన, ఇతర పునరుద్ధరింపదగిన వనరుల నుంచి ఉత్పత్తి చేస్తున్న విద్యుత్‌శక్తిని సమకాలీకరణం (Synchronisation) చేయడానికి నిర్దేశించింది)

 

22. పర్యావరణ సమతాస్థితి కొనసాగాలంటే భూమిపై ఉండాల్సిన అటవీ శాతం ఎంత?
జ: 33

 

23. బయోస్ఫియర్ రిజర్వ్ ప్రాజెక్ట్‌ను మన దేశంలో ఎప్పుడు ప్రారంభించారు?
జ: 1986

24. వృక్ష ప్లవకాలు (Phyto planktons) అనేవాటిని కింది ఏ ఆవరణ వ్యవస్థలో ఉత్పత్తిదారుల జాబితాలో చేర్చవచ్చు?
జ: జలావరణ వ్యవస్థ (Aquatic Eco - System)

 

25. పాదరసం వల్ల కలిగే మినామిటా వ్యాధిని (Minamita) మొదటిసారిగా ఏ దేశంలో గుర్తించారు?
జ: జపాన్

 

26. మన దేశంలో అత్యధికంగా టైగర్ రిజర్వ్‌లు ఉన్న రాష్ట్రం ఏది?
జ: మధ్యప్రదేశ్

 

27. భారతదేశానికి సంబంధించిన కింది ఏ ప్రాంతంలో మడ అడవులు అత్యధికంగా ఉన్నట్లు గణాంకాలు పేర్కొంటున్నాయి?
జ: పశ్చిమ్ బంగ

 

28. ప్రపంచంలో అత్యధికంగా కార్బన్ డై ఆక్సైడ్ ఉద్గారాలను విడుదల చేస్తున్న జాబితాలో అగ్రస్థానంలో ఉన్న దేశం?
జ: ఖతర్

 

29. సల్ఫర్ డై ఆక్సైడ్ వల్ల కలిగే కాలుష్యానికి ప్రధాన సూచికగా కింది ఏ జీవులను పేర్కొనవచ్చు?
జ: లైకెన్లు

30. కిందివాటిలో పర్యావరణంలో కర్బన వలయానికి, కార్బన్ డై ఆయాక్సైడ్ ప్రవేశానికి సంబంధమున్న అంశాలు ఏవి?
   i) కిరణజన్య సంయోగక్రియ    ii) శ్వాసక్రియ   iii) కర్బన పదార్థాల విచ్ఛిత్తి    iv) అగ్ని పర్వతాల విస్ఫోటనం
జ: ii, iii, iv మాత్రమే 

Posted Date : 31-01-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

సుస్థిర అభివృద్ధి 

మాదిరి ప్ర‌శ్న‌లు

1. 'పర్యావరణాన్ని ఒక్క మానవజాతి మాత్రమే కలుషితం చేస్తోంది. జీవావరణ వ్యవస్థలో మానవజాతి ఒక్కటే సిగ్గుపడాల్సిన జాతి లేదా సిగ్గుపడటానికి కారణం కలిగి ఉంటుంది' అని పేర్కొన్నది?
జ: మార్క్‌ట్వెయిన్

 

2. 'భూగోళంపై లభించే వనరులు జీవకోటి అవసరాలు తీర్చడానికి సరిపోతాయి కానీ ఏ ఒక్కరి దోపిడీకి సరిపోవు' అని పేర్కొన్నది ఎవరు?
జ: మహాత్మాగాంధీ

 

3. 'సహజ వనరులు అనంతంగా లభిస్తాయనే సంప్రదాయవాదం వీడి నేటి మానవుడు భూగోళాన్ని పరిమిత వ్యవస్థగా భావించాలి' అని అభిప్రాయపడింది ఎవరు?
జ: కెన్నెత్ బౌల్డింగ్

 

4. పర్యావరణం - ఆర్థిక వ్యవస్థల అనుబంధం దృష్ట్యా కిందివాటిలో సరైంది?
    ఎ) పర్యావరణం ఆర్థిక కార్యకలాపాలకు అవసరమైన ఉత్పాదితాలను అందిస్తుంది.
    బి) పర్యావరణం ఆర్థిక కార్యకలాపాల వల్ల ఏర్పడే వ్యర్థాలను విలీనం చేసుకుంటుంది.
    సి) ఎ, బి                                                                                                                 డి) పైవేవీ కాదు
జ: సి (ఎ, బి)

5. కిందివాటిలో పర్యావరణ విధి ఏమిటి?
    ఎ) సహజ వనరులను అందించడం            బి) సౌలభ్యాలను అందించడం
    సి) వ్యర్థాలను విలీనం చేసుకోవడం             డి) పైవన్నీ
జ: డి (పైవన్నీ)

 

6. సైమన్ కుజ్నెట్స్ పర్యావరణం, ఆర్థిక వ్యవస్థ మధ్య సంబంధాన్ని కింది ఏ అంశాల ద్వారా వివరించాడు?
    1. ఆర్థికాభివృద్ధి                 2. పర్యావరణం నాణ్యతా స్థాయి
    3. పేదరికం స్థాయి             4. ఆదాయ వ్యత్యాసాల స్థాయి                5. జనసాంద్రత
జ: 1, 2, 3, 4, 5

 

7. తిరగబడిన 'U' ఆకార రేఖ (Inverted 'U' shaped curve) ద్వారా తలసరి ఆదాయంలో పెరుగుదల, పర్యావరణ క్షయం మధ్య సంబంధాన్ని సూచించింది ఎవరు?
జ: సైమన్ కుజ్నెట్స్

 

8. నిలకడ గల ఆర్థికాభివృద్ధి (Sustainable development) భావన అంటే...?
  ఎ) పర్యావరణం ప్రజల జీవన ప్రమాణాలకు బహిర్గతంగా తోడ్పడటం.
  బి) నేటి ప్రజలు అనుభవిస్తున్న జీవన ప్రమాణాల స్థాయిని ఏ మాత్రం తగ్గకుండా భావితరాలకు అందించడం.
  సి) సహజ వనరులు, మానవ నిర్మిత వనరులతో కూడిన మూలధనం భావితరాలకు అందుబాటులో ఉండటం.
  డి) పైవన్నీ
జ: డి (పైవన్నీ)

9. పర్యావరణ పరిరక్షణ ద్వారా నిలకడ గల ఆర్థికాభివృద్ధి సాధించాలంటే వేటికి ప్రాధాన్యం ఇవ్వాలి?
    1. వనరుల వాడకం తగ్గించడం (Reduce)
    2. వ్యర్థాల నుంచి సాధ్యమైనంత ప్రయోజనం రాబట్టడం (Recover)
    3. ప్రయోజనం కోల్పోకుండా తిరిగి ఉపయోగించగల వస్తువుల తయారీ (Recycle)
    4. పునఃఉపయోగం, సాధ్యమైనన్నిసార్లు తిరిగి ఉపయోగించడం (Reuse)
జ: 1, 2, 3, 4

 

10. నిలకడ గల ఆర్థికాభివృద్ధి లక్ష్యాలు ఏవి?
    1. వృద్ధి లేదా ఆదాయాల్లో పెరుగుదల        2. అభివృద్ధి కొనసాగింపు
    3. క్షీణత నియంత్రణ                                  4. జీవవైవిధ్య రక్షణ
జ: 1, 2, 3, 4

 

11. హెచ్. డాలీ (1990 లో) కొనసాగించగలిగిన ఆర్థికాభివృద్ధికి తెలియజేసిన నియమాలు ఏవి?
1. పునరుద్ధరించగల వనరులను పునఃకల్పన రేటుకు (Regeneration rate) మించి ఉపయోగించరాదు.
2. పునరుద్ధరించడానికి వీల్లేని వనరులు ప్రత్యామ్నాయ వనరులు లభించే రేటు కంటే ఎక్కువ రేటులో ఉపయోగించకూడదు.
3. పర్యావరణం విలీనం చేసుకోగలిగిన సామర్థ్యం కంటే ఎక్కువ పరిమాణంలో కాలుష్య పదార్థాలను పర్యావరణంలోకి విసర్జించరాదు.
జ: 1, 2, 3

12. ఉష్ణగతిక శాస్త్రం (Thermo Dynamics) మొదటి సూత్రం ఏమని తెలుపుతుంది?
జ: ఇంధనం (శక్తి) పరిమితి స్థిరంగా ఉంటుంది. దాన్ని సృష్టించడం లేదా విధ్వంసం చేయడం సాధ్యం కాదు.

 

13. ఆర్థిక కార్యకలాపాల పరిమాణం పెరిగేకొద్దీ నియమరహితం పెరిగి, ప్రయోజనకరమైన పదార్థాల లభ్యత తగ్గడం ద్వారా నాగరికతలు క్షీణించేలా 'ఎంట్రోపి' సూత్రం (ఉష్ణగతికశాస్త్రం రెండో సూత్రం) శపించిందని పేర్కొన్నది ఎవరు?
జ: జార్జెస్ క్యూ - రోజన్

 

14. గ్రీకు దేశంలో ప్రకృతి వనరులను పునరుద్ధరించగల శక్తి కలిగి, పర్యావరణ సమతూకాన్ని నెలకొల్పే దేవతగా ఎవరిని విశ్వసిస్తారు?
జ: గైయా

 

15. కాలుష్యం ద్వారా కలిగే పర్యావరణ హానిని 'సామాజిక వ్యయం (Social Cost)' అన్నది ఎవరు?
జ: ఎ.సి. పిగూ

 

16. 1914 లోనే 'హరించుకుపోయే వనరుల అభిలషణీయ వినియోగరేటు' అనే సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు?
జ: ఎల్. గ్రే

 

17. పర్యావరణంపై బ్రండ్‌ట్లాండ్ అధ్యక్షతన 'ప్రపంచ సంఘం (World Commission on Environment and Development)' ఎప్పుడు ఏర్పాటైంది?
జ: 1987

18. బ్రండ్‌ట్లాండ్ సంఘం (Brundtland Commission) సమర్పించిన నివేదిక పేరేంటి?
జ: మన ఉమ్మడి భవిష్యత్ (Our Common Future)

 

19. 'భావితరాల ప్రజలు తమ అవసరాలను తీర్చుకునే సామర్థ్యంతో రాజీపడకుండా, వర్ధమాన తరం తన అభివృద్ధి అవసరాలను తీర్చుకోగలగడమే నిలకడ గల అభివృద్ధి (Sustainable development)' అని నిర్వచించింది?
జ: బ్రండ్‌ట్లాండ్ కమిషన్

 

20. 'ఒక నిర్ణీత కాలంలో ప్రకృతి పర్యావరణ ఆస్తులతోసహా ముత్తాతల నాటి నుంచి లభించిన మొత్తం ఆస్తులను యథాస్థితిలో ఉంచగలిగేదే నిలకడ గల అభివృద్ధి' అని నిర్వచించింది ఎవరు?
జ: జె.టి. విన్‌పెన్ని

 

21. కిందివాటిలో నిలకడ గల అభివృద్ధిలోని అంతర్గత అంశాల్లో లేనిది ఏది?
    ఎ) ఆర్థికాంశాలు                         బి) సాంఘిక అంశాలు
    సి) పర్యావరణ అంశాలు              డి) రాజకీయ అంశాలు
జ: డి (రాజకీయ అంశాలు)


22. ఆర్థిక వ్యవస్థలో ఉండే మూలధనాన్ని ఎన్ని రకాలుగా వర్గీకరించవచ్చు?
    1. భౌతిక మూలధనం (KM)       2. మానవ మూలధనం (KH)        3. ప్రకృతి వనరులు (KN)
జ: 1, 2, 3

23. కాలక్రమేణా జాతీయ మూలధన నిల్వ తరగకుండా ఉండే నేపథ్యంలో నిలకడ గల అభివృద్ధి సాధ్యమవుతుందనే 'స్థిర మూలధన నిల్వ నియమాన్ని (Constant Capital Stock Rule)' ప్రతిపాదించింది ఎవరు?
జ: పియర్స్

 

24. ఏ నియమాన్ని అతిబలహీన నిలకడ వృద్ధి లేదా సోలో నిలకడ వృద్ధి స్థితి అంటారు?
జ: రెండో నిలకడ గల వృద్ధి నియమం

 

25. బలమైన నిలకడ గల వృద్ధి నియమం ఏది?
జ: నాలుగో నిలకడ గల వృద్ధి నియమం

 

26. బలమైన నిలకడ గల వృద్ధి సాధించడానికి...
జ: ప్రకృతి మూలధనం నిల్వ స్థిరంగా ఉండాలి

 

27. 'జరిగేలా చూడటం (Making it happen)' అనే పరిశోధనా వ్యాసంలో నిలకడ గల అభివృద్ధి కోసం ప్రతిపాదనలు రూపొందించింది ఎవరు?
జ: రాల్ఫ్ రూక్‌వుడ్

 

28. రాల్ఫ్ రూక్‌వుడ్ ప్రతిపాదనలకు సంబంధించి కిందివాటిలో సరికానిది ఏది?
ఎ) ప్రకృతి వనరుల దుర్వినియోగాన్ని విడనాడి వాటి పరిమితమైన స్థితిని గౌరవించాలి
బి) పర్యావరణానికి హానిచేసే అత్యున్నత ఆచరణలను కనుక్కుని వాటిని ప్రతికృతి (Replication) చేయాలి.
సి) నిలకడ గల అభివృద్ధి నియమాలకు అనుగుణంగా పట్టణ ప్రాంతాల అభివృద్ధికి దీర్ఘకాల ఉద్దేశాలను రూపొందించాలి.
డి) పర్యావరణ సహాయనిధిని ఏర్పాటు చేయాలి.
జ: బి (పర్యావరణానికి హానిచేసే అత్యున్నత ఆచరణలను కనుక్కుని వాటిని ప్రతికృతి (Replication) చేయాలి.)

29. అపసరణ నియమం (Law of Divergence) ప్రకారం....
జ: ఒక నిర్దిష్ట ప్రాంతంలో జీవవైవిధ్యం ఎంత ఎక్కువగా ఉంటుందో ఆ ప్రాంతం అంత ఎక్కువగా సంరక్షించబడుతుంది.

 

30. కాలుష్యం స్థాయిని సాంఘికంగా అభిలషణీయ స్థాయికి నియంత్రించడానికి, కాలుష్యం వల్ల సంఘానికి ఏర్పడుతున్న హానికి సమానంగా పన్నుల విధానాన్ని రూపొందించాలని 'కాలుష్య పన్ను'ను ప్రతిపాదించింది ఎవరు?
జ: పిగూ

 

31. సామాన్యుల దుర్ఘటన (Tragedy of Commons) భావనను ప్రవేశపెట్టింది ఎవరు?
జ: విలియం ఫోస్టర్ లాయిడ్

 

32. ఎన్విరాన్‌మెంట్ (పర్యావరణం) అనే ఆంగ్ల పదం 'ఎన్విరానర్' అనే ఏ భాషా పదం నుంచి వచ్చింది?
జ:  ఫ్రెంచి        

 

33. ఎన్విరాన్ అనే పదానికి అర్థం...?
జ: చుట్టూ ఉన్న

 

34. 'భూమి అనేది ఒక రోదసి నావలాంటిది. ఇందులో ప్రాణాధారమైన వనరులు పరిమితంగా ఉంటాయి. మానవ జాతి వీటి వినియోగాన్ని బాగా పెంచుకోవడానికి బదులుగా, వీలైనంతవరకు తగ్గించుకుంటే మంచిది' అని హెచ్చరించింది ఎవరు?
జ: కెన్నెత్ బౌల్డింగ్

 

35. 'ఆవరణ వ్యవస్థ (Eco System)' అనే పదాన్ని మొదట ప్రతిపాదించింది?
జ: ఎ.జి. టాన్‌స్లే

36. జీవవైవిధ్యం (Bio-Diversity) అనే పదాన్ని తొలిసారి ప్రతిపాదించింది ఎవరు?
జ: వాల్టర్ రోసెన్

 

37. 'సుస్థిరత్వం (Sustainability)' భావనను ప్రవేశపెట్టింది ఎవరు?
జ: ఐరోపా అటవీ అధికారులు

 

38. కింది అంశాలను జతపరచండి.   
1. ది సైలెంట్ స్ప్రింగ్                  a) రాచెల్ కార్సన్ (1962)

2. ది కాస్ట్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్     b) మిషాన్ (1967)

3. లిమిట్స్ టు గ్రోత్                   c) మెడోస్ (1973)

4. అవర్ కామన్ ఫ్యూచర్            d) బ్రండ్‌ట్లాండ్ (1987)

జ: 1-a, 2-b, 3-c, 4-d
 

39. కింది ఏ సంవత్సరంలో 'ధరిత్రీ సదస్సు' జరిగింది? 
    ఎ) 1990       బి) 1991       సి) 1992      డి) 1993
జ: సి (1992)

 

40. అమెరికా 'సుస్థిరమైన అభివృద్ధి కోసం విద్యా దశకం'గా ఏ కాలాన్ని ప్రకటించింది?
జ: 2005 - 15

Posted Date : 31-01-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

జీవ వైవిధ్యం

మాదిరి ప్ర‌శ్న‌లు

1. అత్యధిక జీవ వైవిధ్యం కలిగి ఉన్న దేశం ఏది?
జ: బ్రెజిల్

 

2. అత్యధిక జీవ వైవిధ్యం ఉన్న దేశాల జాబితాలో భారత్ ఎన్నో స్థానంలో ఉంది?
జ: 16వ

 

3. కిందివాటిలో జీవ వైవిధ్యానికి విఘాతం కలిగించే అంశం ఏది?
ఎ) ఆవాసాల వినాశనం      బి) అన్యజాతుల చొరబాటు      
సి) సహజ వనరుల మితిమీరిన వాడకం    డి) అన్నీ
జ: డి (అన్నీ)

 

4. హాట్‌స్పాట్‌లను ప్రతిపాదించింది ఎవరు?
జ: నార్మన్ మైర్స్

 

5. భారతదేశంలో ఉన్న హాట్‌స్పాట్‌లు ఎన్ని?
జ: 4

 

6. కొత్తగా ఆవిర్భవించి, ఒక ప్రాంతానికే పరిమితమైన జీవజాతులు చూపే స్థానీయత ఏది?
జ: నియో ఎండమిజమ్

7. కిందివాటిలో అతిపెద్ద జీవ వైవిధ్య స్థాయి ఏది?
ఎ) జన్యు వైవిధ్యం  బి) జాతి వైవిధ్యం  సి) జీవావరణ వైవిధ్యం  డి) పైవేవీకాదు
: సి (జీవావరణ వైవిధ్యం)

 

8. కిందివాటిలో జీవ వైవిధ్యం వల్ల కలిగే ప్రయోజనాలేవి?
ఎ) ఆహ్లాదపు ప్రయోజనాలు  బి) నైతిక ప్రయోజనాలు సి) ఉత్పాదక ప్రయోజనాలు డి) అన్నీ
జ: డి (అన్నీ)

 

9. సక్యులెంట్ కరూ ప్రాంతం ఏ మండలంలోని హాట్‌స్పాట్‌గా గుర్తించవచ్చు?
జ: ఆఫ్రికా

 

10. కిందివాటిలో అత్యధిక హాట్‌స్పాట్‌లున్న మండలం?
ఎ) ఆఫ్రికా  బి) ఆసియా పసిఫిక్  సి) యూరప్, మధ్య ఆసియా డి) ఏదీ కాదు
జ: బి (ఆసియా పసిఫిక్)

 

11.  ,  ,   లు వరుసగా ఆల్ఫా, బీటా, గామా వైవిధ్యాలను సూచిస్తే వీటి మధ్య సంబంధం ఏది?
జ:   <   <  

12. జీవ వైవిధ్యం పదాన్ని రోసన్ ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టాడు?
జ: 1985

 

13. కిందివాటిలో భారతదేశంలోకి ప్రవేశించిన అన్యదేశ జాతి మొక్కలేవి?
ఎ) కాంగ్రెస్ గ్రాస్       బి) లాంటనా        సి) ఐకార్నియా        డి) అన్నీ
జ: డి (అన్నీ)

 

14. జీవ వైవిధ్య సంపద ......
జ: భూమధ్య రేఖా ప్రాంతం వైపు వెళుతున్న కొద్దీ పెరుగుతుంది.

 

15. కిందివాటిలో సుమారు 50% జీవ వైవిధ్య సంపదను కలిగి ఉంది .......
ఎ) ఉష్ణమండల వర్షారణ్యం బి) సమశీతోష్ణ వర్షారణ్యం సి) ప్రవాళ భిత్తికలు  డి) గడ్డి భూములు
జ: ఎ (ఉష్ణమండల వర్షారణ్యం)

Posted Date : 31-01-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

స్థిరాభివృద్ధి - పర్యావరణం

ఏ దేశమైనా ఆర్థికంగా ఎదగాలంటే పర్యావరణంలో లభించే సహజవనరులే కీలకం. ప్రస్తుత మానవులు వాటిని ఉపయోగించుకుంటూ, తర్వాతి తరాలకు అందించడాన్ని సుస్థిరాభివృద్ధి అంటారు. పర్యావరణం, ఆర్థిక వ్యవస్థ ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉంటాయి. అందుకే పర్యావరణాన్ని కాపాడుకుంటూనే సుస్థిరాభివృద్ధి కోసం కృషిచేయాలి. 


పర్యావరణం
పర్యావరణం అనే భావనలో జీవ, నిర్జీవ అంశాలు ఉంటాయి. జీవ అంశాల్లో మొక్కలు, పక్షులు, జంతువులు మొదలైనవి ఉంటే; నిర్జీవ అంశాల్లో గాలి, నీరు, భూమి తదితరాలు  ఉంటాయి. వీటి మధ్య ఉన్న పరస్పర సంబంధాన్ని అధ్యయనం చేయడమే పర్యావరణశాస్త్ర ముఖ్య ఉద్దేశం.


విధులు: పర్యావరణం ప్రధానంగా 4 ముఖ్యమైన విధులను నిర్వహిస్తుంది.
* ఇది పునరుత్పాదకం అయ్యే, కాని వనరులను సరఫరా చేస్తుంది. పునరుత్పాదక వనరులకు అడవుల్లోని చెట్లు, మహాసముద్రాల్లోని చేపలు మొదలైనవి ఉదాహరణలు. పునరుత్పాదకంకాని వనరులకు ఉదాహరణ శిలాజ ఇంధనాలు. 
* ఇది వ్యర్థాలను తనలో కలుపుకుంటుంది.
* జెనెటిక్, జీవ వైవిధ్యాన్ని అందించడం ద్వారా జీవ మనుగడను కొనసాగిస్తుంది.

విపత్తు: ఎలాంటి ఆటంకాలు లేనప్పుడు పర్యావరణం తన విధులను సమర్థంగా నిర్వహిస్తుంది. అయితే మానవ తప్పిదాలతో విపత్తులు సంభవించి జీవమనుగడే ప్రశ్నార్థకమవుతోంది. 


కారణాలు: 
* సహజ వనరుల పునరుత్పాదక రేటు కంటే వాటి వెలికితీత రేటు అధికంగా ఉండటం.
* ప్రకృతి తనలో కలుపుకోగల సామర్థ్యానికి మించి వ్యర్థాల ఉత్పత్తి జరుగుతుండటం. పునరుత్పాదకం అయ్యే, కాని శక్తి వనరులను పెద్ద ఎత్తున వెలికి తీయడం వల్ల వాటిలో కొన్ని పూర్తిగా అంతరించి పోయాయి. వాటికి ప్రత్యామ్నాయం కోసం శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. దీనికోసం ఎక్కువ ఖర్చు చేయాల్సి వస్తోంది. వీటితో పాటు పర్యావరణ క్షీణత కారణంగా గాలి, నీటి వనరుల్లో నాణ్యత తగ్గి ప్రజలు అనారోగ్యంబారిన పడుతున్నారు. ఫలితంగా ఆరోగ్యం మీద చేసే వ్యయం పెరిగిపోతోంది. గ్లోబల్‌ వార్మింగ్, ఓజోన్‌ పోర క్షీణత లాంటి పర్యావరణ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వాలు ఎక్కువ ఖర్చు చేయాల్సి వస్తోంది. పర్యావరణం ప్రతికూల ప్రభావాలతో ఖర్చులు అధికమయ్యాయి. 


మూలం: పారిశ్రామిక విప్లవానికి ముందు వనరుల సరఫరా కంటే డిమాండ్‌ తక్కువగా ఉండేది. ఫలితంగా పునఃసృష్టి ద్వారా వనరుల సమతౌల్యానికి వీలుండేది. ఆవరణ వ్యవస్థలో వ్యర్థాలు తక్కువగా ఉండేవి. పారిశ్రామిక విప్లవం, జనాభా పెరుగుదల వల్ల వనరులకు డిమాండ్‌ పెరిగింది. పర్యావరణంలో వ్యర్థాలు పెరిగి అనేక సమస్యలు ఆవిర్భవించాయి.


గ్లోబల్‌ వార్మింగ్‌ 
భూవాతావరణంలో గ్రీన్‌ హౌస్‌ వాయువులు పెరిగిపోయి, భూమి సగటు ఉష్ణోగ్రతలు అధికం కావడాన్ని గ్లోబల్‌ వార్మింగ్‌ అంటారు. శిలాజ ఇంధనాల వాడకం, అడవులు నరకడం మొదలైన మానవ చర్యల వల్ల గాలిలో  CO2, మీథేన్‌ లాంటి గ్రీన్‌హౌస్‌  వాయువులు ఎక్కువయ్యాయి. వీటికి ఉష్ణాన్ని గ్రహించే సామర్థ్యం ఉంటుంది. దీంతో భూఉపరితలం వేడెక్కుతోంది. గత వందేళ్లలో భూఉపరితల ఉష్ణోగ్రతలు 1.1°F (0.6°C) పెరిగాయి. దీంతో ధ్రువప్రాంతాల్లో మంచు కరిగిపోయి, సముద్ర మట్టం పెరిగింది. 


ఓజోన్‌ పొర క్షీణత: స్ట్రాటో ఆవరణంలో ఉండే క్లోరిన్, బ్రోమిన్‌ సంబంధ పదార్థాల వల్ల ఓజోన్‌ పొర క్షీణిస్తోంది. రిఫ్రిజిరేటర్లు, ఎయిర్‌ కండిషనర్ల నుంచి వెలువడే క్లోరోఫ్లోరోకార్బన్లు (CFC), బ్రోమోఫ్లోరోకార్బన్లు  (Halons) వాతావరణంలో చేరి క్లోరిన్, బ్రోమిన్‌ పదార్థాలుగా మారుతున్నాయి. 
* అంటార్కిటికా ప్రాంతంలో ఓజోన్‌ పొర అధికంగా దెబ్బతిన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. దీని క్షీణత వల్ల సూర్యుడి నుంచి వెలువడే అతినీలలోహిత కిరణాలు నేరుగా భూమిపై పడి, మానవుల్లో అనేక వ్యాధులకు కారణమవుతున్నాయి. జలాశయాల్లో ఫొటోప్లాంక్టన్‌ (నాచు)ల ఉత్పత్తి తగ్గి, జలచరాలను ప్రభావితం చేస్తోంది. 
* ఓజోన్‌ పొరను కాపాడేందుకు మాంట్రియల్‌ ప్రొటోకాల్‌ను తీసుకొచ్చారు. దీని ప్రకారం  CFC, కార్బన్‌ టెట్రాక్లోరైడ్, ట్రైక్లోరోఈథేన్‌ (మిథైల్‌ క్లోరోఫాం) లాంటి రసాయనాల వాడకాన్ని ప్రపంచవ్యాప్తంగా నిషేధించారు. CFCకి ప్రత్యామ్నాయంగా వాడుతున్న HFC (హైడ్రోఫ్లోరోకార్బన్‌)లు కూడా ఓజోన్‌ పొరకు హాని కలిగిస్తున్నట్లు శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. 
* ఓజోన్‌ దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా ఏటా సెప్టెంబరు 16న నిర్వహిస్తున్నారు.


భారతదేశ పర్యావరణ పరిస్థితి 
భారతదేశంలో పర్యావరణం రెండు కారణాల వల్ల క్షీణిస్తోంది. అవి: 
1. పేదరికం    2. పారిశ్రామికాభివృద్ధి


పేదరికం: దేశంలో అనేకమంది ప్రజలు తమకు లభించిన సహజ వనరులను (ఉదా: వంట చెరకు) అధికంగా వినియోగిస్తున్నారు. దీనివల్ల పర్యావరణం కలుషితం అవుతోంది. పేద వర్గాల ప్రజలు తమ మనుగడ కోసం పర్యావరణంపైనే అధికంగా అధారపడుతున్నారు. దీంతో వారికి తగినంత ఆహారం, ఆరోగ్యదాయక జీవన ప్రమాణాలు లభించడంలేదు. ఈ విధంగా పర్యావరణం, పేదరికం ఒకదానికొకటి అంతర సంబంధాన్ని కలిగిఉన్నాయి. పేదరికం పర్యావరణంపై అధికంగా ఒత్తిడి కలగజేస్తుంటే, పర్యావరణ సమస్యలు పేదలపై ఎక్కువ ప్రభావాన్ని చూపుతున్నాయి.   


పారిశ్రామికాభివృద్ధి: దీనివల్ల పర్యావరణ కాలుష్యం నానాటికీ ఎక్కువవుతోంది. ప్రస్తుతం మన దేశంలో ప్రధానంగా వాయు, నీటి కాలుష్యాలు; మృత్తికా క్రమక్షయం; అటవీ నిర్మూలన; జీవవైవిధ్యం దెబ్బతినడం లాంటి అనేక అంశాలు పర్యావరణ సమస్యలుగా ఉన్నాయి.


మృత్తికా క్షీణతకు కారణాలు
* అటవీ నిర్మూలన.
* వంటచెరకు, పశుగ్రాసం సేకరణ 
* పోడువ్యవసాయం  నీ అడవుల్లో కార్చిచ్చు
* మృత్తికా సంరక్షణ చర్యలు చేపట్టకపోవడం 
* ఎరువులు, పురుగుమందుల అధిక వినియోగం 
* సాగునీటి వ్యవస్థల నిర్వహణలో సరైన  ప్రణాళిక లోపించడం
* భూగర్భ జలాలను అధికంగా తోడెయ్యడం 
* వ్యవసాయం, ఇళ్లు, పరిశ్రమల కోసం పరిమితంగా ఉన్న భూమిపై ఒత్తిడి కలిగించడం వల్ల మృత్తికా క్షీణత ఏర్పడుతుంది.
  మన దేశంలో తలసరి అటవీ భూమి 0.08 హెక్టార్లుగా ఉంది. మనిషి కనీస అవసరాలు తీర్చాలంటే అది 0.47 హెక్టార్లుగా ఉండాలి. మన దేశంలో ఏడాదికి 5.3 బిలియన్‌ టన్నుల మృత్తికా క్రమక్షయం జరుగుతోందని శాస్త్రవేత్తల అంచనా. దీనివల్ల భూమిలోని NPK పోషకాలను అధిక మొత్తంలో కోల్పోతున్నాం.


వాయు కాలుష్యం 
మన దేశంలో వాయు కాలుష్యం పట్టణ ప్రాంతాల్లో; పరిశ్రమలు, థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలు ఉన్నచోట అధికంగా ఉంటోంది. నగరాల్లో నివసించే 80% మందికి వ్యక్తిగత వాహనాలు ఉన్నాయి. వీటి సంచారం ఎక్కువగా ఉండటంతో అక్కడ గాలి కలుషితం అవుతోంది. ప్రపంచవ్యాప్తంగా మొదటి 10 పారిశ్రామిక దేశాల్లో భారత్‌ ఒకటిగా నిలిచింది. దీంతోపాటు పర్యావరణ కాలుష్యం, ప్రణాళిక లేని పట్టణీకరణ, ప్రమాదాలకు అవకాశం లాంటి అంశల్లోనూ మనం ముందున్నాం.


నీటి కాలుష్యం
 భారత్‌లో నీటి కాలుష్యాన్ని అరికట్టేందుకు 1974లో కేంద్ర కాలుష్య నియంత్రణ మండలిని, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలిని ఏర్పాటుచేశారు. మురుగు నీరు, పారిశ్రామిక వ్యర్థాల విడుదలకు ఇవి ప్రమాణాలను నిర్దేశిస్తాయి. ఈ సంస్థలు కాలుష్య నివారణలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సాంకేతిక సలహాలు అందిస్తాయి.

 

సుస్థిరాభివృద్ధి 
పర్యావరణ సంరక్షణ, దాని అభివృద్ధి కోసం 1992లో ‘పర్యావరణం - అభివృద్ధి’ అనే అంశంపై ఐక్యరాజ్య సమితి సమావేశం (UNCED - United Nations Conference on Environment and Development) జరిగింది. ఇందులో ‘‘భవిష్యత్తు తరాలవారు తమ అవసరాలను తీర్చుకోగలిగే సామర్థ్యాన్ని దెబ్బతీయకుండా, ప్రస్తుత తరాల వారి అవసరాలను తీర్చే అభివృద్ధినే సుస్థిరాభివృద్ధి’’గా  నిర్వచించారు. 
* ‘‘భవిష్యత్తు తరాలవారికి భూగ్రహాన్ని మంచిగా అందించాల్సిన నైతిక బాధ్యత ప్రస్తుత తరాల వారిపై ఉంది’’ అని నార్వే మాజీ ప్రధాని హార్లెం బ్రంట్‌లాండ్‌ పేర్కొన్నారు. 
* సుస్థిరాభివృద్ధి సాధించాలంటే కింది చర్యలు చేపట్టాలని పర్యావరణ ఆర్థికవేత్త హెర్నన్‌ డేలీ పేర్కొన్నారు.
* సముద్రంలో ప్రయాణించే నౌకలో అది మోయగలిగే సామర్థ్యం మేరకే ప్రజలను ఎక్కిస్తారు. అలాగే, పర్యావరణం భరించగల పరిమితులలోపు మాత్రమే మానవ జనాభా ఉండాలి.
* ఉత్పాదకాలను సమర్థవంతంగా వాడే సాంకేతిక ప్రగతి కావాలి.
* పునరుత్పాదక శక్తి వనరులను సుస్థిరంగా ఉపయోగించాలి. అంటే వీటి వెలికితీత వాటి పునఃసృష్టి కంటే తక్కువగా ఉండాలి.
* పునరుత్పాదకం కాని శక్తి వనరుల తగ్గుదల రేటు ప్రత్యామ్నాయ శక్తి వనరుల ఉత్పత్తి రేటు కంటే ఎక్కువగా ఉండకూడదు.
* కాలుష్యం వల్ల పర్యావరణానికి కలిగిన నష్టాలను సరిచేయాలి.


సుస్థిరాభివృద్ధి కోసం వ్యూహాలు 
సంప్రదాయేతర ఇంధన వనరుల వాడకం: భారతదేశం థర్మల్, జలవిద్యుత్‌పై అధికంగా ఆధారపడుతోంది. ఈ రెండూ పర్యావరణంపై దుష్ప్రభావాన్ని కలిగిస్తున్నాయి. థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలు గ్రీన్‌హౌస్‌ వాయువు CO2తో పాటు బూడిద (fly ash)ను పర్యావరణంలోకి విడుదల చేస్తున్నాయి. బూడిదను సరిగ్గా వినియోగించకపోతే భూమి, నీటి కాలుష్యానికి దారితీస్తుంది. జల విద్యుత్‌ కేంద్రాల నిర్మాణానికి పెద్దఎత్తున అడవులను నిర్మూలిస్తున్నారు. ఈ పరిమితుల నేపథ్యంలో పవన, సౌర శక్తి లాంటి సంప్రదాయేతర ఇంధన వనరులను అధికంగా వినియోగించాలి.
గ్రామీణ ప్రాంతాల్లో గోబర్‌ గ్యాస్, ఎల్‌పీజీని ఉపయోగించడం: గ్రామీణ ప్రాంతాల్లో వంట చెరకునే ఇంధనంగా ఉపయోగిస్తున్నారు. దీనివల్ల గాలి కలుషితమవుతోంది. దీనికి ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం ఆయా ప్రాంతాల్లో సబ్సిడీతో కూడిన ఎల్‌పీజీని అందించాలి. ప్రజలు గోబర్‌ గ్యాస్‌ ప్లాంట్‌లు ఏర్పాటుచేసుకునేందకు రాయితీలు, రుణాలు అందించాలి.
పట్టణ ప్రాంతాల్లో సీఎన్‌జీ వాడకం: కంప్రెస్డ్‌ నేచురల్‌ గ్యాస్‌ (సీఎన్‌జీ)లో అధిక పీడనం వద్ద మీథేన్‌ను నిల్వ చేస్తారు. పెట్రోల్, డీజిల్‌తో పోలిస్తే ఇది తక్కువ కాలుష్యకారకాలను విడుదల చేస్తుంది. దిల్లీ ప్రజా రవాణా వ్యవస్థలో సీఎన్‌జీ వాహనాల వాడకం వల్ల అక్కడ వాయు కాలుష్యం చాలా వరకు తగ్గింది. 
చిన్నతరహా జల విద్యుత్‌ కేంద్రాల ఏర్పాటు: పర్వత ప్రాంతాల్లో నిరంతరం ప్రవహించే ప్రవాహాల శక్తిని విద్యుత్‌ శక్తిగా మార్చేందుకు చిన్నతరహా జల విద్యుత్‌ కేంద్రాలను ఏర్పాటుచేయాలి. ఇవి స్థానిక అవసరాలకు తగ్గట్టు శక్తిని సరఫరా చేస్తాయి.
సంప్రదాయ విజ్ఞానం, పద్ధతులు:  పూర్వం భారతీయులు పర్యావరణంలో భాగంగా జీవించేవారు. వివిధ రకాల వృక్షజాతుల నుంచి మూలికలు తయారుచేసి వాటిని వైద్యంలో వాడేవారు. భారత్‌లో పాశ్చాత్య వైద్య విధానం వచ్చాక మన సంప్రదాయ పద్ధతులైన ఆయుర్వేదం, యునాని మొదలైనవి అడుగున పడిపోయాయి. మళ్లీ వీటిని ఆచరించాల్సిన అవసరం ఏర్పడింది.
బయో కంపోస్టింగ్‌: వ్యవసాయ ఉత్పత్తులను పెంచే ఉద్దేశంతో గత 5 దశాబ్దాలుగా కంపోస్ట్‌ వాడకం తగ్గించి రసాయనిక ఎరువుల వినియోగాన్ని పెంచారు. దీంతో గాలి, నీరు, నేల కాలుష్యానికి గురయ్యాయి. వానపాములు సులభంగా సేంద్రీయ పదార్థాన్ని కంపోస్ట్‌గా మార్చగలవు. కాబట్టి రైతులు  బయో కంపోస్టింగ్‌ పద్ధతులు అనుసరించేలా చర్యలు చేపట్టాలి.
బయోపెస్ట్‌ కంట్రోలింగ్‌: రసాయన పురుగు మందుల వినియోగం పెరగడం వల్ల భూమి, జల వనరులు పూర్తిగా కలుషితమయ్యాయి. వాటి అవశేషాలు ఆహార ఉత్పత్తుల్లో చేరడం వల్ల మానవ ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపిస్తోంది. ఈ సమస్యకు పరిష్కారంగా వేప లాంటి వృక్ష ఉత్పత్తులను పెస్టిసైడ్లుగా ఉపయోగించాలి. మిశ్రమ వ్యవసాయం, పంటల మార్పిడి పద్ధతులను అవలంబించాలి.

Posted Date : 24-05-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

పర్యావరణ క్షీణత విలువ లెక్కించడం 

పర్యావరణ క్షీణత


వ్యర్థాలను, కాలుష్యాలను ఇముడ్చుకునే క్రమంలో పర్యావరణం తన సహజ లక్షణాలను కోల్పోవడం, మానవాళికి అందిస్తున్న పర్యావరణ లేదా సహజ వనరుల పరిమాణం, వాటి నాణ్యత తగ్గడాన్ని 'పర్యావరణ క్షీణత' (Environmental Degradation) గా భావించవచ్చు. 

