1. కిందివాటిలో పరిసరాల్లో ఉండేది ఏది?
1) వాతావరణం 2) జీవావరణం 3) జలావరణం 4) అన్నీ
జవాబు: అన్నీ
2. భూమి చుట్టూ ఉండే ఏ వాయు సముదాయ పొర భూమికి రక్షణ కవచంలా పనిచేస్తుంది?
జవాబు: వాతావరణం
3. వాతావరణంలో సుమారుగా 15 కి.మీ. దూరంలో ఆవరించి ఉన్న విభాగం?
జవాబు: ట్రోపోస్ఫియర్
4. సూర్యుడి నుంచి వెలువడే అతినీలలోహిత కిరణాలు భూమిపై పడకుండా ఒక రక్షణ కవచంలా కాపాడే ఓజోన్ వాయువు ఏ విభాగంలో ఉంటుంది?
జవాబు: స్ట్రాటోస్ఫియర్
5. కిందివాటిలో కాలుష్యకారిణి కానిది ఏది?
1) DDT 2) కార్బన్ మోనాక్సైడ్ 3) Hg 4) N2
జవాబు: N2
6. నీటిలో కరిగి ఉన్న ఆక్సిజన్‌ను 'DO' విలువ అంటారు. నీటిలోని మొక్కలు, జలచరాలు ఆరోగ్యంగా ఉండాలంటే DO విలువ సుమారుగా ఎంత ఉండాలి?
జవాబు: 4 - 6 మి.గ్రా./లీ.
7. కింది ఏ రసాయన పదార్థాన్ని ఉపయోగించి నీటి రసాయన ఆక్సిజన్ (COD) అవసరాన్ని లెక్కిస్తారు?
1) పొటాషియం నైట్రేట్ 2) ఆక్సాలిక్ ఆమ్లం
3) పొటాషియం పర్మాంగనేట్ 4) పొటాషియం డైక్రోమేట్ + H2SO4
జవాబు: పొటాషియం డైక్రోమేట్ + H2SO4
8. BOD అంటే....
జవాబు: బయో కెమికల్ ఆక్సిజన్ డిమాండ్
9. పెట్రోల్, డీజిల్, కిరోసిన్ లాంటి ఇంధనాలు అసంపూర్ణ దహనచర్యకు లోనైనప్పుడు వెలువడే వ్యర్థ వాయువుల్లో ప్రధానమైంది ఏది?
జవాబు: కార్బన్ మోనాక్సైడ్
10. కిందివాటిలో కార్బన్ మోనాక్సైడ్ హిమోగ్లోబిన్‌తో చర్య జరపడం వల్ల ఏర్పడే కార్బాక్సీ హిమోగ్లోబిన్ ఫార్ములా ఏది?
1) HbO 2) HbO2 3) HbCO 4) HbCO2
జవాబు: HbCO
11. భూమిపై ఎంత శాతం నీరు మంచు రూపంలో ఉంటుంది?
జవాబు: 2%
12. ఏసీల్లో ఫోమింగ్ ఏజెంట్‌గా ఏ వాయువును ఉపయోగిస్తారు?
జవాబు: ఫ్రియాన్
13. కిందివాటిలో వాతావరణంలో అత్యధికంగా లభించే హైడ్రోకార్బన్ ఏది?
1) మీథేన్ 2) ఈథేన్ 3) ఇథిలీన్ 4) ఎసిటలీన్
జవాబు: మీథేన్
14. కిందివాటిలో ఓజోన్ పొర మందం తగ్గించని వాయువు ఏది?
1) CFC 2) NO 3) Cl2 4) CO2
జవాబు: CO2
15. కిందివాటిలో ఆమ్లవర్షాలు కురవడానికి కారణంకాని ఆక్సైడ్ ఏది?
1) NO2 2) SO2 3) SO3 4) CO2
జవాబు: CO2
16. కిందివాటిలో హరితగృహ వాయువు (GHG) కానిది ఏది?
1) CO2 2) CH4 3) CFC 4) SO2
జవాబు: SO2
17. ఫ్రియాన్ రసాయన ఫార్ములా ఏంటి?
జవాబు: CCl2F2
18. 'లండన్ ఫాగ్' ఏర్పడటానికి కారణం ఏది?
జవాబు: పరిశ్రమల్లో బొగ్గును మండించడం
19. ఊపిరితిత్తులు, శ్వాసకోశాన్ని ఎక్కువగా ప్రభావితం చేసే కాలుష్య కారకం ఏది?
