• facebook
  • whatsapp
  • telegram

చిన్నపిల్లల్లో గుండె వేగం ఎక్కువే!

రక్తప్రసరణ వ్యవస్థ

మనిషి సంపూర్ణ ఆరోగ్యానికి దోహదపడే శరీర వ్యవస్థల్లో రక్తప్రసరణ ప్రధానమైనది. గుండె, రక్తనాళాలు, రక్తంతో రూపొందిన ఈ వ్యవస్థ నిరంతరం సక్రమంగా పనిచేస్తూ ఉండాలి. శరీరంలోని అన్ని అవయవాలు, కణజాలాలకు ఆక్సిజన్, ఇతర పోషకాలను అందించడంతోపాటు శరీరంలోని వ్యర్థాలను ఎప్పటికప్పుడు రక్తం  తొలగిస్తుంది. ఈ సంక్షిష్ట వ్యవస్థ గురించి అభ్యర్థులు పోటీపరీక్షల కోణంలో తెలుసుకోవాలి. ఇందులోని ముఖ్య భాగాలు, రక్త ప్రసరణ క్రమం, గుండె పనితీరును ప్రభావితం చేసే అంశాలు, గుండె, రక్తనాళాలకు సంబంధించిన వ్యాధులు, చికిత్స విధానాలతో పాటు ఇతర జీవుల గుండె నిర్మాణంపై ప్రాథమిక అవగాహన కలిగి ఉండాలి.


1.    కింది వాక్యాలను పరిశీలించండి.

ఎ) శరీరంలో గుండె నుంచి శరీర భాగాలకు; శరీర భాగాల నుంచి గుండెకు రక్తప్రసరణను గమనించింది విలియం హార్వే.

బి) రక్తప్రసరణ వ్యవస్థ ముఖ్యవిధి వివిధ పదార్థాల రవాణ.

సి) కీటకాల్లో స్వేచ్ఛా రక్తప్రసరణ వ్యవస్థ ఉంటుంది.

డి) సకశేరుకాల్లో బంధిత రక్తప్రసరణ వ్యవస్థ ఉంటుంది.

పై వాటిలో సరైన వాటిని ఎన్నుకోండి.

1) ఎ, బి, సి డి       2) ఎ, బి, సి   

3) సి, డి         4) ఎ, సి


2. కింది వాక్యాల ఆధారంగా సరైౖన సమాధానాన్ని ఎంచుకోండి.

ఎ) స్వేచ్ఛా రక్తప్రసరణ వ్యవస్థలో రక్తం శరీరంలోని కుహరాల్లో ప్రవహిస్తుంది.

బి) బంధిత రక్తప్రసరణ వ్యవస్థలో రక్తం రక్తనాళాల్లో ప్రవహిస్తుంది.

1) ఎ, బి లు సరైనవి. ఈ రెండు వ్యవస్థలు ఒకే జీవిలో ఉంటాయి.

2) ఎ, బి లు సరైనవి. ఈ రెండు వ్యవస్థలు వేర్వేరు జీవుల్లో ఉంటాయి.

3) ఎ, బి లు సరైనవి కావు. 4) ఎ మాత్రమే సరైంది. బి సరైంది కాదు. 


3. కిందివాటిలో ధమనుల లక్షణం కానివాటిని  గుర్తించండి.

ఎ) ధమనులు గుండె నుంచి రక్తాన్ని శరీర భాగాలకు తీసుకుపోతాయి.

బి) ధమనుల్లో రక్తపీడనం ఎక్కువ. గోడలు మందంగా ఉంటాయి.

సి) ధమనుల్లో రక్తం వెనక్కి ప్రవహించకుండా కవాటాలు ఉంటాయి.

డి) ధమనులు శరీరం పై భాగాల్లో ఉంటాయి.

ఇ) ధమనుల్లో ఆక్సిజన్‌తో కూడిన మంచి రక్తం ప్రవహిస్తుంది.

