మాదిరి ప్రశ్నలు
1. క్యోటో ప్రోటోకాల్ ఒప్పందం దేనికి సంబంధించింది? (ఏఈ, 2015)
జ: వాతావరణ మార్పు
2. క్యోటో ప్రోటోకాల్ ఒప్పందం ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది? (ఏఈఈ, 2016)
జ: 2005, ఫిబ్రవరి 16
3. 2022 నాటికి భారతదేశం ఎన్ని గిగావాట్ల సౌరశక్తిని ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించింది? (గ్రూప్ - 1, 2017)
జ: 100
4. అంతరించిపోతున్న జీవులను లెక్కించడానికి ఉపయోగించే పుస్తకం (ఎస్ఐ, 2016)
జ: రెడ్‌లిస్ట్
5. అంతర్జాతీయ మొదటి పృథ్వి సదస్సును ఎప్పుడు నిర్వహించారు? (ఎస్ఏ, 2018)
జ: 1992
6. కిందివాటిని జతపరచండి.
జాబితా - I | జాబితా - II |
i) పర్యావరణ దినోత్సవం | A) సెప్టెంబర్ 16 |
ii) జీవవైవిధ్య దినోత్సవం | B) ఏప్రిల్ 22 |
iii) ధరిత్రి దినోత్సవం | C) మే 22 |
iv) ఓజోన్ దినోత్సవం | D) జూన్ 5 |
i ii iii iv
జ: D C B A
7. కిందివాటిని జతపరచండి.
సదస్సులు | సంవత్సరం |
i) క్యోటో ప్రోటోకాల్ ఒప్పందం | A) 1987 |
ii) మాంట్రియల్ ప్రోటోకాల్ | B) 1997 |
iii) అంతర్జాతీయ సౌర కూటమి సదస్సు | C) 2016 |
iv) ఓజోన్ తరుగుదల సదస్సు | D) 2018 |
i ii iii iv
జ: B A D C
8. కార్బన్‌పై ట్యాక్స్ విధించిన మొదటి దేశం
జ: న్యూజిలాండ్
9. UNEP ని విస్తరించండి.
జ: United Nations Environment Programme
10. మొదటి అంతర్జాతీయ పర్యావరణ సదస్సును ఎక్కడ నిర్వహించారు?
జ: స్టాక్‌హోం