• facebook
  • whatsapp
  • telegram

భారత ఆర్థిక విధానాలు

మాదిరి ప్ర‌శ్న‌లు

1. భారత ఆర్థిక రాజ్యాంగంగా ఏ పారిశ్రామిక తీర్మానాన్ని అభివర్ణిస్తారు?
జ: పారిశ్రామిక తీర్మానం - 1956

 

2. ''వ్యవసాయ రంగంలో ఉత్పాదకత పెంచడానికి భూ వ్యవస్థలో అవసరమైన మార్పులు తీసుకురావడాన్ని భూసంస్కరణలు అంటారు". అని నిర్వచించింది ఎవరు?
జ: ఐక్యరాజ్య సమితి

 

3. 'భారతదేశంలో భూ సంస్కరణలు' అనే గ్రంథాన్ని రాసింది ఎవరు?
జ: ముఖర్జీ

 

4. లియాంటిఫ్ వైపరీత్యం కిందివాటిలో దేన్ని సూచిస్తుంది?
1) మూలధనం సమృద్ధిగా ఉండే దేశాలు, మూలధన వస్తువులనే ఎగుమతి, దిగుమతి చేయడం.
2) మూలధనం సమృద్ధిగా ఉండే దేశాలు, మూలధన సాంద్రత ఉన్న వస్తువులను ఎగుమతి చేయడం.
3) మూలధనం సమృద్ధిగా ఉండే దేశాలు, శ్రమ సాంద్రత ఉన్న వస్తువులను ఎగుమతి చేయడం.
4) శ్రమ సమృద్ధిగా ఉండే దేశాలు, శ్రమ సాంద్రత ఉన్న వస్తువులను ఎగుమతి, దిగుమతి చేయడం.
జ: 3(మూలధనం సమృద్ధిగా ఉండే దేశాలు, శ్రమ సాంద్రత ఉన్న వస్తువులను ఎగుమతి చేయడం.)

 

5. పారిశ్రామిక విధానం - 1991లోని ముఖ్యమైన ప్రతిపాదన-
జ: ప్రత్యక్ష విదేశీ పెట్టుబడులను ప్రాధాన్యం ఉన్న పరిశ్రమల్లో 51% వరకు అనుమతించడం.

 

6. అధికారికంగా GATT, WTO లను ఎప్పుడు ఏర్పరిచారు?
జ: 1995

 

7. భారత్‌లో నూతన ప్రభుత్వ రంగ విధానం లక్షణం ఏమిటి?
      1) MOU పద్ధతిని ప్రవేశపెట్టడం
      2) ప్రభుత్వ రంగ సంస్థల ప్రయివేటీకరణ
      3) దీర్ఘరుగ్మత ఉన్న పరిశ్రమలను మూసివేయడం
      4) అన్నీ
జ: 4(అన్నీ)

 

8. ఒక ప్రభుత్వ రంగ సంస్థ మహారత్న హోదా పొందాలంటే-
      1) నవరత్న హోదాను కలిగి ఉండాలి.
      2) స్టాక్ మార్కెట్‌లో నమోదై షేర్స్ ట్రేడింగ్ అవుతూ ఉండాలి.
      3) వార్షిక టర్నోవర్ రూ.25,000 కోట్లు ఉండాలి.
      4) అన్నీ
జ: 4(అన్నీ)

 

9. కిందివాటిలో భూసంస్కరణల పరిధిలో లేనిది ఏది?
      1) కమతాల గరిష్ఠ పరిమితి విధింపు     2) మధ్యవర్తుల తొలగింపు
      3) భూదానోద్యమం                               4) ఏదీకాదు
జ: 3(భూదానోద్యమం)

 

10. కిందివాటిలో Soft loan window ద్వారా రుణాలు అందించేది-
1) అంతర్జాతీయ అభివృద్ధి సంస్థ       2) ప్రపంచ బ్యాంకు
 3) అంతర్జాతీయ ద్రవ్యనిధి                4) ప్రపంచ వాణిజ్య సంస్థ
జ: 1(అంతర్జాతీయ అభివృద్ధి సంస్థ)

 

11. మనదేశంలో భూసంస్కరణల ముఖ్య లక్ష్యం ఏమిటి?
జ: భూమి సాగుచేసే వారికి భద్రత కల్పించడం.

 

12. రెండో పారిశ్రామిక విధాన తీర్మానం ప్రధాన లక్ష్యం ఏమిటి?
జ: ప్రభుత్వ రంగాన్ని విస్తరించడం.

 

13. భారతదేశంలో హరిత విప్లవం ఏ పంటల దిగుబడిలో ఎక్కువగా విజయవంతమైంది?
జ: గోధుమ, వరి

 

14. జిల్లా పారిశ్రామిక కేంద్రాలు (DIC) అనే భావనను ప్రవేశపెట్టింది-
జ: జనతా ప్రభుత్వం (1977)

 

15. సభ్యదేశాలకు స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ (SDRs)ను కల్పించే అంతర్జాతీయ సంస్థ ఏది?
జ: అంతర్జాతీయ ద్రవ్యనిధి (IMF)

 

16. లియాంటిఫ్ వైపరీత్యం దేని దత్తాంశ పరీక్షకు సంబంధించింది?
జ: హెక్సర్ - ఒహ్లిన్

 

17. అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఏ రూపంలో విదేశీ పెట్టుబడి ఉండాలి?
జ: పోర్టుపోలియో నిధులు

 

18. కిందివాటిలో దేన్ని తగ్గించడం FRBM ముఖ్య లక్ష్యం?
      1) బడ్జెట్ లోటు       2) రాబడి లోటు       3) బహిర్గత లోటు       4) బ్యాంకింగ్ లోటు
జ: 2(రాబడి లోటు)

 

19. 1894 భూసేకరణ చట్టం ప్రకారం ప్రభుత్వానికి కింది ఏ భూమిని తీసుకునే అర్హత ఉంది?
1) ప్రజా ప్రయోజనార్థం ఎవరి నుంచైనా భూసేకరణ
2) ప్రైవేటు ఉద్దేశానికి ఎవరి నుంచైనా భూసేకరణ
3) కార్పొరేట్ రంగం నుంచి భూసేకరణ
4) ఉన్నత శ్రేణి కుటుంబాల నుంచి భూసేకరణ
జ: 1(ప్రజా ప్రయోజనార్థం ఎవరి నుంచైనా భూసేకరణ)

 

20. ప్రపంచ వాణిజ్య సంస్థ (WTO) ను ఎప్పుడు స్థాపించారు?
జ: 1995

 

21. భారత్‌లో చిన్నతరహా పరిశ్రమలను ప్రోత్సహించడానికి కారణం ఏమిటి?
జ: ఉద్యోగ అవకాశాలను విస్తరించడం

 

22. ఒక దేశం విదేశాలతో వ్యాపారం చేయకుండా ఒంటరిగా ఉండిపోతే ఆ ఆర్థిక వ్యవస్థను ఏమంటారు?
జ: ఇనుపతెర ఆర్థిక వ్యవస్థ

 

23. లక్ష్య నిర్ధారిత ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పంపిణీ చేసేది-
జ: బడుగు, పేదవారికి మాత్రమే

 

24. గ్రామీణ పరపతి కోసం ఏర్పరిచిన శిఖరాగ్ర వ్యవస్థ-
జ: నాబార్డు

 

25. జిల్లా స్థాయిలో గ్రామీణ పారిశ్రామికీకరణను ప్రోత్సహించే మూలాధార ఏజెన్సీ ఏది?
జ: డీఐసీ

 

26. మొదటిసారిగా ఏ దేశంలో పారిశ్రామిక విప్లవం ఏర్పడింది?
జ: ఇంగ్లండ్

 

27. అభిలషణీయ సుంకం అనేది-
జ: వ్యాపార షరతులను మెరుగుపరుస్తుంది

 

28. మేధోసంపత్తి హక్కులు (IPR) అమలు కావడం వల్ల సంభవించే పరిణామం ఏమిటి?
జ: నూతన ఆలోచనలు, పరిశోధనలను విస్తృతంగా ఉపయోగించడం

 

29. పెట్టుబడిదారీ వ్యవస్థలో ధరల వ్యవస్థ దేని కేటాయింపులను నిర్ణయిస్తుంది?
జ: వనరులు

 

30. అంతర్జాతీయ వ్యాపారంలో ఆంక్షలున్న వర్తక విధానాన్ని ఏమని పిలుస్తారు?
జ: రక్షణ

 

31. రైతులపై జాతీయ కమిషన్ తన నివేదికను 2005, 2006లలో సమర్పించింది. ఆ కమిషన్ ఛైర్మన్ ఎవరు?
జ: డాక్టర్ ఎం.ఎస్. స్వామినాథన్

 

32. ప్రాథమిక పరపతి సంఘాలకు విత్తాన్ని సమకూర్చే బాధ్యత ఎవరిది?
జ: కేంద్ర సహకార బ్యాంకులు

 

33. 1990 ప్రారంభ కాలంలో మనదేశంలో సంభవించిన ఆర్థిక సంక్షోభ రూపం -
జ: వ్యాపార చెల్లింపుల శేషం సంక్షోభంలో పడటం

 

34. ప్రభుత్వ రంగంలో స్వచ్ఛంద పదవీ విరమణ పథకం దేని వల్ల సంభవించింది?
జ: ఎక్కువ సిబ్బంది

 

35. సరళీకరణ అంటే ఏమిటి?
1) ప్రైవేటీకరణ   2) డీలైసెన్సింగ్  3) విదేశీ వ్యాపారం, పెట్టుబడులపై ఆంక్షలను తగ్గించడం   4) అన్నీ
జ: 4(అన్నీ)

 

36. అభిలషణీయ టారీఫ్ వల్ల ఒక దేశ సంక్షేమం........అవుతుంది.
జ: గరిష్ఠం

 

37. మొదటి నూలు పరిశ్రమను ఎక్కడ స్థాపించారు?
జ: కలకత్తా దగ్గర ఉన్న ఫోర్ట్ గ్లోస్టర్

 

38. అంతర్గత వ్యాపారం దేనికి సంబంధించింది?
జ: షేర్ మార్కెట్

 

39. ప్రపంచ బ్యాంకు (IBRD)ను ఎప్పుడు స్థాపించారు?
జ: 1995

 

40. సంప్రదాయ తులనాత్మక ప్రయోజన సిద్ధాంతాన్ని వివరించే అంశం?
జ: శ్రామిక వ్యయం

 

41. హెక్సర్ - ఒహ్లిన్ సిద్ధాంతం యొక్క అనుభవ సిద్ధి అధ్యయనం కిందివారిలో ఎవరి అధ్యయనానికి వైరుధ్యమైన ఫలితాలను సూచించింది?
1) ఆడమ్ స్మిత్                2) హర్షమన్      
3) డబ్ల్యూ. లియాంటిఫ్       4) జాకోబ్ వైనర్
జ: 3(డబ్ల్యూ. లియాంటిఫ్)

 

42. బీపీఎల్ వారికి మాత్రమే సబ్సిడీపై ఆహార ధాన్యాలను అందజేయడానికి భారత ప్రభుత్వం లక్ష్య నిర్ధారిత ప్రజాపంపిణీ వ్యవస్థను ఎప్పుడు అమలు చేసింది?
జ: 1997

 

43. ఒక దేశ అంతర్జాతీయ లావాదేవీల్లో రాబడి (రశీదులు), చెల్లింపులను వివరించే జాబితా ఏది?
జ: అంతర్జాతీయ చెల్లింపుల శేషం

 

44. వెనుకబడిన దేశాల ముఖ్య ఎగుమతులు ఏవి?
జ: ప్రాథమిక వస్తువులు

 

