• facebook
  • whatsapp
  • telegram

భారతదేశంలో వ్యవసాయ పరపతి సౌకర్యాలు

1. ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధిని ఎప్పుడు ప్రారంభించారు?

 1) 2019   2) 2020   3) 2021    4) 2022


2. కిసాన్‌ క్రెడిట్‌ కార్డు పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు?

  1)1998, ఆగస్టు     2) 1998, సెప్టెంబరు 

 3) 1998, అక్టోబరు   4) 1998, నవంబరు 


3. కిసాన్‌ క్రెడిట్‌ కార్డులను జారీ చేసే సంస్థలు?

1) సహకార బ్యాంకులు     2)  ప్రాంతీయ బ్యాంకులు 

 3) వాణిజ్య బ్యాంకులు     4) పైవన్నీ 


4. కిందివారిలో ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి పొందే లబ్ధిదారులు?

1) సన్నకారు రైతులు    2) ఉపాంత రైతులు 

3) 1, 2     4) పెద్ద రైతులు 


5. ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజనను ఎప్పుడు ప్రారంభించారు?

1)  2014     2)  2015      3)  2016    4) 2017 


6. వ్యవసాయ అవస్థాపన నిధిని ఎప్పుడు ప్రారంభించారు?

1) 2018    2) 2019     3) 2020     4) 2021


7. భారతదేశంలో సహకార ఉద్యమం ఎప్పుడు ప్రారంభమైంది?

1) 1901    2) 1902      3) 1903      4) 1904 


8. సంస్థేతర పరపతి మూలాల్లో ముఖ్యమైనవారు?

1) భూస్వాములు     2) బ్యాంకులు 

3) వడ్డీ వ్యాపారులు    4) బంధువులు 


9. బ్యాంకులు భూమిని తనఖాగా పెట్టుకుని వడ్డీలు ఇస్తాయి. వీటిని ప్రారంభించిన మొదటి రాష్ట్రం?

1) తమిళనాడు    2) మహారాష్ట్ర 

3) పంజాబ్‌   4) ఉత్తర్‌ ప్రదేశ్‌ 


10. సూక్ష్మ విత్త విధానానికి ప్రాతిపదిక?

1)పేదలకు బ్యాంకింగ్‌ సదుపాయం కల్పించడం

2) సంపన్నులకు బ్యాంకింగ్‌ సదుపాయం కల్పించడం

3) 1, 2       4) ఏదీకాదు 


11. జాతీయ వ్యవసాయ గ్రామీణాభివృద్ధి బ్యాంకు (నాబార్డు)ను ఎప్పడు ఏర్పాటుచేశారు?

1)  1982, జులై 12     2) 1983, జులై 12

3) 1984, జులై 12    4) 1985, జులై 12


12. నాబార్డు ఏర్పాటుకు సిఫార్సు చేసిన కమిటీ?

1) నరసింహం కమిటీ     2) శివరామన్‌ కమిటీ  

3) ఖుస్రో కమిటీ     4) భండారీ కమిటీ 


13. వ్యవసాయ పరోక్ష సహయ అభివృద్ధి సంస్థను ఎప్పుడు ఏర్పాటు చేశారు?

1) 1961, జులై    2) 1962, జులై 

 3) 1963, జులై    4) 1964, జులై


14. వ్యవసాయ పరోక్ష సహాయ అభివృద్ధి సంస్థ కింది దేనిలో విలీనమైంది?

1) నాబార్డు     2) వాణిజ్య బ్యాంకులు 

3) ఆర్‌బీఐ      4) ఐడీబీఐ బ్యాంక్‌


15. గ్రామీణ అవస్థాపన అభివృద్ధి నిధి (ఆర్‌ఐడీఎఫ్‌)ని ఎప్పుడు ఏర్పాటు చేశారు?

1) 1994, ఏప్రిల్‌ 1    2) 1995, ఏప్రిల్‌ 1 

3) 1996, ఏప్రిల్‌ 1    4) 1997, ఏప్రిల్‌ 1 


16. వ్యవసాయదారులకు దీర్ఘకాలిక రుణాలు అందించే సహకార బ్యాంకులు ఏవి?