ప్రకృతి ప్రసాదించిన పర్యావరణ వనరులతోనే మానవ జీవనం సుఖంగా సాగుతోంది. పర్యావరణ వనరులను ఉపయోగించి మానవుడు తనకు కావాల్సిన వివిధ వస్తువులను ఉత్పత్తి చేసుకుంటున్నాడు. అయితే మానవుడు ఈ వనరులను తన అవసరాలకు మించి విచక్షణారహితంగా ఉపయోగిస్తున్నాడు. పర్యావరణంలోని వనరులను ఉపయోగించి చేస్తున్న 'ఉత్పత్తి-వినియోగం' అనే ప్రక్రియలో ఎన్నో వ్యర్థాలు, కాలుష్య కారకాలు విడుదలవుతున్నాయి. వాటన్నింటినీ మళ్లీ పర్యావరణంలోనే పడేస్తుండటంతో పర్యావరణం తొట్టి(Bin)లా తనలో ఇముడ్చుకునేందుకు ప్రయత్నిస్తోంది.
ఐక్యరాజ్య సమితి 'విపత్తు తగ్గుదలకు అంతర్జాతీయ వ్యూహం' (UN International Strategy for Disaster Reduction) ప్రకారం సామాజిక, సహజవనరుల తగ్గుదలను భరించగల భూమి పరిమితి (limit of the earth) తగ్గడాన్ని పర్యావరణ క్షీణతగా పేర్కొనవచ్చు.

* వాతావరణం, జలావరణం, ఆశ్మావరణంలోని నాణ్యత, వనరుల పరిమాణం తగ్గడం, జీవావరణంలో విభిన్న మార్పులు రావడం, జీవరాశుల పరిమాణంలో హెచ్చుతగ్గులు, జీవరాశుల జీవనశైలిలో మార్పులు, కొన్ని జీవరాశులు అంతరించి జీవవైవిధ్యంలో తేడాలు రావడం మొదలైనవన్నీ పర్యావరణ క్షీణతను సూచించేవే.
* మానవుని స్వార్థపూరిత ఆర్థిక జీవనం వల్లే పర్యావరణ క్షీణత అనే సమస్య తలెత్తుతోంది. పర్యావరణ పరిరక్షణ చర్యలు తీసుకోవాలంటే పర్యావరణం ఏమేరకు క్షీణించిందో అంచనా వేయాల్సి వస్తోంది.

 

పర్యావరణ క్షీణత విలువ లెక్కింపు

ముందు చూపులేకుండా మానవుడు పర్యావరణ వనరులను విచ్చలవిడిగా వినియోగిస్తున్నాడు. దీనివల్ల ఏర్పడే పర్యావరణ క్షీణత విలువను లెక్కించడం ద్వారా కింది అంశాలను నెరవేర్చవచ్చు.
* నాణ్యత కోల్పోయిన వివిధ పర్యావరణ వనరుల గుర్తింపు.
* కాలుష్య ప్రభావానికి గురైన వనరుల మధ్య భౌతిక సంబంధం లెక్కింపు.
* పర్యావరణ క్షీణత వల్ల వ్యక్తులు, సంస్థలకు వాటిల్లే నష్టంలో కొంతభాగాన్నైనా తగ్గించడానికి మార్గాల సూచన.
* పర్యావరణ వనరులకు జరిగిన భౌతిక నష్టానికి ద్రవ్య విలువ/ ఆర్థిక విలువ అంచనా.
పర్యావరణ వనరుల ఆర్థిక విలువ: పర్యావరణ వనరుల ఆర్థిక విలువను అంచనా వేయడం ద్వారా క్షీణత స్థాయిని తెలుసుకోవచ్చు. ఆయా సందర్భాలను బట్టి వనరుల విలువను నిల్వ (Stock) లేదా ప్రవాహ (Flow) భావనలుగా చెప్పవచ్చు. ఉదాహరణకు భూగర్భంలో ఉన్న బొగ్గు 'నిల్వ' భావన కాగా, గనుల నుంచి తవ్వి తీసిన బొగ్గును వివిధ అవసరాలకు తరలించడం 'ప్రవాహ భావన'.

విలువ-రకాలు: ఆర్థికవేత్తలు పర్యావరణ వనరుల వల్ల ఏర్పడే ఆర్థిక విలువను 3 రకాలుగా వర్గీకరించారు.
     1. వినియోగ విలువ (Value in use)
     2. ఐచ్ఛిక విలువ (Option value)
     3. వినియోగం లేని విలువ ((non-use value)
* వినియోగ విలువ వనరుల ప్రత్యక్ష వినియోగం నుంచి తెలుస్తుంది. ఉదా: జలాశయాల నుంచి చేపలు, అడవుల నుంచి కలప, నదుల్లోని నీటి పరిమాణం మొదలైనవి. పర్యావరణ కాలుష్యానికి ముందు, తర్వాత వాటి లభ్యతలో, వినియోగంలో తగ్గుదల ద్వారా వాస్తవ వినియోగ విలువ లేదా ఆర్థిక విలువ తగ్గడాన్ని అంచనా వేయొచ్చు. ఐచ్ఛిక విలువను పర్యావరణ వనరులను ప్రస్తుతం వాడకుండా, వాటి నిల్వ, నాణ్యతలను తగ్గకుండా చూస్తూ భవిష్యత్ ఉపయోగానికి వదిలివేయడంగా చెప్పవచ్చు.
* వినియోగం లేని విలువ అంటే వనరులను లభ్యమైన స్థితిలో ఉంచడానికి, వాటిని అసలే వినియోగించకపోవడం. ఈ మూడు విలువలను కూడితే వనరుల వినియోగానికి చెల్లించడానికి ఇష్టపడుతున్న మొత్తం విలువ (Total willingness to pay) తెలుస్తుంది. మొత్తం ఆర్థిక విలువను పటం A(పేజీ నెం.6లో) ద్వారా వివరించవచ్చు.
పర్యావరణ వనరుల ఆర్థిక విలువను లెక్కించే పద్ధతులు: పర్యావరణ వనరుల ఆర్థిక విలువను లెక్కించడానికి ప్రత్యక్ష, పరోక్ష పద్ధతులు ఉన్నాయి.

ప్రత్యక్ష పద్ధతులు (Direct methods of valuation) 

పర్యావరణ వనరుల విలువను కింది పద్ధతుల ద్వారా ప్రత్యక్షంగా లెక్కిస్తారు.
ఎ. ప్రత్యక్ష విలువలు పరిశీలించడం (Observing direct values): పర్యావరణ వనరుల విలువలు పరిశీలించి వాటి విలువలను వీలైన పద్ధతిలో లెక్కిస్తారు. ఉదా: నీటి కాలుష్యం వల్ల తగ్గిన చేపల ఉత్పత్తి పరిమాణాన్ని తద్వారా దాని ఆర్థిక విలువను అంచనా వేయడం.
బి. అనిశ్చిత విలువలు లెక్కించే పద్ధతి (Contingent valuation method Hypothetical case): ప్రత్యక్షంగా క్షీణిస్తున్న వనరుల విలువలను పరిశీలన ద్వారా అంచనా వేయడం వీలు కానప్పుడు అనిశ్చిత విలువలు గణించే పద్ధతిని ఉపయోగిస్తారు. ఉదాహరణకు అంతరిస్తున్న జీవులను, వాటి సహజ ఆవాసాలను కాపాడాలా? వద్దా? అని పరిసర ప్రజలనే అడగటం ద్వారా వారిచ్చే సమాధానాన్నిబట్టి, వాటి పరిరక్షణకు అవసరమైన వ్యయాన్ని భరించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారా అనే అంశాన్ని బట్టి వనరుల విలువను అంచనా వేయొచ్చు. అయితే ఈ పద్ధతి పూర్తిగా కచ్చితమైన సమాచారాన్నిచ్చేదిగా చెప్పలేం. ప్రజల ఆలోచనలు, వైఖరులను బట్టి వచ్చే సమాధానాల వల్ల వనరుల విలువ లెక్కించడం కష్టం.

 

పరోక్ష పద్ధతులు (Indirect methods of valuation) 

పర్యావరణ వనరుల నాణ్యతలో వచ్చే మార్పులను పరిశీలించడం ద్వారా వాటి విలువను పరోక్షంగా అంచనా వేయొచ్చు.

ఎ. పర్యాటక వ్యయాల పద్ధతి (Travel cost method): వివిధ పర్యాటక కేంద్రాలు, ఉద్యానవనాలు, వన్యమృగ సంరక్షణా కేంద్రాలను సందర్శించే పర్యాటకులు ఆయా ప్రాంతాలకిచ్చే ప్రాధాన్యతను, వారు చెల్లించదలచుకున్న ధర (పర్యాటన వ్యయం) ఆధారంగా గుర్తించవచ్చు. పర్యటకుల ప్రాధాన్యాలను గుర్తించడానికి ఫ్రీమాన్ (1993) రెండు ఆధారిత కారకాలను వివరించాడు.
1. పర్యాటకుల సందర్శనల సంఖ్య, సందర్శన కోసం ఎంత మొత్తం వ్యయం చేశారనే అంశాల ఆధారంగా 'పర్యటక ప్రాంత డిమాండ్ రేఖ' ఏర్పడుతుంది.
2. పర్యాటకులు సందర్శనకు ఎంచుకున్న ప్రాంతం, ఆ ప్రాంతంలో లభించే సేవలు, అందుబాటులో ఉన్న సౌకర్యాల ద్వారా విలువలను అంచనా వేయొచ్చు.


బి. వ్యయం - ప్రయోజన పద్ధతి (Cost Benefit Analysis): ఈ పద్ధతిని 1993 లో హిక్స్, కాల్డార్ (Hicks - Kaldor) అనే ఆర్థికవేత్తలు ప్రతిపాదించారు. వీరి అభిప్రాయం ప్రకారం పర్యావరణ నాణ్యత గరిష్ఠంగా ఉండేలా అభిలషణీయ కాలుష్య పరిమాణాన్ని నిర్ణయించవచ్చు.
* పర్యావరణ నాణ్యత అభిలషణీయస్థాయిలో కొనసాగాలంటే వనరుల వినియోగం ద్వారా వచ్చే మొత్తం ప్రయోజనం (Total benefit), వనరుల వినియోగం కోసం అయ్యే మొత్తం వ్యయం (Total cost) కంటే ఎక్కువగా ఉండాలి (TB > TC). అంతేకాకుండా వనరుల ఉపాంత ప్రయోజనం (Marginal benefit), ఉపాంత వ్యయం (Marginal cost) కు సమానంగా ఉండాలి (MB = MC). అప్పుడే వనరుల సమర్థ వినియోగం గరిష్ఠంగా సాధ్యపడుతుంది.

* పర్యావరణ కాలుష్యం శూన్యంగా ఉండాలంటే ఉత్పత్తి, జనాభా వృద్ధిరేటు శూన్యంగా ఉండాలి. ఈ రెండూ సాధ్యం కానివే. ఏ రకమైన సాంకేతిక పద్ధతిని ఉపయోగించినా కాలుష్యం తప్పదు. జనాభా వృద్ధిరేటు శూన్యమైతే ఆర్థిక వ్యవస్థకు (వృద్ధుల జనాభా పెరిగి, పనిచేసే వయసువారి సంఖ్య తగ్గి) నష్టదాయకం అవుతుంది. అందువల్ల ఏ ఆర్థిక వ్యవస్థ అయినా అభిలషణీయ ఆర్థిక వృద్ధిరేటు, పర్యావరణ వనరుల పరిరక్షణలను సంతులనం చేస్తూ తగిన చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. ప్రజాచైతన్యం పెంపొందించడం, కాలుష్య పన్ను, జరిమానాలు, ప్రత్యక్ష నియంత్రణలతో పాటు, పర్యావరణ పరిరక్షణకు తోడ్పడుతున్న వారికి సబ్సిడీలు, ప్రోత్సాహకాలు ఇవ్వడం లాంటి చర్యలు చేపట్టవచ్చు.

Posted Date : 31-01-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

పర్యావరణం - కాలుష్య కారకాలు

మాదిరి ప్రశ్నలు

1. లుకేమియా, మాలిగ్నంట్‌ ట్యూమర్లు, ఆయువు తగ్గడం ఏ రకమైన కాలుష్యం వల్ల సంభవిస్తాయి?
జ: అణుధార్మిక కాలుష్యం

 

2. డెసిబుల్స్‌ వేటికి ప్రమాణాలు?
జ: ధ్వని

గ‌త ప‌రీక్ష‌ల్లో అడిగిన ప్ర‌శ్న‌లు

1. మానవుడికి, పర్యావరణానికి హాని కలిగించని గరిష్ఠ శబ్ద స్థాయి ఎన్ని డెసిబుల్స్‌కు మించరాదు? (ఎస్సై - 2016)
జ: 120

 

2. 1986 ఏప్రిల్‌లో సంభవించిన చెర్నోబిల్‌ దుర్ఘటన ఒక (గ్రూప్‌ - 4, 2014; ఎస్సై - 2016)
జ: కిరణధార్మిక కాలుష్యం

 

3. కిందివాటిలో జల కాలుష్యం వల్ల వచ్చే వ్యాధుల్లో భాగం కానిది? (ఏఈఈ, గ్రూప్‌ - 2, 2017)
1) కలరా             2) జాండీస్‌          3) మలేరియా           4) డయేరియా
జ: 3 (మలేరియా)

 

4. ఆసుపత్రుల వద్ద ఉండాల్సిన శబ్ద స్థాయి పరిధి (ఎఫ్‌బీవో - 2017)
జ: 30 - 40 db

 

5. ధ్వని పీడన యూనిట్‌ ప్రామాణికతలో ఉండాల్సినవి (ఎఫ్‌ఎస్‌వో - 2017)
ఎ) శబ్ద స్థాయి          బి) శబ్ద తీవ్రత            సి) శబ్ద పీడనం
జ: ఎ, బి

6. 2014లో గంగానది కలుషితాన్ని తొలగించడానికి ప్రారంభించిన కార్యక్రమం? (గ్రూప్స్ - 2017)
జ: నమామి గంగా

 

Posted Date : 01-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

సుస్థిర అభివృద్ధి

    అభివృద్ధి అనేది అతి ప్రాచీనమైన మానవ వ్యక్తిగత, సామూహిక కార్యక్రమం. దీనిలో భాగంగా గుహలు విడిచి గృహాలను నిర్మించారు. ఇది కుమ్మరి చక్రంతో మొదలైన మొదటి ఉత్పత్తి. ద్రవ్యం సంపద, సంతోషానికి మారుపేరుగా మారి పర్యావరణాన్ని బాధిస్తున్న విధ్వంసక ప్రక్రియ. ఐక్యరాజ్య సమితి జనరల్‌ అసెంబ్లీ 74వ సమావేశాల్లో భాగంగా 2019 సెప్టెంబరు 24, 25న న్యూయార్క్‌లో జరిగిన వాతావరణ కార్యాచరణ సదస్సులో 16 ఏళ్ల స్వీడన్‌ పర్యావరణ ఉద్యమకారిణి గ్రేటా థెన్‌బర్గ్‌  ‘మా తరాన్ని ముంచేస్తారా’ అని పాలకులను ప్రశ్నించింది. నేటి తరం ఇలా ఎందుకు స్పందిస్తుందో అర్థం కావాలంటే మనిషి అభివృద్ధి భావనా ప్రస్థానాన్ని అవగాహన చేసుకోవాలి. ఆర్థిక, సామాజిక శాస్త్రవేత్తలు మొదట తక్కువ కాలంలో అభివృద్ధి చెందిన దేశాల్లో వాస్తవిక ఆదాయంలోని పెరుగుదలనే ఆర్థిక వృద్ధిగా పరిగణించారు. సాంకేతికతను అందిపుచ్చుకొని సంపదను వస్తువుల రూపంలో సేకరించి, మార్కెటింగ్‌ చేసుకోవడాన్నే ముఖ్యంగా భావించారు. ఈ క్రమంలో పర్యావరణ జాగ్రత్తలను విస్మరించారు. రెండో ప్రపంచ యుద్ధానంతరం రాజకీయంగా స్వతంత్ర దేశంగా అవతరించిన భారత్‌ లాంటి దేశాలను పరిశీలిస్తే వెనుకబడిన దేశాలకు ఆర్థికవృద్ధితోపాటు ఆర్థికాభివృద్ధి కూడా అవసరమని తేల్చారు. దీర్ఘకాలంలో వాస్తవిక ఆదాయంతో పాటు సామాజిక, సంస్థాగత, సాంకేతిక మార్పులను తెలిపే విశాల ప్రక్రియను ఆర్థికాభివృద్ధి అని గుర్తించారు.


    ఆర్థికాభివృద్ధి అనేది ఆర్థికవృద్ధిలా సంపద సృష్టికి ప్రాధాన్యం ఇస్తుంది. అంటే జాతీయాదాయ పెంపుదలే ముఖ్యం. ఇది తక్కువ కాలంలో అధిక వృద్ధిరేటు కోసం ప్రయత్నిస్తుంది. ఉత్పత్తి ఉపాధికి దారితీసి మరెన్నో పరోక్ష ప్రయోజనాలను కల్పిస్తుంది. దీని వల్ల అభివృద్ధి జరుగుతుందనేది సైద్ధాంతిక విశ్వాసం. దీన్నే ట్రికిల్‌ డౌన్‌ థియరీ అంటారు. ఈ సిద్ధాంతం ఆధారంగానే అభివృద్ధి చెందుతున్న దేశాలు అనేక ఆదాయ అభివృద్ధి పనులను చేపట్టాయి. మన దేశంలో 1951-1970 మధ్య కాలంలో సామాజిక అభివృద్ధి, గ్రామాల్లో భూసంస్కరణలు, వ్యవసాయ విస్తరణ, భారీ ప్రాజెక్టులు, పరిశ్రమల నిర్మాణం, హరిత విప్లవాలతో ఆర్థికాభివృద్ధి కోసం అనేక ప్రయత్నాలు జరిగాయి.


ఆర్థిక సంక్షేమం 

    ఆర్థికాభివృద్ధి ఫలాలు కొన్ని సామాజిక వర్గాలు, ప్రాంతాలకే పరిమితమయ్యాయని ఆర్థిక, సామాజిక శాస్త్రవేత్తల పరిశీలనలో తేలింది. పేద ప్రజల స్థితిలో ఎలాంటి మార్పు లేదు. దీన్ని అధిగమించడానికి ఆర్థిక సంక్షేమం ఏర్పడింది. అంటే పేద, బలహీన వర్గాలకు అభివృద్ధి ఫలాలను అందించడానికి ప్రత్యేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారు. మన దేశంలో 1971 - 1990 కాలంలో అనేక పేదరిక, నిరుద్యోగ నిర్మూలన, గ్రామీణ - పట్టణ అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టారు. ఇవి దారిద్య్రరేఖ కింద జీవించేవారి ప్రాథమిక అవసరాలను కొంతమేర తీర్చాయి. కానీ ఆశించిన ఫలితాలు కనిపించలేదు. ఈ పథకాలు ప్రజాస్వామ్య దేశాల్లో క్రమంగా ఓట్ల కోసం పేదలను ఆకర్షించే నినాదాలుగా మారాయి. వీటిలో జరిగే అవినీతి వల్ల ఖజానాపై భారం పెరిగింది.

ఆర్థిక సంక్షేమం = ఆర్థికాభివృద్ధి + ప్రత్యక్ష సంక్షేమ పథకాలు


మానవాభివృద్ధి 
    1991 నుంచి ప్రపంచీకరణ, సరళీకరణ, ప్రైవేటీకరణ చాలా దేశాల్లో అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ఆర్థిక శాస్త్రవేత్తలు పునరాలోచనలో పడ్డారు. మానవుడి కేంద్రీకృతమైన అభివృద్ధి జరగాలని భావించారు. ముఖ్యంగా పేదలు స్వయంగా ఎదిగే వాతావరణాన్ని ప్రభుత్వాలు కల్పించాలి. సంక్షేమ పథకాల పేరుతో వారిని ప్రభుత్వ పథకాల లబ్ధిదారుగా మాత్రమే కాకుండా వారికి స్వేచ్ఛను ఇచ్చి సామర్థ్యాల మేరకు అభివృద్ధిలో చురుకైన భాగస్వాములను చేయాలి. ఇది వారి ఆర్థిక, సామాజిక సాధికారతకు దోహదపడుతుంది. ఇదే నిజమైన మానవాభివృద్ధి. ఆదాయంతోపాటు ప్రజలకు విద్య, ఆరోగ్యాన్ని అందించాలి. ప్రపంచ దేశాలు శ్రామికులను మానవ వనరులుగా గుర్తించి పలు చర్యలు చేపట్టాయి.

మానవాభివృద్ధి = ఆర్థికాభివృద్ధి  +  విద్య + ఆరోగ్యం

    మానవాభివృద్ధి, ఆర్థికాభివృద్ధిలో అభివృద్ధికి ప్రధాన అంశమైన పర్యావరణం గురించి చర్చించలేదు. ప్రకృతి మనిషి కంటే ప్రాచీనమైంది. సృష్టిలోని జీవ, నిర్జీవ పదార్థాలను ఉపయోగించుకుని మానవ నాగరికత రూపుదాల్చింది. ప్రస్తుతం మనుషుల సంఖ్య పెరిగింది. దాంతోపాటు పర్యావరణంలో అనేక మార్పులు వచ్చాయి. అభివృద్ధి పేరుతో సహజ వనరులను అతిగా ఉపయోగించడం వల్ల నేటి తరానికి సహజ సంపద తగ్గిపోయింది. ముఖ్యంగా 18వ శతాబ్దంలో పారిశ్రామిక విప్లవం తర్వాత వనరుల దుర్వినియోగం వేగంగా జరిగి కాలుష్యం అధికమైంది. ఇది రేపటి తరాల భవిష్యత్తును ప్రభావితం చేస్తుందని ప్రపంచ మేధావులు, పర్యావణ వేత్తలు భావించారు. 1970 దశాబ్దంలో ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలోని సమావేశాల్లో ఈ ఆలోచన ప్రారంభమైంది. 1980లో మొదటిసారిగా ప్రకృతి పరిరక్షణ అంతర్జాతీయ యూనియన్‌ సుస్థిర అభివృద్ధి అనే పదాన్ని ప్రయోగించింది. 1987లో పర్యావరణం, అభివృద్ధిపై ఐక్యరాజ్య సమితి ప్రపంచ కమిషన్‌ విడుదల చేసిన ‘అవర్‌ కామన్‌ ఫ్యూచర్‌’లో ఈ పదానికి శాస్త్రీయ నిర్వచనం ఇచ్చింది. దీన్నే సాధారణంగా బ్రంట్‌లాండ్‌ రిపోర్ట్‌ అని పిలుస్తారు. ‘భవిష్యత్తు తరాల అవసరాలు తీర్చుకునే సామర్థ్యాలను దెబ్బతీయకుండా ప్రస్తుత తరాలు తమ అవసరాలను తీర్చుకునే అభివృద్ధే సుస్థిరాభివృద్ధి’.


*  ప్రజలందరి అవసరాలు ముఖ్యంగా పేదలకు ప్రాధాన్యత. 
*  పర్యావరణంపై సాంకేతికత విధించే పరిమితులు
*  ప్రస్తుత, భవిష్యత్తు తరాల మధ్య సమన్యాయం 
*  అభివృద్ధిని ముందు తరాలకు కొనసాగించడం. అందుకే దీన్ని కొనసాగించగల అభివృద్ధి అని కూడా అంటారు.


    ఈ నివేదిక తర్వాత ప్రపంచవ్యాప్తంగా సుస్థిరాభివృద్ధిపై చర్చలు, అవగాహన సదస్సులు ప్రారంభమయ్యాయి. 1992లో బ్రెజిల్‌లోని రియో-డి-జెనీరోలో ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో జరిగిన ధరిత్రీ సదస్సులో అజెండా - 21 పేరుతో 21వ శతాబ్దంలో సుస్థిరాభివృద్ధి సాధనకు సాధ్యాసాధ్యాలు, పరిమితులను చర్చించారు. తర్వాత 20 ఏళ్లకు రియో నగరంలోనే రియో + 20 పేరుతో 2012లో సుస్థిరాబివృద్ధిపై ఐక్యరాజ్య సమితి సదస్సు జరిగింది. ఈ సదస్సులో గత అనుభవాలను సమీక్షించారు. ముఖ్యంగా వాతావరణ మార్పులు - ప్రభావంపై అవగాహన ఏర్పడింది. దీని ఆధారంగానే పారిస్‌ ఒప్పందం (2016) అమల్లోకి వచ్చింది.


భారత్‌ పనితీరు 

    ఐక్యరాజ్య సమితి సుస్థిరాభివృద్ధి సూచిక - 2019 ప్రకారం సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనలో డెన్మార్క్‌ ప్రపంచంలో మొదటి స్థానంలో ఉంది. అమెరికా 35, చైనా 39, భారత్‌ 115వ స్థానంలో ఉన్నాయి. నీతి ఆయోగ్‌ విడుదల చేసిన సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సూచిక - బేస్‌ లైన్‌ రిపోర్ట్, 2018 తొలి నివేదిక ప్రకారం 100 పాయింట్లకు మన దేశం 58 పాయింట్లు సాధించింది. ఈ లక్ష్యాల సాధనలో హిమాచల్‌ ప్రదేశ్, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌ వరుసగా మొదటి నాలుగు స్థానాల్లో ఉన్నాయి.
లక్ష్యాలు

    ఐక్యరాజ్య సమితి 2015 సెప్టెంబరులో న్యూయార్క్‌లో జరిగిన పర్యావరణ సదస్సులో 2015 - 30 మధ్యకాలంలో అన్ని దేశాలు సాధించాల్సిన 17 సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను ఆమోదించింది. 

    1) పేదరిక నిర్మూలన  
    2) ఆకలి చావులను పూర్తిగా తగ్గించడం 
    3) మంచి ఆరోగ్యం  
    4) నాణ్యమైన విద్య  
    5) లింగ సమానత్వం 
    6) పరిశుభ్రమైన నీరు, పరిసరాలు 
    7) పునరుజ్జీవన ఇంధన వాడకం 
    8) ఉపాధి, ఆర్థికవృద్ధి  
    9) పరిశ్రమలు, నూతన ఆవిష్కరణలు, అవస్థాపనా సౌకర్యాల కల్పన
    10) అసమానతల తగ్గింపు  
    11) సుస్థిర నగరాలు, సమాజాలు
    12) బాధ్యతాయుతమైన వినియోగం, ఉత్పత్తి 
    13) వాతావరణ మార్పులపై చర్యలు 
    14) నీటిలోని ప్రాణుల సంరక్షణ 
    15) నేలపై జీవుల రక్షణ 
    16) శాంతి, న్యాయం 
    17) ఉమ్మడి లక్ష్యాల కోసం భాగస్వామ్యం. 

    సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను స్థూలంగా 17గా విభజించినప్పటికీ అవి ఒకదానితో మరొకటి అవినాభావ సంబంధాన్ని కలిగి ఉన్నాయి. కాబట్టి అభివృద్ధి సామాజిక, ఆర్థిక, పర్యావరణపరంగా సుస్థిరంగా ఉండాలి. మొదటిసారి ఐక్యరాజ్య సమితి జనరల్‌ అసెంబ్లీ 74వ సమావేశాల్లో భాగంగా 2019 సెప్టెంబరు 24, 25న న్యూయార్క్‌లో వాతావరణ కార్యాచరణ సదస్సును నిర్వహించింది. ఈ సదస్సుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో పాటు పలువురు నేతలు, పర్యావణ శాస్త్రవేత్తలు హాజరయ్యారు. ఇప్పటివరకు సుస్థిరాభివృద్ధి కోసం చేపట్టిన చర్యలను సమీక్షించారు. సుస్థిరాభివృద్ధి అంటే అసలైన అర్థం నాలుగు కాలాల పాటు కాదు నాలుగు తరాల పాటు అందరినీ సంతోషపెట్టేది. 

P - People;  P - Planet;  P - Prosperity;  P - Partnership;  P - Peace  అనే 5 P'sను సాధించడానికి సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు ఉపయోగపడతాయి. 2000-2015 మధ్య ఎనిమిది సహస్రాబ్ది లక్ష్యాలు ఉన్నాయి.
ఒక చేపను ఒకరికి ఇస్తే ఒక రోజు మాత్రమే ఆకలి తీరుతుంది. అదే అతడికి చేపలు పట్టడం నేర్పిస్తే జీవితాంతం ఆకలి తీర్చుకుంటాడు. -  ప్రముఖ తత్వవేత్త - కన్ఫ్యూసియస్‌

 

సుస్థిరాభివృద్ధి - ప్రపంచ దేశాల కృషి
* ‘మానవ పర్యావరణం’ అనే అంశంపై ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమం (UNEP) 1972 జూన్‌ 5న స్టాక్‌ హోంలో ఓ సమావేశాన్ని నిర్వహించింది. ప్రపంచవ్యాప్తంగా ఏటా ఆ తేదీని ప్రపంచ పర్యావరణ దినోత్సవంగా జరుపుకుంటున్నాం. అప్పటి నుంచే పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం పెరిగింది. 
* 1980లో ప్రపంచ సంరక్షణ వ్యూహం అనే పరిశోధనా పత్రంలో మొదటిసారి ‘కొనసాగించాల్సిన అభివృద్ధి’ అనే పదాన్ని వాడారు.
* 1987లో సుస్థిరాభివృద్ధి సాధన కోసం ఐక్యరాజ్యసమితి అప్పటి నార్వే ప్రధాని హార్లెం బ్రంట్‌లాండ్‌ నేతృత్వంలో World Commission on Environment and Development ను ఏర్పాటు చేసింది.
* సుస్థిరతపై అంతర్జాతీయంగా సహకారాన్ని పెంపొందించడానికి 1992లో ప్రపంచ దేశాధినేతలు బ్రెజిల్‌లోని రియోలో సమావేశమయ్యారు. దీన్నే UN Conference on Environment and Development, ధరిత్రీ సదస్సు, రియో సమ్మిట్‌గా పిలుస్తారు.
* రియో సదస్సు జరిగి 2012కి 20 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ప్రపంచ దేశాధినేతలు రియోలో సమావేశమై సుస్థిరాభివృద్ధి లక్ష్యాల గురించి చర్చించారు. ఇందులో చర్చకు వచ్చిన అంశాలకు 2015లో ఐక్యరాజ్యసమితి సర్వ సభ్య సమావేశంలో ఆమోదం తెలిపారు. వీటినే అజెండా 2030 అని పిలుస్తారు. ఇందులో మొత్తం 17 లక్ష్యాలు, 169 ఉపలక్ష్యాలు ఉన్నాయి. 2016 జనవరి నుంచి ప్రారంభించి 2030 డిసెంబరు నాటికి వీటిని సాధించాలని తీర్మానించారు.


లక్ష్యాలు  
1. పేదరికాన్ని నిర్మూలించడం: 2030 నాటికి పేదరికాన్ని సగానికి తగ్గించాలి. దీనికోసం సాంఘిక భద్రతా పథకాలు అమలుచేయాలి. ఆర్థిక వనరులపై అందరికీ సమాన హక్కులు ఉండేలా చూడాలి.


2. ఆకలిని నిర్మూలించడం: సురక్షితమైన పౌష్ఠికాహారాన్ని అందరికీ తగినంతగా అందుబాటులో ఉంచి, 2030 నాటికి ఆకలిని నిర్మూలించాలి.
* అయిదేళ్లలోపు పిల్లల్లో వయసుకు తగిన ఎత్తు (Stunting), ఎత్తుకు తగిన బరువు (Wasting) లేకపోవడం లాంటి అంశాల్లో అంతర్జాతీయ అంగీకార లక్ష్యాలను చేరుకోవాలి. 2025 నాటికి ఎత్తు తక్కువతో బాధ పడుతున్న పిల్లల సంఖ్యను 40 శాతానికి తగ్గించాలని, శారీరక బరువు సరిగాలేని వారి సంఖ్యను 5 శాతంలోపునకు తీసుకురావాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది.
* 2030 నాటికి వ్యవసాయ ఉత్పాదకతను, చిన్న-కౌలు రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలి.
* 2001 నవంబరులో ఖతార్‌లోని దోహాలో ప్రపంచ వాణిజ్య సంస్థ ్బజూగివ్శీ ఓ సమావేశాన్ని నిర్వహించింది. దీన్నే దోహా రౌండ్‌గా పేర్కొంటారు. ఇందులో వ్యవసాయ ఎగుమతుల సబ్సిడీలను తొలగించాలని; ప్రపంచ వ్యవసాయ మార్కెట్‌లో ఉన్న వాణిజ్యపరమైన షరతులు, ఆటంకాలను ఎత్తివేయాలని తీర్మానించారు.

 

3. అందరికీ మంచి ఆరోగ్యాన్ని అందించాలి
* 2030 నాటికి  ప్రతి లక్ష జననాలకు మాతృత్వ మరణాల రేటును 70కి తగ్గించాలి.
* 2030 నాటికి  ప్రతి 1000 సజీవ జననాలకు Neonatal Mortality Rate (0 - 28 రోజులు)ను 12కి తగ్గించాలి.
* అయిదేళ్లలోపు వయసున్న పిల్లల మరణ రేటును ్బగీ5లీళ్శి ప్రతీ 1000 సజీవ జననాలకు 25కి తగ్గించాలి.
* 2030 కల్లా ఎయిడ్స్, టీబీ, మలేరియా లాంటి వ్యాధులను పూర్తిగా నిర్మూలించాలి. 
* 2030 నాటికి అంటువ్యాధులు కాని రోగాలను 1/3వ వంతు తగ్గించాలి. ప్రపంచవ్యాప్తంగా ఈ జబ్బుల్లో గుండె సంబంధ వ్యాధులు ప్రథమస్థానంలో ఉండగా, క్యాన్సర్‌ రెండో స్థానంలో ఉంది.
* ఆల్కహాల్, డ్రగ్స్‌ వినియోగం, రోడ్డు ప్రమాదాలు, పర్యావరణ కాలుష్యం, పొగాకు మొదలైన వాటి వల్ల సంభవించే మరణాలను 2030 నాటికి   పెద్ద మొత్తంలో తగ్గించాలి.
* ప్రజారోగ్యానికి సంబంధించి దోహా డిక్లరేషన్‌లోని TRIPS (Trade Related Aspects Of Intellectual Property Agreements)  ఒప్పందం ప్రకారం అభివృద్ధి చెందుతున్న దేశాలకు తక్కువ ధరలకే నాణ్యమైన-సురక్షితమైన మందులు, టీకాలను అందించాలి.


4. నాణ్యమైన విద్య
* 2030 నాటికి బాలబాలికలందరికీ నాణ్యమైన పూర్వ ప్రాథమిక, ప్రాథమిక, సెకండరీ విద్యను ఉచితంగా అందించాలి. ప్రమాణాలతో కూడిన సాంకేతిక, వృత్తి, టెరిటరీ విద్యలను అందుబాటు ధరల్లో ఉంచాలి. టెరిటరీ విద్య సెకండరీ విద్య పూర్తయ్యాక 3వ స్థాయిలో ఉంటుంది. ఇది సాధారణంగా కళాశాల విద్య.
* లింగ సంబంధ వ్యత్యాసాలను అన్ని స్థాయుల్లో నిర్మూలించాలి. 2030 నాటికి అర్హత కలిగిన ఉపాధ్యాయుల సంఖ్యను గణనీయంగా పెంచాలి.


5. లింగసమానత్వం, మహిళా సాధికారిత సాధించడం:
మహిళల పట్ల ఉన్న అన్ని రకాల వివక్షను రూపుమాపాలి. ప్రభుత్వ, ప్రైవేట్‌ సంస్థల్లో వీరిపై జరిగే హింసను అరికట్టాలి. మహిళల అక్రమ రవాణా, లైంగిక దాడులు మొదలైన వాటిని నిర్మూలించాలి. బాల్య వివాహాలు, బలవంతపు పెళ్లిళ్లను నిరోధించాలి.
* ఆర్థిక, రాజకీయ, ప్రజా జీవితంలోని అన్ని స్థాయుల్లో మహిళా భాగస్వామ్యాన్ని ప్రోత్సహించాలి. నిర్ణయాలు తీసుకునే చోట పురుషులతో సమానంగా వారికీ అవకాశాలు కల్పించాలి.
* ఆర్థిక వనరులు, భూయాజమాన్యం, సహజ వనరులు మొదలైన వాటిపై మహిళలకు సమాన హక్కులు కల్పించేలా సంస్కరణలు తేవాలి.

 

6. పరిశుభ్రమైన నీరు, పారిశుద్ధ్యం: 2030 నాటికి ప్రజలందరికీ సురక్షితమైన తాగునీటిని అందుబాటు ధరకే పంపిణీచేయాలి. బహిరంగ మలమూత్ర విసర్జనను అరికట్టాలి.
 

7. అందుబాటు ధరల్లో శుద్ధ ఇంధనాలు అందించడం: 2030 నాటికి నమ్మకమైన శక్తి సేవలను అందరికీ అందుబాటు ధరల్లో అందించాలి. ప్రపంచ శక్తి వనరుల్లో పునర్వినియోగ శక్తి వనరుల వాటాను గణనీయంగా పెంచాలి.

8. ఆర్థికవృద్ధి, నాణ్యమైన ఉపాధిని సాధించడం: అల్పాభివృద్ధి దేశాల్లో కనీసం 7% జీడీపీ వృద్ధిని సుస్థిరంగా సాధించాలి.
* 2030 నాటికి ఉపాధి, విద్య లేదా శిక్షణలో లేని యువత వాటాను గణనీయంగా తగ్గించాలి. 
* 2025 నాటికి నిర్బంధ శ్రామికత్వం, బాలకార్మిక వ్యవస్థ, బానిసత్వం, మానవ అక్రమ రవాణాను పూర్తిగా నిర్మూలించాలి.
* 2030 నాటికి అందరికీ ఉత్పాదక ఉపాధిని అందించాలి. సమాన విలువ ఉన్న పనికి సమాన వేతనాన్ని అందించాలి.
* కార్మికుల హక్కులను రక్షించాలి. పనివాళ్లకు ముఖ్యంగా వలస కార్మికులకు సురక్షితమైన పని వాతావరణాన్ని కల్పించాలి.
* యువత ఉపాధి కోసం 2020 నాటికి  ప్రపంచ వ్యూహాన్ని అభివృద్ధిచేసి అమల్లోకి తేవాలి.


9. పరిశ్రమలు, మౌలిక వసతులు, ఆవిష్కరణలు: మానవ సంక్షేమం, ఆర్థికాభివృద్ధి పెంపొందించేందుకు నాణ్యమైన, నమ్మకమైన, సుస్థిర మౌలికవసతులను అభివృద్ధి చేయాలి.
* 2030 నాటికి  ఆదాయం, ఉపాధిలో పరిశ్రమల వాటాను గణనీయంగా పెంచాలి. దీనికోసం సుస్థిర, సమ్మిళిత పారిశ్రామికీకరణను ప్రోత్సహించాలి. అల్పాభివృద్ధి దేశాల్లో పరిశ్రమల వాటాను రెట్టింపు చేయాలి.
* అభివృద్ధి చెందుతున్న దేశాల్లో చిన్నతరహా పరిశ్రమలకు ప్రోత్సాహకాలు అందించాలి.
* శాస్త్రీయ పరిశోధనలు ప్రోత్సహించాలి. 2030 నాటికి ప్రతి మిలియన్‌ జనాభాలో పరిశోధన రంగంలో పనిచేస్తున్నవారి సంఖ్యను గణనీయంగా పెంచాలి.

 

10. దేశం లోపల, వివిధ దేశాల మధ్య ఉన్న ఆర్థిక అసమానతలను తగ్గించాలి: 2030 నాటికి జనాభాలో అట్టడుగున ఉన్న 40% మంది ప్రజల ఆదాయ వృద్ధి రేటు జాతీయ సగటు కంటే ఎక్కువ ఉండేలా చర్యలు చేపట్టాలి.
* వయసు, లింగ, అంగవైకల్యం, జాతి, పుట్టుక, మతం మొదలైనవాటితో సంబంధం లేకుండా అందరికీ సాంఘిక, ఆర్థిక, రాజకీయ సాధికారత కల్పించాలి.
* అసమానతలను ప్రోత్సహించే విధానాలు, చట్టాలను పూర్తిగా తొలగించాలి.
* అంతర్జాతీయ విత్త, ఆర్థిక వ్యవస్థల్లో అభివృద్ధి చెందుతున్న దేశాల ప్రాతినిధ్యం పెంచాలి.
* అల్పాభివృద్ధి దేశాలకు అభివృద్ధి సాయం, విత్త వనరుల ప్రవాహాన్ని ప్రోత్సహించాలి. ఇందులో భాగంగానే ఎఫ్‌డీఐలను రాబట్టాలి.