45. గ్రామీణ ప్రాంతాల రుణ అవసరాలను తీర్చే ఎపెక్స్ సంస్థ ఏది?
జ: నాబార్డు

 

46. అంతర్జాతీయ వ్యాపారానికి కారకాల తేడా ముఖ్య కారణమని చెప్పిన వారెవరు?
జ: హెక్సర్ - ఒహ్లిన్

 

47. వెనుకబడిన దేశాల లక్షణాలు-
1) మూలధన కల్పన తక్కువ                  2) తక్కువ అక్షరాస్యత
3) ప్రాథమిక రంగానికి వాటా ఎక్కువ         4) అన్నీ
జ: 4(అన్నీ)

 

48. నిరపేక్ష లాభ అంతర్జాతీయ నమూనాను తెలిపినవారెవరు?
జ: ఆడమ్ స్మిత్

 

49. దిగుమతుల కోటా ఒక-
జ: నాన్ టూకిష్ వ్యాపార అడ్డంకి (NTB)

 

50. కిందివాటిలో సరళ రుణ కిటికీ వ్యవస్థను ఏది కలిగి ఉంది?
      1) ఐబీఆర్‌డీ       2) ఐడీఏ       3) ఐఎమ్ఎఫ్       4) ఐఎఫ్‌సీ
జ: 2(ఐడీఏ)

 

51. గ్రామీణ ప్రాంతీయ బ్యాంకులను ఎప్పుడు స్థాపించారు?
జ: 1975

 

52. చెల్లింపుల శేషంలో అదృశ్య ఖాతా దేనిలోని భాగం?
జ: కరెంటు

 

53. భారతదేశంలో రూపాయి విలువను 22 శాతానికి ఎప్పుడు తగ్గించారు?
జ: 1991

 

54. మార్కెట్ చట్టాన్ని వృద్ధి పరచినవారెవరు?
జ: జె.బి. సే

 

55. పెట్టుబడి రహిత కమిషన్ ఎప్పుడు ఏర్పడింది?
జ: ఆగస్టు 1996

 

56. మనదేశంలో కుటీర, చిన్నతరహా పరిశ్రమల పాత్ర-
     1) ఉద్యోగితను ప్రోత్సహించడం
     2) అసమానతలను (ఆర్థిక) తొలగించడం
     3) ఆర్థిక స్థోమత కేంద్రీకృతదారులను అరికట్టడం
     4) అన్నీ
జ: 4(అన్నీ)

 

57. నవకల్పన లాభాల సిద్ధాంతాలను పరిచయం చేసినవారెవరు?
జ: షుంపీటర్

 

58. కిందివాటిలో ఏ వాదనపై ఆడమ్స్ అంతర్జాతీయ వ్యాపారం ఆధారపడి ఉంది?
     1) అవకాశవాద సిద్ధాంతం                2) నిరపేక్ష అనుకూలస్థితి
     3) తులనాత్మక అనుకూల స్థితి        4) తులనాత్మక ఖర్చు
జ: 2(నిరపేక్ష అనుకూలస్థితి)

 

59. స్వేచ్ఛా విధానం అంటే పరిశ్రమ, వాణిజ్యంలో ప్రభుత్వ జోక్యం ఏవిధంగా ఉండటం?
జ: కనిష్ఠం

 

60. మనదేశంలో ప్రాథమిక రంగం అంటే?
జ: వ్యవసాయ రంగం

 

61. భారతదేశంలో ధరల పెరుగుదల, ద్రవ్యోల్భణం పెరగడానికి కారణం ఏమిటి?
     1) ఆదాయ అసమానతలు                     2) బీవోపీపై ప్రతికూల ప్రభావం
     3) పెట్టుబడులపై ప్రతికూల ప్రభావం        4) అన్నీ
జ: 4(అన్నీ)

 

62. జాతీయ వ్యవసాయ కమిషన్ ప్రకారం వ్యవసాయ రంగంలో ఉద్యోగిత సంభావ్యత అత్యధికంగా దేనిలో ఉంది?
జ: ఉద్యాన కృషి పంటల్లో

 

63. గనులను కిందివాటిలో ఏ రంగంగా పరిగణిస్తారు?
   1) పారిశ్రామిక రంగం      2) వ్యవసాయ రంగం    
    3) తృతీయ రంగం        4) అవస్థాపనా సౌకర్యాల రంగం
జ: 1(పారిశ్రామిక రంగం)

 

64. ప్రపంచ బ్యాంకు ప్రధాన విధి ఏమిటి?
జ: అభివృద్ధి నిధులను సభ్యదేశాలకు అందించడం.

 

65. కిందివాటిలో నాబార్డు ప్రధాన ఆశయం కానిదేది?
     1) రాష్ట్ర సహకార బ్యాంకులకు రుణాలు అందించడం.
     2) చిన్నతరహా, కుటీర పరిశ్రమలను ప్రోత్సహించడం.
     3) వాణిజ్య బ్యాంకులకు రుణాలు ఇవ్వడం.
     4) వ్యవసాయం, గ్రామీణాభివృద్ధిని ప్రోత్సహించడం.
జ: 3(వాణిజ్య బ్యాంకులకు రుణాలు ఇవ్వడం.)

 

66. ఏ పరిస్థితిలో లోటు ద్రవ్య విధానం ద్రవ్యోల్బణానికి దారితీయదు?
     1) కొరత ఉన్నప్పుడు, ఆహార ధాన్యాల దిగుమతి
     2) విదేశాల్లో ద్రవ్యాన్ని ఖర్చు పెట్టడం
     3) మూలధన వస్తువులు, యంత్రాలను దిగుమతి చేసుకోవడానికి ద్రవ్యాన్ని వినియోగించడం
     4) అన్నీ
జ: 4(అన్నీ)

 

67. మూల్యహీనీకరణ వల్ల-
జ: దిగుమతులు పెరుగుతాయి

 

68. 1969వ సంవత్సరపు పారిశ్రామిక లైసెన్సింగ్ విధాన విచారణ సంఘాన్ని ఏ విధంగా పేర్కొంటారు?
జ: దత్ కమిటీ

 

69. ఓంకార్ గోస్వామి కమిటీని దేన్ని అధ్యయనం చేయడానికి నియమించారు?
జ: పారిశ్రామిక రుగ్మత

 

70. దేశీయ మార్కెట్‌లో కంటే విదేశీ మార్కెట్‌లో ఒక వస్తువును తక్కువ ధరకు అమ్మితే, దాన్ని ఏమంటారు?
జ: డంపింగ్

 

71. హెక్సర్ - ఒహ్లిన్ సిద్ధాంతం దేని మీద ఆధారపడింది?
జ: కారకాల లభ్యతలో ఉండే తేడాలు

 

72. మారకం రేటు $ 1కి రూ.60 నుంచి రూ.50కి అయినప్పుడు
జ: రూపాయి విలువ పెరిగినట్లు

 

73. హవాలా (Hawala) అంటే?
జ: చట్ట విరుద్ధమైన విదేశీ మారకం

 

74. వ్యాపార చెల్లింపుల శేషం ప్రస్తుత అకౌంట్‌లోని లోటును ఎలా సవరించవచ్చు?
     1) ఆస్తుల అమ్మకం              2) విదేశాల నుంచి రుణం    
      3) మూలధనం దిగుమతి     4) అన్నీ
జ: 4(అన్నీ)

 

75. భారతదేశంలో పారిశ్రామిక రుగ్మతకు కారణం కానిది-
     1) మూలధన అకౌంట్‌పై మార్పిడి లేకపోవడం
     2) శ్రామిక సమస్య
     3) తప్పుడు ఉనికి
     4) అప్రయుక్త సాంకేతిక విజ్ఞానం
జ: 1(మూలధన అకౌంట్‌పై మార్పిడి లేకపోవడం)

 

76. అన్ని దేశాల మధ్య స్వేచ్ఛగా ప్రవహించే వాణిజ్యం, పెట్టుబడులే....
జ: ప్రపంచీకరణ

 

77. ఐఎమ్ఎఫ్ ద్వారా ప్రవేశపెట్టిన ఎస్‌డీఆర్ పథకాన్ని దేని కోసం ప్రారంభించారు?
     1) ప్రపంచ వ్యాపారాన్ని విస్తరింపచేయడం
     2) విదేశీ ద్రవ్యత్వాన్ని పెంపొందించడం
     3) సభ్యులకు నిధి, వనరులను ఎక్కువ అందుబాటులోకి తేవడం
     4) అన్నీ
జ: 4(అన్నీ)

 

78. లోటు ద్రవ్యవిధానం అంటే ఏమిటి?
జ: రాబడి కంటే ఎక్కువ ఖర్చు చేయడం

 

79. MRTP చట్టం ఉద్దేశం-
జ: ఆర్థిక స్థోమత కేంద్రీకరణను అదుపు చేయడం

 

80. IMF స్థిర మారకరేటు విధానం ఎప్పుడు అంతం అయ్యింది?
జ: 1971

 

81. పెద్ద ప్రభుత్వ లిమిటెడ్ కంపెనీలకు, సహకార సంఘాలకు విత్తాన్ని సమకూర్చేది-
జ: ఐఎఫ్‌సీఐ

 

82. చిన్న కమతాల సమీకరణ ముఖ్య లక్ష్యం దేన్ని నిరోధించడం?
జ: భూ విభజన

 

83. విదేశీ చెల్లింపుల శేషం ఎగుమతి, దిగుమతుల మధ్య ఉన్న ఏ తేడాలకు సంబంధించింది?
జ: విలువ

 

84. భారతదేశంలో వ్యవసాయంలో ప్రచ్ఛన్న నిరుద్యోగిత చోటు చేసుకోవడానికి కారణం?
జ: భూమిపై జనాభా ఒత్తిడి, గ్రామీణ వైవిధ్యం తక్కువగా ఉండటం

 

85. కిందివాటిలో ఆహార ధాన్యాలని వేటిని అంటారు?
     1) మిల్లెట్లు      2) పప్పులు      3) గోధుమలు, బియ్యం      4) అన్నీ
జ: 4(అన్నీ)

 

86. అభివృద్ధి కోసం భారీ పరిశ్రమల్లో పెట్టుబడి పెట్టాలని వాదించిన అభివృద్ధి సిద్ధాంతం-
జ: బిగ్‌పుష్

 

87. దీర్ఘకాల పరపతి సౌకర్యాన్ని కల్పించే బ్యాంకులేవి?
జ: భూ అభివృద్ధి బ్యాంకులు

 

88. ఆడమ్ స్మిత్ ప్రకారం అంతర్జాతీయ వ్యాపారానికి మూలం ఏమిటి?
జ: సంపూర్ణ ప్రయోజన సూత్రం

 

89. చౌకధరల దుకాణాల ద్వారా ప్రభుత్వం సప్లయి చేసే ఆహార ధాన్యాల ధర
జ: జారీచేసే ధర

 

90. 1996 - 97లో ప్రారంభించిన వేగవృద్ధి నీటిపారుదల ప్రయోజనాల పథక ముఖ్య లక్ష్యం ఏమిటి?
జ: పూర్తికాని నీటిపారుదల ప్రాజెక్టులను పూర్తి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వాలకు సహాయం అందించడం

 

91. విదేశీ మారక చెల్లింపుల్లోని మూలధన ఖాతాలో చేర్చినవి ఏవి?
జ: విదేశీ రుణాలు

 

92. వెనుకబడిన ఆర్థిక వ్యవస్థల్లో ఉత్పాదకత తక్కువగా ఉండటానికి కారణం
     1) శిక్షితులైన, నైపుణ్యం ఉన్న శ్రామికుల కొరత
     2) మూలధన, ఇతర వనరుల కొరత
     3) వెనుకబడిన సాంకేతిక పరిజ్ఞానం
     4) అన్నీ
జ: 4(అన్నీ)

