• facebook
  • whatsapp
  • telegram

భారత రాజ్యాంగంలోని సమాఖ్య లక్షణాలు - పరిశీలన

మాదిరి ప్ర‌శ్న‌లు

1. కిందివాటిలో భారత రాజ్యాంగ సమాఖ్య లక్షణం కానిది ఏది?
1) అధికార విభజన         2) లిఖిత రాజ్యాంగం          
3) ద్విసభా విధానం          4) ఏక పౌరసత్వం
జ: 4 (ఏక పౌరసత్వం)

 

2. కిందివాటిలో భారత రాజ్యాంగ సమాఖ్య లక్షణం ఏది?
1) రాజ్యాంగ ఔన్నత్యం    2) ఏక రాజ్యాంగం              
3) రాజ్యాంగ అదృఢత్వం   4) సమగ్ర న్యాయశాఖ
జ: 4 (రాజ్యాంగ ఔన్నత్యం )

 

3. సమాఖ్య ఏర్పడటానికి అనుకూలమైన అంశాలు ఏవి?
ఎ) భిన్నత్వం         బి) బహుళత్వం       సి) భౌగోళిక సామీప్యం
1) ఎ మాత్రమే               2) ఎ, బి మాత్రమే                
3) బి, సి మాత్రమే           4) ఎ, బి, సి
జ: 4 (ఎ, బి, సి)

 

4. కేంద్ర - రాష్ట్రాల మధ్య అధికార విభజనకు సంబంధించిన షెడ్యూల్ ఏది?
జ: 7 వ షెడ్యూల్

 

5. కిందివాటిలో భారత రాజ్యాంగ ఏక కేంద్ర లక్షణాలు ఏవి?
ఎ) రాజ్యాంగ ఔన్నత్యం      బి) అధికార విభజన    
సి) లిఖిత రాజ్యాంగం      డి) అఖిల భారత సర్వీసులు
1) ఎ, బి, సి మాత్రమే         2) బి, సి, డి మాత్రమే  
3) ఎ, బి, సి, డి              4) డి మాత్రమే
జ: 4 (డి మాత్రమే)

 

6. భారత రాజ్యాంగాన్ని 'అర్ధ సమాఖ్య' అని పేర్కొన్నది ఎవరు?
జ: కె.సి. వేర్

 

7. కిందివాటిని జతపరచండి.
భారత సమాఖ్య                                                 వ్యక్తులు
ఎ) తీవ్రమైన సమాఖ్య                                      I) మోరిస్ జోన్స్
బి) బేరసారాల సమాఖ్య                                   II) పాల్ ఆపిల్‌బి
సి) బలమైన కేంద్రీకృత ధోరణులున్న సమాఖ్య       III) ఐవర్ జెన్నింగ్స్
డి) వినూత్న స్వభావం కలది సుయి జెవరీన్        IV) అలెగ్జాండ్రోవిక్జ్,
జ: ఎ-II, బి-I, సి-III, డి-IV

 

8. 'ఫోడస్' ఏ భాషా పదం?
జ: లాటిన్

 

9. రాష్ట్ర జాబితాలో ప్రస్తుతం ఉన్న అంశాల సంఖ్య .....
జ: 61

 

10. రాజ్యాంగంలోని 1 వ ప్రకరణం భారత దేశాన్ని ఏ విధంగా పేర్కొంటుంది?
జ: యూనియన్ ఆఫ్ స్టేట్స్

 

11. భారత రాజ్యాంగాన్ని సమాఖ్యగా సుప్రీం కోర్టు ఏ కేసులో పేర్కొంది?
జ: ఎస్.ఆర్. బొమ్మై కేసు

 

12. కిందివాటిలో భారత రాజ్యాంగ సమాఖ్య లక్షణాలు ఏవి?
ఎ) లిఖిత రాజ్యాంగం  బి) దృఢ రాజ్యాంగం  సి) రాజ్యాంగ ఔన్నత్యం
1) ఎ మాత్రమే                  2) ఎ, బి మాత్రమే            
3) బి, సి మాత్రమే             4) ఎ, బి, సి
జ: 4 (ఎ, బి, సి)

 

13. కింది అంశాలను పరిశీలించండి.
ఎ) భారతదేశంలో రాష్ట్రాలు అవిచ్ఛిన్నమైనవి.
బి) రాజ్యసభలో రాష్ట్రాలకు ప్రాతినిధ్యం సమానంగా లేకపోవడం.
సి) రాష్ట్ర జాబితాపై పార్లమెంటుకు అధికారం.
డి) అత్యవసర పరిస్థితికి సంబంధించిన నిబంధనలు.
ఇ) కేంద్ర-రాష్ట్రాల మధ్య రాజ్యాంగబద్ధ అధికార విభజన.
పైన పేర్కొన్న ఏ అంశాలు రాజ్యాంగ ఏకకేంద్ర లక్షణాలను బలపరుస్తున్నాయి?
1) ఎ, బి, సి మాత్రమే       2) బి, సి, డి, ఇ మాత్రమే        
3) ఎ, బి, సి, డి, ఇ     4) ఎ, బి, సి, డి మాత్రమే
జ: 4 (ఎ, బి, సి, డి మాత్రమే)

 

14. భారత రాజ్యాంగాన్ని 'సహకార సమాఖ్య అని పేర్కొన్నది ఎవరు?
జ: గ్రాన్‌విల్ ఆస్టిన్

Posted Date : 31-01-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