1) ఎ, బి  2) బి, సి   3) సి, డి  4) డి, ఇ


4.    కిందివాటిలో సిరల గురించి సరైన వాక్యాలను ఎన్నుకోండి.

ఎ) సిరల్లో కార్బర్‌ డై ఆక్సైడ్‌తో కూడిన చెడు రక్తం ప్రవహిస్తుంది.

బి) శరీర భాగాల నుంచి గుండెకు రక్తాన్ని తీసుకువస్తాయి.

సి) సిరల్లో రక్తం ధమనుల కంటే తక్కువ వేగం, ఒత్తిడితో ప్రవహిస్తుంది.

డి) సిరల్లోని కవాటాలు దెబ్బతినడం వల్ల కలిగే వ్యాధి వెరికోస్‌ వీన్స్‌.

ఇ) సిరల్లో రక్తం వెనక్కి ప్రవహించకుండా కవాటాలు ఉంటాయి.

1) ఎ, బి, సి         2) బి, సి, డి    

3) సి, డి, ఇ        4) ఎ, బి, సి, డి, ఇ


5.    కింది జతలను సరైన క్రమంలో అమర్చండి.

ఎ) పుపుస సిర      1) ఊపిరితిత్తులకు రక్తాన్ని సరఫరా చేస్తుంది

బి) పుపుస ధమని    2) ఊపిరితిత్తుల నుంచి  రక్తాన్ని సేకరిస్తుంది

సి) వృక్క సిర       3) మూత్రపిండాలకు రక్తాన్ని  సరఫరా చేస్తుంది

డి) వృక్క ధమని     4) గుండెకు రక్తాన్ని సరఫరా  చేస్తుంది.

ఇ) కరోనరి ధమని    5) మూత్రపిండాల నుంచి   రక్తాన్ని సేకరిస్తుంది

1) ఎ-1, బి-4, సి-3, డి-2, ఇ-5    2) ఎ-2, బి-1, సి-5, డి-3, ఇ-4

3) ఎ-5, బి-3, సి-4, డి-2, ఇ-1  4) ఎ-4, బి-3, సి-2, డి-5, ఇ-1


6. కిందివాటిలో ఎన్ని జతలు సరైనవి?

ఎ) పుపుస ధమని - మంచి రక్తాన్ని ఊపిరితిత్తులకు సరఫరా చేస్తుంది.

బి) మంచి రక్తం - ఎరుపు రంగులో ఉంటుంది.

సి) చెడు రక్తం - లేత నీలి రంగులో ఉంటుంది. 

డి) రక్తకేశ నాళికలు - శరీర భాగాలకు రక్తాన్ని సరఫరా చేస్తాయి. 

ఇ) వెరికోస్‌వీన్స్‌ వ్యాధి - సిరల్లో కవాటాలు దెబ్బతినడం వల్ల కలిగే వ్యాధి.

1) 5 జతలు      2) 4 జతలు  

3) 3 జతలు      4) 2 జతలు


7. కింది వాక్యాల్లో సరికాని దాన్ని గుర్తించండి.

ఎ) రక్తకేశనాళికలు ధమనులకు, సిరలకు, దేహ భాగాలకు మధ్య సంధానకర్తలుగా ఉంటాయి.

బి) మన శరీరంలో గుండె పంపులా పనిచేసే అవయవం.

సి) గుండె నిర్మాణం, పనితీరు గురించి అధ్యయనాన్ని కార్డియాలజీ అంటారు.

డి) గుండె చుట్టూ ఉండే పొర పెరికార్డియం. ఇది రక్షణ ఇస్తుంది.

ఇ) మానవుడి గుండెలోని గదుల సంఖ్య 3.

ఎఫ్‌) గుండెలో పై గదులు జఠరికలు, కింది గదులు కర్ణికలు

1) ఎ, బి, సి      2) బి, సి, డి    

3) ఇ, ఎఫ్‌      4) సి, డి, ఎఫ్‌


8. గుండెలోని కవాటాలకు సంబంధించి సరైన జతలను క్రమంలో అమర్చండి?

