• facebook
  • whatsapp
  • telegram

ముసునూరి నాయక రాజులు (క్రీ.శ. 1325-1368)

మాదిరి ప్ర‌శ్న‌లు

1. ముసునూరి నాయకుల చరిత్రకు ఆధారం-
     1) విలస తామ్రశాసనం     2) పోలవరం శాసనం     3) కలువ చెరువు శాసనం     4) అన్నీ సరైనవే
జ: 4(అన్నీ సరైనవే)

 

2. ముసునూరి వంశ స్థాపకుడు
జ: ప్రోలయనాయకుడు

 

3. ముసునూరి నాయక రాజ్య రాజధాని-
జ: రేఖపల్లి

 

4. 'ఆంధ్రసురత్రాణ' బిరుదాంకితుడు
జ: కాపయ

 

5. రేచర్ల పద్మనాయక స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించింది ఎవరు?
జ: మొదటి సింగమనాయక

 

6. దేవరకొండ రాజధానిగా పాలించిన రేచర్ల పద్మనాయక రాజు-
జ: మాదానీడు

7. రేచర్ల సింగమ నాయకుడి రాజధాని-
జ: పిల్లలమర్రి

 

8. సర్వజ్ఞ చక్రవర్తి బిరుదు పొందినవాడు-
జ: రెండో సింగమనాయక

 

9. 1368 నాటి భీమవరం యుద్ధంలో కాపయనాయకుడిని వధించిన పద్మనాయక రాజు
జ: అనవోతానీడు

 

10. కాపయ నాయకుడి రాజధాని
జ: వరంగల్లు

 

11. కోరుకొండ దుర్గాన్ని నిర్మించిన ముసునూరి పాలకుడు
జ: కాపయనాయకుడు

 

12. కిందివాటిని జతపరచండి.
1) ఆంధ్ర సురత్రణ    ఎ) అనవోతానీడు
2) సర్వజ్ఞ చక్రవర్తి    బి) మొదటి సింగమనాయక
3) సర్వజ్ఞ సింగభూపాలుడు    సి) రెండో సింగమనాయక
4) సోమకులపరశురామ    డి) కాపనాయకుడు
జ: 1-డి, 2-సి, 3-బి, 4-ఎ

13. చమత్కార చంద్రిక గ్రంథ రచయిత ఎవరు?
జ: విశ్వేశ్వరుడు

 

14. సంగీత సుధాకరం అనే అలంకార శాస్త్ర గ్రంథాన్ని ఎవరు రచించారు?
జ: సర్వజ్ఞ సింగముడు

 

15. కాపయ నాయకుడి కాలంలో 'సకల నీతిసారం' అనే గ్రంథాన్ని రాసినదెవరు?
జ: మడికి సింగన

 

16. రెడ్డి రాజ్య స్థాపకుడు
జ: ప్రోలయ వేమారెడ్డి

 

17. ప్రోలయ వేమారెడ్డి ముసునూరి కాపయ ఆస్థానంలో ఉన్నట్లు తెలిపే ఆధారం
జ: కలువచేరు శాసనం

 

18. కొండవీటి రెడ్డి రాజ్య స్థాపకుడు, రాజధాని
జ: ప్రోలయ వేమారెడ్డి, అద్దంకి

 

19. శ్రీశైలంలో పాతాళ గంగకు, అహోబిలం కొండకు మెట్లు కట్టించినవారు?
జ: ప్రోలయ వేమారెడ్డి

 

20. ప్రోలయ వేమారెడ్డి సర్వసైన్యాధ్యక్షుడిగా నియమించిన అతడి సోదరుడు
జ: మల్లారెడ్డి

21. ఎర్రాప్రగడ, శ్రీగిరి పండితులను పోషించిన రెడ్డిరాజు-
     1) పెదకోమటి వేమారెడ్డి      2) అనవేమారెడ్డి      3) కుమారగిరి రెడ్డి     4) ఎవరూకాదు
జ: 4(ఎవరూకాదు)

 

22. రాజధానిని అద్దంకి నుంచి కొండవీడుకు మార్చినదెవరు?
జ: అనపోతారెడ్డి

 