 

11. నగరాలను నివాసయోగ్యంగా, సురక్షితంగా, సమ్మిళితంగా తయారుచేయడం: 2030 నాటికి అందరికీ సురక్షితమైన ఇళ్లను తక్కువ ధరలకు అందించాలి.
* ప్రజారవాణాను పెంచాలి.
* విపత్తుల వల్ల సంభవించే ప్రాణ, ఆస్తి నష్టాన్ని గణనీయంగా తగ్గించాలి.
* 2015, మార్చి 8న జపాన్‌లోని సెంధాయ్‌లో ఐక్యరాజ్యసమితి మూడో డిజాస్టర్‌ రిస్క్‌ రిడక్షన్‌ సమావేశం జరిగింది. దీనికి ‘సెంథాయ్‌ ఫ్రేమ్‌ వర్క్‌ ఫర్‌ డిజాస్టర్‌ రిస్క్‌ రిడక్షన్‌ 2015-30’ అని పేరుపెట్టారు. ఇందులో కొన్ని నిబంధనలను పేర్కొన్నారు. వీటిప్రకారం విపత్తులను తట్టుకునేలా సమగ్ర విధానాలను అమలుచేసే నగరాల సంఖ్యను పెంచాని తీర్మానించారు.
* పట్టణాల్లో వాయుకాలుష్యం, ఘనవ్యర్థాల నిర్వహణపై ప్రత్యేకంగా దృష్టి సారించాలి.

 

12. సుస్థిర వినియోగం, ఉత్పత్తి విధానాల రూపకల్పన: ఉత్పత్తి, సరఫరా స్థాయిలో ఆహార వృథాను అరికట్టాలి. వినియోగదారు స్థాయిలో తలసరి ఆహార వృథాను సగానికి తగ్గించాలి.
* 2030 నాటికి  నివారణ, RRR (Reduce, Reuse and Recycle) ద్వారా వ్యర్థాల సృష్టిని తగ్గించాలి.
* అభివృద్ధి చెందుతున్న దేశాలకు వినియోగం, ఉత్పత్తిలో సుస్థిర పద్ధతులను అవలంబించేందుకు తగిన సాంకేతిక సామర్థ్యాన్ని పెంపొందించుకునేలా మద్దతు ఇవ్వాలి.
* వృథా వినియోగాన్ని ప్రోత్సహిస్తున్న ఇంధన సబ్సిడీలను హేతుబద్ధీకరించాలి.

 

13. పర్యావరణ మార్పు, దాని ప్రభావంపై సత్వర చర్యలు: సహజ విపత్తులు, శీతోష్ణస్థితి సంబంధ విపత్తులను తట్టుకోగలిగే సామర్థ్యాన్ని అందరిలో బలోపేతం చేయాలి.
* దేశ ప్రణాళిక, విధానాలు, వ్యూహాల్లో శీతోష్ణస్థితి మార్పులను సమీకృతం చేయాలి.
* వీటికి సంబంధించిన (ముందస్తు హెచ్చరిక, మార్పులు తగ్గించగలగడం, వాటిని తట్టుకోగలగడం) విద్య, చైతన్య కార్యక్రమాల గురించి ప్రజల్లో అవగాహన కల్పించాలి.
* శీతోష్ణస్థితి మార్పుల ప్రభావాలను తట్టుకునేలా UNFCCC (United Nations Framework Convention on Climate Change) కింద అభివృద్ధి చెందిన దేశాలు సంవత్సరానికి 100 బిలియన్‌ డాలర్లను అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఇచ్చేందుకు అంగీకరించాయి. వీటిని సాధ్యమైనంత త్వరగా అమలుచేయాలి.

 

14. సముద్రాలు, జలవనరుల సంరక్షణ: అన్నిరకాల సముద్ర కాలుష్యాలను తగ్గించాలి. ముఖ్యంగా భూసంబంధ కార్యకలాపాల ద్వారా జరిగే కాలుష్యాన్ని నివారించాలి.
* సముద్రాల ఆమ్లీకరణను తగ్గించాలి. దాని ప్రభావాలను దీటుగా ఎదుర్కోవాలి.
* అధికంగా చేపలు పట్టడానికి కారణమైన మత్స్యరంగ సబ్సిడీలను పూర్తిగా నిషేధించాలి.

 

15. అడవులు, ఇతర ఆవరణ వ్యవస్థలను పరిరక్షించడం, భూక్షీణతను, జీవవైవిధ్య నష్టాన్ని అరికట్టడం
అంతర్జాతీయ ఒప్పందాల ప్రకారం అడవులు, పర్వతాలు, చిత్తడి నేలలను సంరక్షించాలి.
* అన్నిరకాల అడవుల్లో సుస్థిర యాజమాన్య పద్ధతులను అవలంబించాలి. అడవులు నరకడాన్ని అరికట్టాలి. క్షీణతకు గురైన అడవులను పునరుద్ధరించాలి. అన్ని ప్రాంతాల్లో మొక్కలు నాటే కార్యక్రమాలు చేపట్టాలి.
* కరవులు, వరదల వల్ల క్షీణతకు గురయ్యే మృత్తికను పునరుద్ధరించాలి.
* పర్వత ఆవరణ వ్యవస్థను సంరక్షిస్తూ జీవవైవిధ్యాన్ని కాపాడాలి. వీటి ఉత్పత్తులు సుస్థిరాభివృద్ధికి దోహదపడతాయి. రక్షిత జీవజాతుల అక్రమరవాణా, వేటను అడ్డుకోవాలి.

 

16. అందరికీ శాంతి, న్యాయాన్ని అందించాలి, దీనికోసం బలమైన వ్యవస్థలను ఏర్పాటుచేయాలి
అన్నిరకాల హింసలను, వాటివల్ల జరిగే మరణాలను గణనీయంగా తగ్గించాలి.
* జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అందరికీ సమాన న్యాయాన్ని అందించాలి.
* అవినీతి, లంచగొండితనాన్ని అరికట్టాలి.
* గ్లోబల్‌ గవర్నెన్స్‌కు సంబంధించిన సంస్థల్లో అభివృద్ధి చెందుతున్న దేశాల భాగస్వామ్యాన్ని బలోపేతం చేయాలి.
* 2030 నాటికి అందరికీ చట్టబద్ధమైన గుర్తింపు లభించాలి. 
* తీవ్రవాదం, నేరాలు, హింసలు మొదలైనవాటిని అడ్డుకునే జాతీయస్థాయి సంస్థలను బలోపేతం చేయాలి.

 

17. సార్వత్రిక భాగస్వామ్యాన్ని పెంపొందించడం: దేశీయ వనరుల సేకరణను బలోపేతం చేయాలి. అభివృద్ధి చెందిన దేశాలు అభివృద్ధి చెందుతున్న దేశాలకు పర్యావరణ అనుకూల సాంకేతికతను తక్కువ ధరలకే అందించాలి.

Posted Date : 09-06-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

పర్యావరణ వనరుల పరిరక్షణ

మాదిరి ప్ర‌శ్న‌లు

1. పర్యావరణంలో వచ్చే విభాగాలు ఏవి?
1. వాతావరణం 2. జలావరణం 3. ఆశ్మావరణం 4. జీవావరణం
జ: 1, 2, 3, 4

 

2. కిందివాటిలో జల ఆవరణ వ్యవస్థ (Acquatic Ecosystem) కు సంబంధించిన అంశాలేవి?
1. సరస్సు ఆవరణ వ్యవస్థ
2. తడినేల ఆవరణ వ్యవస్థ
3. డెల్టా భూమి ఆవరణ వ్యవస్థ
4. సముద్రనీటి ఆవరణ వ్వవస్థ
జ: 1, 2, 3, 4

 

3. కిందివాటిలో భౌమ ఆవరణ వ్యవస్థ (Terrestial Ecosystem) కానిది ఏది?
ఎ) ద్వీపాల ఆవరణ వ్యవస్థ
బి) పర్వత ఆవరణ వ్యవస్థ
సి) ఎడారి ఆవరణ వ్యవస్థ
డి) డెల్టా భూమి ఆవరణ వ్యవస్థ
జ:  డి (డెల్టా భూమి ఆవరణ వ్యవస్థ)

4. సహజవనరులకు ఉండాల్సిన లక్షణం?
ఎ) వనరుల నిల్వలు స్థిరంగా ఉండటం
బి) ప్రకృతి వనరుల నిల్వలను నిర్థారించడం
సి) సహజ, శారీరక లేదా జీవ రసాయన రేటుకు లోబడి వనరుల నిల్వలు మార్పుకి లోనవడం
డి) పైమూడింటిలో ఏ ఒక్క లక్షణమైనా
జ:  డి (పైమూడింటిలో ఏ ఒక్క లక్షణమైనా)

 

5. కింది వెన్ చిత్రంలో ఏ భాగాన్ని 'సుస్థిరమైన అభివృద్ధి' భావనగా పేర్కొంటారు?

జ: b

6. కిందివాటిలో పునరుద్ధరించగల వనరులు (Renewable Resource) ఏవి?
1. సూర్యకాంతి    2. ఆహార ఉత్పత్తి      3. భూగర్భ నీటి నిల్వలు     4. అటవీ సంపద
జ:  1, 2, 3, 4

 

7. ఉత్పాదక వస్తువులు, ఉత్పత్తి వస్తువులకు సంబంధించి 'భౌతిక సమతూక నమూనా'ను ప్రతిపాదించింది?
జ: అలెన్ నీస్ - ఆర్.వి. ఆయిర్స్

 

8. గ్రీకుల నమ్మకం ప్రకారం భూవనరులను దుర్వినియోగం చేసేవారిని శిక్షించే న్యాయదేవత?
జ: తిమిస్

 

9. 'Rent under the Assumption of Exhaustibility' పరిశోధన గ్రంథకర్త ఎవరు?
జ: ఎల్.సి. గ్రే (1914)

 జ: మొదటి నిలకడగల వృద్ధి నియమం

Posted Date : 31-01-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

పర్యావరణ వనరుల పరిరక్షణ

         ఆర్థిక శాస్త్రవేత్తలు పర్యావరణ క్షయాన్ని మార్కెట్ వైఫల్యంగా పేర్కొంటారు. జీవాధార వ్యవస్థకు (Life Support System) అవసరమైన మూడు విధులను పర్యావరణం నిర్వహిస్తుంది. అవి: ఎ) సహజవనరులను అందించడం  బి) సదుపాయాలను అందించడం సి) ఆర్థిక కార్యకలాపాల వల్ల విడుదలైన కాలుష్యాలను విలీనం చేసుకోవడం  (తొట్టెగా ఉపయోగపడటం). అయితే ఈ విధులు మార్కెట్ పరిధిలోని అంశాలు కాకపోవడం వల్ల, పర్యావరణం అందిస్తున్న విధులకైన వ్యయాలను లెక్కించకపోవడం వల్ల మార్కెట్ ధరలు వాస్తవ ధరలను ప్రతిబింబించవు. వనరుల అభిలషణీయ ధరకు, మార్కెట్ ధరకు మధ్య వ్యత్యాసం ఉండటాన్నే 'మార్కెట్ వైఫల్యం'గా పేర్కొంటారు.
        మార్కెట్ వైఫల్యాలు సమాజంపై 'బాహ్య వ్యయాలు' (External Costs) పడేలా చేస్తాయి. రెండు పక్షాల మధ్య జరిగే ఆర్థిక కార్యకలాపాల వల్ల వారి పరిధిలోకి రాని మూడో పక్షం లేదా వ్యక్తిపై విధించే వ్యయం లేదా ప్రయోజనాన్ని 'బహిర్గత అంశాలు' (Externalities)గా నిర్వచించవచ్చు.
ఉదా: ఒక నదీతీరంలో రసాయన పరిశ్రమ, పర్యటక కేంద్రం ఉన్నప్పుడు రసాయన పరిశ్రమ విడుదల చేసే కాలుష్యాలు, వ్యర్థాలు నదీజలాలను కలుషితం చేయడం; నదీకాలుష్యం వల్ల పర్యటక కేంద్రం వ్యయాలు పెరిగి, లాభాలు తగ్గడం బహిర్గత అంశాల ప్రభావంగా చెప్పవచ్చు. బహిర్గత వ్యయాల వల్ల అభిలషణీయ పంపిణీ సామర్థ్యం దెబ్బతిని, సాంఘిక సామర్థ్యాన్ని పెంపొందించడం సాధ్యం కాదు. ఒక వస్తువు మార్కెట్ ధరను నిర్ణయించడంలో ఉత్పత్తి సంస్థలు బహిర్గత అంశాలను లెక్కించకపోవడంతో సాంఘిక లాభాలు లేదా వ్యయాల వ్యక్తీకరణ జరగడం లేదు. అందువల్ల వస్తూత్పత్తి అల్ప లేదా అధిక పరిమాణంలో జరిగి సమతౌల్యం లోపిస్తుంది.

బహిర్గత అంశాలు పంపిణీ వ్యవస్థపై రెండు రకాల ప్రభావాలను కలిగిస్తాయి.
1. రుణాత్మక ప్రభావం 2. ధనాత్మక ప్రభావం
 రుణాత్మక బహిర్గత అంశాల ప్రభావం వల్ల మార్కెట్ ఉత్పత్తి సాంఘికంగా అభిలషణీయ స్థాయిలో జరగకపోగా ఉపాంతహాని (అదనంగా సమాజానికి హాని) కలిగిస్తుంది. పర్యావరణ నష్టం జరిగి కాలుష్యం పెరుగుతుంది. బహిర్గత అంశాల ధనాత్మక ప్రభావం వల్ల సాంఘిక ప్రయోజనం ఏర్పడి, ఉత్పత్తి పెరుగుతుంది.
బహిర్గత అంశాల ప్రభావాన్ని నివారించే చర్యలు (Solutions of Externalities): బహిర్గత అంశాల ప్రభావం వల్ల ఏర్పడే మార్కెట్ వైఫల్యాల నుంచి మార్కెట్ వ్యవస్థను చక్కదిద్ది పంపిణీ సామర్థ్యం పెంచడానికి కింది చర్యలు ఉపకరిస్తాయి.
1. సాంఘిక నమ్మకాలు (Social Conventions): సంస్కృతిలో భాగంగా ఏర్పడే సాంఘిక నమ్మకాలు, ఆచారాలు, పాటించే పద్ధతులు పర్యావరణంపై పడుతున్న బహిర్గత ప్రభావం గురించి అవగాహనను పెంపొందిస్తాయి.
ఉదా: చిన్నవయసులో తల్లిదండ్రులు, గురువులు నేర్పే పద్ధతులు. వ్యర్థపదార్థాలను చెత్తబుట్టలో మాత్రమే వేయడం, వనరుల వాడకంలో పొదుపు మొదలైనవి. ఈ అలవాట్లు పారిశ్రామిక వ్యర్థాలు, కాలుష్యాల అదుపునకు తోడ్పడతాయి.
2. సంస్థలు విలీనం కావడం (Mergers): సంస్థలు విలీనం కావడం వల్ల బహిర్గత అంశాల ప్రభావాన్ని నివారించవచ్చు. అయితే అన్ని సందర్భాల్లో, ముఖ్యంగా వైయక్తిక వినియోగంలో ఇది సాధ్యం కాకపోవచ్చు.

3. కాలుష్యాలు, వ్యర్థాల పరిమాణంపై నియంత్రణలు విధించడం (Regular limits): కాలుష్యాలు, ఘనవ్యర్థాల పరిమాణంపై పరిమితులు విధించి, పరిమితిని మించి కాలుష్యాలు విడుదల చేసే సంస్థలకు అదనపు పన్నులు, జరిమానాలు విధించడం ద్వారా బహిర్గత వ్యయాల రుణాత్మక ప్రభావాన్ని తగ్గించవచ్చు.
 దిల్లీ ప్రభుత్వం కార్ల వినియోగంలో ప్రవేశపెట్టిన సరి-బేసి కార్ల వాడకం కాలుష్య నియంత్రణకు మంచి ఉదాహరణే. వ్యర్థాలను విడుదల చేసే కర్మాగారాల ఉత్పత్తిపై గరిష్ఠ పరిమితి విధించడం ద్వారా కాలుష్యాన్ని నియంత్రించవచ్చు.
 సులభంగా అమలుచేయడానికి వీలున్న ఈ కాలుష్య నియంత్రణ వల్ల, సంస్థల ఉత్పత్తి పరిమాణం అభిలషణీయ స్థాయి కంటే తగ్గడం, ఉత్పత్తి వ్యయం పెరగడం, ఉత్పాదక శక్తి వృథా కావడం లాంటి సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. అంతేకాకుండా కాలుష్య పరిమాణాన్ని నిర్ధారించడం, సంస్థల వ్యర్థాలను కనుక్కోవడం అంత సులభం కాదు.
4. కాలుష్య పన్ను (Pigouvian Corrective Taxes): బహిర్గత అంశాల రుణాత్మక ప్రభావాన్ని చక్కదిద్దడానికి ఎ.సి. పిగూ 'కాలుష్య పన్నును' సూచించాడు. కాలుష్యస్థాయిని సాంఘికంగా అభిలషణీయ స్థాయికి నియంత్రించడానికి కాలుష్యం వల్ల సమాజానికి ఏర్పడుతున్న నష్టానికి సమానమైన ద్రవ్య విలువతో పన్నుల విధానాన్ని రూపొందించాలని పిగూ సూచించాడు. ఈ కాలుష్యపు పన్నునే పిగూవియన్ టాక్స్ (Pigouvian Tax) అంటారు. ఈ కాలుష్య పన్ను విధింపు కాలుష్య నియంత్రణకు పూర్తి పరిష్కారం కాకపోయినా, సంస్థలు ఉత్పత్తి చేస్తున్న హానికర కాలుష్యాలు, వ్యర్థాల పరిమాణాన్ని గుర్తించవచ్చు. వాటివల్ల పర్యావరణ క్షీణతకు ఏర్పడుతున్న వ్యయాలను నిర్ణయించి బాధ్యుల నుంచే పరిహారాన్ని (పన్నుల రూపంలో) వసూలు చేయవచ్చు.

5. సబ్సిడీల ద్వారా ధనాత్మక బహిర్గత అంశాలను ప్రోత్సహించడం (Encouraging Positibe Externalities through Subsidies): సంస్థల వల్ల చేకూరుతున్న సాంఘిక ప్రయోజనం సబ్సిడీకి సమానంగా ఉంటే అది సంస్థకు ప్రోత్సాహకరంగా ఉండటంతోపాటు ఇతర సంస్థలకు మార్గదర్శకం అవుతుంది. ఉత్పత్తి పరిమాణం కూడా అల్పస్థాయి నుంచి అభిలషణీయ స్థాయికి పెరిగి, ఆర్థిక వ్యవస్థ లబ్ధి పొందుతుంది.
ఉదా: విద్యుత్ ఉత్పత్తికి సోలార్ ప్యానెళ్ల తయారీ పరిశ్రమలకు సబ్సిడీ ఇవ్వడం లేదా గృహ విద్యుత్ వినియోగదారులకు సోలార్ ప్యానెళ్ల కొనుగోలుకు సబ్సిడీ ఇవ్వడం మొదలైనవి. అయితే సాంఘిక ప్రయోజనం, సబ్సిడీలను లెక్కించడంలో జాగ్రత్తలు తీసుకోకపోతే ఉత్పత్తి పెరగకపోగా ఉత్పత్తి సామర్థ్యం దెబ్బతిని, సబ్సిడీలు దుర్వినియోగం అయ్యే ప్రమాదం ఉంది.
6. పబ్లిక్ వస్తువుగా పర్యావరణం (Environment of Public good): పబ్లిక్ వస్తువులకు మూడు లక్షణాలు ఉంటాయి. అవి:
1. ఉమ్మడి వస్తువులుగా అందరికీ అందుబాటులో ఉండటం. ఉదా: గాలి.
2. వీటి వాడకం నుంచి ఎవరినీ నిరోధించడానికి అవకాశం లేకపోవడం.
3. ఈ వనరులు అవిభాజ్యాలు. అంటే వీటిని వైయక్తిక లేదా చిన్న యూనిట్లుగా విభజించి, వాటి వాడకానికి ధర నిర్దేశించే అవకాశం ఉండదు. ధర చెల్లించినా, చెల్లించకపోయినా అందరూ సమానంగా వాడుకునే అవకాశం ఉంటుంది.

 పర్యావరణం అందించే జీవవైవిధ్యం, ప్రకృతి సౌందర్యం, నదులు, జలాశయాలు, అడవులు, స్వచ్ఛమైన గాలి, నీరు, పబ్లిక్ వస్తువులకు ఉదాహరణలు. ఇవి సంఘానికి చెందిన సామూహిక ఆస్తి లేదా ఉమ్మడి ఆస్తి. మార్కెట్ వస్తువులకు నిర్ణయించినట్లు వీటి వాడకానికి ధర నిర్ణయించలేం. ఒకవేళ ఎవరైనా ధరను చెల్లించడానికి ఇష్టపడకపోతే అలాంటి వినియోగదారులను వాడకం నుంచి నిరోధించే అవకాశం లేదు. ఉమ్మడి ఆస్తి వస్తువులైన వీటిపై అందరికీ అధికారం ఉండటం వల్ల వాటి వాడకానికి అందరూ సమానంగా పోటీ పడతారు. దాంతో వీటిని ఎవరికీ చెందని వస్తువులుగా పరిగణించి వృథా చేయడం, విచక్షణారహితంగా వాడుతుండటంతో నిల్వలు తరిగిపోయి పర్యావరణ అసమతౌల్యానికి కారణం అవుతున్నాయి. పబ్లిక్ వస్తువులను విచక్షణారహితంగా ఉపయోగించడాన్ని నియంత్రిస్తూ, పరిమితులు విధిస్తూ, సంరక్షణ చర్యలు చేపడితే జీవవైవిధ్యాన్ని పరిరక్షించవచ్చు. తద్వారా సమాజంలో పర్యావరణ వనరులపై బహిర్గత అంశాల రుణాత్మక ప్రభావాన్ని తగ్గించొచ్చు.
7. ఆస్తి హక్కు: పర్యావరణ వనరులపై బహిర్గత అంశాల రుణాత్మక ప్రభావాన్ని తగ్గించడానికి మరొక పరిష్కారం ప్రయివేట్ ఆస్తి హక్కులు. సమర్థవంతమైన ఆస్తిహక్కుల నిర్మాణమే సమతౌల్య మార్కెట్లకు పునాది. సమర్థవంతమైన పంపిణీ వ్యవస్థకు మూడు లక్షణాలుంటాయి.
1) వనరులపై వ్యక్తులు, సంస్థలకు ప్రత్యేకంగా ఆస్తి హక్కులు ఉండి వాటికయ్యే వ్యయాలు, చేకూరే లాభాలు వారికి మాత్రమే చెందడం.
2) ఆస్తి హక్కును ఒక వ్యక్తి లేదా సంస్థ నుంచి మరో వ్యక్తి లేదా సంస్థకు మార్చడానికి వీలుండటం.
3) వనరులను ఇతరులు ఆక్రమించడానికి అవకాశం లేకుండా వాటి సొంతదారుడు వనరులను పరిమితంగా, సమర్థంగా వినియోగిస్తూ, వాటి పరిమాణం, నాణ్యత క్షీణించకుండా జాగ్రత్తగా చూసుకోవడం.
ఉదా: వ్యవసాయదారుడు తాను సేద్యం చేసే భూమిలో భూసారం తగ్గకుండా రసాయన ఎరువులు ఉపయోగించడం, పంటమార్పిడి చేయడం లాంటి చర్యలు తీసుకుంటాడు.

  తద్వారా పర్యావరణ వనరులను ఇష్టారీతిలో వినియోగించి వాటి క్షీణతకు కారణమవడం ఉండదు. అయితే ప్రకృతి వనరులపై ఆస్తిహక్కు అంటే మార్కెట్ వ్యవస్థలో కనిపించే ప్రయివేటీకరణే. దీనివల్ల ప్రకృతి వనరులపై కొద్దిమందికి ఆధిపత్యం ఏర్పడే ప్రమాదం కూడా ఉంది.

 సామాన్యుల దుర్ఘటన (ఇక్కట్లు)

ఉమ్మడి ఆస్తివనరులైన పర్యావరణ వనరులపై సమాజంలోని వ్యక్తులందరికీ సమానమైన హక్కులుండటంతో సాంఘిక సంక్షేమాన్ని విస్మరించి, స్వలాభం కోసం విచక్షణారహితంగా వనరులను అవి అంతరించే స్థాయిలో దోపిడీ చేస్తారు. 1833లో విలియం ఫోస్టర్ లాయిడ్ (William Forster Lloyd) 'సామాన్యుల దుర్ఘటన' (Tragedy of Commons ) అనే భావనను ప్రవేశపెట్టాడు. దీనికి ఆధారం 'గ్రామీణ ప్రాంతాల్లో పాడిపశువుల పెంపకానికి, పచ్చిక బీళ్లను వాటి పచ్చదనం నశించే స్థాయిలో ఉపయోగించడంతో ఆ పచ్చిక బీళ్లు అంతరించడం' అనే అంశం.
 1968లో గారెట్ హార్డిన్ సామాన్యుల దుర్ఘటన సిద్ధాంతాన్ని జనాభా అభివృద్ధికి అన్వయించి అధిక సంతానం కుటుంబానికి లబ్ధి చేకూర్చినా, అధిక జనాభా వల్ల సమాజంపై రుణాత్మక ప్రభావం (Negative effect) పడుతుందని వివరించారు. ఉమ్మడి ఆస్తిగా ఉన్న పర్యావరణ వనరులను విచక్షణారహితంగా వినియోగించడం వల్ల ప్రకృతి వైపరీత్యాలు ఏర్పడుతున్నాయి. వనరుల వినియోగంపై ఆంక్షలు, నిబంధనల అమలు లాంటి చర్యలు చేపట్టడంతో పాటు జనాభా నియంత్రణను అనుసరించాలని ఆయన సూచించారు.

Posted Date : 31-01-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

పర్యావరణ క్షీణత విలువ లెక్కించడం 

మాదిరి ప్ర‌శ్న‌లు

1. పర్యావరణాన్ని ఏవిధంగా నిర్వచించవచ్చు?
ఎ) ఒక నిర్ణీత ప్రదేశంలో, ఒక నిర్ణీత కాలంలో మానవుల చుట్టూ ఉన్న పరిస్థితుల మొత్తం.
బి) ఒకరి చుట్టూ ఉన్న పరిస్థితులు, వస్తువులు, నియమాలను కలిపి పర్యావరణం అంటారు.
సి) మనుషులతో పాటు అన్ని రకాలైన ప్రాణుల అభివృద్ధిని ప్రభావితం చేస్తూ, మార్పులకు గురిచేసే అన్నిరకాల నియమాలు, ప్రభావాలను కలిపి పర్యావరణం అంటారు.
డి) పైవన్నీ సరైనవే.
జ: డి (పైవన్నీ సరైనవే)

 

2. కిందివాటిని జతపరచండి.
1. భౌతిక అనుఘటకాలు      ఎ) జనాభా, ఆచారాలు, మానవ సంబంధాలు, పట్టణీకరణ

2. జీవ అనుఘటకాలు         బి) సూర్యశక్తి, వాయుశక్తి, భూ ఉష్ణశక్తి, విద్యుదయస్కాంత శక్తి

3. సాంఘిక అనుఘటకాలు   సి) మొక్కలు, వృక్షాలు, జంతువులు

4. శక్తి అనుఘటకాలు          డి) భూమి, నీరు, గాలి, పర్వతాలు, అడవులు

జ: 1-డి, 2-సి, 3-ఎ, 4-బి.

3. మార్కెట్ వ్యవస్థకు బహిర్గత కారకమైన పర్యావరణ క్షీణత ఆర్థిక విలువ లెక్కించడం వల్ల ...
1. నాణ్యత కోల్పోయిన విభిన్న పర్యావరణ వనరులను గుర్తించవచ్చు.
2. కాలుష్యాల రుణాత్మక ప్రభావానికి గురైన వనరుల మధ్య భౌతిక సంబంధాన్ని లెక్కించవచ్చు.
3. పర్యావరణ క్షీణత వల్ల వ్యక్తులు, సంస్థలకు ఏర్పడిన నష్టంలో కొంతభాగం తగ్గించడానికి సూచనలు ఇవ్వొచ్చు.
4. పర్యావరణ వనరులకు జరిగిన భౌతిక నష్టానికి ద్రవ్య విలువ లెక్కించవచ్చు.
జ: 1, 2, 3, 4

 

4. పునరావృతంకాని వనరుల విషయంలో మన ఎంపిక ఏవిధంగా ఉండాలి?
     ఎ) పునఃచక్రీకరణ చేయడం        బి) ఎక్కువగా వృథా చేయకుండా ఉండటం
     సి) పొదుపుగా వాడుకోవడం      డి) అన్నీ
జ: డి (అన్నీ)

 

5. పర్యావరణ వనరుల క్షీణత అంచనాకు వ్యయ-ప్రయోజన పద్ధతిని సూచించింది ఎవరు?
జ: హిక్స్ - కాల్డార్

Posted Date : 31-01-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

అభివృద్ధి - నిరాశ్రయత

అభివృద్ధి చెందుతున్న భారతదేశంలో వ్యవసాయ, పారిశ్రామిక, నీటిపారుదల, విద్యుత్, గనులు లాంటి రంగాలు కీలకమైనవి. ఈ రంగాలను ఆధారంగా చేసుకుని నూతన పరిశ్రమలు నిర్మించాలి. అవస్థాపన సౌకర్యాలు కల్పించాలి. ఈ ప్రాజెక్టుల నిర్మాణానికి పెద్దఎత్తున భూములు అవసరం. వాటిని సేకరించాలంటే ఆ ప్రాంత భూ యజమానులు, స్థానికులు, వృత్తి కార్మికులు, కళాకారులు, కార్మికులు, ప్రజలు నిరాశ్రయులవుతారు. ఇలా వారు దేశాభివృద్ధి కోసం తమ జీవనం, వృత్తులు, ఆస్తులు, సంస్కృతి సంప్రదాయాలను వదులుకోవాల్సి వస్తుంది.
భారీ నీటి ప్రాజెక్టులు, ప్రత్యేక ఆర్థిక మండళ్లు, పరిశ్రమలు, తీరప్రాంత కారిడార్లు, మైనింగ్ కార్యకలాపాలకు మౌలిక సదుపాయాలు, వాటి నిర్మాణాలకు సంబంధించి కొన్ని వేల ప్రజలు తమ భూములు - నివాసాలు కోల్పోవడంతో నిరాశ్రయత (Displacement) ఏర్పడుతుంది.
* అభివృద్ధి ప్రాజెక్టుల నిర్మాణం వల్ల అనేక సమస్యలు ఉంటాయి. ప్రధానంగా....
1) పర్యావరణానికి హాని జరుగుతుంది
2) అడవుల హననం
3) జీవ వైవిధ్యం నశిస్తుంది
4) వన్యమృగ సంపద తరిగిపోతుంది

5) తెగలు తమ సంస్కృతి, సంప్రదాయాలు కోల్పోవాల్సి వస్తుంది.
6) ప్రజలు భూములు, జీవనోపాధి కోల్పోతారు.
7) వ్యవసాయ ఉత్పాదకత తగ్గుతుంది
8) ఆహార భద్రత కొరత
9) ప్రజా ఆందోళనలు, సామాజిక అశాంతి పెరుగుతాయి.


పునరావాస అంశాలు (Rehabilitation Aspects)

నిర్వాసితులు/ నిరాశ్రయులు

ప్రాజెక్టులు, నీటిపారుదల ప్రాజెక్టులు, సెజ్‌లు, మైనింగ్, పారిశ్రామిక, ఆర్థిక, తీరప్రాంత కారిడార్లు, నౌకాశ్రయాలు, మౌలిక సదుపాయాలు లాంటి నిర్మాణాల వల్ల ఇళ్లు, భూములు, జీవనోపాధి కోల్పోయిన ప్రజలను నిర్వాసితులు అంటారు.
 

పునరావాసం
నిర్వాసితులు/ నిరాశ్రయులను దీర్ఘకాల ప్రాతిపదికన వేరే ప్రాంతాలకు తరలించి వారు జీవనోపాధి కోల్పోకుండా కావాల్సిన మౌలిక, జీవన/ ప్రాథమిక సౌకర్యాలు కల్పించడాన్ని పునరావాసం అంటారు.

 

ప్రాజెక్టుల నిర్మాణంలో సమస్యలు... 

* ప్రాజెక్టుల నిర్మాణానికి సంబంధించి పునరావాసం, పరిహారం విషయంలో అనేక సందర్భాల్లో ఉద్యమాలు, నిరసనలు తీవ్రస్థాయిలో జరిగాయి. ప్రధానంగా కింది ప్రాజెక్టుల విషయంలో ఉద్యమాలు జరిగాయి.

* ఆంధ్రప్రదేశ్‌లోని నాగార్జున సాగర్ ప్రాజెక్టు
* తమిళనాడులోని కుడంకుళం అణు విద్యుత్ ప్రాజెక్టు
* గుజరాత్‌లో నర్మదా నదిపై సర్దార్ సరోవర్ ప్రాజెక్టు విషయంలో గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇక్కడ ప్రజలకోసం చాత్రా యువ సంఘర్షణ్ వాహిని, సెంటర్ ఫర్ సోషల్ స్టడీస్ (సూరత్) లాంటి సంస్థలు ఆందోళనలు చేశాయి.
* నర్మదా బచావో పేరుతో మేధాపాట్కర్ ఉద్యమం చేపట్టారు.
తెహ్రి డ్యామ్ - ఉత్తర్ ప్రదేశ్: దీన్ని భాగీరథి నదిపై నిర్మించాలని భావించారు. ఇది పూర్తయితే 107 గ్రామాల్లో 9,563 కుటుంబాలకు చెందినవారు నిర్వాసితులవుతారని అంచనా. సుందర్‌లాల్ బహుగుణ 1996లో 72 రోజులు, తర్వాత 56 రోజులు సత్యాగ్రహం చేశారు. ఈ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా వీరేంద్ర దత్, సక్లాని, తెహ్రి బంద్ విరోధి సంఘర్షణ సమితి అధ్యక్షుడు విద్యాసాగర్ సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ వేశారు.
శ్రీకాకుళం - కొవ్వాడ అణు విద్యుత్ కేంద్రం: దీన్ని న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నిర్మిస్తోంది. అయితే స్థానికులు నిరసన వ్యక్తం చేస్తున్నారు.
* గంగవరం (విశాఖ) పోర్టులో పెట్రోనెట్‌కు చెందిన LNG ప్రాజెక్టు నిర్మాణంపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి.
* విశాఖ - ఫార్మాసిటీ, పశ్చిమ బంగలో టాటా నానో ప్రాజెక్టు
* మహారాష్ట్ర - ఇచ్చంపల్లి ప్రాజెక్టు

* కింది ప్రాజెక్టుల్లో గనుల తవ్వకంపై సమస్యలు ఉన్నాయి.
ఎ) ఝార్ఖండ్‌లోని రాంచి, హజరీబాగ్
బి) మధ్యప్రదేశ్‌లోని జయంత్ ప్రాజెక్టు
సి) ఉత్తర్ ప్రదేశ్‌లోని సింగ్రౌలి ప్రాజెక్టు, బీనా ప్రాజెక్టు
డి) చత్తీస్‌గఢ్ - వేదాంత ప్రాజెక్టు
ఇ) గుజరాత్ - సాయాజి ఐరన్ పరిశ్రమ
ఎఫ్) తమిళనాడు - నైవేలి లిగ్నైట్ ప్రాజెక్టు

 

స్వచ్ఛంద సంస్థల పాత్ర 

* గుజరాత్‌లో ఉబై డ్యామ్ నిర్వాసితుల తరపున ఉబైన నిర్మాణ సమితి పోరాడుతోంది.

* చోటా నాగపూర్‌లో కోయిల్ కరోజన సంఘటన,
* సర్దార్ సరోవర్ ప్రాజెక్టు నిర్వాసితుల కోసం చాత్ర యువ సంఘర్షణ వాహిని, ద పక్టన్ రిసెర్చ్ ఇన్ కమ్యూనిటీ హెల్త్, డెవలప్‌మెంట్ గ్రూప్ సొసైటీలు,
* సూరత్‌లో ఆర్చ్ వాహిని ఆఫ్ మంగోలి, రాజ్‌పిప్లా సోషల్ సర్వీసెస్ లాంటి సంస్థలు ఆయా ప్రాజెక్టుల నిర్వాసితుల హక్కులు, పునరావాస కల్పన, కనీస అవసరాల కోసం ఉద్యమాలు చేపట్టాయి.

గిరిజన పంచశీల్ - పునరావాస కల్పన చర్యలు 

* ప్రాజెక్టుల నిర్మాణం వల్ల నిరాశ్రయులైన ఆదివాసులు, గిరిజనులకు పునరావాసం కల్పించడానికి, గిరిజన అభివృద్ధి సంస్థ జవహర్‌లాల్ నెహ్రూ కాలంలో ఆమోదించిన 5 సూత్రాలను ట్రైబల్ పంచశీల్ అంటారు. అవి:

1) ఆదివాసుల జీవన విధానంపై ఎలాంటి ఆంక్షలు విధించరాదు.
2) ఆదివాసీ సహజ సంస్కృతి సంప్రదాయాలను ప్రోత్సహించాలి.
3) ఆదివాసీ నివాస ప్రాంతాలకు దగ్గర్లోనే పునరావాసం కల్పించాలి.
4) పునరావాసం వారి దగ్గరలో లేకుంటే సారవంతమైన వ్యవసాయ భూముల వద్ద పునరావాసం కల్పించాలి.
5) ఆదివాసీ పునరావాస కేంద్రాల్లో పాఠశాలలు, తాగు, సాగునీరు, ఆరోగ్య కేంద్రాలు, సారవంతమైన భూమి లాంటి సదుపాయాలు కల్పించేలా కృషి చేయాలి.

 

సరైన పునరావాసం లభించాలంటే.........
* ప్రాజెక్ట్ నిర్మాణ ప్రయోజనాల్లో నిర్వాసితులకు భాగస్వామ్యం కల్పించాలి.
* పునరావాస కేంద్రాలు వారి పాత జీవన విధానానికి దగ్గరగా ఉండాలి.
* భూమిని కోల్పోయిన వారికి భూమిని అందించాలి.
* పని భద్రత కల్పించాలి.
* యువకుల కోసం ఉపాధి నైపుణ్య, శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయాలి.

* ప్రభుత్వ ఉద్యోగాలు, ఆయా సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించాలి.
* ఆవాస కల్పనలో నిర్వాసితులు, స్వచ్ఛంద సంస్థల సహకారం తీసుకోవాలి.

 

భూసేకరణ విధానం 

ఏదైనా ప్రజా అవసరం నిమిత్తం భూమిని సేకరించాలని ప్రభుత్వం భావించినప్పుడు ప్రాథమిక పరిశీలన కోసం ఒక ప్రకటన (Notification) ఇస్తుంది.

* ఆ ప్రకటనపై ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే ప్రకటన తేదీ నుంచి 30 రోజుల్లోపు కలెక్టర్‌కు తమ అభ్యంతరాలు తెలుపుకోవచ్చు.
* క్షేత్రస్థాయిలో సేకరించాల్సిన భూములను పరిశీలించే సందర్భంలో భూమికి ఏదైనా నష్టం జరిగితే, సరైన పరిహారం చెల్లిస్తారు.
* ప్రాథమిక పరిశీలన తర్వాత కలెక్టర్ ప్రభుత్వానికి నివేదిక పంపిస్తారు.
* ఆ నివేదిక ప్రకారం భూమి సరైందే అని ప్రభుత్వం భావిస్తే దాని మేరకు ఒక డిక్లరేషన్ వెలువడుతుంది. వెంటనే దానికి అనుగుణంగా భూమిని స్వాధీనం చేసుకునే ప్రక్రియ ప్రారంభమవుతుంది.
* ఈ క్రమంలో ప్రభుత్వం స్వాధీనం చేసుకునే భూముల యజమానులు/ హక్కుదారులు కలెక్టర్‌కు తమ హక్కుల సాక్ష్యాధారాలు అందజేయాలి.