ఎ) త్రిపత్ర కవాటం   1) గుండె నుంచి ఊపిరితిత్తులకు ప్రవహించే రక్తాన్ని నియంత్రిస్తుంది.

బి) ద్విపత్ర కవాటం   2) కుడి కర్ణిక నుంచి కుడి జఠరికకు వెళ్లే రక్తాన్ని నియంత్రిస్తుంది.

సి) పుపుస కవాటం    3) ఎడమ కర్ణిక నుంచి ఎడమ జఠరికకు వెళ్లే రక్తాన్ని నియంత్రిస్తుంది.

డి) మహాధమని కవాటం 4) ఎడమ జఠరిక నుంచి మహా ధమనికి వెళ్లే రక్తాన్ని నియంత్రిస్తుంది.

1) ఎ-2, బి-3, సి-1, డి-4    2) ఎ-1, బి-2, సి-3, డి-4

3) ఎ-1, బి-4, సి-2, డి-3    4) ఎ-4, బి-3, సి-2, డి-1


9. కింది వాక్యాలను చదివి సరైన సమాధానాలను గుర్తించండి.    

ఎ) అథోః మహాసిర గుండె కింద ఉండే శరీర భాగాల నుంచి రక్తాన్ని కుడి కర్ణికలోకి చేరవేస్తుంది.

బి) ఊర్ధ్వ మహాసిర గుండెకు పైన ఉండే శరీర భాగాల నుంచి రక్తాన్ని సేకరిస్తుంది.

సి) పుపుస ధమని గుండె నుంచి రక్తాన్ని ఊపిరితిత్తులకు చేరవేస్తుంది.

డి) పుపుస సిర రక్తాన్ని ఊపిరితిత్తుల నుంచి గుండెకు చేరవేస్తుంది.

ఇ) మహాధమని రక్తాన్ని గుండె నుంచి శరీర భాగాలకు చేరవేస్తుంది.

1) ఎ, బి, సి, డి      2) బి, సి, డి

3) ఎ, సి, డి, ఇ      4) ఎ, బి, సి, డి, ఇ


10. మన శరీరంలో రక్తం ప్రవహించే మార్గానికి  సంబంధించి కిందివాటిలో సరైంది ఏది?    

1) శరీర భాగాలు కుడి కర్ణిక కుడి జఠరిక ఊపిరితిత్తులు ఎడమ కర్ణిక ఎడమ జఠరిక శరీర భాగాలు

2) శరీర భాగాలు ఎడమ కర్ణిక ఎడమ జఠరిక కుడి కర్ణిక కుడి జఠరిక శరీర భాగాలు

3) శరీర భాగాలు ఎడమ కర్ణిక ఎడమ జఠరిక కుడి కర్ణిక కుడి జఠరిక శరీర భాగాలు

4) శరీర భాగాలు ఎడమ కర్ణిక కుడి కర్ణిక కుడి జఠరిక ఎడమ జఠరిక శరీర భాగాలు


11. గుండెకు సంబంధించిన కిందివాక్యాల్లో సరైన వాటిని గుర్తించండి.

ఎ) కర్ణికల కంటే జఠరికల గోడలు మందంగా ఉంటాయి.

బి) కుడి జఠరిక కంటే ఎడమ జఠరిక గోడ మందంగా ఉంటుంది.

సి) ఎడమ జఠరిక రక్తాన్ని మహాధమనిలోకి పంపు చేస్తుంది.

డి) కుడి కర్ణిక రక్తాన్ని కుడి జఠరికలోకి పంపు చేస్తుంది.

ఇ) కుడి జఠరిక రక్తాన్ని పుపుస ధమనిలోకి పంపు చేస్తుంది.