23. శ్రీశైల శిలాశాసనం ఏ రెడ్డి రాజు విజయాలను వివరిస్తుంది?
జ: అనవేమారెడ్డి

 

24. గొట్టివాడ గ్రామాన్ని సింహాచలేశుడికి దానం చేసినదెరు?
జ: చెన్నమ నాయకుడు

 

25. శ్రీశైలం, సింహాచలంలో వీరశిరోమండపాలు నిర్మించిన రెడ్డిరాజు-
జ: అనవేమారెడ్డి

 

26. కిందివాటిని జతపరచండి.
1) వసంతరాయలు    ఎ) అనవేమారెడ్డి
2) కర్పూర వసంతరాయలు    బి) కుమారగిరిరెడ్డి
3) ద్వీపజేత, జగనొబ్బగండ    సి) ప్రోలయవేమారెడ్డి
4) మ్లేచోబ్ధి కుంభోద్భవ    డి) అనవోతారెడ్డి
జ: 1-ఎ, 2-బి; 3-డి; 4-సి

27. కిందివాటిని జతపరచండి.
1) నవనాథ చరిత్రం    ఎ) ఎర్రాప్రగడ
2) నృసింహపురాణం    బి) శ్రీ గిరి దేవయ్య
3) విష్ణుపురాణం    సి) కుమారిగిరి రెడ్డి
4) వసంతరాజీయం    డి) వెన్నెలకంటి సూరన
జ: 1-బి, 2-ఎ, 3-డి, 4-సి

 

28. లకుమాదేవి అనే నర్తకి ఎవరి ఆస్థానంలో ఉండేది?
జ: కుమారగిరి రెడ్డి

 

29. శ్రీనాథుడి 'హరివిలాసం' గ్రంథం ప్రకారం కుమారగిరి కాలంనాటి వసంతోత్సవాలను నిర్వహించింది?
జ: అవచి తిప్పయ్య శెట్టి

 

30. రాజమండ్రి రెడ్డి రాజ్యాన్ని స్థాపించినదెవరు?
జ: కాటయ వేమారెడ్డి

 

31. 1416లో మోటుపల్లిలో అభయశాసనం వేయించిన పాలకుడు ఎవరు?
జ: రెండో దేవరాయలు

32. శివలీలా విలాసం గ్రంథ రచయిత ఎవరు?
జ: శివలెంకకొమ్మన

 

33. శ్రీనాథుడు పెదకోమటి వేమారెడ్డి ఆస్థానంలో నిర్వహించిన పదవి-
జ: ఆస్థాన విద్యాధికారి

 

34. 'సంగీత చింతామణి, సాహిత్య చింతామణి' లాంటి గ్రంథాలు రచించిన రెడ్డిరాజు-
జ: పెదకోమటి వేమారెడ్డి

 

35. ఫిరంగిపురం వద్ద సంతానసాగరం చెరువును తవ్వించినదెవరు?
జ: సూరాంబిక

 

36. శ్రీనాథుడు తన 'శృంగార నైషథం' గ్రంథాన్ని ఎవరికి అంకితమిచ్చాడు?
జ: మామిడి సింగన

 

37. పురిటి సుంకం విధించిన రెడ్డిరాజు
జ: రాచ వేమారెడ్డి

 

38. అద్దంకి వీధుల్లో సవరం ఎల్లయ్య అనే బలిజనాయకుడి చేతిలో హతమైన రెడ్డిరాజు-
జ: రాచవేమారెడ్డి

 

39. కుమారగిరి రాజీయం గ్రంథాన్ని ఎవరు రచించారు?
జ: కాటయవేమారెడ్డి

40. మూడో అనవోతారెడ్డి రాజధాని రాజమండ్రి అని వివరిస్తున్న శాసనం-
జ: కొమ్ముచిక్కాల

 

41. ధరణికోట యుద్ధంలో బహమనీ సుల్తాన్ హసన్ గంగూను ఓడించినదెవరు?
జ: మల్లారెడ్డి

 

42. గ్రామ అధికారులైన 12 మంది ఆయగాండ్రుల్లో 'ఆరెకుడు'గా ఎవరిని పిలుస్తారు?
జ: తలారి

Posted Date : 31-01-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