1) సహకార వ్యవసాయ గ్రామీణాభివృద్ధి బ్యాంకులు 

2) ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు 

 3) నాబార్డు    4) ఏదీకాదు


17. సహకార వ్యవసాయంలో భాగమైన గ్రామీణాభివృద్ధి బ్యాంకులను పూర్వం ఏ పేర్లతో పిలిచేవారు?

 1) భూమి తనఖా బ్యాంకులు

2) భూమి అభివృద్ధి బ్యాంకులు

3) 1, 2    4) నాబార్డు


18. ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల (ఆర్‌ఆర్‌బీ) ఏర్పాటు ఆర్డినెన్స్‌ను ఎప్పుడు జారీచేశారు?

1) 1975, సెప్టెంబరు 26     2) 1975, అక్టోబరు 26

3) 1975, నవంబరు 26      4) 1975, డిసెంబరు 26


19. ప్రస్తుతం మనదేశంలో ఎన్ని ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు ఉన్నాయి?

1) 41   2) 42    3) 43    4) 44


20. ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు ఎప్పుడు ప్రారంభమయ్యాయి?

1) 1975, అక్టోబరు 2     2) 1975, అక్టోబరు 3 

3) 1975, అక్టోబరు 4     4) 1975, అక్టోబరు 5 


21. మనదేశంలో తొలిసారిగా 1975లో అయిదు ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులను ప్రారంభించారు. వాటిని ఏర్పాటు చేసిన ప్రదేశాలు?

1) మొరదాబాద్‌ (యూపీ), గోరఖ్‌పూర్‌ (యూపీ)

2) బివానీ (హరియాణా), జైపూర్‌ (రాజస్థాన్‌)

3) మాల్దా (పశ్చిమ్‌ బంగా) 

4) పైవన్నీ


22. ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులకు స్పాన్సర్‌ చేసే బ్యాంకులు?

1) వాణిజ్య బ్యాంకులు    2) నాబార్డు 

3) ఆర్‌బీఐ    4) ఏదీకాదు


23. ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల మూలధనంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాటా? (మిగిలిన మొత్తాన్ని స్పాన్సర్‌ బ్యాంక్‌ ఇస్తుంది.)

1) కేంద్రం 50%    2) రాష్ట్రం 15%

3) 1, 2     4) కేంద్రం 65%, రాష్ట్రం 25%


24. ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల మూలధనంలో స్పాన్సర్‌ బ్యాంకు వాటా?

1) 15%     2) 50%     3) 35%     4) 25%


25. ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులను వాటికి స్పాన్సర్‌ చేసిన బ్యాంకుల్లో విలీనం చేయాలని సిఫార్సు చేసిన కమిటీ?

1) రంగరాజన్‌ కమిటీ    2) నరసింహం కమిటీ

3) ఎ.ఎం.ఖుస్రో కమిటీ    4) భండారీ కమిటీ


26. ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులను పునర్‌వ్యవస్థీకరించడానికి సూచనలు చేసిన కమిటీ?

1) ఎం.సి.భండారీ కమిటీ      2) నరసింహం కమిటీ

3) ఎ.ఎం.ఖుస్రో కమిటీ       4) రంగరాజన్‌ కమిటీ


27. సంస్థాగత పరపతిని అందించడంలో మొదటి స్థానంలో ఉన్న బ్యాంకులు?

1) వాణిజ్య బ్యాంకులు      2) నాబార్డు 

3) ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు     4) పైవన్నీ


28. వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బ్యాంకు?

1) నాబార్డు     2) యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (యూబీఐ)

3) స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ)      4) ఏదీకాదు


29. సంస్థాగత పరపతిని అందించడంలో ద్వితీయ, తృతీయ స్థానాల్లో ఉన్న బ్యాంకులు?

1) సహకార బ్యాంకులు    2)  ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు

3) ఎస్‌బీఐ     4) 1, 2


30. వ్యవసాయాభివృద్ధి కోసం ఆర్‌బీఐ ఏర్పాటు చేసిన నిధి?

