1. హిమాలయ నదీ వ్యవస్థలో అత్యంత పురాతనమైన నది ఏది?
జ: బ్రహ్మపుత్ర
2. కిందివాటిలో యమునా నది ఉపనది కానిది?
జ: కోసి
3. అతితరుణ నది అని దేన్ని పిలుస్తారు?
జ: గంగా
4. బ్రహ్మపుత్ర నదిని అరుణాచల్‌ప్రదేశ్‌లో ఏమంటారు?
జ: దిహాంగ్
5. మధుర ఏ నది ఒడ్డున ఉంది?
జ: యమున
6. మనదేశంలో ఉన్న ఏకైక నదీ ఆధారిత దీవి?
జ: మజూలీ
7. బెంగాల్ దుఃఖదాయిని అని దేన్ని పిలుస్తారు?
జ: దామోదర్
8. గంగానది ఏ ప్రాంతం వద్ద మైదానంలోకి ప్రవేశిస్తుంది?
జ: హరిద్వార్
9. గువహటి ఏ నది ఒడ్డున ఉంది?
జ: బ్రహ్మపుత్ర
10. నదుల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు?
జ: పొటమాలజీ
11. అరేబియా సముద్రంలో కలిసే నదుల్లో అత్యంత పెద్దది, పొడవైన నది....
జ: సింధు
12. సింధూ నది ఉపనదుల్లో అత్యంత పొడవైంది....
జ: సట్లెజ్
13. భారతదేశ భూభాగంలో మాత్రమే ప్రవహించే ఏకైక సింధూ ఉపనది.....
జ: బియాస్