ఎఫ్‌) ఎడమ కర్ణిక రక్తాన్ని ఎడమ జఠరికలోకి పంపు చేస్తుంది

1) ఎ, బి, సి, డి           2) బి, సి, డి, ఇ

3) ఎ, బి, సి, డి, ఇ, ఎఫ్‌       4) సి, డి, ఇ, ఎఫ్‌


12. కింది వాక్యాల్లో సరికాని వాటిని గుర్తించండి.

ఎ) గుండెలో రక్తం ఉత్పత్తి అవుతుంది.

బి) గుండెలో రక్తం శుభ్రపడుతుంది.

సి) ఊపిరితిత్తుల్లో వాయు వినిమయం జరుగుతుంది.

డి) ఊపిరితిత్తుల్లో రక్తం శుభ్రపడుతుంది.   ఇ) గుండె రక్తాన్ని పంపు చేస్తుంది.

1) ఎ, బి   2) బి, సి  3) డి, ఇ   4) సి, డి


13. హృదయ స్పందన వలయం గురించి కింది వాక్యాలను పరిశీలించి, సమాధానాన్ని ఎన్నుకోండి.

ఎ) సిస్టోల్‌లో సంకోచం జరిగి రక్తం పంపు చేయబడుతుంది.

బి) డయాస్టోల్‌లో వ్యాకోచం జరిగి రక్తం నిండుతుంది.

1) ఎ, బి లు సరైనవి. ఇవి రెండు వేర్వేరు అంశాలు 

2) ఎ, బి లు సరైనవి. ఇవి రెండు ఒకే అంశానికి సంబంధించినవి.

3) ఎ సరైంది, బి సరైంది కాదు.4) ఎ, బి రెండూ సరైనవి కావు.


14. కిందివాటిలో సరైంది గుర్తించండి.

ఎ) ఆరోగ్యవంతుడైన మానవుడి రక్త పీడనం 120/80 mm/Hg.

బి) ఆరోగ్యవంతుడైన మానవుడి గుండె కొట్టుకునే వేగం నిమిషానికి 70 - 80 సార్లు.

సి) మానవుడిలో ద్వివలయ రక్తప్రసరణ వ్యవస్థ ఉంటుంది.

డి) చేపలో ఏకవలయ రక్తప్రసరణ వ్యవస్థ ఉంటుంది.

ఇ) పెద్దవారితో పోలిస్తే చిన్న పిల్లల్లో గుండె కొట్టుకునే వేగం ఎక్కువ.

1) ఎ, బి, సి      2) బి, సి, డి, ఇ

3) సి, డి, ఇ      4) ఎ, బి, సి, డి, ఇ


15. గుండె సంబంధిత వ్యాధుల పనితీరుకు సంబంధించి కింది వాక్యాల్లో తప్పుగా ఉన్నదాన్ని గుర్తించండి.    

ఎ) గుండె తక్కువగా కొట్టుకునే వ్యాధిని బ్రాడికార్డియా అంటారు.

బి) గుండె ఎక్కువగా కొట్టుకునే వ్యాధిని టాకికార్డియా అంటారు.

సి) గుండె పరిమాణంలో పెరగడాన్ని కార్డియోమెగాలి అంటారు.

డి) విషపదార్థాల వల్ల గుండెలో కవాటాలు దెబ్బతినడాన్ని ఆర్ధ్రరైటిస్‌ అంటారు.

ఇ) గుండెకు రక్తాన్ని సరఫరా చేసే ధమనుల్లో కొవ్వు పేరుకుపోవడాన్ని వెరికోస్‌వీన్స్‌గా పిలుస్తారు.

1) ఎ, బి, సి  2) డి, ఇ  3)  బి, సి  4) సి, డి


16. కింది వాక్యాలను పరిశీలించి, సరైన వాటిని గుర్తించండి.

ఎ) గుండెకు రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళాల్లో అడ్డంకులను గుర్తించడానికి జరిగే పరీక్ష కరోనరి యాంజియోగ్రామ్‌.