* భూ విస్తీర్ణం, కొలతలకు సంబంధించి ఉన్న అభ్యంతరాలను కలెక్టరుకు తెలపవచ్చు.
* సదరు అభ్యంతరాలు, యాజమాన్య హక్కులు, భూమి మార్కెట్ విలువపై కలెక్టర్ విచారణ జరుపుతారు.

 

అవార్డు జారీ, పరిహారం చెల్లింపు

* విచారణ అనంతరం భూమిని స్వాధీనం చేసుకునే అంశాలతో పాటు ఒక అవార్డును ప్రభుత్వం లేదా కలెక్టర్ జారీ చేయాల్సి ఉంటుంది.

* స్వాధీనం చేసుకునే భూమికి చెల్లించే పరిహారం గురించి ఆ అవార్డ్ ప్రకటనలో స్పష్టంగా తెలియజేయాలి.
* నష్టపరిహార మొత్తం ఎవరికి చెల్లించాలో ఆ అవార్డులో పేర్కొనాలి. దానికి అనుకూలంగా పరిహారం చెల్లిస్తారు.
* సదరు నష్టపరిహారం తీసుకోవడానికి భూ యజమాని నిరాకరించినా, ఆ భూ యజమాని అందుబాటులో లేకపోయినా లేదా నష్టపరిహార మొత్తం చాలామందికి పంపిణీ చేయాల్సి ఉన్నా, పంపిణీలో ఇబ్బందులు ఎదురైనా ఆ మొత్తాన్ని కోర్టులో డిపాజిట్ చేయాల్సి ఉంటుంది.

 

నష్టపరిహారం - న్యాయస్థానం అధికారాలు 

భూసేకరణ ప్రజా అవసరాల కోసమేనా, కాదా అనే అంశం మినహా భూ సేకరణను ప్రశ్నించే, నిలువరించే హక్కు, అధికారం ఎవరికి లేదు.

* ఒక వ్యక్తి తనకు ఉన్న కొద్ది భూమిని పూర్తిగా కోల్పోయినా అతను భూసేకరణ అడ్డుకోలేడు. అతడు చేయవలసిందల్లా సాధ్యమైనంత ఎక్కువ నష్టపరిహారం పొందడం మాత్రమే.

* ప్రభుత్వం ప్రకటించిన పరిహారం చాలా తక్కువ మొత్తమని, అది మార్కెట్ విలువకు సరిపోలేదని, అందువల్ల పరిహారం పెంచాల్సిందిగా న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చు.
* ఆ సందర్భంలో న్యాయస్థానం ఆ అంశాల ఆధారంగా పరిహారం పెంచాల్సిందిగా ప్రభుత్వానికి ఉత్తర్వులు జారీ చేయవచ్చు.
చట్టం అమలు - ప్రభావం: భూసేకరణ చట్టం 1894 ప్రభుత్వానికి తిరుగులేని అధికారాలను కల్పించింది.
* ఈ చట్టం అమలు వల్ల ఇప్పటిదాకా ప్రభుత్వ భూసేకరణ నిరాటంకంగా కొనసాగుతోంది.
* ప్రభుత్వాలకు ఈ అధికారాలు లేకుంటే భారీ ప్రాజెక్టులు, విస్తరణ, అభివృద్ధి నిర్మాణాలు, ప్రభుత్వ పథకాల అమలు సాధ్యం కాకపోయి ఉండేది.
విమర్శ: ప్రత్యేక ఆర్థిక మండళ్ల (SEZs) పేరుతో వేలాది ఎకరాల వ్యవసాయ సాగు భూమిని అనేక ప్రయివేట్ కంపెనీలకు, తమ సంబంధీకులకు ప్రభుత్వాలు అప్పగిస్తున్నాయనేది ప్రధాన విమర్శ.
* వ్యవసాయ భూములను సేకరించడం వల్ల ఆహార భద్రతకు సమస్యగా మారుతోంది.
* భూసేకరణ వల్ల వేలాది ప్రజలు నిర్వాసితులు అవుతున్నారు. అటవీ భూమి సేకరణ వల్ల విలువైన అటవీ సంపద, పశుపక్ష్యాదులు, వనమూలికలు, అరుదైన పశుసంపద కోల్పోతున్నాం.

ప్రభుత్వ భూసేకరణ చట్టాలు 

నూతన ప్రాజెక్టులు, సెజ్‌లు, భారీ నీటిపారుదల ప్రాజెక్టులు, ప్రత్యేక ఆర్థిక మండళ్లు, భారీ పరిశ్రమలు, తీరప్రాంత కారిడార్లు నిర్మాణానికి, మౌలిక సదుపాయాలు కల్పనకు వేలాది ఎకరాల భూమి అవసరం. అలాంటి సందర్భంలో ప్రభుత్వం చట్టం ద్వారా భూమిని స్వాధీనం చేసుకుంటుంది. భారతదేశంలో బ్రిటిష్ కాలంనాటి 1894 చట్టంతోపాటు సవరించిన మరికొన్ని అంశాలు ఉన్నాయి.

1) భూసేకరణ చట్టం 1894 (బ్రిటిష్ కాలం)
2) భూసేకరణ పునఃస్థాపన, పునరావాస చట్టం - 2013 (UPA)
3) భూసేకరణ ఆర్డినెన్స్ - 2014 (NDA)

 

భూస్వాధీనతా/ భూసేకరణ చట్టం - 1894
ప్రజల వద్ద ఉన్న భూమిని, స్థలాలను, కొన్ని సందర్భాల్లో అవసరమైతే భవనాలను కూడా ప్రభుత్వాలు స్వాధీనం చేసుకునే విధానాన్ని భూసేకరణ అంటారు.
* భూసేకరణ అనేది ముఖ్యంగా ప్రాజెక్టుల నిర్మాణం, నీటిపారుదల, విద్యుత్ పరిశ్రమల ఏర్పాటు, విస్తరణ వంటి సందర్భాల్లో ప్రభుత్వం అవసరమైన భూములను సేకరించే విధానం.
* భూసేకరణ వల్ల వేలమంది నిరాశ్రయులవుతారు. వారికి పునరావాసం, నష్టపరిహారం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే.

* ప్రభుత్వాలు భూములు సమీకరించే పద్ధతి బ్రిటిష్ పాలనాకాలంలో ప్రారంభమైంది. దానికోసం చేసిన చట్టమే భూసేకరణ చట్టం. దీన్ని 1894లో రూపొందించారు.
 

కొన్ని అంశాలు 

* ఈ చట్టం అత్యంత పురాతనమైంది

* బ్రిటిష్ వలస పాలనలో 1894లో దీన్ని రూపొందించారు.
* కేంద్ర, రాష్ట్రాలు తమ అవసరాలకు అనుగుణంగా ఈ చట్టాన్నే అమలు చేస్తున్నాయి.
* ఈ చట్టం 'భూసేకరణ అనేది ప్రభుత్వ ఏకస్వామ్య అధికారం'గా పేర్కొంటుంది.
* ఈ చట్టాన్ని దుర్వినియోగం చేయకుండా అడ్డుకునేందుకు సరైన నిబంధనలు ఈ చట్టంలోనే ఉన్నాయి.
* ఈ చట్టంలోని నిబంధనల ప్రకారం ప్రజోపయోగాలు, ప్రజల అవసరాల కోసమే భూసేకరణ జరగాలి.

 

ప్రజోపయోగం అంటే 

భూసేకరణ చట్టం ప్రకారం భూమిని సేకరించాలంటే అది తప్పనిసరిగా ప్రజలకు ఉపయోగపడే ప్రాజెక్టులు, పరిశ్రమల ఏర్పాటు, అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిందై ఉండాలి. ప్రజా అవసరాల నిమిత్తం మాత్రమే భూసేకరణ జరగాలి.

* గ్రామాలు, పట్టణాల్లో క్రమబద్ధమైన అభివృద్ధి కోసం భూమిని స్వాధీనం చేసుకోవడం.
* గ్రామీణ భూముల విస్తీర్ణం, వాటి క్రమబద్ధమైన అభివృద్ధి కోసం
* ప్రభుత్వ సంస్థలు లేదా ప్రభుత్వ నియంత్రణలోని కార్పొరేషన్‌ల అభివృద్ధి, విస్తరణ, స్థాపనల అవసరాల కోసం భూమిని సేకరించడం.
* ప్రభుత్వం చేపట్టే వివిధ విధానాల అమలు కోసం లేదా వివిధ పథకాల అమల్లో భాగంగా ప్రభుత్వం తన నిధులతో భూములను సేకరించడం.
* ప్రకృతి వైపరీత్యాలు, ప్రభుత్వ విధానాల వల్ల నష్టపోయిన వారికి గృహ అవసరాలకు కేటాయించే భూమి కోసం స్వాధీనం చేసుకోవడం.
* పేదవారికి, భూమిలేని వారికి గృహ/ నివాస స్థలాల కేటాయింపు కోసం భూమిని స్వాధీనం చేసుకోవడం.
* ప్రభుత్వం ప్రారంభించిన ఏదైనా విద్యా, గృహ నిర్మాణ, ఆరోగ్య సంబంధ పథకం లేదా మురికివాడల నిర్మూలన పథకం కోసం భూమిని సేకరించడం.
* ఏదైనా ప్రభుత్వ కార్యాలయ భవన నిర్మాణం కోసం భూమి సేకరించడం.
* ప్రభుత్వం, ప్రభుత్వ అనుమతితో ఏదైనా స్థానిక సంస్థ ప్రారంభించిన ఏదైనా అభివృద్ధి పథకం కోసం భూమి సేకరించడం.

Posted Date : 31-01-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

పర్యావరణం - సమకాలీన అంశాలు

             ఎలక్ట్రానిక్ వ్యర్థాలకు (e-waste) సంబంధించి అసోచామ్ (ASSOCHAM) - KPMG సంయుక్తంగా ఒక అధ్యయనాన్ని నిర్వహించాయి. ఇ-వ్యర్థాలను ఉత్పత్తి చేసే ప్రపంచ దేశాలన్నింటిలో భారత్ అయిదో స్థానంలో నిలిచిందని ఈ అధ్యయనం వెల్లడించింది. మనదేశంలో ఏటా సుమారు 18.5 లక్షల టన్నుల ఎలక్ట్రానిక్ వ్యర్థాలు విడుదలవుతున్నాయి.
      ఝార్ఖండ్‌లో గంగానది సంరక్షణ, గ్రామీణ శుభ్రత కోసం కేంద్ర ప్రభుత్వం తొమ్మిది ప్రాజెక్ట్‌లను ప్రారంభించింది. ఈ రాష్ట్రంలో గంగానది ప్రవహిస్తున్న 83 కి.మీ. తీరప్రాంతానికి ఆనుకుని ఉన్న సుమారు 78 గ్రామాల్లో స్వచ్ఛత, శుభ్రత, ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఇవి సహకరిస్తాయి. ఐక్యరాజ్య సమితికి చెందిన United Nations Developmet Programme వీటికి సాంకేతిక సాయం అందించనుంది.

అత్యంత కాలుష్య వాయువు...


* నగర వాయు గుణాత్మక డేటాబేస్ (Urban Air Quality Database) - 2016 ను ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఇటీవల వెలువరించింది. ఈ నివేదిక ప్రకారం ప్రపంచంలో అత్యంత కలుషితమైన వాయువును ఇరాన్‌లోని జబోల్ నగరంలో గుర్తించారు.

* హిమాచల్‌ప్రదేశ్‌కు చెందిన మత్స్య సంవర్థక శాఖ గోల్డెన్ మసీర్ చేప (Golden Mahseer Fish ) పునరావాసం, సంరక్షణ కోసం వాటిని కృత్రిమంగా వృద్ధి చేసే కార్యక్రమాన్ని ప్రారంభించింది. విచక్షణారహితంగా వేటాడటం, ఆవాసాలు కోల్పోవడం, కాలుష్యం కారణంగా హిమాచల్‌ప్రదేశ్‌లో ఈ చేపల సంతతి క్షీణించిపోయింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. గోల్డెన్ మసీర్ చేప ఎక్కువకాలం బతికే మంచినీటి చేప. దీన్ని 'భారత నదీజలాల పులి'గా (Tiger of Indian Rivers) పిలుస్తారు. IUCN(International Union of Conversion of Natural Resources) ఈ చేపను అంతరించిపోతున్న జీవజాతుల జాబితాలో చేర్చింది.
*  అసోంలోని గువాహటి నగర జంతువు (City Animal) ను ప్రకటించిన మొట్టమొదటి నగరంగా చరిత్రలో నిలిచింది. ప్రత్యేకంగా నిర్వహించిన ఓటింగ్ ప్రక్రియ ద్వారా గంగానది డాల్ఫిన్ (Gangetic River Dolphin) ను గువాహటి నగర జంతువుగా ఎంపిక చేశారు. ఈ డాల్ఫిన్‌ను అధికారికంగా భారత జాతీయ జల జంతువుగా (National Aquatic Animal of India) ప్రకటించారు. దీన్ని స్థానికంగా సిహు (Sihu) అని పిలుస్తారు. ప్లాంటానిస్టా గేంగటికా (Plantanista Gangetica) అనే శాస్త్రీయనామం కలిగిన ఈ డాల్ఫిన్‌ను గంగా పులి (Tiger of Ganga) గా కూడా వ్యవహరిస్తారు. భారత ప్రభుత్వం ఈ డాల్ఫిన్‌ల జనాభా పునరుద్ధరణ, వ్యాప్తిని అధ్యయనం చేయడానికి 1997 లో సంరక్షణా కార్యక్రమాన్ని (Ganges River Dolphin Conservation Programme) ప్రారంభించింది.
*  ప్రపంచంలో అటవీ నిర్మూలనను (Deforestation) నిషేధించిన మొట్టమొదటి దేశంగా నార్వే చరిత్రలో నిలిచింది. నార్వే పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ సూచనల మేరకు నార్వే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. నార్వేలో ఇకపై అటవీ నిర్మూలనకు కారణమయ్యే ఎలాంటి చర్యలనూ అంగీకరించరు.

* ఆసియాలోనే ప్రప్రథమ గిప్స్ రాబందుల పునర్‌ప్రవేశన కార్యక్రమాన్ని (Gyps Vulture Reintrodution Programme) పింజోర్‌లోని జటాయు సంరక్షణ, ప్రజనన కేంద్రం (Jatayu Conservation Breeding Centre) లో హరియాణా ప్రభుత్వం ప్రారంభించింది. హిమాలయాల్లోని గ్రిఫాన్ రాబందులతో ఈ గిప్స్ రాబందులకు దగ్గరి పోలికలు ఉంటాయి.


¤  రాబందుల ఆహారమైన పశువుల కళేబరాల్లోని డైక్లోఫినాక్ అనే ఔషధం వల్ల రాబందులు మూత్రపిండ సంబంధ వ్యాధులకు గురవుతున్నాయి. (పశువుల్లో నొప్పుల నివారణకు డైక్లోఫినాక్ ఔషధం ఉపయోగిస్తుంటారు). దీంతో కేంద్ర ప్రభుత్వం 2006లో పశువులకు డైక్లోఫినాక్ వాడకాన్ని నిషేధించింది.

దినోత్సవాలు


*  అంతర్జాతీయ జీవవైవిధ్య దినోత్సవాన్ని (International Biodiversity Day) మే 22న నిర్వహిస్తారు.


*   జీవవైవిధ్య సంరక్షణ, స్థిరమైన అభివృద్ధిపై సరైన అవగాహన కల్పించడం దీని ప్రధాన లక్ష్యం.
*   'జీవవైవిధ్యం - ప్రధాన జీవన స్రవంతి: ప్రజలు వారి జీవనోపాయాల కొన సాగింపు' (Mainstreaming Biodiversity; Sustaining people and their livelihoods) అనేది 2016 ఏడాదికి జీవవైవిధ్య దినోత్సవ నినాదం.

* ప్రపంచ వలస పక్షుల దినోత్సవాన్ని (World Migrating Bird Day) 2016 మే 10న నిర్వహించారు. వలస పక్షుల నివాసాలు, సంతతిని సంరక్షించడం ఈ దినోత్సవం ముఖ్య ఉద్దేశం.


*  ' వలస పక్షుల అక్రమ సంహారం, వాణిజ్యాలను ఆపేయండి' (Stop the lilegal Killing, Taking and Trading of Migratory Birds) అనేది 2016 ఏడాది నినాదం.
* ఐక్యరాజ్య సమితి 2006 నుంచి ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తోంది.
* ప్రపంచ సముద్రాల దినోత్సవాన్ని (World Oceans Day) 2016 జూన్ 8న నిర్వహించారు. సముద్ర ఆవాసాల పరిరక్షణ, పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించడం ఈ దినోత్సవ ఉద్దేశం. సముద్రాల్లో ప్లాస్టిక్ సంబంధ వ్యర్థ పదార్థాల నిర్మూలనను ఈ ఏడాది లక్ష్యంగా నిర్ణయించారు. 2016 ఏడాదికి 'ఆరోగ్యకరమైన సముద్రాలు, ఆరోగ్యవంతమైన గ్రహం' (Healthy Oceans, Healthy Planet ) అనే ఉద్దేశంతో ఈ దినోత్సవాన్ని జరుపుకున్నారు. ఐక్యరాజ్య సమితి సాధారణ సభ 2008లో అధికారికంగా ఈ దినోత్సవాన్ని నిర్వహించడానికి ఆమోదం తెలిపింది. అయితే 1992లో బ్రెజిల్‌లోని రియో డిజనిరోలో జరిగిన ధరిత్రీ సదస్సులో కెనడా తొలిసారిగా దీన్ని ప్రతిపాదించింది.

* ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని (World Environment Day) 2016 జూన్ 5న నిర్వహించారు. 'జీవనం కోసం వన్యంలోకి' (Go Wild for Life) అనేది 2016 పర్యావరణ దినోత్సవం ముఖ్య ఉద్దేశం. పర్యావరణాన్ని, వన్య ప్రాణులను సంరక్షించడమే ప్రపంచ పర్యావరణ దినోత్సవ లక్ష్యం. పులులపై అవగాహన కల్పించడానికి రైల్వే మంత్రి సురేశ్ ప్రభు 2016 జూన్ 5న టైగర్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించారు. ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సభ 1972లో ప్రపంచ పర్యావరణ దినోత్సవానికి ఆమోదం తెలిపింది. 1973లో మొట్టమొదటి పర్యావరణ దినోత్సవాన్ని నిర్వహించారు.

 ప్రపంచ హైడ్రోగ్రఫీ దినోత్సవం..

* ప్రపంచ హైడ్రోగ్రఫీ దినోత్సవాన్ని (World Hydrography day) 2016 జూన్ 21న నిర్వహించారు. 'హైడ్రోగ్రఫీ - చక్కగా నిర్వహిస్తున్న సముద్రాలు, జల మార్గాలకు ఒక కీలక అంశం' (Hydrography - the key to well managed seas and water ways) అనేది 2016 ఏడాది నినాదం. సముద్రాలు, సరస్సులు, నదులు లాంటి జల సంబంధ అంశాల కొలతలు, వర్ణనకు సంబంధించిన ఒక అనువర్తిత శాఖగా హైడ్రోగ్రఫీని పేర్కొనవచ్చు. అంతర్గత జలాశయాలు, సముద్రాల్లో నావిగేషన్‌ను చక్కగా నిర్వహించడానికి ఈ శాస్త్ర పరిజ్ఞానం తోడ్పడుతుంది.

మరుభూమీకరణపై పోరు దినోత్సవం

* మరుభూమీకరణపై పోరు దినోత్సవాన్ని (The World Day to Combat Deforestation) ప్రపంచవ్యాప్తంగా జూన్ 17న నిర్వహించారు. ఎడారులు, కరవు భూములు ఏర్పడకుండా ప్రపంచ దేశాలు పరస్పరం సహకరించుకోవడమే దీని లక్ష్యం. 'భూ హాని పట్ల తటస్థత సాధన దిశగా సంఘటిత సహకారం' అనేది 2016 ఏడాదికి ఈ దినోత్సవ ముఖ్యఉద్దేశం. 'భూమిని కాపాడు, నేలను పునరుద్ధరించు, ప్రజలను పనిలో నియమించు' (Protect Eath, Restore Land, Engage People) అనేది 2016 నినాదంగా ప్రకటించారు. ఈ దినోత్సవాన్ని తొలిసారిగా 1995లో నిర్వహించారు.

*  అరుణాచల్‌ప్రదేశ్‌లోని తూర్పు కామెంగ్ జిల్లాలో ఉన్న పక్కే పులుల సంరక్షణ కేంద్రానికి (Pakke Tiger Reserve) భారత దేశ జీవవైవిధ్య పురస్కారం (India Biodiversity Award) 2016 లభించింది.

Posted Date : 31-01-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

పర్యావరణ పరిరక్షణ చట్టం - భారతదేశం

              పర్యావరణ సంతులనాన్ని పరిరక్షించి జీవరాశిని కాపాడటానికి పర్యావరణ యాజమాన్యానికి పటిష్ఠమైన శాసనాలు, చట్టాలు అవసరం. మనదేశంలో కాలుష్య సంబంధిత సమస్యలు పెనుసవాళ్లుగా మారాయి. వీటి నియంత్రణ, పర్యావరణాన్ని రక్షించడానికి ప్రభుత్వం కొన్ని చట్టాలను రూపొందించింది. అదేవిధంగా పర్యావరణ కాలుష్యాన్ని నివారించి ప్రకృతి సహజసిద్ధ లక్షణాలను కాపాడటం; అడవులు, వన్యప్రాణుల శ్రేయస్సు దృష్ట్యా పర్యావరణ పరిరక్షణను ప్రభుత్వం బాధ్యతగా గుర్తించింది.


పర్యావరణ పరిరక్షణ - లక్ష్యాలు
ఎ) పర్యావరణ సమతౌల్యాన్ని కాపాడటం.
బి) కాలుష్య కారకాల వల్ల కలిగే హానికర ప్రభావాల నుంచి జీవరాశులన్నింటినీ కాపాడటం.
సి) సహజ వనరులను పరిరక్షించడం.
డి) హక్కులు, స్వేచ్ఛ, సమానత్వానికి భంగం వాటిల్లకుండా ప్రజలందరూ సగౌరవంగా, హుందాగా జీవించే అవకాశాన్ని కల్పించడం.

పర్యావరణ రక్షణ - రాజ్యాంగ ప్రస్తావన
           పర్యావరణాన్ని పరిరక్షించే విషయంలో ప్రభుత్వం, ప్రజలు బాధ్యత వహించాలని రాజ్యాంగం నిర్దేశించింది. మొదట రాజ్యాంగంలో ఈ ప్రస్తావన లేదు. కానీ 1972 జూన్‌లో ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో స్టాక్‌హోం (స్వీడన్‌)లో నిర్వహించిన పర్యావరణ సదస్సులో దీన్ని సవరించారు. 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 48(A), 51(A) (g)  నిబంధనల కింద పర్యావరణ పరిరక్షణను పొందుపరిచారు. ఇలా జీవవైవిధ్యాన్ని కాపాడటానికి ప్రభుత్వానికి సర్వ హక్కులను ఇచ్చిన మొదటి దేశం భారత్‌.
ఉదా:
* రాజ్యాంగంలోని 21వ నిబంధన ప్రకారం జీవించే హక్కులో భాగంగా ఆరోగ్యకరమైన పర్యావరణ హక్కును సుప్రీంకోర్టు ఒక సాధనంగా పేర్కొంది.
* రాజ్యాంగంలో 47వ నిబంధన కింద ప్రజల జీవన ప్రమాణాలు, ఆరోగ్యాన్ని మెరుగుపరచడం; పౌష్టికాహార స్థాయిని పెంచడం లాంటి అంశాలను చేర్చింది.
* రాజ్యాంగంలో 48(A) నిబంధనలో అడవులు, వన్యప్రాణులు, సహజ పర్యావరణ పరిరక్షణ ప్రభుత్వ బాధ్యత అని పేర్కొంది.
* రాజ్యాంగంలో 51(A) నిబంధన కింద ప్రాథమిక విధుల్లో భాగంగా చెరువులు, నదులు, సరస్సులు, వన్యప్రాణులు, వన సంరక్షణ, జీవవైవిధ్యాన్ని కాపాడటం పౌరుల విధిగా పేర్కొంది.

పర్యావరణ రక్షణకు ప్రభుత్వం అమలు చేసిన చట్టాలు
* 1857 పారిశ్రామిక వ్యర్థాల చట్టం
* 1879 ఏనుగు సంరక్షణ చట్టం
* 1897 మత్స్యసంపద పరిరక్షణ చట్టం
* 1905 బెంగాల్‌ పొగ ఇబ్బందుల నివారణ చట్టం
* 1927 భారతీయ అడవుల చట్టం
* 1938 మోటారు వాహనాల చట్టం
* 1946 బిహార్‌ నిరుపయోగ భూముల చట్టం

 

స్వాతంత్య్రం తర్వాత ప్రభుత్వం అమలు చేసిన చట్టాలు
 

1) కర్మాగారాల చట్టం - 1948:
1887 చట్టాన్ని సవరించి కర్మాగారాల్లో పనిచేసే కార్మికుల ఆరోగ్యం, భద్రత, సంక్షేమం కోసం 1948లో కర్మాగారాల చట్టాన్ని రూపొందించింది. పరిశ్రమల చుట్టుపక్కల నివసించే ప్రజల ఆరోగ్యం, భద్రత, పర్యావరణం గురించి ఈ చట్టంలో నిబంధనలు రూపొందించారు.

2) క్రిమిసంహారక మందుల చట్టం - 1968:

మందుల తయారీ, దిగుమతి, విక్రయం, రవాణా, పంపిణీ, వినియోగం లాంటి కార్యకలాపాలను క్రిమిసంహారక మందుల చట్టం - 1968 ద్వారా నియంత్రించవచ్చు.
 

3) వన్యప్రాణి సంరక్షణ చట్టం - 1972:
1972లో స్టాక్‌హోం (స్వీడన్‌)లో నిర్వహించిన పర్యావరణ సదస్సు తర్వాత దేశంలో మొదటి వన్యప్రాణులు, పక్షులు అంతరించిపోకుండా రక్షించే లక్ష్యంతో జాతీయ వన్యప్రాణి సంరక్షణ చట్టం - 1972ను రూపొందించారు. వన్య మృగాలను వేటాడటాన్ని ఈ చట్టం పూర్తిగా నిషేధిస్తుంది. దీన్ని 2002లో సవరించారు. ఈ చట్టం కింద ప్రధానమంత్రి అధ్యక్షతన ఒక జాతీయ మండలిని ఏర్పాటు చేయవచ్చు. తర్వాత ఈ చట్టాన్ని 2006లో మరోసారి పార్లమెంటు ద్వారా సవరించి పులుల రిజర్వు హాట్‌స్పాట్‌లలో ‘టైగర్‌ టాస్క్‌ ఫోర్స్‌’లను ఏర్పాటుచేశారు. దీని ప్రకారం జంతువులు ప్రధానంగా పులుల చర్మం, గోర్లు లాంటి వాటితో వ్యాపారం చేయడం చట్ట వ్యతిరేకం.

 

4) నీటి కాలుష్య నివారణ, నియంత్రణ చట్టం - 1974:
నీటిలో నివసించే, నీటిని వినియోగించే జీవరాశులకు హాని కలగకుండా; పరిశ్రమల ద్వారా నదులు, చెరువుల్లోకి పంపే విషపూరిత రసాయన వ్యర్థాల వల్ల నీటి కాలుష్యం పెరగడాన్ని నిషేధిస్తూ 1974లో కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాన్ని రూపొందించింది. ఇది కాలుష్య నివారణ మొదటి జాతీయ చట్టం. దీని ప్రకారం నీటి నాణ్యతను కాపాడుతూ నదులు, సరస్సులు, చెరువులు, కాలువల్లోని నీటి కాలుష్యాన్ని నియంత్రించాలి. ఈ చట్టం ప్రకారం కేంద్ర - రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండళ్లను ఏర్పాటు చేశారు.

* జాతీయ కాలుష్య నియంత్రణ మండలి న్యూదిల్లీ కేంద్రంగా పనిచేస్తుంది. దీని కింద 7 ప్రాంతీయ కార్యాలయాలు ఉన్నాయి.
 

5) వాయు కాలుష్య నివారణ, నియంత్రణ చట్టం - 1981:
పారిశ్రామిక విసర్జితాలు లేదా వాహనాల నుంచి వెలువడే వివిధ ఉద్గారాలను నియంత్రించడానికి 1981లో కేంద్ర ప్రభుత్వం వాయు కాలుష్య నియంత్రణ చట్టాన్ని రూపొందించింది. ఈ నిబంధనలను అతిక్రమించిన వ్యక్తులు, సంస్థలు శిక్షార్హులు. ఏడాదిన్నర నుంచి గరిష్ఠంగా 6 సంవత్సరాలు జైలు శిక్ష, పదివేల జరిమానా విధిస్తారు.

 

6) పర్యావరణ సంరక్షణ చట్టం - 1986:
1974 నీటి కాలుష్య నియంత్రణ చట్టం, 1981 వాయు కాలుష్య నియంత్రణ చట్టం రెండూ సమర్థంగా పర్యావరణ కాలుష్య నివారణకు ఉపయోగపడలేదని కేంద్ర ప్రభుత్వం గ్రహించింది. అన్ని రకాల కాలుష్యాల నియంత్రణ, పర్యావరణ నాణ్యత కాపాడటం కోసం కేంద్రం పార్లమెంటు ద్వారా 1986లో ఒక సమగ్ర, సార్వత్రిక చట్టాన్ని ప్రవేశపెట్టింది. దీన్ని పర్యావరణ పరిరక్షణ చట్టం అంటారు.

 

7) జీవ వైవిధ్య చట్టం - 2002:
వివిధ జాతులకు చెందిన జీవులు ఉండే సమూహ ప్రాంతాలు లేదా భౌమ, సముద్ర, ఇతర జలావరణ వ్యవస్థల్లోని విభిన్న జీవరాశులు, వాటి మధ్య ఉండే వైవిధ్యాల స్వరూపాన్నే జీవవైవిధ్యం అంటారు. మన దేశంలో దీన్ని మొదటిసారిగా 2002 పార్లమెంటు చట్టం ద్వారా ఆమోదించగా 2003, అక్టోబరు 1 నుంచి అమల్లోకి వచ్చింది. దీని ప్రధాన కార్యాలయం చెన్నైలో ఉంది. ప్రస్తుతం ప్రపంచంలోని జీవవైవిధ్య దేశాల్లో 17వ పెద్ద దేశంగా భారత్‌ గుర్తింపు పొందింది.

8) అటవీ హక్కుల గుర్తింపు చట్టం - 2006:
1988లో కేంద్ర ప్రభుత్వం అటవీ అభివృద్ధిలో గిరిజనులకు భాగస్వామ్యం కల్పించాలని తీసుకున్న నిర్ణయానికి పొడిగింపుగా 2006, డిసెంబరు 18న పార్లమెంట్‌ ద్వారా అటవీ హక్కుల అమలు చట్టం ఆమోదం పొందింది. ఇది 2007, డిసెంబరు 31 నుంచి అమల్లోకి వచ్చింది. ఈ చట్టం ప్రకారం అనాధిగా నివాసముంటున్న వివిధ జాతుల సంప్రదాయ హక్కులను గుర్తించి 2005, డిసెంబరు 13కు ముందు, ఆ తర్వాత కూడా అటవీ భూములు సేద్యం చేస్తున్నవారికి వాటి మీద హక్కు లభిస్తుంది.

 

9) జాతీయ హరిత ట్రైబ్యునల్‌ చట్టం - 2010:
రాజ్యాంగంలోని 21వ నిబంధనకు స్ఫూర్తిగా పర్యావరణ సమస్యలను పరిష్కరించేందుకు భారత పార్లమెంటు 2010, మే 5న దీన్ని ఆమోదించింది. ఈ చట్టం న్యూదిల్లీ కేంద్రంగా 2010, అక్టోబరు 28న అమల్లోకి వచ్చింది. 2011, జులై 4 నుంచి విధులను నిర్వర్తిస్తుంది. ఈ ట్రైబ్యునల్‌ జీవ వైవిధ్యం, వన్యప్రాణులు; అటవీ, పర్యావరణ సమస్యలను బెంచ్‌ ద్వారా పరిష్కరిస్తుంది. దీని కింద నాలుగు ట్రైబ్యునల్‌ బెంచ్‌లు ఉన్నాయి. అవి:
1) సెంట్రల్‌ బెంచ్‌ - భోపాల్‌
2) పశ్చిమ బెంచ్‌ - పుణె
3) తూర్పు బెంచ్‌ - కోల్‌కతా
4) దక్షిణ బెంచ్‌ - చెన్నై

10) జాతీయ కార్యచరణ ప్రణాళిక - 2016:
వాతావరణ మార్పులపై 2015 డిసెంబరులో COP-21 సదస్సును నిర్వహించారు. దీనికి అనుగుణంగా భారత ప్రభుత్వం 2016 డిసెంబరులో జాతీయ కార్యచరణ ప్రణాళికను రూపొందించింది. దీనిలో భాగంగా 8 జాతీయ మిషన్‌లను ప్రారంభించారు.

1) సోలార్‌ మిషన్‌
2) శక్తి సామర్థ్య మిషన్‌
3) సుస్థిరాభివృద్ధి ఆవాస మిషన్‌
4) వాటర్‌ మిషన్‌
5) హిమాలయ ఆవరణ మిషన్‌
6) గ్రీన్‌ ఇండియా మిషన్‌
7) సుస్థిరాభివృద్ధి వ్యవసాయ మిషన్‌
8) వాతావరణ మార్పు వ్యూహాత్మక మిషన్‌
 

మరికొన్ని చట్టాలు....
1) హానికర వ్యర్థాల నియంత్రణ చట్టం - 1989
2) బయో మెడికల్‌ వ్యర్థాల నివారణ నిబంధనల చట్టం - 1998
3) ధ్వని కాలుష్య నియంత్రణ చట్టం - 2000
4) ప్లాస్టిక్‌ రీసైకిల్‌ ఉత్పత్తి వాడక చట్టం - 2003

Posted Date : 01-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

సుస్థిరాభివృద్ధి - వనరులు

మాదిరి ప్ర‌శ్న‌లు

1. ఐక్యరాజ్య సమితి ‘సుస్థిరాభివృద్ధి కోసం విద్యా దశాబ్దం’ను ఎప్పుడు ప్రకటించింది? (డిప్యూటీ సర్వేయర్, 2017)
జ: 2005 - 2015

 

2. ‘ఎజెండా - 21’ దేనికి సంబంధించింది? (డీఎల్, 2017)
జ: సుస్థిరాభివృద్ధి

 

3. కిందివాటిలో సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో భాగం కానిది? (గ్రూప్‌ - 3, 2017)
1) పేదరిక నిర్మూలన                2) ప్రపంచశాంతి, న్యాయాన్ని కాపాడటం 
3) అందరికీ నాణ్యమైన విద్య      4) క్రీడా నైపుణ్యాలను పెంచడం
జ: 4 (క్రీడా నైపుణ్యాలను పెంచడం)

 

4. 2015 న్యూయార్క్‌ సాధారణ సభలో ఐక్యరాజ్య సమితి మొత్తం ఎన్ని సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను ప్రకటించింది? (ఏఈ, 2016)
జ: 17

 

5. యూఎన్‌వో సాధారణ సభ 2015 సెప్టెంబరులో నిర్వహించిన 70వ సదస్సులో ఏ తీర్మానాన్ని ప్రకటించింది? (గురుకుల పీజీటీ, 2018)
జ: సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు

 

6. సుస్థిరాభివృద్ధిపై మొదటి సదస్సును ఎక్కడ నిర్వహించారు?
జ: జోహన్నెస్‌ బర్గ్‌

Posted Date : 01-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

సుస్థిరాభివృద్ధి - వనరులు

          20వ శతాబ్దం మధ్య కాలంలో ప్రపంచ సమాజం ప్రజల ఆకాంక్షలు, కోరికలను ప్రతిబింబించే విధంగా నడవాలనుకుంది. దీనికోసం ముఖ్యంగా శాంతి, స్వాతంత్య్రం, అభివృద్ధి, పర్యావరణం అనే నాలుగు అంశాలను ఎంచుకుంది. అయితే 1950వ దశకంలో అమెరికా వ్యవసాయసాగులో అవలంబించిన విధానాలు ఈ గమ్యానికి ఆటంకాన్ని కలిగించాయి. అగ్రరాజ్యం విరివిగా డీడీటీ (డైక్లోరో డైఫినైల్‌ ట్రైక్లోరో ఈథేన్‌) క్రిమిసంహారక మందును వినియోగించడంతో అధిక సంఖ్యలో జీవులు మరణించి పర్యావరణానికి విఘాతం కలిగింది. ఈ వినాశనాన్ని 1962లో రెచెల్‌ కార్సన్‌ (అమెరికా) ‘నిశ్శబ్ద వసంతం (సైలెంట్‌ స్ప్రింగ్‌)’ అనే పుస్తకంలో ప్రస్తావించాడు. ఇందులో ఆర్థికాభివృద్ధికి, పర్యావరణానికి మధ్య గల వైరుధ్యాన్ని తెలియజేశాడు. దీంతో పర్యావరణ పరిరక్షణ ఉద్యమాలు ఊపందుకున్నాయి. పర్యావరణాన్ని నిలకడ గల అభివృద్ధి ద్వారా సాధించాలనే ఉద్దేశంతో సుస్థిరాభివృద్ధి వెలుగులోకి వచ్చింది.

సుస్థిరాభివృద్ధికి మూలం
          సుస్థిరత్వం అనే పదం మొదట 19వ శతాబ్దపు మధ్య కాలంలో ఐరోపా అటవీ అధికారులు ప్రవేశపెట్టిన ఒక ప్రక్రియ. ఆనాటి యూరోపియన్‌ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి అడవులే ప్రధాన చోదక శక్తులుగా ఉండేవి. అక్కడ అటవీ సంపద తరిగిపోయినా తిరిగి ఆ ప్రాంతంలో మొక్కలను నాటి అడవులను సంరక్షించేవారు. భావితరాలకు అడవుల క్షీణత ఉండకూడదనే సంకల్పమే సుస్థిరత్వ అభివృద్ధికి దారితీసింది.
 

సుస్థిరాభివృద్ధి అంటే? 
          పర్యావరణ విధ్వంసం లేకుండా జరిగే అభివృద్ధిని సుస్థిరాభివృద్ధి అంటారు. ఈ అభివృద్ధి ప్రక్రియలో పర్యావరణాన్ని విలీనం చేస్తారు. అంటే ప్రజల ప్రస్తుత అవసరాలను తీరుస్తూ, భావితరాల అవసరాలను తీర్చడంలో రాజీలేని మార్గం ద్వారా అభివృద్ధి కొనసాగించడాన్నే సుస్థిరాభివృద్ధి అంటారు. దీన్నే నిలకడ గల లేదా కొనసాగించగలిగే అభివృద్ధి అని పిలుస్తారు.
 

సుస్థిరాభివృద్ధి భావన
* 1972లో జరిగిన స్టాక్‌హోం ప్రపంచ మానవ పర్యావరణ సదస్సులో సుస్థిరత్వం అనే పదాన్ని ఉపయోగించారు. 1980లో ‘ప్రకృతి, సహజ వనరుల రక్షణ అంతర్జాతీయ సంఘం’ (IUCNNR - International Union for the Conservation of Nature and Natural Resources) మొదట సుస్థిరాభివృద్ధి అనే భావనను తెలియజేసింది.
* 1987లో గ్రొహర్లెమ్‌ బ్రుంట్‌లాండ్‌ అధ్యక్షతన జరిగిన ప్రపంచ పర్యావరణ అభివృద్ధి సంఘం (WCED - The World Commisson on Environment and Development) లో ‘మన ఉమ్మడి ప్రణాళిక’ నివేదికలో సుస్థిరత్వం అనే పదానికి అర్థాన్ని తెలియజేశారు.