 

93. ఎలాంటి పరిస్థితిలో మూల్యహీనీకరణ విదేశీ మారక చెల్లింపుల లోటును తగ్గించలేదు?
జ: ఎగుమతుల డిమాండ్ వ్యాకోచత్వం ఒకటి కంటే తక్కువ

 

94. జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని ఎప్పుడు ఆమోదించారు?
జ: 2005

 

95. SME అంటే......
జ: చిన్న, మధ్య ఎంటర్‌ప్రైజెస్

 

96. కిందివాటిలో అదృశ్య రాబడులకు ఉదాహరణ-
     1) ప్రవాస భారతీయుల ఆదాయాలు      2) స్పెక్యులేషన్ వ్యాపార లాభాలు
     3) భూములను తిరిగి అమ్మడం            4) ఏదీకాదు
జ: 1(ప్రవాస భారతీయుల ఆదాయాలు)

 

97. పారిశ్రామిక నిల్వ సేన భావాన్ని వాడిందెవరు?
జ: కారల్ మార్క్స్

 

98. MRTP చట్టం రద్దుకు సిఫార్సు చేసిన కమిటీ .....?
జ: రాఘవన్ కమిటీ

 

99. టారిఫ్ విధించడం వల్ల-
     1) దిగుమతి పోటీ వస్తువుల ఉత్పత్తి పెరుగుతుంది
     2) దిగుమతి వస్తువుల ధరలు పెరుగుతాయి
     3) దిగుమతి వస్తువుల జాతీయ వినియోగం తగ్గుతుంది
     4) అన్నీ సరైనవే
జ: 4(అన్నీ సరైనవే)

 

100. 1977 పారిశ్రామిక విధానం దేన్ని ప్రోత్సహించింది?
జ: చిన్నతరహా, కుటీర పరిశ్రమలను

 

101. నవకల్పన లాభాల సిద్ధాంతాన్ని పరిచయం చేసినవారు-
జ: షుంపీటర్

 

102. 1969లో పారిశ్రామిక లైసెన్స్ విధానం విచారణను సమర్పించిన కమిటీ-
జ: దత్ కమిటీ

 

103. కిందివాటిలో దీర్ఘకాలిక విత్తాన్ని పరిశ్రమలకు అందించే సంస్థ ఏది?
       1) ఎల్ఐసీ        2) ఆర్‌బీఐ        3) ఎస్‌బీఐ        4) ఐడీబీఐ
జ: 4(ఐడీబీఐ)

 

104. భారత్‌లో లార్డ్ కారన్‌వాలీస్ ప్రవేశపెట్టింది-
జ: జమీందారీ పద్దతి

 

105. ఒక పరిశ్రమ ఎప్పుడు ఖాయిలా పడుతుంది?
జ: నిరంతరంగా మిగులు ఉత్పత్తి లేకపోవడం

 

106. భారతదేశ విదేశీ వ్యాపారంలో కరెంటు అకౌంటులో అధిక మొత్తంలో ఉన్న అదృశ్యాలు ఏవి?
జ: విదేశీ ద్రవ్యం

 

107. ప్రపంచ వాణిజ్య సంస్థ (WTO) సభ్య దేశాలను దేని కోసం ఒత్తిడి చేస్తుంది?
       1) మార్కెట్లు అందరికీ లభ్యమయ్యేలా సుంకాల తగ్గింపు
       2) ఎగుమతి సబ్సిడీని తొలగించడం
       3) స్వేచ్ఛా వ్యాపారాన్ని ప్రోత్సహించడానికి కోటాలను, సుంకాలను నిషేధించడం
       4) అన్నీ
జ: 4(అన్నీ)

 

108. 'అంతర్జాతీయ వ్యాపారం అనేది ప్రపంచ శాంతికి పెట్టనికోట లాంటిద'ని అభివర్ణించిన వారెవరు?
జ: జె.ఎస్. మిల్

 

109. 1996 ఆగస్టులో ఏర్పాటైన పెట్టుబడుల ఉపసంహరణ కమిషన్‌కు ఎవరు అధ్యక్షత వహించారు?
జ: జి.వి. రామకృష్ణన్

 

110. District Industrial Centres (DIC) లను ఎప్పుడు స్థాపించారు?
జ: 1978

 

111. విత్తపరమైన చర్యల్లో భాగంగా 1988లో ఏర్పాటైన సింగిల్ విండో స్కీమ్ ప్రధాన ఉద్దేశం ఏమిటి?
జ: చిన్న పరిశ్రమలకు కావాల్సిన దేశీయ రుణాలు, విదేశీ రుణాలు కల్పించడం

 

112. ఒక సంవత్సర కాలంలో ఒక దేశం, విదేశాలతో జరిపే అన్నిరకాల వ్యాపార వ్యవహారాలను క్రమ పద్ధతిలో నమోదు చేసే పట్టికను ఏమంటారు?
జ: విదేశీ వ్యాపార చెల్లింపుల శేషం

 

113. డంపింగ్ (Dumping) అంటే?
జ: దేశీయంగా ఎక్కువ ధర, విదేశంలో తక్కువ ధర

 

114. సాంద్ర వ్యవసాయ జిల్లాల కార్యక్రమం ప్రధాన లక్ష్యం ఏమిటి?
జ: అధిక దిగుబడి వంగడాల సరఫరా

 

115. జాతీయ వ్యవసాయ కమిషన్‌ను ఎప్పుడు ఏర్పాటు చేశారు?
జ: 2001

 

116. భారత వ్యవసాయ రంగం వెనుకబడి ఉండటానికి కారణమేమిటి?
       1) కౌలుదారీ వ్యవస్థ
       2) భూ సంబంధిత విషయాల్లో మధ్యవర్తుల జోక్యం
       3) భూ యాజమాన్య కేంద్రీకరణ
       4) అన్నీ
జ: 4(అన్నీ)

 

117. మొదటి నూలు పరిశ్రమ ఎక్కడ స్థాపించారు? (రిపీట్)
జ: కలకత్తా దగ్గర ఉన్న పోర్ట్‌గ్లోస్టర్

 

118. భారత్‌లోని అతిపెద్ద వాణిజ్య బ్యాంకు ఏది?
జ: ఎస్‌బీఐ

 

119. సంయుక్త పారిశ్రామిక సంస్థలు అంటే?
జ: ప్రభుత్వ - ప్రయివేట్ రంగాల ద్వారా సంయుక్త నిర్వహణ

 

120. బహిరంగ మార్కెట్ కార్యకలాపాలు అంటే?
జ: ట్రెజరీ బిల్లులను బహిరంగ మార్కెట్‌లో అమ్మడం, కొనడం

 

121. రెండు దేశాల మధ్య వ్యాపారం ఎందుకు ఉంటుందంటే?
జ: వ్యయాల్లో తులనాత్మక వ్యత్యాసాలు

 

122. విదేశీ వ్యాపారానికి సుంకాల రూపంలో అతి ముఖ్యమైన అవరోధం-
జ: కోటాలు (Quotas)

 

123. 1990 - 1991లో ఆర్థిక సంస్కరణలు వేటిలో ప్రవేశపెట్టలేదు?
జ: శ్రామిక చట్టాలు

 

124. ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులను ఎప్పుడు స్థాపించారు?
జ: 1975

 

125. అంతర్జాతీయ చెల్లింపుల శేషం (బీవోపీ) అంటే?
జ: ఒక దేశంలోని వ్యక్తులు ఇతర దేశాలతో జరిపే అన్ని రకాల ఆర్థిక లావాదేవీలను నమోదు చేసే ఖాతా

 

126. నియమిత ఆర్థిక వ్యవస్థ (Closed Economy) అంటే ఏమిటి?
జ: ఎగుమతులు, దిగుమతులు లేకపోవడం

 

127. చిన్న, సన్నకారు రైతులకు; భూమిలేని వ్యవసాయ కూలీలకు, చేతి వృత్తుల వారికి పరపతి సౌకర్యం నిమిత్తం స్థాపించినవి-
జ: ఆర్ఆర్‌బీలు

 

128. భూ సంస్కరణల పటిష్ఠ అమలుకు కావాల్సింది ఏమిటి?
       1) రాజకీయ తోడ్పాటు        2) లబ్దిదారుల్లో చైతన్యం        
       3) సరైన భూ రికార్డులు        4) అన్నీ
జ: 4(అన్నీ)

 

129. భారత వ్యవసాయ రంగం వెనుకబడి ఉండటానికి కారణం-
       1) కౌలు వ్యవస్థ                                2) భూ సంబంధాల్లో మధ్యవర్తులు        
       3) భూ యాజమాన్యం కేంద్రీకరణ     4) అన్నీ
జ: 4(అన్నీ)

 

130. కిందివాటిలో బ్రిటిష్ - ఇండియా వాణిజ్య విధానంలో భాగం కానిదేది?
       1) బ్రిటన్‌లో తయారైన వినియోగ వస్తువుల దిగుమతి
       2) భారత ముడిపదార్థాల దిగుమతి
       3) బ్రిటన్‌లో తయారైన మూలధన వస్తువుల దిగుమతి
       4) అన్నీ
జ: 3(బ్రిటన్‌లో తయారైన మూలధన వస్తువుల దిగుమతి)

 

131. నూతన ఆర్థిక విధానం ప్రధాన లక్ష్యం ఏమిటి?
జ: ప్రభుత్వ రంగ సంస్థల పాత్రను తగ్గించడం

 

132. విదేశీ వ్యాపార ముఖ్య సంరక్షకులు-
జ: వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ (WTO)

 

133. ఒక ఆర్థిక వ్యవస్థలో ప్రైవేటు, పబ్లిక్ రంగాల సహజీవనాన్ని ఏమని పిలుస్తారు?
జ: మిశ్రమ ఆర్థిక వ్యవస్థ

 

134. భారతదేశాన్ని ఇతర ప్రపంచ దేశాలతో అనుసంధానం చేయడానికి ఉపయోగపడని ఆర్థిక సంస్కరణల అంశం-
జ: వ్యాపార, మూలధన ప్రవాహ సంస్కరణలు

 

135. ఒక దేశ కరెన్సీని తక్కువగా మూల్య నిర్ధారణ చేసినప్పుడు విదేశీ మారక చెల్లింపులు ఏవిధంగా ఉంటాయి?
జ: అనుకూలంగా

 

136. వెనుకబడిన దేశాల్లో తక్కువ స్థాయి ఉత్పాదకతను వివరించేది-
జ: మానవీయ మూలధన కొరత

 

137. స్పెషల్ డ్రాయింగ్ హక్కుల సదుపాయాన్ని ఎవరు ఏర్పరిచారు?
జ: IMF

 

138. కిందివాటిలో వ్యాపార వృద్ధికి ఇంజిన్ లాంటిదని పరిగణించేది-
       1) ప్రాంతీయ అభివృద్ధి వ్యూహం
       2) దిగుమతులకు ప్రత్యామ్నాయ వ్యూహం
       3) ఎగుమతుల ప్రధాన వ్యూహం
       4) స్వయంవృద్ధి వ్యూహం
జ: 3(ఎగుమతుల ప్రధాన వ్యూహం)

 

139. దేశీయ - వ్యయ పెరుగుదల అనేది-
జ: సంతులిత వ్యాపారాన్ని పాడుచేస్తుంది

 

140. పారిశ్రామిక విధానం -1977 దేన్ని ప్రోత్సహించింది?
జ: చిన్నతరహా, కుటీర పరిశ్రమలను

