మాదిరి ప్రశ్నలు
1. శూన్యంలో కాంతి వేగం ఎంత?
జ: 3 × 108 మీ./సె.
2. కిందివాటిలో విద్యుదయస్కాంత తరంగాలు కానివి?
జ: ఆల్ఫా వికిరణాలు
3. కింది అంశాలను జతపరచండి.
జాబితా - I జాబితా - II
a) తరంగదైర్ఘ్యం i) జౌల్
b) పౌనఃపున్యం ii) మీ./సె.
c) కాంతివేగం iii) మీటర్
d) శక్తి iv)హెర్ట్జ్
జ: a-iii, b-iv, c-ii d-i
4. అంతర్జాతీయ ఓజోన్ పొర పరిరక్షణ దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు?
జ: సెప్టెంబరు 16
5. CFC అంటే ఏమిటి?
జ: క్లోరోఫ్లోరోకార్బన్లు
6. కాంతి విశ్లేషణ లేదా విక్షేపణాన్ని కనుక్కున్న శాస్త్రవేత్త?
జ: న్యూటన్
7. సాధారణ మానవ కన్ను కింది ఏ తరంగ దైర్ఘ్యాల కాంతికి ప్రతిస్పందిస్తుంది?
జ: 380 nm - 750 nm
8. ప్రతిపాదన (A): ఎరుపు రంగు లైట్లను ట్రాఫిక్ సిగ్నల్స్‌లో వాహనాలను నిలపడానికి ఉపయోగిస్తారు.
కారణం (R): ఎరుపు రంగుకు అత్యధిక తరంగదైర్ఘ్యం ఉంటుంది.
జ: A, R రెండూ నిజం, Aకు R సరైన వివరణ.
9. తేనెటీగలు కింది ఏ విద్యుదయస్కాంత తరంగాలను చూడగలవు?
జ: అతినీలలోహిత కిరణాలు
10. కిందివాటిలో ప్రాథమిక రంగులు ఏవి?
i. ఎరుపు ii. నీలం iii. పసుపు
iv. ఆరెంజ్ v. ఆకుపచ్చ vi. ఊదారంగు
జ: i, ii, v
11. కాంతి-దాని ధర్మాల గురించి అధ్యయనం చేసే శాస్త్రం?
జ: ఆప్టిక్స్
12. కాంతి వేగంతో ప్రయాణించేవి?
జ: x - కిరణాలు , మైక్రో తరంగాలు
13. కిందివాటిలో ఏ రంగుకు కనిష్ఠ శక్తి ఉంది?
జ: ఎరుపు
14. C.T. స్కానింగ్ అంటే?
జ: కంప్యూటెడ్ టోమోగ్రఫీ
15. జీర్ణాశయాన్ని x కిరణాలతో ఫొటో తీసే ముందు రోగికి ఏ రసాయన ద్రావణాన్ని తాగిస్తారు?
జ: బేరియం సల్ఫేట్
16. ‘బేరియం మీల్స్’ అని ఏ రసాయన ద్రావణాన్ని పిలుస్తారు?
జ: బేరియం సల్ఫేట్
17. విమానాశ్రయ భద్రతా స్కానర్లలో ఉపయోగించే విద్యుదయస్కాంత తరంగాలు?
జ: x కిరణాలు
18. x కిరణాల కంటే తక్కువ తరంగదైర్ఘ్యం కలిగిన విద్యుదయస్కాంత తరంగాలు ఏవి?
జ: గామా కిరణాలు
19. అత్యధికంగా చొచ్చుకొని వెళ్లే సామర్థ్యం కలిగి ఉన్న కిరణాలు ఎవి?
జ: గామా కిరణాలు
20. గామా కిరణాల రేడియేషన్ నుంచి రక్షించుకునేందుకు తయారుచేసే కవచాల్లో ఉపయోగించే పదార్థం ఏది?
జ: సీసం
21. RADAR అంటే?
జ: Radio Detection and Ranging
22. భూగోళం నుంచి అంతరిక్షంలో ఉన్న ఉపగ్రహాల మధ్య దూరాలను కొలిచే పద్ధతిని ఏమంటారు?
జ: టెలిమెట్రి
23. మైక్రోవేవ్ ఓవెన్‌ను కనుక్కున్న శాస్త్రవేత్త ఎవరు?
జ: పెర్సీ స్పెన్సర్
24. కిందివాటిలో తక్కువ పౌనఃపున్యం కలిగిన విద్యుదయస్కాంత తరంగాలు ఏవి?
జ: రేడియో తరంగాలు
25. కిందివాటిలో అధిక తరంగదైర్ఘ్యం కలిగి ఉన్న విద్యుదయస్కాంత తరంగాలు?
జ: రేడియో తరంగాలు
26. మానసిక ఒత్తిడిని దూరంచేసి, మనిషి కంటికి ఆహ్లాదాన్ని కలిగించే రంగు ఏది?
జ: ఆకుపచ్చ
27. విద్యుదయస్కాంత తరంగాలు ప్రయాణించే వేగం?
జ: 3 x 108 మీ./సె., 3 x 1010 సెం.మీ./సె.
28. కిందివాటిలో సమాచారాన్ని తీసుకుని చాలాదూరం ప్రయాణించేవి ఏవి?
జ: రేడియో తరంగాలు
29. రెండు వరుస శృంఖాలు లేదా ద్రోణులు మధ్య దూరాన్ని ఏమంటారు?
జ: తరంగదైర్ఘ్యం
30. కిందివాటిలో రాంట్జన్ వికిరణాలు అని వేటిని పిలుస్తారు?
జ: x - కిరణాలు
31. కిందివాటిలో శ్రీ కిరణాలకు సంబంధించి సరైంది?
జ: x - కిరణాలు ఒక రకమైన విద్యుదయస్కాంత తరంగాలు.
32. భౌతికశాస్త్రంలో మొదటిసారి నోబెల్ బహుమతి పొందిన శాస్త్రవేత్త?
జ: రాంట్జన్