* సుస్థిరత్వం మూడు అంశాలపై ఆధారపడి ఉంటుంది.
అవి: 1) అవసరాలు - వనరుల పంపిణీలో సంబంధాన్ని కలిగి ఉండాలి
       2) అభివృద్ధి - సామాజిక, ఆర్థిక విషయాల్లో మెరుగుదలను సూచించాలి.
       3) భవిష్యత్తు - రాబోయే తరాలకు స్థిరత్వాన్ని ఇవ్వాలి. 
* 1992 జూన్‌లో రియో - డి - జెనిరో (బ్రెజిల్‌)లో జరిగిన పృథ్వీ సదస్సులో ఐక్యరాజ్య సమితి ‘ఎజెండా - 21’ అనే ప్రపంచ ప్రణాళిక ద్వారా సుస్థిరాభివృద్ధిని కొనసాగించడానికి దోహదపడే విధంగా ప్రణాళికలను రూపొందించింది.
* 2002లో దక్షిణాఫ్రికా జోహన్నెస్‌ బర్గ్‌ సదస్సులో మొదటి సుస్థిరాభివృద్ధి సమావేశాన్ని నిర్వహించి సుస్థిరత్వం అనే భావనను ప్రపంచ వ్యాప్తంగా తెలియజేసింది.
 

సుస్థిరాభివృద్ధి భాగాలు

* కొనసాగించగలిగే అభివృద్ధిలో ముఖ్యంగా మూడు భాగాలు ఉంటాయి. ఇవి ఒకదాంతో ఒకటి సంబంధాన్ని కలిగిన స్వతంత్రమైన అంశాలు. ఇవి ఆర్థిక, సామాజిక, పర్యావరణ అంశాల మధ్య సమతూకాన్ని సాధించడం ద్వారా సుస్థిరాభివృద్ధి సాధ్యమవుతుంది.

సుస్థిరాభివృద్ధి ప్రాధాన్యత 
          ప్రపంచ స్థాయిలో సుస్థిరాభివృద్ధి ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకొని ఐక్యరాజ్య సమితి పర్యావరణ విద్యకు ఎక్కువ ప్రాధాన్యాన్ని ఇచ్చింది. 2005 - 2015 కాలాన్ని సుస్థిరాభివృద్ధి కోసం విద్యా దశాబ్దంగా ప్రకటించింది.

సుస్థిరత్వం - సహస్రాభివృద్ధి లక్ష్యాలు 
          2000 సెప్టెంబరు 20 - 22 వరకు జరిగిన ఐక్యరాజ్య సమితి న్యూయార్క్‌ సాధారణ సభలో మిలీనియం డిక్లరేషన్‌ను ప్రకటించింది. ఇందులో ఎనిమిది లక్ష్యాలు ఉన్నాయి. వీటిని 2015 సెప్టెంబరు 25 నాటికి సాధించాలని నిర్ణయించింది.


1) ఆకలి, పేదరికాన్ని నిర్మూలించాలి
2) ప్రాథమిక విద్యను అందించాలి
3) శిశు మరణాల సంఖ్యను తగ్గించాలి
4) ప్రసూతి ఆరోగ్యాన్ని పెంచాలి
5) వ్యాధులను నివారించాలి
6) పర్యావరణంతో కూడిన సుస్థిరాభివృద్ధి
7) లింగ సమానత్వం, మహిళా సాధికారిత
8) అభివృద్ధి లక్ష్యాల్లో ప్రతిదేశం భాగస్వామ్యం కావాలి

ఐక్యరాజ్యసమితి - సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు 
          2015 సెప్టెంబరు 25 నుంచి 27 వరకు జరిగిన న్యూయార్క్‌ సర్వ ప్రతినిధుల సభలో ఐక్యరాజ్య సమితి 2015 - 2030 కాలానికిగాను సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను తీర్మానించి ప్రకటించింది. వీటిని ప్రపంచ దేశాలు 2030 వరకు సాధించాలి. వీటిలో మొత్తం 17 లక్ష్యాలు, 169 ఉప లక్ష్యాలు ఉన్నాయి.
 

లక్ష్యాలు
1) పేదరికాన్ని నిర్మూలించడం.
2) ఆకలిని పారద్రోలి, ఆహార భద్రతను సాధించడం.
3) మెరుగైన, ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అందించడం.
4) సమ్మిళిత, సమానత్వంతో కూడిన నాణ్యమైన విద్యను అందించడం.
5) లింగపరమైన సమానత్వం, స్త్రీల సాధికారతను సాధించడం.
6) తాగునీరు, పరిశుభ్రతను అందుబాటులోకి తీసుకురావడం.
7) శిలాజేతర ఇంధన శక్తి సామర్థ్యాలను పెంపొందించడం.
8) అందరికీ పూర్తిస్థాయి ఉత్పాదక, ఉద్యోగితను కల్పించడం.
9) పారిశ్రామికీకరణ, నవకల్పనను ప్రోత్సహించడం.
10) ప్రపంచ దేశాల మధ్య అసమానతలను తగ్గించడం.
11) పట్టణాలు, మానవ ఆవాసాలు సురక్షితంగా ఉండేలా చేయడం.

12) ఉత్పత్తి నమూనాలు, వినియోగం అందుబాటులోకి తేవడం.
13) వాతావరణ మార్పులను అరికట్టడానికి సత్వర చర్యలు చేపట్టడం.
14) సముద్ర వనరులను పరిరక్షించడం.
15) జీవావరణాన్ని పరిరక్షిస్తూ అడవుల రక్షణ, ఎడారికీకరణ, నేల క్షీణతను అరికట్టడం.
16) అందరికీ న్యాయం, శాంతి అందుబాటులోకి తేవడం.
17) అభివృద్ధి సాధనలో ప్రపంచ దేశాలను భాగస్వామ్యం చేయడం.

Posted Date : 01-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

జలకాలుష్యం

 హానికర జలాలు.. అనర్థాలకు మూలాలు!

 



 

జలుబు చేయడం, జ్వరం రావడం, శ్వాసకు ఇబ్బంది కలగడం, నాడీవ్యవస్థ సక్రమంగా పనిచేయకపోవడం, అతిసారం, జలాశయాల్లో వ్యర్థాల తెట్టు ఏర్పడటం, సముద్రపు అలలు ఎర్రగా మారడం, మొక్కలు పెరగకపోవడం, పంటల దిగుబడులు తగ్గిపోవడం తదితరాలన్నింటికీ కారణం కలుషిత జలాలు. మనిషి ఆరోగ్య సమస్యలకు, మరెన్నో జీవరాశుల ప్రాణాలకు నీరు ప్రమాదకరంగా పరిణమించడానికి మూలం కాలుష్యం.  ఈ నేపథ్యంలో జలకాలుష్యం రకాలు, దాని వల్ల కలిగే వ్యాధులు, నివారణకు ప్రభుత్వాలు చేపడుతున్న చర్యలపై పోటీ పరీక్షార్థులకు తగిన అవగాహన ఉండాలి. 

భూమిని ఆవరించి ఉన్న జలావరణంలోని సముద్రాలు, మహాసముద్రాల్లో 97.25% ఉప్పునీరు, మిగిలిన 2.75% మంచినీరు ఉంది. ఆ మంచినీటిలోనూ 2% హిమం, హిమానీ నదాల్లోనే ఉంది. వాస్తవానికి జలావరణంలో సుమారు 1% మాత్రమే మనిషి అవసరాలకు భూగర్భం, భూఉపరితలం నుంచి మôచినీరుగా లభిస్తోంది. ఇదే సమస్త జీవరాశుల మనుగడకు ఆధారం. కానీ మనిషి అదుపు లేని అభివృద్ధి కార్యకలాపాల వల్ల అందుబాటులో ఉన్న ఆ కాస్త నీరు కూడా కలుషితమైపోతోంది.  

ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇచ్చిన నిర్వచనం ప్రకారం ‘ఏవైనా అవాంఛనీయ పదార్థాలు నీటిలో కలిసి భౌతిక, రసాయనిక, జీవసంబంధ మార్పులకు కారణమై, ఆ నీటిని తాగడానికి, మొక్కలు ఆహ్లాదకరంగా పెరగడానికి వీలు లేకుండా చేయడాన్ని జలకాలుష్యం అంటారు’. భారతీయ ప్రమాణాల సంస్థ (ఐఎస్‌ఐ) ప్రకారం నాణ్యమైన తాగునీటికి రంగు, రుచి, వాసన అనే లక్షణాలు ఉండవు. నీటి గాఢత 6.0  9.0 pH మధ్యలో ఉంటుంది. నీటిలో కరిగి ఉన్న ఆక్సిజన్‌ 3 ppm (పార్ట్స్‌ పర్‌ మిలియన్‌) ఉండాలి.

 పరిశ్రమల నుంచి వెలువడే అనేక కర్బన, అకర్బన పదార్థాలు; విషతుల్య రసాయనాలు జలాలను కలుషితం చేస్తున్నాయి. గృహ సంబంధ వ్యర్థాలు, ఎరువులు, క్రిమిసంహారక మందుల వినియోగం వల్ల వచ్చిన వ్యవసాయ సంబంధ వ్యర్థాలు, అణు రియాక్టర్ల నుంచి వెలువడే రేడియోధార్మిక పదార్థాలు, సముద్రాలపై పేరుకుపోయిన చమురు తెట్టులాంటి అనేక వ్యర్థాలు నిత్యం స్వచ్ఛ జలాలు కాలుష్యం బారిన పడేందుకు కారణమవుతున్నాయి.

వివిధ అంచనాలు: జలకాలుష్యాన్ని రకరకాలుగా అంచనా వేస్తారు.

1) విలీన ఆక్సిజన్‌ (DO - డిజాల్వ్‌డ్‌ ఆక్సిజన్‌): నీటిలో కరిగిన ఆక్సిజన్‌ను విలీన ఆక్సిజన్‌ అంటారు. ఇది నీటి నాణ్యతను నిర్ధారించేందుకు మంచి కొలమానం. జలాల్లో ఆక్సిజన్‌ పరిమాణం 5ppm కంటే ఎక్కువగా ఉన్నప్పుడే ఆ నీరు తాగడానికి, వ్యవసాయానికి, జలచరాల నివాసానికి ఉపయోగపడుతుంది. విలీన ఆక్సిజన్‌ 5ppm కంటే తగ్గితే ఆ జలాలు కాలుష్యం బారిన పడినట్లు పేర్కొంటారు.

2) జీవ ఆక్సిజన్‌ గిరాకీ (BOD - బయోలాజికల్‌ ఆక్సిజన్‌ డిమాండ్‌): నిర్ణీత ఘనపరిమాణం ఉన్న నీటిలో కర్బన వ్యర్థ పదార్థాలను సూక్ష్మజీవులు జీవ, రసాయన ఆక్సీకరణ చర్య జరపడంలో వినియోగించుకునే ఆక్సిజన్‌ పరిమాణాన్ని జీవ ఆక్సిజన్‌ గిరాకీ అంటారు. నీటిలో ఆక్సిజన్‌ పరిమాణం సూక్ష్మజీవులు 5 లేదా 7 రోజులకు వినియోగించుకోగలిగిన అవధి ఆధారంగా జీవ ఆక్సిజన్‌ గిరాకీని కొలుస్తారు. 

3) రసాయన ఆక్సిజన్‌ గిరాకీ (COD- కెమికల్‌ ఆక్సిజన్‌ డిమాండ్‌): నిర్ణీత ఘనపరిమాణం ఉన్న నీటిలో కర్బన పదార్థాలను ఆక్సీకరించడానికి, బలమైన రసాయన కారకాలకు అవసరమైన ఆక్సిజన్‌కు సమానంగా పొటాషియం డై క్రోమేట్‌ ద్రావణం నుంచి పొందగలిగే ఆక్సిజన్‌ను రసాయన ఆక్సిజన్‌ గిరాకీ అంటారు. గంటల వ్యవధిలో ఎంత ఆక్సిజన్‌ అవసరం ఉంటుందనే అంశం ఆధారంగా రసాయన ఆక్సిజన్‌ డిమాండ్‌ను లెక్కిస్తారు.

4) యూట్రోఫికేషన్‌: జలాశయాల్లో పోషకాల పరిమాణం పెరిగినప్పుడు ఆకుపచ్చని శైవలాలు, అకశేరుకాలు గుంపుగా నీటిపై చేరి తెట్టు మాదిరిగా తేలియాడుతుంటాయి. దాంతో నీరు చిక్కగా, ఆకుపచ్చగా మారి చెడు వాసనను వెదజల్లుతుంది. ఈ స్థితిని యూట్రోఫికేషన్‌ అంటారు. దీన్నే శైవల మంజరులుగా వ్యవహరిస్తారు. ఈ చర్య వల్ల నీటిలోని ఆక్సిజన్‌ తగ్గి చేపలు, జలచరాలు చనిపోతాయి. పంట పొలాలు, రొయ్యలు, చేపల చెరువుల నుంచి వెలువడే ఫాస్ఫేట్స్, నైట్రేట్స్‌ లాంటి పోషకాల వల్ల; నివాస, పారిశ్రామిక ప్రాంతాల నుంచి విడుదలయ్యే మురుగు నీటి వల్ల యూట్రోఫికేషన్‌ కాలుష్యం ఏర్పడుతుంది. ఫలితంగా నీటి ద్వారా సంక్రమించే పోలియో, అతిసారం, టైఫాయిడ్, కామెర్ల లాంటి వ్యాధులు వస్తాయి. టెర్రర్‌ ఆఫ్‌ బెంగాల్‌గా పిలిచే నీటి ‘హైయాసింత్‌’ ప్రపంచంలోనే అత్యంత సమస్యాత్మకమైన నీటి కలుపు మొక్క. పోషకాలు ఎక్కువగా ఉన్న యూట్రోఫిక్‌ నీటి ఆవాసాల్లో ఇవి ఎక్కువగా పెరుగుతాయి. తద్వారా నీటి కుంటల జీవావరణ వ్యవస్థ దెబ్బతింటుంది. 

5) ఓలిగోట్రోఫికేషన్‌: ఇది యూట్రోఫికేషన్‌కు వ్యతిరేకమైన స్థితి. కొత్తగా తవ్విన బావులు, చెరువులు, సరస్సుల్లో సాధారణంగా నీరు నిలకడగా ఉంటుంది. సరైన పోషక పదార్థాలు ఉండక యూట్రోఫికేషన్‌ కాలుష్యం జరగదు. నీరు స్వచ్ఛంగా ఉంటుంది. జలాశయాలకు ఉండే ఈ స్థితినే ఓలిగోట్రోఫికేషన్‌ అంటారు.

6) రెడ్‌ టైడ్స్‌: సముద్రాల్లోకి మానవ జనిత ఉద్గారాలు చేరినప్పుడు ఆ వ్యర్థాలను విచ్ఛిన్నం చేసే ప్రక్రియలో అక్కడి డైనోఫ్లాజెల్లేట్స్‌ అనే సూక్ష్మజీవులు కొన్ని రసాయనాలను నీటిలోకి విడుదల చేస్తాయి. ఫలితంగా ఆ ప్రాంతంలో సముద్రపు నీరు ఎర్రగా మారుతుంది. దీని ప్రభావం వల్ల తీరం వద్ద అలలు ఎర్రగా కనిపిస్తాయి. వీటిని రెడ్‌ టైడ్స్‌ అంటారు. 

7) భారలోహ కాలుష్యం: పరిశ్రమల నుంచి విడుదలయ్యే వ్యర్థాలు నీటిలో కలవడంతో జింక్, కాపర్, కాడ్మియం, మెర్క్యురీ, ఆర్సెనిక్, క్రోమియం, కోబాల్ట్‌ లాంటి భార లోహాల వల్ల మానవులు అనేక వ్యాధుల బారిన పడుతున్నారు. 

8) చమురు కాలుష్యం: సముద్ర నీటిపై ఓడల నుంచి ఆయిల్‌ స్పిల్‌ జరిగి సముద్ర జలాలు చమురుతో కలుషితమవుతున్నాయి. వీటి నుంచి విడుదలయ్యే పారాఫిన్, మీథేన్, ఈథేన్‌ లాంటి వాయువులను పీల్చినప్పుడు శ్వాస సంబంధ వ్యాధులు వస్తాయి. ఆక్సిజన్‌ నీటిలో కరగకుండా చమురు తెట్టు అడ్డుకుంటుంది. దాంతో ఆక్సిజన్‌ డిమాండ్‌ పెరిగి సముద్ర జలచరాలకు ప్రాణహాని కలుగుతుంది. సముద్ర జలాల్లో పేరుకుపోయిన చమురును సూడోమోనాస్‌ బ్యాక్టీరియా ద్వారా విక్షాళనం చెందించవచ్చు. భారత సంతతికి చెందిన ఆనంద చక్రవర్తి అనే అమెరికన్‌ శాస్త్రవేత్త సముద్ర జలాల్లోని చమురు కాలుష్యాన్ని తొలగించే ‘ఆయిల్‌ ఈటింగ్‌ బ్యాక్టీరియా’ అనే సూపర్‌ బగ్‌ను రూపొందించారు.


వ్యాధులు: కొన్ని రకాల భార లోహాలు కరిగిన నీటిని తాగడం వల్ల రకరకాల వ్యాధులు వస్తాయి. 

పాదరసం: సాధారణంగా నీటిలో 0.001 మి.గ్రా./లీటర్‌ పాదరసం కరిగి ఉండటం వల్ల ఎలాంటి హాని ఉండదు. కానీ ఆ మోతాదుకు మించి పాదరసం నీటిలో కలిస్తే పెదవులు, చేతులు స్పర్శజ్ఞానాన్ని కోల్పోవడం, వినికిడి సామర్థ్యం, కంటి చూపు తగ్గిపోవడం లాంటి సమస్యలు తలెత్తుతాయి. జపాన్‌లోని మినమాటా గ్రామంలో ఇలాంటి వ్యాధి లక్షణాలు గమనించడం వల్లే దీన్ని మినమాటా వ్యాధి అంటారు. కాగితం, రంగుల పరిశ్రమల నుంచి వచ్చే మెర్క్యురీ జలాల్లో కలిసి డై మిథైల్‌ మెర్క్యురీగా నీటిలో కరుగుతుంది. ఈ నీటిలోని చేపలను ఆహారంగా తీసుకునే మనిషిలోకి ఇది ప్రవేశిస్తుంది.

కాడ్మియం: ఇది సాధారణంగా జలాల్లో 0.01 మి.గ్రా./లీటర్‌ కరిగి ఉంటే ప్రమాదం లేదు. అంతకుమించి ఉంటే మూత్రపిండాలు, కేంద్రీయ నాడీ వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. ఎముకలు విరూపణ చెందడం, రక్తహీనత, స్త్రీలలో సంతానోత్పత్తి శక్తి తగ్గిపోవడం లాంటి సమస్యలు ఏర్పడతాయి. జింక్‌ తయారు చేసే పరిశ్రమల నుంచి కాడ్మియం విడుదలవడం వల్ల జపాన్‌లోని ఇటాయ్‌ ప్రాంతంలో దీని ప్రభావాన్ని మొదట కనుక్కున్నారు. అందుకే ఆ వ్యాధిని ఇటాయ్‌ ఇటాయ్‌ అంటారు.

నైట్రేట్స్‌: తాగునీటిలో సాధారణంగా 4.5 మి.గ్రా/లీటర్‌ పరిమాణంలో నైట్రేట్స్‌ ఉంటే సరిపోతుంది. అంతకంటే ఎక్కువ పరిమాణంలో ఉంటే అవి రక్తంలోని హిమోగ్లోబిన్‌తో కలిసి మెటా హిమోగ్లోబినియాగా మారి శరీర కణజాలాలకు ఆక్సిజన్‌ సరఫరా తగ్గిపోతుంది. దాంతో దుష్ప్రభావాలు కలుగుతాయి. శిశువులు నీలి రంగులో జన్మించడం, క్యాన్సర్‌ వ్యాధులు ప్రబలడం లాంటి పరిణామాలు జరుగుతాయి. తాగునీటిలో నైట్రేట్‌ మలినాలు ఎక్కువగా చేరడానికి కారణం పరిమితికి మించి ఎరువులను వినియోగించడం, భూగర్భజలంలో నైట్రేట్స్‌ గాఢత పెరిగిపోవడమే.

కాపర్‌: తాగేనీటిలో కాపర్‌ అధికంగా ఉంటే అధిక రక్తపోటు, అప్పుడప్పుడు జ్వరం రావచ్చు.

క్రోమియం: తాగునీటిలో ఎక్కువ పరిమాణంలో క్రోమియం ఉంటే క్యాన్సర్, కేంద్రనాడీ మండలానికి సంబంధించిన రుగ్మతలు, మూత్రపిండాల వాపు లాంటివి సంభవిస్తాయి.

కోబాల్ట్‌: పరిమితికి మించి కోబాల్ట్‌ నీటిలో కరిగి ఉంటే ఆ నీటిని స్వీకరించడం వల్ల పక్షవాతం, అతిసారం, రక్తపోటు తగ్గడం,  ఎముకల బలహీనత లాంటివి వస్తాయి.


జల కాలుష్య నివారణ చర్యలు:

ట్రిక్లింగ్‌ ఫిల్టర్‌: ఇదో రకమైన మురుగు నీటి శుద్ధి వ్యవస్థ. చిన్న గులకరాళ్లతో తయారుచేసిన బెడ్‌ లాంటి నిర్మాణం. దీనిపైకి మురుగు నీటిని ప్రవేశపెట్టినప్పుడు నీరు వడపోతకు గురై పరిశుభ్రమైన నీరుగా మారుతుంది.

రొటేటింగ్‌ బయలాజికల్‌ కాంటాక్టర్‌: వలయాకార ప్లాస్టిక్‌ ఫలకలు ఒకదాని పక్కన మరొకటి అమరి ఉంటాయి. వీటిపై మురుగు నీరు ప్రవేశించినప్పుడు సూక్ష్మజీవులు సేంద్రియ పదార్థాన్ని విచ్ఛిన్నం చేస్తాయి.

తిరోగమన ద్రవాభిసరణ: ఇది నీటిలో కరిగి ఉన్న అవాంఛనీయ లవణాలను తొలగించే ప్రక్రియ. ఎక్కువ గాఢత నుంచి తక్కువ గాఢతకు అయాన్లు, అణువులను రవాణా చేసి నీటిని శుద్ధి చేసే కార్యక్రమం.

అడ్వాన్స్‌డ్‌ సీవేజ్‌ ట్రీట్‌మెంట్‌: ఇది యంత్రాల ద్వారా జరిగే నీటి శుద్ధి కార్యక్రమం. ఇదొక ఆధునిక మురుగు శుద్ధి ప్రక్రియ.


నీటి కాలుష్య నివారణకు ప్రభుత్వం చేపట్టిన చర్యలు: 

* జల కాలుష్య నియంత్రణ చట్టం - 1974 

* గంగా కార్యాచరణ ప్రణాళిక - 1985 

* జాతీయ నదీ సంరక్షణ కార్యక్రమం - 1995 

* జాతీయ గంగానది పరీవాహక అథారిటీ - 2009 

* నమామి గంగే - 2015 - 22

రచయిత: జల్లు సద్గుణరావు

Posted Date : 23-08-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ఘన వ్యర్థ కాలుష్యం - నిర్వహణ

పోగుపడే వ్యర్థాలతో పొంచి ఉన్న ప్రమాదాలు!

 పర్యావరణ వ్యవస్థకు, మనిషి ఆరోగ్యానికి ప్రమాదకరంగా మారిన వాటిలో ఘన వ్యర్థ కాలుష్యం ఒకటి. అభివృద్ధి పోకడలు, వస్తు వినియోగం, ఆహార వృథాతో వ్యర్థాలూ పెరిగిపోతున్నాయి. గాలి, నీరు, నేలలను కలుషితం చేస్తున్నాయి. పరిసరాలు దెబ్బతినడానికి, అంటువ్యాధులు ప్రబలడానికి ఈ పరిణామమే ప్రధాన కారణం. ప్లాస్టిక్, విద్యుత్తు, ఎలక్ట్రానిక్‌ వ్యర్థాల వంటివి మున్సిపాలిటీలు, నగర పాలక సంస్థలకు సవాలు విసురుతున్నాయి. సమస్త జీవజాలానికి సమస్యలు సృష్టిస్తున్న ఈ ఘన వ్యర్థాలు, వాటి మూలాలు, రకాలను అభ్యర్థులు తెలుసుకోవాలి. వాటి నిర్వహణ, దుష్ప్రభావాలను తగ్గించగలిగే శాస్త్రీయ విధానాల గురించి అవగాహన పెంచుకోవాలి.

ప్రజల జీవన ప్రమాణాలు పెరిగి, ఆధునిక జీవనశైలి అలవరుచుకుంటున్నారు. దాంతో వస్తు వినియోగం అధికమైంది. ‘ఉపయోగించు-పారవేయు’ పద్ధతిలోనే వస్తువులను తయారు చేస్తుండటంతో వాటి ఉత్పత్తి పెరుగుతోంది. ఫలితంగా ఘన వ్యర్థాల సమస్య అంతకంతకూ ఎక్కువవుతోంది. పట్టణ, నగర జనావాసాల్లో ఈ సమస్య మరీ ఎక్కువగా ఉంది. ‘జాతీయ కాలుష్య నియంత్రణ బోర్డు’ నివేదిక ప్రకారం మన దేశంలో రోజుకు సుమారు 1.60 లక్షల టన్నుల వ్యర్థాలు పోగు పడుతున్నాయి. ఇందులో 95.4% సేకరిస్తున్నారు. అత్యధిక వ్యర్థాలు ఉత్పత్తి చేసే రాష్ట్రాల్లో మహారాష్ట్ర, ఉత్తర్‌ప్రదేశ్, పశ్చిమ బెంగాల్‌ తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి. నగరాలపరంగా దిల్లీ, ముంబయి, చెన్నై ముందంజలో ఉన్నాయి.


దుష్ప్రభావాలు: ఘనవ్యర్థాల నిర్వహణ సక్రమంగా లేకపోతే అనేక రకాల పర్యావరణ, ఆరోగ్య, ఆర్థికపరమైన దుష్ప్రభావాలు తలెత్తుతాయి.


* ఘనవ్యర్థాలు పోగుపడటం వల్ల భూ, జల వనరులు కలుషితమవుతాయి. ఫ్లోరిన్, పాదరసం, సీసం లాంటి భారలోహ కాలుష్యాలు మానవ ఆహార శృంఖలాల్లో జీవ ఆవర్తనం చెంది ప్రజలు ఫ్లోరోసిస్, డయేరియా, మతిభ్రమించడం లాంటి వ్యాధులకు గురవుతారు.


* ఘనవ్యర్థాలు కుళ్లి గాలి విషవాయువులతో దుర్గంధమై వ్యాధులు సంక్రమిస్తాయి.


* ఘనవ్యర్థాలు పేరుకుపోయి పరిసరాలు సహజ సౌందర్యాన్ని కోల్పోతాయి.


* ఎలుకలు, పందికొక్కులు లాంటి పరాన్నబుక్కులు ఎక్కువై సూక్ష్మజీవుల ప్రవాహకాలుగా మారి ప్లేగు తదితర వ్యాధులు విజృంభించడానికి కారణమవుతాయి.


* గుట్టలుగా పేరుకుపోయిన వ్యర్థాలను తొలగించడం స్థానిక సంస్థలకు ఆర్థిక భారంగా మారుతోంది.


ఘన వ్యర్థ మూలాలు


1) గృహసంబంధ వ్యర్థాలు: మున్సిపాలిటీలు, మెట్రో నగరాల్లో గృహ సంబంధ వ్యర్థాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. వంటింట్లో మిగిలిన, పాడైన ఆహార పదార్థాలు, చిరిగిన దుస్తులు, కాగితం, లెదర్‌ లాంటి జీవక్షయం చెందే వస్తువులు/పదార్థాలు ఇందులో ఉంటాయి. ప్లాస్టిక్, పాలిథిన్, గ్లాసు, లోహ సంబంధమైన జీవక్షయం చెందని వస్తువులూ ఉంటాయి.


2) పారిశ్రామిక వ్యర్థాలు: ఇనుము, ఉక్కు, అల్యూమినియం కర్మాగారాలు; రబ్బరు, ప్లాస్టిక్, గాజు తయారుచేసే పరిశ్రమల్లో మిగిలిపోయిన వ్యర్థాలు; సిమెంట్‌ కర్మాగారాల నుంచి వెలువడే ఫ్లైయాష్‌ లాంటి పారిశ్రామిక ఘనవ్యర్థాలు భూమి, జలాలను కలుషితం చేస్తాయి.


3) రేడియోధార్మిక వ్యర్థాలు: యురేనియం, థోరియం మూలకాలను భూమి నుంచి వెలికి తీసినప్పుడు లేదా వాటిని శుద్ధి చేసినప్పుడు వెలువడే వ్యర్థాలను నీటిలో/భూమిలో కలపకూడదు. భూమి లోపల ప్రత్యేక జాలీల్లో భద్రపరచాలి.


4) మైనింగ్‌ వ్యర్థాలు: గనుల తవ్వకాల్లో, ఖనిజాల్లోని మలినాలు తొలగించినప్పుడు ఏర్పడిన స్లాగ్‌ కూడా భారీగా పోగుపడిన ఘన వ్యర్థమే. బొగ్గు, ఇనుప గనుల నుంచి వెలువడే ధూళి తీవ్రస్థాయి శ్వాసకోస వ్యాధులను కలగజేస్తుంది.


5) వ్యవసాయ సంబంధ వ్యర్థాలు: వ్యవసాయ రంగంలో ఉత్పత్తులను పెంచుకోవడానికి విచక్షణారహితంగా ఉపయోగిస్తున్న రసాయన ఎరువులు, క్రిమిసంహారక మందులు నేల, నీటిపై పేరుకుపోతాయి. వీటివల్ల నేలలు నిస్సారంగా మారుతున్నాయి. జీవజాతులకు పలు అనారోగ్యాలకు గురవుతున్నాయి.


6) బయో మెడికల్‌ వ్యర్థాలు: ఆస్పత్రుల్లో వాడేసిన సిరంజీలు, సెలైన్‌ బాటిళ్లు, బ్యాండేజీలు, బ్లేడ్‌లు, రక్తవ్యర్థాలు లాంటి వాటిని బయోమెడికల్‌ వ్యర్థాలు అంటారు. ఘన వ్యర్థాలన్నింటిలో ఇవి చాలా హానికరమైనవి. వీటిని సరైన పద్ధతిలో నిర్వహించాలి.


7) ఎలక్ట్రానిక్‌ వేస్ట్‌: కాలం చెల్లిన, పాడైపోయిన కంప్యూటర్లు, టెలివిజన్లు, ప్రింటర్లు, ఎలక్ట్రానిక్‌ పరికరాల్లో ఉపయోగించే విషపూరిత రసాయనాలు; లోహ సంబంధ భాగాల ద్వారా చేరిన వ్యర్థాలను ఈ-వేస్ట్‌ లేదా ఎలక్ట్రానిక్‌ వేస్ట్‌ అంటారు. వీటి నుంచి ఆర్సెనిక్, బేరియం, కాడ్మియం, కోబాల్ట్, సీసం, పాదరసం, జింక్‌ లాంటి హానికర మూలకాలు విడుదలై తిరిగి మానవ జీవనంపై దుష్ప్రభావం చూపుతాయి.


8) కెమికల్‌ వేస్ట్‌: వినియోగించని ఔషధాలు, నెయిల్‌ పాలిష్‌ టిన్నులు, పెర్‌ఫ్యూమ్‌ బాటిళ్లు, టాయిలెట్‌ కెమికల్స్, కాస్మోటిక్‌ వ్యర్థాలు లాంటి వాటిని కెమికల్‌ వేస్ట్‌ అంటారు. ఈ రసాయన మూలకాల వ్యర్థాల వల్ల హాని కలుగుతుంది. ముఖ్యంగా చిన్నారులు ఎక్కువగా ప్రభావానికి గురవుతారు.


ఘన వ్యర్థాల నిర్వహణ: ఇది మున్సిపాలిటీలకు భారంగా మారుతోంది. వ్యర్థాలను సేకరించడం, తరలించడం, నిల్వ చేయడం ప్రభుత్వాలకు తలకు మించిన భారంగా మారుతోంది. అయితే కొన్ని నిర్వహణ విధానాల ద్వారా వాటి దుష్ప్రభావాన్ని తగ్గించవచ్చు.


వ్యర్థాలను వేరుచేసే ప్రక్రియ: వ్యర్థ పదార్థాలను సేకరించినప్పుడే తడి, పొడి చెత్తను వేరు చేయాలి. ఆ తర్వాత అందులోని జీవక్షయం చెందే తడి చెత్తను గుంతలు తీసి పూడ్చివేయాలి. ఇది క్రమంగా కుళ్లిపోయి ఎరువుగా మారుతుంది. ఈ విధానం వల్ల చెత్త పరిమాణం తగ్గించుకోవచ్చు.


5 R విధానం: ఘన వ్యర్థాల నిర్వహణకు ఇది అత్యంత శాస్త్రీయమైన పద్ధతి. ఈ విధానంపై ప్రజలకు పూర్తిగా అవగాహన కల్పించాలి.


1) Refuse -  చెత్త వేయకూడదు.


2) Reduce - చెత్త ఉత్పత్తిని తగ్గించుకోవాలి


3) Re-use - నీళ్ల సీసాలు, ప్యాకింగ్‌ మెటీరియల్స్‌ లాంటివి తిరిగి ఉపయోగించుకోవాలి.


4) Re-purpose - ఇతర ప్రయోజనాలకు ఉపయోగించాలి.


ఉదా: మెటల్‌ క్యాన్లు, బకెట్‌లను మొక్కలు పెంచుకోవడానికి వాడాలి.


5) Recycle - వ్యర్థాలను పునఃచక్రీయం చేయాలి.


ఉదా: కాగితం, ప్లాస్టిక్, లోహాలు, గాజు లాంటి వ్యర్థాలతో పరిశ్రమల ద్వారా తిరిగి కొత్త వస్తువులు తయారుచేయాలి.

పల్వరైజేషన్‌: సేకరించిన వ్యర్థాలను గ్రైండింగ్‌ మిషన్స్‌ ద్వారా ముక్కలు చేసి వాటి భౌతిక స్వరూపాన్ని, పరిమాణాన్ని మార్చే విధానం. ముక్కలైన వ్యర్థాలు రుచి, లక్షణాలు మారి కీటకాలను ఆకర్షించలేని విధంగా తయారవుతాయి. ఈ పదార్థాలను గుంతల్లో పూడ్చవచ్చు. అయితే ఈ ప్రక్రియ ఖర్చుతో కూడుకున్నది.


లోతట్టు ప్రాంతాల్లో పూడ్చవచ్చు: జీవక్షయం కాని, పునర్వినియోగానికి, పునఃచక్రీకరణకు పనికిరాని వ్యర్థాలను లోతట్టు ప్రాంతాల్లో మట్టితో కప్పివేయాలి. దీన్ని ల్యాండ్‌ ఫిల్లింగ్‌ అంటారు.


సముద్రాలకు దూరంగా పారబోయడం: ప్రపంచంలో సముద్రాల్లోకి అత్యధికంగా వ్యర్థాలను విడుదల చేస్తున్న దేశాల్లో చైనా, భారత్‌ ముందంజలో ఉన్నాయి. ఇది జలచరాలకు అత్యంత ప్రమాదకరంగా మారుతోంది. తీర ప్రాంత పట్టణాల్లోని చెత్తను తీరానికి 20 కి.మీ. దూరంలో, 30 మీటర్ల లోతైన ప్రాంతాల్లోకి తరలించాలి.


ఉపాధి సృష్టి: జీవక్షయం చెందే వ్యర్థాలను కంపోస్ట్‌ చేయడం ద్వారా ఎరువు, మీథేన్‌ వాయువును ఉత్పత్తి చేయవచ్చు. వ్యర్థాన్ని వానపాముల చర్య ద్వారా వర్మికంపోస్ట్‌గా మార్చొచ్చు. ఆస్పత్రి సంబంధ వ్యర్థాలను 800 డిగ్రీల సెంటీగ్రేడ్‌ వద్ద వేడి చేసి ‘ఇన్సినరేషన్‌’ ద్వారా విద్యుత్తును ఉత్పత్తి చేయవచ్చు.


బయోమెడికల్‌ వ్యర్థాల నిర్వహణ

ఎ) తెలుపు రంగు డబ్బాలు: సూదులు, బ్లేడ్లు వేయాలి.


బి) నీలి రంగు డబ్బాలు: గాజు సీసాల వ్యర్థాలు వేయాలి.


సి) పసుపు రంగు డబ్బాలు: జంతు, మానవ, ప్రయోగశాలల వ్యర్థాలు; శరీర ద్రవాలు వేయాలి.


డి) ఎరుపు రంగు డబ్బాలు: సిరంజీలు, సెలైన్‌ బాటిళ్లు, ట్యూబ్‌లు, క్యాథటర్స్‌ లాంటివి వేయాలి.

ఈ-వేస్ట్‌ నిర్వహణ: కాలం చెల్లిన, ఉపయోగంలో లేని ఎలక్ట్రిక్, ఎలక్ట్రానిక్‌ సంబంధ వ్యర్థాలను ఈ-వేస్ట్‌ అంటారు. అసోచామ్‌ గ్రూప్‌ నివేదిక ప్రకారం మన దేశం ఏటా 20 లక్షల టన్నుల ఈ-వేస్ట్‌ ఉత్పత్తితో ప్రపంచంలో అయిదో స్థానంలో ఉంది. దేశంలో ఈ-వేస్ట్‌ ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం మహారాష్ట్ర, నగరం ముంబయి.


ఈ-వేస్ట్‌లు మూడు రకాలు 


1) White Goods: పాడైపోయిన వాషింగ్‌ మిషిన్లు, గ్రైండర్లు, రిఫ్రిజిరేటర్లు.

2) Brown Goods:వాణిజ్య సముదాయాలు, గృహాల నుంచి ఉత్పత్తయ్యే పాడైపోయిన టెలివిజన్లు, కెమెరాలు.

3) Grey Goods: ప్రభుత్వ, ప్రైవేట్‌ కార్యాలయాలు, వాణిజ్య సముదాయాల్లోని పాడైపోయిన కంప్యూటర్లు, స్కానర్లు, ప్రింటర్లు, మొబైల్‌ ఫోన్లు.

రచయిత: జల్లు సద్గుణరావు

 

Posted Date : 25-09-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

గ్లోబల్‌ వార్మింగ్‌ (భూతాపం)

భూగోళం భగభగ!

ఏటేటా ప్రపంచం అంతటా ఉష్ణోగ్రతలు తీవ్రమైపోతున్నాయి. వేసవిలో వడగాలులు, శీతాకాలంలో చలితీవ్రత అంతకంతకు అధికమవుతూ జీవుల మనుగడకు సవాలు విసురుతున్నాయి. వాతావరణంలో అనూహ్య మార్పులు ఏర్పడి పర్యావరణ సమతౌల్యత ప్రమాదంలో పడిపోతోంది. నదులతో పాటు సముద్రాల్లోనూ ఉష్ణోగ్రతలు ఎక్కువై జలచరాలు, భూమిపై కొన్ని సున్నిత జీవజాతులు అంతరించిపోతున్నాయి. తుపాన్లు, వరదలు, దుర్భిక్షంతో మానవ జీవనం రోజురోజుకూ దుర్భరమైపోతోంది. ఇన్ని అనర్థాలకు కారణం భూగోళ ఉష్ణోగ్రతలు పెరిగిపోవడమే. మనిషి విపరీత చర్యలతో తలెత్తుతున్న ఈ భూతాపానికి ప్రధాన కారణాలు, వాటి పర్యవసానాలు, నివారణ చర్యలపై పరీక్షార్థులు శాస్త్రీయ పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలి.

