* రోబోట్ అనేది ఒక యంత్రం. ఇది మానవుడిని ఆశ్చర్యపరిచే విధంగా ఇచ్చిన పనిని చక్కగా నిర్వర్తిస్తుంది.
రోబోట్‌లో 3 రకాలైన తరాలు ఉన్నాయి
మొదటి తరం (సాధారణ రోబోట్లు)
* వీటిని చెవిటి, మూగ, గుడ్డి రోబోట్లు అంటారు.
* ఇవి మమూలు యంత్రాలను కలిగి ఉండి చెప్పిన పనిని సక్రమంగా పూర్తి చేస్తాయి.
* వీటిని ఆటోమొబైల్ పరిశ్రమలో వెల్డింగ్, స్ప్రే చేయడంలో ఉపయోగిస్తారు.
* వీటికి గ్రహణ శక్తి లేదు. ఏదైనా తప్పు ఉంటే దాన్ని ఎలా పరిష్కరించాలో తెలియదు.
* వస్తు పరికరాల అమరికలో తప్పు ఉంటే ఈ తరహా రోబోట్లు గమనించకుండా పనిచేసుకుంటూనే ఉంటాయి.
రెండో తరం రోబోట్లు
* మొదటి తరం కంటే వీటికి జ్ఞాపకశక్తి ఎక్కువగా ఉంటుంది. ఇవి సాధారణంగా కంప్యూటరీకరించి ఉంటాయి.
* వీటికి 4º - 6º స్వేచ్ఛ ఉండి, తమ కదలికల్లో నియంత్రణ కలిగి ఉంటాయి.
మూడో తరం రోబోట్లు
* ఇవి చాలా సంక్లిష్ట రూపాన్ని కలిగి ఉంటాయి. వస్తువును చూడగలవు, స్పర్శించగలవు.
* సెన్సార్లు పంచిన సమాచారం ఆధారంగా నిర్ణయాలు చేయగలిగే శక్తిని కలిగి ఉంటాయి.
ఉదా: 1985లో ఎయిర్ ఇండియా జంబోజెట్ విమానం కనిష్క కూలినప్పుడు ఈ రోబోట్ల సహాయంతోనే బ్లాక్ బాక్స్‌ను సముద్రం నుంచి వెలికితీశారు.
రోబోటిక్స్ - ఉపయోగాలు
1) పరిశ్రమలు:
* రోబోట్లను పరిశ్రమల్లో డ్రిల్లింగ్ చేయడం, పరికరాలను వాడటం, విడిభాగాలను లోడ్ చేయడం.
* పెయింట్ స్ప్రే చేయడం, వెల్డింగ్ చేయడం, పరికరాలను అసెంబుల్ చేయడం, వస్తువులను పరిశీలించడంలో ఉపయోగిస్తారు.
* భవిష్యత్తులో రక్షణ రంగంలో మానవుడు లేని ట్యాంకుల నిర్వహణలో రోబోట్లను వినియోగించనున్నారు.
* వైద్య రంగంలో శస్త్ర చికిత్స, నర్సింగ్‌కేర్‌లో ఉపయోగించే పైపుల్లో వచ్చే చీలికలను గుర్తించడానికి ఉపయోగిస్తారు. మైక్రో సర్జరీలలో ఇప్పటికే రోబోట్లను ఉపయోగిస్తున్నారు.
* గనుల్లో 24 గంటలు నడిచే యంత్రాలతోపాటు రోబోట్లను ఉపయోగించి విలవైన వనరులను సమర్థంగా వెలికితీస్తున్నారు.
* సముద్ర గర్భంలో, అంతరిక్ష పరిశోధనా విభాగంలో, అణువిద్యుత్ కేంద్రాల్లో విస్ఫోటక పదర్థాలను గుర్తించడానికి; ఎయిర్‌పోర్ట్‌లలో బాంబులను కనుక్కోవడం, తొలగించడంలో; రసాయనశాలలో ప్రయోగాత్మక పనుల్లో ఉపయోగిస్తున్నారు.
రోబోటిక్ టెక్నాలజీ - భారతదేశం
* భారత్‌లోని ఐఐటీలలో, బెంగళూరు ఐఐఎస్సీ, జాదవ్‌పూర్ యూనివర్సిటీలలో రోబోటిక్ ప్రయోగశాలలు ఉన్నాయి.
* ముంబయిలోని బాబా అణువిద్యుత్ పరిశోదనా కేంద్రం (BARC) న్యూక్లియర్ వ్యర్థాలను తొలగించడానికి రోబోట్లను లను ఉపయోగిస్తుంది.
* టెల్కోలో స్పాట్ వెల్డింగ్ చేయడానికి, KIRLOSKARలో మోటార్లను అసెంబుల్ చేయడంలో, మారుతీ ఉద్యోగ్ లిమిటెడ్‌లో స్ప్రే చేయడంలో ఈ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు.
* DRDO, DAC, HMT, IIT లు రోబోట్లను తయారు చేస్తున్నాయి.
* బెంగళూరులోని 'సెంటర్ ఫర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ రోబోటిక్స్'(CAIR) సెన్సర్లను కలిగి ఉన్న వస్తువులను ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి మార్చే సామర్థ్యం ఉన్న చాతూ రోబోట్ (CHATOO ROBOT), నిపుణ (NIPUNA) రోబోట్లను తయారు చేసింది.
రోబోటిక్స్
* 1942లో ఇసాక్ అసిమోల్ రోబోటిక్స్‌కు సబంధించిన మూడు నియమాలను ప్రతిపాదించారు.
* 1948లో నోబెర్ట్ వైనర్ సైబర్ నెటిక్స్ అనే రోబోటిక్స్ ప్రాథమిక సూత్రాలను ప్రతిపాదించారు.
* ఫుల్లీ అటానమస్ రోబోట్ 20వ శతాబ్దం ద్వితీయార్థంలో వచ్చింది.
* మొదటి రోబోట్‌ను 1961లో తయారు చేశారు.