జవాబు: SO2
20. అకాల వర్షాలు, తుపానులు దేని ఫలితంగా సంభవిస్తాయి?
జవాబు: గ్లోబల్ వార్మింగ్
21. హిమశిఖరాలు ఎప్పుడు కరుగుతాయి?
జవాబు: గ్లోబల్‌వార్మింగ్ ఏర్పడినప్పుడు
22. కిందివాటిని జతపరచండి.
1) గ్రీన్‌హౌజ్ వాయువులు A) అధిక పోషకాలు
2) HNO3 + H2SO4 B) నీటి కాలుష్యం
3) ఫ్లోరోసిస్ C) ఆమ్లవర్షాలు
4) యూట్రిఫికేషన్ D) గాలి కాలుష్యం
E) శబ్ద కాలుష్యం
జవాబు: 1-D, 2-C, 3-B, 4-A
23. గ్రీన్‌హౌజ్ ఫలితం తగ్గించడానికి ఏం చేయాలి?
జవాబు: చెట్లు, అడవులు పెంచాలి
24. కిందివాటిలో దేన్ని 'పరిశ్రమలకు వరం కానీ పర్యావరణానికి శాపం' అని పిలుస్తారు?
1) ఓజోన్ 2) కార్బన్ డై ఆక్సైడ్ 3) క్లోరోఫ్లోరో కార్బన్స్ 4) క్లోరోఫాం
జవాబు: క్లోరోఫ్లోరో కార్బన్స్
25. జలకాలుష్యానికి ప్రధాన కారణమేంటి?
1) జనాభా పెరుగుదల 2) వ్యవసాయ రంగంలో హరిత విప్లవం 3) పారిశ్రామికీకరణ 4) అన్నీ
జవాబు: అన్నీ
26. విషపూరిత లోహాల వల్ల నీరు కలుషితం అయితే కలిగే దుష్ప్రభావం ఏమిటి?
1) నరాల బలహీనత 2) డయేరియా 3) క్యాన్సర్ 4) అన్నీ
జవాబు: అన్నీ
27. మినిమాటా వ్యాధిని కలిగించే కాలుష్య కారకమేది?
జవాబు: Hg
28. కిందివాటిలో ఏది కాలుష్యానికి కారణం కాదు?
1) పెస్టిసైడ్స్ 2) సౌరశక్తి 3) పెట్రోలియం 4) బొగ్గు
జవాబు: సౌరశక్తి
29. భోపాల్ దుర్ఘటన ఏ సంవత్సరంలో జరిగింది? (ఈ ప్రమాదంలో MIC వాయువు వెలువడింది)
జవాబు: 1984
30. క్యోటో ప్రొటోకాల్ కిందివాటిలో దేనికి సంబంధించింది?
1) వాతావరణ మార్పు 2) నదుల అనుసంధానం 3) మాదకద్రవ్యాల దుర్వినియోగం 4) అణు ఒప్పందం
జవాబు: వాతావరణ మార్పు
31. కిందివాటిని జతపరచండి.
1) గాలిలో ఎక్కువగా ఉండే అణుఘటకాలు A) N2, O2
2) గాలిలో తక్కువగా ఉండే అణుఘటకాలు B) CO2, CH4, NO
3) విషలోహాలు C) Zn, Al, Fe
4) హరితగృహ వాయువులు D) Ne, Ar, Kr
E) Hg, Pb, As
జవాబు: 1-A, 2-D, 3-E, 4-B
32. కిందివాటిలో శబ్దస్థాయి ఎన్ని డెసిబుల్స్ (dB) దాటితే అది శబ్దకాలుష్యానికి దారితీస్తుంది?
1) 15 dB 2) 65 dB 3) 100 dB 4) 120 dB
జవాబు: 65 dB
33. భౌమ్య కాలుష్యానికి కారణం ఏంటి?
1) పెస్టిసైడ్లు 2) పారిశ్రామిక వ్యర్థాలు 3) రసాయన ఎరువులు 4) అన్నీ
జవాబు: అన్నీ
34. కింది వాటిలో ప్రాథమిక కాలుష్య కారకం ఏది?
ఎ) CO2 బి) SO2 సి) NO2 డి) అన్నీ
జవాబు: అన్నీ
35. భారత ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణ చట్టాన్ని ఏ సంవత్సరంలో తీసుకువచ్చింది?
జవాబు: 1986
36. పర్యావరణాన్ని కాపాడటం ప్రతి ఒక్కరి ప్రాథమిక విధి - అని భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ పేర్కొంటోంది?
