మాదిరి ప్రశ్నలు
1. లుకేమియా, మాలిగ్నంట్ ట్యూమర్లు, ఆయువు తగ్గడం ఏ రకమైన కాలుష్యం వల్ల సంభవిస్తాయి?
జ: అణుధార్మిక కాలుష్యం
2. డెసిబుల్స్ వేటికి ప్రమాణాలు?
జ: ధ్వని
గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు
1. మానవుడికి, పర్యావరణానికి హాని కలిగించని గరిష్ఠ శబ్ద స్థాయి ఎన్ని డెసిబుల్స్‌కు మించరాదు? (ఎస్సై - 2016)
జ: 120
2. 1986 ఏప్రిల్‌లో సంభవించిన చెర్నోబిల్ దుర్ఘటన ఒక (గ్రూప్ - 4, 2014; ఎస్సై - 2016)
జ: కిరణధార్మిక కాలుష్యం
3. కిందివాటిలో జల కాలుష్యం వల్ల వచ్చే వ్యాధుల్లో భాగం కానిది? (ఏఈఈ, గ్రూప్ - 2, 2017)
1) కలరా 2) జాండీస్ 3) మలేరియా 4) డయేరియా
జ: 3 (మలేరియా)
4. ఆసుపత్రుల వద్ద ఉండాల్సిన శబ్ద స్థాయి పరిధి (ఎఫ్‌బీవో - 2017)
జ: 30 - 40 db
5. ధ్వని పీడన యూనిట్ ప్రామాణికతలో ఉండాల్సినవి (ఎఫ్ఎస్వో - 2017)
ఎ) శబ్ద స్థాయి బి) శబ్ద తీవ్రత సి) శబ్ద పీడనం
జ: ఎ, బి
6. 2014లో గంగానది కలుషితాన్ని తొలగించడానికి ప్రారంభించిన కార్యక్రమం? (గ్రూప్స్ - 2017)
జ: నమామి గంగా