వేసవికాలం పెరిగిపోయి ఎండలు మండిపోతున్నాయి. శీతాకాలం తగ్గిపోయి రుతువులు క్రమం తప్పుతున్నాయి. అకాల వర్షాలతో వరదలు, వర్షాభావ పరిస్థితులతో కరవు కాటకాలు వంటి పరిస్థితులను శీతోష్ణస్థితి మార్పులుగా అంతర్జాతీయ సంస్థలు పేర్కొంటున్నాయి. వాటి ప్రభావం భూమిపై అన్ని ప్రాంతాల్లో స్పల్ప నుంచి తీవ్రస్థాయికి చేరినట్లు అనేక నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. శీతోష్ణస్థితి మార్పుల అధ్యయనానికి వరల్డ్‌ మెటిరియోలాజికల్‌ ఆర్గనైజేషన్‌ (WMO), యునైటెడ్‌ నేషన్స్‌ ఎన్విరాన్‌మెంటల్‌ ప్రోగ్రామ్‌(UNEP) సంయుక్త ఆధ్వర్యంలో 1988లో జెనీవా వేదికగా ఇంటర్‌ గవర్నమెంటల్‌ ప్యానెల్‌ ఆన్‌ క్లైమేట్‌ ఛేంజ్‌(IPCC)ను ఏర్పాటు చేశారు. ఆ సంస్థ ఇచ్చిన వివరాల ప్రకారం ఈ శతాబ్దం చివరి నాటికి ప్రపంచవ్యాప్త ఉష్ణోగ్రతలు 1.80Cనుంచి  40C వరకూ పెరగవచ్చని అంచనా. సాధారణంగా భూగోళం సగటు ఉష్ణోగ్రత 15.4oC ఉంటుంది. ఈ ఉష్ణోగ్రత పెరగడాన్ని గ్లోబల్‌ వార్మింగ్‌ (భూగోళం వేడెక్కడం లేదా భూతాపం)గా పిలుస్తారు.


సూర్యుడి నుంచి నిరంతరం బయటకు వెలువడే సౌరశక్తిని సౌర వికిరణం అంటారు. ఇందులో చాలా తక్కువ పరిమాణంలో శక్తి భూమిని చేరుతుంది. ఈ సౌరశక్తిని సూర్యపుటం అంటారు. దీని ద్వారా భూమి వేడెక్కిన తర్వాత కొంత శక్తిని భూమి నుంచి పరారుణ కిరణాల రూపంలో, దీర్ఘ తరంగాలుగా వాతావరణం తిరిగి తీసుకుంటుంది. దీనినే భూవికిరణం అంటారు. మానవ కార్యకలాపాల వల్ల వాతావరణంలోకి విడుదలవుతున్న కార్బన్‌ డై ఆక్సైడ్, మీథేన్, నైట్రస్‌ ఆక్సైడ్‌ లాంటి హరిత గృహ వాయువులు భూవికిరణాన్ని అడ్డుకుని తిరిగి భూమి వేడెక్కడానికి కారణమవుతున్నాయి. ఈ విధంగా భూవికిరణం వల్ల భూమి చల్లబడటానికి బదులు తిరిగి భూవాతావరణం వేడెక్కడాన్ని గ్లోబల్‌ వార్మింగ్‌ లేదా భూతాపంగా పిలుస్తారు.


అతిశీతల వాతావరణంలో పెరగడానికి అనుకూలంగా లేని సున్నిత మొక్కలను ఆకుపచ్చని గాజు గదిలో పెంచినప్పుడు లోపలి వేడి పైకి వెళ్లకుండా కాపాడి మొక్కల పెరుగుదలకు సహకరించినట్లు గ్రీన్‌హౌస్‌ వాయువులు కూడా భూమి చుట్టూ వేడిని పెంచుతాయి. అయితే ఈ హరితగృహ వాయువులు పెరిగే కొద్దీ భూగోళ సగటు ఉష్ణోగ్రతలు అధికమై క్రమంగా గ్లోబల్‌ వార్మింగ్‌కు దారితీస్తుంది. దీనినే హరితగృహ ప్రభావం అంటారు. హరితగృహ వాయువు ఉద్గారాల్లో ఇంధన రంగం నుంచే అధికంగా విడుదలవుతున్నాయి. గ్లోబల్‌ వార్మింగ్‌కు ప్రధానంగా కార్బన్‌ డై ఆక్సైడ్‌ (72%), మీథేన్‌ (21%), నైట్రస్‌ ఆక్సైడ్‌ (7%) కారణమవుతున్నాయి.

కర్బన ఉద్గారాలను అధికంగా విడుదల చేస్తున్న దేశాలు: 1) చైనా (29.18%), 2) అమెరికా (14.02%), 3) ఇండియా (7.09%), 4) రష్యా (4.65%).


గ్రీన్‌హౌస్‌ ఘన కారకాలు:

1) బ్లాక్‌ కార్బన్‌: ఇది వాతావరణాన్ని వేడి చేసే ఘన స్థితిలోని  ప్రధాన కాలుష్యం, వాతావరణంలోని పార్టిక్యులేట్‌ మ్యాటర్‌ లేదా ఏరోసాల్‌. దీనినే మసి (Sooty) గా పిలుస్తారు. ఇది కార్బన్‌డై ఆక్సైడ్‌ తర్వాత వాతావరణాన్ని వేడెక్కించే రెండో ప్రధాన కారకం. జీవ సంబంధ పదార్థాలు/బొగ్గు/పెట్రోలియం అసంపూర్తిగా మండినప్పుడు బ్లాక్‌ కార్బన్‌ ఎక్కువగా విడుదలవుతుంది. సూర్యుడి నుంచి భూమి గ్రహించిన సౌరశక్తికి, భూమి వెనుకకు పంపిన భూవికిరణానికి మధ్య నిష్పత్తిని తెలియజేసే అల్బిడో సామర్థ్యాన్ని ఇది తగ్గిస్తుంది. అంటే బ్లాక్‌ కార్బన్‌ సౌర వికిరణాన్ని ఎక్కువగా గ్రహించి మంచు ప్రాంతాల్లో నిక్షిప్తం చేస్తుంది. దాంతో హిందూ కుష్, హిమాలయాల్లో గ్లేసియర్స్‌ హెచ్చు పరిమాణంలో కరిగిపోతున్నాయి.

2) బ్రౌన్‌ కార్బన్‌: ఆర్గానిక్‌ ఏరోసాల్స్‌నే బ్రౌన్‌ కార్బన్‌ అంటారు. కర్ర, పంట అవశేషాలు; బొగ్గు, పిడకలు లాంటి జీవసంబంధ పదార్థాలను మండించినప్పుడు ఏర్పడతాయి. ఇవి కూడా వాతావరణంలోకి చేరి గ్లోబల్‌ వార్మింగ్‌కు కారణమవుతాయి.

గ్లోబల్‌ వార్మింగ్‌ వల్ల నష్టాలు:

* భూమి చుట్టూ వేడి అధికమవడంతో ధ్రువాల్లో మంచు కరిగి సముద్ర మట్టాలు పెరుగుతాయి. దాంతో మాల్దీవులు లాంటి కొన్ని దీవులు సముద్రంలో మునిగిపోతాయి. 

* సైబీరియా భూభాగంలో కప్పి ఉన్న శాశ్వత మంచుపొర అయిన ‘ఫెర్మాప్రాస్ట్‌’ కరిగిపోతే అందులోని మీథేన్‌ వాయువు విడుదలై భూతాపాన్ని మరింత పెంచుతుంది.

* వ్యవసాయ దిగుబడులు తగ్గి ప్రపంచవ్యాప్తంగా ఆహార భద్రతకు ముప్పు ఏర్పడుతుంది.

* వరదలు, సునామీలు, టోర్నడోలు, తుపాన్లు లాంటి విపత్తులు మరింత విరుచుకుపడతాయి. 

* అధిక ఉష్ణోగ్రతల కారణంగా కొన్నిరకాల సూక్ష్మజీవుల వ్యాప్తి ఎక్కువై సంక్రమణ వ్యాధులు పెరుగుతాయి.

* హిమనీనదాలు త్వరగా కరిగిపోయి గంగానది లాంటి కొన్ని నదుల్లో స్వల్పకాల వ్యవధిలో వరదలు వస్తాయి. ఈ పరిస్థితి దీర్ఘకాలంలో దుర్భిక్షానికి దారితీస్తుంది.

* వాతావరణంలో కార్బన్‌ డై ఆక్సైడ్‌ అధికమైన కొద్దీ సముద్రపు నీటిలో దాని మోతాదు కూడా పెరుగుతుంది. సముద్రపు నీటిలో కార్బానిక్‌ ఆమ్లం ఎక్కువై నీటి ఆమ్లత్వం పెరుగుతుంది. దీనినే ‘ఓషన్‌ ఎసిడిఫికేషన్‌’ అంటారు. ఫలితంగా సముద్ర జీవవైవిధ్యం దెబ్బతింటుంది.

గ్లోబల్‌ వార్మింగ్‌ నియంత్రణ వ్యూహాలు:

1) కార్బన్‌ ట్రేడింగ్‌ విధానం: హరిత విధానాన్ని అనుసరించే వర్ధమాన, పేద దేశాల్లోని పరిశ్రమలు తమ ప్రాజెక్టుల నుంచి తగ్గించే ప్రతి టన్ను కార్బన్‌ డై ఆక్సైడ్‌కు ఒక కార్బన్‌ క్రెడిట్‌ను పొందుతాయి. ఆ విధంగా సంపాదించిన పాయింట్లను అంతర్జాతీయ మార్కెట్‌లో అమ్ముకోవచ్చు. అభివృద్ధి చెందిన పారిశ్రామిక దేశాలు నిర్ధారించిన కర్బన వాయు ఉద్గారాల తగ్గింపు లక్ష్యాలను చేరుకోలేనప్పుడు వర్ధమాన దేశాలు విక్రయించే ఈ కర్బన క్రెడిట్లను కొనుగోలు చేసుకోవచ్చు. ఏటా జరిగే కాన్ఫరెన్స్‌ ఆఫ్‌ పార్టీస్‌ ్బదివీశ్శి సదస్సుల్లో ఈ ఉద్గారాల తగ్గింపు లక్ష్యాలను నిర్ణయిస్తుంటారు.

2) కార్బన్‌ శోషక విసర్జిత విధానం: దీన్నే కార్బన్‌ శోషక నిల్వ విధానం అంటారు. వాతావరణంలో పరిమితికి మించి చేరిన కర్బన ఉద్గారాలను తగిన సాంకేతిక విధానం ద్వారా సేకరించి సముద్రాలు, అడవులు, ఎండిపోయిన ముడిచమురు బావులు, తవ్వకాలు చేపట్టని, మిగిలిపోయిన గనులు లాంటి ప్రాంగణాల్లో నిల్వ చేస్తారు. లేదా భూగర్భంలో పాతిపెడతారు.

3) జీవసంబంధ కార్బన్‌ శోషక విధానాలు: వృక్ష జాతులు కిరణజన్య సంయోగక్రియ ద్వారా కార్బన్‌ను గ్రహించి కార్బోహైడ్రేట్స్‌గా మార్చి తమలో విలీనం చేసుకుంటాయి. దీనినే గ్రీన్‌ కార్బన్‌ శోషకం అంటారు. అడవులను పెంచడం వల్ల కర్బన ఉద్గారాలను తగ్గించవచ్చు. తీర ప్రాంతాలు, మంచి నీటి ప్రాంతాల్లో పెరిగే మాంగ్రూవ్, సర్గోసా, నాచు లాంటి జలావరణ వ్యవస్థలో పెరిగే వృక్షజాతులు వాతావరణం, సముద్రాల్లోని కార్బన్‌ను తొలగించి వాటిని నిల్వ చేసుకుంటాయి లేదా వాటి నేల అడుగున సహజ ప్రక్రియ ద్వారా నిక్షిప్తం చేస్తాయి. దీన్నే బ్లూకార్బన్‌ శోషక విధానం అంటారు. గ్లోబల్‌ వార్మింగ్‌ తగ్గించడానికి తీర ప్రాంత ఆవరణ వ్యవస్థను పెంచాలి.

4) కార్బన్‌ ట్యాక్స్‌ విధానం: కర్బన ఉద్గారాలను నియంత్రించడానికి అనుసరించే అత్యంత సమర్థ విధానమిది. ఇందులో కార్బన్‌ డయాక్సైడ్‌ను విడుదల చేసే పరిశ్రమలు, మైనింగ్‌ సంస్థలు, విద్యుత్తు ఉత్పత్తి కేంద్రాలకు కర్బన పన్ను (కార్బన్‌ ట్యాక్స్‌) విధిస్తారు. ఈ విధంగా చేయడాన్ని Cap and Trade అంటారు. దీనివల్ల ఉత్పిత్తిదారులను కర్బన ఉద్గారాలను వెదజల్లే ఇంధన వినియోగం నుంచి కర్బన రహిత ఇంధనాల వినియోగం వైపు మళ్లించవచ్చు.

5) జియో ఇంజినీరింగ్‌: ఇదొక ప్రయోగాత్మక నూతన సాంకేతిక విధానం. భూమి వైపు ప్రసరించే సౌర వికిరణ పరిమాణాన్ని తగ్గించడానికి అంతరిక్షంలో గ్లాస్‌ రూమ్‌ను ఏర్పాటు చేయడం, సల్ఫేట్‌ ఏరోసాల్స్‌ను స్ట్రాటోస్ఫియర్‌లోకి పంపించడం ద్వారా ఆ ప్రాంతాన్ని తెల్లగా చేయవచ్చు. నివాసాల పైకప్పులకు వైట్‌వాష్‌ చేయడం, ఇనుము సంబంధిత ప్లేట్స్‌ను సముద్రంలో ఉంచడం ద్వారా ఆల్గే లాంటి నాచు మొక్కలు ఒక చోట ఎక్కువగా పెరిగే విధంగా చూడవచ్చు. ఈ తరహా సాంకేతిక విధానాలను గ్లోబల్‌ వార్మింగ్‌ నియంత్రణకు అనుసరిస్తారు. అధిక సాంకేతికత గ్లోబల్‌ వార్మింగ్‌కు కారణమైతే, అత్యాధునిక సాంకేతికతతో దాన్ని నివారించాల్సిన అవసరం ఉంది.

రచయిత: జల్లు సద్గుణరావు

Posted Date : 05-10-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

శీతోష్ణ మార్పులు

ప్రకృతి రక్షణ కవచాలకు తూట్లు!

 


చెట్ల ఆకుల్లో పచ్చదనం తగ్గిపోతోంది. ఎండిపోయి రాలిపోతున్నాయి. పంటచేలు బీడుబారి, వ్యవసాయ ఉత్పత్తులు క్షీణిస్తున్నాయి. చారిత్రక కట్టడాల్లో పగుళ్లు ఏర్పడుతున్నాయి. జలాశయాల్లో ఆమ్లత్వం పెరిగి జీవరాశులు అంతరించిపోతున్నాయి. ఇవన్నీ వాతావరణంలో వచ్చే మార్పుల వల్ల సంభవించే విపరిణామాలు. మనిషి ఆధునిక జీవన విధానంతో శీతోష్ణస్థితిపై పడుతున్న ప్రభావం వల్ల పర్యావరణానికి కలుగుతున్న హాని, దుష్ఫలితాలు, వాటి నివారణ చర్యల గురించి పరీక్షార్థులు సమగ్రంగా తెలుసుకోవాలి. ఈ పరిస్థితులను అధిగమించేందుకు అంతర్జాతీయ స్థాయిలో జరుగుతున్న ప్రయత్నాలు, నిర్వహించిన సదస్సులు, చేసిన నిర్ణయాలపై అవగాహన పెంచుకోవాలి. 

ఒక భౌగోళిక ప్రాంతంలో గాలిలోని తేమ, ఉష్ణోగ్రత, మేఘాలు, పవనాలు, వర్షపాతం లాంటి వాతావరణ అంశాలను దీర్ఘకాలంలో సగటుగా తీసుకుని శీతోష్ణస్థితిగా పేర్కొంటారు. భూమిపై జీవరాశి అవతరించిన నాటి నుంచి వాటికి శీతోష్ణస్థితితో అన్యోన్యత కొనసాగుతూనే ఉంది. అయితే గత రెండు శతాబ్దాల నుంచి మనిషి సున్నిత, యాంత్రికమైన జీవితం వల్ల కలుషిత వాయువులు గాలిలోకి విడుదలై వికృతీకరణ జరుగుతోంది. ఫలితంగా ఆమ్లవర్షాలు, ఓజోన్‌ పొర క్షీణత లాంటి శీతోష్ణ మార్పులు ఏర్పడి జీవజాతుల మనుగడకు ప్రమాదంగా మారుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఆహార భద్రత, జీవనోపాధి, సుస్థిర అభివృద్ధిపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తున్నాయి.


ఆమ్ల వర్షాలు: థర్మల్‌ విద్యుత్తు కేంద్రాల్లో బొగ్గును మండించినప్పుడు విడుదలైన సల్ఫర్‌ డయాక్సైడ్, వాహనాల నుంచి విడుదలవుతున్న నైట్రోజన్‌ ఆక్సైడ్, అగ్నిపర్వత విస్ఫోటాల ద్వారా బయటపడిన సల్ఫర్, నైట్రోజన్‌ వాయువులు వాతావరణంలోని తేమ, కాంతితో రసాయన చర్య జరుపుతాయి. ఇవి వెంటనే సల్ఫ్యూరిక్‌ ఆమ్లం, నత్రికామ్లం, హైడ్రోక్లోరిక్‌ ఆమ్లంగా మారి వర్షపు నీటితో కలిసి భూమిని చేరతాయి. ఆ విధంగా కురిసిన వర్షాలను ఆమ్ల వర్షాలు అంటారు. ఒక శతాబ్దం క్రితమే ఇంగ్లండులోని మాంచెస్టర్‌ నగరంలో ఆమ్ల వర్షాలను మొదటిసారిగా గుర్తించారు. అప్పట్లో ఈ సమస్య తీవ్రతను అంతగా పట్టించుకోలేదు. తర్వాత అది పెనుసవాలుగా మారింది. మన దేశంలో మొదటి ఆమ్ల వర్షాన్ని 1974లో ముంబయిలో గుర్తించారు. ఆమ్ల వర్షం అనే పదాన్ని మొదట 1852లో స్కాట్‌లాండ్‌కు చెందిన రాబర్ట్‌ అంగస్‌ స్మిత్‌ అనే రసాయన శాస్త్రవేత్త ఉపయోగించారు.


ఆమ్ల వర్షాల ప్రభావం:

* మొక్కల్లో పత్రహరితం క్షీణించి పంటల ఉత్పాదకత తగ్గుతుంది.


* మానవుల్లో నాడీవ్యవస్థ దెబ్బతింటుంది. శ్వాస సంబంధ వ్యాధులు, చర్మ క్యాన్సర్‌లు వస్తాయి.


* నేలలో ఆమ్లత్వం పెరిగి నిస్సారంగా మారతాయి.


* జలాశయాల్లో ఆమ్లత్వం పెరిగి ఆల్గల్‌ బ్లూమ్‌ ఎక్కువగా వ్యాపిస్తుంది. దాంతో బ్యాక్టీరియాలు నశించి, జీవులకు ఆక్సిజన్‌ అందక జలచరాలూ చనిపోతాయి.


* అడవుల్లో ఈ వర్షాలు కురిసినప్పుడు సున్నితమైన కోనిఫెరస్‌ లాంటి వృక్షజాతులు నశించిపోతాయి.


* తాజ్‌మహల్‌ లాంటి చారిత్రక కట్టడాలు కళావిహీనమై, పగుళ్లు, గుంతలు లాంటి స్టోన్‌ లెప్రసీకి గురవుతున్నాయి.


ఆమ్ల వర్షాల ప్రభావాన్ని తగ్గించే చర్యలు


* ఆమ్లత్వం కలిగిన నీటిని, దానిలో గాఢతను నియంత్రించడానికి కాల్షియం ఆక్సైడ్, కాల్షియం కార్బొనేట్‌ రూపంలో సున్నాన్ని కలపాలి.


* సల్ఫర్‌ తక్కువగా ఉండే ఇంధనాలను వాడాలి. బొగ్గును మండించినప్పుడు అందులోని సల్ఫర్‌ని తొలగించాలి.


* శిలాజ ఇంధనాలకు బదులుగా సౌర, పవన, తరంగ ఆధారిత శక్తిని, హైడ్రోజన్‌ లాంటి హరిత ఇంధనాలను వినియోగించాలి.


* కలుషిత వాయువులను ఎక్కువగా విడుదల చేసే యంత్రాలను నవీకరించాలి.


* సల్ఫర్, నైట్రోజన్‌లను ఆధునిక సాంకేతికతను వినియోగించి హానిరహిత వాయువులుగా మార్చాలి.

ఓజోన్‌ క్షీణత: O3 రూపంలో లేత నీలిరంగులో ఉండే ఓజోన్‌ భూమి ఉపరితలం నుంచి రెండో వాతావరణ పొర అయిన స్ట్రాటో ఆవరణంలో విస్తరించి ఉంటుంది. దీనిని 1913లో ఫ్రెంచి భౌతిక శాస్త్రవేత్తలు ఛార్లెస్‌ ఫాబ్రి, హెన్రీ బుయేసన్‌ కనుక్కున్నారు. ఓజోన్‌ ధర్మాలను జి.ఎమ్‌.బి.డాబ్సన్‌ అనే బ్రిటిష్‌ శాస్త్రవేత్త వివరించాడు.ఓజోన్‌ పొర మందాన్ని ‘డాబ్సన్‌ యూనిట్‌’లలో కొలుస్తారు. అందుకు వినియోగించే పరికరాన్ని ‘డాబ్సన్‌ ఓజోన్‌ స్పెక్ట్రో ఫొటో మీటర్‌’ అంటారు. ఓజోన్‌ పొర స్ట్రాటో ఆవరణంలో 25-35 కి.మీ. ఎత్తులో 90% కేంద్రీకృతమై ఉంటుంది. మిగిలిన 10% ట్రోపో ఆవరణంలో విస్తరించి ఉంటుంది. ఓజోన్‌ పొర సూర్యుడి నుంచి వస్తున్న సౌర వికిరణంలో శక్తిమంతమైన అతినీలలోహిత కిరణాలను వడపోసి, శక్తిని మాత్రమే భూమి పైకి పంపిస్తుంది. అందువల్ల ఓజోన్‌ పొరను భూమికి రక్షణ కవచం అంటారు.ఓజోన్‌ పొర క్షీణతకు ప్రధాన కారణం రిఫ్రిజిరేటర్లు, ఎయిర్‌ కండిషనర్లు, కంప్యూటర్లు, ప్లాస్టిక్, ఫోమ్‌ల నుంచి విడుదలవుతున్న క్లోరోఫ్లోరో కార్బన్లు (CFC). ఈ ఫ్రియాన్‌ వాయువులకు అత్యధిక స్థిరత్వం ఉండటంతో ఓజోన్‌ను ఎక్కువగా నాశనం చేస్తున్నాయి. ఒక క్లోరిన్‌ పరమాణువు రెండేళ్లపాటు స్ట్రాటో ఆవరణంలో ఉండి O3 ని క్షీణింపజేస్తుంది. పరిశ్రమలు, ఎరువుల కర్మాగారాల నుంచి విడుదలయ్యే నైట్రస్‌ ఆక్సైడ్‌ కూడా ఓజోన్‌ను హరింపజేస్తుంది. మంటలార్పడానికి ఉపయోగించే బ్రోమిన్‌ విడుదల చేసే బ్రోమో ఫ్లోరో కార్బన్లు (BFC) క్లోరిన్‌ కంటే మరింత సమర్థంగా ఓజోన్‌ పైన ప్రభావం చూపిస్తాయి. బెలూన్ల ద్వారా డాబ్సన్‌ ఓజోన్‌ స్పెక్ట్రో ఫొటో మీటర్‌ను పంపించడం ద్వారా తెలుసుకున్న వివరాల ప్రకారం 1970 నుంచి యూరప్‌పై 8% ఓజోన్‌ క్షీణించింది. అంటార్కిటికాపైన ఓజోన్‌కు పెద్ద రంధ్రం ఏర్పడింది. ఇప్పటివరకు భూమి ఉపరితలంపై సరాసరిగా 4% ఓజోన్‌ క్షీణించినట్లు తేలింది.

ఓజోన్‌ క్షీణత - ప్రభావాలు: 

* 4% ఓజోన్‌ తగ్గడం వల్ల 3% అతినీలలోహిత కిరణాలు భూమిని చేరుతున్నాయి. వీటి వల్ల మానవుల్లో కార్సినోమా, మెలనోమా అనే క్యాన్సర్లు వస్తున్నాయి.


* రక్తనాళాల్లో రక్తప్రవాహ రేటు పెరిగి, చర్మం ఎర్రబారి బొబ్బలు ఏర్పడుతున్నాయి.


* ల్యూకేమియా (బ్లడ్‌ క్యాన్సర్‌), స్త్రీలలో రొమ్ము క్యాన్సర్లు వస్తున్నాయి. కంటి సంబంధ వ్యాధులు కలుగుతున్నాయి.  


* డీఎన్‌ఏ ప్రభావితమై రోగనిరోధక శక్తి తగ్గుతోంది.


* మొక్కల్లో కిరణజన్య సంయోగక్రియ రేటు, పత్రాల్లో పత్రహరితం తగ్గి త్వరగా రాలిపోతున్నాయి. దాంతో ఉత్పాదకత, వృక్షసంపద తగ్గుతోంది.


* జీవ ఎరువుల్లో ఉపయోగించే సయనో బ్యాక్టీరియా అతినీల లోహిత కిరణాల వల్ల క్షీణించి పంట దిగుబడి తగ్గిపోతుంది. 


* ఓజోన్‌ పొర పలుచగా మారడం వల్ల భౌగోళిక ఉష్ణోగ్రతలు అధికం కావడంతో పాటు ధ్రువాల్లో మంచు కరిగి సముద్రనీటి మట్టం పెరుగుతుంది. ఆ విధంగా జరిగితే అనతికాలంలోనే మాల్దీవులు లాంటి ద్వీప దేశాలు కనుమరుగయ్యే ప్రమాదం ఉంది. 


ఓజోన్‌ క్షీణత అరికట్టేందుకు తీసుకుంటున్న చర్యలు


వియన్నా కన్వెన్షన్‌: ఆస్ట్రియా రాజధాని వియన్నాలో 1985లో జరిగిన సమావేశంలో ఓజోన్‌ క్షీణతకు సంబంధించి పలు సూచనలతో ఒప్పందం రూపొందింది. దీనిపై భారత్‌ సహా 20 దేశాలు సంతకాలు చేశాయి.


మాంట్రియల్‌ ప్రోటోకాల్‌ ఒప్పందం: కెనడాలోని మాంట్రియల్‌ నగరంలో 1987లో జరిగిన అంతర్జాతీయ ఒప్పందాన్ని 197 దేశాలు ఆమోదించాయి. దీనిపై 1992లో మనదేశమూ సంతకం చేసింది. 2000 నాటి కల్లా ప్రపంచవ్యాప్తంగా క్లోరోఫ్లోరో కార్బన్ల వినియోగాన్ని నిలిపేయాలని ఈ ప్రోటోకాల్‌లో నిర్ణయించారు. ఈ సమావేశం జరిగిన సెప్టెంబరు 16వ తేదీని ‘అంతర్జాతీయ ఓజోన్‌ దినోత్సవం’గా పాటించాలని ప్రపంచ వాతావరణ సంస్థ ప్రకటించింది. దీని ఆధ్వర్యంలో ‘గ్లోబల్‌ క్లైమేట్‌ అబ్జర్వింగ్‌ సిస్టమ్‌’, ‘వరల్డ్‌ వెదర్‌ వాచ్‌’ సంస్థలు పనిచేస్తుంటాయి. ఇవి ప్రపంచ శీతోష్ణ మార్పులపై వివరాలను సేకరిస్తాయి.


లండన్‌ సదస్సు: క్లోరోఫ్లోరో కార్బన్‌లకు ప్రత్యామ్నాయ సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయాలని, అభివృద్ధి చెందిన దేశాలు ఆ పరిజ్ఞానాన్ని తృతీయ ప్రపంచ దేశాలకు బదిలీ చేయాలని 1992లో లండన్‌లో జరిగిన సమావేశంలో నిర్ణయించారు. ఇప్పటికే అమెరికా, యూరోపియన్‌ యూనియన్‌ దేశాలు వీటిని పూర్తిగా నిషేధించాయి. 2030 కల్లా ఓజోన్‌ క్షీణతకు కారణమైన హైడ్రో ఫ్లోరో కార్బన్ల విడుదలను పూర్తిగా నియంత్రిస్తామని భారత్‌ ప్రకటించింది. ఈ మేరకు క్లోరోఫ్లోరో కార్బన్లకు బదులుగా 134-ఎ పదార్థాన్ని తయారుచేసి రిఫ్రిజిరేటర్లు, ఎయిర్‌ కండిషనర్లలో ఉపయోగిస్తున్నారు.


కిగాలి ఒప్పందం: హైడ్రో ఫ్లోరో కార్బన్లను నియంత్రించడమే లక్ష్యంగా 2016, అక్టోబరులో రువాండా రాజధాని కిగాలిలో ఒప్పందం కుదిరింది. ఇది మాంట్రియల్‌ ప్రొటోకాల్‌ ఒప్పందానికి జరిగిన సవరణ. క్లోరోఫ్లోరో కార్బన్లకు బదులుగా హైడ్రో ఫ్లోరో కార్బన్లు వాడిన దేశాలకు కూడా నష్టాన్ని వివరించి, నిషేధించాల్సిందిగా ఒప్పందం చేశారు. ఈ సమావేశంలో 197 దేశాలు పాల్గొన్నాయి. సభ్యదేశాలను మూడు గ్రూపులుగా విభజించారు. భారత్‌ను వీటిలో 3వ గ్రూప్‌లో చేర్చారు. ఓజోన్‌ పొర పరిరక్షణ కోసం ప్రపంచవ్యాప్తంగా అనేక సమావేశాలు, ఒప్పందాలు జరుగుతూనే ఉన్నప్పటికీ వాటి అమలులో చిత్తశుద్ధి కరవవుతోంది. ప్రతి దేశం సామాజిక బాధ్యతతో మెలిగి ఒప్పంద నియమాలను అమలుచేస్తేనే ప్రపంచానికి మేలు జరుగుతుంది.


 

రచయిత: జల్లు సద్గుణరావు


 

Posted Date : 16-10-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 జాతీయ పర్యావరణ పరిరక్షణ చర్యలు 

 ప్రకృతి సంరక్షణకు ప్రభుత్వం సంసిద్ధం! 


 

  అధిక జనాభా, నాగరిక జీవనం, విచ్చలవిడిగా వనరుల వినియోగం, ఆధునిక సాంకేతికత తదితరాల కారణంగా సహజ పర్యావరణం రోజురోజుకు క్షీణిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా నాగరికత విస్తరిస్తున్న ప్రతిచోటా నీరు, గాలి నాణ్యత తగ్గిపోతోంది. ఆ పరిస్థితిని, అలాంటి మానవ కార్యకలాపాలను నియంత్రించేందుకు, అభివృద్ధి ఏదైనా పర్యావరణహితంగా సాగే విధంగా చేసేందుకు చట్టబద్ధమైన యంత్రాంగాలు, నిబంధనలు అవసరమవుతాయి. ప్రకృతి సమతౌల్యాన్ని, వన్యప్రాణుల మనుగడను కాపాడటంతో పాటు నష్టాలను సాధ్యమైనంత మేర నివారించాలి. ఈ లక్ష్యాలతో దేశంలో చేసిన పర్యావరణ పరిరక్షణ చట్టాలు, ఏర్పాటు చేసిన సంరక్షణ కేంద్రాలు, వాటి ఉద్దేశాలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఉన్న అధికారాలను పోటీ పరీక్షార్థులు తెలుసుకోవాలి.


 


మానవుడు భూమిపై ఆవిర్భవించిన తర్వాత కొన్ని మిలియన్ల సంవత్సరాల పాటు ప్రకృతికి అనుగుణంగానే జీవించాడు. గత కొన్ని శతాబ్దాల నుంచి మానవ నాగరికత అభివృద్ధి చెందే క్రమంలో ఆర్థిక, సాంఘిక, సాంస్కృతిక అవసరాల కోసం ప్రకృతిని తనకు అనుకూలంగా మార్చుకొని జీవనం సాగించడం ప్రారంభించాడు. దాంతో ప్రకృతి వనరులు దెబ్బతినడం, తరిగిపోవడం మొదలైంది. శీతోష్ణస్థితిలో మార్పులకు కారణమైంది. పర్యావరణ సమస్యలు ఒక ప్రాంతానికి పరిమితం కావు. అవి జనబాహుళ్యానికి, జీవజాతుల మనుగడకు హాని కలిగిస్తాయి. అందువల్ల పర్యావరణ సమస్యల నివారణకు అంతర్జాతీయ స్థాయిలో సమావేశాలు, సదస్సులు, ఒప్పందాలు జరుగుతూనే ఉన్నాయి. వీటిలో భాగంగానే మన దేశంలో జాతీయ స్థాయిలో కొన్ని చట్టాలు చేశారు.


1972లో స్టాక్‌హోంలో ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో మొదటిసారి జరిగిన ‘మానవుడు - పర్యావరణం’ సదస్సు తర్వాత భారత ప్రభుత్వం రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 253ని అనుసరించి కొన్ని సవరణలు, చట్టాలు చేసింది. అందులో భాగంగా ప్రభుత్వం పర్యావరణాన్ని పరిరక్షించడానికి కృషి చేయాలని, అడవులు, వన్యప్రాణులను రక్షించాలని ఆర్టికల్‌ 48(ఎ) ద్వారా ఆదేశించింది. దేశంలోని ప్రతి పౌరుడు సహజ పర్యావరణాన్ని రక్షించాలని, అడవులను, వన్యప్రాణులను ఆదరించాలని ఆర్టికల్‌ 51(ఎ) చెబుతోంది. పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా 1980లో పర్యావరణ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేశారు. 1985లో దీన్ని పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖగా మార్చారు.


వన్యప్రాణి సంరక్షణ చట్టం-1972:  ఈ చట్టాన్ని భారత పార్లమెంటు 1972లో ఆమోదించింది. 2002లో సవరణలు చేశారు. దీని ప్రకారం ‘జాతీయ వన్యప్రాణి ప్రాధికార సంస్థ (నేషనల్‌ వైల్డ్‌ లైఫ్‌ అథారిటీ)’ అనుమతితో జాతీయ పార్కులు, వన్యప్రాణి సంరక్షణా కేంద్రాలు, బయోస్పియర్‌ రిజర్వులు ఏర్పాటు చేసి వాటి సరిహద్దులు నిర్ణయిస్తారు. వన్యప్రాణులు, పక్షుల వేటను నియంత్రించడం; వాటి ఉత్పత్తులతో జరిగే వాణిజ్యంపై నియంత్రణ; నిబంధనలను అతిక్రమిస్తే తగిన జరిమానాలు, శిక్షలు విధిస్తారు. రాష్ట్రాల్లో వన్యప్రాణి పరిరక్షణ సలహా బోర్డులను ఏర్పాటు చేస్తారు. ఈ చట్టం కింద మొదటగా అంతరించి పోతున్న మొక్కలతో పాటు జీవజాతుల జాబితాను సిద్ధం చేశారు. దాంతోపాటు పులిని జాతీయ జంతువుగా ప్రకటించారు. 1973 నుంచి పులుల సంరక్షణ కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది.


జలకాలుష్య నియంత్రణ చట్టం-1974: దీని ప్రకారం నీటి స్వచ్ఛతను మెరుగుపరచడం కోసం కేంద్ర, రాష్ట్ర స్థాయుల్లో కాలుష్య నియంత్రణ బోర్డులను ఏర్పాటు చేయవచ్చు. 1988లో సవరణలు చేసి మరింత బలోపేతం చేశారు. కాలుష్య నియంత్రణలు, ప్రమాణాలు పాటించని పరిశ్రమలను మూసివేసే అధికారాలను ఈ చట్టం రాష్ట్ర కాలుష్య నియంత్రణ బోర్డులకు కల్పించింది.

అటవీ పరిరక్షణ చట్టం-1980: స్థానిక గిరిజనులు కలపను పొందే హక్కులను హరిస్తూ, అటవీ ఉత్పత్తులను సేకరించుకోవడాన్ని నిషేధిస్తూ, పోడు వ్యవసాయం విధానాలను కట్టడి చేస్తూ బ్రిటిష్‌ ప్రభుత్వం 1927లో అటవీ చట్టాన్ని చేసింది. దీనికి సంస్కరణలు చేస్తూ భారత ప్రభుత్వం 1980లో అటవీ పరిరక్షణ చట్టాన్ని తీసుకొచ్చింది. 1988లో మరోసారి సవరించింది. దీని ప్రకారం కేంద్రం అనుమతి లేకుండా రాష్ట్ర ప్రభుత్వాలు తమ పరిధిలోని అడవుల అభివృద్ధి కార్యకలాపాలను అడ్డుకోకూడదు. గనుల తవ్వకాలు చేపట్ట కూడదు. అరణ్యాలను అభివృద్ధి కార్యకలాపాలకు వినియోగిస్తే ఆ మేరకు అటవీ విస్తీర్ణం పెంచాలి. అటవీ భూములను కాఫీ, తేయాకు, సుగంధద్రవ్యాలు, కొబ్బరి, ఔషధ మొక్కలు, ఉద్యాన పంటల కోసం ఉపయోగించకూడదు. వీటితోపాటు అటవీ వనరులను అవసరం మేరకు వాడుకుంటూ, దుర్వినియోగాన్ని అరికట్టి సుస్థిరతను పెంచే విధంగా అనేక నిబంధనలను చట్టంలో పొందుపరిచారు.


వాయుకాలుష్య నియంత్రణ చట్టం-1981: ఈ చట్టం ప్రకారం రాష్ట్రస్థాయి జలకాలుష్య నియంత్రణ బోర్డుల పరిధిని పెంచి, వాయుకాలుష్య నియంత్రణను కూడా అందులో  చేర్చారు. అంతేకాకుండా జలకాలుష్య నియంత్రణ బోర్డులు లేని రాష్ట్రాల్లో వాయుకాలుష్య నియంత్రణ బోర్డులను కొత్తగా ఏర్పాటు చేశారు. ఇవి వాయు ప్రమాణాలను మెరుగుపరచడం, వాయుకాలుష్య నిర్మూలనను చేపట్టడం తదితర విధులు నిర్వహిస్తాయి. 1987లో చట్టాన్ని సవరించి శబ్ద కాలుష్యాన్ని కూడా వాయుకాలుష్యంలో భాగంగా పేర్కొన్నారు.


పర్యావరణ పరిరక్షణ చట్టం-1986:  1986లో ఈ చట్టం చేశారు.  మనదేశంలో పర్యావరణ పరిరక్షణకు విశేష కృషి చేసిన మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జయంతి నవంబరు 19 నుంచి ఇది అమల్లోకి వచ్చింది. 1986లో జరిగిన భోపాల్‌ గ్యాస్‌ దుర్ఘటనను దృష్టిలో ఉంచుకొని, పర్యావరణ పరిరక్షణ కోసం అప్పటివరకు రూపొందించిన చట్టాలు, వ్యవస్థల్లో ఉన్న లోపాలను సవరిస్తూ,  రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 253ని అనుసరించి చట్టాన్ని తీసుకొచ్చారు. పర్యావరణ పరిరక్షణకు, మెరుగుకు చర్యలు తీసుకోవడానికి కేంద్ర ప్రభుత్వానికి, ఆ చర్యలను సమన్వయపరచడానికి రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ చట్టం అధికారం కల్పించింది.


పర్యావరణ పరిరక్షణకు, పర్యావరణ నాణ్యతను మెరుగుపరిచేందుకు, కాలుష్యాన్ని నివారించేందుకు ఈ చట్టంలోని షెడ్యూళ్లు 1-4 ప్రకారం కొన్ని నిబంధనలు రూపొందించారు. ఇవి విసర్జిత వ్యర్థపదార్థాలు, ప్రాంతాలను బట్టి మారుతూ ఉంటాయి. ఉదాహరణకు నీటిలోకి వదిలిన వ్యర్థ పదార్థాల గరిష్ఠ పరిమితి 30 PPM ఉండాలి. ఒకవేళ తూముల్లోకి వదిలితే 350 PPM ఉండవచ్చు. భూతలంపై లేదా కోస్తా ప్రాంతానికి వదిలితే 100 PPM ఉండవచ్చు. ఈ చట్టం ప్రకారం పర్యావరణ పరిరక్షణకు కొన్ని ముఖ్య నిబంధనలను ప్రవేశపెట్టారు. అవి * ప్రమాదకర వ్యర్థాల నిర్వహణ నిబంధనలు - 1989 

* ప్రమాదకర రసాయనాల ఉత్పత్తి, నిల్వ, దిగుమతులపై నిబంధనలు - 1989 

* హానికర సూక్ష్మజీవులు/జన్యుపరంగా అభివృద్ధి చేసిన జీవులు, కణాల ఉత్పత్తి, వాడకం, దిగుమతి, ఎగుమతి నిల్వలపై నిబంధనలు - 1989 

* జీవ, వైద్య సంబంధిత వ్యర్థాల నిర్వహణ కలిగి ఉండటంపై నిబంధనలు - 1998 


* రీ సైకిల్డ్‌ ప్లాస్టిక్‌ ఉత్పత్తి వాడకంపై నిబంధనలు - 1999  * మున్సిపల్‌ ఘన వ్యర్థపదార్థాల నిర్వహణ చట్టం - 2000


ఎకో మార్క్‌-1991: దీన్ని బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్డ్‌ సంస్థ ఏర్పాటు చేసింది. పర్యావరణానికి హాని కలిగించని ఉత్పత్తులకు ఎకో మార్క్‌ సర్టిఫికెట్‌ను ఈ సంస్థ జారీ చేస్తుంది. పర్యావరణంపై ప్రభావం చూపించే ఉత్పత్తులకు అనుమతులు ఇవ్వదు.