జవాబు: 51
37. మొదటిసారిగా 1972 లో UNO ఆధ్వర్యంలో పర్యావరణ సదస్సు ఎక్కడ జరిగింది?
జవాబు: స్టాక్‌హోం
38. అంతర్జాతీయ ఓజోన్ దినోత్సవాన్ని ఏ రోజు జరుపుకుంటారు?
జవాబు: సెప్టెంబరు 16
39. మాంట్రియల్ ప్రొటోకాల్ కిందివాటిలో దేనికి సంబంధించింది?
ఎ) వాతావరణ మార్పులను పసిగట్టడం బి) ఓజోన్ పొరను పరిరక్షించడం
సి) జీవవైవిధ్యాన్ని పరిరక్షించడం డి) ఏదీకాదు
జవాబు: ఓజోన్ పొరను పరిరక్షించడం
40. DDT అనేది ఒక...
జవాబు: కీటక నాశనకారి
41. వాతావరణంలో అత్యంత వేడిగా ఉండే భాగం ఏది?
జవాబు: థర్మోస్ఫియర్
42. కిందివాటిలో హెర్బిసైడ్ (Herbicide) ఏది?
1) సోడియం క్లోరైడ్ 2) సోడియం సల్ఫేట్ 3) సోడియం క్లోరేట్ 4) ఏదీకాదు
జవాబు: సోడియం క్లోరేట్
43. కిందివాటిలో ఏది విషపూరితం, కాలుష్యకారిణి?
1) కాడ్మియం 2) లెడ్ 3) మెర్క్యురీ 4) జింక్
జవాబు: 1, 2, 3
44. కిందివాటిని జతపరచండి.
1) హరితగృహ ప్రభావం A) చర్మ క్యాన్సర్, కాటరాక్ట్
2) ఆమ్ల వర్షాలు B) మార్బుల్ కట్టడాలు దెబ్బతినడం
3) ఓజోన్ పొర మందం తగ్గడం C) ధృవ ప్రాంతాల్లో మంచు కరగడం
4) ఫొటో కెమికల్ స్మాగ్ D) తలనొప్పి, దృష్టి లోపం
E) కళ్లలో దురద
జవాబు: 1-C, 2-B, 3-A, 4-E
45. తెలంగాణా రాష్ట్రప్రభుత్వం 33% అడవుల విస్తీర్ణం పెంచడమే లక్ష్యంగా తలపెట్టిన 'హరితహారం' కార్యక్రమం ఏ సంవత్సరంలో ప్రారంభమైంది?
జవాబు: 2015 జులై
పర్యావరణం - ముఖ్యాంశాలు
* పర్యావరణాన్ని వాతావరణం, జలావరణం, శిలావరణం, జీవావరణం అనే నాలుగు విభాగాలుగా వర్గీకరించారు.
* వాతావరణాన్ని తిరిగి నాలుగు భాగాలుగా విభజించవచ్చు.
1) ట్రోపోస్ఫియర్ 2) స్ట్రాటోస్ఫియర్ 3) మీసోస్ఫియర్ 4) అయనోస్ఫియర్
* పర్యావరణ కాలుష్యం ప్రధానంగా నాలుగు రకాలు
1) గాలి కాలుష్యం 2) జల కాలుష్యం 3) శబ్ద కాలుష్యం 4) భూమి కాలుష్యం
* గాలి/ వాతావరణ కాలుష్యం వల్ల కలిగే అనర్థాలు మూడు రకాలు.
1) ఆమ్లవర్షాలు 2) ఓజోన్ పొర మందం తగ్గడం 3) హరితగృహ ప్రభావం
* నైట్రోజన్, సల్ఫర్ ఆక్సైడ్లు నీటిఆవిరితో కలిసి ఆమ్లాలను ఏర్పరుస్తాయి. ఇవి నేలమీద వర్షం నీటితోపాటు కురుస్తాయి. కాబట్టి, వీటిని ఆమ్లవర్షాలు అంటారు.
* CFC, NO, Cl2 వాయువులు స్ట్రాటోస్ఫియర్లోని ఓజోన్‌తో చర్యనొంది దాని మందాన్ని తగ్గిస్తాయి.
* CH4, NO, CFC, O3, నీటిఆవిరి, CO2 లను గ్రీన్‌హౌజ్ వాయువులు (GHG) అంటారు. వీటివల్ల భూఉపరితలం వేడెక్కుతుంది. దీన్నే గ్లోబల్ వార్మింగ్ అంటారు. ఇది ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య.
రచయిత: డాక్టర్ వాసం శ్రీనివాస్ (విషయ నిపుణులు)