1) జాతీయ వ్యవసాయ పరపతి (దీర్ఘకాలిక కార్యకలాపాల) నిధి

2) జాతీయ వ్యవసాయ స్థిరీకరణ నిధి

3) 1, 2        

4) మౌలిక అవస్థాపన నిధి


సమాధానాలు

1-1  2-1  3-4  4-3  5-3  6-3  7-4  8-3  9-3  10-1  11-1  12-2  13-3  14-1  15-2 16-1  17-3  18-1  19-3  20-1  21-4  22-1  23-3  24-3  25-3  26-1  27-1  28-1  29-4  30-3


మరికొన్ని..

1. బ్యాంకేతర సంస్థలను కూడా వడ్డీ వ్యాపారస్తుడు అనే నిర్వచనంలో చేర్చాలని సూచించిన కమిటీ?

1) రంగరాజన్‌ కమిటీ    2) సారంగి కమిటీ

3) నరసింహం కమిటీ    4) ఖుస్రో కమిటీ


2. పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి కింద ఏడాదికి చెల్లించే మొత్తం?

1) రూ.5000      2) రూ.6000

 3) రూ.7000      4) రూ.8000


3. సకాలంలో తిరిగి చెల్లించిన రుణాలపై అదనపు రాయితీ?

1) 3% (వడ్డీరేటు : 4%)     2)  2% (వడ్డీరేటు : 5%)

 3) 3% (వడ్డీరేటు : 6%)     4) ఏదీకాదు


4. నాబార్డు స్వయం సహాయక బృందాల అనుసంధానం ద్వారా ప్రోత్సహించిన పరపతి విధానం?

1) సూక్ష్మ బీమా     2) సూక్ష్మ విత్త విధానం

3) ద్రవ్య విధానం     4) విత్త విధానం


5. కరవులు, వరదలు మొదలైన అత్యవసర పరిస్థితుల్లో వ్యవసాయదారులకు ప్రభుత్వం అందించే రుణాలను ఏమంటారు?

1) స్వల్పకాలిక రుణాలు       2) మధ్యకాలిక రుణాలు       

3) దీర్ఘకాలిక రుణాలు      4) తక్కావి రుణాలు


6. కృషి ఉడాన్‌ యోజన పథకం ముఖ్య ఉద్దేశం?

1) వ్యవసాయ ఉత్పత్తులపై రైతుకు మెరుగైన ధర లభించేలా తోడ్పడుతూ, ఆదాయం పెంచడం. 

 2) కనీస మద్దతు ధర కల్పన

3) పరపతి సౌకర్యం కల్పన

4) సేకరణ ధర కల్పన


7. కిసాన్‌ క్రెడిట్‌ కార్డు ప్రధాన లక్ష్యం?

1) రైతులు, స్వయం సహాయక బృందాలు లేదా కౌలురైతులకు స్వల్ప లేదా దీర్ఘకాలిక వ్యవసాయ అవసరాల కోసం సులభ రుణ సహాయం అందించడం

2)  పెద్ద రైతులకు స్వల్పకాలిక రుణాలు అందించడం 

3) మధ్యకాలిక రుణాలు అందించడం

4) ఏదీకాదు


8. 2022, ఏప్రిల్‌ వరకు దేశంలో ఎన్ని కిసాన్‌ క్రెడిట్‌ కార్డులను జారీ చేశారు?

1) 3.05 కోట్లు    2) 2.05 కోట్లు      3) 4.05 కోట్లు     4) 6.05 కోట్లు


9. జాతీయ వ్యవసాయ బీమాపథకానికి ఉన్న మరోపేరు?

1) రాష్ట్రీయ కృషి బీమాయోజన      2) పంటలబీమా    

3) పశుగణనబీమా     4)వర్షబీమా


10. సమగ్ర పంటల బీమా పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు?

1) 1985, ఖరీఫ్‌ పంటకాలం

2) 1985, రబీ పంటకాలం

3) 1999, ఖరీఫ్‌ పంటకాలం

4) 1999, రబీ పంటకాలం

సమాధానాలు

1-2  2-2  3-1  4-2  5-4  6-1  7-1  8-1  9-1  10-1 

Posted Date : 28-01-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