జాతీయ పర్యావరణ ట్రైబ్యునల్‌ చట్టం-1995:  వాణిజ్య, ఆర్థిక కార్యకలాపాలు జరిపేటప్పుడు వ్యక్తులు/ఆస్తులు/పర్యావరణానికి నష్టం జరిగితే తగిన పరిహారం ఇప్పించేందుకు ఈ చట్టాన్ని అమల్లోకి తెచ్చారు.


జీవవైవిధ్య చట్టం-2002: అంతర్జాతీయ జీవవైవిధ్య కన్వెన్షన్‌ 1992, జూన్‌ 5న యూఎన్‌ఓ ఆధ్వర్యంలో బ్రెజిల్‌లోని రియో డి జెనీరొలో జరిగింది. ఈ కన్వెన్షన్‌లో భాగంగా భారత ప్రభుత్వం 2000లో జీవవైవిధ్యంపై జాతీయ విధానాలను, కార్యాచరణ వ్యూహాన్ని విడుదల చేసింది. దీని అమలు కోసం 2002, డిసెంబరులో జీవవైవిధ్య చట్టాన్ని చేసింది. దాని ప్రకారం కేంద్ర, రాష్ట్ర, స్థానిక బోర్డులతో కూడిన మూడంచెల వ్యవస్థ ఏర్పాటైంది. జీవవైవిధ్యాన్ని పరిరక్షించడం; జీవచౌర్యాన్ని అరికట్టడం; వృక్ష, జంతు జాతుల జన్యు వనరుల దోపిడీని నియంత్రించడం దాని ముఖ్య విధులు.


షెడ్యూల్డ్‌ తెగల అటవీ హక్కుల గుర్తింపు చట్టం-2006: గిరిజనులకు అటవీ ఉత్పత్తులపై హక్కులు కల్పిస్తూ, అటవీ వనరుల సంరక్షణ, గిరిజన తెగల జీవన చర్యలను సమీకృతం చేయడం దీని ప్రధాన ఉద్దేశం. సహజ వనరులను సంరక్షిస్తూ, గిరిజన సమాజాల్లో పేదరిక నిర్మూలన, అభివృద్ధి కార్యకలాపాలను చేపట్టడం ద్వారా వారి జీవన విధానాన్ని పెంపొందిస్తారు.


నేషనల్‌ గ్రీన్‌ ట్రైబ్యునల్‌ బిల్లు-2010: పర్యావరణ న్యాయస్థానాలను ఏర్పాటు చేయమని 2003, సెప్టెంబరులో భారత న్యాయ వ్యవహారాల కమిషన్‌ తన 186వ నివేదికలో కోరింది. ఆ మేరకు ఈ బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టింది. దీని ప్రధాన కార్యాలయం భోపాల్‌లో ఉంది. పర్యావరణ చట్టాలను అమలు చేయడానికి, ప్రజలందరికీ పర్యావరణ హక్కులను కల్పించడానికి దీన్ని రూపొందించారు. పర్యావరణ కాలుష్యంతో హాని జరిగిన ఏ వ్యక్తికైనా హాని కలిగితే ఈ ట్రైబ్యునల్‌ ద్వారా పరిహారం పొందొచ్చు.


పర్యావరణ ప్రభావ మదింపు (ఎన్విరాన్‌మెంటల్‌ ఇంపాక్ట్‌ అసెస్‌మెంట్‌- ఈఐఏ): బహుళార్థ సాధక ఆనకట్టల నిర్మాణం, భారీ పరిశ్రమల ఏర్పాటు లాంటి పర్యావరణ కార్యక్రమాల వల్ల అడవుల నిర్మూలన, జంతువులు నశించడం; నేల, నీరు, వాయు కాలుష్యాలు ఏర్పడి సహజ పర్యావరణం దెబ్బతింటుంది. అందువల్ల అలాంటి పర్యావరణ భారీ మార్పును ఈఐఏ విధానం ద్వారా బేరీజు వేసుకుని,  ప్రభావాల ఉద్ధృతిని తగ్గించి, పర్యావరణ సమతౌల్యతకు, జీవ నాణ్యత విలువలు పెంచడానికి ప్రత్యామ్నాయ మార్గాలు రూపొందించడానికి వీలవుతుంది. పర్యావరణ ప్రతికూల పరిస్థితుల తీవ్రతను తగ్గించడానికి ముందుగానే అనుకూల మార్గాలు ఏర్పాటు చేసుకోవచ్చు. అమెరికా 1970లోనే జాతీయ పర్యావరణ విధానాన్ని చట్టబద్ధం చేసి మొదటిసారిగా అమలుచేసింది. ఈ విధానం నేడు ప్రపంచానికే మార్గదర్శకంగా మారింది. భారతదేశం ఈఐఏ విధానాన్ని 1994 నుంచి రూపొందించినప్పటికీ, 1986లోనే పర్యావరణ చట్టం చేసినప్పటి నుంచి ప్రాజెక్టుల నిర్మాణానికి, ప్రణాళికల రూపకల్పనకు ముందస్తు అనుమతి తీసుకోవాలనే షరతును అమలుచేస్తోంది.

రచయిత: జల్లు సద్గుణరావు


 

Posted Date : 02-11-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

అతిపెద్ద స్థిర ఆవాసం సముద్రమే!

ఆవరణ వ్యవస్థ

జీవులు, వాటి పరిసరాలకు మధ్య ఉండే సంబంధాన్ని అధ్యయనం చేసే శాస్త్రాన్ని పర్యావరణ శాస్త్రం/ఆవరణ శాస్త్రం అంటారు. ఇంగ్లిష్‌లో  ఇకాలజీగా వ్యవహరిస్తారు. ఆవరణ శాస్త్ర నిర్మాణాత్మక, క్రియాత్మక ప్రమాణం ఆవరణ వ్యవస్థ. ఏదైనా ఒక భౌగోళిక ప్రాంతంలో జీవ, నిర్జీవ కారకాల మధ్య పరస్పరం జీవ-భూరసాయన వలయాల ద్వారా శక్తి, పోషకాల మార్పిడి జరిగే నిర్దిష్ట భౌగోళిక ప్రాంతాన్ని ఆవరణ వ్యవస్థ అంటారు. ఇది సహజ, కృత్రిమ ఆవరణ వ్యవస్థలుగా ఉంటుంది. ఇందులో సముద్రాన్ని అత్యంత స్థిరమైన ఆవరణ వ్యవస్థ పరిగణిస్తారు. జీవులు, నిర్జీవుల మధ్య సంబంధాలు, ఆహార గొలుసు, ఆహార జాలం, జీవావరణ పిరమిడ్, జీవ భూరసాయన వలయాలు, గతిశీలత, ఉత్పాదన లాంటి అంశాలను వివరించే ఈ వ్యవస్థ గురించి అభ్యర్థులు సమగ్రంగా తెలుసుకోవాలి.

1.    కిందివాటిలో ఆవరణశాస్త్ర అధ్యయనంలో ముఖ్య అంశం?

1) పర్యావరణ కారకాలు

2) పర్యావరణంపై వృక్షజాతుల ప్రభావం

3) పర్యావరణానికి అనుకూలంగా వృక్షాల అనుకూలత

4) జీవులకు, వాటి పరిసరాలకు మధ్య సంబంధం


2.     ‘ఆవరణ శాస్త్రం (Ecology)’ అనే పదాన్ని మొదటిసారిగా ఉపయోగించింది?

1) టేలర్‌     2) కార్ల్‌ రీటర్‌ 

3) థామ్సన్‌     4) ఎర్నెస్ట్‌ హెకెల్‌


3.     ‘సినికాలజీ’ అనే ఆవరణ శాస్త్ర విభాగం కిందివాటిలో దేని గురించి అధ్యయనం చేస్తుంది?

1) ఒకటి కంటే ఎక్కువ జాతులు    2) ఒకే జాతి జీవులు

3) ఒకటి కంటే ఎక్కువ జంతు జాతులు   4) ఒకటి కంటే ఎక్కువ వృక్ష జాతులు


4.     ‘ఇకలాజికల్‌ పిరమిడ్‌’ అనే భావనను ప్రతిపాదించిన శాస్త్రవేత్త?

1) టాన్స్‌లే              2) స్మిత్‌  

3) చార్లెస్‌ ఎల్టన్‌          4) వెబ్‌స్టర్‌


5.     ‘ఆవరణ వ్యవస్థ’ అనే పదాన్ని ప్రతిపాదించింది?

1) ఎర్నెస్ట్‌ హెకెల్‌        2) టాన్స్‌లే 

3) ఒడమ్‌              4) చార్లెస్‌ ఎల్టన్‌ 


6.     ‘ఇకలాజికల్‌ నిషే’ అనే పదం కిందివాటిలో దేన్ని నిర్వచిస్తుంది? 

1) ఒక జాతి జీవులు నివసించే ఆవాసం

2) ఒక జీవసముదాయంలో భిన్నజాతులు నిర్వర్తించే విధులు

3) ఒక జీవి తినే ఆహార రకాన్ని, ఆహార సేకరణ కోసం ఏ జాతులతో పోటీతత్వాన్ని కలిగి ఉంటుందో ఆ ప్రదేశాన్ని తెలియజేస్తుంది

4) పైవన్నీ


7.     ఒకదాంతో మరొకటి అనుసంధానమై ఉండే ఒకటి కంటే ఎక్కువ ఆహారపు గొలుసుల సముదాయాన్ని ఏమని విధంగా పిలుస్తారు?

1) శక్తి పిరమిడ్‌లు     2) ఆహారపు శృంఖలం

3) పోషక వలయం     4) ఆహారపు జాలం


8.     కింది ఏ ఆవరణ వ్యవస్థలో అత్యధిక స్థూల ప్రాథమిక ఉత్పాదన రేటు ఎక్కువగా ఉంటుంది?

1) గడ్డిమైదాన      2) మాంగ్రూవ్‌  

3) ఉష్ణమండల     4) టండ్రా


9.     ఒక జీవి ఇంకొక జీవిని తినడం ద్వారా, ఆ జీవి మరొక జీవికి ఆహారంగా వినియోగపడటం ద్వారా ఏర్పడే క్రియాశీలక వ్యవస్థ?

1) ఆహారపు జాలం        2) ఆహారపు వల 

3) ఆహారపు గొలుసు    4) జీవావరణ పిరమిడ్‌ 


10. శాకాహారుల నుంచి ఆహారాన్ని పొందే జీవులను ఏమని పిలుస్తారు?

1) ప్రాథమిక వినియోగదారులు     2) ద్వితీయ వినియోగదారులు  

3) తృతీయ వినియోగదారులు     4) అంతిమ వినియోగదారులు  


11. ఆవరణ వ్యవస్థలో పోషకాలు జీవులకు, పరిసరాలకు మధ్య చక్రీయంగా బదిలీ అయ్యే విధానాన్ని ఏమని పిలుస్తారు?

1) భూవిజ్ఞాన వలయం         2) భూరసాయన వలయం

3) భూజీవ వలయం     4) జీవ భూరసాయన వలయం


12. ఏ ఆహారపు గొలుసులోనైనా అత్యధిక సంఖ్యలో ఏ జనాభా ఉంటుంది? 

1) ప్రాథమిక వినియోగదారులు     2) తృతీయ వినియోగదారులు 

3) ఉత్పత్తిదారులు    4) విచ్ఛిన్నకారులు 


13. ఏ ఆవరణ వ్యవస్థలో అయినా ఆకుపచ్చని మొక్కలు ఏ విధి పూర్వకస్థాయిని కలిగి ఉంటాయి?

1) విచ్ఛిన్నకారులు     2) ఉత్పత్తిదారులు 

3) వినియోగదారులు     4) రూపాంతరీకరణులు


 14. కిందివాటిలో అతిపెద్ద కార్బన్‌ శోషకంగా పనిచేసేది?

1) పంట మొక్కలు     2) సముద్రాలు 

3) ఉష్ణమండల వర్షారణ్యాలు     4) సమశీతోష్ణ అడవులు


15. కింది గడ్డిమైదాన ఆహారపు గొలుసులో నిజమైన క్రమానుగత శ్రేణిని గుర్తించండి.

1) గడ్డి - కీటకాలు - పక్షులు - పాములు 

2) గడ్డి - పాములు - కీటకాలు - జింకలు 

3) గడ్డి - నక్కలు - జింకలు - ఎద్దులు 

4) బ్యాక్టీరియాలు - గడ్డి - ఎలుకలు - నక్కలు 


16. కింది ప్రవచనాలను పరిశీలించి సరైన వాటిని గుర్తించండి.

ఎ) శక్తి పిరమిడ్లు అన్నీ నిట్టనిలువుగా ఉంటాయి.

బి) జీవద్రవ్యరాశి పిరమిడ్లు కొన్ని నిట్టనిలువుగా, మరికొన్ని తలకిందులుగా ఉంటాయి. 

సి) సంఖ్యా పిరమిడ్లు కొన్ని నిట్టనిలువుగా, మరికొన్ని తలకిందులుగా ఉంటాయి.

డి) శక్తి పిరమిడ్లు కొన్ని నిట్టనిలువుగా, మరికొన్ని తలకిందులుగా ఉంటాయి.

1) ఎ, బి, సి         2) ఎ, సి, డి    

3) బి, సి, డి        4) ఎ, బి, సి, డి


17. ఆస్ట్రేలియా తూర్పు తీరం వెంబడి ఉన్న గ్రేట్‌ బ్యారియర్‌ రీఫ్‌ అనేది-     

1) ఒక జనాభా       2) ఒక జీవ సముదాయం 

3) ఒక బయోన్‌      4) ఒక ఆవరణ వ్యవస్థ 


18. సముద్ర ఆవరణ వ్యవస్థలో ఫైటోప్లాంక్టాన్స్‌ (వృక్ష ప్లవకాలు) ఉత్పత్తి ఆగిపోతే కింది ఏ పరిణామాలు సంభవిస్తాయి?

1) సముద్రాలు కార్బన్‌ సింక్‌గా తమ విధిని నిర్వర్తించలేవు. 

2) సముద్ర ఆవరణ వ్యవస్థ ఆహార శృంఖలం విచ్ఛిన్నమవుతుంది.

3) సముద్రాల్లో చేపల ఉత్పత్తి దెబ్బతింటుంది.   4) పైవన్నీ


19. కిందివాటిలో భూగోళంలో కార్బన్‌ వలయానికి, కార్బన్‌ డై ఆక్సైడ్‌ను అందించని అంశం ఏది?    

1) కిరణజన్యసంయోగ క్రియ    2) శ్వాసక్రియ

3) జీవ విచ్ఛిన్నత        4) అగ్నిపర్వత విస్ఫోటం


20. జీవావరణ అనుక్రమం (ఎకలాజికల్‌ ససెషన్‌) అంటే....?

1) పర్వత ప్రాంతాల్లో వివిధ అక్షాంశాల వద్ద ఒక జాతి జీవుల స్థానంలో మరొక జాతి ఆవిర్భవించడం.

2) భౌతిక పరిస్థితుల వల్ల ఏదైనా ఆవరణ వ్యవస్థలో కాలం, ప్రాంతాలను బట్టి శీతోష్ణస్థితిలో వచ్చే మార్పులకు అనుగుణంగా ఒక జీవ సమాజ స్థానంలో మరొక జీవసమాజం ఆవిర్భావం చెందడం.

3) ఒకేసారి అనేక జాతుల జీవులు ఒకే ప్రాంతంలో ఆవిర్భవించడం.

4) ఆహార శృంఖలంలో వరుసగా ఉత్పత్తిదారుల నుంచి శాకాహారులు; శాకాహారుల నుంచి  మాంసాహారులు స్థిరీకరించడం.


21. ఒక నిర్దిష్ట భౌగోళిక ప్రాంతంలో ఒకే జాతికి చెందిన, ఒకే జీవన విధానాన్ని కలిగి జన్యుపరమైన వినిమయాలున్న సమూహాన్ని ఏమని పిలుస్తారు?    

1) జీవ సమాజం     2) జనాభా  

3) ఎకోటైప్‌     4) ఆవరణ వ్యవస్థ


22. కిందివాటిలో కృత్రిమ ఆవరణ వ్యవస్థను గుర్తించండి.

1) కొలను      2) పంటభూమి 

3) అడవి     4) మాంగ్రూవ్‌


23. కిందివాటిలో అత్యంత స్థిరమైన ఆవరణ వ్యవస్థ ఏది?

1) పర్వతం     2) అడవి     

3) ఎడారి     4) మహాసముద్రం


24. కిందివాటిలో వేటిని ‘ప్రకృతి పాకీపనివారు’ అని పిలుస్తారు?

1) కీటకాలు     2) సూక్ష్మజీవులు 

3) మానవుడు      4) జంతువులు


25. ‘కాంతి, పోషకాలు, ఆవాసాల కోసం తీవ్రంగా పోటీ’ అనేది ఏ జాతుల మధ్య ఉంటుంది?

1) విభిన్న నిషేల్లో నివసిస్తున్న ఒకే జాతికి చెందిన జీవుల మధ్య

2) ఒకే నిషేలో నివసిస్తున్న ఒకే జాతి జీవుల మధ్య

3) ఒకే నిషేలో నివసిస్తున్న భిన్న జాతి జీవుల మధ్య 

4) విభిన్న నిషేల్లో నివసిస్తున్న విభిన్న జాతి జీవుల మధ్య


26. జీవావరణ అనుక్రమంలో అంతిమ జీవ సమాజాలను ఏమని పిలుస్తారు?

1) క్లైమాక్స్‌       2) సెర్‌     

3) పయోనీర్స్‌          4) కార్నిఓరస్‌


27. ప్రపంచంలో అతి పెద్ద ఆవరణ వ్యవస్థ?

1) గడ్డిభూములు      2) సరస్సులు  

3) సముద్రాలు      4) అడవులు


28. ఆవరణ వ్యవస్థలో కొంత నిర్దిష్ట సమయంలో  శ్వాసక్రియలో వినియోగమైన కర్బన పదార్థాలతో సహా కాంతిశక్తి కిరణజన్య సంయోగక్రియ ద్వారా రసాయనిక శక్తిగా మార్పు చెందుతుంది. ఇలా ఏర్పడిన మొత్తం ఉత్పత్తి రేటును.... అంటారు.

1) నికర ద్వితీయ ఉత్పాదన         2) స్థూల ప్రాథమిక ఉత్పాదన 

3) నికర ప్రాథమిక ఉత్పాదన        4) స్థూల ద్వితీయ ఉత్పాదన


29. కిందివాటిలో ఆహరపు గొలుసుకు సంబంధించి నిజమైన దాన్ని గుర్తించండి.

1) వృక్ష ప్లవకాలు - జంతు ప్లవకాలు - చిన్న చేపలు - పెద్ద చేపలు - కొంగలు 

2) వృక్ష ప్లవకాలు - చిన్న చేపలు - జంతు ప్లవకాలు - పెద్ద చేపలు - కొంగలు 

3) జంతు ప్లవకాలు - వృక్ష ప్లవకాలు - చిన్న చేపలు - పెద్ద చేపలు  - తిమింగలాలు 

4) చిన్న చేపలు - వృక్ష ప్లవకాలు  - జంతు ప్లవకాలు - పెద్ద చేపలు - తిమింగలాలు


30. మృత కళేబరాలు - బ్యాక్టీరియా/శిలీంధ్రాలు - వృక్ష ప్లవకాలు - జంతు ప్లవకాలు - చిన్న చేపలు - పెద్ద చేపలు - కొంగలు - తిమింగలాలు.

పైన తెలిపిన ఆహారపు గొలుసు కిందివాటిలో ఏ రకానికి చెందింది?

1) మేత ఆహారపు గొలుసు 

2) భౌమ ఆవరణ వ్యవస్థలోని పూతికాహారపు గొలుసు

3) జలావరణ వ్యవస్థలోని పూతికాహారపు గొలుసు

4) పరాన్నజీవ ఆహారపు గొలుసు


31. కింది ఏ ఆవరణ వ్యవస్థలో జీవద్రవ్యరశి పిరమిడ్‌ తలకిందులుగా ఉంటుంది?

1) కొలను     2) అడవి 

3) గడ్డిభూమి      4) మాంగ్రూవ్స్‌


32. ఎకలాజికల్‌ పిరమిడ్స్‌కు సంబంధించి కింది వాటిలో తప్పుగా పేర్కొన్న వాక్యాన్ని గుర్తించండి.

1) శక్తి పిరమిడ్‌ సముద్ర ఆవరణ వ్యవస్థలో తలకిందులుగా ఉంటుంది.

2) జీవద్రవ్యరాశి పిరమిడ్‌ మంచినీటి ఆవరణ వ్యవస్థలో తలకిందులుగా ఉంటుంది.

3) సంఖ్యా పిరమిడ్‌లు గడ్డిమైదాన ఆవరణ వ్యవస్థలో నిట్టనిలువుగా ఉంటాయి.

4) జీవద్రవ్యరాశి పిరమిడ్లు గడ్డి మైదాన ఆవరణ వ్యవస్థలో నిట్టనిలువుగా ఉంటాయి.


33. ఆవరణ వ్యవస్థలో శక్తి ఏ దిశలో బదిలీ అవుతుంది?

1) రేఖీయంగా  2) పురోగామి  3) అచక్రీయంగా 4) చక్రీయంగా


34. ఏ ఆహారపు గొలుసులోనైనా గరిష్ఠంగా ఎన్ని పోషక స్థాయులు ఉంటాయి?

1) 2  2) 2 లేదా 3  3) 3 లేదా 4 4) 4 లేదా 5


35. జలావరణ వ్యవస్థల్లో ఆక్సిజన్‌ సమృద్ధిగా లభించే ప్రాంతాన్ని ఏమని పిలుస్తారు?

1) యుఫోటిక్‌ మండలం 2) ఫోటిక్‌ మండలం 3) ఎఫోటిక్‌ మండలం 4) ఏవీకావు 


36. కింది ప్రవచనాలను పరిశీలించి, సరైంది గుర్తించండి.

ఎ) ఆవరణ వ్యవస్థ అనేది ఒక చదరపు సెం.మీ. పరిధినైనా కలిగి ఉండొచ్చు లేదా జీవావరణం అంతా ఒక ఆవరణ వ్యవస్థ ఉండొచ్చు.

బి) ఆవరణ వ్యవస్థలో ఒకదాని నుంచి మరొకటి స్వతంత్రంగా ఉంటాయి.

1) 1 మాత్రమే సరైంది   2) 2 మాత్రమే సరైంది  3) 1, 2 సరైనవి 4) 1, 2 సరికావు 


37. కింది ప్రవచనాలను పరిశీలించి సరైంది గుర్తించండి. 

ఎ) ఆవరణ వ్యవస్థ అనేది ఒక సంవృత వ్యవస్థ.

బి) ఆవరణ వ్యవస్థ అనేది ఆవరణ శాస్త్రానికి చెందిన ఒక ప్రాథమిక, క్రియాత్మక, నిర్మాణాత్మక ప్రమాణం.

పైన తెలిపిన వాటిలో నిజమైన వాక్యాన్ని తెలపండి

1) ఎ మాత్రమే  2) బి మాత్రమే 3) 1, 2  4) ఏదీకాదు


38. జతపరచండి.

జాబితా - 1                     జాబితా - 2

1) శాకాహారులు               1) జంతువుల నుంచి మాత్రమే ఆహారాన్ని పొందుతాయి

2) మాంసాహారులు             2) వృక్షాలు, జంతువుల నుంచి ఆహారాన్ని పొందుతాయి

3) సర్వభక్షకులు               3) కుళ్లిన మృతకళేబరాల నుంచి ఆహారాన్ని పొందుతాయి

4) పూతికాహారులు              4) మొక్కల నుంచి మాత్రమే ఆహారాన్ని పొందుతాయి

1) 1-డి, 2-ఎ, 3-బి, 4-సి   2) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి

3) 1-సి, 2-డి, 3-ఎ, 4-బి   4) 1-బి, 2-సి, 3-ఎ, 4-డి


39. కింది ప్రవచనాలను పరిశీలించి, సరైంది గుర్తించండి.

ఎ) ఆవరణ వ్యవస్థ అనే భావనను మొదటిసారిగా 1950లో ఎ.జి. టాన్స్‌లే ప్రతిపాదించాడు.

బి) నేలలోని నత్రజని స్థాపక బ్యాక్టీరియాల సంఖ్యలో ఏ మాత్రం మార్పు వచ్చినా ఆవరణ వ్యవస్థలో అనూహ్యమైన మార్పులు సంభవించి, దాని సమతౌల్యం దెబ్బతింటుంది.

1) ఎ మాత్రమే 2)  బి మాత్రమే  3) రెండూ   4) ఏదీకాదు



సమాధానాలు

1-4; 2-2; 3-1; 4-3; 5-2; 6-4; 7-4; 8-3; 9-3; 10-2; 11-4; 12-3; 13-2; 14-2; 15-1; 16-1; 17-4; 18-4; 19-1; 20-2; 21-2; 22-2; 23-4; 24-2; 25-2; 26-1; 27-3; 28-2; 29-1; 30-3; 31-1; 32-1; 33-1; 34-4; 35-1; 36-1; 37-2; 38-1; 39-2. 


రచయిత: ఇ.వేణుగోపాల్‌
 

Posted Date : 20-11-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

పర్యావరణ అనుకూల అభివృద్ధి విధానాలు

భావితరాల క్షేమం కోరే ప్రగతి సుస్థిరం!

ప్రకృతి సిద్ధంగా లభించిన వనరులను అభివృద్ధి పేరుతో ఎన్నో దేశాలు విచ్చలవిడిగా వినియోగించుకుంటున్నాయి. స్వార్థం, తాత్కాలిక ప్రయోజనాల కోసం భవిష్యత్తు తరాల ఉనికిని ప్రమాదంలో పడేస్తున్నాయి. దీని పర్యవసానంగా పర్యావరణ క్షీణత, భూతాపం పెరిగిపోయి సమస్త మానవాళి దుష్పరిణామాలను ఎదుర్కొంటోంది. ప్రకృతి బాగుంటేనే మనిషి బాగుంటాడని, భవిష్యత్తు తరాల ప్రయోజనాలకు విఘాతం లేకుండా ప్రస్తుత అవసరాలను తీర్చేదే అసలైన అభివృద్ధి అన్న స్పృహ ఇప్పుడిప్పుడే క్రమంగా పెరుగుతోంది. ఈ క్రమంలో ప్రభుత్వాలు అమలుచేస్తున్న పర్యావరణ అనుకూల విధానాల గురించి పోటీ పరీక్షల అభ్యర్థులకు అవగాహన ఉండాలి. వనరులను సమర్థంగా వినియోగించుకునే పద్ధతులు, ఆధునిక పునరుత్పాదక వనరులు, వాటి ప్రయోజనాలు, జీవన నాణ్యతను పెంచే పరిణామాలను తెలుసుకోవాలి.

ప్రస్తుత ప్రజల కనీస అవసరాలు తీరుస్తూ భవిష్యత్తు తరాలకు వనరులను మిగిల్చే విధంగా, వాటిని వివేకవంతంగా (జ్యుడీషియస్‌ యుటిలైజేషన్‌) వినియోగిస్తూ సాధించే అభివృద్ధినే ‘సుస్థిరాభివృద్ధి’ అంటారు. అంటే భావితరాల అవసరాలను విస్మరించకుండా ఇప్పటి అభివృద్ధి ఉండాలని అర్థం. అయితే మానవ సంక్షేమాన్ని పెంపొందించుకోవడానికి అభివృద్ధి ఒక్కటే సరిపోదు. పర్యావరణ సంరక్షణతో కూడిన వనరుల వినియోగం, పునఃకల్పనల మధ్య సమతౌల్యతను ఏర్పరిచి అభివృద్ధి కొనసాగిస్తే నిజమైన సుస్థిరాభివృద్ధి సాధ్యమవుతుంది. పెరుగుతున్న జనాభా అవసరాల కోసం సహజ వనరులను పరిమితికి మించి వినియోగించడం వల్ల భూ, జలవనరులు; వాతావరణం కలుషితమై అనేక పర్యావరణ సమస్యలకు దారితీస్తుంది. అందువల్ల పర్యావరణాన్ని పరిరక్షించుకుంటూ సుస్థిరాభివృద్ధి సాధించడం అవసరంగా మారింది. సమగ్ర అభివృద్ధి సాధించడానికి వివిధ నూతన పర్యావరణ అనుకూల అభివృద్ధి విధానాలను ఆయా రంగాల్లో అనుసరిస్తున్నారు.

సేంద్రియ వ్యవసాయం: వ్యవసాయ పంటలు, పశుసంపదలో ఉత్పత్తి, ఉత్పాదకతలను పెంచుకోవడానికి పర్యావరణానికి హాని చేసే రసాయనిక పురుగు మందులు, ఎరువులు, జన్యుమార్పిడి జీవులు, వృద్ధి హార్మోన్లను ఇటీవల ఉపయోగిస్తున్నారు. వీటి స్థానంలో పర్యావరణానికి అనుకూలమైన జీవ ఎరువులను వినియోగించి చేసే వ్యవసాయ విధానాన్ని సేంద్రియ వ్యవసాయం అంటారు. సేంద్రియ వ్యవసాయ పితామహుడిగా ‘సర్‌ ఆల్బర్ట్‌ హూవార్డ్‌’ని పిలుస్తారు. మన దేశంలో సిక్కింను మొదటి సేంద్రియ వ్యవసాయ (ఆర్గానిక్‌ ఫార్మింగ్‌) రాష్ట్రంగా ప్రకటించారు. ఈ తరహా వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకే ఉత్తర్‌ ప్రదేశ్‌లోని ఘాజియాబాద్‌లో ‘నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ ఆర్గానిక్‌ ఫార్మింగ్‌ సంస్థ’ను స్థాపించారు.


జీవ ఎరువులు: పర్యావరణాన్ని పరిరక్షిస్తూ భూసారాన్ని పెంచే సూక్ష్మజీవులు, వాటి మిశ్రమాన్ని జీవ ఎరువులు అంటారు. ఈ సూక్ష్మజీవులు మొక్కలతో సహజీవనం చేస్తూ పంటకు కావాల్సిన అనేక పోషకాలను అందజేస్తాయి. వీటిలో పలు రకాలున్నాయి.


ఉదా: 

* జనుము, సుబాబుల్‌ చెట్ల ఆకులు, కొమ్మలను ఎరువుగా వాడుకునే హరిత ఎరువు.

 * నాస్టాక్, అనబీనా లాంటి నీలి ఆకుపచ్చ శైవలాలు. 

* వేరు బుడిపెల్లో నివసించే రైజోబియం, స్వేచ్ఛాయుత నత్రజని స్థాపన జరిపే అజటోబాక్టర్, క్లాస్ట్రీడియం లాంటి బ్యాక్టీరియాలు.

* ఎత్తయిన మొక్కల వేర్లపై పెరిగి భూమి నుంచి ఫాస్ఫేట్లు, సల్ఫేట్లు, కాపర్, జింక్, ఇనుము లాంటి పోషకాలను మొక్కలకు అందించే శిలీంధ్రాలు జీవ ఎరువులుగా ఉపయోగపడతాయి.

* వరి పంట పొలాల్లో జీవ ఎరువుగా వాడే మొక్క ‘అజొల్లా లేదా టెరిడోఫైట్‌’.


జీవ క్రిమిసంహారాలు: పర్యావరణానికి హానిచేసే రసాయన క్రిమిసంహారాల స్థానంలో పర్యావరణ అనుకూల క్రిమిసంహారాలను వినియోగించడాన్ని జీవ క్రిమిసంహారాలు అంటారు. పంట మొక్కలు, ఉత్పత్తులను నష్టపరిచే తెగుళ్లు, క్రిమికీటకాలు, కీటక డింభకాలను అరికట్టే క్రిమిసంహారిణులను; మొక్కలు, జంతువులు, సూక్ష్మజీవులు లాంటి ప్రకృతిపరమైన వాటి నుంచి తీసే ఉత్పత్తులను జీవ క్రిమిసంహారాలు అంటారు.


ఉదా: పత్తి పంటను నష్టపరిచే బోల్‌వార్మ్‌ నివారణకు వాడే బాసిల్లస్‌ తురింజియెన్సిస్‌ లాంటి బ్యాక్టీరియాలు, విరిడే కుటుంబానికి చెందిన వైరస్‌లు, బావేరియా బాసియానా, ట్రైకోడెర్మా లాంటి శిలీంధ్రాలు; కలుపు మొక్కల నివారిణిగా ఉపయోగించే యూకలిప్టస్‌ నూనె, టమాట పంటలో కీటక నాశినిగా ఉపయోగించే లెగ్యూమ్‌ జాతి మొక్కల వేర్ల నుంచి తయారుచేసిన రొటెనాన్‌ లాంటి ఉత్పత్తులను జీవ క్రిమిసంహారాలుగా వాడటం వల్ల పర్యావరణ కాలుష్యం, బయోమాగ్నిఫికేషన్‌ జరగదు.


పునరుత్పాదక ఇంధన వనరులు: వాడేకొద్దీ తిరిగి పునరుత్పత్తి చెందే సామర్థ్యం ఉన్న కాలుష్య రహితమైన ఇంధన వనరులను పునరుత్పత్తి ఇంధన వనరులు అంటారు. కాలుష్య కారకాలైన బొగ్గు, పెట్రోలియం, షెల్‌ గ్యాస్‌ లాంటి సంప్రదాయ ఇంధన వనరుల స్థానంలో పునరుత్పాదక ఇంధన వనరులైన సౌరశక్తి, పవనశక్తి, సముద్ర అలలశక్తి, సముద్ర పోటు-పాట్ల శక్తి, భూతాప శక్తి, హైడ్రోజన్‌ ఇంధనశక్తి లాంటివి వినియోగించడం పర్యావరణ అభివృద్ధికి దోహదం చేస్తుంది.


జీవ ఇంధనాల వాడకం: ఇంధన వనరుల్లో కాలుష్య రహితమైన, తక్కువ ఖర్చుతో కూడిన, సుస్థిరాభివృద్ధిని పెంపొందించేవి జీవ ఇంధన వనరులు. జీవ వ్యర్థాలను నేరుగా మండించడం లేదా సూక్ష్మజీవుల సమక్షంలో కిణ్వన ప్రక్రియకు గురిచేయడం ద్వారా శక్తిని పొందే వనరులను జీవ ఇంధనాలు అంటారు. ప్రపంచంలో అత్యధికంగా పశుసంపద భారతదేశంలోనే ఉండటం, ప్రధానంగా వ్యవసాయ దేశం కావడంతో జీవ ఇంధనాల ఉత్పత్తికి కావాల్సిన జీవ వ్యర్థాలు బాగా లభిస్తాయి. భారత ప్రభుత్వం 2018లో కొత్త జీవ ఇంధన విధానాన్ని ప్రకటించింది.


ఎ) బయోగ్యాస్‌: పశువుల పేడను ఆక్సిజన్‌ రహితంగా కుళ్లబెట్టడం లేదా పట్టణ, చెట్ల వ్యర్థాలను మిథనోమోనాస్, మిథనోకోకస్‌ లాంటి బ్యాక్టీరియాల సమక్షంలో కిణ్వన ప్రక్రియకు గురిచేయడం ద్వారా బయోగ్యాస్‌ను తయారుచేస్తారు. ఇది 60% మీథేన్, 40% కార్బన్‌ డై ఆక్సైడ్‌లతో ఉంటుంది.


బి) బయో డీజిల్‌: జట్రోపా, కానుగ, సోయాబీన్స్, పామాయిల్, రెడ్‌ సీడ్స్‌ లాంటి మొక్కల విత్తనాల నుంచి తీసిన నూనెలను ఆల్కహాల్‌ లేదా ఆమ్లాలను ఉపయోగించి చర్యనొందించే ట్రాన్స్‌ ఎస్టరిఫికేషన్‌ ప్రక్రియ ద్వారా జీవ ఇంధనాన్ని తయారుచేస్తారు. దీన్ని డీజిల్‌తో కలిపి బయోడీజిల్‌గా వినియోగించడం వల్ల పర్యావరణ మిత్రుడిగా మారుతుంది.


సి) బయో ఇథనాల్‌: చెరకు, స్వీట్‌ కార్న్, స్వీట్‌ క్యారెట్, చిలగడ దుంప, గోధుమలు, మొక్కజొన్న లాంటి వాటి నుంచి గ్రహించిన గ్లూకోజ్‌కు ఈస్ట్‌ కలిపి కిణ్వన ప్రక్రియ (మురగబెట్టడం)కు గురిచేస్తే బయో ఇథనాల్‌ తయారవుతుంది. దీన్ని పెట్రోల్‌తో కలిపి బయోపెట్రోల్‌గా వాడొచ్చు. భారత ప్రభుత్వం 2022 నాటికి పెట్రోల్‌లో 10% ఇథనాల్‌ను కలిపి విజయం సాధించింది. 2030 నాటికి 20% ఇథనాల్‌ కలపాలని నిర్ణయించింది.


డి) బయో బ్యుటనాల్‌: బయో ఇథనాల్‌ మాదిరిగా చెరకు లేదా మొక్కజొన్న మొలాసిన్‌ను క్లాస్ట్రీడియం ఎసిటోబ్యుటలికం అనే బ్యాక్టీరియా సమక్షంలో కిణ్వన ప్రక్రియ జరిపినప్పుడు ఎసిటో బ్యుటనాల్‌ ఏర్పడుతుంది. దీన్ని గృహ సంబంధ అవసరాలు, ఇంటర్నల్‌ ఇంజిన్‌ కంబుషన్‌లో వాడవచ్చు. 


ఇ) బయో హైడ్రోజన్‌ గ్యాస్‌: బయోమాస్‌ను హైడ్రోజోనోమోనాస్‌ బ్యాక్టీరియా సమక్షంలో కిణ్వన ప్రక్రియకు గురిచేసినప్పుడు హైడ్రోజన్‌ వాయువు విడుదలవుతుంది. దీన్ని రాకెట్ల ఇంధనంగా, వాహనాలు నడవడానికి ఉపయోగపడే హైడ్రోజన్‌ బ్యాటరీలోనూ వాడవచ్చు.


హరిత నగరాలు: పునరుద్ధరించదగిన కార్బన్‌ రహిత శక్తి వనరులను వినియోగించడం, ప్రత్యేకమైన, వ్యవస్థీకృత వనరులు వినియోగించగలిగేలా రహదారులు ఉండటం, పరిశ్రమలకు దూరంగా, వృక్ష సహిత నగరాలను నిర్మించడం నవీన పట్టణ అభివృద్ధికి సూచిక. ఎకోసిటీ భావనను 1975లో రిచర్డ్‌ అనే పర్యావరణవేత్త ప్రతిపాదించారు. ప్రపంచంలో మొదటి జీరో కార్బన్‌ పట్టణంగా 2008లో అబుదాబిలోని మస్టర్డ్‌ నగరాన్ని అభివృద్ధి చేశారు.