 

141. అదృశ్యహస్తం అనే సిద్ధాంతాన్ని ప్రాబల్య పరచినవారు ఎవరు?
జ: ఆడమ్ స్మిత్

 

142. నాబార్డు ఎవరికి రుణాలను ఇస్తుంది?
జ: వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి బ్యాంకులకు

 

143. ఇటీవలి కాలంలో అవస్థాపనా అభివృద్ధిని చేసింది ఎవరు?
జ: పబ్లిక్ - ప్రైవేట్ భాగస్వామ్యం

 

144. కిందివాటిలో పరిశ్రమలకు దీర్ఘకాలిక విత్తాన్ని అందించే సంస్థ ఏది?
       1) IDBI        2) SBI        3) RBI        4) LIC
జ: 1(IDBI)

 

145. ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది ఒక
జ: స్వతంత్ర ప్రభుత్వ రంగ సంస్థ

 

146. భారతదేశంలో కుటీర, లఘు పరిశ్రమలు ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నాయి. ఎందుకంటే?
       1) ఆర్థిక అసమానతలు తగ్గిస్తున్నాయి
       2) ఉద్యోగ అవకాశాలను కల్పిస్తున్నాయి
       3) ఆర్థికశక్తి వికేంద్రీకరణకు తోడ్పడుతున్నాయి
       4) అన్నీ
జ: 4(అన్నీ)

 

147. విదేశీ వ్యాపార ముఖ్య సంరక్షకుడు-
జ: WTO

 

148. ప్రపంచ బ్యాంకు ప్రధాన విధి ఏమిటి?
జ: అభివృద్ధి నిధులను సభ్యదేశాలకు అందించడం

 

149. గ్రామ స్థాయిలో సహకార సంస్థల రుణాలను పంపిణీ చేసే సంస్థ ఏది?
జ: ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు

 

150. ప్రతికూల చెల్లింపునకు తీసుకోవాల్సిన చర్యలేవి?
జ: మూల్యహీనీకరణ

 

151. నీలివిప్లవం దేనికి సంబంధించింది?
జ: చేపల పెంపకం

 

152. కిందివాటిలో విదేశీ వ్యాపార చెల్లింపుల శేషంలో కలిసి ఉండనిది ఏది?
     1) పెట్టుబడి ఆదాయం      2) రుపాయి - రుణ సర్వీసు      
      3) విదేశీ పెట్టుబడి      4) రుణాలు
జ: 2(రుపాయి - రుణ సర్వీసు)

 

153. కిందివాటిలో ఏ అంశాన్ని BOPలోని కరెంటు ఖాతాలోని అదృశ్య అంశాల్లో చేర్చరు?
     1) రవాణా చేయడం      2) విదేశీ ప్రయాణం      
     3) విదేశీ బ్యాంకుల నుంచి రుణాలు      4) బీమా
జ: 3(విదేశీ బ్యాంకుల నుంచి రుణాలు)

 

154. కిందివాటిలో ఏది సహకార సంస్థ కాదు?
     1) ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు
     2) రాష్ట్ర సహకార బ్యాంకులు
     3) కేంద్ర భూమి అభివృద్ధి బ్యాంకులు
     4) ప్రాథమిక భూమి అభివృద్ధి బ్యాంకులు
జ: 1(ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు)

 

155. 1950, 1960 దశాబ్దాల్లో పారిశ్రామిక విధానం ఆశయం ఎలా ఉంది?
     1) ప్రభుత్వ - ప్రైవేట్ సంస్థల మిశ్రమం
     2) పెద్ద ఎత్తున ఉద్యోగితా అవకాశాలను కల్పించడం
     3) పారిశ్రామిక అభివృద్ధికి ఒక ఆధారాన్ని కల్పించడం
     4) అన్నీ
జ: 4(అన్నీ)

 

156. ఆర్థర్ లూయీ ప్రకారం ద్వంద్వ ఆర్థిక వ్యవస్థ వేటి ఉనికిని తెలియజేస్తుంది?
జ: వెనుకబడిన అతిపెద్ద వ్యవసాయ రంగం, స్వల్ప ఆధునిక రంగం

 

157. డంపింగ్ లేదా వస్తువులను నింపడం దేని ప్రత్యేక రూపం?
జ: ఏకస్వామ్యం

 

158. భారతదేశంలో వాణిజ్య బ్యాంకులు ప్రధాన రంగానికి అందించే పరపతిని సూచించే అంశం ఏది?
     1) వ్యసాయ రంగం, చిన్నతరహా పరిశ్రమలు, బలహీన వర్గాలకు అందించే పరపతి
     2) విదేశీ కంపెనీలకు అందించే రుణాలు
     3) రాష్ట్రాలకు ప్రకృతి విపత్తుల పరిస్థితుల్లో అందించే రుణసాయం
     4) భారీ పరిశ్రమలకు అప్పులివ్వడం
జ: 1(వ్యసాయ రంగం, చిన్నతరహా పరిశ్రమలు, బలహీన వర్గాలకు అందించే పరపతి)

 

159. వర్తక నిబంధనలు కిందివాటిలో దేని సూచికల నిష్పత్తికి సంబంధించినవి?
     1) విదేశీ మారక చెల్లింపులు         2) ఎగుమతులు, దిగుమతులు
     3) దిగుమతులు - చెల్లింపులు      4) ఎగుమతులు - చెల్లింపులు
జ: 2(ఎగుమతులు, దిగుమతులు)

 

160. విదేశీ చెల్లింపుల శేషం ఖాతాలో ఉండే అదృశ్య వ్యయాలు ఏవి?
     1) నౌకా      2) రవాణా      3) విదేశాల్లో ప్రభుత్వ వ్యయం      4) అన్నీ
జ: 4(అన్నీ)

 

161. అధిక ప్రయోజనమే అంతర్జాతీయ వ్యాపారానికి మూలమని చెప్పిన ఆర్థికవేత్త ఎవరు?
జ: ఆడమ్ స్మిత్

 

162. ధరల్లో వ్యత్యాసాలే దీనికి ముఖ్య కారణం-
జ: అంతర్జాతీయ వ్యాపారం

 

163. క్రమబద్దీకరించిన మార్కెట్ల ముఖ్య లక్ష్యం మార్కెటింగ్ వ్యవస్థను అభివృద్ధి పరచడం. ఎందుకంటే?
     1) ఉత్పత్తిదారుల, వినియోగదారుల మధ్య ధర విస్తరణను తగ్గించడానికి
     2) వ్యవసాయ వస్తువులను గిట్టుబాటు ధరలకు లభించేలా చూడటానికి
     3) వ్యాపారుల, కమిషన్ ఏజెంట్ల నిష్కార్య లాభాలను తగ్గించడానికి
     4) అన్నీ
జ: 4(అన్నీ)

 

164. భారత ప్రభుత్వ అమల్లో ఉన్న వాస్తవ ఆర్థిక పారిశ్రామిక విధానాలు ఏవి?
     ఎ) ఎగుమతులకు ఇచ్చే ద్రవ్య పరిహార చెల్లింపులు రద్దు చేయడం
     బి) MRTPని రద్దు చేయడం
     సి) FERAని రద్దు చేయడం
     డి) లైసెన్సుల విధానాన్ని (కొన్ని వస్తువులకు మినహా) రద్దు చేయడం.
జ: ఎ, బి, సి, డి

 

165. భారత్‌లో షేర్ మార్కెట్లను నియంత్రించే సంస్థ ఏది?
జ: SEBI

 

166. సరిహద్దు సుంకాల సంఘం ఎప్పుడూ దేనికి దారితీస్తుంది?
జ: వర్తక సృష్టి, వైవిధ్యం రెండింటికీ దారితీస్తుంది

 

167. వ్యాపార చెల్లింపుల శేషమైన కరెంటు అకౌంట్ దేన్ని తెలుపుతుంది?
జ: సరకులు, అదృశ్యాలు, బదిలీలు

 

168. విదేశీ వ్యాపారం అవకాశ వ్యయం అనే భావాన్ని అభివృద్ధి పరచిన వారెవరు?
జ: హాబర్‌లర్

 

169. కిందివాటిలో ఏది కరెంట్ అకౌంట్, వర్తక అకౌంట్‌ల్లో భాగం కానిది?
     1) సాఫ్ట్‌వేర్ ఎగుమతులు      2) విదేశీ పెట్టుబడి      
     3) యంత్ర దిగుమతి      4) ఆభరణాల ఎగుమతులు
జ: 1(సాఫ్ట్‌వేర్ ఎగుమతులు)

 

170. భారత్‌లో మూలధన మార్కెట్లను నియంత్రణ చేసే ఒక స్వతంత్ర చట్టబద్దమైన సంస్థ?
జ: SEBI

 

171. IMF అంటే-
జ: International Monetary Fund

 

172. అంతర్జాతీయ వర్తకం దేని ఆధారంగా ఏర్పడుతుంది?
జ: కేవలం తులనాత్మక ప్రయోజనం, నిరపేక్ష ప్రయోజనం వల్ల

 

173. ఎగుమతులు, దిగుమతుల డిమాండు వ్యాకోచత ఏవిధంగా ఉంటే మూల్య విహీనీకరణ విజయవంతం అవుతుంది?
జ: ఒకటి కంటే ఎక్కువ

 

174. ప్రస్తుత అకౌంటు శేషంపై ఉన్న లోటును నిశ్శేషం చేయాలంటే ఏ చర్యను చేపట్టాలి?
     1) విదేశాల నుంచి రుణాలను గ్రహించడం      2) ఆస్తులను అమ్మడం
     3) మూలధనాన్ని దిగుమతి చేసుకోవడం          4) అన్నీ
జ: 4(అన్నీ)

 

175. కింది అంశాల్లో వ్యాపార చెల్లింపుల శేషం కరెంటు ఖాతాలో చేర్చనిది-
     1) పెట్టుబడి ఆదాయం      2) రుణాలు      3) రూపాయి రుణసేవ      4) విదేశీయాత్ర
జ: 2(రుణాలు)

 

176. భారతదేశంలో విదేశీ పోర్ట్‌పోలియా పెట్టుబడి అంటే?
జ: షేర్లలో, బాండ్లలో విదేశీ పెట్టుబడి

 

177. సంస్కరణల్లో భాగంగా భారతదేశం ఆర్థిక వ్యవస్థ ద్వారాలు తెరిచింది. అంటే దాని అర్థం ఏమిటి?
జ: ప్రపంచ దేశాల నుంచి అధిక మొత్తంలో ఇచ్చిపుచ్చుకునే విధానం

 

178. కిందివాటిలో ఏ సంస్థలు Soft Loan Window ద్వారా రుణాలు అందిస్తున్నాయి?
     1) అంతర్జాతీయ ద్రవ్యనిధి        2) ప్రపంచ బ్యాంకు  
     3) అంతర్జాతీయ విత్తసంస్థ        4) అంతర్జాతీయ అభివృద్ధి సంస్థ
జ: 4(అంతర్జాతీయ అభివృద్ధి సంస్థ)

 

179. విదేశీ మారక రేటుకోసం విదేశీ చెల్లింపుల శేష సిద్ధాంతం-
జ: సాధారణ సమతౌల్య సిద్ధాంతం

 

180. WTO ఒప్పందం దేశాల నుంచి ఏ రకమైన చర్యలను ఆశిస్తుంది?
     1) సబ్సిడీలకు స్వస్తి చెప్పి కాబోయే పోటీదారులకు ఒక అనుకూల వాతావరణాన్ని కల్పించడం
     2) మార్కెట్ల అవకాశాలు విస్తరించేలా సుంకాలను తగ్గించడం
     3) స్వేచ్ఛా వ్యాపారాన్ని ప్రేరేపించడానికి పరిమితులు, సుంకాలను తొలగించడం
     4) అన్నీ
జ: 4(అన్నీ)

