మాదిరి ప్రశ్నలు
1. జాతీయ వన్యప్రాణి సంరక్షణ చట్టం భారతదేశంలో ఎప్పుడు అమల్లోకి వచ్చింది? (ఏఈ, 2015)
జ: 1972
2. భారతదేశంలోని పర్యావరణ పరిరక్షణ చట్టాలను ఆరోహణ క్రమంలో అమర్చండి. (ఏఎస్‌వో, 2018)
a) జాతీయ వన్యప్రాణి చట్టం b) జీవ వైవిధ్య చట్టం
c) వాయుకాలుష్య నియంత్రణ చట్టం d) నీటి కాలుష్య నియంత్రణ చట్టం
జ: a, d, c, b
3. కిందివాటిలో జీవవైవిధ్య సంరక్షణ కేంద్రాలతో భౌగోళిక సరిహద్దు లేనివి? (గ్రూప్ 4, 2018)
1) జాతీయ పార్కులు 2) జీవగోళ సంరక్షణ ప్రాంతాలు
3) అభయారణ్యాలు 4) జల సంరక్షణ ప్రాంతాలు
జ: 3 (అభయారణ్యాలు)
4. భారతదేశంలో 2016 వాతావరణ మార్పు జాతీయ కార్యచరణ ప్రణాళికలో భాగంగా ఎన్ని జాతీయ మిషన్లు ప్రారంభించారు? (గ్రూప్ 1, 2017)
జ: 8
5. కిందివాటిని జతపరచండి. (ఎస్సై, 2016)
చట్టాలు | ఆమోదించిన సంవత్సరం |
i) నీటి కాలుష్య నియంత్రణ చట్టం | a) 1974 |
ii) వాయుకాలుష్య నియంత్రణ చట్టం | b) 1981 |
iii) పర్యావరణ పరిరక్షణ చట్టం | c) 1986 |
iv) జీవవైవిధ్య చట్టం | d) 2002 |
e) 1985 |
i ii iii iv
జ: a b c d
6. భారతదేశ జీవవైవిధ్య సంరక్షణ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? (ఏఈఈ, 2016)
జ: చెన్నై
7. జాతీయ పర్యావరణ పరిరక్షణ చట్టాన్ని ఎప్పుడు ఆమోదించారు? (గ్రూప్స్, 2017)
జ: 1986