బి) గుండె కొట్టుకునే విధానాన్ని తెలుసుకోవడానికి జరిపే పరీక్ష ఎలక్ట్రో కార్డియోగ్రామ్‌.

1) ఎ, బి లు సరైనవి. ఇవి రెండూ ఒకే అంశానికి సంబంధించినవి.

2) ఎ సరైంది, బి సరైంది కాదు.

3) ఎ సరైంది కాదు, బి సరైంది.

4) ఎ, బి లు సరైనవి కావు. ఇవి రెండూ వేర్వేరు అంశాలు.


17. వివిధ జంతువుల్లో ఉండే గుండె గదులకు సంబంధించి కింది జతలను సరైన క్రమంలో అమర్చండి.

జీవి గుండె గదులు
ఎ) చేప 1) 4 గదుల గుండె 
బి) కప్ప 2) 2 గదుల గుండె
సి) తాబేలు 3) 3 గదుల గుండె
డి) పక్షి 4) అసంపూర్తిగా విభజన చెందిన 4 గదుల గుండె


1) ఎ-4, బి-3, సి-2 డి-1   2) ఎ-2, బి-3, సి-4, డి-1

3) ఎ-3, బి-4, సి-1, డి-2   4) ఎ-1, బి-3, సి-2, డి-4


18. కింది వాక్యాలను పరిశీలించి సరైన వాటిని ఎన్నుకోండి.

ఎ) సరిసృపాల్లో అసంపూర్తిగా విభజన చెందిన జఠరిక ఉంటుంది.

బి) సరీసృపమైన మొసలిలో పూర్తిగా విభజన చెందిన 4 గదుల గుండె ఉంటుంది.

సి) పక్షులు, క్షీరదాల్లో 2 కర్ణికలు, 2 జఠరికలతో కూడిన గుండె ఉంటుంది.

డి) చేపలో ఒక కర్ణిక, ఒక జఠరికతో కూడిన 2 గదుల గుండె ఉంటుంది.

1) ఎ, బి, సి  2) బి, సి, డి    3) ఎ, బి, సి, డి    4) ఎ, సి


19. కింది వాక్యాలను గమనించి, సరైన వాటిని గుర్తించండి.

ఎ) గుండె పైభాగంలో కుడికర్ణిక పైన ఉండే సైనో ఆర్టియల్‌ నోడ్‌ను పేస్‌మేకర్‌ అంటారు.

బి) మయోజెనిక్‌ హృదయం క్షీరదాల్లో ఉంటుంది.

సి) కీటకాలు, అనిలెడా వర్గ జీవుల్లో న్యూరోజెరిక్‌ హృదయం ఉంటుంది.

డి) మణికట్టు దగ్గర ఉండే పల్స్‌ (నాడి) కొట్టుకునే వేగం ఆధారంగా గుండె కొట్టుకునే విధానాన్ని గుర్తించవచ్చు.

1) ఎ, బి, సి  2) బి, సి  3) సి, డి  4) ఎ, బి, సి, డి


20. మన శరీరంలో ఉండే రక్తానికి సంబంధించి కిందివాటిలో సరికానిది ఏది?

ఎ) రక్తం గురించిన అధ్యయనాన్ని హెమటాలజీ అంటారు.

బి) రక్తాన్ని ద్రవరూప కణజాలం అంటారు.

సి) రక్తం pH విలువ 1 నుంచి 2 వరకు ఉంటుంది.

డి) మన శరీరంలో మొత్తం రక్తం పరిమాణం 9 లీటర్లు.

1) ఎ, బి 2) బి సి  3) సి, డి  4) ఎ, సి



సమాధానాలు

1-1; 2-2; 3-3; 4-4; 5-2; 6-2; 7-3; 8-1; 9-4;10-1; 11-3; 12-1; 13-2; 14-4; 15-2; 16-1; 17-1; 18-2; 19-3; 20-3.

Posted Date : 25-11-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