జాతీయ పర్యావరణ విధానం: భారతదేశం జాతీయ పర్యావరణ విధానాన్ని సుస్థిరాభివృద్ధి లక్ష్య సాధనలో భాగంగా 2006లో ప్రకటించింది. సాంఘిక న్యాయాన్ని సాధించడానికి ఆవరణ పరిమితులు తొలగించి సుస్థిరాభివృద్ధిని సాధించడం జాతీయ పర్యావరణ విధాన ప్రధాన లక్ష్యం. ప్రభుత్వ విధానాలు, పథకాలు, ప్రాజెక్టుల్లో పర్యావరణ అంశాలను చేర్చి ఆర్థిక, సాంఘిక అభివృద్ధిని సాధించడం; జీవనోపాధికి పర్యావరణంపై ఆధారపడే పేదలకు పర్యావరణ వనరులు అందుబాటులో ఉండేలా సహజ వనరులను సంరక్షించడం; జీవనానికి ఆధారమైన సంక్షేమానికి దోహదపడే ఆవరణ వ్యవస్థను సంరక్షించడం.. లాంటి ముఖ్య ఉద్దేశాలతో జాతీయ పర్యావరణ విధానాన్ని రూపొందించారు.


ఎకో ఎఫీషియన్సీ: ‘వరల్డ్‌ బిజినెస్‌ కౌన్సిల్‌ ఫర్‌ సస్టెయినబుల్‌ డెవలప్‌మెంట్‌’ ఎకో ఎఫీషియన్సీని నిర్వచించింది. జీవన నాణ్యతను పెంచుతూ, మానవ అవసరాలను తీరుస్తూ, వస్తుసేవలను అందించే పోటీదారులను సమాజానికి అందించడమే ఎకో ఎఫీషియన్సీ. దీనిలో పర్యావరణంపై ప్రభావాన్ని తగ్గిస్తూ, సహజవనరులు నాశనం కాకుండా చూస్తూ, వ్యర్థాలను భూమి శోషించుకునే శక్తి నిర్వహించేలా ప్రణాళికలు ఉండాలి.


గ్రీన్‌ జీడీపీ: పారిశ్రామిక వృద్ధి స్థూల దేశీయోత్పత్తిని పెంచుతున్నప్పటికీ పర్యావరణానికి నష్టం చేస్తోంది. పర్యావరణ క్షీణత పారిశ్రామిక ప్రక్రియ, సహజ వనరుల సేకరణ, వ్యవసాయోత్పత్తులను పెంచడం, పారిశ్రామిక వస్తువుల వినియోగంలో అనేక విధాలుగా అంతర్లీనంగా తిరిగి మానవాభివృద్ధికి విఘాతం కలిగిస్తోంది. సంప్రదాయ జీడీపీ పర్యావరణ నష్టాన్ని పరిగణనలోకి తీసుకోవడం లేదు. అందుకే సంప్రదాయ జీడీపీని పర్యావరణ నష్టానికి సర్దుబాటు చేస్తే గ్రీన్‌ జీడీపీ వస్తుంది.


గ్రీన్‌ జీడీపీ (గ్రాస్‌ డొమెస్టిక్‌ ప్రొడక్ట్‌) = సంప్రదాయ జీడీపీ - ఎన్విరాన్‌మెంటల్‌ (లేదా) ఎకలాజికల్‌ కాస్ట్‌


పర్యావరణ వనరుల నష్టం, పర్యావరణ నష్టాన్ని నిరోధించడానికి, నష్టపోయిన వనరుల పునరుద్ధరణకు, పర్యావరణాన్ని నిర్వహించడానికి చేసే వ్యయం ఎన్విరాన్‌మెంటల్‌ కాస్ట్‌లో ఇమిడి ఉంటుంది. 2006లో చైనా ప్రభుత్వం గ్రీన్‌ జీడీపీని ప్రకటించింది. గాలి, నీరు, ఘనపదార్థాల వల్ల ఏర్పడిన కాలుష్యం; సహజ వనరుల క్షీణత కారణంగా కలిగిన వ్యయాన్ని తీసుకుని దీన్ని గణించింది.


భారత ప్రణాళికా సంఘం గ్రీన్‌ నేషనల్‌ ఎకౌంట్‌ను తయారుచేయడానికి ప్రొఫెసర్‌ పార్థదాస్‌ గుప్తా ఆధ్వర్యంలో నిపుణుల కమిటీని నియమించింది. ఈ కమిటీ జాతీయ వనరులపై రుణాత్మక ప్రభావాన్ని లెక్కలోకి తీసుకుని జాతీయ ఉత్పత్తిని తగ్గిస్తుంది. సహజ, మానవ, భౌతిక ఆస్తులను పరిగణనలోకి తీసుకుని ఆర్థిక ప్రగతిని అంచనా వేసేందుకు రోడ్‌ మ్యాప్‌ తయారుచేసింది. భారతదేశం గ్లోబల్‌ ఎన్విరాన్‌మెంట్‌ ఫెసిలిటీ వ్యవస్థాపక సభ్యదేశంగా కొనసాగుతోంది. 1991లో స్థాపితమైన ఈ సంస్థకు 183 దేశాల నుంచి ఆర్థిక సాయం అందుతోంది. ఈ నిధులను ప్రపంచ పర్యావరణ ప్రయోజనాల కోసం వివిధ దేశాలకు అందిస్తున్నారు.

 

 

రచయిత: జల్లు సద్గుణరావు

Posted Date : 29-11-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 పర్యావరణ పరిరక్షణలో జాతీయ, అంతర్జాతీయ సంస్థలు  

సహజ వనరుల సంరక్షణ కవచాలు! 

మానవుడితో పాటు సమస్త జీవరాశి మనుగడకు పర్యావరణమే ఆధారం. అయితే పారిశ్రామికీకరణ, ఆధునిక అభివృద్ధి చర్యల ఫలితంగా పర్యావరణం క్షీణిస్తోంది. దాంతో ఆవరణ వ్యవస్థల్లో అనూహ్య మార్పులు సంభవించి అందరూ అవస్థలు పడాల్సి వస్తోంది. ఈ పరిస్థితులను అధిగమించేందుకు, మనిషి గమనాన్ని ప్రకృతికి అనుకూలంగా సాగించేందుకు పర్యావరణ శాస్త్రవేత్తలు, స్వచ్ఛంద సంస్థలు కృషి చేస్తున్నాయి. ఇవి పర్యావరణ పరిరక్షణ ఆవశ్యకతను చాటుతాయి, ప్రజలను చైతన్యపరుస్తాయి, ప్రభుత్వాలతో కలిసి పనిచేస్తాయి. అవసరమైతే ఆ ప్రభుత్వాలతోనే పోరాడతాయి, పర్యావరణ విరుద్ధ కార్యకలాపాలను ప్రత్యక్ష కార్యాచరణతో అడ్డుకుంటాయి. దేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా అలాంటి ఉన్నత ఆశయాలతో నడుస్తున్న స్వచ్ఛంద సంస్థలు, వ్యవస్థల గురించి పోటీ పరీక్షార్థులు తెలుసుకోవాలి.


పర్యావరణ క్షీణత నేడు ప్రధాన అంతర్జాతీయ సమస్యగా మారింది. అభివృద్ధి పేరుతో జరుగుతున్న సహజ వనరుల విధ్వంసం అన్ని దేశాలకు శాపంగా మారుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో సర్వమానవ సౌభ్రాత్రం కోసం పలు జాతీయ, అంతర్జాతీయ సంస్థలు కృషి చేస్తున్నాయి.


ఇంటర్నేషనల్‌ యూనియన్‌ ఫర్‌ కన్జర్వేషన్‌ ఆఫ్‌ నేచర్‌ అండ్‌ నేచురల్‌ రిసోర్సెస్‌(IUCN): ప్రపంచంలోనే అత్యంత ప్రాచీన, అతిపెద్ద పర్యావరణ సంస్థ ఇది. సహజవనరుల సంరక్షణ, స్థిరత్వం కాపాడేందుకు పనిచేసే సంస్థ. యునెస్కో ఆధ్వర్యంలో ప్రభుత్వాలు, సంరక్షణ సంస్థలకు ప్రాతినిధ్యం కల్పిస్తూ 1948, అక్టోబరు 5న ఫ్రాన్స్‌లోని ఫౌంటెన్‌బ్లూయి ప్రాంతంలో దీనిని స్థాపించారు. ప్రస్తుతం దీని పేరు వరల్డ్‌ కన్జర్వేషన్‌ యూనియన్‌. ప్రధాన కార్యాలయం స్విట్జర్లాండ్‌లోని గ్లాండ్‌ ప్రాంతంలో ఉంది. ఇది అంతరించిపోయే దశలో ఉన్న జంతువులు, మొక్కలు, శిలీంధ్రాలను రెడ్‌ డేటాబుక్‌లో ప్రచురిస్తుంటుంది.


కన్వెన్షన్‌ ఆన్‌ ఇంటర్నేషనల్‌ ట్రేడ్‌ ఇన్‌ ఎన్‌డేంజర్డ్‌ స్పిసీస్‌ ఆఫ్‌ వైల్డ్‌ ఫనా అండ్‌ ఫ్లోరా (CITES) : దీనినే వాషింగ్టన్‌ కన్వెన్షన్‌ అంటారు. 1963లో IUCN సమావేశంలో ఈ సంస్థ ఏర్పాటును నిర్ణయించారు. 1975, జులై 1 నుంచి అమల్లోకి వచ్చింది. ఇందులో 184 సభ్య దేశాలు ఉన్నాయి. ప్రధాన కార్యాలయం జెనీవాలో ఉంది. అంతరించే దశలో ఉన్న జంతువులు, మొక్కలను వాణిజ్యం నుంచి నిషేధించేందుకు ఈ సంస్థ కృషి చేస్తోంది.


యునైటెడ్‌ నేషన్స్‌ ఎన్విరాన్‌మెంట్‌ ప్రోగ్రామ్‌(UNEP): దీనిని 1972లో స్థాపించారు. ప్రధాన కార్యాలయం కెన్యా రాజధాని నైరోబీలో ఉంది. ఐక్యరాజ్యసమితి చేపట్టే పర్యావరణ కార్యక్రమాలను సమన్వయం చేయడానికి, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో పర్యావరణ పరిరక్షణ కార్యకలాపాల అమలుకు సహాయం అందించేందుకు స్థాపించారు. ఈ సంస్థ వాతావరణం, సముద్ర పర్యావరణం లాంటి అంశాల్లో ఎన్నో కార్యక్రమాలను నిర్వహించింది. అంతర్జాతీయ సదస్సులు నిర్వహించడం, వివిధ జాతీయ ప్రభుత్వాలతో కలిసి పర్యావరణ విధానాలు అమలుచేయడం, పర్యావరణ సంబంధిత విజ్ఞానాన్ని అందించడంలో కీలక పాత్ర పోషిస్తోంది.


ఇంటర్‌ గవర్నమెంటల్‌ ప్యానల్‌ ఆన్‌ క్లైమేట్‌ ఛేంజ్‌ (IPCC): దీనిని UNEP, వరల్డ్‌ మెటీరియాలాజికల్‌ ఆర్గనైజేషన్‌ కలిసి 1988లో స్థాపించాయి. ఈ సంస్థ ప్రధానంగా శీతోష్ణస్థితి మార్పు వల్ల కలిగే ఆర్థిక, సామాజిక ఇబ్బందుల గురించి సమాచారం అందిస్తుంది. ‘యునైటెడ్‌ నేషన్స్‌ ఫ్రేమ్‌వర్క్‌ కన్వెన్షన్‌ ఆన్‌ క్లైమేట్‌ ఛేంజ్‌’ నిర్వహించే ధరిత్రీ సమావేశాలు, ప్రపంచ వాతావరణ సదస్సులకు సంబంధించిన సమాచారాన్ని ప్రచురించి అందరికీ అందుబాటులోకి తీసుకొస్తుంది. ప్రధాన కార్యాలయం స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో ఉంది.


వరల్డ్‌ వైడ్‌ ఫండ్‌ ఫర్‌ నేచర్‌ (WWF-N) : ప్రపంచవ్యాప్తంగా వన్యప్రాణుల సంరక్షణ కోసం ఈ సంస్థను 1961లో  IUCN స్థాపించింది. ప్రధాన కార్యాలయం స్విట్జర్లాండ్‌లోని గ్లాండ్‌లో ఉంది. దీని గుర్తు జెయింట్‌ పాండా. ప్రపంచవ్యాప్తంగా ప్రకృతి సంబంధిత అధ్యయనాలను చేపడుతుంది. అవసరమైతే నిపుణులను ఆయా దేశాలకు పంపి వాటి సంరక్షణ బాధ్యతలు తీసుకుంటుంది. మన దేశంలోని పులుల సంరక్షణ విషయంలో క్రియాశీలక పాత్ర పోషించింది. ప్రజల్లో పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంపొందించే విధంగా వర్క్‌షాపులు, ఎగ్జిబిషన్‌లు, రోడ్‌ షోలు నిర్వహిస్తుంది.  శక్తి ఆదా కోసం ఈ సంస్థ చేపట్టిన అతిపెద్ద ప్రపంచవ్యాప్త ఉద్యమం ఎర్త్‌ అవర్‌. ఇది సాధారణంగా మార్చి చివరి శనివారం రాత్రి 8.30 నుంచి 9.30 మధ్య సమయంలో లైట్లు ఆపే కార్యక్రమం. ప్రపంచవ్యాప్తంగా 200 జీవవైవిధ్య ప్రాంతాలను ఎంపిక చేసి సంరక్షిస్తోంది.


గ్లోబల్‌ ఎన్విరాన్‌మెంటల్‌ ఫెసిలిటీ(GEF): ఈ సంస్థను 1991లో స్థాపించారు. ప్రధాన కార్యాలయం వాషింగ్టన్‌లో ఉంది. ప్రపంచవ్యాప్తంగా జీవ వైవిధ్య సంరక్షణకు, శీతోష్ణస్థితి మార్పుల నివారణకు, నీరు- నేల కాలుష్యాలను తగ్గించేందుకు చేపట్టే ఖర్చులకు గ్రాంట్లు ఇస్తుంది.


గ్రీన్‌పీస్‌: కెనడాకు చెందిన పర్యావరణ కార్యకర్తలు పర్యావరణం, శాంతి, సుస్థిరత అనే నినాదాలతో 1969-72 మధ్య కాలంలో బ్రిటిష్‌ కొలంబియాలోని వాంకోవర్‌లో ఈ సంస్థను స్థాపించారు. ప్రధాన కార్యాలయం నెదర్లాండ్స్‌లోని ఆమ్‌స్టర్‌డామ్‌లో ఉంది. ఇదొక అంతర్జాతీయ ప్రభుత్వేతర స్వచ్ఛంద సంస్థ. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పర్యావరణ విధ్వంసక చర్యలను అడ్డుకుంటుంది. పర్యావరణాన్ని కలుషితం చేసే వివిధ సంస్థలు, దేశాల చర్యలను బయటపెట్టి నిరసనలు, సదస్సులు నిర్వహిస్తుంది. కొన్నిసార్లు బలప్రయోగం ద్వారా కూడా పర్యావరణ విధ్వంసక చర్యలను అడ్డుకుంటుంది.


బర్డ్‌లైఫ్‌ ఇంటర్నేషనల్‌: ప్రపంచవ్యాప్తంగా స్వతంత్రంగా పనిచేస్తున్న అనేక పక్షి సంరక్షణ సంస్థల కలయికతో ఏర్పడిన అతిపెద్ద సంస్థ ఇది. 1922లో గిల్‌బర్ట్‌ పియర్‌సన్, జీన్‌ డెలకోర్‌ స్థాపించారు. కార్యాలయం యునైటెడ్‌ కింగ్‌డమ్‌లోని కేంబ్రిడ్జిలో ఉంది. ఈ సంస్థ జీవ వైవిధ్య ప్రాంతాలతో పాటు, పక్షుల ఆవాసాలు, ముఖ్యమైన పక్షులు, వాటి సంరక్షణ ప్రాంతాలను గుర్తిస్తుంది. ‘వరల్డ్‌ బర్డ్‌వాచ్‌’ అనే త్రైమాసిక మేగజీన్‌ను ప్రచురిస్తుంది.


వరల్డ్‌ నేచర్‌ ఆర్గనైజేషన్‌(WNO): ప్రపంచ పర్యావరణ పరిరక్షణ కోసం ఏర్పాటైన మరో సంస్థ ఇది. వివిధ దేశాల అంతర ప్రభుత్వ ఒప్పందం ప్రకారం 2014 నుంచి ఉనికిలోని వచ్చింది. జెనీవాలో కార్యాలయం ఉంది. ఇందులో భారత్‌ సభ్యత్వం తీసుకోలేదు. శీతోష్ణ మార్పుల ప్రభావాన్ని తగ్గించేందుకు తగిన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడం, పునరుత్పాదక ఇంధన వనరులను ప్రోత్సహించడం లాంటి కార్యక్రమాలను నిర్వహిస్తోంది.


భారతదేశంలో


వైల్డ్‌లైఫ్‌ ప్రొటెక్షన్‌ సొసైటీ ఆఫ్‌ ఇండియా(WPSI) : ఇది భారతదేశంలోనే అత్యంత సమర్థ వన్యప్రాణి సంరక్షణ సంస్థ. బెస్ట్‌ వైల్డ్‌లైఫ్‌ ఫొటోగ్రాపర్‌గా అవార్డు అందుకున్న మహిళ బిలిండావైట్‌ 1994లో న్యూఢిల్లీలో దీనిని స్థాపించారు. జంతువుల అక్రమ రవాణాపై ప్రభుత్వానికి సమాచారం అందించడం, వేటను నివారించడం లాంటి లక్ష్యాలతో ఈ సంస్థ పనిచేస్తుంది.


బాంబే నేచురల్‌ హిస్టరీ సొసైటీ(BNHS): వన్యప్రాణి సంరక్షణ, పరిశోధన కోసం ముంబయి కేంద్రంగా 1883లో ఏర్పడిన పురాతన ప్రభుత్వేతర సంస్థ. ఆవరణ వ్యవస్థలు, వన్యజాతి జీవుల సంరక్షణకు కృషి చేయడమే కాకుండా వన్యప్రాణులకు సంబంధించి చట్టాలు రూపొందించడంలో ప్రభుత్వానికి సహాయం అందిస్తుంది. హార్న్‌బిల్‌ అనే జర్నల్‌ను ప్రచురిస్తుంది.

సెంటర్‌ ఫర్‌ సైన్స్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌ (CSE): ఇది లాభాపేక్ష లేని స్వచ్ఛంద పర్యావరణ పరిశోధనా సంస్థ. అనిల్‌ అగర్వాల్‌ వ్యవస్థాపకులుగా 1980లో న్యూఢిల్లీ కేంద్రంగా ఏర్పాటైంది. సైన్స్, పర్యావరణ అంశాలతో కూడిన పక్షపత్రిక ‘డౌన్‌ టు ఎర్త్‌’ను ప్రచురిస్తుంది. ఈ సంస్థ మొదటిసారిగా కోకో కోలా సింథటిక్‌ డ్రింక్స్‌లో పురుగు మందుల అవశేషాలు ఉన్నట్లు గుర్తించింది. 1954 ఆహార కల్తీచట్టం ప్రకారం బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్డ్స్‌ వారు వాటర్‌ బాటిల్స్‌కు సర్టిఫికెట్‌ మార్కును 2001 నుంచి తప్పనిసరి చేయడంలో ఈ సంస్థ కృషి ఉంది.


పెటా - ఇండియా: పీపుల్‌ ఫర్‌ ద ఎథికల్‌ ట్రీట్‌మెంట్‌ ఆఫ్‌ యానిమల్స్‌(PETA)- జంతువుల హక్కుల రీత్యా ప్రపంచంలోనే అతిపెద్ద లాభాపేక్ష రహిత సంస్థ. యూఎస్‌ఏలోని వర్జీనియాలో 1980లో ఇంగ్రిడ్‌ న్యూకిర్క్, అలెక్సో పెచెకో స్థాపించారు. ప్రపంచవ్యాప్తంగా జంతువులను పరిరక్షిస్తూ, పర్యావరణ- జీవ వైవిధ్య సంరక్షణ కోసం శాకాహారాన్ని ప్రోత్సహిస్తుంది. భారతదేశంలో కార్యకలాపాల కోసం 2000 సంవత్సరంలో ముంబయిలో ‘పెటా-ఇండియా’ను స్థాపించారు. ‘‘జంతువులు ఉన్నది మనుషులు తినడానికో, ప్రయోగాలు చేయడానికో, హింసించడానికో కాదు. అన్ని ప్రాణులూ సమానమే’’ అనే సందేశంతో ప్రజలు, ప్రభుత్వాలను చైతన్యపరుస్తోంది.


వైల్డ్‌ లైఫ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా(WII): వన్యప్రాణుల నిర్వహణ, పరిశోధనలతోపాటు అటవీ అధికారుల శిక్షణ కోసం 1982లో దేహ్రాదూన్‌లో స్థాపించారు. వైల్డ్‌ లైఫ్‌ సైన్సెస్‌లో ఎమ్మెస్సీ లాంటి పలు కోర్సులను అందిస్తోంది.


జాతీయ హరిత ట్రైబ్యునల్‌(NGT): పర్యావరణ చట్టాల ఉల్లంఘన కేసుల సత్వర పరిష్కారం కోసం 2010, అక్టోబరు 18న దిల్లీ కేంద్రంగా ప్రారంభించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 21 (జీవించే హక్కు) 48-A కింద ఏర్పాటైంది. అడవుల రక్షణ, జీవవైవిధ్యం, కాలుష్యం లాంటి పర్యావరణ కేసులను సమర్థంగా పరిష్కరించడంతో పాటు ఆస్తులు, వ్యక్తి సంబంధ నష్టాలకు పరిహారం ఇప్పిస్తుంది. ఇలాంటి ట్రైబ్యునల్‌ ఏర్పాటు చేసిన మొదటి దేశం న్యూజిలాండ్, రెండో దేశం ఆస్ట్రేలియా, భారత్‌ మూడోది.


దేశంలో పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తున్న మరికొన్ని సంస్థలు: 


* ఇండియా కౌన్సిల్‌ ఫర్‌ ఫారెస్ట్రీ రిసెర్చ్‌ అండ్‌ ఎడ్యుకేషన్‌ - దేహ్రాదూన్‌ 


* ఇందిరాగాంధీ నేషనల్‌ ఫారెస్ట్‌ అకాడమీ - దేహ్రాదూన్‌ 


* వైల్డ్‌ లైఫ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా - దేహ్రాదూన్‌ 


* సెంటర్‌ ఫర్‌ ఎన్విరాన్‌మెంట్‌ ఎడ్యుకేషన్‌ - అహ్మదాబాద్‌ 


* జాతీయ జీవ వైవిద్య సంస్థ - చెన్నై 


* జాతీయ పర్యావరణ సాంకేతిక పరిశోధన సంస్థ - నాగ్‌పుర్‌ 


* వన్యప్రాణి నేర నియంత్రణ బ్యూరో - న్యూదిల్లీ * క్రోకడైల్‌ బ్యాంక్‌ ట్రస్టు - చెన్నై 


* జులాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా - కోల్‌కతా 


* బొటానికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా - కోల్‌కతా


 

                                                                                                                                                                                                                                                                                                                                                                           రచయిత: జల్లు సద్గుణరావు

 

 

Posted Date : 13-12-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

పర్యావరణం - సహజ వనరులు

పశ్చిమ హిమాలయాల్లో వికసించే బ్రహ్మకమలం

జీవరాశులు, ఆవరణ వ్యవస్థల మనుగడకు కావాల్సిన శక్తి అవసరాలను తీర్చే వాటినే సహజ వనరులు అంటారు. అవి ప్రకృతిలో సహజసిద్ధంగా ఆవిర్భవిస్తాయి. ఆధునిక   మానవులు వాటిని విచక్షణారహితంగా వినియోగిస్తూ, కలుషితం చేస్తూ వినాశనానికి కారణమవుతున్నారు. ఈ నేపథ్యంలోనే కాలుష్య కారకాలైన సంప్రదాయ ఇంధన వనరుల వాడకాన్ని తగ్గించడం, పునరుత్పాదక శక్తి    వనరుల వినియోగాన్ని పెంచడం లక్ష్యాలుగా ప్రభుత్వాల విధానాలు రూపొందుతున్నాయి. వీటిపై పోటీ పరీక్షార్థులకు అవగాహన ఉండాలి. దేశంలో వాతావరణ పరిస్థితులకు తగినట్లుగా వివిధ ప్రాంతాల్లో పెరిగే అడవులు, అక్కడి వృక్ష జాతులు, లభించే ఉత్పత్తుల గురించి తెలుసుకోవాలి. అటవీ, జల సంరక్షణ, భూ స్వభావాల ఆధారంగా పాటించాల్సిన నీటిపారుదల పద్ధతులు తదితర పురోగామి అంశాలను అర్థం చేసుకోవాలి. 


1.  కిందివాటిలో సాంప్రదాయేతర శక్తి వనరు కానిది  ఏది?

1) చిన్నతరహా జలవిద్యుత్తు  2) కోల్‌బెడెడ్‌ మీథేన్‌ 

3) గ్యాస్‌హైడ్రేట్స్‌       4) బొగ్గు



2.   కిందివాటిలో పునరుత్పాదక శక్తివనరు కానిది ఏది?

1) సౌరవిద్యుత్తు     2) జీవవ్యర్థం 

3) ఓషియన్‌ థర్మల్‌ ఎనర్జీ గ్రేడియెంట్         4) ముడిచమురు



3.  కిందివాటిలో నవీన శక్తివనరు ఏది?

1) హైడ్రోజన్‌ ఎనర్జీ     2) జియోథర్మల్‌ ఎనర్జీ 

3) కోల్‌బెడెడ్‌ మీథేన్‌     4) పైవన్నీ 


 

4.  కిందివాటిలో తప్పుగా పేర్కొన్న దానిని గుర్తించండి.

1) బొగ్గు - సాంప్రదాయ, పునరుత్పత్తి చెందని ఇంధన వనరు

2) బయోగ్యాస్‌ - సాంప్రదాయేతర, పునరుత్పత్తి చెందే సహజ వనరు

3) జియోథర్మల్‌ ఎనర్జీ - నవీన, పునరుత్పత్తి చెందే సహజ వనరు

4) సహజవాయువు - సాంప్రదాయ, పునరుత్పత్తి చెందే సహజ వనరు



5.  కిందివాటిలో పునరుత్పాదక శక్తి వనరు ఏది?

1) జలవిద్యుత్తు      2) చిన్నతరహా జలవిద్యుత్తు 

3) వాయుశక్తి       4) పైవన్నీ 



6.  భారతదేశంలో ఉష్ణమండల ఆర్ధ్రతతో కూడిన సతతహరిత అడవులు ఏ ప్రాంతంలో ఉన్నాయి?

1) పశ్చిమ హిమాలయాలు         2) పశ్చిమ కనుమల తూర్పు ప్రాంతం 

3) పశ్చిమ కనుమల పశ్చిమ ప్రాంతం   4) తూర్పు హిమాలయాలు


7.  భారతదేశంలో ఏ రకానికి చెందిన అడవులు ఎక్కువ విస్తీర్ణాన్ని ఆక్రమించాయి?

1) తేమతో కూడిన సమశీతోష్ణ మండల పర్వత ప్రాంత అరణ్యాలు 

2) ఉప ఉష్ణమండల అనార్ధ్ర సతతహరిత అరణ్యాలు 

3) ఉష్ణమండల ఆర్ధ్రతతో కూడిన ఆకురాల్చు అరణ్యాలు 

4) ఉష్ణమండల ఆర్ధ్రతతో కూడిన సతతహరిత అరణ్యాలు  



8.   షోలా అడవులు భారత్‌లో ఎక్కడ ఉన్నాయి?

1) హిమాలయాల్లో 1800 మీ. - 3300 మీ. ఎత్తులో

2) మధ్యప్రదేశ్‌లో హోషంగాబాద్‌ జిల్లాలో 

3) పంజాబ్‌ హిమాలయాలు

4) నీలగిరి, అన్నామలై కొండల్లో 1200 మీ., అంతకంటే ఎక్కువ ఎత్తులో 



9. సిగరెట్‌ పెట్టెల తయారీకి వాడే కలప పేరు? 

1) సెమూల్‌      2) హల్థా     3) సెడార్‌      4) చెస్ట్‌నట్స్‌ 



10. క్రికెట్‌ బ్యాట్‌ల తయారీకి వాడే కలప పేరు? 

1) విల్లోస్‌    2) దేవదారు    3) సిల్వర్‌ఫర్‌     4) స్ప్రూస్‌



11. ఇంటర్నేషనల్‌ యూనియన్‌ ఫర్‌ కన్జర్వేషన్‌ ఆఫ్‌ నేచర్‌ అండ్‌ నేచురల్‌ రిసోర్సెస్‌ (IUCN) భారతదేశంలో అంతరించిపోయే వృక్షాల జాబితాలో చేర్చిన వృక్షం?

1) ఎర్రచందనం     2) మంచి గంధం   3) జిట్టెగ     4) టెక్సాస్‌ 



12. ఏ ప్రాంతంలో నిరుపయోగమైన భూమి ఎక్కువగా విస్తరించి ఉంది?

1) మధ్యప్రదేశ్‌     2) అరుణాచల్‌ ప్రదేశ్‌ 

3) ఉత్తర్‌ప్రదేశ్‌     4) జమ్ము-కశ్మీర్‌ 


13. సుగంధద్రవ్యాల్లో వాడే అల్ఫైన్‌ జాతి ‘బ్రహ్మకమలం’ భారతదేశంలో ఏ ప్రాంతంలో పెరుగుతుంది?

1) పశ్చిమ హిమాలయాలు     2) కేరళ కొండలు 

3) తూర్పు హిమాలయాలు     4) గంగా మైదానం 



14. పశ్చిమ బెంగాల్‌లో ‘జల్దపార సంరక్షణ కేంద్రం’లో పరిరక్షించే జంతువులు ఏవి?    

1) అడవి గాడిదలు     2) ఏనుగులు 

3) ఖడ్గమృగాలు     4) పులులు 



15. భారత దేశంలో ఆకర్షణీయ పుష్పాలున్న రోడోడెండ్రాన్‌ జాతికి చెందిన మొక్కలు ఏ ప్రాంతంలో పెరుగుతాయి?

1) లద్దాఖ్‌          2) సిక్కిం హిమాలయాలు 

3) టెరాయి మైదానం   4) వింధ్య పర్వతాలు 



16. కిందివాటిని పరిశీలించండి. 

ప్రవచనం (ఎ): రుతువపన ప్రాంతంలో పెరిగే వృక్షజాతులు వేసవిలో ఆకులు రాలుస్తాయి.

కారణం (ఆర్‌): ఉష్ణమండల ప్రాంతాల్లో పెరిగే వృక్షజాతులు వేసవిలో బాష్పోత్సేక ప్రక్రియను నియంత్రించడానికి వాటి ఆకులను రాలుస్తాయి.

1) ఎ, ఆర్‌ లు సరైనవి. ఎ కి ఆర్‌ సరైన వివరణ. 

2) ఎ, ఆర్‌ లు సరైనవి. కానీ, ఎ కి ఆర్‌ సరైన వివరణ కాదు 

3) ఎ సరైంది, ఆర్‌ సరైంది కాదు. 

4) ఎ సరైంది కాదు, ఆర్‌ సరైంది.


17. కిందివాటిలో సవన్నా శీతోష్ణస్థితికి సంబంధించి తప్పుగా పేర్కొన్న వాటిని గుర్తించండి.

1) దేశంలో వృక్షాలు లేని సవన్నా శీతోష్ణస్థితి ఆరావళి పర్వతాలకు పశ్చిమంగా ఉన్న ఎడారి ప్రాంతాల్లో విస్తరించి ఉంది.

2) కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌లోని నైరుతి ప్రాంతాల్లో పొడి వాతావరణంతో కూడిన సవన్నా శీతోష్ణస్థితి ఉంది.

3) ఏ ప్రాంతంలోనైతే అనార్ధ్ర ఆకురాల్చు అరణ్యాలు అగ్నిప్రమాదాల వల్ల కాలిపోతాయో ఆ ప్రదేశాలు అనార్ధ్ర సవన్నా ప్రాంతాలుగా మారిపోతాయి.

4) అనార్ధ్ర సవన్నా శీతోష్ణస్థితి ముఖ్య లక్షణం ముళ్లపొదలు, తుప్పలు, గడ్డిజాతులను కలిగి ఉండటం.



18. కిందివాటిని జతపరచండి. 

వృక్షజాతి రకం      అటవీ రకం 

1) టేకు        ఎ) సతతహరిత అరణ్యాలు 

2) యుఫోర్బియా   బి) ఆకురాల్చు అరణ్యాలు 

3) రోజ్‌ఉడ్‌       సి) సవన్నా అరణ్యాలు 

4) సుంద్రీ        డి) మాంగ్రూవ్‌ అరణ్యాలు 

1) ఎ-2, బి-1, సి-3, డి-4    

2) ఎ-1, బి-2, సి-3, డి-4

3) ఎ-2, బి-3, సి-1, డి-4    

4) ఎ-1, బి-3, సి-2, డి-4


19. దేశంలో అటవీ విస్తీర్ణం ఎక్కువగా ఉన్న రాష్ట్రాల వరుసను గుర్తించండి.

1) మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, అరుణాచల్‌ ప్రదేశ్, ఒడిశా 

2) మిజోరాం, అరుణాచల్‌ ప్రదేశ్, మేఘాలయ,   మణిపుర్‌ 

3) మధ్యప్రదేశ్, అరుణాచల్‌ ప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా 

4) మధ్యప్రదేశ్, అరుణాచల్‌ ప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌


20. క్షారత్వాన్ని తట్టుకుని పెరిగే ప్రాంతాల్లోని సతత హరితాలు దేశంలో కింద తెలిపిన ఏ ఉద్భిజ ప్రాంతంలో ఉన్నాయి?

1) ఉష్ణమండల సతతహరిత ప్రాంతాలు 

2) మాంగ్రూవ్స్‌

3) అనార్ధ్ర సతతహరితాలు         

4) ఆర్ధ్ర ఆకురాల్చు అరణ్యాలు 


21. దేశంలో జలవనరుల అభివృద్ధి, నియంత్రణ కోసం జాతీయ జలవనరుల మండలి (NWRB)ని ఎప్పుడు ఏర్పాటు చేశారు?

1) 1981  2) 1982  3) 1983  4) 1984



22. దేశంలో జలవనరుల నిర్వహణకు మొదటి జలవిధానాన్ని ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు?

1) 1983  2) 1987  3) 1989  4) 1992 



23. పంట పొలాలకు నీటి లభ్యతను పెంచి, దేశంలో సాగునీటి సదుపాయం ద్వారా సాగు విస్తీర్ణతను పెంచాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం 2015-16లో ప్రారంభించిన కార్యక్రమం పేరు?

1) జలక్రాంతి అభియాన్‌  

2) ప్రధానమంత్రి కృషి సింఛాయి యోజన 

3) ఆగ్జిలరేటెడ్‌ ఇరిగేషన్‌ బెనిఫిట్‌ ప్రోగ్రాం

4) కమాండ్‌ ఏరియా డెవలప్‌మెంట్‌ ప్రోగ్రాం

24. ఒక నీటిపారుదల ప్రాజెక్టు నిర్మాణ సమయంలో, నదీ ప్రవాహ దారిని మళ్లించడానికి తాత్కాలికంగా నిర్మించే ఎత్తయిన కట్టడాలను ఏమని పిలుస్తారు?

1) డైక్‌ డ్యామ్స్‌     2) డైవర్షన్‌ డ్యామ్స్‌ 

3) కాఫర్‌ డ్యామ్స్‌     4) గ్రావిటీ డ్యామ్స్‌ 

25. దేశంలో రాక్‌ఫిల్‌ డ్యామ్‌ లేదా ఎంబాక్‌మెంట్‌ డ్యామ్‌ కిందివాటిలో దేనికి ఉదాహరణగా చెప్పవచ్చు?

1) థెయిన్‌ డ్యామ్‌     2) రామ్‌గంగా 

3) నాగార్జున సాగర్‌     4) పైవన్నీ 




26. కిందివాటిని పరిశీలించండి.

ప్రవచనం (ఎ): నల్లరేగడి నేలలు పత్తి పంటకు అనుకూలమైనవి.

కారణం (ఆర్‌): నల్లరేగడి నేలలకు నీటిని నిల్వ చేసుకునే సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది. అందువల్లే నీటిపారుదల సౌకర్యాలు లేని వ్యవసాయ సాగు విధానాలకు ఇవి అనుకూలమైనవి.

1) ఎ, ఆర్‌ లు సరైనవి. ఎ కి ఆర్‌ సరైన వివరణ. 

2) ఎ, ఆర్‌లు సరైనవి. కానీ, ఎ కి ఆర్‌ సరైన వివరణ కాదు. 

3) ఎ సరైంది, ఆర్‌ సరైంది కాదు. 

4) ఎ సరైంది కాదు, ఆర్‌ సరైంది. 




27. మృత్తికా క్రమక్షయానికి సంబంధించి కింది ప్రవచనాలను పరిశీలించి, తప్పుగా ఉన్నదాన్ని గుర్తించండి.

1) గల్లీప్లగ్గింగ్‌ అంటే సాగుభూముల్లో అడ్డంగా ఏర్పడిన భూమికోతను నియంత్రించడం

2) కాంటూర్‌ ప్లవ్వింగ్‌ అంటే భూమి వాలుకి అడ్డంగా కాంటూర్‌లను అనుసరించి పొలాన్ని దున్నడం.

3) పర్వత ప్రాంతాల్లో సోపాన వ్యవసాయానికి బదులు పోడు వ్యవసాయాన్ని అనుసరించాలి.

4) మృత్తికా క్రమక్షయ నివారణకు పంటమార్పిడి విధానాన్ని అనుసరించాలి.

1) 1, 3   2) 2, 3   3) 2, 4   4) 1, 4


28. రెగర్‌ నేలలు అని వేటిని అంటారు?

1) ఒండ్రు నేలలు     2) నల్లరేగడి నేలలు 

3) ఎర్ర నేలలు     4) లేటరైట్‌ నేలలు


 

29. కాఫీ, తేయాకు తోటలకు అనుకూలమైన నేలలు?

1) ఎర్ర నేలలు     2) డెల్టా నేలలు 

3) పర్వత నేలలు     4) నల్లరేగడి నేలలు 



30. నీటిపారుదల తక్కువగా అవసరమయ్యే నేలలు?

1) ఒండ్రుమట్టి నేలలు     2) నల్లరేగడి నేలలు 

3) ఎర్ర నేలలు     4) లేటరైట్‌ నేలలు



31. భారత్‌లో మొదటిసారిగా జలవిద్యుత్తు ఉత్పత్తి జరిగిన ప్రదేశం?     

1) శివసముద్రం     2) డార్జిలింగ్‌ 

3) మాచ్‌ఖండ్‌     4) నరోరా 


32. భారత్‌లో మొదటి అణురియాక్టర్‌ పేరు?

1) కామిని     2) ఊర్వశి 

3) అప్సర     4) రావత్‌భట 



33. కిందివాటిలో సహజవాయు ఆధారిత థర్మల్‌ కేంద్రానికి సంబంధించింది?

1) గుజరాత్‌ - కవాస్‌   2) రాజస్థాన్‌ - అంటా

3) ఒడిశా - తాల్చేర్‌   4) ఉత్తర్‌ప్రదేశ్‌ - గాంధార



34. కిందివాటిలో అణురియాక్టర్లకు సంబంధించి సరికానిది?

1) కాక్రపార - గుజరాత్‌   2) కైగా - కర్ణాటక 

3) నరోరా - పంజాబ్‌    4) కుడంకుళం - తమిళనాడు 



35. న్యూక్లియర్‌ పవర్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?

1) ముంబయి  2) హైదరాబాద్‌ 

3) చెన్నై     4) బెంగళూరు



రచయిత: ఇ.వేణుగోపాల్‌

 

సమాధానాలు

1-4; 2-4; 3-4; 4-4; 5-3; 6-3; 7-3; 8-4; 9-2; 10-1; 11-1; 12-4; 13-1; 14-3; 15-2; 16-1;  17-1; 18-3; 19-3; 20-2; 21-3; 22-2; 23-2;  24-3; 25-4; 26-1; 27-1; 28-2; 29-3; 30-2;  31-2; 32-3; 33-4; 34-3; 35-1. 

Posted Date : 22-12-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