 

181. సుంకాల (టారిఫ్) తగ్గింపు విధానాన్ని ఏ కారణం వల్ల భారతదేశంలో విధించారు?
     1) భారతీయ వస్తువుల పోటీతత్వాన్ని పెంచడానికి
     2) విదేశీ ఉత్పత్తిదారులకు విస్తరించిన మార్కెట్లు లభ్యం కావడానికి
     3) దేశీయ ఉత్పత్తిదారులను ఎక్కువ సమర్థులుగా మార్చడానికి
     4) అన్నీ
జ: 4(అన్నీ)

 

182. కిందివాటిలో వ్యాపార చెల్లింపుల శేషం ప్రస్తుత అకౌంటులో అదృశ్య అంశంగా పరిగణించేది-
     1) రవాణా చేయడం      2) విదేశీ బ్యాంకుల నుంచి రుణం      3) బీమా      4) విదేశీ యాత్ర
జ: 2(విదేశీ బ్యాంకుల నుంచి రుణం)

 

183. అభివృద్ధి చెందుతున్న దేశాలకు ప్రయివేటు విదేశీ ద్రవ్యవనరుల ప్రవాహం సంస్థల విదేశీ మేనేజ్‌మెంట్‌తో సహా తరలి రావడాన్ని ఏమంటారు?
జ: ప్రత్యక్ష పెట్టుబడి

 

184. రెండు దేశాల్లో ఒక దేశం అన్ని వస్తువులను ఉత్పత్తి చేయడంలో ఆధిక్యాన్ని సంపాదిస్తే అప్పుడు ఆ రెండు దేశాల మధ్య వ్యాపారంలో ఎవరికి లాభం?
జ: రెండు దేశాలకూ లాభం

 

185. కిందివాటిలో ప్రస్తుతం ఐఎంఎఫ్ ప్రత్యక్ష ఆశయాల్లో కానిదేది?
     1) అంతర్జాతీయ ద్రవ్యత్వాన్ని ప్రోత్సహించడం
     2) సభ్యదేశాలకు నిధి వనరులను అందించి, వారి విశ్వాసాన్ని చూరగొనడం
     3) సభ్యదేశాల కరెన్సీ విలువలను సమాన స్థాయిలో ఉంచి విదేశీ ద్రవ్య వినియమాన్ని స్థిరంగా ఉంచడం
     4) విదేశీ వ్యాపారం విస్తరించి దాని సంతులిత వృద్ధికి పాటుపడటం
జ: 4(విదేశీ వ్యాపారం విస్తరించి దాని సంతులిత వృద్ధికి పాటుపడటం)

 

186. MRTP చట్టం ఉద్దేశం ఏమిటి?
జ: ఆర్థిక స్థోమత కేంద్రీకరణను అదుపు చేయడం

 

187. కిందివాటిలో స్థూల వస్తుమార్పిడి వ్యాపార షరతులు వేటి మధ్య నిష్పత్తి?
     1) ఎగుమతి ధర, దిగుమతి ధర
     2) దిగుమతి ధర, ఎగుమతి ధర
     3) ఒక దేశం ఎగుమతులు, దిగుమతుల పరిణామాలు
     4) ఒక దేశం దిగుమతులు, ఎగుమతుల పరిణామాలు
జ: 4(ఒక దేశం దిగుమతులు, ఎగుమతుల పరిణామాలు)

 

188. భారతదేశ రూపాయి మార్పిడిని ఏ స్థాయి వరకు ప్రవేశపెట్టారు?
జ: కరెంట్ అకౌంటు, కొన్ని ఎంపిక చేసిన మూలధన వస్తువులపైన మాత్రమే

 

189. వ్యవసాయ ధరల కమిషన్‌ను ఎప్పుడు ప్రారంభించారు?
జ: 1965

 

190. ఏ పారిశ్రామిక తీర్మానాన్ని ఆర్థిక రాజ్యాంగం అంటారు?
జ: 1956

 

191. దేశంలో అధిక లాభాల్లో ఉన్న కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఏది?
జ: ONGC

 

192. కిందివాటిలో బ్రిటన్ వుడ్స్ కవలలుగా పిలుస్తున్న సంస్థలు ఏవి?
     1) IMF, UNO      2) WTO, IBRD      3) IBRD, IMF      4) WTO, ADB
జ: 3(IBRD, IMF)

 

193. మిశ్రమ ఆర్థికవ్యవస్థలో ప్రాధాన్యం కలిగి ఉండేవి?
జ: ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలు

 

194. కింది అంశాల్లో వివిధ దేశాల మధ్య స్వేచ్ఛా వాణిజ్యం, ప్రపంచీకరణకు దోహదం చేసేవి ఏవి?
     1) శ్రామికులు, వస్తుసేవలు
     2) పెట్టుబడులు, సాంకేతిక పరిజ్ఞానం
     3) శ్రామికులు, వస్తుసేవలు; పెట్టుబడులు, సాంకేతిక పరిజ్ఞానం
     4) ఏదీకాదు
జ: 3(శ్రామికులు, వస్తుసేవలు; పెట్టుబడులు, సాంకేతిక పరిజ్ఞానం)

 

195. వ్యవసాయం, గ్రామీణాభివృద్ధికి పరపతిని అందించే శిఖరాగ్ర సంస్థ ఏది?
జ: NABARD

 

196. దేశంలో మారకం రేటు స్థిరీకరణకు కృషిచేసే సంస్థ ఏది?
జ: RBI

 

197. జాతీయ పంటల బీమా పథకం (NCIP) ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది?
జ: 2014 ఖరీఫ్

 

198. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల అభివృద్ధి చట్టాన్ని (MSMED Act)ను ఎప్పుడు చేశారు?
జ: 2006

 

199. ప్రస్తుతం ప్రభుత్వం రంగానికే పరిమితమైన పరిశ్రమలు ఎన్ని?
జ: 3

 

200. మిశ్రమ ఆర్థిక వ్యవస్థకు పునాది వేసిన పారిశ్రామిక విధాన తీర్మానం-
జ: మొదటి పారిశ్రామిక తీర్మానం

 

201. పారిశ్రామిక శిక్షణా కేంద్రాల ఏర్పాటును సిఫారసు చేసిన కమిటీ ఏది?
జ: కార్వే కమిటీ

 

202. ప్రపంచంలో పారిశ్రామిక విప్లవానికి నాంది పలికిన దేశం ఏది?
జ: బ్రిటన్

 

203. భవిష్యత్‌లో అధిక ఉద్యోగ అవకాశాలు కల్పించే పరిశ్రమలను ఏమని పిలుస్తారు?
జ: సన్‌రైజ్ పరిశ్రమలు

 

204. దేశంలో పారిశ్రామిక రుగ్మతకు గురైన పరిశ్రమల్లో అత్యధిక పరిశ్రమలు ఏ తరహావి?
జ: చిన్నతరహా

 

205. పారిశ్రామిక సంస్థలు తమ లాభాల నుంచి సొంత నిధులు సమకూర్చుకోవడాన్ని ఏమంటారు?
జ: లాభాల ప్లస్ బ్యాక్

 

206. మొదటి భారతీయ వస్త్ర మిల్లును 1818లో ఏ నగరంలో స్థాపించారు?
జ: కలకత్తా

 

207. మన దేశంలో వస్త్ర పరిశ్రమలకు సంబంధించి, మొదటి అపెరల్ పార్క్‌ను ఎక్కడ స్థాపించారు?
జ: తిరుపూర్

 

208. 2015 - 16 ఆర్థిక సంవత్సరంలో మానుఫాక్చ్యరింగ్ రంగం ఎంత శాతం వృద్ధిరేటు సాధిస్తుందని అంచనా వేశారు?
జ: 9.5%

 

209. కిందివాటిలో సరైంది ఏది?
 ఎ) భూ ఆర్డినెన్స్ - 2014 ప్రకారం ప్రైవేట్ విద్యా, వైద్య సంస్థలు 80% అంగీకారంతో భూమిని సమీకరించవచ్చు.
 బి) LARR - 2013 ప్రకారం ప్రతి ప్రాజెక్టుకు తప్పనిసరిగా సామాజిక ప్రభావాన్ని అంచనా వేయాలి.
జ: ఎ, బి

 

210. 2016, ఏప్రిల్ 1 నాటికి మొత్తం విదేశీ మారక నిల్వలు ఎంత? (బిలియన్ల డాలర్లలో)
జ: 359.7

 

211. 12వ పంచవర్ష ప్రణాళికా పెట్టుబడిలో ప్రభుత్వ రంగం వాటా ఎంత? (కోట్లలో)
జ: రూ.76,69,807

 

212. భారత ఆర్థిక వ్యవస్థ ప్రాథమిక రంగంలో ఉన్నవి ఏవి?
    i) వ్యవసాయం, పశుసంపద, అనుబంధపనులు
    ii) అటవీ, కలప
    iii) మత్స్యపరిశ్రమ
    iv) గనులు, రాళ్ల పరిశ్రమ
జ: పైవన్నీ

 

213. మహలనోబిస్ నమూనా ప్రకారం భారీగా మౌలిక, మూలధన వస్తు పరిశ్రమలను నెలకొల్పడానికి ప్రాధాన్యం ఇచ్చిన ప్రణాళిక ఏది?
జ: 2వ

 

214. నియంత్రిత ఆర్థిక వ్యవస్థకు స్వేచ్ఛాపూరిత వాతావరణాన్ని కల్పించడాన్ని ఏ రకంగా పరిగణిస్తారు?
జ: సరళీకరణ

 

215. చిన్న తరహా పరిశ్రమల అధ్యయనానికి సంబంధించి కిందివాటిలో సరైంది?
    1) అబిద్ హుస్సేన్ కమిటీ - 1997     2) కార్వే కమిటీ - 1955
    3) ఎస్.పి. గుప్తా కమిటీ - 1999        4) మహలనోబిస్ కమిటీ - 1960
జ: 3(ఎస్.పి. గుప్తా కమిటీ - 1999)

 

216. భారతదేశం స్థితిగతుల దృష్ట్యా చిన్న తరహా పరిశ్రమలు స్థాపించడానికి ప్రధాన లక్ష్యం-
జ: ఉద్యోగ అవకాశాలు కల్పించడం

 

217. పారిశ్రామిక రంగానికి విత్త సహాయం చేయడానికి మొదట స్థాపించిన సంస్థ ఏది?
జ: భారత పారిశ్రామిక విత్త సంస్థ

 

218. హరిత విప్లవం వల్ల ప్రాంతీయ అసమానతలు పెరగడానికి కారణాలు-
    ఎ) అధిక పెట్టుబడులు
     బి) కరవు ప్రాంతాలు
    సి) నీటి పారుదల సౌకర్యాల లేమి
    డి) వ్యవసాయేతర వృత్తులు దీని పరిధిలోకి రాకపోవడం
జ: ఎ, బి, సి, డి

 

219. ప్రభుత్వరంగ సంస్థల నిర్వహణ, యాజమాన్య బాధ్యతలను ప్రైవేట్ రంగానికి బదిలీ చేయడాన్ని ఏమంటారు?
జ: ప్రైవేటీకరణ

 

220. 2014 - 15 నాటి విదేశీ వ్యాపారానికి సంబంధించి కిందివాటిలో సరికానిది ఏది?
    1) భారతదేశంతో విదేశీ వ్యాపారం అధికంగా ఉన్న దేశం - చైనా
    2) ప్రపంచ ఎగుమతుల్లో భారత్ వాటా - 1.6%
    3) ప్రపంచ దిగుమతుల్లో భారత్ వాటా - 2.3%
    4) మొత్తం ఎగుమతుల్లో ముడిచమురు, పెట్రోలియం వాటా - 25.7%
జ: 4(మొత్తం ఎగుమతుల్లో ముడిచమురు, పెట్రోలియం వాటా - 25.7%)

 

221. భారతదేశంలో ఆహార ధాన్యాల్లో స్వయం సంవృద్ధి సాధించిన సంవత్సరం?
జ: 1992 - 93

 

222. IMFలో SDR (పేపర్ గోల్డ్) ఉద్భవించడానికి కారణం ఏమిటి?
జ: ప్రపంచ ద్రవ్య కొరత

 

223. భారత్‌లో సంయుక్త రంగం (Joint Sector) ఏర్పాటుకు సిఫారసు చేసిన కమిటీ ఏది?
జ: దత్ కమిటీ

 

224. 'సూక్ష్మ, చిన్నతరహా, మధ్యతరహా సంస్థల అభివృద్ధి చట్టం (MSMED) 2006' ను అనుసరించి తయారీ
రంగంలో చిన్న తరహా పరిశ్రమల పెట్టుబడి పరిమితి ఎంత?
జ: 25 లక్షల నుంచి 5 కోట్లు

 

225. భారత్‌లో పరిశ్రమల అభివృద్ధి క్రమబద్ధ చట్టాన్ని ఎప్పుడు ప్రవేశపెట్టారు?
జ: 1951

 

226. భారత్‌లో మొదటి పంచదార పరిశ్రమను ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేశారు?
జ: బిహార్

 

227. భారత్‌లో ప్రభుత్వ రంగ సంస్కరణల్లో భాగంగా ప్రవేశపెట్టిన గోల్డెన్ షేక్ హ్యాండ్ పథకం దేనికి సంబంధించింది?
జ: భారమైన ఉద్యోగులను తగ్గించడం

 

228. కింది ప్రవచనాల్లో వాస్తవాలను గుర్తించండి.
i) LARR - 2013 ప్రకారం ప్రైవేట్ ప్రాజెక్టులకు 80%, PPP ప్రాజెక్టులకు 70% ప్రాభావిత కుటుంబాల అంగీకారం అవసరం
ii) భూసేకరణ చట్టం - 1894 ప్రకారం బలవంతంగా భూసేకరణ చేయొచ్చు
జ: i, ii

 

229. 2015 - 16 నాటికి భారతదేశ విదేశీ వ్యాపారానికి సంబంధించి కిందివాటిలో సరైంది?
    i) వ్యాపార శేషం: (-) 118.46 బిలియన్ డాలర్లు
    ii) ఎగుమతులు: 261.14 బిలియన్ డాలర్లు
    iii) దిగుమతులు: 379.50 బిలియన్ డాలర్లు
జ: అన్నీ సరైనవి

 

230. అత్యధిక విదేశీ మారక ద్రవ్యాన్ని ఆకర్షిస్తున్న తొలి రెండు రంగాలు ఏవి?
జ: సేవారంగం, టెలీ కమ్యూనికేషన్లు

 

231. కిందివాటిలో ఏది పెట్టుబడి కాదు?
    1) ప్లాంటు విస్తరణ వ్యయం
    2) ఆహార ధాన్యాల కొనుగోలు వ్వయం
    3) మూలధన వస్తువుల కొనుగోలు వ్యయం
    4) ప్లాంటు స్థాపనకు అయ్యే వ్యయం
జ: 2(ఆహార ధాన్యాల కొనుగోలు వ్వయం)

 

232. కింది కర్మాగారాల్లో వాటిని నెలకొల్పిన కాలం ఆధారంగా భిన్నమైన పరిశ్రమ ఏది?
    1) రూర్కెలా ఇనుము - ఉక్కు కర్మాగారం
    2) నంగల్ ఎరువుల కర్మాగారం
    3) బొకారో ఇనుము - ఉక్కు కర్మాగారం
    4) భిలాయ్ ఇనుము - ఉక్కు కర్మాగారం
జ: 3(బొకారో ఇనుము - ఉక్కు కర్మాగారం)

 

233. దేశ విభజన వల్ల మనదేశంలో బాగా దెబ్బతిన్న పరిశ్రమ ఏది?
జ: జనపనార పరిశ్రమ

 

234. ఖాయిలాపడిన సంస్థ అంటే ఏమిటి?
    1) సామర్థ్యం కంటే తక్కువగా నిర్వహించడం
    2) అమ్మకాలను పెంచలేకపోవడం
    3) నష్టాల్లో కొనసాగడం
    4) అన్నీ
జ: 4(అన్నీ)

 

235. 1956లో ప్రవేశపెట్టిన ద్వితీయ పారిశ్రామిక విధాన తీర్మానానికి సంబంధించి సరైన అంశం ఏది?
    (A) సామ్యవాద రీతి సమాజస్థాపన     (B) భారత ఆర్థిక రాజ్యాంగం
    (C) ప్రభుత్వరంగ ప్రాధాన్యం                (D) ప్రైవేట్ రంగ ప్రాధాన్యం
జ: A, B, C మాత్రమే

 

236. భారత్‌లో 'నూతన సరళీకృత పారిశ్రామిక విధానాన్ని' ఎప్పుడు ప్రకటించారు?
జ: 1991

 

237. ప్రాంతీయ అభివృద్ధిని గుర్తించడానికి అవసరమయ్యే పారిశ్రామిక సూచికలు ఏవి?
    (A) మొత్తం శ్రామికుల్లో పారిశ్రామిక శ్రామికులు
    (B) పారిశ్రామిక రంగ తలసరి ఉత్పత్తి
జ: A, B

 

238. IRDAను విస్తరించండి.
జ: ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ

 

239. 2014 - 15లో దేశంలోని మొత్తం ఆహారధాన్యాల ఉత్పత్తి ఎంత? (మిలియన్ టన్నుల్లో)
జ: 252

 

240. జాతీయ వ్యవసాయ విధానం (2000) ఒక ముఖ్య లక్షణం-
జ: వ్యవసాయ రంగంలో వార్షిక వృద్ధిరేటు 4% కంటే ఎక్కువ సాధించడం.

 

241. కిందివాటిలో ఏ వివరణ సరైంది కాదు?
    1) వర్తక శేషం, చెల్లింపుల శేషంలో ఒక భాగం
    2) సేవలను (Services) అదృశ్య అంశం అని పిలుస్తారు
    3) వ్యాపార సరుకును అదృశ్య అంశం అని పిలుస్తారు
    4) వర్తక శేషం, చెల్లింపుల శేషం రెండింటిలో ఎప్పుడూ ఒకే దిశలో కదలిక ఉంటుంది
జ: 4(వర్తక శేషం, చెల్లింపుల శేషం రెండింటిలో ఎప్పుడూ ఒకే దిశలో కదలిక ఉంటుంది)

 

242. మనదేశంలో కుటీర, చిన్నతరహా పరిశ్రమలకు ప్రాధాన్యం ఇచ్చిన నమూనా ఏది?
జ: గాంధీ నమూనా

 

243. కిందివాటిలో ఏ పరిశ్రమలో గరిష్ఠ సంఖ్యలో మహిళా కార్మికులు పనిచేస్తున్నారు?
    1) జనపనార     2) కాఫీ తోటలు     3) చేనేత పరిశ్రమ     4) తేయాకు తయారీ పరిశ్రమ
జ: 4(తేయాకు తయారీ పరిశ్రమ)

 

244. మనదేశంలో కిందివాటిలో వేటిని మౌలిక పరిశ్రమలుగా పేర్కొంటారు?
    1) ప్లాస్టిక్, పెట్రోలియం             2) టీవీ, రేడియో    
    3) ఇనుము - ఉక్కు పరిశ్రమ     4) యంత్రపరికరాలు
జ: 3(ఇనుము - ఉక్కు పరిశ్రమ)

 

245. పారిశ్రామిక ఉత్పత్తుల సూచీ నిర్మాణంలో అధిక ప్రాధాన్యం ఉన్నవి-
జ: మౌలిక వస్తువులు

 

246. కింది పారిశ్రామిక విత్తసంస్థలను అవి ఏర్పాటైన సంవత్సరాల ఆధారంగా సరైన క్రమంలో అమర్చండి.
         (A) SFC      (B) ICICI     (C) IDBI      (D) SIDBI
జ: A, B, C, D

 

247. 2011 - 12 స్థిర ధరల వద్ద ముందస్తు అంచనాల ప్రకారం 2015 - 16లో దేశంలో పరిశ్రమల రంగంలో నమోదైన వృద్ధిరేటు ఎంత?
జ: 7.3%

 

248. భారతదేశంలో అత్యంత పురాతనమైన భూ స్వాధీనత చట్టాన్ని ఎప్పుడు రూపొందించారు?
జ: 1894

 

249. 2016 - 17 అమ్మకపు సీజన్‌లో గోధుమ (అంటే 2015 - 16 రబీ పంటకు)కు ప్రకటించిన కనీస మద్దతు ధర ఎంత?
జ: రూ.1525

 

250. కిందివాటిలో సరైంది ఏది?
    (A) భారత్ మొత్తం రుణాల్లో దీర్ఘకాలిక విదేశీ రుణం - 83%
    (B) భారత్ మొత్తం రుణాల్లో స్వల్పకాలిక విదేశీ రుణం వాటా - 17%
    (C) దీర్ఘకాలిక విదేశీ రుణం - 398.6 బిలియన్ డాలర్లు
    (D) స్వల్పకాలిక విదేశీ రుణం - 81.6 బిలియన్ డాలర్లు
జ: అన్నీ సరైనవి

 

251. మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అంటే ఏమిటి?
జ: పబ్లిక్, ప్రైవేటురంగ సమ్మేళనం

 

252. హర్ష్‌మన్ ప్రకారం సమష్టి అనుబంధాలు సంభవించేది దేనికి?
జ: ఇనుము, ఉక్కు

 

253. పదకొండో పంచవర్ష ప్రణాళిక మొత్తం వ్యయంలో పరిశ్రమలు, ఖనిజాలకు ఎంత శాతం నిధులు కేటాయించారు?
జ: 4.2%

 

254. మనదేశంలో మొదటి ఇనుము - ఉక్కు కర్మాగారాన్ని ఎప్పుడు, ఎక్కడ స్థాపించారు?
జ: 1907 - జంషెడ్‌పూర్

 

255. చిన్నతరహా పరిశ్రమల ముఖ్య పెట్టుబడి వనరు ఏది?
జ: బ్యాంకు రుణాలు

 

256. పారిశ్రామిక సంస్థలు జారీచేసే రుణపత్రాలను ఏమంటారు?
జ: డిబెంచర్లు

 

257. భారతదేశంలో రాష్ట్ర విత్తసంస్థలు దేని అభివృద్ధికి ఆర్థిక సహాయం చేస్తాయి?
జ: చిన్న, మధ్యతరహా పరిశ్రమల అభివృద్ధికి

 

258. 2015 - 16 ఆర్థిక సర్వే ప్రకారం ముడి ఉక్కు ఉత్పత్తిలో ప్రపంచంలో భారత్ ఏ స్థానంలో ఉంది?
జ: 4వ

 

259. చిన్నతరహా, కుటీర పరిశ్రమలకు ప్రాధాన్యం ఇచ్చిన తీర్మానం ఏది?
జ: పారిశ్రామిక తీర్మానం - 1977

 

260. భూసేకరణ పునఃస్థాపన, పునరావాస చట్టం - 2013 ఏ అంశాన్ని నిషేధించింది?
జ: రెండు, మూడు పంటలు పండే భూమి సేకరణ

 

261. 2015 డిసెంబరు చివరి నాటికి భారతదేశ విదేశీరుణం ఎంత? (బిలియన్ డాలర్లలో)
జ: 480.2

 

262. సంప్రదాయ సిద్ధాంతం ప్రకారం అంతర్జాతీయ వ్యాపారం దేనిపై ఆధారపడుతుంది?
జ: శ్రామిక విలువ సిద్ధాంతం

 

263. పారిశ్రామిక విధానంలో చాలా చిన్న పారిశ్రామికంను ఎప్పుడు పరిచయం చేశారు?
జ: 1977

 

264. పారిశ్రామిక ......ను అధ్యయనం చేయడానికి ఓంకార్ గోస్వామి కమిటీని ఏర్పాటు చేశారు.
జ: రుగ్మత

 

265. భారతదేశంలో మేనేజింగ్ ఏజెన్సీ విధానాన్ని ఎప్పుడు రద్దు చేశారు?
జ: 1970

 

266. భారత్‌లో ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తున్న అతిపురాతన పరిశ్రమ ఏది?
జ: వస్త్ర పరిశ్రమ

 

267. మనదేశంలో చిన్నతరహా పరిశ్రమలు ఎదుర్కొంటున్న సమస్య-
    ఎ) ముడిసరుకుల కొరత     బి) ఖాయిలా సమస్య     సి) పరపతి కొరత     డి) విద్యుత్ కొరత
జ: ఎ, బి, సి, డి

 

268. 1996లో నియమించిన జి.వి. రామకృష్ణ మిషన్ దేనికి సంబంధించింది?
జ: పెట్టుబడుల ఉపసంహరణ

 

269. భారతదేశంలో పారిశ్రామిక విత్తాన్ని సమకూర్చడంలో శిఖరాగ్ర సంస్థ ఏది?
జ: ఐడీబీఐ

 

270. ప్రస్తుతం దేశవ్యాప్తంగా సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల్లో ఎంతమంది పనిచేస్తున్నారు?
జ: 3.6 కోట్లు

 

271. మనదేశంలో చిన్నతరహా పరిశ్రమలకు సంబంధించిన సికా (SICA) చట్టాన్ని ఎవరి సిఫారసుల మేరకు రూపొందించారు?
జ: తివారీ

 

272. భూసేకరణ పునఃస్థాపన, పునరావాస చట్టం - 2013 ప్రకారం భూసేకరణ జరిగితే గ్రామీణ ప్రాంతాల్లో ఎన్ని రెట్ల నష్టపరిహారం చెల్లించాలి?
జ: 4

 

273. 2015 - 16 ఖరీఫ్ కాలంలో వివిధ పంటలకు ఒక క్వింటాల్‌కు ప్రకటించిన కనీస మద్దతు ధరలను కింద పేర్కొన్నారు. అందులో సరైన జతను గుర్తించండి.
    ఎ) వరి - రూ.1410
    బి) జొన్న - రూ.1325
    సి) పొద్దుతిరుగుడు గింజలు - రూ.3800
    డి) పత్తి పొడవు గింజ - రూ.4100
జ: ఎ, బి, సి, డి

 

274. 2000 ఏప్రిల్ నుంచి 2015 డిసెంబరు నాటికి వచ్చిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (FDI) ఎంత? (బిలియన్ డాలర్లలో)
జ: 408.676

 

275. సెబీ (SEBI) ఒక-
జ: చట్టబద్ధమైన వ్యవస్థ

 

276. ఆహార ధాన్యాలకు సంబంధించి భారతదేశం, అమెరికా మధ్య ఒప్పందాన్ని ఏమంటారు?
జ: పి.ఎల్. 480

 

277. ఉపాంత వ్యవసాయ భూమి పరిమితి ఎంత?
జ: ఒక హెక్టారు కంటే తక్కువ

 

278. వ్యాపార బిందువు (Trade Point) అంటే ఏమిటి?
జ: కేంద్రీకృతంగా నియమితమైన స్టాక్ మార్కెట్

 

279. ఏ వనరు నుంచి రైతులు అత్యధిక రుణాలు గ్రహిస్తారు?
జ: సహకార సంఘాలు

 

280. లైసెజ్ ఫేర్ (Laissez faire) విధానం అంటే ఏమిటి?
జ: స్వేచ్ఛా వ్యాపార విధానం

 

281. పారిశ్రామిక రంగ శ్రామికుల వినియోగదారుల సూచి (CPI) నిర్మించడంలో ఆధార సంవత్సరం-
జ: 1982

 

282. ఐఎమ్ఎఫ్ స్థిర మారక రేటు విధానం ఎప్పుడు అంతం అయ్యింది? (రిపీట్)
జ: 1971

 

283. పేపర్ గోల్డ్ (Paper Gold) అంటే-
జ: స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ (SDRs)

 

284. మల్టీ బ్రాండ్ రిటైల్ రంగంలో ఎంత శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడిని అనుమతిస్తున్నారు?
జ: 51%

 

285. బీఐఎఫ్ఆర్ వేటిని పరిశీలిస్తుంది?
జ: పారిశ్రామిక రుగ్మతలకు లోనైన సంస్థలను

 

286. ఆర్ఆర్‌బీలను (Regional Rural Banks) ఎప్పుడు స్థాపించారు?
జ: 1975

 

287. మనదేశ ఎగుమతుల్లో వేటి ద్వారా ఎక్కువ విదేశీ మారకం లభిస్తుంది?
జ: రత్నాలు, విలువైన రాళ్లు, ఆభరణాలు

 

288. గ్రీన్ రెవల్యూషన్‌లో HYV - IR - 8 అంటే ఏమిటి?
జ: బియ్యం

 

289. నూతన పారిశ్రామిక విధాన తీర్మానం ఎప్పుడు జరిగింది?
జ: 1991, జులై 24

 

290. పారిశ్రామిక రుగ్మతలకు లోనైన పరిశ్రమల ఆధునీకీకరణకు తోడ్పడేది?
జ: IRBI

 

291. MRTP చట్టాన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు?
జ: 1969

 

292. SIDBI (Small Industrial Development Bank of India) ను ఎప్పుడు ఏర్పాటు చేశారు?
జ: 1990

 

293. ప్రస్తుత ప్రభుత్వ నిబంధనలను అనుసరించి కింది ఏ ఉత్పత్తులకు లైసెన్సు అవసరం?
    1) పారిశ్రామిక పేలుడు పదార్థాలు     2) ఆయుధాలు, మందుగుండు
    3) ప్రమాదకర రసాయనాలు            4) అన్నింటికీ
జ: 4(అన్నింటికీ)

 

294. చిన్నతరహా పరిశ్రమలకు అధిక ప్రాధాన్యం ఇచ్చిన పారిశ్రామిక విధాన తీర్మానం ఏది?
జ: పారిశ్రామిక విధాన తీర్మానం - 1977

 

295. కిందివాటిలో దేనికి నూతన వ్యవసాయక వ్యూహం తోడ్పడలేదు?
    1) సంతులిత ప్రాంతీయాభివృద్ధికి
    2) వ్యవసాయ ఉత్పత్తి పెరుగుదలకు
    3) వ్యవసాయ ఉత్పాదకత పెరుగుదలకు
    4) ఆధునిక వంగడాల వినియోగానికి
జ: 1(సంతులిత ప్రాంతీయాభివృద్ధికి)

 

296. భారతీయ ముడి పదార్థాల ఎగుమతికి, బ్రిటిష్ వస్తువులు మనదేశంలో విస్తరించడానికి తోడ్పడిన అంశం ఏది?
జ: రవాణా సౌకర్యాల విస్తరణ

 

297. 1991 సంవత్సరానికి పూర్వపు పారిశ్రామిక విధాన తీర్మానంలో కిందివాటిలో లేనిది?
    1) ప్రభుత్వరంగ విస్తరణ     2) ప్రైవేటీకరణ     3) జాతీయీకరణ     4) విదేశీ పెట్టుబడులపై నియంత్రణ
జ: 2(ప్రైవేటీకరణ)

 

298. 1991 నుంచి భారత వాణిజ్య విధానం లక్షణం?
    1) పరిమాణాత్మక ఆంక్షల ఎత్తివేత
    2) ఉత్పత్తి సంబంధిత పేటెంట్ హక్కులు
    3) దిగుమతులపై సుంకాల తగ్గింపు
    4) అన్నీ
జ: 4(అన్నీ)

 

299. కిందివాటిలో ఎగుమతులు, దిగుమతులతో ప్రత్యక్ష సంబంధం ఉన్నది ఏది?
    1) EXIM - BANK     2) IDBI     3) SIDBI     4) NABARD
జ: 1(EXIM - BANK)

 

300. ఐఎమ్ఎఫ్ ద్వారా ప్రవేశపెట్టిన SDRsను దేని కోసం ప్రారంభించారు?
    1) విదేశీ ద్రవ్యత్వాన్ని పెంపొందించడం
    2) ప్రపంచ వ్యాపారాన్ని విస్తరింపజేయడం
    3) సభ్యులకు నిధి వనరులను ఎక్కువ అందుబాటులోకి తేవడం
    4) అన్నీ
జ: 4(అన్నీ)

 

301. జాతీయ ఆహార భద్రతా మిషన్ (NFSM)కు సంబంధించి కిందివాటిలో సరికానిది ఏది?
1) ఇది వరి, గోధుమ ఉత్పత్తిని పెంచడానికి ఉద్దేశించింది
2) దీన్ని 2007 - 08 రబీ సీజన్‌లో ప్రవేశపెట్టారు
3) ఇది వరి, గోధుమ, పప్పుధాన్యాల ఉత్పత్తి పెంచడానికి ఉద్దేశించింది
4) ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 28 రాష్ట్రాల్లో దీన్ని అమలు చేస్తున్నారు
జ: 1(ఇది వరి, గోధుమ ఉత్పత్తిని పెంచడానికి ఉద్దేశించింది)

 

302. గోల్డెన్ హ్యాండ్ షేక్ స్కీమ్ లక్ష్యం ఏమిటి?
జ: ప్రభుత్వరంగ సంస్థల్లో అధిక సిబ్బంది భారాన్ని తగ్గించడానికి

 

303. సర్వ్‌డ్ ఫ్రమ్ ఇండియా ఏ ఎగుమతులను ప్రోత్సహించేందుకు ఉద్దేశించింది?
     1) వ్యవసాయోత్పత్తుల ఎగుమతులను ప్రోత్సహించడానికి
     2) భారత సేవారంగ ఎగుమతులను ప్రోత్సహించడానికి
     3) విలువైన రత్నాలు, ఆభరణాల ఎగుమతులను ప్రోత్సహించడానికి
     4) అన్నీ
జ: 2(భారత సేవారంగ ఎగుమతులను ప్రోత్సహించడానికి)

 

304. భారత ఆర్థిక వ్యవస్థలో ఆహార వస్తువుల ధరల సూచీ రెండు ఉప అంశాలను కలిగి ఉంది. అవి ప్రాథమిక ఆహార వస్తువులు, .........
జ: తయారు చేసిన ఆహార వస్తువులు

 

305. నూతన పారిశ్రామిక విధానం - 1991 ప్రధాన లక్ష్యం-
జ: అనవరసరమైన ఆంక్షలు, నియంత్రణల నుంచి భారత పారిశ్రామిక వ్యవస్థను వేరు చేయడం

 

306. Soft Loan Window of The World అని కిందివాటిలో దేన్ని పిలుస్తారు?
     1) IBRD     2) IMF     3) IDA     4) IFC
జ: 3 (IDA)

 

307. కిందివాటిలో సరైన జతను గుర్తించండి.
     1) వైట్ రెవల్యూషన్ - పాల ఉత్పత్తి
     2) ఎల్లో రెవల్యూషన్ - నూనెగింజల ఉత్పత్తి
     3) రెండో హరిత విప్లవం - జీవ ఎరువులకు ప్రాధాన్యం
     4) అన్నీ సరైనవే
జ: 4(అన్నీ సరైనవే)

 

308. NAFED దేనికి సంబంధించింది?
జ: వ్యవసాయ మార్కెటింగ్‌కు

 

309. కిందివాటిలో ద‌త్‌  సిఫార్సుల మేరకు ఏర్పాటైనవి-
     1) MRTP చట్టం 1969
     2) 1970 పారిశ్రామిక లైసెన్సింగ్ విధానం
     3) 1956 పారిశ్రామిక విధానం
     4) MRTP చట్టం 1969, 1970 పారిశ్రామిక లైసెన్సింగ్ విధానం
జ: 4(MRTP చట్టం 1969, 1970 పారిశ్రామిక లైసెన్సింగ్ విధానం)

 

310. MSMED చట్టం - 2006 ప్రకారం మాన్యుఫ్యాక్చరింగ్ రంగంలో చిన్నతరహా పరిశ్రమల పెట్టుబడి పరిమితి ఎంత?
జ: 25 లక్షల నుంచి 5 కోట్ల వరకు

 

311. MRTP చట్టాన్ని రద్దు చేసి 2002లో దాని స్థానంలో తీసుకువచ్చిన చట్టం ఏది?
జ: కాంపిటీషన్ చట్టం

 

312. ఉమ్మడి రంగాన్ని ఏర్పాటు చేయాలని సూచించిన కమిటీ ఏది?
జ: దత్ కమిటీ

 

313. కిందివాటిలో భూ సంస్కరణల్లో భాగం కానిదేది?
     1) కౌలు విధానాలు     2) మధ్యవర్తుల తొలగింపు    
     3) భూకమతాల గరిష్ఠ పరిమితి     4) భూదానోద్యమం
జ: 4(భూదానోద్యమం)

 

314. ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు (RRBs) ఎవరికి పరపతిని అందిస్తాయి?
     1) చేతివృత్తుల వారికి      2) ఉపాంత చిన్న రైతులకు      
     3) వ్యవసాయ కూలీలకు      4) వీరందరికీ
జ: 4(వీరందరికీ)

 

315. The end of Laissez Faire గ్రంథాన్ని రచించిన ఆర్థికవేత్త ఎవరు?
జ: జాన్ మోనార్డ్ కీన్స్

 

316. మనదేశంలో ఆర్థిక సంస్కరణల వల్ల-
     1) విదేశీమారక ద్రవ్యం పెరిగింది      2) విదేశీ పెట్టుబడులు పెరిగాయి    
     3) ఆర్థికవృద్ధి పెరిగింది      4) అన్నీ
జ: 4(అన్నీ)

 

317. కిందివాటిలో నూతన వ్యవసాయక వ్యూహంలో భాగంగా ఉన్నవి?
     1) రసాయనిక ఎరువుల సరఫరా
     2) ఆధునిక వంగడాల సరఫరా
     3) భారీ నీటి ప్రాజెక్టుల నిర్మాణం
     4) రసాయనిక ఎరువుల సరఫరా, ఆధునిక వంగడాల సరఫరా
జ: 4(రసాయనిక ఎరువుల సరఫరా, ఆధునిక వంగడాల సరఫరా)

 

318. భారత ప్రణాళిక సంఘం ప్రకారం భారతదేశంలో భూ సంస్కరణల లక్ష్యాలేవి?
     1) వ్యవసాయ రంగంలో దోపిడీ నిర్మూలన
     2) భూమిని దున్నేవారికి రక్షణ
     3) వ్యవసాయ ప్రగతి అవరోధాల నిర్మూలన
     4) అన్నీ
జ: 4(అన్నీ)

 

319. కిందివాటిలో మొదటి దశ భూసంస్కరణల్లో విజయవంతమైన చర్య ఏది?
     1) భూ పంపిణీ      2) మధ్యవర్తుల తొలగింపు      3) కౌలు సంస్కరణలు      4) అన్నీ
జ: 2(మధ్యవర్తుల తొలగింపు)

 

320. భారత ఆర్థిక వ్యవస్థలో 1991లో ప్రవేశపెట్టిన నూతన ఆర్థిక విధాన ఉద్దేశం-
     1) ప్రాంతీయ సమానత్వాన్ని సాధించడం
     2) ఆర్థిక అసమానతలు తగ్గించడం
     3) దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నవారిని తగ్గించడం
     4) అన్నీ
జ: 4(అన్నీ)

 

321. భారతదేశంలో భారీ తరహా పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలకు, సహకార సంస్థలకు ఆర్థిక సహాయాన్ని అందించే సంస్థ-
జ: IFCI

 

322. ప్రభుత్వం చేసిన కౌలుదారు సంస్కరణల చట్టం ముఖ్య ఆశయం ఏమిటి?
     1) కొంతమంది కౌలుదారులకు యాజమాన్య హక్కు కల్పించడం
     2) సముచిత బాటక నిర్ణయం చేయడం
     3) కౌలుదారుకు కాలపరిమితి సెక్యూరిటీని కల్పించడం
     4) అన్నీ
జ: 4(అన్నీ)

 

323. ఉత్పత్తిని విక్రయించడం, ఉత్పత్తి కారకాలు మార్కెట్లో అమ్మడం; వస్తువులు, ఉత్పత్తి కారకాల స్వేచ్ఛా గమనం ఉన్న ఆర్థికవ్యవస్థ-
జ: మార్కెట్ ఆర్థికవ్యవస్థ

 

324. భారతదేశంలో రాష్ట్ర ప్రభుత్వాలు భూగరిష్ఠ పరిమితి చట్టాన్ని వాస్తవంగా ఏ ప్రణాళికా కాలంలో ప్రవేశపెట్టారు?
జ: 3వ

 

325. ప్రపంచీకరణ ప్రక్రియ వివిధ దేశాల మధ్య అనుమతించే స్వేచ్ఛా ప్రవాహం, వస్తు, సేవలు, ........
     1) సాంకేతిక పరిజ్ఞానం      2) శ్రామికులు      3) పెట్టుబడి      4) అన్నీ
జ: 4(అన్నీ)

 

326. 2004 - 05 ఆధారిత కేంద్ర గణాంకాల కార్యాలయం గణాంకాల ప్రకారం 2010 - 11లో తయారీరంగ పారిశ్రామిక ఉత్పత్తి సూచీ ఎంత?
జ: 175.7

 

327. విదేశీ మారక చెల్లింపుల శేషంలోని మూలధన ఖాతాలో వర్గీకరించిన డెట్ లేదా ఈక్విటీ, స్వల్ప లేదా దీర్ఘకాల అంశాలు-
జ: విదేశీమారక ప్రవేశ ప్రవాహాలు

 

328. ఒక దేశానికి చెందిన ఎగుమతులు, దిగుమతుల మధ్య వ్యత్యాసాన్ని తెలిపేది-
జ: నికర ఎగుమతులు

 

329. కిందివాటిలో మహారత్న హోదా పొందిన కంపెనీ ఏది?
     1) NTPC      2) SAIL      3) ONGC      4) అన్నీ
జ: 4(అన్నీ)

 

330. మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అంటే ఏమిటి?
జ: ఉత్పత్తి, పంపిణీ ప్రభుత్వ, ప్రయివేట్ యాజమాన్యాధీనంలో ఉంటాయి. 

 

331. భారత్‌లో ఆదాయ అసమానతలకు కిందివాటిలో సరైన కారణం-
     1) భూయాజమాన్యం కొద్దిమంది చేతుల్లోనే కేంద్రీకృతమై ఉండటం
     2) వృత్తిపరమైన నైపుణ్యం, శిక్షణలో అసమానతలు
     3) సంపద ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఉండటం
     4) అన్నీ
జ: 4(అన్నీ)

 

332. వ్యవసాయానికి అత్యధికంగా రుణాలు ఇచ్చే సంస్థలు (గత దశాబ్ద కాలంలో)-
జ: వాణిజ్య బ్యాంకులు

 

333. లీడ్ బ్యాంక్ పథకం కింద వాణిజ్య బ్యాంకులు దత్తత తీసుకునేవి-
     1) జిల్లాలు      2) గ్రామాలు      3) మండలాలు      4) రాష్ట్రాలు
జ: 1(జిల్లాలు)

 

334. IDBI అనేది-
జ: స్వయం ప్రతిపత్తి ఉన్న సంస్థ

 

335. కిందివాటిని జతపరచండి.
1) శివరామన్ కమిటీ          ఎ) ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు
2) హిల్టన్ యంగ్               బి) NABARD
3) నారిమన్                     సి) RBI
4) నరసింహం కమిటీ       డి) లీడ్ బ్యాంకు
జ: 1-బి, 2-సి, 3-డి, 4-ఎ

 

336. కిందివాటిని జతపరచండి.
1) NABARD            ఎ) జిమ్ యంగ్ కిమ్
2) IMF                   బి) రాబర్టో అజెవెడో
3) World Bank        సి) క్రిస్టిన్ లగార్డే
4) WTO                 డి) హర్షకుమార్ బన్వాల
జ: 1-డి, 2-సి, 3-ఎ, 4-బి

 

337. అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి, విదేశీ పెట్టుబడులకు ఒక ప్రధాన మార్గమై దేశంలోకి మూలధనం, సాంకేతిక పరిజ్ఞానాన్ని రప్పించడమే కాకుండా దేన్ని పెంచుతుంది?
జ: ఆర్థిక వృద్ధి

 

338. కిందివాటిలో సరికాని జత ఏది?
     (A) SIDBI -1990      (B) RRB - 1975       (C) IDBI -1964    (D) NABARD - 1979
జ: D మాత్రమే

 


 

340. కిందివాటిలో జాతీయ ప్రభుత్వ - ప్రైవేట్ భాగస్వామ్య విధానాన్ని సూచించేది ఏది?
     1) నీతి ఆయోగ్      2) ఆర్థిక సంఘం      3) ప్రణాళికా సంఘం      4) WTO
జ: 1(నీతి ఆయోగ్)

 

341. రష్యా సహకారంతో చత్తీస్‌గఢ్‌లో నిర్మించిన ఇనుము - ఉక్కు కర్మాగారం ఏది?
జ: భిలాయ్

 

342. ప్రత్యేక ఆర్థిక మండళ్లను ఏర్పాటు చేయడం వల్ల రైతులు భూములు కోల్పోతారని, పెట్టుబడిదారుల సామ్రాజ్యవాదం పెరుగుతుందని ఎవరు పేర్కొన్నారు?
జ: డేవిడ్ హార్వే

 

343. జాతీయ సహకార వ్యవసాయ మార్కెటింగ్ ఫెడరేషన్‌ను ఎప్పుడు ఏర్పాటు చేశారు?
జ: 1958

 

344. ప్రభుత్వం చేసిన కౌలుదారు సంస్కరణల చట్టం ముఖ్య ఆశయం ఏమిటి? (రిపీట్)
     1) కొంతమంది కౌలుదారులకు యాజమాన్య హక్కు కల్పించడం
     2) సముచిత బాటక నిర్ణయం చేయడం
     3) కౌలుదారుకు కాలపరిమితి సెక్యూరిటీని కల్పించడం
     4) అన్నీ
జ: 4(అన్నీ)

Posted Date : 31-01-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